Warangal NIT
-
ప్యాకేజీలో తగ్గేదేలే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆకర్షణీయ వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థులకు వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్ఐటీ) అడ్డా గా మారింది. నిట్ వరంగల్‌లో సీటు వచి్చందంటే ఉద్యోగంతోనే బయటకి అడుగుపెడుతామన్న భరోసా విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఇక్కడి విద్యార్థి అన్ని రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారనే భావనతో ప్రభుత్వ రంగం సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎన్ఐటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు, రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్‌లో‘నిట్’ విద్యార్థుల జోరు ∙నిట్ వరంగల్‌లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రతీ ఏడాది జోరు కొనసాగిస్తున్నారు. » ఈ ఏడాది బీటెక్‌లో 82 శాతం, ఎంటెక్ 62.3 శాతం, ఎంసీఏ 82.6 శాతం, ఎమ్మెస్సీ 80 శాతం, ఎంబీఏలో 76 శాతం విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. » మొత్తంగా 1,483 మంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో 1,128 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. » నాలుగేళ్లలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌ను పరిశీలీస్తే ఏటేటా కొలువులు పొందుతున్న సంఖ్య పెరుగుతోంది. » 2020–21లో క్యాంపస్ సెలక్షన్స్ కోసం 186 కంపెనీలు పాల్గొంటే.. 815 మంది విద్యార్థులు ఎంపిక కాగా, అత్యధికంగా రూ.52లక్షల ప్యాకేజీ వచ్చింది. » 2021–22లో 1,108, 2022–23లో 1,404 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. ఈ ఏడాది 1,128 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ లభించింది.ప్లేస్‌మెంట్స్,ప్యాకేజీలలోతగ్గేదేలే..ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోయి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండగా సంక్షోభాన్ని తలదన్ని తమ ప్రత్యేకతను చాటుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు నిట్ విద్యార్థులు. గతేడాది సీఎస్ఈ విభాగానికి చెందిన ఆదిత్య సింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీని అత్యధికంగా సాధించగా, ఈ ఏడాది ఈసీఈ విద్యార్థి రవీషా తన సత్తాను చాటి రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఆనవాయితీని కొనసాగించాడు. అదే విధంగా 12 మంది రూ.68 లక్షల వార్షిక ప్యాకేజీ, తక్కువలో తక్కువగా రూ.15.6 లక్షల వార్షిక ప్యాకేజీని మిగతా విద్యార్థులు సాధించారు.గతేడాది 250..ఇప్పుడు 278..నిట్ క్యాంపస్‌లో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు గతేడాది 250కి పైగా కంపెనీలు రాగా ఈ ఏడాది 278 ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు ఆసక్తి కనబరిచాయి. ఇక్కడి విద్యార్థులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రాడక్ట్స్ అనాలిసిస్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, కన్సల్టెంట్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఎంపిక చేశారు.ఉత్తమ బోధనతోనే.. నిట్ వరంగల్‌లోని అధ్యాపకుల అత్యుత్తమ బోధనతోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో యూఎస్‌కు చెందిన సోర్బ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీనిసాధించా. మాది పంజాబ్‌లోని లూథియానా.. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నిట్ వరంగల్‌లో సీటు సాధించి, ఉన్నత ఉద్యోగానికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. - రవిషా, ఈసీఈ, రూ.88 లక్షల ప్యాకేజీఎంటర్ప్రెన్యూర్గాఉద్యోగావకాశాలు కల్పిస్తా..మాది మహారాష్ట్ర. వరంగల్‌లో నిట్‌లో సీటు వచ్చినప్పుడు ఎంతో భయంగా ఉండేది. ఇక్కడి అధ్యాపకుల ప్రోత్సాహం, విద్యార్థుల సహకారంతో బీటెక్‌లో ఈసీఈ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్‌లో హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.64లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాను. ఎంబీఏ చేసి ఎంటర్పెన్యూర్గా ఓ పరిశ్రమను స్ధాపించి నా తోటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే నా లక్ష్యం. – మీత్ పోపాట్, ఈసీఈ, రూ.64లక్షల ప్యాకేజీ -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తొలగింపు
