Nigeria
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
T20 WC 2025 USA vs Ire: ధనాధన్.. 9.4 ఓవర్లలోనే..
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జొహూర్ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 75 పరుగులకే ఆలౌట్ముందుగా ఐర్లాండ్ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్ వాల్ష్ (16; 2 ఫోర్లు), లాలా మెక్బ్రిడ్ (13), అబీ హ్యారిసన్ (13), ఫ్రెయా సర్జెంట్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో శ్రీలంకతో వెస్టిండీస్ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.సంచలన విజయంఈ మెగా టోర్నీతోనే వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లో కివీస్ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్‌స్కోరర్ కాగా, లిలియన్ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రెండంకెల స్కోరు చేసింది.ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్ (27 బంతుల్లో 19; 1 ఫోర్), ఇవ్ వొలాండ్ (15 బంతుల్లో 14; 1 ఫోర్) మెరుగ్గా ఆడారంతే! లలియన్ ఉడే (3–0–8–1) బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.ఆఖరి ఓవర్ డ్రామా... కివీస్ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్‌బై!అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్ లంబట్ (6 నాటౌట్) కొట్టిన షాట్‌కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్ టష్ వేక్లిన్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది. చదవండి: 10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు. ప్రమాదాలు సర్వసాధారణంనైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. -
Nigeria: పడవ ప్రమాదం.. 100 మంది గల్లంతు
అబుజా: ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.పడవలో వ్యాపారులు నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (ఎన్‌ఐడబ్ల్యూఏ)ప్రతినిధి మకామా సులేమాన్ మీడియాతో మాట్లాడుతూ పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ తెలిపారు. ప్రయాణికులెవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం కారణంగానే ప్రాణనష్టం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.తరచూ ప్రమాదాలుఘటనా స్థలంలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. బోటులో ఎక్కువగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బోటులో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు తదితర అంశాలు ఇటువంటి ఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
నైజీరియన్ యువతులతో వ్యభిచారం...
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్ ఎదురుగా ఉన్న మంగమాల్ నగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ అరుల్ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్ మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్.. కేవలం 7 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదైంది. టీ20 వరల్డ్‌కప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ కేవలం 7 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. దీనికి ముందు టీ20 అత్యల్ప స్కోర్ రికార్డు ఐసిల్ ఆఫ్ మ్యాచ్, మంగోలియా జట్ల పేరిట ఉండేది. ఈ రెండు జట్లు గతంలో 10 పరుగులకే ఆలౌటయ్యాయి.నైజీరియా-ఐవరీ కోస్ట్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. వికెట్‌కీపర్ సెలిమ్ సలౌ విధ్వంసకర శతకం (53 బంతుల్లో 112 రిటైర్డ్ ఔట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది నైజీరియా భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. నైజీరియా ఇన్నింగ్స్‌లో ఐసక్ ఓక్పే (23 బంతుల్లో 65 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్ (29 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరుపు అర్ద శతకాలు బాదారు. ఐవరీ కోస్ట్ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్ఫ్రైడ్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్.. 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా నైజీరియా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కాగా.. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మొహమ్మద్ చేసిన నాలుగు పరుగులే టాప్ స్కోర్‌గా నిలిచాయి. ఈ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. -
PM మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
-
ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు
అబుజా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలలో పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా నేడు(ఆదివారం) నైజీరియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నైజీరియా అత్యున్నత పురస్కారం "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్"తో ప్రధాని మోదీని సత్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. ప్రధాని మోదీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రపంచంలోనే రెండవ నేతగా నిలవనున్నారు. దీనికి ముందు 1969లో నైజీరియా నుంచి ఈ గౌరవాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి.Nigeria to honour Prime Minister Narendra Modi with its award- The Grand Commander of The Order of the Niger (GCON). Queen Elizabeth is the only foreign dignitary who has been awarded GCON in 1969. This will be the 17th such international award being conferred to PM Modi by a… pic.twitter.com/nOVKGyJr0a— ANI (@ANI) November 17, 2024ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి -
నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
అబుజా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. నైజీరియా చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. నైజీరియాలో ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. ఈ క్రమంలో మోదీ వారికి కరచాలనం చేస్తూ ముందుకు సాగారు.ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ నేడు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. అనంతరం, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్తారు. ఈ సదస్సు సందర్భంగా జీ-20 దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు.#WATCH | Prime Minister Narendra Modi lands in Abuja, the capital city of the Federal Republic of Nigeria; receives a grand welcomeHe is on a three-nation tour to Nigeria, Brazil and Guyana from November 16 to 21. On the first leg of his visit, PM is in Nigeria. In Brazil, PM… pic.twitter.com/0LWi0beBWU— ANI (@ANI) November 16, 2024 అలాగే, ఈ నెల 19న మోదీ గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.#WATCH | Nigeria: Prime Minister Narendra Modi greeted members of the Indian Diaspora as he received a grand welcome from them when he arrived at a hotel in Abuja(Source - ANI/DD News) pic.twitter.com/9Q9krfzQaP— ANI (@ANI) November 16, 2024నవంబర్ 18, 19 తేదీల్లో రియో డీజెనిరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా జీ-20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 కూటమి సమావేశం కానుంది. #WATCH | Ritu Agarwal, a member of Indian Diaspora in Nigeria says, " PM said that my drawing is very good and he took the pen from me and signed the drawing. He was very happy..." pic.twitter.com/OzKdsezE07— ANI (@ANI) November 16, 2024 -
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మిలిటరీ యూనిట్‌పై దాడి.. 40 మంది మృతి!
అబుజా: మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై జిహాదిస్ట్ గ్రూప్ బోకో హరామ్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.‘‘నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి బోకో హరామ్ గ్రూప్ సభ్యులు 200 మందికి పైగా సైనికులు ఉన్న యూనిట్ లక్ష్యంగా దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలిని సందర్శించా. ఈ దాడికి పాల్పడిన వారి రహస్య స్థావరాలను గాలించేందుకు ఆపరేషన్ ప్రారంభించాం’’ అని చాద్ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబి ఇట్నో ఓ ప్రకటన విడుదల చేశారు.🇹🇩|#Chad: An attack yesterday on a military base in #Barkaram, Kaya department has left approx 40 soldiers dead. The base, found in the Lake Chad region, is speculated to have been attacked by Boko Haram, others have suggested that rebels are responsible. pic.twitter.com/CDr3SNfOqT— Charlie Werb (@WerbCharlie) October 28, 2024 పూర్తిస్థాయి ఇస్లామిక్ రాజ్య స్థాపనే థ్యేయమని చెప్పుకుంటూ 2009లో ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ప్రారంభమైంది. ఈ గ్రూప్.. పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాను తన కీలక స్థావరంగా చేసుకుంది. ఇప్పటివరకు వేలాదిమంది అమాయకులను కర్కశంగా హతమార్చింది బొకోహరాం తీవ్రవాద సంస్థ. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ గ్రూప్ మూడున్నర లక్షల మందిని పొట్టనబెట్టుకున్నట్లు తెలుస్తోందది. వీరి దాడులకు లక్షలాది మంది పౌరులు తమ ఇళ్లను విడిచిపెట్టి వలసవెళ్లటం గమనార్హం. చదవండి: ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు -
నైజీరియాలో పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 90 మందికి పైగా మృతి
నైజీరియా దేశంలో పెను విపత్తు చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఉత్తర జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.కాగా కనో నుంచి బయల్దేరిన ఓ పెట్రోల్ ట్యాంకర్ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది.దీంతో పెట్రోల్ అంతా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.ఈ ఘటనలో 94 మంది మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 50 మంది వరకు గాయపడిన్టలు బుధవారం పోలీసు ప్రతినిధి లావాన్ షిసు ఆడమ్ వెల్లడించారు.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందారు. -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్‌లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్‌లోని అగాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు -
నైజీరియాలో దుండగుల కాల్పులు.. 100 మందికిపైగా మృతి
మైదుగురి: నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు గుంపు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 100 మంది మృతి చెందారు. వివరాలు.. ఈశాన్య నైజీరియా యోబే రాష్ట్రంలోని తర్మువా కౌన్సిల్ ప్రాంతంలోకి 50 మంది దుండగులు మార్కెట్లో పాటు పలు ఇళ్లపై కాల్పులు జరిపారు. పెద్దసంఖ్యలో దుండగులు బైకులపై వచ్చి పలు భవనాలకు నిప్పంటించి అనంతరం కాల్పులకు తెగపడ్డారని యోబ్ పోలీసు ప్రతినిధి డంగస్ అబ్దుల్కరీమ్ తెలిపారు. At least 127 people have been killed following an attack by Boko Haram militants on motorcycles in a northeastern Nigerian village. The assailants set shops and homes on fire. This information comes from Amnesty International via AA.#BokoHaram #NigeriaAttack… pic.twitter.com/cNN7kc1dwo— Live Updates (@LiveupdatesUS) September 3, 2024ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పులను బోకోహరం ఉగ్రవాదుల దుశ్చర్యగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని నైజీరియాలో వేల మందిని పొట్టన పెట్టుకొని, ఎంతో మందిని ఈ ఉగ్రసంస్థ అపహరించిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ ప్రాంతంలో ఇస్లామిక్ చట్టం లేదా షరియా చట్టాలతో కూడిన రాజ్యాన్ని స్థాపించేందుకు తిరుగుబాటు ప్రారంభించింది. -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!
దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్‌కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్‌ని తొక్కేయలేమని చాటిచెప్పింది. వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది. "ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా. కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.(చదవండి: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!) -
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నైజీరియాలో బాంబు పేలుడు
అబూజ: నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఒక దుకాణసముదాయంలో అమర్చిన బాంబు పేలిన ఘటనలో 16 మంది చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కవోరీ ప్రాంతంలోని ఒక టీ దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. కానీ చాన్నాళ్లుగా పలు దాడులకు కారణమైన బోకో హరామ్ ఉగ్రసంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. బోకో హరామ్, దాని చీలిక వర్గం ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్‌ల దాడులు, అంతర్యుద్ధం కారణంగా నైజీరియా, కామెరూన్, నైజర్, చాద్ దేశాల్లో గత 15 సంవత్సరాల్లో 35,000 మందికిపైగా ప్రజలు చనిపోయారు. -
డ్రగ్స్ క్వీన్ బ్లెస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ సిండికేట్‌లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కింగ్‌పిన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని దందా నిర్వహించేవాడు. నగరానికి ఒకరిని చొప్పున అంకితమైన డ్రగ్ పెడ్లర్‌ను నియమించుకునేవాడని, ఈక్రమంలో హైదరాబాద్‌కు అనోహా బ్లెస్సింగ్ కొరియర్‌గా వ్యవహరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్), సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడెషోలాతో సహా ఐదుగుర్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.నకిలీ పాస్పోర్టుతో..2018లో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్.. కొంతకాలానికి బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టయిలిస్ట్‌గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెడ్లర్‌తో పరిచయం పెంచుకుంది. తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా సుజీ ఆదేశాల మేరకు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సా దేశం పాస్‌పోర్టును తీసుకుంది. కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతుండేది. 2019 సెప్టెంబర్ 27న ఒకసారి ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.డ్రగ్స్‌తో 20సార్లు హైదరాబాద్‌కు..సుజీ సూచనల మేరకు ఆమె నివసించే బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్‌ను తీసుకొని హైదరాబాద్‌కు సరఫరా చేసేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా.. ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని, 13 సందర్భాల్లో రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకుందని ఓ అధికారి తెలిపారు. బ్లెస్సింగ్ తన బ్యాగేజ్లో కొకైన్ దాచి పెట్టి, దాన్ని విమానం ఎక్కేక్రమంలో చెకిన్ లగేజ్‌లో ఇచ్చేదని, విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల ఉనికి గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనానికి ఇదొక ఉదాహరణనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ డ్రగ్ పార్సిల్‌ను లంగర్‌హౌస్‌లోని సన్‌సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు అందజేస్తుంది. ఈమె డ్రగ్స్‌ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని, డ్రగ్స్ హైదరాబాద్‌కు చేర్చిన ప్రతీసారి సుజీ... బ్లెస్సింగ్‌కు రూ.20 వేలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్‌కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సుజీ పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. -
డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి తెప్పించి... నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది. ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాముకు రూ.500 కమీషన్ 2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు. నగరంలో 13 మంది... వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు. వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Nigeria: స్కూలు బిల్డింగ్ కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
కనో: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడు చోటుచేకున్నాయి. మూడుచోట్ల జరిగిన ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించింది. ఈ ఘటనలు శనివారం చోటు చేసుకున్నట్లు ఎమెర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.ఈశాన్య నైజీరియాలోని గ్వోజా పట్టణంలో ఓ వివాహ వేడుకలో గుర్తు తెలియని మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అదే పట్టణంలో మరో మహిళ ఓ ఆస్పత్రిలో ఆత్మాహుతి దాడి చేసింది. వివాహ వేడుకలో మృతిచెందిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో మరో దాడి చోటుచేసుకుంది. ఈ మూడు ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా.. 42 మంది గాయపడినట్లు బోర్నో రాష్ట్ర ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. మృతి చెందిన 18 మందిలో చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు అధికారులు తెలపారు.2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలో ఉన్న గ్వోజా పట్టణాన్ని బోకో హరామ్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకుంది. కెనడీయన్ ఆర్మీ సాయంతో నైజీరియన్ సైన్యం.. ఆ పట్టణాన్ని తిరిగి 2015లో స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి పట్టణానికి సమీపంలోని కొండల నుంచి హరామ్ మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నాయి. -
నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు
-
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
అమెరికాలో హెలికాప్టర్ కూలి... ఆరుగురి దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది. ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి. -
ఒకేసారి పదిమందిని ఓడించాడు! కారణం తెలిస్తే ఫిదా..
Chess Player Plays 10 Games Simultaneously: నైజీరియా చెస్ క్రీడాకారుడు టుండే ఒనకోయ తన నైపుణ్యాలతో అభిమానులను ఫిదా చేశాడు. ఒకేసారి పది మందితో చెస్ ఆడి.. అందరినీ ఓడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టుండే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో టుండే ఈ గేమ్ ఆడటానికి గల అసలు కారణాన్ని తెలుసుకున్న నెటిజన్లు అతడి మంచి మనసును కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. నైజీరియాకు చెందిన టుండే ఒనకోయ చెస్ ప్లేయర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికే పరిమితం కాకుండా.. ‘చెస్ ఇన్ స్లమ్స్’ అనే ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు సాయం చేస్తున్నాడు. సామాజిక అంతరాలను తగ్గించే క్రమంలో చెస్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ.. ఆటపై మక్కువ ఉన్న చిన్నారులకు మెళకువలు నేర్పిస్తున్నాడు. కేవలం ఆట వరకే తన శిక్షణను పరిమితం చేయకుండా.. జీవిత పాఠాలు, సమస్యలు ఎదురైనపుడు సహనంగా, ఓర్పుగా వాటిని పరిష్కరించుకోవడం వంటి విషయాలు నేర్పుతూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నాడు టుండే ఒనకోయ. తాజాగా పది మందితో ఒకేసారి చెస్ ఆడాలన్న ఈవెంట్ కూడా ఫండ్ రైజింగ్‌లో భాగంగా నిర్వహించినదే. ఈ చెస్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వంద మంది విద్యార్థుల చదువుకు సాయం చేసేందుకు వినియోగిస్తామని టుండే ఒనకోయ సోషల్ మీడియాలో వెల్లడించాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తాను పది మందిని ఒకేసారి ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. జనవరి 17 నాటి ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చదవండి: Sachin Tendulkar: వరుసగా రెండుసార్లు డకౌట్.. సాకులు చెప్పా.. ఆ ఒక్క పరుగు వల్ల On day two of the DLD conference, I played a simultaneous chess match against 10 players at once. After an almost two hour battle of wits ,I managed to win all the games. The Chess exhibition helped us raise enough money to support the education of 100 children in our academy. pic.twitter.com/fnrOcxQe8p — Tunde Onakoya (@Tunde_OD) January 17, 2024 -
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
భారతీయులు నైగర్‌ను వీడాలని కేంద్రం ఆదేశం..
తిరుగుబాటుతో నైగర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. నైగర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోందని విదేశాంక శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎయిర్‌లైన్స్ వ్యవస్థను నిలిపివేసినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. భూభాగం గుండా ప్రయాణిస్తున్నవారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నైగర్ వెళ్లదలచినవారు కూడా అక్కడ సాధారణ పరిస్థితుల నెలకొనేవరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. #WATCH | MEA spokesperson Arindam Bagchi says, "Government of India is closely monitoring ongoing developments in Niger. In light of the prevailing situation, Indian nationals whose presence is not essential are advised to leave the country as soon as possible. They may bear in… pic.twitter.com/vjqzqxdyY2 — ANI (@ANI) August 11, 2023 నైగర్‌లో ఉన్న భారతీయులు మన దేశం చేపట్టిన ఇండియన్ మిషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, వారందరి బాధ్యతలను ఎంబసీ చూసుకుంటుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న భారతీయుల ప్రయాణానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూభాగం ద్వారానే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నైగర్ ప్రెసిడెంట్ బజౌమ్‌ను తొలగించినట్లు ఆ దేశ ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు జాతీయ టెలివిజన్‌లో జూలై 26న ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెన్షియల్ గార్డ్‌కు అధిపతిగా పనిచేసిన జనరల్ అబ్దురహమనే ట్చియాని నైజర్కు కొత్త సైనిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో తిరుగుబాటు మొదలైంది. ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. -
ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
ఆఫ్రికాలోని నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్‌కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీవ్ర ఆగ్రహం నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. What's Happening in Niger? Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on? - Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6 — Brian Krassenstein (@krassenstein) August 1, 2023 అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్‌కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్‌లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అతని ప్యాలెస్‌లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ
నియామే: నైగర్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకించిన కారణంగా ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీలు చేశారు సైనిక మద్దతుదారులు. దీంతో నైగర్‌లో ఉండే ఫ్రాన్స్ దేశస్తులకు హాని ఉందన్న కారణంతో వారిని వెంటనే వెనక్కు రప్పించనున్నట్లు తెలిపింది ఫ్రాన్స్ ఎంబసీ. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందిన నైగర్‌లో 2021లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగాయి. అందులో అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ బజోమ్స్ పరిపాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని సైన్యం ఆరోపిస్తూ ఆయనను గద్దె దించాలని నిర్ణయించుకుంది సైన్యం. ఇటీవలే ఆయను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించారు సైన్యాధ్యక్షుడు కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే. నైగర్‌లో సైనిక తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫ్రాన్స్ దేశం సైనిక తిరుగుబాటును వ్యతిరేకించగా రష్యా సమర్ధించింది. ఈ నేపథ్యంలో నైగర్‌లో తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు రష్యాకు జేజేలు పలుకుతూ ఫ్రాన్స్ దేశానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో భారీగా ప్రదర్శన చేశారు. దీంతో ఫ్రాన్స్ దేశస్తులకు నైగర్‌లో ప్రమాదమని భావించి వారిని వెనక్కు రాపించే ప్రయత్నం చేస్తోంది ఫ్రాన్స్ ఎంబసీ. ఇది కూడా చదవండి: కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష.. -
రష్యా అధ్యక్షుడికి జేజేలు.. నైగర్‌లో భారీగా మద్దతుదారులు..
నియామే: పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైగర్‌లో సైనిక దళాలు తిరుగుబాటు చేసి ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ బజోమ్స్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సైనిక చర్యను ప్రాన్స్ తప్పుబట్టగా వాగ్నర్ దళాధిపతి ప్రిగోజిన్ మాత్రం మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు సైన్యానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధానికి తరలి వచ్చారు. తిరుగుబాటు పర్వం.. కొద్దిరోజుల క్రితం నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటు ఇరుగు పొరుగు దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల క్రితం 2021లో నైగర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ బజోమ్స్ గెలిచారు. కానీ ఆయన పరిపాలనలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద ముఠాలు పేట్రేగుతున్నాయని, అతని చేతగానితనంతో ఫ్రాన్స్ మళ్ళీ తమ గడ్డమీద పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసి అధ్యక్షుడిని చెరలో బంధించామని కల్నల్ మజ్ అమదౌ అబ్రందానే తెలిపారు. దేశమంతటా కర్ఫ్యూ.. ఈ మేరకు ఒక వీడియోని విడుదల చేస్తూ.. దేశ సరిహద్దులను మూసి వేస్తున్నామని, ఇది మా దేశ అంతర్గత వ్యవహారమని ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మహమ్మద్ బజోమ్స్ ను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నామని ప్రకటిస్తూ దేశమంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు టీవీ ద్వారా సందేశమిచ్చారు. COUP D'ETAT IN NIGER - Group of soldiers appear on state TV - Announce President Bazoum has been removed - Order 7 pm-5 am nationwide curfew - Borders closed until further notice - Bazoum appears to have been detained - Niger is Western ally in fight against terror pic.twitter.com/iHJ3XbaF1s — BNO News (@BNONews) July 26, 2023 అమెరికా కంగారు.. తిరుగుబాటు తదనంతరం సైనిక చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా వారి గొంతు వెనుక స్వార్ధపూరిత కారణాలు కూడా లేకపోలేదంటున్నాయి నైగర్ సైనిక వర్గాలు. నైగర్‌లో అమెరికాకు రెండు డ్రోన్ స్థావరాలున్నాయని సుమారు 800 మంది వారి సైనికులు నైగర్ సైన్యానికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. జయహో పుతిన్.. ఇదిలా ఉండగా రష్యా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడు యెవ్‌గనీ ప్రిగోజిన్ నైగర్ సైన్యం తిరుగుబాటు సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో నైగర్ తిరుగుబాటు సైన్యానికి మద్దతుదారులు భారీగా రాజధాని నియామేకి తరలి వచ్చి ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు జేజేలు పలుకుతూ రష్యా జెండాలను ప్రదర్శించారు. అనుమానమే నిజమైంది.. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి నైగర్‌లో తిరుగుబాట్లు జరిగాయి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన తర్వాత తిరుగుబాటు జరగడం ఇదే మొదటిసారి. అధ్యక్షుడిగా మహమ్మద్ బజోమ్స్ ఎన్నికైన తర్వాత పలుమార్లు ప్రెసిడెన్షియల్ గార్డ్స్ బృందం నుండి తనకు ముప్పు ఉందని తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఆయన అనుమానమే నిజమైంది. ఇది కూడా చదవండి: ఎత్తైన భవనంపై సాహాసం.. అంతలోనే పట్టుతప్పి.. -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్‌స్టాప్‌గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్‌కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్‌స్టాప్‌గా ఏడవం అనే ఫీట్‌ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్‌ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..
అది 1985, ఏప్రిల్ 22, నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఓ) 35 ఏళ్ల మహిళ గ్లోరియా ఒకాన్‌ను హెరాయిన్‌తో పాటు ఇతర హార్డ్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు నైజీరియాలోని అమీను కానో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె నుంచి 56.70 గ్రాముల మత్తు పదార్ధాలు, 301 డాలర్లు, 60 పౌండ్ల స్టెర్లింగ్, 20,000యెన్లు,19,000 ఇటాలియన్ లిరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె నైజీరియా నుండి ఇంగ్లండ్‌కు వెళుతోంది. గ్లోరియా ఒకాన్ చేస్తున్న మత్తుమందుల రవాణాకు సంబంధించిన వార్తలు స్థానిక, అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. నైజీరియన్లు ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపారు. ఎందుకంటే నాటి బుహారీ మిలిటరీ.. నిషేధిత డ్రగ్స్‌తో ఎవరైనా పట్టుబడితో మరణశిక్ష విధిస్తామని ప్రకటించింది. గ్లోరియా ఒకాన్‌ను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత అంటే 1985, ఏప్రిల్ 28న కస్టడీలో ఉన్న ఆమె వివాదాస్పద రీతిలో మరణించింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. అరెస్టు చేసిన సమయంలో ఆమెలో అనారోగ్య సంకేతాలు లేవని దానిలో పేర్కొన్నారు. తొలగని అనుమానాలు.. గ్లోరియా ఒకాన్‌ను కస్టడీలో ఉంచిన కస్టమ్స్ అధికారి మాట్లాడుతూ ఆమెను అరెస్టు చేసిన రోజున, ఆమె రైస్, బీన్స్ అడిగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యానని తెలిపిందన్నారు. ఆ తరువాత ఆమె మరణించిందని అన్నారు. అయితే ఆమె మరణానికి ముందు ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆమె ఒక క్లూని మాత్రంవదిలి వెళ్లింది. బస్సీ అనే పేరును విచారణలో ఆమె ప్రస్తావించింది. కాగా గ్లోరియా ఒకాన్ బంధువులెవరూ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి రాలేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నాటి పాలకుడు బాబాంగిడా బుహారీని అధికారం నుండి తొలగించిన తర్వాత, గ్లోరియా ఒకాన్ కేసు దర్యాప్తును తిరిగితోడేందుకు నైజీరియన్ న్యాయవాది గని ఫవేహిన్మి సిద్ధమయ్యారు. అయితే గ్లోరియా ఒకాన్ కేసులో ఎటువంటి ముగింపు లేకపోవడంతో నైజీరియన్లలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. Her mule, Gloria Okon was caught redhanded, reports claimed she was dead but infact she was secretly pardoned by Babangida, and Dele Giwa had proof of this, he even had a picture of this Gloria and Maryam Babangida in London, Chilling! pic.twitter.com/xs6muRlT48— Ronu Spirit (@ronuspirit) March 17, 2023 సాధారణ జీవితం గడుపుతూ.. గ్లోరియా ఒకాన్ నాటి నైజీరియన్ ఆర్మీ జనరల్ బాబాంగిడా కోసం పనిచేస్తున్నదని కొందరు భావించారు. అందుకే ఆమెను హత్య చేశారని అనుకున్నారు. గ్లోరియా ఒకాన్ మరణం అసహజమైనదని, ఆమె కుటుంబసభ్యులకు పంపిన మృతదేహం ఆమెది కాదని కొందరు వాదించారు. నైజీరియాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆమె సాధారణ జీవితాన్ని గడిపేదని కూడా అంటారు. జూన్ 2009లో నైజీరియన్ ప్రొఫెసర్ తైమివో ఒగునాడే ది నేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “గ్లోరియా ఒకాన్ అసలు పేరు చిన్యెరే. ఆమె ఛార్లెస్ "జెఫ్" చాండ్లర్ను వివాహం చేసుకుంది. అతను న్జియోగ్వు హత్య జరిగిన మర్నాడు హతమయ్యాడు. కాగా చిన్యేరే, మరియమ్, ప్రిన్సెస్ అట్టా మొదలైనవారంతా స్నేహితులు. వారందరూ మిలిటరీలోని వారిని వివాహం చేసుకున్నారు. నాటి రోజుల్లో మిలటరీలో పనిచేసేవారిని ఎంతో గౌరవించేవారు. కేసు రీఓపెన్ అవుతుందా? ఇమో స్టేట్‌కు చెందిన టివ్... చిన్యెరేను వివాహం చేసుకున్నాడు. భర్త మరణంతో చిన్యెరే వితంతువుగా మారింది. అనంతరం ఆమె యూకే- నైజీరియా మధ్య డ్రగ్స్ వ్యాపారాన్ని ఆశ్రయించింది. ఆపై ఆమె డ్రగ్స్‌తో పట్టుబడింది. కానో నుండి లండన్‌కు వెళ్లే విమానంలో చిన్యేరేను ఎక్కించిన మమ్మన్ వత్సా ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఈ నాటి వరకు గ్లోరియా ఒకాన్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగానే మిగిలింది. మూసివేసిన ఈ కేసును తిరిగి తెరవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేసు రీఓపెన్ అవుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. He doesn't know the Gloria Okon Saga story small kids pic.twitter.com/2iDxIDcCBF— LUCA BRASI -5.0 The UnderBoss (@donortez) November 14, 2022 ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. -
నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?
నైజీరియా దేశానికి చెందిన ఒక చెఫ్ చేపట్టిన కుక్-ఏ-థాన్ విశేషంగా నిలుస్తోంది. లాంగెస్ట్ కుక్ఏథాన్లో హిల్డా బాసీ వరుసగా 100 గంటలు వంట చేసి రికార్డ్ బద్దలు కొట్టింది. మే 11-15 వరకు ఏకథాటిగా కుక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల కెక్కింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తమ నైజీరియన్ వంటకాల గురించి ప్రచారం చేయడమేనని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో నైజీరియన్ వంటకాలు కూడా ఒకటని, వీటి గురించిన విశేషాలు మరింతమందికి చేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. హిల్డా బాసిగా ప్రసిద్ధి చెందిన హిల్డా ఎఫియాంగ్ బస్సే ఈ 100 గంటల్లో 100 కంటే ఎక్కువ మీల్స్ , దాదాపు 55 ఇతర వంటకాలను ప్రిపేర్ చేసింది. ఈ కుక్-ఎ-థాన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. హిల్డా బాసికంటే ముందు సుదీర్ఘమైన వంట చేసిన రికార్డు భారతీయ చెఫ్ లతా టొండన్ పేరుతో ఉంది. దాదాపు 88 గంటల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Hilda Baci’s Cookathon (@hildabacicookathon) View this post on Instagram A post shared by Myfood By Hilda Baci (@myfoodbyhilda) -
ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు!
కొందరు విదేశీయులు అద్దెకు ఇంటిని తీసుకున్న అందులో ల్యాబరేటరీని ఏర్పరుచుకుని డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఈ దాడిలో నిందితులతో పాటు కోట్ల విలువైన మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అంతర్జాతీయ మార్కెట్లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులుకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు సుమారు 100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకులో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిని అనుదుమ్ ఇమ్మాన్యుయేల్, అజోకు ఉబాకా, డేనియల్ అజుహ్, లెవి ఉజోచుక్వ్, జాకబ్ ఎమెఫీలే, కోఫీ, చిడి ఇజియాగ్వా (ఎనిమిది మంది నైజీరియాకు చెందినవారు), డ్రామెమండ్ (సెనెగల్‌కు చెందినవారు)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్‌ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్‌గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
ఎంత దారుణం.. మార్కెట్లో ప్రవేశించి 47 మందిని కాల్చి చంపారు!
ఆఫ్రికాలోని నైజీరియాలోని సాయుధులు నరమేధానికి తెగబడ్డారు. బెన్యూ రాష్ట్రంలోని ఉమోగిడి గ్రామంలో సాయుధులు 50 మందిని దారుణంగా చంపారు. బుధవారం నాడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 47 మందిని కాల్చి చంపినట్లు ఒటుక్పో స్థానిక ప్రభుత్వ చైర్మన్ తెలిపారు. ఈ ఘటనకు ఒక రోజు ముందు, అదే స్థలంలో ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. బెన్యూ స్టేట్ పోలీసులతో అనెన్ సీవీస్ ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు అకస్మాత్తుగా మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒక పోలీసు అధికారి కూడా మరణించినట్లు సీవీస్ తెలిపారు. కాగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ రెండు దాడులకు సంబంధం ఉన్నట్లు భావిస్తూ ఆ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. కాగా ఉత్తర-మధ్య నైజీరియాలో భూ వివాదాలపై గతంలో రైతులతో ఘర్షణ పడిన స్థానిక పశువుల కాపరులపై అనుమానం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో.. ఫులానీ మూలానికి చెందిన పశువుల కాపరులు తమ పొలాల్లో తమ పశువులను మేపుతున్నారని, ఈ కారణంగా తమ పంట నాశనమవుతోందని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1965లో తొలిసారిగా చట్టం ద్వారా ఆ భూములు మేత దారులేనని పశువుల కాపరులు నొక్కి చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బెన్యూ రాష్ట్రాన్ని "నైజీరియా ఆహార బుట్ట"గా అక్కడి ప్రజలు పిలుస్తారు. ఆ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండుతాయి. అయితే తరచుగా జరిగే ఈ ఘర్షణల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఆకలితో అలమటించే పేద ప్రజలను ఈ పరిస్థితి మరింత కుంగతీస్తుంది. -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్‌ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్‌బుక్‌లు, 8 చెక్కు బుక్‌లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్‌లో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్‌లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు..!
‘నైజీరియన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి సందేశం కావొచ్చు. మీరంతా నాకు సాయం చేస్తారని భావిస్తున్నా..’ అంటూ ఇక్వెటోరియల్ గినీలో బందీగా మారిన ఓ భారత నావికుడి వీడియో సందేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆఫ్రికా దేశమైన ఇక్వెటోరియల్ గినీలో గత ఆగస్టు నెలలో ‘హీరోయిక్ ఇడున్’ అనే నౌకను అక్కడి నౌకాదళం బందించింది. అందులోని 16 మంది భారత నావికులు సహా సిబ్బంది బందీలుగా ఉన్నారు. ఆగస్టు 13న హీరోయిక్ ఇడున్ నౌకపై ఇక్వెటోరియల్ గినియా జెండా లేదనే కారణంగా నిలిపేశారు. గత 80 రోజులుగా నావికులు బందీలుగా ఉన్నారని, వారిని నైజీరియా నేవీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరోయిక్ ఇడున్ నౌక చీఫ్ ఆఫీసర్, భారత నావికుడు సాను జోష్ తనను అదుపులోకి తీసుకునేందుకు కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోలో ‘నైజీరియాన్ నౌకాదళం నన్ను తీసుకెళ్తోంది. ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు. మీరంతా నన్ను చూస్తున్నారని, నాకు సాయం చేస్తారని భావిస్తున్నా. ఈ సందేశాన్ని దేశంలోని ప్రతిఒక్కరికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు సాను జోష్. బందీలుగా మారిన భారత నావికులను విడిపించేందుకు భారత అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బంది సురక్షితంగా స్వదేశం చేరేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు.. గత ఆగస్టు నెల మధ్యలోనే హీరోయిక్ ఇడున్ అనే నౌకకు చెందిన భారత నావికులు సహా సిబ్బంది అంతా బందీలుగా పట్టుబడ్డారని విదేశాంగ శాఖకు తెలియజేశారు రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం. మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బందీలను త్వరగా విడుదల చేయడానికి గినీ, నైజీరియా దేశాలకు చెందిన అధికారులతో చర్చిస్తున్నామని ఇక్వెటోరియల్ గినీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. ఆందోళనలో ప్రజలు.. చైనానే కారణం? -
ఐయామ్ వరుణ్ రావ్ ఫ్రమ్ యూఎస్ఏ.. త్వరలో పెళ్లి చేసుకొని కోట్లు సంపాదిద్దాం
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): అమెరికాలో ఉన్నత ఉద్యోగం, ఇద్దరం కలసి త్వరలో ఒక్కటై కోట్లు సంపాదించవచ్చు. నేను ఇండియా వచ్చే వరకు ఆలస్యం అవుతున్న కారంగా నీకొక గిఫ్ట్ పంపుతున్నా తీసుకో అంటూ..మరుసటి రోజు నుంచి కస్టమ్స్ పేరుతో లక్షల రూపాయిలు లూటీ చేసిన నైజీరియన్ కటకటాలపాలైయ్యాడు. అతగాడి నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, 8 మొబైల్ ఫోన్లు, పది సిమ్‌కార్డులు, రెండు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. ఎస్సార్‌నగర్‌కు చెందిన యువతి కొద్దిరోజు క్రితం పెళ్లికోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈమె ప్రొఫైల్ చూసిన నైజీరియన్ యూఎస్ఏలో సివిల్ ఇంజనీర్‌గా చేస్తున్నానని తన పేరు వరుణ్రావుగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గంటలకొద్దీ ఫోన్లలో మాట్లాడుకున్నారు. తాను యూఎస్ఏ నుంచి ఇండియాకు వచ్చే లోపు ఆసల్యం అవుతున్న కారణంగా ముందుగా బంగారు ఆభరణాలు, యూఎస్ డాలర్స్, ఖరీదైన ఫోన్లను గిఫ్ట్ రూపంలో పంపుతున్నాను తీసుకోమన్నాడు. మరుసటి రోజే స్టార్ట్ అయ్యింది ఢిల్లీలోని కస్టమ్స్ అధికారులమంటూ యువతికి వల వేశారు. మీకు రావాల్సిన గిఫ్టŠస్కి మీరు కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీంతో యువతి పలు దఫాలుగా రూ. 18 లక్షలు చెల్లించి మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో బట్టల వ్యాపారం చేస్తున్న నైజీరియన్ అములోన్యే ప్రిన్స్ ఫ్లెక్స్(50)ను అరెస్ట్ చేశారు. ఇతగాడిని విచారించగా.. గతంలో అనేకమందికి ఇలా వల వేసి లక్షలాది రూపాయిలు దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు. 2012లో నైజీరియన్ నుంచి ఢిల్లీకి వచ్చిన అములోన్యే ప్రిన్స్ ఫ్లెక్స్ వీసా గడువు ముగిసినాక కూడా ఇక్కడే ఉంటూ..ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్నణట్లు నిర్థారణ అయ్యింది. ఈ విధమైన మోసాల్లో నగరవాసులు చిక్కుకోవద్దంటూ సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ సూచించారు. -
ముంచెత్తిన వరదలు.. ఎటు చూసినా నీరే! 600 మంది మృతి
అబుజా: దక్షిణ ఆఫ్రికా దేశం నైజీరియాను వరదలు ముంచెత్తాయి. గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 600 మంది మరణించారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు. Nigeria is experiencing a flooding crisis, but the government is not taking any immediate action. It has become an ‘overwhelming’ disaster, killing over 500 people and displacing 1.4 million people. #NigeriaFloods pic.twitter.com/vNvJNXPjXV — EiE Nigeria (@EiENigeria) October 17, 2022 వరదల కారణంగా దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2 లక్షల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే వరదల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, మౌలిక వసతుల లేమి, పేలవ ప్రణాళిక కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం భారీ విపత్తు వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. Large parts of 31 States are affected by massive flooding. Over 500 dead. Unimaginable pain and suffering. Urgent Help Needed! Begging Mr President to: -Declare a state of emergency in the affected areas - Address the flood victims@toluogunlesi @nemanigeria @MBuhari https://t.co/oxL5WFjVjj pic.twitter.com/CSBEcvziIV — Dr Aloy Chife (@ChifeDr) October 16, 2022 వర్షాకాలం పూర్తయ్యే నవంబర్ చివరి వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని నైజీరియా వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని మొత్తం 36కు గాను 26 రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉన్నట్లు చెప్పింది. It doesn't seem like we have a National Crisis at hand, probably because #Lagos and #Abuja are not flooded. #NigeriaFloods pic.twitter.com/9ji4OWW7xz — #LeaveNoOneBehind (@Temple_Oraeki) October 15, 2022 చదవండి: తాలిబన్ల చేతితో దారుణమైన చావు తప్పదని తెలిసి..! -
స్నేహం పేరుతో టోకరా... ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
హిమాయత్‌నగర్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న నైజీరియన్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన ఓ యువతికి యూఎస్‌లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహానికి గుర్తుగా యూఎస్ నుంచి విలువైన గిఫ్ట్‌లు పంపిస్తున్నట్లు సదరు వ్యక్తి యువతితో నమ్మబలికాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించగా.. నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిబుజా, రోమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. (చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం) -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 76 మంది దుర్మరణం
లాగోస్: వరదలతో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వెళ్తున్న పడవ మునిగి 76 మంది దుర్మరణం చెందారు. ఈ విషాదం సంఘటన నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో జరిగింది. వరద నీటిలో పడవ మునకపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి. నైగెర్ నది వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. పడవలో దాదాపు 85 మంది ప్రయాణించారని, ఓవర్ లోడ్ కారణంగా మునిగిపోయినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాష్ట్రంలోని ఓగుబరూ ప్రాంతంలో సుమారు 85 మందితో వెళ్తున్న పడవ వరదలతో ఉప్పొంగిన నదిలో మునిగిపోయినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మొత్తం 76 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం ధ్రువీకరించింది. బాధితులకు అత్యవసర సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.’ అని తెలిపారు అధ్యక్షుడు బుహారి. భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగినట్లు అత్యవసర విభాగం వెల్లడించింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కఠినంగా మారినట్లు తెలిపింది. సహాయ చర్యల కోసం నౌకాదళ హెలికాప్టర్ సాయం కోరామని పేర్కొంది. ఇదీ చదవండి: ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి -
చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ
ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్‌కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అన్నారు. 'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్‌గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు. బీజేపీ గట్టి కౌంటర్.. అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్‌కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. Nana Patole who is Rahul Gandhi of Maharashtra says Lumpy Virus originated in Nigeria & it came because Modi ji brought Cheetahs! Cheetahs came from Namibia Does he know Nigeria & Namibia are different nations? Congress has always spread such lies & rumours 1/n — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 3, 2022 కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పిల్లాడు ఆషామాషీ బుడ్డోడేమీ కాదు, ఇతగాడు బాలకుబేరుడు. పట్టుమని పదేళ్ల వయసైనా లేదు గాని, వయసుకు మించినన్ని లగ్జరీ కార్లు, రాజప్రాసాదాన్ని తలపించే భవంతి, ఒక ప్రైవేటు విమానం ఇతడి సొంతం. ఈ నైజరీయన్ బాలకుబేరుడి పేరు మహమ్మద్ అవల్ ముస్తఫా. నైజీరియాలో ఇతడు ‘మోంఫా జూనియర్’గా ఫేమస్. ఈ బాలకుబేరుడి కథా కమామిషూ ఏమిటంటే, ఇతడి తండ్రి ఇస్మాయిలా ముస్తఫా నైజీరియాలో ఇంటర్నెట్ సెలిబ్రిటీ. ‘మోంఫా’ పేరుతో బాగా ఫేమస్. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇతగాడి ఫాలోవర్ల సంఖ్య 12 లక్షల మందికి పైమాటే! ‘మోంఫా’ ప్రధాన ఆదాయ వనరు ఇంటర్నెట్ అయితే, దీనితో వచ్చిన ఆదాయంతో వేర్వేరు వ్యాపారాలూ సాగిస్తూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడిస్తున్నాడు. తన కొడుకు ‘మోంఫా జూనియర్’కు మూడేళ్ల కిందట– 2019లో అతడి ఆరో పుట్టినరోజు సందర్భంగా లాగోస్ నగరంలో రాజప్రాసాదాన్ని తలపించే ప్యాలెస్‌ను కానుకగా ఇచ్చాడు. ‘మోంఫా జూనియర్’ కూడా ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రాండెడ్ దుస్తులతో, లగ్జరీ కార్లతో పోజులిస్తూ ఫొటోలు పెడుతుండటంతో ఈ బాలకుబేరుడికి ఫాలోవర్లు బాగానే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకుబేరుడి తండ్రి సీనియర్ ‘మోంఫా’ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటం గమనార్హం. -
Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు
ఢిల్లీ: మరో మంకీపాక్స్ కేసు దేశంలో నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఆఫ్రికాకు చెందిన సదరు యువతి.. నైజీరియా నుంచి నెల కిందట వచ్చింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువతికి టెస్టుల అనంతరం శుక్రవారం రాత్రి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరు యువతులు. తేలికపాటి వైరస్ అయిన మంకీపాక్స్.. మశూచి లాంటిదే!. ఇది తొలిసారిగా 1958లో బయటపడింది. కోతులకు ముడిపడి ఉందన్న నేపథ్యంతో.. దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వైరస్ ఛాయల్ని గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరింది. ఇప్పుడు భారత్ సహా 75 దేశాలకు పైగా విస్తరించింది. ఇదీ చదవండి: మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు ఎలా గుర్తించాలో తెలుసా? -
గోవా టు హైదరాబాద్.. అతిపెద్ద డ్రగ్ దందా గుట్టురట్టు
హిమాయత్ నగర్: గోవా టు హైదరాబాద్ మధ్య నడుస్తున్న అతిపెద్ద డ్రగ్ ముఠా గుట్టును హెచ్ న్యూ టీమ్ రట్టుచేసింది. నైజీరియాకు చెందిన ఒసిగ్వే చుక్వేమెక జేమ్స్ అలియాస్ అలమాంజో నామ్సిచ్క్వూను అరెస్ట్ చేసింది. అతడి వద్ద నుంచి అతిప్రమాదకరమైన 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను మూడు దేశాలకు చెందిన నగదు తోపాటు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసు కుంది. జేమ్స్‌ను నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని నియాజ్‌ఖానా వద్ద స్థానిక పోలీసులతో కలసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సెంట్రల్‌జోన్ డీసీపీ రాజేష్‌చంద్ర శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దొంగ పాస్‌పోర్ట్‌లతో మకాం నైజీరియాకు చెందిన జేమ్స్ 2016 నుంచి 2019 వరకు అధికారిక పాస్‌పోర్ట్‌తో టూరిస్ట్‌గా ఇండియాకు వస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గోవా, బెంగళూరులోని కొందరు డ్రగ్ పెడ్లర్ (అక్రమంగా మత్తుమందు సరఫరా చేసేవారు)లతో పరిచయాలు పెంచుకున్నాడు. 2021లో మరోమారు ఇండియాకు వచ్చిన జేమ్స్ పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో పలు పేర్లతో నకిలీ పాస్‌పోర్ట్‌లను రూపొందించుకున్నాడు. గోవా, హైదరాబాద్ నుంచి నైజీరియాకు వెళ్లి వస్తున్నాడు. గోవాలో ఎండీఎంఏ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు జేమ్స్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మూడు నెలల తర్వాత ఇటీవల జైలు నుంచి వచ్చిన జేమ్స్ గోవా నుంచి తన మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ అయిన నైజీరియన్ జాక్‌తో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నాడు. జాక్ చెప్పినట్లు గోవా, బెంగళూరు నుంచి డ్రగ్‌ను సేకరించి హైదరాబాద్‌లో అమ్మకాలు చేస్తున్నాడు. 108 మంది కస్టమర్లకు రెగ్యులర్‌గా డ్రగ్‌ను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రముఖులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అధికంగా ఉన్నారు. 60 మంది వివరాలను సేకరించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్‌న్యూ టీమ్ ఆరు నెలల వ్యవధిలో 60 కేసులు నమోదు చేసి దేశవ్యాప్తంగా 250 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. -
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ ... ఎనిమిదికి చేరిన కేసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా ఎనిమిదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్‌ఎన్‌జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అంతకు ముందురోజే యూఏఈ నుంచి కోజీకోడ్ వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ వచ్చింది. ప్రస్తుతం అతను మలప్పురంలో చికిత్స పొందుతున్నాడు. అదీగాక ఇటీవలే కేరళలో మంకీపాక్స్‌తో మరణించిన తొలి కేసును కూడా అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి మంకీపాక్స్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినట్లు కూడా తెలిపారు. దీంతో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నియంత్రణ కోసం, వ్యాక్సిన్ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జాతీయ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాదవియా వెల్లడించారు. ఈ టాస్క్ఫోర్సులో డాక్టర్ వీకే పాల్ తోపాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో ఇతర సభ్యులు ఉన్నారని చెప్పారు. (చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి!) -
భారత్‌లో నైజీరియా స్టార్టప్ ఎంట్రీ.. ఆ మూడు నగరాలే టార్గెట్!
న్యూఢిల్లీ: వాహన రుణ రంగంలో ఉన్న నైజీరియా స్టార్టప్ మూవ్ తాజాగా భారత విపణిలోకి ప్రవేశించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలను ప్రారంభించినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. మొబిలిటీ ఎంటర్ప్రైసెస్కు రెవెన్యూ ఆధారిత రుణాన్ని కంపెనీ అందిస్తోంది. యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ఉబర్‌కు వాహనాల సరఫరా భాగస్వామిగా ఉంది. ఉబర్ డ్రైవర్ పార్ట్నర్లకు ప్రత్యేకంగా రుణం సమకూరుస్తోంది. రుణం అందిస్తున్న వాహనాల్లో 60 శాతం హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండాలన్నది కంపెనీ లక్ష్యం. 13 దేశాల్లో కార్యకలాపాలను మూవ్ సాగిస్తోంది. డ్రైవర్ పార్ట్నర్లు 50 లక్షల ట్రిప్‌లను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది. సంస్థ ఇప్పటి వరకు రూ.1,600 కోట్లు సమీకరించింది. చదవండి: Karur Vysya Bank: అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది! -
మంచి చాన్స్ మిస్ చేశాడనుకుంటున్నారా.. కథ వేరే ఉంది
ఫుట్‌బాల్‌లో పెనాల్టీ కిక్ అంటే అదృష్టం కింద పరిగణిస్తారు. ఎందుకంటే పెనాల్టీ కిక్ సమయంలో ప్రత్యర్థి జట్టు నుంచి గోల్ కీపర్ మినహా మరే ఆటగాడు గోల్‌పోస్ట్ ముంగిట ఉండడు. ఈ అవకాశం వచ్చిన జట్టు పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పెనాల్టీ కిక్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేని ఆటగాళ్లు కొందరుంటారు. అదే కావాలని మిస్ చేయడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇది చదవండి. విషయంలోకి వెళితే.. నైజీరియా వేదికగా ఓగున్ స్టేట్ ఎఫ్ఏ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రోమియో స్టార్స్, ఇజేబూ యునైటెడ్ మధ్య జరిగింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ ఆడేందుకు వచ్చిన ప్లేయర్ వచ్చాడు. గోల్‌పోస్ట్ వైపు కొట్టాల్సిన బంతిని సరిగ్గా వ్యతిరేక దిశలో కిక్ చేశాడు. అంతే చూస్తున్న మనకు షాకింగ్‌గా ఉండొచ్చు.. కానీ వాళ్లకు కాదు. ఎందుకంటే మ్యాచ్ ముందే ఫిక్స్ అయింది కాబట్టి. ఆ తర్వాతి వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది. తరువాత షూటౌట్ చేయడానికి వచ్చిన ప్లేయర్ ఈసారి నేరుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించగా.. గోల్ కీపర్ మాత్రం అసలేం పట్టనట్లు చూస్తూ ఉండిపోయాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ అని. ఈ వీడియో చూసిన నెటిజన్లు వినూత్న కామెంట్లతో రెచ్చిపోయారు. I do not know what to say! 🤣🤣pic.twitter.com/YSkFJZ2bDU — Figen (@TheFigen) July 22, 2022 If this isn’t Match Fixing, then I don’t know what it is. Why is Nigerian football like this? Why don’t we ever want progress?? This is Ogun State FA Cup final between Remo Stars and Ijebu United 💔💔 pic.twitter.com/Mef2oU2gd1 — Ibukun Aluko (@IbkSports) July 14, 2022 -
వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా అధికారుల ఫోటోలు...అమెజాన్ గిఫ్ట్ కూపన్ల పేరుతో వల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫొటోలను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్లుగా (డీపీ) పెట్టి, అనేక మందికి సందేశాలు పంపిస్తూ, అమెజాన్ గిఫ్ట్ కూపన్లు కోరి టోకరా వేస్తున్న, వేయడానికి ప్రయత్నిస్తున్న కేటుగాళ్లు నైజీరియాలో ఉన్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సహా ముగ్గురు ఉన్నతాధికారుల ఫొటోల దుర్వినియోగంపై నమోదైన కేసుల దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆయా వాట్సాప్‌ల ఐపీ అడ్రస్‌లు తని ఖీ చేయగా అవన్నీ నైజీరియాలోనే ఉన్నట్లు తేలింది. ఇక్కడి నంబర్ అక్కడ వాట్సాప్.. దేశంలోనే ఉంటూ నేరాలు చేసే నైజీరియన్లు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని వాడుతుంటారు. వీళ్లు బాధితులను బుట్టలో వేసుకోవడానికి అవసరమైన ఫోన్లు చేయడానికి బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు తీసుకుంటారు. వీటిని వీళ్లు కేవలం బేసిక్ ఫోన్లలో వేసి వాడేలా సూత్రధారులైన నైజీరియన్లు జాగ్రత్తపడతారు. ఈ నంబర్లకు సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం నైజీరియాలోని తమ అనుచరులతో యాక్టివేట్ చేయిస్తారు. అక్కడి వాళ్లు వైఫై ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటారు. అందుకు అవసరమైన కోడ్ మాత్రం ఇక్కడి వ్యక్తి దగ్గర ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. దీన్ని వీళ్లు నైజీరియాలోని వారికి చెప్పడంతో వాళ్లు ఎంటర్ చేసుకుని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. చిక్కకుండా గిఫ్ట్ కూపన్లు.. గతంలో సైబర్ నేరగాళ్లు తమ సందేశాలు అందుకున్న వారి నుంచి డబ్బు అడిగి ఆన్లైన్ ద్వారా లేదా వివిధ వ్యాలెట్స్‌కు పంపాలని కోరేవారు. విషయం పోలీసుల వరకు వెళ్లి దర్యాప్తు చేపడితే నగదు చేరిన నంబర్ ఆధారంగా వీరి వివరాలు బయటపడేవి. ఇటీవల కాలంలో ఎక్కువగా అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపాలని కోరుతున్నారు. నిర్ణీత మొత్తానికి వీటికి ఖరీదు చేస్తున్న బాధితులు దానికి సంబంధించిన లింకులను షేర్ చేస్తున్నారు. వీటిని ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా రీడీమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు ఫలానా దేశంలో కూపన్ రీడీమ్ అయిందని గుర్తించినా చర్యలు సాధ్యంకాదు. అధికారిక వెబ్సైట్లే ఆధారం.. వాట్సాప్ సిద్ధం చేసుకుంటున్న నైజీరియన్లు అధికారిక వెబ్సైట్ల ద్వారానే ప్రముఖ సంస్థల, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల వివరాలు, ఫొటోలు సంగ్రహిస్తున్నారు. ప్రొఫైల్ నేమ్, అబౌట్ తదితరాలను డీపీగా ఎంచుకున్న ఫొటోకు తగ్గట్టే సిద్ధం చేసుకుంటారు. ఈ నంబర్ నుంచి సదరు అధికారి కింద పని చేసే వారికి సందేశాలు పంపుతారు. ఇవీ నేరగాళ్ల చేతికి ఆయా వెబ్సైట్ల ద్వారానే తెలుస్తున్నాయి. కేవలం డీపీలు మాత్రమే చూస్తూ ఆ సందేశం తమ అధికారి నుంచే వచ్చినట్లు భావించి స్పందిస్తున్నారు. ఈ తరహా స్కామ్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సంప్రదించి సరిచూసుకోవాలి డీపీ ఫ్రాడ్స్‌ల్లో ఉన్నతాధికారులు, సెలబ్రెటీల ఫొటోలు వినియోగిస్తారు. ఎవరికైనా తమ పై అధికారులు, పరిచయస్తుల నుంచి డబ్బు, గిఫ్ట్ కూపన్లు పంపాలంటూ సందేశాలు వస్తే గుడ్డిగా నమ్మొద్దు. కేవలం డీపీలు చూసి ఆ సందేశం ఫలానా వారే పంపారని భావించద్దు. ఆ వాట్సాప్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను పరిశీలించాలి. అది వాళ్లు నిత్యం వినియోగించేది కాకపోతే వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
నరమేధం.. చెల్లాచెదురుగా మృతదేహాలు
ఉగ్రవాదుల మారణహోమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి. నైజీరియాలో ఓ చర్చిలో జరిగిన ఉగ్రకాండలో యాభై మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాడిని చాలా పక్కగా నిర్వహించారు ఉగ్రవాదులు. కొందరు చర్చిలోపల కాల్పులకు పాల్పడగా.. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లపై బయట ఉన్న మరో ఉగ్రవాది తూటాల వర్షం కురిపించాడు. మృతదేహాలు, చెల్లాచెదురుగా విడిభాగాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. పలు దేశాల అధినేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం -
నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
అబూజా: నైజీరియాలోని రివర్స్ రాష్ట్రం హర్కోర్ట్ నగరంలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కింగ్స్ అసెంబ్లీ పెంటెకొస్టల్ చర్చిలో శనివారం ఉదయం 9 గంటలకు పేదలకు పలు వస్తువులను ఉచితంగా అందజేస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, ఉదయం 5 గంటలకే భారీ సంఖ్యలో జనం చర్చి వద్ద క్యూ కట్టారు. రద్దీ పెరిగి, చర్చిగేట్లు విరగ్గొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 31 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు ఉచిత పంపిణీని రద్దు చేశారు. చదవండి: టెక్సాస్ నరమేధం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
ఆయిల్ రిఫైనరీలో భారీ ప్రమాదం.. 100 మంది కార్మికుల మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమోలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 100 మందికిపైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్టు తెలుస్తోంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. చదవండి👉🏼 58 ఏళ్ల తర్వాత ఫేస్బుక్ చేసిన మేలు కాగా, ఆఫ్రికాలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన నైజీరియాలో అనుమతిలేకుండా చమురు శుద్ధి కర్మాగారాలను నిర్వహించడం మామూలే! పైప్ లైన్ల నిర్వహణ లోపాల కారణంగా ప్రమాదాలు సాధరణమైపోయాయి. ఆయిల్ దొంగలు కూడా రిఫైనరీల పైప్లైన్లను ధ్వంసం చేసి భారీ ఎత్తున పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి వందలాది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆయిల్ దందాలో అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు మిలటీరిని రంగంలోకి దించామని, పటిష్ట చర్యలు చేపడుతున్నామని నైజీరియా ప్రభుత్వం చెబుతోంది. రోజూ 2 మిలియన్ల బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేస్తున్న నైజీరియాలో మెజారిటీ ప్రజలు బీదరికంలో మగ్గుతుండటం గమనార్హం. చదవండి👉 మొట్టమొదటిసారిగా.. యూఎస్‌లో పోర్నోగ్రఫీపై కోర్సు -
నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి డబ్బు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు ర్యాట్, కీలాగర్స్ వంటి మాల్వేర్స్ వాడారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీటి ద్వారానే హ్యాకర్లు బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి రూ.12.48 కోట్లు కొట్టేశారన్నారు. బుధవారం నైజీరియన్ ఇక్పా స్టీఫెన్ ఓర్జీని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 23కు చేరిందని చెప్పారు. బ్యాంక్‌ను కొల్లగొట్టిన హ్యాకర్లు నైజీరియా లేదా లండన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. గత నవంబర్ నుంచి సన్నాహాలు ప్రారంభించిన వీళ్లు మూడు మెయిల్ ఐడీల నుంచి బ్యాంక్ అధికారిక ఈ–మెయిల్ ఐడీకి ఆ నెల 4,10,16 తేదీల్లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపారు. ఆర్టీజీఎస్ అప్‌గ్రేడ్ తదితరాలకు సంబంధించిన మెయిల్స్‌గా ఉద్యోగులు భ్రమించేలా వీటిని రూపొందించారు. నవంబర్ 6న ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు వీటిని క్లిక్ చేశారు. ఫలితంగా దీనికి అటాచ్ చేసిన ఉన్న రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) ఆ రెండు కంప్యూటర్లలోకి చొరబడింది. దీని ద్వారా బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి వాటిలోకి కీలాగర్స్ మాల్వేర్ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు కంప్యూటర్లను వాడిన ఉద్యోగులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌తోపాటు అన్ని కార్యకలాపాలు హ్యాకర్‌కు చేరిపోయాయి. అత్యంత బలహీనంగా సైబర్ సెక్యూరిటీ రూ.వందలు, వేల కోట్ల ప్రజాధనంతో లావాదేవీలు జరిగే బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఈ విషయంలో మహేష్ బ్యాంక్ కక్కుర్తి, నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన ఫైర్ వాల్స్‌ను ఏర్పాటు చేసుకోలేదు. దీనివల్లనే హ్యాకర్లు బ్యాంకు నెట్‌వర్క్‌ను తమ అ«ధీనంలో పెట్టుకుని ఎంపికచేసిన నాలుగు ఖాతాల నుంచి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీనికి సహకరించిన వారికి 5–10 శాతం కమీషన్లు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న çప్రధాన హ్యాకర్లను కనిపెట్టడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నాణ్యతలేని సాఫ్ట్వేర్ అందించిన ఇంట్రాసాఫ్ట్ సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ నిర్వాహకులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చామన్నారు. -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
నైజీరియా: దక్షిణ నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఓటే టౌన్లో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని, వాహనాల అతివేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. -
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
మహేష్ బ్యాంక్ కేసు ప్రధాన నిందితుడు నైజీరియన్ అరెస్ట్.. తప్పించుకునేందుకు..
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ స్కామ్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 13 కోట్ల హ్యాకింగ్ కేసులోని ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి తప్పించుకునేందుకు నైజీరియన్ నిందితుడు విఫల ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్స్ సహా ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. మెయిన్ హ్యాకర్స్, క్యాష్ రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణలో పోలీసులకు నిందితులు ఏమాత్రం సహకరించడం లేదు. మహేష్ బ్యాంక్ కేసులో నిందితులు సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చదవండి: కారు, స్కూటీకి ఒకే నంబర్! ఇంతకీ కారు ఎవరిది? -
మహేష్ బ్యాంక్ కేసు.. సినీ ఫక్కీలో భారీ చేజ్.. 2 కి.మీ. వెంటాడి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు చెందిన చెస్ట్ ఖాతా నుంచి రూ.12.93 కోట్లు కాజేసిన కేసులో సూత్రధారులకు సహకరించిన నైజీరియన్ ఆచూకీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో కనిపెట్టారు. సోమవారం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రత్యేక బృందంపై దాడికి దిగాడు. అతికష్టమ్మీద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో సహా మొత్తం నలుగురిని పట్టుకున్న పోలీసులు సిటీకి తరలిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే అరెస్టయిన ఆరుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మహేష్ బ్యాంక్ సొమ్ము తొలుత 4 ఖాతాల్లోకి బదిలీ అయింది. ఆపై వాటి నుంచి ఢిల్లీ, బెంగళూర్, కేరళ సహా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న 128 ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కాజేశారు. సూత్రధారులతో పాటు ఈ ఖాతాదారులనూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూర్‌లో నైజీరియన్లు జములు, ఇమ్మానుయేల్‌తో పాటు మణిపూర్‌కు చెందిన యువతి షిమ్రాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీలో గాలించిన స్పెషల్ టీమ్ పూజాకపూర్, అనిల్‌మాలిక్, సుస్మితలను అరెస్టు చేసింది. రెండు కిలోమీటర్లు వెంటాడి... పట్టుబడిన వారి ప్రాథమిక విచారణ నేపథ్యంలో కొందరు దళారుల ద్వారా తమ బ్యాంకు ఖాతాల వివరాలను సూత్రధారులకు అందించామని బయటపెట్టారు. తమకు 10 నుంచి 15 శాతం చెల్లించేలా ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కేరళల్లో గాలింపు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎవ్వరూ చిక్కకపోయినా.. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం మాత్రం ముగ్గురు ఖాతాదారులతో పాటు దళారిగా వ్యవహరించిన ఓ నైజీరియన్‌ను గుర్తించింది. వారిని పట్టుకున్న పోలీసులు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. హఠాత్తుగా అతను పోలీసులపై ఎదురుతిరిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ అతడి ఫ్లాట్ నుంచి బయటకు పరుగుతీశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆ వీధుల్లో అతడి కోసం భారీ ఛేజింగ్ చేశారు. దాదాపు 2 కి.మీ. వెంటాడి అదుపులోకి తీసుకోగలిగారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన బృందాలు సైతం మరికొందరు ఖాతాదారులను పట్టుకున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్కీ సహా ఇతర సూత్రధారుల కోసం గాలింపు కొనసాగుతోంది. -
మాట్రి ‘మోసగాడు’ కేసులో ట్విస్ట్: నిందితురాలనుకుంటే బాధితురాలైంది!
సాక్షి హైదరాబాద్: సైబర్ నేరాలు చేసే నైజీరియన్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన యువతి నుంచి డబ్బు కాజేయడానికి బేగంపేట వాసుల వివరాలు ఇచ్చినట్లే... బోయిన్‌పల్లికి చెందిన యువతి నుంచి రూ.15 లక్షలు కాజేసేందుకు మైఖేల్ అనే నైజీరియన్ మాట్రి ‘మోసగాడు’ ఉత్తరప్రదేశ్ యువతిని వాడుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా ఆమ్స్టర్డ్యామ్లో నివసిస్తున్న డాక్టర్‌గా నగర యువతికి పరిచయమైన నైజీరియన్ మైఖేల్ గిబి ఛిడీ ఆమెకు మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటానని, ఆసుపత్రి నిర్మిస్తానంటూ ఆమెతో నమ్మబలికాడు. తన వస్తువులను పార్శిల్ చేస్తున్నానంటూ చెప్పి, కొరియర్ ఆఫీస్ నుంచి అన్నట్లు ఫోన్లు చేయించి వివిధ పన్నుల పేరుతో రూ.15,32,500 కాజేశాడు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ గంగాధర్ దర్యాప్తు చేశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మైఖేల్ వాడిన ఫోన్ నంబర్, ఓ బ్యాంకు ఖాతా ఉత్తరప్రదేశ్‌లోని మోబినగర్‌కు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓ నేరం కోసం వాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాలను మరోసారి వినియోగించరు. అప్పటికే అవి బ్లాక్, ఫ్రీజ్ కావడమో జరుగుందని లేదా తాము చిక్కే ప్రమాదం ఉందని ఈ జాగ్రత్త తీసుకుంటారు. బోయిన్పల్లి యువతిని మోసం చేయడానికి మైఖేల్ వాడినవి మోబినగర్లో పని చేస్తూ ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడికి పంపారు. ఘజియాబాద్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోబినగర్ చేరుకున్న ఈ బృందం దాదాపు మూడు రోజుల పాటు మాటు వేసింది. ఆ ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వినియోగిస్తున్నది నిందితుడే అని భావించి అతడి కోసం గాలించారు. ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు నైజీరియన్లు భారతీయులనే తమ అనుచరులుగా మార్చుకుని వారి బ్యాంకు ఖాతాలు వాడతారు. సహకరించినందుకు వీరికి కొంత కమీషన్ ఇస్తారు. మోబినగర్ యువతి వ్యవహారం కూడా ఇలాంటిదే అని భావించారు. ఆమెను విచారించిన నేపథ్యంలో అసలు విషయం తెలిసింది. సదరు యువతిని సైతం మైఖేల్ సోషల్‌మీడియా ద్వారా ట్రాప్ చేశాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు సంగ్రహించిన అతగాడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఢిల్లీలో ఉండే మైఖేల్ తరచు మోబినగర్‌కు వచ్చి ఆమెతో గడిపే వాడు. ఆ సమయంలోనే టార్గెట్ చేసిన వారికి ఆమె ఫోన్ వినియోగించి కాల్స్ చేసేవాడు. ట్రాప్ అయిన వారితో ఆమె ఖాతాలోనే డబ్బులు వేయించేవాడు. అనంతరం వాటిని డ్రా చేసుకుని ఉడాయించేవాడు. నగర యువతిని కూడా ఇలానే ట్రాప్ చేశాడు. ఈ విషయం చెప్పిన యూపీ యువతి మైఖేల్ ఆచూకీ చెప్పడంతో అధికారులు అతడిని పట్టుకోగలిగారు. -
వరుడొస్తాడనుకుంటే పోలీసులొచ్చారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న బేగంపేట ప్రాంతానికి చెందిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన వరుడు తనను వెతుక్కుంటూ వస్తాడని భావిస్తున్న తరుణంలో కర్ణాటక పోలీసులు వచ్చారు. అక్కడ నమోదైన ఓ సైబర్ నేరంలో తనతో పాటు తన స్నేహితుడూ పావుగా మారామని తెలుసుకుని అవాక్కైంది. ఉడిపి పోలీసుల ఆదేశాల ప్రకారం మంగళవారం బేగంపేట ఠాణాకు వచ్చిన ఆ ఇద్దరూ తమకు ఏ పాపం తెలియదంటూ నెత్తినోరు బాదుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ► నైజీరియాకు చెందిన ఓ నేరగాడు ఢిల్లీ కేంద్రంగా మాట్రిమోనియల్ నేరాలు చేస్తున్నాడు. ఇతడికి కొ న్నాళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్ యాప్ ద్వారా బేగంపేట ప్రాంతానికి చెందిన యువతి పరిచయమైంది. ► తాను విదేశంలో ఉంటున్న ప్రైవేట్ సంస్థ ఉన్నతోద్యోగిగా ఆమెను నమ్మించాడు. స్నేహంగా కొన్నాళ్లు చాటింగ్ చేసిన అతగాడు ఆపై ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. బేగంపేట యువతి సైతం అతడిని నమ్మింది. ► తాను త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి కలుస్తానంటూ యువతిని నమ్మించాడు. తన వద్ద కొంత మొత్తం ఉందని, దాన్ని తనతో తీసుకురావడానికి సాంకేతిక ఇబ్బందులు వస్తాయంటూ... అది డిపాజిట్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు కావాలన్నాడు. ► దీంతో ఆ యువతి బేగంపేట ప్రాంతానికే చెందిన తన స్నేహితుడి పేరుతో బ్యాంకులో ఖాతా తెరిచింది. దానికి అనుసంధానించడానికి అతడి పేరుతో ఓ సెల్‌ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది. ► బ్యాంకు ఖాతా వివరాలతో పాటు డెబిట్ కార్డు, చెక్‌బుక్, అనుసంధానించిన ఫోన్ నెంబర్‌కు సంబంధించిన సిమ్‌కార్డులను ఢిల్లీలో ఉండే తన స్నేహితుడికి పంపాలంటూ నగర యువతిని నైజీరియన్ సూచించాడు. దీంతో ఆమె వాటిని కొరియర్ చేసింది. ► ఇదే నేరగాడు కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన ఓ యువతినీ ట్రాప్ చేశాడు. తమ ప్రేమకు గుర్తుగా ఆమెకు కొన్ని బహుమతులు పంపుతున్నట్లు నమ్మించాడు. ఆపై ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారుల మాదిరిగా ఫోన్లు చేశాడు. ► ఖరీదైన గిఫ్ట్‌లు వచ్చినందుకు పన్నులు కట్టాలంటూ ఆమె నుంచి రూ.19 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును ఆమె ఢిల్లీకి చెందిన తొమ్మిది ఖాతాల్లోకి బదిలీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన మరో ఖాతాలోకి రూ.లక్ష బదిలీ చేయమనడంతో అనుమానించింది. ► తాను మోసపోయానని గుర్తించి ఉడిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నగదు బదిలీ చేసిన తొమ్మిది ఖాతాలు నకిలీ వివరాలతో తెరిచినట్లు గుర్తించారు. డబ్బు డిపాజిట్ చేయనప్పటికీ బాధితురాలి ఒత్తిడి మేరకు హైదరాబాద్ ఖాతా వివరాలు ఆరా తీశారు. ► దీంతో పాటు అనుసంధానించి ఉన్న సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా బేగంపేట యువకుడిని గుర్తించారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు బాధితురాలితో సహా వచ్చిన ఉడిపి పోలీసులు సహకారం కోరారు. ►ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ వీరికి సహకరించారు. బేగంపేటలో యువకుడిని అదుపులోకి తీసుకున్న ఉడిపి పోలీసులు స్థానిక ఠాణాకు తరలించారు. అతడిని విచారించిన నేపథ్యంలోనే తాను ఫలానా యువతి కోరడంతోనే తాను వాటిని ఇచ్చానని చెప్పాడు. ► అతడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిని సైతం ఉడిపి పోలీసులు విచారించారు. దీంతో ఆ మెను సైతం విచారించిన ఉడిపి పోలీసులకు అ సలు విషయం తెలిసింది. అయితే బాధిత యువ తి మాత్రం వీళ్లిద్దరూ నైజీరియన్తో సంబంధాలు కలిగి ఉన్నారని వాదించింది. దీన్ని తోసిపుచ్చిన పోలీసులు నగరవాసుల్ని విడిచిపెట్టారు. -
ఫేస్బుక్ ప్రేమ.. విలువైన బహుమతులు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. కేవైసీ అప్డెట్, ఓటీపీలు, విదేశాల నుంచి గిఫ్ట్స్, ప్రేమ, పెళ్లి పేరుతో హైదరాబాదీలను వలలో వేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సైబర్ నేరస్తుడిని సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన వ్యక్తి ఫేస్బుక్లో నకిలీ పేర్తో ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. తను యూకేలో డాక్టర్ అని నమ్మించాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నైజీరియన్.. యూకే నుంచి 40 వేల ఫౌండ్ల నగదు పార్శిల్ పంపిస్తున్నానని చెప్పాడు. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేయించి.. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్శిల్, ఐటీ, మనీలాండరింగ్ ఇతర చార్జీల పేరుతో కొంత డబ్బు కట్టాలని మాట్లాడాడు. ఇది నిజమేనని నమ్మిన యువతి విడతల వారీగా 38 లక్షల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. అయితే పార్శిల్ ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న నైజీరియన్ ఒనేకా సోలమన్ విజ్డమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 7 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంక్ పాస్ బుక్స్, ఒక డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్.. -
పాత టైర్లు కావవి.. ఆ దేశంలో అవిప్పుడు ‘బంగారమే’?
Nigerian Ifedolapo Runsewe Success story: దేశాలకు అతీతంగా అన్ని చోట్ల బంగారానికి విలువ ఉంది. మన దగ్గర పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటుంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రీసైకిలింగ్ కంపెనీని స్థాపించింది. రెండేళ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో ఈ కంపెనీ మొదలైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించేవారు. వాటిని తమ రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్మెంట్ బ్రిక్స్‌గా తయారు చేశారు. రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు. అంతే దీంతో ఒక్కసారిగా ఆమె కంపెనీకి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో బ్రిక్స్‌ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండేళ్లలోనే నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది. పేవ్మెంట్ బిక్స్తో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులు కూడా తయారు చేస్తోంది రాన్‌సేవే. ఈమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్కో టైరుకు 0.20 డాలర్లు (సుమారు రూ.15) చెల్లిస్తున్నారు. దీంతో కరోనా ఉపాధి కరువైన వారంతా పాత టైర్ల వేటలో పడ్డారు. ఎక్కడ టైరు కనిపించినా వాటిని పోగేసి ఈ ప్లాంటుకు తెస్తున్నారు. దీంతో రన్సువే సక్సెస్‌పై రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. పాత టైర్లు కావవి బ్లాక్‌గోల్డ్ అంటూ పేర్కొంది. In Nigeria, hundreds of thousands of tires which would otherwise be dumped across the country have emerged as a new ‘black gold.’ Entrepreneur Ifedolapo Runsewe is transforming old tires into paving bricks, tiles and other goods, creating an entire value chain around tires pic.twitter.com/raCRbFqTOV — Reuters Business (@ReutersBiz) November 15, 2021 -
కుప్పకూలిన 21 అంతస్తుల భవనం: 36కు చేరిన మృతుల సంఖ్య
లాగోస్: నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో నిర్మాణంలో ఉన్న 21 అంతస్తుల భవనం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం కూలిన భవనశిథిలాల నుంచి మరో 14 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 36కు చేరింది. ఘటనాస్థలంతో వరుసగా నాలుగో రోజు కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్ తాజాగా గురువారం వెలికితీసిన మృతదేహాలతో కలుపుకొని మొత్తం మృతుల సంఖ్య 36కి చేరింది. మృతిచెందిన వారిలో 33 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అక్కడ భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనాల్సిందే, ఎందుకంటే..
భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అనడం కామన్. కానీ, ఇక్కడ మాత్రం అన్నా, తమ్ముడు, స్నేహితుడు ఆఖరుకు నాన్న మాట్లాడినా కూడా వారితో పాటు సమానంగా అదే మాటను ఏ మహిళా అక్కడ పలకదు. ఆశ్చర్యపోకండి. అవును.. అక్కడి ప్రజల్లో ఏ జెండర్‌కు ఆ భాష నడుస్తోంది. అంటే అక్కడి మహిళలకు, పురుషులకు వేర్వేరు భాషలు ఉన్నాయి. ఉదాహరణకు దుస్తులను పురుషుడు ‘నికి’ అంటే, స్త్రీ ‘అరిగా’ అని.. చెట్టును ‘కిచి’ అంటే ‘ఓక్వెంగ్’ అనే భిన్న పదాలతో సంభాషిస్తారు. కేవలం వారి భాషలే కాదు, లిపులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తరతరాలుగా వారు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. మరి, ఆ ప్రాంత ప్రజలు జీవనం ఎలా సాగిస్తున్నారు?, అక్కడ ఓ స్త్రీ మరో స్త్రీతో తప్ప.. ఒక పురుషుడు మరో పురుషుడితో తప్ప స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? అని అనుకుంటే పొరపాటే.. ఇద్దరికీ రెండు భాషలు తెలుసు. కానీ, సంప్రదాయాన్ని గౌరవించి కేవలం వారు మాట్లాడే భాషల్లోనే మాట్లాడతారు. కేవలం వారి పిల్లలకు తప్ప మరో తెగతో కానీ, సమాజంతో గానీ వారి భాషలను నేర్పించడానికి ఇష్టపడరు. కారణం అక్కడి స్త్రీలు శుక్రగ్రహం నుంచి పురుషులు అంగారక గ్రహం నుంచి వచ్చారని, ఇది దైవ రహస్యం అని వారి నమ్మకం. విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ వారు ఎవరో చెప్పలేదు కదా. నైజీరియా అడవుల్లో నివసించే ఓ ఆటవిక తెగ ప్రజలు. -
క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై అనేక మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీపై అనేక దేశాలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా దేశ పౌరులు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. ఎల్ సాల్వాడార్, పరాగ్వే వంటి దేశాలు బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలను చట్టబద్దత కల్పిస్తామని పేర్కొన్నాయి. ఈ నిర్ణయంలో పలు క్రిప్టోకరెన్సీలు కొత్త రికార్డులను నమోదు చేస్తూ గణనీయంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఆరు వేలకుపైగా క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వీటిలో బిట్‌కాయిన్, ఈథిరియం, డాగ్‌కాయిన్ వంటివి ఎక్కువ ఆదరణను పొందాయి. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు... తాజాగా క్రిప్టోకరెన్సీలకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహంతో ముందుకువస్తున్నాయి. క్రిప్టోకరెన్సీకి బదులుగా సొంత డిజిటల్ కరెన్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. పశ్చిమ ఆఫ్రికాలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీను త్వరలోనే ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది క్రిప్టో దత్తతలో నైజీరియా ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్లను రూపొందించడానికి విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్ కరెన్సీపై పనిచేస్తోన్న దేశాల వరుసలో నైజీరియా, ఘనా కూడా చేరాయి. త్వరలోనే ట్రయల్స్...! పలు విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో నైజీరియా, ఘనా దేశాలు డిజిటల్ కరెన్సీ ఏర్పాటులో కీలక అడుగువేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో నైజీరియా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గి ఉంది. వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి ‘ఈనైరా’ అనే డిజిటల్ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ‘ఈసేడీ’ డిజిటల్ కరెన్సీలను ట్రయల్ చేయనున్నట్లు సమాచారం. పడిపోతున్న కరెన్సీ విలువ...! గత కొన్ని రోజుల నుంచి నైజీరియా క్రిప్టో కరెన్సీ వాడకంలో బూమ్ కన్పించినా... అక్కడి బ్యాంకులు క్రిప్టోపై బ్యాన్ విధించాయి. నైజీరియన్ పౌరులు ఎక్కువగా క్రిప్టోలో లావాదేవీలను జరుపడంతో నైజీరియన్ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో క్రిప్టోకరెన్సీలకు పోటీగా డిజిటల్ కరెన్సీలను తీసుకురావాలని నైజీరియా నిర్ణయించుకుంది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! -
ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్‌ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్‌కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. బూట్ల కింద దాచి స్మగ్లింగ్ బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్‌పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
అదో వెరైటీ విలేజ్.. పురుషులకో భాష, మహిళలకు మరో భాష
సాధారణంగా ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉంటుంది. అదే వాళ్ల మాతృ భాష కూడా అవుతుంది. ఆ ఊళ్లో మాత్రం రెండు భాషలు మాట్లాడుతారట. అది కూడా మహిళలకు ఓ భాష. పురుషులు మరో భాష. అదేం వింత, ఎక్కడా అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. సౌత్ నైజీరియాలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలు భాష విషయంలో పాటిస్తున్న ఆచారం ఇది. ఎందుకంటే వారు ఇలా వేర్వేరు భాషలు మాట్లాడటం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తారట. ఆ ఉరిలో.. వ్యవసాయం చేసుకునే ఉబాంగ్ అనే తెగ వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయితే.. వాళ్లు రెండు భాషలు మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఉదాహరణకు, ఒక స్త్రీ యమ్‌ను 'ఇరుయ్' అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను 'అరిగా' అని పురుషులు దీనిని 'ఎన్కి' అని పిలుస్తారు. ఇలా పురుషులకు, మహిళలకు వేర్వేరు భాషలు ఉన్నా వారి మధ్య భాషపరంగా ఏ సమస్యలు తలెత్త లేదని అక్కడి ప్రజలు చెప్తుతున్నారు. ఇలా వాళ్లకి భాషలు విభజించినప్పటికీ కొన్ని పదాలు మాత్రం కామన్‌గా ఉంటాయట. చిన్నపిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏ భాష మాట్లాడినా పట్టించుకోరు కానీ.. మగ పిల్లలు మాత్రం 10 ఏళ్లు దాటితే ఖచ్చితంగా పురుషుల భాషనే మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరూ ఒత్తిడి చేయకపోయినా మహిళల భాషను పురుషులు మాట్లాడితే మాత్రం వింతగా చూస్తారట. అందుకే అక్కడి నియమాలు తెలిసిన వాళ్లు ఎవ్వరూ తమ భాష కాకుండా వేరే మాట్లాడరు. చదవండి: Siddharth: హీరో సిద్ధార్థ్ మృతి అంటూ సంతాపం, స్పందించిన హీరో -
మహిళా న్యాయవాదికి నైజీరియన్ కిలేడి ఊహించని షాక్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళా న్యాయవాదికి నైజీరియన్ కిలేడీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల ఓ కేసును వాదించాలని నైజీరియన్ మహిళ న్యాయవాదిని సంప్రదించింది. అనంతరం న్యాయవాదిని ట్రాప్ చేసి రూ.9.26 లక్షలు కాజేసి పరారయ్యింది. దీంతో మోసపోయానని గుర్తించిన న్యాయవాది సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
విదేశాల్లో ఉద్యోగం.. బహుమతులు.. చివరికి!
సాక్షి. నాగోలు: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డబ్బులు కాజేస్తున్న నైజీరియన్‌ను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన డెనియల్ ఒబియానో(30) స్టడెంట్ వీసాపై 2011లో భారత్‌కు వచ్చాడు. ముంబైలో డిగ్రీ, ఎంస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. తరువాత 2018లో బెంగుళూరుకు వెళ్లి తన స్నేహితులను కలుసుకున్నాడు. తన స్నేహితుల ద్వారా ఆన్లైన్, సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. తన స్నేహితులైన బాంకె, ఓకా ఓయిస్, అబుజాబ్రోతో కలసి నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచారు. దీంతో విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల నుంచి బహుమతుల వచ్చాయంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి బహుమతులు వచ్చాయంటూ కస్టమ్ అధికారులుగా మాట్లాడి కొంత డబ్బు చెల్లించాలని చెప్పి తమ ఖాతాలకు నగదు బదిలీ చేయించుకునేవారు. కుషాయిగూడకు చెందిన వ్యక్తికి కెనడాలోని పెప్సికో కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్, ఆఫర్ లెటర్, వీసా ఫీజు, ఇతర ఖర్చులకు బధితుడి నుంచి ర.51.32లక్షల నగదు బదిలీ చేయించుకున్నారు. తరువాత ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో వెసపోయినట్లు గుర్తించి బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డెనియల్ ఒబియానోను అరెస్టు చేసి రివండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, రెండు సెల్ఫోన్లు, వివిధ బ్యాంకుల ఖాతాలలో ఉన్న రూ.7.12 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. -
మాట్రిమోనియల్ మోసగాడు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్కే కుచ్చుటోపి..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.10 లక్షల కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన ఈ నైజీరియన్‌ను మంగళవారం సిటీకి తీసుకువచ్చారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నైజీరియాకు చెందిన ఓషర్ ఎబుక విక్టర్ కొన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. సైబర్ నేరాలు చేయడం మొదలెట్టిన ఇతగాడు మాట్రిమోనియల్ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకున్న యువతుల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఓ యువతి ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈమె ఇటీవల తన ప్రొఫైల్‌ను తెలుగు మాట్రిమోని సైట్లో అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన విక్టర్ మేహుల్ కుమార్ పేరుతో ఆమెను సంప్రదించాడు. అమెరికాలో ఫార్మాసిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్న గుజరాత్ వాసినంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలను తనవే అంటూ పంపించాడు. కొన్నాళ్ల చాటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు కాజేశాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి విక్టర్ నిందితుడిగా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తరలించింది. నిందితుడు విక్టర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మంగళవారం ఉస్మానియా ఆస్పపత్రికి తరలించగా.. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అతగాడిని తిరిగి సైబర్ క్రైమ్ ఠాణాకు తీసుకువచ్చారు. విక్టర్‌ను అరెస్టు చేసిన, సిటీకి తరలించిన, విచారించిన బృందంలోని సైబర్ క్రైమ్ అధికారులు క్వారంటైన్‌కు వెళ్లారు. మంగళవారం సాయంత్రం విక్టర్‌ను గాంధీ ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డుకు తరలించారు. అప్పటి వరకు సైబర్ క్రైమ్ ఠాణా రిసెప్షన్ ఏరియాలోనే ఉన్న ఇతగాడు అటు పోలీసులు... ఇటు మీడియాకు చుక్కలు చూపించాడు. ముట్టుకుంటానంటూ మీడియా ప్రతినిధులను పరుగులు పెట్టించాడు. -
ఐదు కొమ్ముల వింత గొర్రె.. యుగాంతానికి సంకేతమంటున్న నెటిజన్లు
లాగోస్: సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, నైజీరియాలోని ఓ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. వివరాల్లోకి వెళితే.. జులై 21న బక్రీద్ పర్వదినం సందర్భంగా నైజీరియాలోని లాగోస్ మార్కెట్లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకర్షింది. ఆ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. నెత్తి మీద కిరీటం పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. Watch a rare ram with five horns in Lagos, Nigeria pic.twitter.com/6WmkrqeEq4 — Reuters (@Reuters) July 21, 2021 దీంతో చుట్టుపక్కల ప్రజలు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు ఆ గొర్రెను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు భలే ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ ఐదు కొమ్ముల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఆమె వైద్యురాలు, అతడు నైజీరియన్: రూ.41 లక్షలు ఇచ్చేసింది
సాక్షి, హిమాయత్‌నగర్: హెర్బల్ మందుల వ్యాపారం పేరుతో మెహదీపట్నంకు చెందిన ఓ వైద్యురాలిని నట్టేట ముంచిన నిందితుడిని సిటీ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న పలు బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాదీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. నైజీరియాకు చెందిన మెస్సీ డాన్ హో మూడళ్ల క్రితం విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో ఢిల్లీలో అనధికారికంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మెహదీపట్నంకు చెందిన హెర్బల్ వైద్యురాలితో ఫేస్బుక్ ద్వారా ఇటలీ వాసినంటూ పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ల పరిచయంలో ఇటీవల హెర్బల్ ఫార్మూలా, మెడిసిన్స్ పంపిస్తే తమ దేశంలో వ్యాపారం చేసుకుంటానని, ఇందుకు రూ.5 కోట్లు చెల్లిస్తానడంతో వైద్యురాలు నమ్మింది. తనపై నమ్మకం వచ్చేలా ఓ ఎకౌంట్‌కు చెందిన డెబిట్ కార్డును పంపగా..రూ.4వేలు డ్రా చేసిన వైద్యురాలికి ఢిల్లీ కస్టమ్స్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీకు వచ్చిన రూ.5కోట్లు తీసుకోవాలంటూ మెస్సీ డాన్ హో నమ్మించారు. ఇందుకు గాను పలు దఫాలుగా రూ.20లక్షలు బదిలీ చేశారు .ఆ తర్వాత తనతో వచ్చిన కుమార్తె కూడా చనిపోయిందనే నాటకం ఆడటంతో మరో రూ.21లక్షలు బదిలీ చేశారు. డాక్టర్ ఇంకా పంపుతూనే ఉండటంతో..ఆమె కుమార్తెకు అనుమానం వచ్చి జూన్ 29న సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరియన్ది అంతా డ్రామా, ఇతను ఇటలీ వాసి కాదని, ఇప్పటికే పలువురిని మెసం చేశాడనే విషయాలను రాబట్టి ఢిల్లీలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్ఫోన్లు, 37 డెబిట్, క్రెడిట్ కార్డులు, 13 బ్యాంకు పాస్‌బుక్స్, 12 బ్యాంక్ చెక్కులు, పలు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నగరవాసిపై సైబర్‌నేరస్తుల వల హిమాయత్‌నగర్: లాభాల ఆశ చూపించి 19 మంది నుంచి రూ.12.30 లక్షలు స్వాహా చేశాడో సైబర్ నేరస్తుడు. సికింద్రాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, వారి బంధువులు 13 కలిసి యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయతి్నంచారు. వీరికి ఓ వ్యక్తి పరిచయమై తొలుత రూ.10వేలు కట్టాలన్నాడు. అవినాష్ రూ.10వేలు కట్టగా లాభం రూ.1లక్ష వచ్చింది. దీంతో అందరూ కట్టారు. ఇలా 12.30 లక్షలు చెల్లించారు. లాభం రాకపోవడంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూగుల్‌లో విమాన టికెట్ల కోసం వెతికిన బోయినపల్లి వాసి మౌనికకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రయాణ ఆఫర్లు ఉన్నాయని నమ్మించి రూ.1.08 లక్షలు స్వాహా చేశాడు.ఇంజనీరింగ్ పూర్తిచేసిన సనత్‌నగర్ వాసి అనురాధ తన రెజ్యూమ్‌ను క్విక్కర్ డాట్‌కామ్‌లో పోస్ట్ చేసింది. కన్సల్టెన్సీ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. వివిధ ఫీజుల పేర్లతో రూ.96వేల 500కాజేశాడు. -
బందిపోట్ల అరాచకం.. 35 మంది గ్రామస్తుల బలి
జంఫారా : వాయువ్య నైజీరియాలో బందిపోట్లు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 35 మంది గ్రామస్తులను కాల్చి చంపారు. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గురువారం బైకులపై ఆయుధాలతో వచ్చిన బందిపోట్లు అటవీ ప్రాంత గ్రామాలైన గిడన్, ఆదాము, సౌని, గిడన్ బౌసి, గిడన్ మైదావాలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొన్ని ఇళ్లను తగులబెట్టారు. భద్రతాదళాలు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దాడిలో 35 మంది గ్రామస్తులు చనిపోయారని పోలీసులు చెబుతుండగా.. 43 మంది మృతదేహాలను గుర్తించామని, మరికొంతమంది గాయపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా, నైజీరియాలో బందిపోట్ల అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. తరుచుగా ఊళ్లపై పడి ప్రజలను బలితీసుకుంటున్నారు. గత గురువారం సౌవా గ్రామంపై దాడి చేసి 18మందిని చంపారు. గత నెలలో జంఫారా, జుర్మీ జిల్లాలోని ఓ ఆరు గ్రామాలపై దాడి చేసిన బందిపోట్లు దాదాపు 53 మందిని చంపేశారు. -
ట్విట్టర్ బ్యాన్: అసలు కారణం ఇదేనా?
అబూజా: ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ అధ్యక్షుడు బుహారీ ట్వీట్‌ను తొలగించిన కారణంగానే ట్విట్టర్ కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే నైజీరియా నిర్ణయంపై సొంత ప్రజలు అంసతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. అయితే ఇది అసలు కారణం కాదనే వాదన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి ట్విట్టర్‌పై నైజీరియా సర్కార్ గుర్రుగా ఉంది అధ్యక్షుడి ట్వీట్ డిలీట్ వ్యవహారంతో మాత్రమే కాదని ఆ వాదన సారాంశం. గత కొన్నేళ్లుగా నైజీరియాలోని లాగోస్ ఆఫ్రికాలోనే అత్యంత ఆకర్షణనీయమైన టెక్ హబ్‌గా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏప్రిల్‌లో ట్విట్టర్ ఆఫ్రికాలో తన రీజినల్ హెడ్‌క్వార్టర్ కోసం లాగోస్ కాకుండా.. ఘనాను ఎంచుకుంది. దీనిపై నైజీరియా వివరణ కోరగా.. ఘనా ప్రభుత్వం బయటి పెట్టుబడులను ఆకర్షించడంలో ముందుందని ట్విట్టర్ కారణం చెప్పింది. నిజానికి ట్విట్టర్ వివరణను సమర్థించడానికి బోలెడు కారణాలున్నాయి. అయినప్పటికీ నైజీరియా ఆ విషయంలో దారుణంగా హర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ డిలీట్ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. దెబ్బ నైజీరియాకే! ఇక ట్విట్టర్ బ్యాన్ వివాదంతో నైజీరియా టెక్ రంగం సంక్షోభంలో పడే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల శాతం 60కి పైనే ఉంది. మరోవైపు టెక్ పెట్టుబడులతో లాగోస్ ఆర్థికాభివృద్ధికి బీజం వేసింది. ఆఫ్రికాకే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించింది. ఇలాంటి తరుణంలో నైజీరియా ట్విట్టర్ బ్యాన్ నిర్ణయంతో.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016లో నైజీరియా టూర్లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ఆఫీస్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు. 2021 ద్వితియార్థంలో అది జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్బుక్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల తర్వాత నైజీరియా ప్రతినిధులు ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్‌కు సందేశం పంపగా.. అక్కడి నుంచి బదులు లేకపోవడంతో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. ఇక ఇదే బాటలో మరికొన్ని టెక్ సంస్థలు లాగోస్ నుంచి వెనక్కి వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నైజీరియా దూకుడు నిర్ణయం వల్ల 170 మిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయే ప్రమాదం నెలకొన్నట్లు వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Twitter ban: అధ్యక్షుడి ట్వీట్ తొలగింపు, నిరవధిక నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు మరో దేశంలో భారీ షాక్ తగిలింది. దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే చర్యలకు ట్విటర్‌ను వినియోగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్హాజి లాయ్ మొహ్మద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ట్విటర్ ఖాతా సస్పెన్షన్ జరిగిన రెండు రోజుల తరువాత శుక్రవారం (స్థానిక సమయం) తాజా పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి పోస్ట్ చేసిన ట్వీట్‌ను అభ్యంతరకరమైన పోస్ట్‌గా పేర్కొన్న ట్విటర్ ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆయన ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. అయితే దీనిపై బుహారీ మద్దతు దారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రతి స్పందనగానే దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధింగా బ్యాన్ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికలను నియంత్రించేలా కొత్త లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాగా చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు ట్విటర్‌ను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్ తొలగింపు -
ప్లాస్టిక్ వస్త్రాలు.. ఈ వనితల వినూత్న ఆలోచన
నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రపంచ పర్యావరణవేత్తల ఆందోళనను ఆలకించిన నైజీరియా టీనేజర్లు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నడుం బిగించారు. ఒకసారి వాడి పడేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యాషన్ బుల్ డ్రెసులు, బ్యాగులు రూపొందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నైజీరియాకు చెందిన 15 ఏళ్ల ఎసోహి ఒజిగ్బో ‘ట్రాషన్ షో’ ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవచ్చో చెబుతోంది. వినూత్న అవగాహన కార్యక్రమం నైజీరియాలోని లాగోస్ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పూనుకున్నారు. డస్ట్‌బిన్, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలను జాగ్రత్తలు పాటిస్తూ సేకరించి, ఉపయోగపడే వస్తువులు, ఫ్యాషనబుల్ దుస్తులను తయారు చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల డ్రస్‌లను ‘గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్ షో’ పేరిట ప్రదర్శించారు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫ్యాషన్ షోలో ఫ్యాషన్ డ్రస్సులేగాక ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్‌లు, డస్ట్బిన్ల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్ మాల్స్ వద్ద విక్రయిస్తున్నారు. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు ఒజిగ్బో మాట్లాడుతూ.. ‘‘ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ.. మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాం. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సేకరించి .. శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాబ్రిక్ తో కలిపి కుట్టి మోడల్ వస్త్రాలు, బ్యాగులు రూపొందిస్తున్నాం. మేము రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్ షో మంచి వేదిక అయింది. మేమంతా టీనేజర్లం.. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి మాలో ఉంది. అందుకే స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్నాము’’ అని చెప్పింది. గ్రీన్ ఫింగర్స్ వైల్డ్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవప్థాపకులు నినేడు మొగాంబో మాట్లాడుతూ..‘‘ఒజిగ్బో బందం తయారు చేసిన దుస్తులను షాపింగ్ మాల్స్‌లో స్టేజ్ షోలను ఏర్పాటు చేసి ప్రమోట్ చేయడమేగాక, ట్రాషన్ షో నిర్వహించి ప్లాస్టిక్ ఫాషన్కు జీవం పోశాం. ఒజిగ్బో బృందంలో అంతా టీనేజర్లే అయినప్పటికీ పర్యావరణంపై వారికున్న అవగాహన, భవిష్యత్తు తరాలకోసం ఆరాటపడడం విశేషం’’ అని మొగాంబో అభినందించారు. ( చదవండి: అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా! ) -
యూకే నుంచి బహుమతి అంటూ... రూ.18 లక్షలు స్వాహా
సాక్షి, నాగోలు: యూకే నుంచి బహుమతి పార్శిల్ వచ్చిందని, దానిని మీకు ఇవ్వాలంటే ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చార్జీలు చెల్లించాలని నమ్మించి రూ.18 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వుని ఒపెరా మెడికల్ వీసాపై భారత్ వచ్చి కర్టాటకకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ద నగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేసే వ్యక్తితో నైజీరియా జాతీయుడి పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్ మోసాలకు అలవాటు పడ్డారు హెన్రీ ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చేవాడు. అక్కడే ఉండే మరోక నైజీరియా చెందిన చీమా ఫ్రాంక్ను ఇతర స్నేహితులకు పరిచయం చేశాడు. అందరూ కలసి ఆన్లైన్ బహుమతి మోసాలు, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్ మోసాలు చేయడం ప్రారంభించారు. బహుమతులు పంపే నెపంతో నగరంలోని ఓ వ్యక్తికి హెన్రీ చుక్వుని ఒపెరా మెసేజ్ పెట్టాడు. యూకే నుంచి కరెన్సీలో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చింది.. ఢిల్లీ విమానాశ్రమంలో ఉంది. దానిని మీకు పంపించాలంటే కస్టమ్ అధికారులకు ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని స్థానికంగా ఉండే నోయిడాకు చెందిన ఆటో డ్రైవర్ సూరజ్ బ్యాంకు ఖాతాల్లో రూ. 18 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆటో డ్రైవర్‌కు రూ. 55 వేలు నగదు అందజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో హెన్రీ చుక్వుని ఒపెరా, ఆటో డ్రైవర్ సూరజ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
మగువా నీకు సలామ్.. 8నెలల గర్భంతో గోల్డ్ మెడల్
అబూజా: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో, నైజీరియాకు చెందిన అమినాత్ ఇద్రీస్ అనే 26 ఏళ్ల అథ్లెట్ ఎనిమిది నెలల గర్భంతో ఉండి కూడా తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. నైజీరియాలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పోటీల్లో భాగంగా తైక్వాండో మిక్స్డ్ పూమ్సే కేటగిరీలో ఆమె ఈ పతాకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దీంతో పాటు ఆమె ఇతర కేటగిరీల్లో సైతం పలు పతాకలు సాధించి ఔరా అనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భం దాల్చడానికి ముందు నుంచే తాను శిక్షణ తీసుకుంటున్నాని, అందువల్లే గర్భంతో ఉండి కూడా పోటీల్లో పాల్గొనడం సమస్యగా అనిపించలేదని పేర్కొంది. ఇద్రీస్ సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సంస్థ ట్విట్టర్లో షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల గర్భిణి బంగారు పతకం సాధించి, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మగువా నీకు సలామ్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
కిడ్నాపర్ల చెర నుంచి 42 మంది విడుదల
లాగోస్: రెండు వారాలక్రితం ఉత్తర నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి కిడ్నాప్‌కి గురైన 27 మంది విద్యార్థులు సహా, మొత్తం 42 మందిని, బందిపోట్లు విడుదల చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. కిడ్నాపర్ల చెరలోనుంచి విడుదలైన వారు దేశ రాజధాని మిన్నాకి చేరుకున్నారని నైజర్ గవర్నర్, చీఫ్ ప్రెస్ సెక్రటరీ మేరీ నియోల్ బెర్జ్ వెల్లడించారు. ప్రభుత్వ సైన్స్ కాలేజ్ కగారా నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులను సాయుధులైన దుండగులు రెండు వారాల క్రితం అపహరించారు. నార్తరన్ నైజీరియాలోని జాంఫరా రాష్ట్రంలోని బోర్డింగ్ స్కూల్నుంచి 317 మంది బాలికలను అపహరించిన ఒక రోజు తర్వాత ముష్కరులు వీరిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని పోలీసులు తెలిపారు. జాంఫరా రాష్ట్రంలో అనేక బందిపోటు ముఠాలు పనిచేస్తున్నాయి. డబ్బు కోసం, లేదా వారి సభ్యులను జైలు నుంచి విడుదల చేయించుకునేందుకు వారు ఈ దారుణాలకు పాల్పడుతుంటారని ప్రభుత్వం తెలిపింది. లొంగిపోయేది లేదు: బుహారీ నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్ బుహారీ మాట్లాడుతూ కిడ్నాప్‌కి గురైన పాఠశాల పిల్లలను సురక్షితంగా, సజీవంగా విడిపించుకోవడం ప్రభుత్వ ప్రథాన లక్ష్యమని అన్నారు. అయితే అంతమాత్రాన అమాయక పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొన్న బందిపోట్ల బ్లాక్ మెయిలింగ్‌లకు లొంగిపోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటే తాము శక్తివంతులమని బందిపోట్లు, కిడ్నాపర్లు, ఉగ్రవాదులు భ్రమలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. నైజీరియాలో అనేక యేళ్ళుగా ఇటువంటి కిడ్నాప్‌లు, దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 2014లో బోరో రాష్ట్రంలోని చిబోక్ మాధ్యమిక పాఠశాల నుంచి 276 మంది బాలికలను జిహాదిస్ట్ గ్రూపు కిడ్నాప్ చేసింది. ఇప్పటికీ వారిలోని 100 మంది బాలికల ఆచూకీ తెలియరాలేదు. -
వాణిజ్య వారధి.. బైడెన్ మెచ్చిన లీడర్
ప్రపంచ వాణిజ్య సంస్థకు ఎవరు డైరెక్టర్ జనరల్ కాబోతున్నారు? పోటీలో ఉన్న ఇద్దరూ మహిళలే. పోటీ ఉన్నదీ ఆ ఇద్దరి మధ్యనే. నైజీరియా మాజీ ఆర్థిక మంత్రి ఒకాంజో అవేలా ఒకరు. దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూ మింగ్హ్యీ ఇంకొకరు. ఒకాంజో బైడెన్ చెప్పిన పేరు. మింగ్హ్యీ ట్రంప్ చెప్పిన పేరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరికి డబ్లు్య.టి.ఓ. డైరెక్టర్ జనరల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో! వచ్చే నాలుగేళ్లలో ప్రపంచ దేశాల వాణిజ్య ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాలను ఎవరు రూపొందించబోతున్నారో?! బైడెన్‌తో పాటు డబ్లు్య.టి.వో.లో సభ్యత్వం ఉన్న మొత్తం 164 దేశాలు మొగ్గు చూపుతున్నది ఒకాంజో వైపే. ట్రంప్ దాదాపుగా ప్రతి ప్రపంచ సంస్థతో, ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక పంచాయితీ పెట్టుకుని వెళ్లినవారే. ట్రంప్ ఎంపిక చేసిన వ్యక్తుల సామర్థ్యాలు ఎంత శిఖరాగ్ర స్థాయిలో ఉన్నా, ట్రంప్ ఎంపిక చేశారు కాబట్టి బైడెన్ పాలనలో ఆ వ్యక్తులకు ప్రాముఖ్యం లేకపోవడమో, లేక ప్రాధాన్యం తగ్గిపోవడమో సహజమే. ఏమైనా ఒకాంజో డబ్లు్య.డి.వో. కొత్త డైరెక్టర్ జనరల్ కానున్నారన్నది స్పష్టం అయింది. మార్చి 1–2 తేదీల్లో సర్వసభ్య సమాజం ఉంది కనుక ఆ లోపే ఒకాంజో కొత్త సీట్లో కూర్చోవాలి. 66 ఏళ్ల ఒకాంజో ప్రస్తుతం ట్విట్టర్, స్టాండర్డ్–చార్టర్డ్ బ్యాంక్, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్, ఆఫ్రికన్ రిస్కీ కెపాసిటీ సంస్థల డైరెక్టర్ల బోర్డులలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎంపిక ఖరారు అయితే కనుక ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అవుతారు. ఆ సంస్థకు ఇప్పుడు అమెరికా అవసరం ఉంది కనుక, అమెరికా ఆమెను నామినేట్ చేసింది కనుక మరొకరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశమే లేదు. అలాగని ఒకాంజో అవేనా ఎవరో వేసిన సోపానం పైకి ఎక్కడం లేదు. ఆమె ప్రతిభ ఆమెకు ఉంది. ఆమె అనుభవం ఆమెకు ఉంది. అవన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థకు పూర్తి స్థాయి లో అవసరమైనవీ, అక్కరకు వచ్చేవే. ∙∙ ఇటీవలే 2019లో అమెరికన్ పౌరసత్వం తీసుకున్న ఒకాంజో వరల్డ్ బ్యాంకులో 25 ఏళ్లు పని చేశారు. అందులోనే మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగారు. ఇక తన స్వదేశం నైజీరియాకు రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఆమె డైరెక్టర్ జనరల్ కాబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు రావడంతోనే.. ‘‘ఆర్థికవేత్తగా అమె నాలెడ్జ్ సాటి లేనిది’’ అని యు.ఎస్.టి.ఆర్. (యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్) సంస్థ కొనియాడింది. ‘‘అమెరికా ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు’’ అని ఒకాంజో కూడా స్పందించారు. ఆమె చదివిందంతా ఎకనమిక్సే. అందులోనే డిగ్రీలు, అందులోనే డాక్టరేట్ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఒకాంజో భర్త న్యూరో సర్జన్. నలుగురు పిల్లలు. వారిలో ఒకరు కూతురు. వాళ్లవీ పెద్ద చదువులే. కుటుంబ అనుబంధాలకు, మానవ సంబంధాలకు, దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలకు క్రమశిక్షణ గల ‘ఎకానమీ’ ఇరుసు వంటిది అని అంటారామె. ఒకాంజో. -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు. ⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
ఆఫ్రికన్ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్
అచ్చం మన బ్రహ్మిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కడుపుబ్బా నవ్వించే ఆఫ్రికన్ యాక్టర్ ‘ఒసితా ఇహెమ్’. సందర్భానికి తగ్గట్టు ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా ఒసితా దగ్గర దొరుకుతుంది. కొందరు తమలో ఉన్న క్రియేటివిటీని మీమ్స్ ద్వారా వ్యక్తపరుస్తుంటారు. అలాంటి మీమ్స్‌లో చిన్నపిల్లాడి క్యారెక్టర్లో కనిపిస్తూ నవ్వులు పూయిస్తుంటారు ఒసితా. ట్విట్టర్,ఫేస్బుక్ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఎక్కడ చూసినా ఒసితా ఫొటోలు, జీఐఎఫ్, మీమ్స్ కనిపిస్తాయి. 1982 ఫిబ్రవరి 20న నైజీరియాలోని ఇమొ రాష్ట్రంలో ఒసితా ఇహెమ్ జన్మించారు. జన్యులోపం కారణంగా 38 ఏళ్ల ఒసితా చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. తన మరుగుజ్జు ఆకారాన్ని చూసి ఒసితా ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. తనకెంతో ఇష్టమైన సినీ రంగంలో మంచి కమెడియన్‌గా రాణిస్తున్నాడు. 2002లో నాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒసితా 2003లో ‘అకీ నా ఉక్వా’ అనే నైజీరియన్ సినిమాలో పావ్పావ్ అనే బాలుడి పాత్ర లో తన నటనతో జీవించేశాడు. ఈ క్యారెక్టర్ నైజీరియన్లతోపాటు ప్రపంచ దేశాలను మెప్పించింది. అప్పటినుంచి ఒసితాపేరు ‘పావ్పావ్’అని ప్రముఖంగా వినిపించేది. వందకుపైగా సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. 2007లో ఒసితా నటనను గుర్తించిన ఆఫ్రికన్ మూవీ అకాడమీ ‘లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు’తో సత్కరించింది. కమెడియన్‌గా, నిర్మాతగా, అన్ని విభాగాల్లో రాణిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒసితా. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ.. యువతను ప్రోత్సహిస్తున్నాడు. ఆఫ్రికా, నైజీరియన్ యువత లో స్ఫూర్తి నింపేందుకు ‘ఆఫ్రికా ఇన్స్పైర్డ్ మూమెంట్’’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తూ సేవలందిస్తున్న ఒసితా కృషికి గుర్తింపుగా నైజీరియా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్’ వరించింది ఆయన్ని. -
కోరలు చాస్తున్న కొత్త రకం
లండన్/నైరోబీ/బీజింగ్: యునైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త రకం(వేరియంట్) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్ (పీ681హెచ్) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో పుట్టి, యూకేలోకి ప్రవేశించిందన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను యూకే రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండడంతో దాదాపు 40 దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ జాబితాలో తాజాగా చైనా, బ్రెజిల్ కూడా చేరాయి. ఎప్పటి నుంచి విమానాలు రద్దు చేస్తారన్న సమాచారాన్ని చైనా బయటపెట్టలేదు. నాన్–చైనీస్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారు యూకే నుంచి తమ దేశంలోకి రాకుండా చైనా నవంబర్ నుంచే నిషేధం అమలు చేస్తోంది. కొత్త రకమైనా టీకాలు పనిచేస్తాయి కరోనా వైరస్‌లో ఎన్ని మార్పులు జరిగినా.. టb వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నట్లు మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని వెల్లడింరాయి. కొత్త వేరియంట్ భయానకం యూకేను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్‌తో మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్’కు చెందిన సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త రకం వల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య, మరణాల రేటు వచ్చే ఏడాది భారీగా పెరుగుతుందని తెలియజేసింది. ఈ వేరియంట్ 56 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. దీనిని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. వారానికి కనీసం 20 లక్షల మందికి టీకా అందజేయాలని కోరింది. -
70 ఏళ్లుగా మంచు దిబ్బల్లో ఒంటరి జీవితం
అగాఫ్యా లైకోవా. ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్న 76 ఏళ్ల ఒంటరి స్త్రీ.మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ వద్ద సైబీరియా మంచు దిబ్బల్లో నాగరిక ప్రపంచానికి దాదాపు 160 మైళ్ల దూరాన గత 70 ఏళ్లుగా జీవిస్తోంది.‘ఓల్డ్ బిలీవర్స్’ గా భావించే క్రిస్టియన్ చాందస సమూహానికి చెందిన అగాఫ్యా కుటుంబం సోవియెట్ రష్యా ఆవిర్భావ సమయంలో తమ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న భయంతో సైబీరియాలోకి పారిపోయి అక్కడే జీవించసాగింది.అగాఫ్యా అక్కడే పుట్టింది. ఇప్పటికీ అక్కడే నివసిస్తోంది. రష్యా సంపన్నుడు ఒగెల్ దెరిపాస్కా ఆమెకు అక్కడ కొత్త ఇల్లు కట్టి ఇస్తుండటంతో తిరిగి వార్తల్లోకి వచ్చింది. సైబీరియా మంచు ఎడారిలో, ఏ జనావాసం నుంచైనా సరే దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తున, విస్తారమైన మంచు అడవుల మధ్య, మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే చోట ఇప్పుడు ఒకే ఒక ఇల్లు కట్టబడుతోంది. దానిని కడుతున్నది రష్యాలో అల్యూమినియం కింగ్‌గా ఖ్యాతి గాంచిన ఒలెగ్ దెరిపాస్కా. కట్టి ఇస్తున్నది 76 ఏళ్ల వృద్ధురాలు అగాఫ్యా లైకోవాకు.ఎందుకంటే ఆమె అక్కడ ఒంటరిగా... అవును ఒంటరిగా 30 ఏళ్లుగా జీవిస్తున్నది. జీర్ణావస్థలో ఉన్న తన ఇంటిని వదిలి రానంటున్నది. ఆమె కోసమే ఆ ఇల్లు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచమంతా తిరుగాడుతోంది. ఎవరీ అగాఫ్యా? అగాఫ్యాను తెలుసుకోవాలంటే ముందు మతం గురించి తెలుసుకోవాలి. మతం మీద అచంచల విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారో తెలుసుకోవాలి. రష్యాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి సోవియెట్ యూనియన్ ఏర్పడ్డాక కొన్నాళ్లకు అక్కడి మత స్వేచ్ఛకు విఘాతం తలెత్తే పరిస్థితులు వచ్చాయి. రష్యాలో ఉంటున్న ‘పాత విశ్వాసులు’ అనే క్రైస్తవ చాందస వర్గంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు (వీరు పవిత్రంగా భావించే క్రాస్‌లో మూడు అడ్డగీతలు ఉంటాయి.) ఆ సమయంలో అంటే 1936లో నలుగురు సభ్యులున్న‘లైకోవ్ కుటుంబం’ అనే పాత విశ్వాసులు తమ మతాన్ని కాపాడుకోవడానికి సైబీరియా మంచు అడవుల్లోకి పారిపోయారు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్న ఆ కుటుంబం వాయవ్య సైబీరియాలో యారినత్ నదికి సమీపంలో జీవించడం మొదలెట్టారు. ఆ భార్య, భర్త అక్కడకు వెళ్లాక వారికి మరో ఇద్దరు పిల్లలపు పుట్టారు. ఆ ఇద్దరిలో ఒకరు అగాఫ్యా. ఆకలి జీవితం సైబీరియా మంచు అడవి భయంకరమైనది. అది ఏ మాత్రం నివాస యోగ్యం కాదు. రష్యా ప్రభుత్వం తమ మీద తిరగబడే వారిని సైబీరియా జైలుకు పంపి తద్వారా వారికై వారు చచ్చేలా చేసేది. అలాంటి సైబీరియాలో అగాఫ్యా తల్లి, తండ్రి, ముగ్గురు తోబుట్టువులు జీవించడం మొదలుపెట్టారు. కేవలం తమ మతాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఉండిపోయారు. వారు అక్కడ ఉన్నట్టుగా కాని, ఉంటున్నట్టుగా కాని ఎవరికీ తెలియదు. సమాచార వ్యవస్థ లేని ఆ రోజుల్లో వారు జీవించిన రోజులన్నీ చీకటి రోజులే. ముందు వారిలో తల్లి మరణించింది. ఆమె తన ఆహారాన్ని త్యాగం చేసి పస్తులు ఉండటం వల్ల చనిపోయింది. ఆ తర్వాత మిగిలిన తోబుట్టువులు ఒక్కొక్కరు రకరకాల ఆరోగ్య సమస్యలతో మరణించారు. 1988లో ఆఖరి తోడుగా ఉన్న తండ్రి కూడా మరణించాడు. అప్పటి నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా అగాఫ్యా అక్కడ ఒంటరిగా జీవిస్తూ ఉంది. ఉలిక్కిపడ్డ ప్రపంచం 1980లలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారి అగాఫ్యాను అప్పటికి జీవించి ఉన్న ఆమె తండ్రిని చూశారు. చావు బతుకుల్లో ఉన్న అగాఫ్యా తండ్రిని ఆ భూగర్భ శాస్త్రవేత్తలలో ఒకడైన యెరొఫై సొదోవ్ కాపాడాడు. అంత నిర్మానుష్యమైన చోట వారు జీవించడాన్ని చూసి వారితో స్నేహం చేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి 2015 వరకూ అగాఫ్యాకు ఒకే ఒక్క నైబర్‌గా ఉన్నాడు కూడా. ఈ విషయం తెలుసుకున్న ఒక రిపోర్టర్ మొదటిసారిగా అగాఫ్యా ఉన్న చోటును సందర్శించి ఆమె గురించి కథనాలు రాసి ప్రచురించాడు. అగాఫ్యా కథ రష్యా అంతా సంచలనం అయ్యింది. ‘ఆమెకు మతి భ్రమించిందని నేను అనుకున్నాను. ఆమె మాట్లాడే భాష కూడా చాలా పాతది. ఆ మాటలు ఇప్పుడు చలామణిలో లేవు. కాని ఆమె వేట పద్ధతులు, ఇల్లు నిర్వహించుకునే తీరు చూసి ఆమె నార్మల్‌గా ఉందని తెలుసుకున్నాను’ అని ఆ రిపోర్టర్ రాశాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఆమె ఖర్చులన్నీ భరించి ఒక నెల పాటు రష్యా టూరు చేయించింది. ఆ సమయంలోనే మొదటిసారి అగాఫ్యా కరెన్సీని, ఏరోప్లేన్లని, ట్రాఫిక్ని చూసింది. అయితే ఆమె ఏ కోశానా జనావాసాల్లో ఉండదలుచుకోలేదు. తిరిగి తన ఏకాంత హిమసీమకు వెళ్లిపోయింది. తోడేళ్లు... ఎలుగుబంట్ల మధ్య... అగాఫ్యా ఉంటున్న చోటుకు భూ మార్గం లేదు. హెలికాప్టర్లో వెళ్లాలి. లేదా నడుచుకుంటూ వెళ్లాలి. అక్కడ కరెంటు లేదు. హీటర్లూ లేవు. అయితే ఆమె అక్కడ ఒక్కతే ప్రాణాలతో జీవించి ఉంది. కొన్ని గొర్రెల్ని పెంచుకుంటూ వేట ద్వారా అడవిలో దొరికే కాయల ద్వారా తోడేళ్ల నుంచి ఎలుగుబంట్ల నుంచి కాపాడుకుంటూ జీవిస్తోంది. ‘మా కుటుంబం ఆకలికి తాళలేక ఒక్కోసారి బూట్లు ఉడకబెట్టుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి’ అని ఆమె చెప్పింది. చివరి శ్వాస వరకూ అక్కడే సైబీరియాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి. ఇప్పుడు అగాఫ్యా ఉంటున్న ఇల్లు జీర్ణావస్థలో ఉంది. కాని ఆమె అక్కడి నుంచి రానంటున్నది. ‘నగరపు గాలి నాకు పడదు. జబ్బు పడతాను. అక్కడి ట్రాఫిక్, స్పీడ్ లైఫ్ చూస్తే నాకు యాంగ్జయిటీ వస్తుంది’ అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే రష్యా సంపన్నుడు ఒలెగ్ దెరిపాస్కా ఆమెకు ఇల్లు కట్టడానికి ముందుకొచ్చాడు. ‘కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె కాంటాక్ట్‌లో రాకుండా ఇల్లు కడుతున్నాం’ అని బాధ్యుడొకడు తెలిపాడు. ఇంటి సామాగ్రి ఆమె ఉంటున్న చోటుకు తీసుకుపోవడనికి కూడ పడవలు, హెలికాప్టర్లు ఉపయోగించాల్సి వస్తోంది. పని మొదలైంది. త్వరలో ముగుస్తుంది. ప్రభుత్వం ఆమె నివాస ఎంపికను గౌరవించి తరచూ ఆమెను సందర్శించే వలంటీర్‌ను ఏర్పాటు చేసింది. నెలలో ఒకటి రెండుసార్లు ఎవరో ఒకరు వచ్చి ఆమెను గమనించి వెళుతుంటారు. అగాఫ్యా జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన డాక్యుమెంటరీలు యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని చూస్తే ఆమె ఎలాంటి స్థితుల్లో నివసిస్తోందో అర్థమవుతుంది. మగతోడు లేనిదే స్త్రీ జీవించలేదని మగవాళ్లు, స్త్రీలు కూడా అనుకుంటూ ఉంటరు. దుర్గమారణ్యాలలో కూడా స్త్రీ ఒంటరిగా జీవించగలదని అగాఫ్యా నిరూపించింది. ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. లోకానికి తర్ఫీదు కాని పద్ధతుల్లో ఎందరో జీవిస్తూ ఉంటారు. ఆ కథలు బయటపడినప్పుడు ఆశ్చర్యపోవడమే మనం చేయగలం. – సాక్షి ఫ్యామిలీ -
400 మంది విద్యార్థుల కిడ్నాప్!
లాగోస్: నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్‌తో పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండాపోయారని వెల్లడించారు. ఆ సాయుధ దుండగులు తమతో పాటు కొందరు విద్యార్థులను బందీలుగా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ స్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారని, వారిలో సుమారు 400 మంది ఆచూకీ ఇప్పుడు లభించడం లేదని పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా తెలిపారు. పోలీసులు, నైజీరియా సైన్యం, దేశ వైమానిక దళం విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. -
'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్'
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. నైజీరియా దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం కరోనా సంక్రమణను నివారించే ఓ ప్రత్యేకమైన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోవిడ్-19 రీసెర్చ్ గ్రూప్ అధ్వర్యంలోని నైజీరియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ప్రకటించారు. అడెలెకే విశ్వవిద్యాలయంలోని మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ నిపుణుడు, కోవిడ్-19 పరిశోధనా బృందం నాయకుడు డాక్టర్ ఒలాడిపో కోలవోల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆఫ్రికన్ల కోసం ఆఫ్రికాలో స్థానికంగా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడుతుంది. ఈ వ్యాక్సిన్ అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలల సమయం పడుతుంది. ఈ పరిశోధనకు గానూ ట్రినిటీ ఇమ్యునో డెఫిషియంట్ లాబోరేటరీ, హెలిక్స్ బయోజెన్ కన్సల్ట్, ఓగ్బో మోషోల నుంచి 7.8 మిలియన్ నైజీరియన్ నైరాస్ నిధులు అందాయని' ఆయన పేర్కొన్నారు. చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ మరో ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్ మాట్లాడుతూ.. 'వ్యాక్సిన్ విజయవంతమైంది. కాకపోతే ఇది ఆఫ్రికన్లను లక్ష్యంగా చేసుకొని తయారు చేశాము. ఇతర జాతుల మీద కూడా పనిచేస్తుందని భావిస్తున్నాము. ఈ వ్యాక్సిన్ మా సంకల్పం యొక్క ఫలితం. దీని తయారీకి అనేక శాస్త్రీయ ప్రయత్నాలు అవసరమయ్యాయి. వ్యాక్సిన్లు అవసరమయ్యే జనాభా ప్రస్తుతం మందులు అవసరం కంటే ఎక్కువ ఉంది. కనుక టీకాపై మరింత దృష్టి సారించాము' అని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) ప్రకారం.. 120 వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా.. 13 మాత్రం మనుషులపై ప్రయోగ దశలో ఉన్నాయి. -
బెయిల్ కోసం నకిలీ డాక్యుమెంట్లు..
సాక్షి, సిటీబ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసేందుకు ష్యూరిటీ సంతకం చేసి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన మహిళా నైజీరియన్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా డాక్టర్‌ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షలు కొట్టేసిన కేసులో ఈ ఏడాది మార్చి నెలలో నైజీరియన్ గిడ్డి ఇసాక్ ఓలూతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు సమ్మతించిన న్యాయస్థానం ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలని ఆదేశించింది. దీంతో ఒబినా బాతోలోమివూ గొడ్విన్, రొస్‌లైన్ అన్నా ఎక్యూరేలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి పాస్‌పోర్టు కాపీలు, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలు సమర్పించారు. అయితే వీరిలో ఒకరైన న్యూఢిల్లీలో ఉంటున్న రొస్‌లైన్ అన్నా ఎక్యూరే 2016 ఫిబ్రవరి 10న మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చానని పోలీసులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తే అనుమానం వచ్చి సంబంధిత అదికారులకు పంపిస్తే వీసా ఫోర్జరీది అని తేల్చి చెప్పారు. దీంతో ఇటు పోలీసులు, అటు కోర్టును మోసం చేసి తమ వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేసేందుకు యత్నించిన రొస్‌లైన్ అన్నా ఎక్యూరేను అరెస్టు చేశారు. -
నైజీరియాలో 19 మంది భారతీయుల విడుదల
అబుజా: ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న భారతీయులను గత నెలలో కిడ్నాప్ చేసిన నైజీరియా సముద్ర దొంగ లు వారిని విడిచిపెట్టారు. డిసెంబర్ 15న ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్టీ డ్యూక్ పడవలో వెళుత ున్న 20 మందిని సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. అయితే, ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆఫ్రికా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆఫ్రికా పశ్చిమ తీరంలో 20 మంది భారతీయులను సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వ్యవహారాన్ని భారత అధికారులు నైజీరియా అధికారులకు చేరవేశారు. హాంకాంగ్ జెండాతో ఉన్న పడవలో వీరు ప్రయాణిస్తుండగా కిడ్నాప్ అయినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నైజీరియా అధికారులతో మాట్లాడామని విదేశాంగ శాఖ తెలి పింది. నైజీరియా తీరం వెంట ఇలా జరగడం ఈ ఏడాది ఇది మూడోది. -
నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు. -
అమ్మాయి పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్.. 34 లక్షలకు టోకరా
ఫేస్బుక్ ద్వారా అమ్మాయి పేరుతో పరిచయం చేసుకున్నారు. విశ్రాంత ఉద్యోగికి మాయమాటలు చెప్పారు. వాళ్ల బుట్టలో పడిపోయిన పెద్దాయన మొత్తం 34 లక్షల రూపాయల సొమ్ము వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసేశారు. విశ్రాంత జీవితానికి ఉపయోగించుకోవాల్సిన సొమ్ము మొత్తాన్నీ ఒక్క ఫేస్బుక్ మోసంతో పోగొట్టుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడిన ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కానీ సొమ్ము మొత్తాన్నీ రికవరీ చెయ్యలేకపోయారు. ఇంతకీ ఓ పెద్దాయన్ని సైబర్ నేరగాళ్లు ఎలా ట్రాప్ చేశారు? ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైర్డ్ అయిన సోయమిర్ కుమార్ దాస్‌కు అన్నే రోజ్ అనే పేరుతో ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అవతలి మహిళ నమ్మకంగా మాట్లాడటంతో సోయమిర్ కుమార్ ఆమెతో ఫ్రెండ్షిప్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక విషయాలు పంచుకునే స్థాయికి వాళ్ల స్నేహం వెళ్లింది. తాను మాట్లాడుతున్నది సైబర్ మోసగాళ్లతో అని తెలియని సోమియర్ కుమార్.. తన రిటైర్డ్మెంట్ గురించీ.. తన ఆర్థిక స్థితిగతుల గురించి పంచుకున్నారు. ఈ క్రమంలో తాను విదేశాల్లో ఉంటున్నాననీ.. ఆయన పదవీవిరమణ చేశారు కాబట్టి గిఫ్ట్ కింద విలువైన బహుమతులు, విదేశీ కరెన్సీ పంపుతున్నానని సదరు మహిళ చెప్పారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. మీకు పెద్ద పార్శిల్ నిండా ఫారెన్ కరెన్సీ వచ్చింది.. అవి మీకు ఇవ్వాలంటే కస్టమ్స్ డ్యూటీ కట్టాలి అంటూ నమ్మబలికారు. నిజమేననుకొని ఆయన.. తన ఏడు అకౌంట్ల వివరాలను వాళ్లకు చెప్పడమే కాకుండా.. 34,19,450 రూపాయల సొమ్మును వాళ్ల ఖాతాల్లోకి పంపేశారు. కట్టిన సొమ్ము మళ్లీ తిరిగి వచ్చేస్తుందనీ.. పైగా భారీగా డబ్బు కూడా వస్తున్నాయి కదా అనుకొని అంత పెద్ద మొత్తాన్ని ఆన్లైన్లో పంపేశారు. అంతే.. మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్.. ఫేస్ బుక్ లోకి వెళ్లి చూస్తే అకౌంట్ క్లోజ్.. జరిగింది మోసమని గ్రహించిన సోమియర్ కుమార్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు ఈ ముఠా ఢిల్లీ నుంచి తమ యాక్టివిటీస్ చేస్తోందని పసిగట్టారు. నేరుగా ఢిల్లీ వెళ్లి ఓ నైజీరియన్తో పాటు.. హర్యానాకు చెందిన కిషన్ లాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నది 2 లక్షల సొమ్ము మాత్రమే. మిగతా 32 లక్షల సొమ్ము అసలు రికవరీ అవుతుందా లేదా కూడా తెలియని పరిస్థితి. అలాగే 95 సిమ్ కార్డులు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంటే సిమ్ కార్డులు మార్చి మార్చి దేశవ్యాప్తంగా ఈ ముఠా ఎలాంటి మోసాలకు పాల్పడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు నేరుగా పరిచయం లేని వ్యక్తులతో ఎప్పుడూ ఆర్థిక లావాదేవీలు చెయ్యకూడదనీ, అసలు సోషల్ మీడియా స్నేహాలనే నమ్మకండి అని చెబుతున్నారు. -
కుక్కకు బదులుగా సింహం పిల్ల కాపలా!
సాక్షి, న్యూఢిల్లీ : నైజీరియాలోని లాగోస్ నగరంలో రెండు అపార్టుమెంట్ల బ్లాక్ కలిగిన ఓ ఆసామీ భద్రత కోసం కుక్కకు బదులుగా సింహం పిల్లను తెచ్చి పెంచుతున్నారు. రెండేళ్ల వయస్సు కలిగిన ఆ సింహం పిల్లను కనీసం కట్టేయకుండా స్వేచ్ఛగా ఓ చెట్టు కింద వదిలేశారు. ఆ అపార్ట్ ఆవరణలో పిల్లల సంరక్షణ కేంద్రంతోపాటు ఓ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పిల్లలేమోగానీ పిల్లలను తీసుకొచ్చే పెద్దలు, తల్లిదండ్రులు ఆ సింహాన్ని చూసి జడుసుకు చస్తున్నారు. అక్కడి నుంచి దాన్ని తొలగించాల్సిందిగా యజమానికి వారంతా కోరగా, అలవాటయితే అది కూడా కుక్కలాగానే మనిషులతోని మంచిగానే ఉంటుందని చెబుతూ వచ్చాడట. ఆ సింహం ప్రస్తుతానికి ఏమనకపోయినా ఏదో రోజు పిల్లలనో, తమనో పీక్కు తింటుందని ఆందోళన చెందిన అపార్ట్మెంట్ వాసులు నేరుగా పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతో అటవి సిబ్బంది వచ్చి ఆ సింహం పిల్లకు మత్తుమందు ఇచ్చి లెక్కి ప్రాంతంలోని జంతు ప్రదర్శన శాలకు దాన్ని తరలించారు. ఈ విషయం తెల్సినప్పటి నుంచి గత రెండు రోజులగా ఆ యజమాని పత్తా లేకుండా పోయాడట. ఆయన ఆచూకి దొరికితే ఆయన్ని వన్య సంరక్షణ చట్టాల కింద అరెస్ట్ చేస్తామని అటవి శాఖ అధికారులు తెలిపారు. ఆ ఆసామీ పేరు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. రెండు నెలల క్రితమే ఆయన ఈ సింహం పిల్లను కొనుక్కొని వచ్చాడట. -
ముగ్గురు నైజీరియన్ల ఘరానా మోసం!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొల్లగొడుతున్న ఓ ముగ్గురు నైజీరియన్లతో పాటు నాగాలాండ్ మహిళను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్లు దియోంగ్యూ మహమ్మద్, ముసా హలిమాట్, ఎన్‌డౌర్ అలియోనితో పాటు నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమీని న్యూఢిల్లీ నుంచి ట్రాన్సిట్ వారంట్‌పై శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కేసు వివరాలను క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌లతో కలసి సీపీ సజ్జనార్ వెల్లడించారు. నేరగాళ్ల పాత్రలిలా.. న్వోసు డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ దియోంగ్యూ మహమ్మద్ అలియాస్ హీదర్ విలియమ్స్‌గా చలామణి అవుతున్నాడు. నైజీరియాకు చెందిన న్వోసు డొనాల్డ్ ప్రాస్పర్ పేరును దియోంగ్యూ మహమ్మద్‌గా మార్చుకొని సింగపూర్ పాస్‌పోర్టుపై 2018 మార్చిలో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. విదేశాల్లో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి జాబితాను సేకరించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మెయిల్స్ పంపేవాడు. ముసా హలిమాట్ అలియాస్ మిస్ హీదర్ విలియమ్స్ దియోంగ్యూ ప్రియురాలు. మెడికల్ వీసాపై 2016లో భారత్‌కు వచ్చింది. ఉద్యోగార్థులతో మాట్లాడుతూ వారిని ముగ్గులోకి లాగడం ఈమె పని. ఎన్‌డౌర్ అలి యోని అలిమాస్ బెనిడిక్ట్ ఎనబులిలి అలియాస్ మిస్టర్ రాబర్ట్ సెనగల్ పాస్‌పోర్టుపై 2018 సెప్టెంబర్‌లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. వివిధ కంపెనీల నకిలీ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించడంలో దిట్ట. నాగాలాండ్‌కు చెందిన హలిటో జిమోమి అలియాస్ అకిత కుమారి 2019లో నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్ అగాహోన్ను పెళ్లాడింది. అకిత కుమారి పేరుతో మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చేస్తుంది. పెటోసైల్ ఉఘా, శామ్సన్ విలియమ్‌లు కూడా దియోంగ్యూకు సహకరించేవారు. గుట్టు రట్టయిందిలా.. కూకట్‌పల్లికి చెందిన వి.రాజన్‌బాబు భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గత మూడేళ్లుగా ఒడిశాలోని పట్నాయక్ స్టీల్స్‌లో సీఈవోగా పనిచేస్తున్నారు. అక్కడ ఏడాదికి రూ.45 లక్షలు జీతం తీసుకుంటున్నారు. ఎక్కువ జీతం వచ్చే జాబ్ కోసం రాజన్ చేస్తున్న ప్రయత్నాలను నైజీరియన్ బ్యాచ్ గుర్తించింది. లాస్‌ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా రొగల్ హోటల్ అండ్ అపార్ట్మెంట్స్ సీఈవో అంటూ హీదర్ విలియమ్స్ రాజన్‌కు ఫోన్ చేశాడు. ఏడాదికి కోటిన్నర ఇస్తామని చెప్పారు. బోస్టన్ నుంచి ఢిల్లీలోని బ్రిటిష్ కాన్సులేట్‌కు వస్తున్నానని రాజన్‌ను నమ్మించారు. హీదర్ విలియమ్స్ 12 నెలల అడ్వాన్స్ శాలరీ 1.75 లక్షల డాలర్ల డీడీతో వచ్చిందని, ఇది విడుదల చేయాలంటే రూ.55 వేలు చెల్లించాలని అకిత కుమారి మాట్లాడింది. మళ్లీ ఫోన్ చేసి రూ.2.55 లక్షలు చెల్లించాలని అడగడంతో మళ్లీ అంత మొత్తాన్ని జమ చేశారు. ఆ వెంటనే హీదర్ విలియమ్స్ ఫోన్ చేసి మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ అడగడంతో మళ్లీ ఖాతాలో వేశాడు. ఇలా పలు దఫాలుగా రూ.47 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. వారం అయినా నిందితుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని తెలుసుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆగస్టు 29న ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కేసు ఛేదించారు. నిందితుల నుంచి 21 సెల్ఫోన్లు, నాలుగు పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, డెబిట్‌కార్డులు, విదేశీ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషిం చిన ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, సీహెచ్ రామయ్య, ఎస్ఐలు విజయ్ వర్ధన్, రాజేంద్రను సీపీ సజ్జనార్ సత్కరించారు. -
నైజీరియన్ల అక్రమ దందాకు తెర
సాక్షి, హైదరాబాద్ : రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నైజీరియన్లు కొత్త రకం దందాతో రంగంలోకి దిగారు . ఎయిర్పోర్ట్ కార్గోలో లాగోస్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా నిషేధిత పదార్థాలు దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా నిషేధిత పదార్థాలను పట్టుకున్నారు. నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ భారీ పార్సల్‌లో 13 టన్నులు ఉన్న కాస్మోటిక్స్, బీర్, విస్కీ, జిన్‌తోపాటు ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. వీటి విలువ 52 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా అనుమతి లేకుండా వీటిని నగరానికి తీసుకు వచ్చిన నిందితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
మోసం.. వస్త్ర రూపం
బ్లాక్ టికెట్.. బ్లాక్ మార్కెట్.. బ్లాక్ మనీ.. ఈ పేర్లు తరచూ వింటూనే ఉంటాం. మరీ ఈ బ్లాక్ బిజినెస్ ఏంటి? దానికి నైజీరియన్లకు సంబంధం ఏమిటి? ఆ దందాతో మనం ఎలా నష్టపోతున్నాం? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనంచదవాల్సిందే. సాక్షి, సిటీబ్యూరో :లాటరీలు, బహుమతులు, పెళ్లి ప్రతిపాదనల పేరుతో సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌తో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ మెసేజ్‌లతో ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు చిక్కడం కష్టసాధ్యమవుతోంది. ఒకవేళ దొరికినా వారి నుంచి రికవరీలు తీసికట్టుగా ఉంటున్నాయి. రాజధాని కమిషనరేట్ల పరిధిలోని ప్రజలు సైబర్ నేరాల్లో కోల్పోతున్న మొత్తాల్లో గరిష్టంగా 5 శాతం మాత్రమే రికవరీ ఉంటోందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘బ్లాక్ బిజినెస్’. మెట్రో నగరాల్లో స్థిరపడిన నల్లజాతీయులు సైబర్ మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును వస్త్రాలు, వస్తువులుగా మార్చి తమ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వివరాలకు మార్గాలెన్నో... ఈ సైబర్ నేరగాళ్లలో అత్యధికులు ఆఫ్రికా దేశాలకు చెందిన నల్లజాతీయులే ఉంటున్నారు. వీరు ఆన్లైన్ మోసాలను ఈ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్, వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్లతో ప్రారంభిస్తారు. మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరించడానికి వారికి అనేక మార్గాలుంటున్నాయి. బహుమతులు, క్విజ్‌ల పేరుతో ఆన్లైన్లో చాలా సాధారణమైన ప్రశ్నల్ని అడుగుతూ వ్యక్తిగత వివరాలు పూరించమంటారు. మరోపక్క ఫ్రీ గిఫ్ట్ ఓచర్ల పేరుతో అనేక వాణిజ్య ప్రాంతాల్లో పేరు, నంబర్, మెయిల్ ఐడీలతో స్లిప్స్ నింపించి బాక్సుల్లో వేయించే విధానాలు ఇటీవల పెరిగాయి. ఇవన్నీ అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా లక్ష ఫోన్ నంబర్లు/ఈ–మెయిల్స్ రూ.30 వేలకు విక్రయించే వెబ్సైట్లూ ఉన్నాయి. ఇలాంటి సైట్లకు డార్క్‌నెట్ అడ్డా. వీటి ఆధారంగా ముఠాలుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖాతాలకు బదులు వాలెట్స్ ఈ నైజీరియన్లు స్కీములు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. ఒకప్పుడు కేవలం ఖాతాల్లోనే నగదు జమ చేయించుకునే వీళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాలైన వాలెట్స్‌ను వాడుతున్నారు. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే కేసు నమోదైనప్పుడు పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నైజీరియన్లు ఈ ఖాతాలు, వాలెట్స్ కోసం భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, బెంగళూర్, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలు/వాలెట్స్ తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఇవి అంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఈ రకంగా కమీషన్ తీసుకొని తమ ఖాతాలు/వాలెట్స్‌ను అప్పగించే వారిని సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్’ అంటారు. వస్త్రాలు.. వస్తువులు ఇలా చేయడం ద్వారా ఖాతాలు/వాలెట్స్‌ను తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు, నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది. సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు పంపడం ఇబ్బందికరం. అలాగని ఇక్కడే ఏ రూపంలో ఉంచినా పోలీసులకు వీరు చిక్కినప్పుడు ఆ మొత్తాన్ని, వస్తువుల్నీ రికవరీ చేసేస్తారు. దీంతో మోసగాళ్లు బాధితుల నుంచి స్వాహా చేసిన సొమ్మును వస్తు/వస్త్ర రూపంలోకి మార్చేస్తున్నారు. వీటిని ఎగుమతుల పేరుతో తమ దేశానికి తరలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరిని బిజినెస్ వీసాపై భారత్‌కు తీసుకొస్తున్నారు. వీరు ఎక్కువగా వస్త్ర వ్యాపారుల ముసుగులోనే తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుల నుంచి కాజేసిన దాంట్లో కొంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకొని, మిగిలిన దాంతో ఢిల్లీలో ఉన్న పాలికాబజార్, సరోజిని మార్కెట్, చాందినీ చౌక్‌లలో హోల్‌సేల్‌గా వస్త్రాలు, ఎగుమతికి ఇబ్బంది లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్సైన్మెంట్ రూపంలో ఆయా ఆఫ్రికన్ దేశాలకు పంపిస్తున్నారు. ఈ కన్సైన్మెంట్స్ను రిసీవ్ చేసుకునేందుకు అక్కడా ముఠా సభ్యులు ఉంటున్నారు. వీళ్లు అక్కడ మార్కెట్లో ఆయా వస్తువులు, వస్త్రాలు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరాల్లో నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆలస్యం చేయొద్దు సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసుల్లో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడానికి ఆలస్యం చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ మోసగాళ్ల బారినపడినవాళ్లు గరిష్టంగా 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే కొంతవరకు ఉపయుక్తం. నగదు ఆన్లైన్లో బదిలీ చేసినా, వాలెట్స్‌లోకి ట్రాన్స్ఫర్ చేసినా అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. నేరగాళ్లు ఏటీఎం ద్వారానూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయలేరు. ఈ అవకాశాల్ని వినియోగించుకొని బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి రికవరీ చేయవచ్చు. అయితే అనేక సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయడానికి ఆలస్యం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చెబుతున్న మాటలు నమ్మడం వల్లే ఇలా జరుగుతోంది.– సైబర్‌క్రైమ్ పోలీసులు -
విమానం పైకెక్కి వ్యక్తి హల్చల్
అబూజా : టెకాఫ్‌కు రెఢీ అయిన విమానం రెక్కలపైకి ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశారు. విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి...విమాన రెక్కలపైకి ఎక్కటం చూసిన ప్రయాణీకులు నిర్ఘాంతపోయారు. కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. ఈ నెల 19న ఐకెజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముర్తలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే పక్కనే ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా విమానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గమనించిన పైలెట్ విమాన ఇంజన్ నిలిపివేశాడు. ఇంతలో విమానం పైకి ఎక్కిన ఆ దుండగుడు వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను ఫ్లైట్ ఇంజన్ పైన పెట్టి విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణీకులు భయపడిపోవడంతో వారందరినీ విమానం నుంచి దింపేశారు. తర్వాతి విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. -
మాట్రి‘మోసగాడు’!
సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిస్థిరపడిన ఓ నైజీరియన్ మాట్రిమోనియల్ సైట్ ఆధారంగా నగరానికి చెందిన యువతిని మోసం చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నట్లు నమ్మించి వివాహం, బహుమతుల పేరుతో రూ.16.37 లక్షలు గుంజాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడైన ఒనియనోర్ ఎలోనియం బ్రైట్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం వెల్లడించారు. నైజీరియా నుంచి వలసవచ్చిన ఒనియనోర్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతడు జీవన్సాథీ.కామ్ అనే మాట్రిమోనియల్ సైట్లో తాను లండన్‌లో ఉంటున్నట్లు, తన పేరు బాసిమ్కరీం అని ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. నగరానికి చెందిన యువతి ప్రొఫైల్‌ను లైక్ చేసిన అతడు ఆమెతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఓ దశలో వివాహం చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. హఠాత్తుగా తాను తన వద్ద ఉన్న భారీ నగదు, బహుమతులతో ఇండియా వస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులం అంటూ అతడి అనుచరులు ఈ యువతికి కాల్ చేశారు. కరీం అనే వ్యక్తి లండన్ నుంచి వచ్చాడని, వస్తూ విలువైన వస్తువులు తేవడంతో ఆపేశామని చెప్పారు. ఆ వస్తువులు, నగదుతో సహా పంపాలంటే పన్ను చెల్లించాలన్నారు. ఆమె ఈ మాటలు నమ్మడంతో వివిధ పన్నుల పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.16.37 లక్షలు గుంజారు. మోసపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒనియనోర్ నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రద్దీ ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 30 మంది మరణించగా.. 40 మందికి గాయాలయ్యాయి. నైజీరియా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కి.మీ దూరంలో ఉన్న కొండుగ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన తీరును బట్టి ఇది బొకో హరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నామని ఆ దేశ అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఫుట్‌బాల్ అభిమానులందరూ కలిసి ఓ హాల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని సదరు హాల్ యజమాని నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయిం దని.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక ఆత్మరక్షణ దళ నేత హాసన్ వెల్లడించారు. అప్పటికే జనాల్లోకి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు సహా ఈ వ్యక్తి తమను తాము పేల్చుకున్నారని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే మరణించగా మిగతా వారు చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పారు. ఎమర్జెన్సీ దళాలు ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని అత్యవసర విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. -
నైజీరియాలో దాడి.. 23 మంది మృతి
కానో: ఉత్తర నైజీరియాలోని రెండు గ్రామాలపై మోటార్‌సైకిళ్లపై గుంపుగా వచ్చి విరుచుకుపడిన సాయుధులు 23 మందిని పొట్టనపెట్టుకున్నారు. తుంగ, కబాజే గ్రామాల్లో స్థానికులు మంగళవారం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వీరు దాడికి పాల్పడ్డారు. -
అమ్మాయి పేరుతో అలీని చీట్ చేశారు
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లు చెప్పి అగంతకులు మోసాలకు పాల్పడుతున్న జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ నైజరీయన్ ప్రేమ పేరుతో అమ్మాయిలా నమ్మిస్తూ హైదరాబాద్‌కు చెందిన అలీ నుంచి రెండు లక్షల రూపాయలు రాబట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. అలీకి ఫెస్‌బుక్‌లో పరిచయం అయిన సదురు నైజీరియన్ తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. తాను అమెరికాలో ఆర్మీ అధికారినిగా పనిచేస్తున్నానని చెప్పాడు. ప్రేమ పేరుతో నమ్మబలికాడు. తనకు డాలర్ బ్యాగ్ దొరికిందని.. ఆ డాలర్లను మార్చగా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో సెట్ అవుదామంటూ అలీని ప్రలోభ పెట్టారు. ఆ డాలర్ బ్యాగ్ ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉందని దానికి సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ కట్టాలని అలీ వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీరా ఎంతకీ డాలర్ బ్యాగ్ రాకపోవడంతో అలీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తాను రెండు లక్షల రూపాయలు మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులో పూణేలో ఉంటున్న నైజీరియన్ నంబా రేమండ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కుబేరుడికి డౌటొచ్చింది.. బ్యాంక్‌కు వెళ్లి..
అబూజా : ఆఫ్రికా కుబేరుడు అలికో డాంగోట్ (61) చేసిన ఓ పని చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 10.3 బిలియన్ డాలర్లతో ఆఫ్రికా రిచెస్ట్ పర్సన్‌గా కొనసాగుతున్న నైజీరియాకు చెందిన డాంగోట్కు.. ‘ఇంతకూ నేను కోటీశ్వరుడినేనా’ అనే సందేహం కలిగింది. తన సంపాదనంతా ఎప్పుడూ కాగితాల్లోనే చూసుకుని మురవాలా అని మదనపడ్డాడు. తన కష్టార్జితాన్ని ఓసారి కళ్లారా చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్యాంక్‌కు వెళ్లి ఓ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.69 కోట్లు)ను విత్‌డ్రా చేశాడు. డాంగోట్ అంత భారీ మొత్తం విత్‌డ్రా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు విస్తుబోయారు. చివరకు అతని కోరిక తెలిసి.. ఇదేం కోరికా అంటూ లోలోన నవ్వుకున్నారు. ఇక డ్రా చేసిన 10 మిలియన్ డాలర్లను ఓ సారి తడిమి చూసుకున్న డాంగోట్.. వాటిని ఓ రోజంతా తన దగ్గర ఉంచుకుని మరుసటి రోజు బ్యాంక్‌లో వేశాడు. ‘యుక్త వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించే మొదటి 10 మిలియన్ డాలర్లే అత్యంత ప్రధానం. తర్వాతా ఆ మొత్తం పెరుగుతూ వెళ్తుంది. నువ్వప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవు. కానీ, నాకెందుకో నా డబ్బును కళ్లారా చూద్దామనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. సిమెంట్, షుగర్, ఫ్లోర్ తదితర తయారీ రంగాల్లో డాంగోట్ బడా పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. -
వావ్.. నైజీరియన్స్ నోట షారుఖ్ పాట
విశ్వజనీనంగా మాట్లాడే శక్తి కేవలం సంగీతానికే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎల్లలు దాటుతూ, హద్దులు చెరిపివేస్తూ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి సంగీతానికి ఉందని ఎన్నో సార్లు రుజువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఇదే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నైజీరియాకు చెందిన కొంత మంది కుర్రాళ్లు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు వీరాభిమానులు. అయితే తమ హీరోకు సంబంధించిన సినిమాలోని పాటలను నేర్చుకొని పాడటం వాళ్లకు సరదా. అయితే అలీ గుల్ ఖాన్ అనే వ్యక్తి గతంలో వీరి పాటకు సంబంధించిన పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షారుఖ్ హిట్ సినిమా ‘కల్ హో న హోలో’లోని టైటిల్ సాంగ్ పాడి సంగీత ప్రియుల మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా షారుఖ్‌కు చెందిన మరో పాటను పాడి సంగీతంపై, తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు నైజీరియన్ కుర్రాళ్లు. తాజాగా అలీ గుల్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన మరో వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. షారుఖ్ హిట్ సినిమా ‘దిల్ తో పాగల్ హై’ లోని ‘బోలి సి సూరత్’పాటను ఐదుగురు నైజీరియన్ కుర్రాళ్లు పాడుతూ సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచారు. వాళ్లలో ఒకరు పాట పాడుతుంటే మిగతా వారు కోరస్ ఇచ్చారు. వాళ్ల అద్భుత ప్రదర్శనకు సంగీతం తెలిసిన వారు, తెలియనివారు అందరూ ముగ్దులవుతున్నారు. ఇక అలీ వీడియో షేర్ చేస్తూ ‘బాలీవుడ్ సినిమాలను భారతీయులకంటే నైజీరియన్లే ఎక్కువ చూస్తున్నారని అనిపిస్తోంది. మరో పాటను అద్భుతంగా పాడారు’ అంటూ వీడియో కింద పేర్కొన్నారు. -
‘నమ్మండిరా బాబు.. నిజంగా నేనే’
అబుజా : ‘చావుపుట్టుకలు దైవాధీనం’.. ఇది ఒకప్పటి మాట. మరి నేడో.. రేటింగ్స్ కోసం.. పాపులారిటీ కోసం.. సోషల్ మీడియా సాక్షిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా చంపేస్తున్నాం. పాపం ఆనక సదరు వ్యక్తులు ‘బాబోయ్ మేం బతికే ఉన్నాం’ అంటూ టీవీల ముందుకు వచ్చి మొరపెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నైజీరియా అధ్యక్షుడు బుహారికి. మీడియా ముందుకు వచ్చి ‘నేను బతికే ఉన్నాను.. నేను నేనే. నన్ను నమ్మండి’ అంటూ వాదించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది బుహారికి. విషయం ఏంటంటే గత ఏడాది గుర్తు తెలియని వ్యాధి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లారు బుహారి. ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తిరిగి స్వదేశానికి వచ్చారు. కానీ ఈ లోపే ఆయన చనిపోయినట్లు.. ఆ స్థానంలో బుహారిని పోలిన మరో వ్యక్తి పరిపాలన సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి. పొరుగున ఉన్న సూడాన్ నుంచి అచ్చం బుహారి లాంటి వ్యక్తినే తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే గాసిప్స్ తారస్థాయికి చేరాయి. అంతటితో ఆగక ఆ వ్యక్తి పేరు జబ్రిల్ అని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. స్వదేశానికి వచ్చిన బుహారికి ఈ వదంతుల గురించి తెలిసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారీ ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన అతిథులందరూ ఇతర విషయాలను వదిలేసి ఈ వదంతుల గురించి ప్రస్తావించడంతో ఆయన ‘నేనే బాబూ.. బతికే ఉన్నాను.. డమ్మీని కాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాక తన గురించి ఇలాంటి వదంతులు ప్రచారం చేసిన వారు అజ్ఞానులు, మతం పట్ల గౌరవం లేనివాళ్లంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి తిరిగి పోటీచేయాలని భావిస్తున్నారు బుహారీ. దాంతో ప్రత్యర్ధులు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి వదంతులు వ్యాపింపచేశారు. బుహారి లండన్‌లో ఎక్కువ రోజులు గడపడం కూడా వారికి ఉపయోగపడింది. అయితే బుహారి ఇప్పటి వరకూ ఆయనకు ఉన్న వ్యాధి ఏమిటో వెల్లడించ లేదు. -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల వరుసగా రెండో టైటిల్ సాధించింది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–1, 7–6 (7/2)తో టాప్ సీడ్, ప్రపంచ 142వ ర్యాంకర్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. గంటా 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నాలుగుసార్లు చొప్పున చేజార్చుకున్నారు. అయితే టైబ్రేక్‌లో ప్రాంజల పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గతవారం కూడా ఇదే వేదికపై జరిగిన టోర్నీలో క్యానీ పెరిన్నే ఓడించి ప్రాంజల తొలి టైటిల్ దక్కించుకుంది. -
ప్రాంజల సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రొ సర్క్యూట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో 19 ఏళ్ల ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 396వ ర్యాంకర్ ప్రాంజల 2–6, 7–5, 6–0తో ప్రపంచ 144వ ర్యాంకర్, టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించడం తోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈజిప్ట్‌లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రాంజల ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే. -
పెట్రోల్ బంక్ వద్ద పేలుడు.. 35మంది మృతి
అబుజా: ఉత్తర నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ట్యాంకర్లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నిట్ ఎదుట నైజీరియన్ విద్యార్థుల హల్చల్
కాజీపేట : నిట్‌లో చదువుతున్న నైజీరియన్ విద్యార్థులు రూ.5 కోసం ఆటో డ్రైవర్‌పై దాడి చేయడమేగాక నడిరోడ్డుపై హల్చల్ సృష్టించిన ఘటన కాజీపేటలోని నిట్ ఎదుట సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిట్‌లో పీజీ చ దువుతున్న ముగ్గురు నైజీరియన్లు హన్మకొండలోని పోలీసు హెడ్‌క్వార్టర్ ఎదుట ఆటో ఎక్కారు. వారిలో ఒకరు రోహిణి ఆస్పత్రి వద్ద దిగిపోగా ఇద్ద రు నిట్ ఎదుట దిగి ఆటో డ్రైవర్ బాలుకు రూ.50 నోటు ఇచ్చారు. ఆటో డ్రైవర్ తిరిగి రూ.5 చేతిలో పెట్టగా రూ.10 వస్తాయంటూ గొడవకు దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా ఆటో డ్రైవర్ బాలుతోపాటు వారి పై విద్యార్థులు చేయి చేసుకున్నారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాటసారులు 100 డయల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా ఆ సమయంలో హన్మకొండ వైపు వెళ్తున్న మడికొండ సీఐ సంతోష్ గొడవను చూసి వచ్చా రు. పోలీసులను చూసి కూడా వెనక్కి తగ్గకుండా రెచ్చి పోతున్న నైజీరియన్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని కాజీపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఘటన జరుగుతున్నప్పుడు ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన విలేకరులపై కూ డా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడితో కలిసి ప్రయాణికులు ఫిర్యాదు చేయగా ఎస్సై సాంబమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నైజీరియన్ల అరెస్ట్..భారీగా గంజాయి స్వాధీనం
గురుగావ్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.3 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు యావో, ఓక్లీ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం వీరు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకుని వీరిని అదుపులోకి తీసుకుంది. పోలీసు రిమాండ్‌కు తరలించిన తర్వాత వీరిద్దరినీ విచారించారు. దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ దేశాల నుంచి అక్రమంగా హెరాయిన్‌ను తెప్పించి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఇంకా దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు వారి పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లు కూడా సమర్పించడంలో విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. -
నైజీరియా మగువ.. చీరంటే మక్కువ
అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది’’ అన్న మనసుకవి మాటలు చీర మహిమేమిటో చెబుతాయి.. చీరకట్టి ఆడతనం పెంచుకొమ్మన్న యువకవి పదాలు ఆ ఆరుమూరల వస్త్ర విశేషం ప్రత్యేకతను చాటిచెబుతాయి. అయితే ఎన్ని విధాలా వర్ణించినా.. ఇంకా ఏదో మిగిలిపోయిందన్న విశిష్టత చీరకే ఉంది. నెమలిపింఛంలా, నీలి మేఘంలా, కడలి కెరటంలా, పూలగాలి తెమ్మెరలా ఎన్నెన్నో హొయలు పోయే చీర భారతీయ వనిత ఔన్నత్యానికి తిరుగులేని రీతిలో అద్దం పడుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ అందచందాల చీర నైజీరియా నుంచి వచ్చిన ఇంతి మనసును ఆకట్టుకుంది. కట్టులో వింత ఆమెను విస్మయానికి గురిచేసింది. విశాఖకు తమ కంపెనీ పని మీద వచ్చిన నైజీరియా దేశస్తురాలు గ్రీన్ అలా హబ్జాకు చీర మీద చాలా మనసైంది. ఏదేశం మగువైనా ఒకటే కదా. వెంటనే ఆమె చీరకట్టు గురించి వివరంగా తెలుసుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నైజీరియా షిప్పింగ్కంపెనీ లీగల్ విభాగం డెప్యుటీ డైరెక్టర్ అయిన హబ్జా చీరకట్టులోనే పాల్గొని అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. ఈస్ట్ కోస్ట్ మారిటైం అకాడమీలో షిప్పింగ్‌లో ఎగుమతులు, దిగుమతుల అంశంపై శిక్షణ నిమిత్తం తాను వచ్చానని.. విశాఖ వచ్చిన దగ్గర నుండి ఇక్కడి వారి చీరకట్టు తనను ఎంతగానో మైమరపించిందని, అందుకే గత రాత్రి షాపింగ్‌కు వెళ్లి చీర, చెవి రింగులు, నక్లెస్ కొనుక్కొని, జాకెట్టు కుట్టించుకుని మరీ ధరించానని ఆమె సమావేశంలో చెప్పగానే అంతా కేరింతలు కొట్టారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సదస్సులో అలా ఆమె అందరిలో కేంద్రబిందువు అయ్యారు. భారతీయ సంప్రదాయాల్లో తెలుగువారి చీరకట్టు తనను ముగ్ధురాలిని చేసిందని ఆమె చెప్పారు. -
బుడతడి ఆర్ట్‌కి అధ్యక్షుడు ఫిదా
లాగోస్(నైజీరియా) : 11 ఏళ్ల నైజిరియా బుడతడు గీసిన చిత్రానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఫిదా అయ్యారు. నైజీరియాలో రెండు రోజు పర్యటనలో భాగంగా మాక్రాన్ లాగోస్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైజీరియా చిన్నారి కరీమ్ వారిస్ ఒలామిలేకన్ గీసిన తన చిత్రాన్ని చూసుకొని మాక్రాన్ మురిసిపోయారు. చిత్రాన్ని గీసిన కరీమ్‌ను ప్రేమతో దగ్గరకు తీసుకొని వెన్ను నిమిరి మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కరీమ్ కేవలం రెండు గంటల్లోనే మాక్రాన్ చిత్రాన్ని గీశాడు. మాక్రాన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. బుడతడి నైపుణ్యం తన మనస్సుకు హత్తుకుందని అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పిటిన తర్వాత తొలిసారి మాక్రాన్ నైజిరియాలో పర్యటించారు. ఆఫ్రికా లెజెండరీ మ్యూజీషియన్ ఫెలా కుటి స్మారకార్థం లాగోస్‌లో నిర్మించిన నైజీరియా నైట్ క్లబ్‌ను సందర్శించారు. -
బుడతడి ఆర్ట్‌కి ఆ దేశ అధ్యక్షుడు ఫిదా
-
‘నన్ను చంపినవారిని పట్టించండి’
మాస్కో: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డీగో మారడోనాకు చిర్రెత్తుకొచ్చింది. అర్జెంటీనా- నైజీరీయా మ్యాచ్ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన ఈ దిగ్గజం.. స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పోందిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే మారడోనా గుండె పోటుతో మరణించాడంటూ కొందరు పుకార్లు సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హల్ చల్ చేశారు. అవికాస్త వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. స్పందించిన దిగ్గజం.. ‘మరణ వార్త’పై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు. చనిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కొందరు కల్పించారు అని మండిపడ్డారు. ఇక అంతటితో ఆగకుండా తనను చంపిన వారిని(చనిపోయినట్టు మెసేజ్ చేసినవారిని) పట్టించినవారికి పది వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మారడోనా వ్యక్తిగత న్యాయవాది తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంజీనా- నైజీరియా మ్యాచ్ సందర్భంగా మారడోనా ప్రవర్తించిన తీరు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఫుట్‌బాలర్ ప్రేక్షకులను గేలి చేస్తూ చేతితో అసభ్యకర సంజ్ఞలు చేయండపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మారడోనాపై కోపంగానే కోందరు ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అర్జెంటీనా నిలిచింది
అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది! ఒక డ్రా, ఒక ఓటమితో... నాకౌట్ అవకాశాలను పీకల మీదకు తెచ్చుకున్న ఆ జట్టు... ఓ చక్కటి గెలుపుతో ప్రపంచ కప్ లీగ్ దశ గండాన్ని అధిగమించింది. ఢీ అంటే ఢీ అనేలా తలపడే నైజీరియాపై ఆధిపత్యం చాటుతూ లియోనల్ మెస్సీ మైమరపు గోల్ ఆధిక్యం అందించగా... మార్కొస్ రొజొ మెరుపు షాట్ గెలుపును కట్టబెట్టింది. సెయింట్ పీటర్స్బర్గ్: తరుముకొస్తున్న పరాభవాన్ని అర్జెంటీనా తప్పించుకుంది. ‘డ్రా’ సైతం సరిపోనంతగా... గెలుపు అత్యవసరమైన స్థితిలో పైకి లేచింది. కెప్టెన్ మెస్సీ (14వ నిమిషంలో), డిఫెండర్ మార్కొస్ రొజొ (86వ నిమిషంలో) గోల్స్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 2–1 తేడాతో నైజీరియాను ఓడించి నాకౌట్‌కు చేరింది. నైజీరియా తరఫున మోసెస్ (51వ నిమి షంలో) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఈ ఫలితంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన అర్జెంటీనా (4 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ విజేత ఫ్రాన్స్‌తో ఈ నెల 30న జరిగే నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుంది. మెస్సీ ‘బనేగా’ గోల్... జట్టుగా ఎలా ఉన్నా మైదానంలోకి వచ్చేసరికి అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ. దీనిని మరోసారి నిరూపిస్తూ అతడు ప్రారంభంలోనే గోల్ కొట్టి ఆధిక్యం అందించాడు. 14వ నిమిషంలో సహచరుడు బనేగా సుదూరం నుంచి ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ ముందు దానిని నియంత్రించి, ఆ తర్వాత ప్రత్యర్థి ఆటగాడిని ఏమారుస్తూ ముందుకెళ్లి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టా డు. ఆధిక్యం కోల్పోయి, జట్టుగా ఆడలేకపోతున్న నైజీరియాకు రెండో భాగంలో అదృష్టం తోడైంది. 49వ నిమిషంలో బాక్స్ లోపల బలోగన్‌ను మాస్కెరనో అడ్డుకోవడంతో ఆ జట్టుకు పెనాల్టీ దక్కింది. దీనిని మోసెస్ పొరపాటు లేకుండా నెట్లోకి పంపాడు. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా కుడి వైపు కార్నర్ నుంచి అందిన పాస్‌ను అందుకున్న రొజొ... అంతే వేగంగా నెట్లోకి పంపి జట్టుకు రెండో గోల్‌తో పాటు అద్భుత విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘డి’ టాపర్ క్రొయేషియా రొస్తావ్ ఆన్ డాన్: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన క్రొయేషియా... గ్రూప్ ‘డి’లో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో నెగ్గింది. బడెల్జ్ (53వ నిమిషంలో), పెరిసిక్ (90వ ని.లో) క్రొయే షియాకు గోల్స్ చేశారు. మధ్యలో సిగుర్డ్సన్ (76వ ని.లో) పెనాల్టీని గోల్‌గా మలిచి ఐస్లాండ్ను పోటీలో నిలిపాడు. మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించినా పెరిసిక్ స్కోరు చేసి ఫలితాన్ని మార్చాడు. ఇంతకుముందే నైజీరియా, అర్జెంటీనాలపై నెగ్గిన క్రొయే షియా ఈ ఫలితంతో గ్రూప్‌లో అజేయంగా నిలిచింది. జూలై 1న నాకౌట్లో డెన్మార్క్‌తో ఆడనుంది. ప్రపంచకప్‌లో నేడు జపాన్ x పోలాండ్ రా.గం. 7.30 నుంచి సెనెగల్ x కొలంబియా రా.గం. 7.30 నుంచి పనామా x ట్యూనిషియా రా.గం. 11.30 నుంచి ఇంగ్లండ్ x బెల్జియం రా.గం. 11.30 నుంచి -
పేదరికం తగ్గుతోంది..!
భారత్‌కు ఓ శుభవార్త. అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశంగా భారత్∙పేరిట ఉన్న రికార్డ్‌ను తాజాగా నైజీరియా అధిగమించింది. అంతేకాదు... మనదేశంలో ప్రతీ నిమిషానికి 44 మంది దుర్భర దారిద్య్రం నుంచి బయటపడుతున్నారు. అదే నైజీరియాలో నిమిషానికి ఆరుగురు పేదలు పెరుగుతున్నారు. ‘ ఈ ఏడాది మే చివరకల్లా నైజీరియాలో 8.7 కోట్ల మంది కడు పేదరికంలో మగ్గుతున్నారు. అదే భారత్‌లో 7.3 కోట్ల మంది పేదలున్నారు. నైజీరియాలో దారిద్య్రం పెరుగుతుండగా, భారత్‌లో తగ్గుతోంది’ అని వరల్డ్ పావర్టీ క్లాక్ నివేదిక స్పష్టం చేసింది. రోజుకు రూ.130.25 (1.9 డాలర్లు) కంటే తక్కువలో జీవనాన్ని సాగిస్తుంటే అది దుర్భర దారిద్య్రం కిందకు వస్తుందని ఖరారు చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 188 దేశాల్లో దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు. వారి జీవితాలతో ముడిపడిన అంశాల ఆధారంగా ఆయా దేశాల్లోని పేదరికం తీరుతెన్నులను అంచనా వేశారు. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల దుర్భర దారిద్య్రం ఆఫ్రికా ఖండంలోనే ఉందని ఇందులో తేలింది. ప్రస్తుతమున్న పరిస్థితులే అక్కడ కొనసాగితే 2030 కల్లా ప్రపంచంలోని పదింట తొమ్మిదో వంతు అతి పేదరికం ఆ ఖండంలోనే ఉంటుందని హెచ్చరించింది. ఈ రిపోర్ట్‌లోని అంశాలు...క్లుప్తంగా .. 2030 కల్లా భారత్ దుర్భర దారిద్య్రాన్ని పూర్తిగా రూపుమాపే అవకాశాలున్నాయి 2020 సంవత్సరానికి భారత్‌లో 3 శాతం కంటే తక్కువే పేదలుంటారు దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఫిలిప్పిన్స్, చైనా, పాకిస్తాన్లలో తలసరి ఆదాయ రేటు వృద్ధి చెందడం ఇందుకు ఉపయోగపడుతోంది. పేదరికం నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు భారత్,చైనా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆర్థికవేత్తల మాట అదే... 1991లో భారత్‌లో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు పేదరికాన్ని తగ్గించడంతో పాటు దేశ పురోభివృద్ధికి దోహదపడిందని చెప్పడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ ఎన్ ఆర్ బానుమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం స్థిరమైన ఆర్థిక లక్ష్యాల సాధన అనేది ఓ సవాల్. ఇది 2030 కల్లా కడు పేదరికాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు దోహదపడుతుంది, అయితే మిగిలిన 12 ఏళ్ల పాటు 7–8 శాతం వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని చెప్పారు. -
2030 నాటికి భారత్‌కు విముక్తి!
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి త్వరగా పేదరికం నుంచి విముక్తి పొందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపతున్నారని సర్వే ఒకటి వెల్లడించినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. పేదరికం పెరుగుతున్న దేశాలలో నైజీరియా మొదటి స్థానంలో నిలిచిందని, అక్కడ నిమిషానికి ఆరుగురు పేదరికం బారిన పడుతున్నారని బ్రూకింగ్స్ నిర్వహించి అధ్యయంలో తేలిందని తెలిపింది. ‘ఫ్యూచర్ డెవలప్మెంట్’ పేరుతో ఈ సర్వే నిర్వహించినట్టు బ్రూకింగ్స్ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. సర్వే ప్రకారం.. మే నెల చివరి నాటికి ఇండియాలో 7.3 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు. కాగా నైజీరియాలో 8.7 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారు. అయితే ఇండియాలో ప్రతి నిమిషానికి 44 మంది పేదరికం నుంచి బయటపడుతుండగా, నైజీరియాలో మాత్రం భిన్నంగా ప్రతి నిమిషానికి ఆరు మంది పేదరికం బారిన పడుతున్నారని అని సర్వే పేర్కొంది. 2022 నాటికి ఇండియాలో పేదరికం 3 శాతానికి తగ్గుతుందని, 2030 నాటికి పేదరికం పూర్తిగా తొలగిపోతుందని సర్వే నివేదిక వెల్లడించింది. -
నైజీరియాను గెలిపించిన మూసా
వోల్గోగ్రాడ్: తొలి మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో ఎదురైన ఓటమి నుంచి వెంటనే తేరుకున్న నైజీరియా జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసింది. ఐస్‌లాండ్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో నైజీరియా 2–0తో గెలుపొందింది. అహ్మద్ మూసా 49వ, 75వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి నైజీరియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పటిష్టమైన అర్జెంటీనాను తొలి మ్యాచ్‌లో 1–1తో నిలువరించిన ఐస్లాండ్ రెండో మ్యాచ్‌లో నిరాశపరిచింది. ఆ జట్టుకు 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సిగుర్డ్సన్ వృథా చేశాడు. అతను కొట్టిన కిక్ గోల్‌పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లింది. నైజీరియా విజయంతో గ్రూప్ ‘డి’లో ప్రిక్వార్టర్ ఫైనల్ రెండో బెర్త్ కోసం మూడు జట్లు రేసులోకి వచ్చాయి. 6 పాయింట్లతో క్రొయేషియా ఇప్పటికే నాకౌట్ బెర్త్ దక్కించుకోగా... 3 పాయింట్లతో నైజీరియా రెండో స్థానంలో ఉంది. ఒక పాయింట్‌తో ఐస్లాండ్, అర్జెంటీనా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నైజీరియా ప్రిక్వార్టర్స్‌కు చేరాలంటే ఈనెల 26న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకోవాలి. అర్జెంటీనా మాత్రం భారీ గోల్స్ తేడాతో కచ్చితంగా గెలవాలి. ఐస్లాండ్ ప్రిక్వార్టర్స్‌కు చేరాలంటే 26న క్రొయేషియాపై భారీ గోల్స్ తేడాతో నెగ్గాలి. -
ప్రపంచకప్‌లో క్రొయేషియా శుభారంభం
-
రెండు దశాబ్దాల తర్వాత...
కలినిన్‌గ్రాడ్: రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లోనే క్రొయేషియా జట్టు విజయం రుచిని చూసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–0తో నైజీరియాను ఓడించింది. నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్ గోల్‌తో క్రొయేషియా ఖాతా తెరువగా... 71వ నిమిషంలో కెప్టెన్ మోడ్రిక్ గోల్‌తో క్రొయేషియా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కుతున్న సమయంలో అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్ కొట్టాడు. ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో ఫస్ట్–హాఫ్ కార్నర్ వద్ద ఎటెబో నుంచి బంతి గోల్‌పోస్ట్‌లోకి చేరడంతో నైజీరియాకు సొంతదెబ్బ తగిలింది. దీంతో క్రొయేషియా అయాచిత వరంతో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. నైజీరియా స్ట్రయికర్లను అదేపనిగా ప్రత్యర్థి డిఫెండర్లు నిలువరించారు. దీంతో డెజన్ లొవ్రెన్, ఒడియన్ ఇగాలో గోల్ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. క్రొయేషియా డిఫెండర్లు అలెక్స్ ఐవోబి, బ్రియాన్ ఇడోవులు ప్రత్యర్థి అవకాశాల్ని సమర్థంగా దెబ్బతీశారు. ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టకపోవడం గమనార్హం. నైజీరియా డిఫెండర్ విలియమ్ ట్రూస్ట్ ఎకాంగ్... కార్నర్ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను దురుసుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2–0తో జయభేరి మోగించింది. 2 వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ క్రొయేషియా జట్టు ‘సెల్ఫ్ గోల్’తో ఖాతా తెరువడం విశేషం. 2014లో క్రొయేషియాపై బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో సెల్ఫ్ గోల్ చేయగా... ఈసారి ఎటెబో సాధించాడు. 1 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ‘సెల్ఫ్ గోల్’ చేసిన ఏకైక జట్టుగా నైజీరియా నిలిచింది. చివరిసారి 2014 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టుపై ఇదే విధంగా నైజీరియా సెల్ఫ్ గోల్ సాధించింది. 1 ఇరవై ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం క్రొయేషియాకిదే తొలిసారి. చివరిసారి 1998లో అరంగేట్రం మ్యాచ్‌లో క్రొయేషియా 3–1తో జమైకాను ఓడించింది. -
నైజీరియా సైబర్ నేరస్తుల అరెస్టు
భువనేశ్వర్ ఒరిస్సా : రాష్ట్ర క్రైం శాఖ పోలీసులు నైజీరియా దేశానికి చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల్ని అరెస్టు చేశారు. న్యూ ఢిల్లీలో వీరివుర్ని ఆదివారం అరెస్టు చేశారు. ఒyనైజీరియా సైబర్ నేరస్తుల అరెస్టుశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో వీరివురు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణ. దీర్ఘకాలంగా వీరివురి ఆచూకీ కోసం ఇరు రాష్ట్రాలు గాలిస్తున్నాయి. న్యూ ఢిల్లీలో వీరివురు బస చేసినట్టు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా రాష్ట్ర క్రైం శాఖ పోలీసులు దాడి చేసి నేరస్తుల్ని అరెస్టు చేశారు. లాటరీ అధికారులుగా స్వీయ పరిచయం చేసుకుని ప్రజల్ని నమ్మించి మోసగించడంలో వీరు ఆరి తేరారు. భారీ నగదు, పలు రకాల బహుమానాలు అందజేస్తామని ప్రలోభ పరచి అమాయక ప్రజల బ్యాంకు ఖాతా వివరాల్ని సేకరించి ఆన్లైన్లో నగదు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు రూ. 10.50 లక్షల వరకు దోచుకున్నారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు కోసం వీరివుర్ని ప్రశ్నించనున్నట్టు పోలీసులు తెలిపారు. -
టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కాల్చివేత
ఓ టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. నైజిరియాకు చెందిన డాగెంట్ సిమెంట్ కంపెనీకి కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్న దీప్ కామ్రాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇథియోపియాలో హత్య చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా వారు హత్య చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అడ్డిస్ అబాబాకు తిరుగు ప్రయాణమైన దీప్ కామ్రాను ఓరోమియా ప్రాంతంలో దుండగులు అడ్డగించి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కామ్రాతో పాటు ఆయన సెక్రటరీ, డ్రైవర్ కూడా మరణించినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ దుండగులను పట్టుకోవడానికి సెక్యురిటీ బలగాలు రంగంలోకి దింపినట్టు పేర్కొంది. నైజిరియాకు చెందిన డాంగెట్ కంపెనీ ఆఫ్రికాలో 10 ప్రాంతాల్లో తన కార్యకాలపాలను సాగిస్తోంది. ఇథియోపియాలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారిగా డాంగెట్ కంపెనీ ఉంది. అత్యధిక నైపుణ్యమున్న 32.5, 42.5 గ్రేడ్ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తూ.. మార్కెట్ అవసరాలను ఇది అతి సులువుగా చేధిస్తోంది. -
స్మగ్లర్ అరెస్ట్.. రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ అంతర్జాతీయంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ విదేశీయుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలిలా.. ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాలపై గత కొన్ని రోజులుగా దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఆకస్మిక తనఖీలు చేపట్టిన ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతర్జాతీయంగా హెరాయిన్‌ను విక్రయిస్తున్న ఓ నైజీరియా గ్యాంగ్ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 4 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతి
లాగోస్ : నైజీరియాలోని ముబి పట్టణంలో రెండు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఆత్మాహుతి మసీదు లోపల జరిగిందని, మరో దాడి అదే మసీదుకు సమీపంలో బట్టల మార్కెట్ బయట జరిగిందని అడమావా రాష్ట్ర సమాచార కమిషనర్ అహ్మద్ సాజో పేర్కొన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని స్థానిక అధికారి వెల్లడించారు. -
హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠా ఆట కట్టించారు సైబరాబాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డ్రస్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లతో పాటు ఓ ముంబై మహిళను అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ ఫ్రెండ్స్ కాలనీలో కొకైన్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు... సైబరాదాద్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. తమ తనిఖీల్లో ఇద్దరు నైజీరియా వ్యక్తులను, ఓ ముంబై మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొకైన్ విలువ 4 లక్షల రూపాయలు ఉంటుంది. సైజీరియాకు చెందిన ఎమ్మాన్యుల్ ఉముడు (43) ఏ1, ఇదుష్ ప్లస్ (45) ఏ2 లు బిజినెస్ వీసా మీద కొన్నేళ్ల కిందట భారత్‌కు వచ్చి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మాన్యుల్-ఏ1, లీలా శివకుమార్ (37) ఏ3 ని వివాహం చేసుకున్నాడు. వీరు గ్రాముకు రూ.4000 నుంచి రూ.5000 ధరకు కొకైన్‌ను విక్రయించేవారు. గతేడాది డిసెంబర్లో తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కు వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఎమ్మాన్యుల్-లీలా శివకుమార్‌లు నగరానికి మకాం మార్చారు. తమకు అందిన సమాచారంతో పుప్పలగూడలోని ఫ్రెండ్స్ కాలనీ, సాయి బాలాజీ రెసిడెన్సీలో ఆకస్మిక దాడులు చేపట్టిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. -
చేపల మార్కెట్లో ఆత్మాహుతి దాడి
అబుజా : ఆత్మాహుతి దాడితో నైజీరియాలో రక్తపాతం చోటు చేసుకుంది. ఈశాన్య ప్రాంత పట్టణం మైడుగురిలోని ఓ చేపల మార్కెట్లో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ మారణ హోమంలో 18 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాంబు దాడి చోటు చేసుకున్నట్లు బోర్నో పోలీస్ కమిషనర్ తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 18 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. 2015లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ సైనిక పాలకుడు ముహమ్మదు బుహారీ.. ఇస్లాం ఉగ్రవాద సంస్థ బోకో హరామ్‌ను కట్టడి చేస్తానని.. పౌరులకు రక్షణ కల్పిస్తానని ప్రకటించాడు. అయినప్పటికీ ఉగ్రదాడులను కట్టడి చేయలేకపోయాడు. ఐసిస్ తో విలీనం అయ్యాక ఆ సంస్థ దాడులను మరింతగా ఉధృతం చేసింది. -
నైజీరియన్ల ఘరానా మోసం
బనశంకరి : సిలికాన్‌సిటీలో ఆన్లైన్ వంచకుల మోసాలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్రోగ నివారణకు తక్కువ ధరతో హెర్బల్‌సీడ్స్ అందిస్తామని చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నైజీరియన్లు మోసగించిన సంఘటనన శుక్రవారం వెలుగుచూసింది. నగరానికి చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్‌కు క్యాన్సర్ రోగానికి హెర్బల్‌సీడ్స్ అందిస్తామని చెప్పి నైజీరియాకు చెందిన కొందరు ఫోన్లో సంప్రదించారు. వీరి మాటలు నమ్మిన రవికుమార్ వారి సూచన మేరకు రూ. 20 లక్షల నగదు వారి ఖాతాకు జమచేయించుకున్నారు. అనంతరం హెర్బల్ సీడ్స్ అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన శుక్రవారం రవికుమార్ సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోల్‌కతా విమానాశ్రయంలో కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ విదేశీయుడిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.కోటి విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ 170 గ్రాములు ఉంటుందని, కెవిన్ ఎడ్వర్డ్ అనే ఇతను ఇక్కడి నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం ముంబై నుంచి వచ్చిన విమానంలో ఇక్కడికి వచ్చాడని కోల్‌కతా జోనల్ డైరెక్టర్ దిలీప్ కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం ఇక్కడ వివరించారు. నిందితుడు ఢిల్లీలోని ఐజీఐ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మన దేశంలోకి వచ్చాడని, అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. ముంబైలో ఉంటున్న మరో నైజీరియన్ జాన్ అలియాస్ టోనీ ఇతనికి ఈ పని అప్పగించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం!
లాగోస్: నూతన సంవత్సరం రోజున నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలోని జింగ్వా, ఒగున్ రాష్ట్రాలో ఈ దుర్ఘటనలు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. జింగ్వా రాష్ట్రంలో బస్సు– ట్రక్కు ఢీకొనడంతో 15 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఏడుగురు ఎక్కాల్సిన వాహనంలో 14 మంది ప్రయాణికులు ఎక్కడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు వివరించారు. ఒగున్ రాష్ట్రంలో జరిగిన మరోక ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కమాండ్ అధికారి తెలిపారు. -
బంజారాహిల్స్‌లో కలకలం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో అయ్యప్ప దేవాలయం పక్కన ఉన్న మెట్లపై నుంచి అర్ధరాత్రి ఓ నల్లజాతి యువకుడిని అదే జాతికి చెందిన నలుగురు యువకులు కాళ్లను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్తూ తమతో పాటు తీసుకొచ్చిన కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. తాను రానంటూ సదరు యువకుడు ఏడుస్తూ పారిపోవడానికి యత్నిస్తుండగాపట్టుకొని కాళ్లకు తాళ్లు వేసి ఈడ్చుకెళ్లి కారులో(ఏపీ 10బీఈ 5107) కూర్చోబెట్టారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీరు ఎవరైందీ, పోలీసులు కారు నంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా ఆ కారు నంబర్ తప్పు అని తేలింది. ఆ యువకులు ఎవరు.? తీసుకెళ్లిన నల్లజాతీయుడు ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నైజీరియాలో దాడి: 50 మంది మృతి
కానో: ఈశాన్య నైజీరియాలోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇది బోకోహరమ్ ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు. అడమవా రాష్ట్ర రాజధాని యొలా ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంగువర్ షువా ప్రాంతంలోని మదీనా మసీదులో మంగళవారం ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ప్రార్థన చేసేవారితో కలసి వచ్చిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఇరాక్‌లో 32 మంది మృతి: ఇరాక్‌లోని తుజ్ ఖుర్మాటు పట్టణంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 32 మంది మృతిచెందగా, 80 మంది గాయపడ్డారు. జనంతో రద్దీగా ఉన్న ఓ కూరగాయల మార్కెట్లోకి కారులో వచ్చిన దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. -
ముంబై వీధుల్లో చేజింగ్!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వీధుల్లో చేజింగ్ చేశారు. ఓ వ్యక్తిని సీబీక్యూ సీడ్స్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ కోసం పరుగులు పెట్టారు. దాదాపు కిలోమీటరున్నర వెంటాడిన తర్వాత నేరగాడిని పట్టుకోగలిగారు. నిందితుడిని నగరానికి తరలించిన పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో నివసించే ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అమెరికాకు చెందిన డాక్టర్ వెన్నిస్సా విల్సన్ పేరుతో పరిచయం చేసుకున్న ఓ యువతి తమకు సీబీక్యూ సీడ్స్ సరఫరా చేయాలని కోరింది. ఈ విత్తులు న్యూజిలాండ్, భారత్‌ల్లో మాత్రమే లభిస్తాయంటూ చెప్పింది. లాభాల్లో 50 శాతం వాటా ఇస్తాననడంతో ఈ వ్యాపారం చేయడానికి బాధితుడు అంగీకరించాడు. దీంతో విల్సన్ సదరు విత్తుల్ని మీరాశర్మ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తుందంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. బాధితుడు ఆ నంబర్లో సంప్రదించగా.. మీరాశర్మగా మాట్లాడిన యువతి 500 గ్రాములకు రూ.1.85 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తం జమ చేయమంటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చింది. గత నెల 23న బాధితుడు ఆ ఖాతాలోకి నగదు జమ చేశాడు. ఇది జరిగిన ఐదు రోజులకు కొరియర్లో నకిలీ విత్తనాలు వచ్చి చేరాయి. ఆపై మోసగాళ్ల నుంచి స్పందన కరువు కావడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.హరినాథ్ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ముంబై వెళ్లారు. అయితే బ్యాంకు రికార్డుల్లో ఉన్నది నకిలీ అడ్రస్‌గా తేలింది. ఇదిలా ఉండగా.. బాధితుడికి నిందితుల నుంచి ఓ సందేశం వచ్చింది. విత్తనాలు తీసుకుని ముంబై వస్తే వాటిని పరీక్షించి సర్టిఫికేషన్ చేయిద్దామంటూ అందులో ఉంది. దీంతో బుధవారం అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముంబైలోని భాండ్వా కుర్లా కాంప్లెక్స్ వద్ద కాపు కాసింది. అక్కడకు వచ్చిన ఓ నైజీరియన్‌ను పట్టుకోవ డానికి ప్రయత్నించగా అతడు పారిపోయే ప్రయ త్నం చేశాడు. దీంతో అతడిని వెంటాడిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు కిలోమీటరున్నర ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడు నైజీరియా నుంచి వచ్చి ముంబైలో ఉంటున్న అబ్దుల్ మహ్మద్ అలీగా గుర్తించారు. అతడిని నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
మనుషులేనా? దారుణం.. గొడ్డును బాదినట్లే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాలవ్యనగర్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ నైజీరియన్‌ను స్థానికులు గొడ్డును బాదినట్టు బాదారు. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడిన కనికరం చూపకుండా స్తంభానికి కట్టేసి చావబాదారు. ఈ దారుణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని మాత్రం అరెస్టు చేశారుగానీ, అతడిని కొట్టినవారిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. మాలవీయ నగర్‌లోని కృష్ణ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గత నెల (సెప్టెంబర్) 24న ఉదయం దొంగతనం జరిగింది. అయితే, అది చేసింది ఆ నైజీరియనేనని, అతడు దొంగతనం చేసి వస్తుంటే మెట్లు జారి కింద కూడా పడ్డాడని పోలీసులకు చెప్పారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ప్రకారం అతడిని ఓ స్తంభానికి కట్టేశారు. ఓ వ్యక్తి అతడి కాళ్లకు కూడా తాడు కట్టి పశువును పట్టుకున్నట్లు పట్టుకోగా మిగితా వారంతా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అక్కడే ఉన్న ఇంకొందరైతే కత్తితీసుకొని వాడి చేయి నరికేయండి అంటూ కూడా కేకలు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు నైజీరియన్‌ను బాదుతున్న వీడియో -
కిడ్నీకి రూ.కోటి!
సాక్షి, హైదరాబాద్ : అవయవాలు ఖరీదు చేస్తామం టూ ఓ నైజీరియన్ సైబర్ నేరగాడు ఎరవేసి అందినకాడికి కాజేశాడు. అపోలో హాస్పిటల్స్ 220 ఎట్ జీమెయిల్.కామ్ పేరుతో ఈ–మెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఫేస్బుక్లో ఖాతా తెరిచాడు. బోగస్ ధ్రువీకరణలతో కొన్ని సిమ్‌కార్డులు సైతం తీసుకుని వీటి ఆధారంగా వాట్సాప్ ఖాతాలు కూడా తెరిచాడు. ఈ మేరకు మానవ అవయవాలు కొంటామంటూ వివిధ సోషల్‌మీడియాల్లో ప్రకటన లు ఇచ్చాడు. వీటికి ఆకర్షితులై సంప్రదించినవారి తో చాటింగ్ చేస్తూ బేరసారాలు చేశాడు. తాను విదేశంలో ఉన్నానని, కిడ్నీ గరిష్టంగా రూ.కోటి వెచ్చించి ఖరీదు చేస్తానని, ఇతర వ్యవహారాలను మొత్తం తానే పర్యవేక్షిస్తానంటూ నమ్మించేవాడు. రేటు ఖరారైన తర్వాత సదరు నేరగాడు నగదుతో ఇతర దేశం నుంచి బయలుదేరుతున్నట్లు సమాచా రమిస్తాడు. ఆ తర్వాత షరామామూలే. ఒకటి, రెండు రోజులకు విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ‘విక్రేత’కు ఫోన్ వస్తుంది. పలానా వ్యక్తి పలానా దేశం నుంచి భారీ మొత్తంతో వచ్చి తమ విమానాశ్రయంలో దిగాడని, అంత డబ్బుతో ఎయిర్పోర్ట్ దాటి బయటకు రావాలంటే వివిధ రకాలైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. దీని కోసం కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలు అందించి కస్టమ్స్, యాంటీ టెర్రర్ ట్యాక్స్‌ల పేరుతో డిపాజిట్ చేయించుకుని స్వాహా చేస్తున్నారు. అసలే ఆర్థిక సమస్యలు/అవస రాల్లో ఉండి తమ అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన బాధితులు ఈ మోసాలతో మరింత కుదే లవుతున్నారు. తమ ఆస్పత్రి పేరుతో ఓ ఐడీ సృష్టించిన కొందరు అవయవాల కొనుగోలు పేరుతో దందా ప్రారంభించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అపోలో ఆస్పత్రి యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగళూరు కేంద్రంగా ఓ వ్యక్తి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లగా, ఆ నేరగాడు నైజీరియన్ అని తేలింది. అతడు ఇటీవలే తమ దేశానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. అతడు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తితో బేరసారాలు చేశాడని బయటప డింది. అతడి కిడ్నీని రూ.కోటికి ఖరీదు చేస్తానం టూ చెప్పి.. ఎయిర్పోర్ట్ కథ నడిపి రూ.30 లక్షలు స్వాహా చేశాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిం చారు. దీనిపై ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
ఘనంగా నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
తూర్పుగోదావరి, మారేడుమిల్లి (రంపచోడవరం) : మండలంలోని జలతరంగిణి జలపాతం వద్ద ఆదివారం నైజీరియా దేశం 57వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆ దేశ యువతీయువకులు అదివారం ఘనంగా జరుపుకొన్నారు. రాజానగరం గైట్, సూరంపాలెం అదిత్య, శ్రీప్రకాష్తోపాటు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న నైజీరియా దేశానికి చెందిన పలువురు అక్టోబర్ ఒకటో తేదీని తమ దేశానికి స్వాతంత్య్ర వేడుకలను మారేడుమిల్లిలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారంతా ఇక్కడికి వచ్చారు. సుమారు 50 మంది యువత ఆట పాటలతో జలపాతంలో కేరింతలు కొట్టారు. అనంతరం వారి దేశ జాతీయ గీతాన్ని పాడుతూ కేక్ కట్ చేశారు. -
ఆన్లైన్ మోసం.. నైజీరియన్ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న డెస్మండ్ ఓఈబో అనే నైజీరియా దేశస్తుడిని రాప్తాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రా ప్తాడు మండల పరిధిలోని రేణుకా గేటెడ్ కమ్యూనిటీ టౌన్ షిప్లో కవిత, మారుతి దంపతులు నివసిస్తున్నారు. భర్త మారుతి అనంతపురంలో చికెన్ వ్యాపారం చేస్తుండగా భార్య కవిత ఇంట్లోనే చీరల వ్యాపారం చేస్తోంది. ఇద్దరికీ వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. అప్పుల నుంచి గట్టెక్కాలని వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆన్లైన్లో కిడ్నీ ఇస్తే రూ.కోటి ఇస్తామని నమ్మబలుకుతూ డాక్టర్ అమర్ పేరున ఒక ప్రకటన కనిపించింది. దీంతో వారు అందులో ఇచ్చిన 80507 73651 నెంబర్‌కు ఫోన్ చేశారు. ఆ వ్యక్తి సూచన మేరకు రూ.11 వేలు చెల్లించి రిజష్టర్ చేసుకున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయ ని, రకరకాల సర్టిఫికెట్లు అవసరమవు తాయని ఆ వ్యక్తి చెప్పి నమ్మించడంతో వారు దశలవారీగా రూ.37, 62,900 ఆన్లైన్లోనే చెల్లించారు. చివరకు అనుమానం వచ్చి అతడిని గట్టిగా అడగడంతో కిడ్నీ ఇవ్వకనే రూ.కోటి ఓ వ్యక్తి ద్వారా పంపుతామని చెప్పారు. ఆ మేరకు ఇటీవల ఒకతను కవిత ఇంటికి వచ్చి తాను డెస్మండ్ ఓఈబోనని, తన వద్దనున్న సూట్‌కేసులో కోటి రూపాయల మేర రూ.2వేల నల్లనోట్లు ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. కెమికల్ వాడితే ఆ నల్లనోట్లు అసలైన రూ.2వేల నోట్లుగా మారతాయని చెప్పి తన జిమ్మిక్కుతో ఓ మూడు నోట్లను అలా మార్చి నట్లు చూపి నమ్మించాడు. ఈ కెమికల్ బాటిల్ కావాలంటే రూ.15.50 లక్షలు అవుతుందన్నాడు. దీంతో వారు బెంగళూరుకెళ్లి అతని చేతికి రూ.11.50 లక్షలు అందజేసి ఆ బాటిల్ తెచ్చుకున్నారు. ఇంటికొచ్చే లోపు అది పగిలిపోయింది. మరో కెమికల్ బాటిల్ కావాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. వీళ్లు అంగీకరించడంతో సెప్టెంబర్ 23న తానే స్వయంగా కెమికల్ బాటిల్ తీసుకొస్తానని నమ్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ నల్లనోట్లను బాగా పరిశీలించి అవి కేవలం నల్ల కాగి తాలేనని, తాము మోసపోయామని తెలు సుకున్నారు. ఈనెల 17న రాప్తాడు పోలీ సులను ఆశ్రయించారు. చెప్పినట్లే వచ్చిన నైజీరియన్వాసిని ఇటుకలపల్లి ఇన్చార్జ్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ ధరణీబాబు తదితరులు రేణుకా గేటెడ్ టౌన్షిప్ వద్ద అరెస్ట్ చేశారు. విచారించగా డాక్టర్ అమర్పేరున ఇచ్చిన ప్రకటన తనదేనని అంగీకరించాడు. నైజీరియాకు చెందిన తాను 2014 నవంబర్ 11న స్టూడెంట్ వీసా కింద ఏడాది అనుమతితో బెంగుళూరుకు వచ్చానని చెప్పాడు. అయితే వీసా గడువు ముగిసినా అనధికారికంగా బెంగూళురులోనే ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడాలని పథకం రచించినట్లు అంగీకరించాడు. అందులో భాగంగా కవిత, మారుతిలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
పది మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలి కమీషనర్ కార్యాలయంలో రాచకొండ జాయింట్ కమీషనర్ తరుణ్‌జోషి మీడియాతో మాట్లాడారు. నిందితుల వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, 8 పాస్‌పోర్ట్‌లు, 25 సెల్ఫోన్లు, 15 డేటా కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీ ఫోన్ నెంబర్ లక్కీ డ్రాలో ఎంపిక అయిందని మాయమాటలు చెప్పి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. -
రెచ్చిపోయిన బొకోహరాం మిలిటెంట్లు
మైదుగురి : నైజీరియాలో బొకోహరాం మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరుగునే ఉన్న కామెరూన్లో తీవ్రవాద కార్యకలాపాలతో నిరాశ్రయులైన వారికి మైదుగురి సమీపంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఇక్కడి శిబిరాల్లో సుమారు 80 వేల మంది నైజీరియా పౌరులు తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో బొకోహరాంనకు చెందిన తీవ్రవాదులు ఈ శిబిరాలపై కాల్పులు జరపటంతో ఏడుగురు చనిపోయారు. రాత్రివేళ కావటంతో అందరూ నిద్రిస్తున్నారని, అందుకే మృతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. -
గొంతులు కోసి.. కాల్పులు జరిపి భయానకంగా..
మైదుగురి : నైజీరియాకు చెందిన ముస్లిం తీవ్రవాద సంస్థ బొకో హరామ్ మరోసారి రెచ్చిపోయింది. గ్రామాలపై విరుచుకుపడి ఏకంగా 27మంది అమాయక పౌరులను హత్య చేసింది. ఎన్గాన్‌జయి, గుజామల గ్రామాలపై శుక్రవారం సాయంత్రం బొకోహరామ్ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా 15 మంది పౌరులను గొంతులు కోసి హతమార్చారు. మరికొందరిని చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపి తీవ్రవాదులు చంపేశారు. స్థానికుల ఇళ్లకు సైతం మంటలు పెట్టి పైశాచిక పర్వం కొనసాగించారు. ఈ దుర్ఘటన అనంతరం సైన్యం ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిందని అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు...
న్యూఢిల్లీ: దేశం నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి రాగా, అందుకు కారణమైన ఓ విదేశీయుడు పారిపోతూ ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛత్రర్పూర్ ఎన్క్లేవ్ ఫేజ్-1 లోని ఓ అపార్ట్మెంట్లో నైజీరియాకు చెందిన సైప్రియన్ అమ ఒగ్బోన్నయా(40) అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీం మెరుపు దాడి నిర్వహించింది. పోలీసులు రావటం గమనించిన అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వేరే దారి లేకపోవటంతో నాలుగో అంతస్థు కిటికీ నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎయిమ్స్ కు తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. సైప్రియన్ కిటీకిలోంచి దూకిన దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదుకాగా, ‘ఓ వ్యక్తి హెల్మెట్ తో నాలుగో అంతస్థు నుంచి దూకాడని, మధ్యలో ఎయిర్ కండినర్ ను ఢీకొట్టడంతో అది ఊడి నేలపై పడి తీవ్రంగా గాయపడ్డాడని’ ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. ఆ సమయంలో ఒగ్బోన్నయా వెంట మరో ఇద్దరు మహిళలు ఉన్నారని, అతని వెంటే వాళ్లు కూడా దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఢిల్లీ ప్రత్యేక సెల్ అధికారి ప్రమోద్ కుష్వాహా పేర్కొన్నారు. సుమారు 25 కిలోల కెటామైన్ అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనపరుచుకోగా, అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువ 20 కోట్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసు కింద ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రమోద్ వెల్లడించారు. ఇంతకు ముందు నగరంలో ఇలాగే ఓ నైజీరియన్ ముఠా డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు బిల్డింగ్ పై నుంచి పారిపోయింది. -
నైజీరియన్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : డ్రగ్స్ పై నిఘా పెట్టిన పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న నైజీరియన్స్ ఇళ్లలో గురువారం పోలీసుల సోదాలు నిర్వహించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిధిలో వీసాలేని పలువురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాచకొండ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తున్నారు. వీసా గడువులు ముగుసినప్పటికీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు గాబ్రియేల్‌ను పోలీసులు కౌకూర్ ప్రాంతంలోని యాప్రాల్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి కొకైన్, హెరాయిన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ డ్రగ్స్ రాకెట్లో గాబ్రియేల్ కీలక నిందితుడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అతడు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడి ప్రియురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాబ్రియేల్ రెండేళ్ల బిజినెస్ వీసాపై హైదరాబాద్ వచ్చినట్టు వెల్లడైంది. వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే అతడు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. గతంలో పోలీసులకు పట్టుబడి బెయిల్‌పై అతడు బయటికొచ్చాడు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో నైజీరియన్లు ఉంటున్న ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో 6 వేలకుపైగా, సైబరాబాద్ రాచకొండ పరిధిలో 4 వేల మందిపైగా నైజీరియన్లు ఉన్నట్టు గుర్తించారు. వీసా గడువు తీరిపోయిన వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. -
లేడీ డాన్ సంగీత ఉచ్చులో బడా ‘బాబు’లు
హైదరాబాద్ : నైజీరియన్ డ్రగ్స్ ముఠా కేసులో అరెస్ట్ అయిన లేడీ డాన్ సంగీత పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో అనేక విషయాలు వెలుగు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంగీతకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆమె ఓ వైపు డ్రగ్స్ విక్రయిస్తూనే మరోవైపు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే తన మాట వినకపోతే యువతుల న్యూడ్ ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రియుడు జాన్‌తో కలిసి సంగీత నగర శివారులోని ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ సప్లయి చేసేది. బంజారాహిల్స్‌కు చెందిన పలువురి ప్రముఖుల పిల్లలు ఆమె ఉచ్చులో ఉన్నట్లు విచారణలో వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించి ఆరుగురిని ప్రశ్నించిన పోలీసులు, వారి రక్త నమూనాలును సేకరించారు. కాగా విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్బుక్లో సూడాన్‌కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్‌కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్‌సిటీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్‌షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్‌లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే గతనెల 23న ఎల్బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్‌ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్‌ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లోని తిరు అపార్ట్మెంట్లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
పెళ్లి పేరుతో రూ.2.32 లక్షలు స్వాహా
♦ అమెరికా వాసినంటూ ఎర వేసిన నైజీరియన్ ♦ సహకరించిన వ్యక్తినీ పట్టుకున్న సైబర్ కాప్స్ హైదరాబాద్: మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకుని, తాను అమెరికాలో పని చేస్తున్న ఇంజినీర్‌గా నమ్మించి, అందినకాడికి దండుకుని మోసం చేసిన నైజీరియన్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి సహకరించిన ఢిల్లీ వాసినీ పట్టుకున్నట్లు ఏసీపీ కేసీఎస్ రఘువీర్ మంగళవారం తెలిపారు. నైజీరియాకు చెందిన పైస్ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన పేరును దీపక్పటేల్గా పేర్కొంటూ జీవన్‌సాథి. కామ్ అనే మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. దీని ఆధారంగా సిటీకి చెందిన ఓ యువతికి రిక్వెస్ట్ పంపాడు. కొన్ని రోజుల పాటు ఫోన్లు, వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరిపిన తరువాత ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలని, తాను అమెరికాలోనే పుట్టానని, ప్రస్తుతం అక్కడే ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు యువతిని నమ్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఫోన్ చేసిన పైల్ తాను హైదరాబాద్ వస్తున్నానని, కలుద్దామంటూ చెప్పాడు. ఆ మరుసటి రోజు కాల్ చేసిన నైజీరియన్ తాను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చానని, తన వెంట భారీ లగేజ్ ఉండటంతో అధికారులు అడ్డుకున్నట్లు తెలిపాడు. వివిధ పన్నుల నిమిత్తం రూ.45 వేలు చెల్లించాలని కోరిన అతను తాను తిరిగి వచ్చాక ఇచ్చేస్తాంటూ ఓ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయించుకున్నాడు. సదరు ఖాతా తన వ్యవహారాలను పర్యవేక్షించే ఏజెంట్‌కు చెందినదని నమ్మించాడు. మరుసటి రోజు సదరు యువతికి ఫోన్ చేసిన ఓ మహిళ తాను ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారిగా చెప్పుకుని దీపక్పటేల్ తన వెంట భారీ మొత్తం డబ్బు తీసుకువచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని, విడిచిపెట్టడానికి పన్ను చెల్లించాలంటూ రూ.55 వేలు డిమాండ్ చేసింది. దీనిని పైల్ కూడా ఖరారు చేయడంతో బాధితురాలు వారు చెప్పిన ఖాతాలో మరో రూ.55 వేలు డిపాజిట్ చేసింది. ఇలా అనేక కారణాలు చెబుతూ నైజీరియన్ నగర యువతి నుంచి మొత్తం రూ.2.32 లక్షలు వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేయించాడు. ఎట్టకేలకు మోసపోయినని గుర్తించిన బాధితురాలు సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎస్సైలు కృష్ణ, మధుసూదన్, కానిస్టేబుళ్లు సతీష్, విజయ్‌కుమార్, సలీం దర్యాప్తు చేపట్టి బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రత్యేక బృందం తొలుత పైల్‌కు సహకరించిన ఢిల్లీని తిలక్‌నగర్ వాసి హరిసింగ్‌ను పట్టుకుంది. ఇతడు చెప్పి వివరాల ఆధారంగా పైల్‌ను అరెస్టు చేశారు. -
సీవో అంటే కొకైన్.. బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి
- డ్రగ్స్ రవాణా, వ్యభిచారం చేస్తున్న నైజీరియన్ ముఠా అరెస్టు - రూ.2 లక్షల నగదు, 8 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం - డ్రగ్స్, యువతుల సమాచారాన్ని డైరీలో కోడ్ భాషలో రాసుకున్న నైజీరియన్లు సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రవాణా, వ్యభిచారానికి పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు నైజీరియన్లతోపాటు వారికి సహకరిస్తున్న విజయవాడకు చెందిన ఓ మహిళను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి 2,04,000 నగదుతో కలుపుకొని రూ.9,70,000 విలువ చేసే 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 39.8 గ్రాముల అంఫిటమైన్ ట్యాబ్లెట్లు, 1.675 కిలోల గంజాయి, 3 ల్యాప్‌టాప్‌లు, 6 పాస్‌పోర్టులు, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఫేస్బుక్లో పరిచయం నుంచి.. విజయవాడకు చెందిన పాలపర్తి సంగీతకు పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఫేస్బుక్లో సూడాన్‌కు చెందిన ఓ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి సంగీత హైదరాబాద్‌కు మకాం మార్చగా.. ఆ సూడాన్ స్నేహితురాలి ద్వారా నైజీరియాకు చెందిన ఒజుకు కాస్మోస్, అతడి స్నేహితులతో పరిచయమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి వారితో కలసి డ్రగ్స్ అక్రమ రవాణాలో భాగస్వామిగా మారింది. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని బండ్లగూడ సన్‌సిటీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఒజుకు కాస్మోస్తో కలసి ఉంటోంది. కాస్మోస్ గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్‌షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్లను తీసుకొచ్చి... తన స్నేహితులు జాన్ ఒకొరి, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలసి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు. సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్‌లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. పక్కా సమాచారంతో.. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్వోటీ, ఎల్బీ నగర్ పోలీసులు నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎల్బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్‌ను అదుపులోకి తీసుకుని.. మూడు గ్రాముల కొకైన్, 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు.. సన్సిటీలోని నివాసంలో దాడి చేసి కాస్మోస్‌ను అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాస్మోస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ జిల్లా యాప్రాల్‌లోని తిరు అపార్ట్మెంట్లో, సిరిల్ అనే ముఠా సభ్యుడి నివాసంలో కార్డన్ సెర్చ్ చేపట్టి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కోడ్ లాంగ్వేజ్‌తో రాతలు సీవో అంటే కొకైన్.. బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి.. నైజీరియన్ ముఠా సభ్యులు తమ దందాలను కోడ్ భాషలో రాసుకునే పదాలివి. వారు నైజీరియన్ యువతులతో యాప్రాల్ కేంద్రంగా.. కుషాయి గూడ, ఏఎస్రావు నగర్, జవహర్‌నగర్, నేరేడ్ మెట్లలో వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు గాబ్రిల్ కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాకు గోవాలోని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్టు తేలింది. దీనిపై పోలీసులు గోవా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసుల్లో అరెస్టైన వారికి, ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న దిశగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ : నగర శివారలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లతో పాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షలతో పాటు భారీగా ఎల్ఎస్డీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నైజీరియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడు. వీరందరినీ పోలీసులు రహస్యప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా ప్రేమికుల ముసుగులో గత కొంతకాలంగా వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.