kidnaped
-
3 నెలల వయసులో కిడ్నాపై... 26 సంవత్సరాలకు తల్లిదండ్రులను చేరి..
బాల్యంలో తప్పిపోవడం లేదా కిడ్నాప్‌కు గురవ్వడం.. పెద్దయ్యాక సంపన్నులైన తల్లిదండ్రులను కలవడం... ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథే. కానీ ఆ సినిమా కథలను మించిన జీవిత కథ చైనాలో జరిగింది. మూడు నెలల వయసులో కిడ్నాప్‌కు గురైన పసిబాలుడు.. యువకుడిగా తల్లిదండ్రులను చేరాడు. ఆ తరువాత కథ మాత్రం సినిమాలను మించి పోయింది. అదేంటో చూద్దాం! ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న షి కిన్షుయ్ మూడు నెలల వయసులో కిడ్నాపయ్యాడు. తల్లిదండ్రులు దశాబ్దాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. కుమారుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఆ కుటుంబం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రెండున్నర దశాబ్దాల తరువాత.. ఎట్టకేలకు ఆచూకీ కనుగొన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. డిసెంబర్ 1న కొడుకును ఇంటికి తీసుకొచ్చారు. ఆ సందర్భాన్ని ఘనమైన వేడుకలా చేసుకున్నారు. అంతేకాదు తమ ఐశ్వర్యాన్నంతా ముందు పెట్టారు. అనేక భవనాలు.. లగ్జరీ కార్లు.. విలాసవంతమైన బహుమతులెన్నో అందించారు. కానీ.. ఇక్కడే పెద్ద ట్విస్ట్. అప్పటిదాకా అనాథలా పెరిగిన షి.. ఆస్తులకు వారసత్వాన్ని పొందడానికి ఇష్టపడలేదు. తన భార్యతో కలిసి జీవించడానికి ఒక్క ఫ్లాట్‌ను మాత్రం తీసుకున్నాడు. ప్రస్తుతం తన లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న షి... తన సంపాదనతోనే జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కోట్ల ఆస్తులను వదులుకుని నిరాడంబరుడిగా మిగిలిపోవాలనుకున్న అతని వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతని విలువలను కొందరు ప్రశంసిస్తుంటే.. సానుభూతి కోరుకుంటున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్న షి నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అర్ధరాత్రి ఆసుపత్రిలో పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు
-
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
నలుగురిని కిడ్నాప్ చేసిన బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్
సనత్‌నగర్: దుబాయ్ నుంచి నగరానికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ఓ ముఠా నలుగురిని కిడ్నాప్ చేయడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరు.. నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తూ అక్రమ సంపాదన చేస్తోంది. ఎవరైనా పర్యటన నిమిత్తం దుబాయ్‌కు వెళితే వారిని గుర్తించే ఈ ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పర్యటన ఖర్చులతో పాటు మరింత డబ్బును అదనంగా ఇస్తామని చెబుతుంది. ఇలాగే పాతబస్తీకి చెందిన సహబాజ్(21) ద్వారా పరిచయం అయిన ఈ ముఠా షహబాజ్‌తో పాటు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆయాజ్(22), అశోక్‌కాలనీకి చెందిన పహద్(23)లను గత 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపించారు. అక్కడ ఈ ముఠాకు చెందిన సభ్యులు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని కాళ్లకు చుట్టుకుని రావలసి ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆయాజ బంగారాన్ని తీసుకుని హైదరాబాద్‌కు ముందుగానే చేరుకున్నాడు. షహబాజ్, పహద్లు శుక్రవారం నగరానికి రావాల్సి ఉంది. అయితే పహద్ దుబాయ్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కకుండా అదృశ్యయమయ్యాడు. బంగారంతో పాటు అదృశ్యమైన పహద్ కోసం నగరంతో పాటు దుబాయ్‌లోని స్మగ్లర్లు గాలింపు చేపట్టి వెదుకుతున్నారు. పహద్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాలంటూ నగరానికి వచ్చిన అయాజ్, షహబాజ్‌లతో పాటు పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, వారి దగ్గర బంధువు ఆసిమ్‌లను ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేవారు. అలాగే దుబాయ్‌లో ఉండే పహద్ దగ్గరి బంధువు ఆకిబ్‌ను కూడా దుబాయిలో కిడ్నాప్ చేశారు. నగరంలో కిడ్నాప్ చేసిన నలుగురిలో షహబాజ్, ఆయాజ్, ఆసిమ్‌లను విడిచిపెట్టారు. పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని గుర్తించిన కిడ్నాపర్లు ఆయనను కూడా వదలిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. (చదవండి: కదం తొక్కిన కార్మికులు) -
బాలికను కిడ్నాప్ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో
సాక్షి, తణుకు: తమిళనాడుకి చెందిన బాలికను అపహరించి ఆమెతో బిక్షాటన చేయిస్తున్న ప్రబుద్ధుడి నిర్వాకం వెలుగుచూసింది. యాచకవృత్తి చేయడానికి నిరాకరించిన బాలికను సైతం గాయపరిచిన అతడిని తణుకు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తణుకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకు చెందిన సెల్వం అనే వ్యక్తి అదే రాష్ట్రం సాతూర్‌కు చెందిన మేరీదాస్ అనే తొమ్మిదేళ్ల బాలికను మూడేళ్ల క్రితం బలవంతంగా ఎత్తుకుని వచ్చాడు. ఆమెతో తిరుపతి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. కూతురిగా చెబుతూ.. దివ్యాంగుడైన సెల్వం.. మేరీదాస్‌ను తన కూతురిగా పరిచయం చేస్తూ భిక్షాటన చేయిస్తున్నాడు. ఈక్రమంలో నెల రోజుల క్రితం తణుకు తీసుకువచ్చిన సెల్వం తణుకులోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద గణేష్ సెంటర్లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 20న భిక్షాటన చేయడానికి మేరీదాస్ నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో గాయపడిన చిన్నారి ఏడుస్తూ స్థానిక పాత బెల్లం మార్కెట్ వద్ద ఉండటాన్ని గమనించిన లారీ డ్రైవర్లు పోలీసులకు అప్పగించారు. చిన్నారికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు ఆమె చేయి విరగడంతో చికిత్స చేయించి ప్రస్తుతం దెందులూరులోని బాలసదన్‌లో ఉంచారు. ఇదిలా ఉంటే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న సెల్వంను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. నిందితుడు ఇంకా ఎవరినైనా ఇలా తీసుకువచ్చి భిక్షాటన చేయిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చైతన్యకృష్ణ వెల్లడించారు. కేసులో సహకరించిన ఎస్సైలు కె.రామారావు, డి.రవికుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. చదవండి: చికిత్స పొందుతున్న ఏఎస్సై మృతి -
400 మంది విద్యార్థుల కిడ్నాప్!
లాగోస్: నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్‌తో పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండాపోయారని వెల్లడించారు. ఆ సాయుధ దుండగులు తమతో పాటు కొందరు విద్యార్థులను బందీలుగా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ స్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారని, వారిలో సుమారు 400 మంది ఆచూకీ ఇప్పుడు లభించడం లేదని పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా తెలిపారు. పోలీసులు, నైజీరియా సైన్యం, దేశ వైమానిక దళం విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. -
కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..
-
సోనీ ఆచూకి లభ్యం
సాక్షి, హైదరాబాద్ : బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఈ నెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్ రవి శేఖర్..ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సంరక్షణలో సోనీ.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఆమె బంధువులు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థినిని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. వారం రోజులు అయినా ఆచూకి లభ్యం కాకపోవడంతో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న సోనీ హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. (చదవండి : మాటల్లో దించి కారులో..) -
పసికందు దొరికింది
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(కోఠి మెటర్నిటీ హాస్పిటల్) నుంచి సోమవారం అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభించింది. దాదాపు 28 గంటల పాటు నిర్విరామ గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు మంగళవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని గుర్తించాయి. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం ఉదయానికి హైదరాబాద్ తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయాగా పరిచయం.. అపహరణ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సుబావతి విజయ కాన్పు కోసం గత నెల 21న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. 27న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో విజయ వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఆయాగా పరిచయం చేసుకుంది. చిన్నారికి వ్యాక్సినేషన్ చేయించాలని చెప్పి తనతో తీసుకెళ్లింది. ఆ మహిళ ఎంతకూ బిడ్డను తీసుకురాకపోవడంతో విజయకు అనుమానం వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పింది. వారు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత దాదాపు ఒంటి గంట ప్రాంతంలో రెండు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితురాలిని గుర్తించాయి. చిన్నారిని తీసుకెళ్లిన మహిళ కదలికల కోసం ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న 200 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ చిన్నారితోపాటు ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరాల ఆధారంగా.. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మరో రెండు గంటల పాటు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. సదరు కిడ్నాపర్ చిన్నారితోపాటు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తించగలిగారు. ఆ బస్సు ఎక్కడకు వెళ్తుందో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆర్టీసీ అధికారుల సాయంతో అది బీదర్ బస్సుగా నిర్థారించిన పోలీసులు దాని నంబర్ కోసం ప్రయత్నించారు. వీడియోల్లో స్పష్టంగా లేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో బస్సు నంబర్‌తో పాటు దాని డ్రైవర్ సెల్ నంబర్ సైతం సేకరించగలిగారు. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆ డ్రైవర్‌కు కాల్ చేయగా.. సదరు మహిళ చిన్నారితోపాటు బీదర్ బస్సు స్టేషన్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దిగిందని, తాము ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నామని చెప్పాడు. బీదర్‌కు ప్రత్యేక బృందాలు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్ బీదర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడి నుంచీ మూడు ప్రత్యేక బృందాలు బీదర్ బయలుదేరాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు పాప ఫొటోలతో పాటు అనుమానితురాలి సీసీ ఫుటేజ్ తదితరాలను బీదర్ పోలీసులకు పంపారు. వీటి ఆధారంగా బీదర్ పోలీసులు అక్కడి బస్టాండ్ నుంచి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రికి నగరం నుంచి బయలుదేరిన పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు బీదర్ చేరుకున్నాయి. అప్పటికే బీదర్ పోలీసులు సదరు మహిళ చిన్నారితోపాటు బస్టాండ్ పక్కనే ఉన్న మురికివాడలోకి వెళ్లినట్లు సమాచారం సేకరించారు. బీదర్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలు ఆ మురికివాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తమ వద్ద ఉన్న చిన్నారి, అనుమానితురాలి ఫొటోలను ప్రజలకు చూపిస్తూ సమాచారం సేకరించాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. అయితే కిడ్నాపర్ చిన్నారితోపాటు ఆ మురికివాడ నుంచి తప్పించుకుంది. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. తదుపరి చర్యల్లో భాగంగా మురికివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా మహిళ కదలికలు రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆమే కిడ్నాపర్ అని, చిన్నారితోపాటు ఓ ఆటో ఎక్కుతున్నట్లు గుర్తించారు. మరికొన్ని సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం సదరు మహిళ మూడు ఆటోలు మారినట్లు తేల్చారు. ఆటో నంబర్లు సరిగ్గా కనిపించకపోవడంతో సాంకేతికంగా ప్రయత్నించారు. చివరకు ఐదు ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను విచారించారు. ఓ ఆటో డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాను ఓ మహిళను, చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో వదిలినట్లు చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. ఓ మహిళ ఒంటి గంటల ప్రాంతంలో పసికందుతో వచ్చిందని, చిన్నారిని వదిలి పారిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తాము పసికందును ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. ఫొటోలతో సరిపోల్చి.. తల్లికి చూపించి.. అక్కడకు చేరుకున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన ఐసీయూలో ఉన్న చిన్నారిని ఫొటోలతో పోల్చి కిడ్నాపైన శిశువుగా గుర్తించారు. వీడియో కాల్ ద్వారా నగరంలో ఉన్న తల్లి విజయకు చిన్నారిని చూపించి ఖరారు చేసుకున్నారు. ప్రసుత్తం చిన్నారి అక్కడే చికిత్స పొంkదుతుండటంతో తల్లి విజయను సైతం అక్కడికి తీసుకువెళ్లారు. బుధవారం తల్లీబిడ్డల్ని నగరానికి తీసుకురానున్నారు. మరోవైపు పరారైన కిడ్నాపర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె బీదర్‌కు చెందినదా లేదా అక్కడ బంధువులు ఉన్న మహిళై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో లేదా చుట్టు పక్కల ఒకటి రెండు రోజులు కాపుకాసి ఉండచ్చని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు -
తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు..
మందస : ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ కుర్రాడు ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. మరణించాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మందస పట్టణంలోని కంచమయికాలనీ సమీపంలో నివాసముంటున కరుమోజి సంతోష్ పుట్టుకతో దివ్యాంగుడు(మూగ, చెవిటి). సంతోష్‌ను ప్రతి ఒక్కరూ జడ్డిడుగా హేళన చేసేవారు. 9 ఏళ్ల కిందట ఇతడు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర భోజన హోటల్లో పని చేసేవాడు. ఒక రోజు హఠాత్తుగా కనిపించలేదు. ఇంటికీ వెళ్లలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హోటల్ యాజమాన్యం కూడా సంతోష్ ఆచూకీకి ఎంతో ప్రయత్నించారు. ఇతడిపై పోలీసు స్టేషన్లో అదృశ్యం కేసు కూడా నమోదైంది. అయితే, అప్పటిలో ఓ చిరువ్యాపారి సంతోష్‌ను ఎవరో కారులో తీసుకెళ్లడం చూశానని చెప్పినప్పటికీ ఎవరూ నమ్మలేదు. సంతోష్ కనిపించకుండా దాదాపు తొమ్మిదేళ్లు గడిచాయి. స్థానికంగా పానీపూరి చేసుకుని, అమ్ముకుంటూ జీవించే ఒడిశా వాసులు ఇదే కాలనీలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వారు తమ సొంత స్థలాలైన ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో సంతోష్ కనిపించాడు. అతనితో సైగలతో మాట్లాడారు. తన దగ్గర డబ్బుల్లేవని, సొంత ఊరుకు వచ్చేస్తానని చెప్పడంతో వారు తమ చేతిలోని డబ్బులతో భువనేశ్వర్ నుంచి మందస తీసుకువచ్చి కుటుంబానికి సంతోష్‌ను అప్పగించారు. తొమ్మిదేళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న ఇతడు ప్రస్తుతం చిక్కిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్.. ఏమి చేస్తున్నావ్.. అని ప్రశ్నించగా, తనను ఎవరో కారులో తీసుకెళ్లిపోయారని, ఇటుకలు తయారీ చేసే బట్టీలో కూలీగా మార్చేశారని సంతోష్ చెబుతున్నాడు. అర్థాకలితో యజమాని వేధింపులకు గురిచేశాడని, అంతేకాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పని చేయించుకునే వాడన్నాడు. దాదాపుగా తప్పించుకుని పారిపోయే విధంగానే వచ్చానని చెబుతున్నాడు. సుమారు దశాబ్ద కాలం పాటు కనిపించకుండా పోయిన కుమారుడు ఇంటికి రావడంతో తల్లి కమల, అన్నయ్య అప్పన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంతోష్ లేకపోవడంతో రేషన్ కార్డులో పేరును తొలగించారని, ఆధార్‌కార్డు లేదని, వస్తున్న పింఛన్‌ను నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో పేదరికంలో ఉన్నామని, అధికారులు స్పందించి, పింఛన్‌తో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం బిలాస్పూర్లో రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలకలం.. సినీ ఫైనాన్షియర్ కుమార్తె కిడ్నాప్
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ ఫైనాన్షియర్ బోద్రా కూమార్తె కరిష్మా బోద్రా కిడ్నాప్‌నకు గురైనట్లు సమాచారం. సినీ ఫైనాన్షియర్ బోద్రా దక్షిణ సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు ఫైనాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చాడయన్ చిత్రం విషయంలో లతా రజనీకాంత్‌పై బోద్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం కలకలం రేపింది. ఈ కేసులో తన వద్ద తీసుకున్న డబ్బును లతా రజనీకాంత్ తిరిగి చెల్లించలేదంటూ బోద్రా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో బోద్రా కుమార్తె కరిష్మా బోద్రా అదృశ్యమైంది. దీంతో బోద్రా తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు శనివారం స్థానిక టీనగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సినీ వర్గాల్లో కలకలం రేపింది. -
SRనగర్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్
-
ఏలూరులో విద్యార్థి కిడ్నాప్ కలకలం
-
కాకినాడ ప్రభుత్వాస్పాత్రిలో ఆడ శిశువు మాయం
-
నగరంలో రెచ్చిపోయిన కామాంధులు
హైదరాబాద్ : నగరంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారానికి యత్నించిన ఘటనలు బుధవారం ఒక్కరోజే నగరంలో రెండు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు గత కొంతకాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు బుధవారం రాత్రి దుండగుల నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్మెన్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఎల్బీనగర్ బండ్లగూడలో ఓ బాలికపై ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు రామకృష్ణ అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. -
5ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన బాలుడు
-
బాలుడి కిడ్నాప్ కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 4వ తరగతి విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేశారు. సదరు బాలుడు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సమీప బంధువుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
లిబియాలో మరో ఇద్దరు భారతీయుల కిడ్నాప్
లిబియాలో మరో ఇద్దరు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇప్పటికీ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లను తమ చెరలో ఉంచుకున్న ఐఎస్ తీవ్రవాదులు.. సిర్తే పట్టణానికి సమీపంలో మరో ఇద్దరు భారతీయులను బందీలుగా చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కిడ్నాపైన ఇద్దరిలో ఒకరు ఏపీకి చెందిన కొసనం రామ్మూర్తి కాగా, మరొకరు ఒడిశాకు చెందిన రంజన్ సమాల్ లుగా గుర్తించామని, వీరిని చెర నుంచి విడిపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. గత జులై 31న ఇదే సిర్తే పట్టణంలో నలుగురు భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లు క్షేమంగా తిరిగిరాగా, తెలుగువారైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామ్ లు ఇంకా బందీలుగానే ఉన్నారు. వారిని విడిపించేందుకు విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు చేస్తున్నది. -
హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్:రూ. కోటి డిమాండ్
హైదరాబాద్: నగరంలోని ఎల్బి నగర్లో ఎనిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రగతి విజయ్ పాత్రో మార్బుల్ యజమాని కుమారుడైన విజయ్ (బబ్లూ ) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి కిడ్నాప్ చేశారు. బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలోనే కిడ్నాప్ చేశారు. ఆపై బాలుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. బాలుడిని వదిలి పెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాలుడిని చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. దుండగులు 9949892673, 9866625454 అనే రెండు మొబైల్ నంబర్ల నుంచి బాలుడి తండ్రి ఆశిష్‌కు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆతర్వాత లొకేషన్ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఫోన్‌ను స్విచ్ఛాప్ చేశారు. -
రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్..?
రాజమండ్రి క్రైం: గుర్తు తెలియని ప్రవాస భారతీయుడొకరు రాజమండ్రిలో కిడ్నాప్‌నకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. రాజమండ్రి నగరంలోని సోమాలమ్మ ఆలయం సమీపంలో ఓ ఇంటీరియర్ డెకరేషన్ దుకాణం ఉంది. ఆ దుకాణం వద్దకు గత నాలుగు రోజులుగా ఓ ఎన్నారై వస్తున్నాడు. రాజమండ్రి దగ్గరే తమ గ్రామం ఉందని చెప్పి పరిచయం చేసుకున్న ఆయన..తనకు విదేశాల్లో పలుకుబడి ఉందని, ఏదైనా సాయం కావాలంటే చేస్తానంటూ దుకాణ యజమానితో చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సదరు ఎన్నారై ఆ దుకాణం వద్ద ఉండగా ఒక స్కోడా కారు వేగంగా వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఎన్నారైని బెదిరించి తమ వెంట తీసుకుపోయారు. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది. దీనిపై ఇంటీరియర్ దుకాణం యజమాని రాజమండ్రి ప్రకాష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎన్నారై ఎవరు, అతనిని ఎవరు కిడ్నాప్ చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బందీల విడుదలకు విద్యార్థుల దౌత్యం
ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులచెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆందోళనలో గోపీకృష్ణ,బలరాం కిషన్ కుటుంబ సభ్యులు * ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా విడుదలకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లకు విముక్తి లభించలేదు. సోమవారం కూడా వీరు విడుదల కాకపోవటంతో ఇరువురు ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బందీలుగా ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లను విడుదల చేసేందుకు ఐఎస్ఐఎస్ అనుబంధ విద్యార్థి సంఘాల ద్వారా దౌత్య అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై 29న స్వదేశానికి వస్తున్న నలుగురు భారతీయులను ట్రిపోలి సమీపంలో కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని వదిలేసి, తెలుగు రాష్ట్రాలకు చెందిన గోపీకృష్ణ, బలరాం కిషన్‌లను తమ వద్ద బందీలుగా ఉంచుకున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు ఇచ్చిన సమాచారం మేరకు.. గోపీకృష్ణ, బలరాం కిషన్ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం మధ్యాహ్నానికి కచ్చితంగా విడుదల అవుతారని దౌత్య అధికారులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ, సోమవారం తీపికబురు కోసం రోజంతా వేచిచూసిన గోపీకృష్ణ, బలరాం కుటుంబ సభ్యులు సాయంత్రానికి పూర్తిగా డీలాపడిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకు బందీల విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే దౌత్య అధికారులు మాత్రం హ్యూన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులనే దూతలుగా పంపి గోపీకృష్ణ, బలరాం కిషన్ల విడుదల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాధి నేతలూ.. కనికరించండి.. ఏ రోజూ.. ఎవరికీ హాని చేయని తమ వారిని విడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకోవాలని బందీల కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం గోపీకృష్ణ భార్య కళ్యాణి, సోదరుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బోరున విలపించారు. కిడ్నాప్ అయిన నలుగురు ప్రొఫెసర్లలో కర్ణాటకకు చెందిన ఇద్దరు విడుదలయ్యారని తమ వారు కూడా త్వరగా విడుదల అయ్యేలా చూడాలని, దీనికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. లిబియా బందీలను విడిపించండి ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరినట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం ఢిల్లీలో చెప్పారు. తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, రాపోలు ఆనందభాస్కర్‌తో వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిసినట్టు ఆయన తెలిపారు. దొరకని కేసీఆర్ అపారుుంట్‌మెంట్ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించామని కానీ లభించలేదని ప్రొఫెసర్ బలరాం కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం బలరాం విడుదల అవుతాడని ఆశాభావంతో ఉన్నామని, లేనిపక్షంలో ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతినిధులను కలుస్తామని వారు చెప్పారు. -
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
-
లిబియాలో తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్
నలుగురు భారతీయుల అపహరణ ఇద్దరి విడుదల.. చెరలోనే మనవాళ్లిద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకమేనని అనుమానం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్, బెంగళూరు: ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ ప్రొఫెసర్లు లిబియాలో కిడ్నాప్‌నకు గురయ్యారు. వీరిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు శుక్రవారం సాయంత్రం విడుదల కాగా హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఇంకా ఉగ్రవాదుల చెరలోనే మగ్గుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిర్త్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ఈ నలుగురూ బుధవారం ట్రిపోలి మీదుగా భారత్‌కు వస్తుండగా వర్సిటీకి 50 కి.మీ. దూరంలోని ఓ చెక్‌పాయింట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యస్థాపన కోసం ఇరాక్, సిరియాలలో నెత్తుటేర్లు పారిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగతా ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వివరణనిచ్చారు. కాగా, ఐఎస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో లిబియా నుంచి వచ్చేయాలంటూ అక్కడి భారతీయులకు కేంద్రం ఏడాది క్రితమే సూచనలు జారీచేసింది. ఇరాక్‌లో గతేడాది 39 మంది భారతీయులు కిడ్నాప్ కాగా, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. మా వారిని రప్పించండి..: కరీంనగర్ జిల్లా శనిగారం గ్రామానికి చెందిన చిలివేరు బలరామ్ కిషన్ కుటుంబం... హైదరాబాద్‌లో అల్వాల్ మానస సరోవర్‌లోని సాయిసాగర్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. ఇతని భార్య శ్రీదేవి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్ బీటెక్, చిన్న కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. బలరామ్ ఐదేళ్ల క్రితం సిర్త్ వర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. బలరామ్ ఈ నెల 29న రాత్రి 7 గంటలకు లిబియా నుంచి ఇంటికి బయలుదేరుతున్నానంటూ ఫోన్ చేసి భార్య శ్రీదేవితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. తన భర్త, గోపీకృష్ణలను భారత్‌కు రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ‘వీ ఆర్ సేఫ్’ అంటూ సందేశం: కిడ్నాప్‌నకు గురైన వారిలో ఒకరైన లక్ష్మీకాంత్ నుంచి బలరామ్ భార్య శ్రీదేవి సెల్‌ఫోన్‌కు శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. ‘వి ఆర్ సేఫ్ హియర్ ఇన్ సిర్త్ యూనివర్సిటీ డోన్ట్ వర్రీ’ (మేము సిర్త్ యూనివర్సిటీలో సురక్షితంగా ఉన్నాం. ఆందోళన వద్దు) అని అందులో పేర్కొన్నారు. భారత్ వస్తూ బందీగా... ఆందోళనలో తెలుగు కుటుంబాలు నలుగురు ప్రొఫెసర్లను గుర్తుతెలియనిదుండగులు కిడ్నాప్ చేసిన విషయాన్ని వారు ప్రయాణించిన కారు డ్రైవర్ హైదరాబాద్‌లోని గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన మురళీ ట్రిపోలీలో ఉన్న స్నేహితులను సంప్రదించడంతో పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణతో కలిసి పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి నాచారం ప్రాంతంలో స్థిరపడ్డారు. డిగ్రీ వరకు టెక్కలిలో చదువుకున్న గోిపీ, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెస్సీ, తమిళనాడు కాంచీపురంలోని మీనాక్షి అమ్మన్ కళాశాలలో ఎంటెక్ చదివారు. బలరాం అదృశ్యంపై టీవీలో వార్త చూసి ఆందోళన చెందుతున్నభార్య శ్రీదేవి ఈయనకు 2004లో కళ్యాణితో వివాహమైంది. వీరి కుమార్తె జాహ్నవి (10) నాలుగో తరగతి, కుమారుడు కృష్ణ సాయికిశోర్ (4) యూకేజీ చదువుతున్నారు. 2004 నుంచి 2007 వరకు నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కుటుంబంతో లిబియాకు వలసవెళ్లి హున్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011లో భార్యాపిల్లల్ని నాచారం రాఘవేంద్రనగర్‌కు పంపారు. ప్రస్తుతం స్రిట్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతితోపాటు అమ్మమ్మ టెక్కలిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీకి రంజాన్ సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో గడపటానికి బుధవారం భారత్‌కు పయనమయ్యారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఆ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం గోపీకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. -
కిడ్నాప్ కలకలం
-
విశాఖలో బాలుడి కిడ్నాప్...
గోపాలపట్టణం(విశాఖపట్టణం జిల్లా): గుర్తుతెలియని దుండగులు ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన మంగళవారం విశాఖ జిల్లా గోపాలపట్టణంలో జరిగింది. వివరాలు..ఇందిరానగర్‌కి చెందిన వేచలపు రమేష్(9) మూడోతరగతి చదువుతున్నాడు. కాగా, మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బాలుడిని వాహనంపై ఎక్కించుకొని తీసుకె ళ్లాడు. అయితే, స్నేహితులందరూ ఎవరో తెలిసిన వ్యక్తి అనుకున్నారు. కాగా, రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గోవిందరావు, మణి కుమారుడి ఆచూకీ కోసం తోటి స్నేహితులను దగ్గర ఆరా తీశారు. వారు చెప్పిన వివరాలు తీసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కుమారుడిని కిడ్నాప్ చేసిన తండ్రి
తుర్కపల్లి: ఓ తండ్రి మోటార్ సైకిల్ కోసం కన్న కొడుకునే కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో గురువారం జరిగింది. మాదాపూర్ గ్రామ పరిధిలోని కేవ్లా తండాకు చెందిన సోనా, దేవసోతు దేవ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త తాగుడుకు బానిసై తరచూ హింసిస్తుండడంతో భార్య సోనా ఐదేళ్ల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. మూడేళ్ల క్రితం భార్యను పంపాలని వచ్చి అడిగిన సమయంలో మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మాదాపూర్ పాఠశాలలో చదువుతున్న అతని పెద్దకుమారుడు వెంకటేశ్‌ను బుధవారం దేవ తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు సోనికి సమాచారం అందించారు. విద్యార్థి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి దేవను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మోటార్‌సైకిల్ కోసమే తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. -
మూడేళ్ల బాలుడి కిడ్నాప్... రూ. కోటి డిమాండ్
నెల్లూరు: నెల్లూరులోని సైదాపురంలో మూడేళ్ల బాలుడు మోహిత్‌ను మంగళవారం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. మోహిత్‌ను విడిచిపెట్టాలంటే రూ. కోటి చెల్లించాలని కిడ్నాపర్లు మోహిత్ తల్లిదండ్రులకు ఫోన్ లో డిమాండ్ చేశారు. దాంతో వారు నగర పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే చిన్నారి కిడ్నాప్‌కు రియల్ ఎస్టేట్ వివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. -
వివి వినాయక్‌కు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఫోన్లో పరామర్శించారు. వివి వినాయక్ తల్లి నాగరత్నమ్మ (61) మృతి పట్ల జగన్ సంతపం తెలిపారు. వివి వినాయక్ తల్లి నాగరత్నమ్మ (61) మంగళవారం సాయంత్రం మరణించారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో బుధవారం నిర్వహించనున్నారు. అలాగే నైజీరియాలో కిడ్నాపైన గుంటూరు జిల్లా వాసి టి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఫోన్లో పరామర్శించారు. కిడ్నాపర్ల చెర నుంచి శ్రీనివాసరావును విడిపించేందుకు కృషి చేస్తామని అతడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కిడ్నాప్ అంశంపై కేంద్రంతో సంప్రదించాలని ఆయన పార్టీ ఎంపీలను ఆదేశించారు. అలాగే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితి సమీక్షించాలని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ సూచించారు. -
కిడ్నాప్ పై హైకోర్టులో పిటిషన్
-
ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీల కిడ్నాప్
ప్యాపిలి: మెజారిటీ లేకపోయినా ఎంపీపీ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీస్తోంది. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఇరువురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేసింది. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 9 స్థానాల్లో గెలుపొందాయి. వీరిలో ఒక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ వుృతి చెందినా ఆ పార్టీకి 11 వుంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్యాపిలి-3వ ఎంపీటీసీ పెద్దరాజును కారు బాడుగకు మాట్లాడాలి రమ్మంటూ ఫోన్ చేసి గుత్తి వద్ద కొందరు కిడ్నాప్ చేశారు. జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవి, ఈమె భర్త శ్రీనివాసులు సైతం మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. పెద్దరాజును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమాదేవి దంపతుల అదృశ్యంపై కూడా వారి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.