తాడేపల్లిగూడెం: ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థ ఏపీ నిట్ డైరెక్టర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న సస్పెండైన నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావును టెర్మినేట్ చేసింది. కాగా, వరంగల్ నిట్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు ఏపీ నిట్‌కు డైరెక్టర్‌గా 2018 మార్చి 19న బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం లేదా 70 ఏళ్ల వయస్సు.. ఏది ముందైతే అప్పుడు డైరెక్టర్ పదవి నుంచి తొలగిపోవచ్చు. ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా, ఇంకా వయస్సు ఉంటే మరోసారి డైరెక్టర్‌గా అవకాశం తెచ్చుకోవచ్చు. నిట్ తాత్కాలిక ప్రాంగణం నుంచి సొంత భవనానికి వచ్చే సరికి సీఎస్పీ రావుపై అభియోగాలు మొదలయ్యాయి. రావుకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నిట్ రెండు, మూడో స్నాతకోత్సవాలు జరిగాక రావు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, రాష్ట్రపతి భవన్, కేంద్ర ఉన్నత విద్యా శాఖ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి, ఈ ఏడాది మార్చిలో 60వ పుట్టిన రోజు వేడుకలను సీఎస్పీ రావు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఆ మరునాడే సీబీఐ కేసులు నమోదు కావడం, సీఎస్పీ రావు సస్పెండ్ కావడం జరిగింది. జూన్ 27న సస్పెన్షన్‌ను మరో 90 రోజులు పొడిగించారు. ఇదే సమయంలో సీఎస్పీ రావుపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై విచారణకు రాష్ట్రపతి కార్యాలయం అనుమతితో జూన్ 27న వన్‌మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. పూర్తి ఆధారాలను సేకరించింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఉన్నత విద్యా సంస్ధగా ఉన్న ఏపీ నిట్ డైరెక్టర్ స్థాయి వ్యక్తిగా రావు వ్యవహరించలేదని కమిటీ నివేదికను ఇచి్చంది. డైరెక్టర్ పదవికి అనర్హుడిగా తేలి్చంది. ఈ నివేదిక ఆధారంగా సెంట్రల్ సివిల్ సరీ్వస్ రూల్సును అనుసరించి సీఎస్పీ రావును డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచి్చంది. దీని ప్రకారం మాతృ సంస్థ వరంగల్ నిట్‌కు సీఎస్పీ రావు రిపోర్టు చేయాలి. అభియోగాలపై క్రమశిక్షణ చర్యలు అక్కడ తీసుకోవాలనేది ఉత్తర్వుల్లో ఉన్న సారాంశం. -
రికార్డు బ్రేక్ చేసిన వరంగల్ నిట్
కాజీపేట అర్బన్: వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2021 విద్యా సంవత్సరంలో 1,000 పరిశోధన పత్రాలతో తన రికార్డు తానే బ్రేక్ చేసింది. రికార్డుస్థాయిలో పరిశోధనలు చేపట్టి పరిశోధన పత్రాల ప్రచురణ రికార్డు బ్రేక్ చేసినట్లు స్పోపస్ డేటాబేస్ సంస్థ వెల్లడించడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్ ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులను ఆయన అభినందించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతో ప్రత్యేకత చాటుకుంటున్న నిట్ వరంగల్ 2017 విద్యా సంవత్సరంలో 540 పరిశోధన పత్రాలను ప్రచురణకు ఇవ్వగా.. 2021లో రికార్డుస్థాయిలో వెయ్యి పరిశోధన పత్రాలను సమర్పించడం విద్యార్థులు, అధ్యాపకుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. ఇది నిట్ మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలకు స్పెషల్ పర్మిషన్) -
వరంగల్ నిట్‌లో 471 మందికి ప్లేస్‌మెంట్స్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నిట్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 471 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ నెల 19వ తేదీ నాటికి వివిధ కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్స్‌లో ఎనిమిది బ్రాంచ్‌లకు చెందిన 857 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 471 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారి సగటు వేతనం సంవత్సరానికి రూ.43.33 లక్షలు. ఎంపికైన వారిలో 122 మందికి ఏటా రూ.47లక్షల ప్యాకేజీ కాగా, 105 మంది రూ.45 లక్షల ప్యాకేజీ, 85 మంది రూ.43.30 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు. -
నిట్‌లో గుప్పుమన్న గంజాయి
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) లో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. ఆదివారం రాత్రి నిట్‌లోని 1.8కే హాస్టల్లో 12 మంది ఫస్టియర్ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద పది కిలోల గంజాయి లభించినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేపట్టేందుకు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నిట్ వరంగల్‌లో కట్టుదిట్టమైన సె క్యూరిటీ ఉంటుంది. అయినా విద్యార్థులు గం జాయితో పట్టుబడడం గమనార్హం. సాధారణంగా రోజూ నిట్‌లోని మొదటి ఏడాది వి ద్యార్థులు తప్ప మిగతా విద్యార్థులు బయటికెళ్లి రాత్రి 10 గంటల్లోపు కళాశాల కు చేరుకునే అవకాశాన్ని యాజమాన్యం కల్పిస్తుంది. కా గా, బయటకే వెళ్లని ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఎవరు గంజాయి అందించి ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
విదేశాల్లో మెరిసే..నూజివీడు మురిసె
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు అయిన ట్రిపుల్ ఐటీల్లో వికసించిన విద్యాకుసుమాలు నేడు ఖండాంతరాల్లో పరిమళాలు వెదజల్లుతున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌కు చెందిన కొల్లి మీనాకుమారి కూడా ఈ కోవకు చెందిన యువతే. పరదేశంలో తెలుగునేల గొప్పతనం చాటుతోంది. జర్మనీలో యువ సైంటిస్టుగా రాణిస్తూ, పుట్టిన గడ్డకు.. చదువు నేర్పిన విద్యా సంస్థకు పేరుతెస్తోంది. సాక్షి, నూజివీడు(విజయవాడ) : నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని తన ప్రతిభతో జర్మనీలోని ఫిలిప్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ సత్తా చాటుతోంది. తొలి బ్యాచ్‌లో ట్రిపుల్ ఐటీలో చేరిన కొల్లి మీనాకుమారి స్వగ్రామం విజయనగరం జిల్లా కామన్నవలస. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో చివరి అమ్మాయి అయిన మీనాకుమారి తొలి నుంచి చదువులో ముందుండేది. బాడంగి హైస్కూల్లో పదో తరగతి చదివి మెరుగైన మార్కులు తెచ్చుకోవడంతో ట్రిపుల్ ఐటీ సీటును సాధించింది. గేట్లో ర్యాంక్ తెచ్చుకొని.. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి గేట్ రాయగా వరంగల్‌లోని నిట్‌లో సీటు లభించింది. అక్కడ చేరి రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ విభాగంలో 2015–17 ఏడాదిలో ఎంటెక్ పూర్తిచేసింది. ఈ విభాగంలో వస్తున్న నూతన మార్పులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకుంది. అనంతరం డెహ్రాడూన్‌లోని ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేసింది. ఐఐఆర్ఎస్లో రీసెర్చ్ చేస్తుండగానే జర్మనీలో, థాయ్‌లాండ్‌లో పీహెచ్డీ చేసేందుకు అవకాశాలు వచ్చాయి. జపాన్ ప్రభుత్వ ఉపకార వేతనంతో థాయిలాండ్‌లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏఐటీ)లో పరిశోధన చేయడానికి ఎంపికైంది. ప్రస్తుతం ఫిలిప్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధనతో పాటు జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తూ ట్రిపుల్ ఐటీ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటుతోంది. ఆమె చేసిన పీహెచ్డీ పరిశోధకు మార్బర్గ్ ఇంటర్నేషనల్ డాక్టరేట్ పురస్కారం సైతం లభించింది. గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం. ట్రిపుల్ ఐటీలే లేకుంటే వేలాది మంది విద్యార్థులు నేడు ఉన్న గొప్ప గొప్ప స్థాయిల్లో ఉండేవారే కాదు. లక్షలాది రూపాయల ఫీజులు కట్టి చదివించే స్థోమత లేని నిరుపేద, పేద వర్గాల పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరింత పదును పెట్టడంలో ట్రిపుల్ ఐటీలు ఎంతో దోహదపడుతున్నాయి. – కొల్లి మీనాకుమారి -
నిట్ ఎదుట నైజీరియన్ విద్యార్థుల హల్చల్
కాజీపేట : నిట్‌లో చదువుతున్న నైజీరియన్ విద్యార్థులు రూ.5 కోసం ఆటో డ్రైవర్‌పై దాడి చేయడమేగాక నడిరోడ్డుపై హల్చల్ సృష్టించిన ఘటన కాజీపేటలోని నిట్ ఎదుట సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నిట్‌లో పీజీ చ దువుతున్న ముగ్గురు నైజీరియన్లు హన్మకొండలోని పోలీసు హెడ్‌క్వార్టర్ ఎదుట ఆటో ఎక్కారు. వారిలో ఒకరు రోహిణి ఆస్పత్రి వద్ద దిగిపోగా ఇద్ద రు నిట్ ఎదుట దిగి ఆటో డ్రైవర్ బాలుకు రూ.50 నోటు ఇచ్చారు. ఆటో డ్రైవర్ తిరిగి రూ.5 చేతిలో పెట్టగా రూ.10 వస్తాయంటూ గొడవకు దిగారు. ఇది చిలికిచిలికి గాలివానగా మారడంతో తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించగా ఆటో డ్రైవర్ బాలుతోపాటు వారి పై విద్యార్థులు చేయి చేసుకున్నారు. దీంతో వాహనాలన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాటసారులు 100 డయల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా ఆ సమయంలో హన్మకొండ వైపు వెళ్తున్న మడికొండ సీఐ సంతోష్ గొడవను చూసి వచ్చా రు. పోలీసులను చూసి కూడా వెనక్కి తగ్గకుండా రెచ్చి పోతున్న నైజీరియన్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని కాజీపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఘటన జరుగుతున్నప్పుడు ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన విలేకరులపై కూ డా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడితో కలిసి ప్రయాణికులు ఫిర్యాదు చేయగా ఎస్సై సాంబమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిట్‌కు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రాక..?
కాజీపేట అర్బన్ : బాలీ వుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఆగస్టు 2వ తేదీన కాజీపేటలోని నిట్‌కు రానున్నట్లు సమాచారం. నిట్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రేరణ కల్పించేందుకు వివేక్ అగ్నిహోత్రి హాజరుకానున్నట్లు తెలిసింది. జిద్, హేట్‌స్టోరీ, చాక్లెట్ వంటి పలు చిత్రాలతో ఆయన సత్తా చాటారు. -
‘గేట్’ బద్దలుకొట్టాడు!
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్‌లో (గేట్) వరంగల్ ఎన్ఐటీ విద్యార్థి సౌరవ్ కుమార్ సింగ్.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో ఎంఈ/ఎంటెక్/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ ఫలితాలను ఐఐటీ గౌహతి శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జాతీయ స్థాయి ప్రథమ ర్యాంకు సహా 100 లోపు ఏడు ర్యాంకులను వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు వెల్లడించారు. గత నెల 3, 4, 10, 11 తేదీల్లో 23 సబ్జెక్టుల్లో గేట్‌ను ఐఐటీ గౌహతి నిర్వహించింది. ఇందులో ఎన్ఐటీ విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ర్యాంకులను సాధించినట్లు తెలిసింది. ఒక్కసారి సాధించిన గేట్ స్కోర్‌కు మూడేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ మూడేళ్లలోగా ఎప్పుడైనా ఎంటెక్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి గేట్ ర్యాంకు ఉపయోగపడుతుంది. ఉద్యోగాలకూ ‘గేట్’దాటాల్సిందే! గేట్ స్కోర్ ఉన్న వారికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరిగింది. ఎన్టీపీసీ, గెయిల్, ఐవోసీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ తదితర సంస్థలు గేట్లో అర్హత సాధించిన వారికే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి గేట్‌కు దాదాపు 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు అంచనా. -
కొట్టుకున్న నిట్ ప్రొఫెసర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో అధ్యాపకులు ఘర్షణకు దిగారు. విద్యార్థుల ఎదుటే హోదాలను మరిచి పరస్పరం చేయి చేసుకున్నారు. వసంతోత్సవ వేడుకల సాక్షిగా విద్యా ర్థుల మధ్య ఘర్షణ చెలరేగి కత్తులతో దాడులు చేసుకున్న ఘటన మరవక ముందే ఈ సారి అధ్యాపకులు దాడులు చేసుకోవడం సంచలనం రేపింది. పరీక్షల నిర్వహణ వద్ద పాఠాలు చెప్పే తీరుపై వాగ్వాదం చెలరేగి ఈ గొడవకు దారితీసింది. రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు వైవా పరీక్షలను మెకానికల్ ప్రొఫెసర్ సాయి శ్రీనాథ్ మంగళవారం నిర్వహిస్తున్నారు. ఈ వైవా టెస్ట్‌ను పరిశీలించేందుకు మెకానికల్ విభాగాధిపతి బంగారు బాబు అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా వైవాకు హాజరైన విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వీటికి విద్యార్థులు ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘ఇప్పటివరకు.. వీరికి నువ్వు ఏం నేర్పించావ్’అంటూ విద్యార్థుల ఎదుటæ శ్రీనాథ్‌ను బంగారుబాబు ప్రశ్నించాడు. దీనికి ప్రతిగా ‘విద్యార్ధులు సరిగానే సమాధానం ఇచ్చారు కదా’అని శ్రీనాథ్ సమాధానం ఇచ్చాడు. దీనిపై ఇరువురి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలి సింది. ఇద్దరు అధ్యాపకుల మధ్య జరుగుతున్న గొడవను చూసి అక్కడున్న పీహెచ్డీ స్కాలర్లు అవాక్కయ్యారు. కేసు.. కాంప్రమైజ్ విద్యార్థుల ఎదుటే పరస్పరం దాడులు చేసు కున్న బంగారుబాబు, సాయి శ్రీనాథ్‌లు అక్కడి నుంచే గొడవ జరిగిన విషయాన్ని కాజీపేట పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఇంతలో విషయం బయటకు తెలియడంతో ఇతర అధ్యా పకులు అక్కడికి వచ్చారు. గొడవ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళితే నిట్ ప్రతిష్టకు మచ్చ అంటూ ