గోపాలపట్టణం(విశాఖపట్టణం జిల్లా): గుర్తుతెలియని దుండగులు ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన మంగళవారం విశాఖ జిల్లా గోపాలపట్టణంలో జరిగింది. వివరాలు..ఇందిరానగర్‌కి చెందిన వేచలపు రమేష్(9) మూడోతరగతి చదువుతున్నాడు. కాగా, మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బాలుడిని వాహనంపై ఎక్కించుకొని తీసుకె ళ్లాడు. అయితే, స్నేహితులందరూ ఎవరో తెలిసిన వ్యక్తి అనుకున్నారు.
కాగా, రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గోవిందరావు, మణి కుమారుడి ఆచూకీ కోసం తోటి స్నేహితులను దగ్గర ఆరా తీశారు. వారు చెప్పిన వివరాలు తీసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.