
హల్‌చల్ చేస్తున్న నైజీరియన్ విద్యార్దులు
కాజీపేట : నిట్‌లో చదువుతున్న నైజీరియన్ విద్యార్థులు రూ.5 కోసం ఆటో డ్రైవర్‌పై దాడి చేయడమేగాక నడిరోడ్డుపై హల్‌చల్ సృష్టించిన ఘటన కాజీపేటలోని నిట్ ఎదుట సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిట్‌లో పీజీ చ దువుతున్న ముగ్గురు నైజీరియన్లు హన్మకొండలోని పోలీసు హెడ్‌క్వార్టర్ ఎదుట ఆటో ఎక్కారు. వారిలో ఒకరు రోహిణి ఆస్పత్రి వద్ద దిగిపోగా ఇద్ద రు నిట్ ఎదుట దిగి ఆటో డ్రైవర్ బాలుకు రూ.50 నోటు ఇచ్చారు. ఆటో డ్రైవర్ తిరిగి రూ.5 చేతిలో పెట్టగా రూ.10 వస్తాయంటూ గొడవకు దిగారు.
ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా ఆటో డ్రైవర్ బాలుతోపాటు వారి పై విద్యార్థులు చేయి చేసుకున్నారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాటసారులు 100 డయల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా ఆ సమయంలో హన్మకొండ వైపు వెళ్తున్న మడికొండ సీఐ సంతోష్ గొడవను చూసి వచ్చా రు.
పోలీసులను చూసి కూడా వెనక్కి తగ్గకుండా రెచ్చి పోతున్న నైజీరియన్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని కాజీపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఘటన జరుగుతున్నప్పుడు ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన విలేకరులపై కూ డా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడితో కలిసి ప్రయాణికులు ఫిర్యాదు చేయగా ఎస్సై సాంబమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment