వారం రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన హయత్‌నగర్ ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ లభ్యమైంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీ ఉన్నట్లు హయత్‌నగర్ పోలీసులు గుర్తించారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థినిని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు.