విద్యార్థుల తల్లిదండ్రులు
లాగోస్: నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్‌తో పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండాపోయారని వెల్లడించారు. ఆ సాయుధ దుండగులు తమతో పాటు కొందరు విద్యార్థులను బందీలుగా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ స్కూల్‌లో సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారని, వారిలో సుమారు 400 మంది ఆచూకీ ఇప్పుడు లభించడం లేదని పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా తెలిపారు. పోలీసులు, నైజీరియా సైన్యం, దేశ వైమానిక దళం విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment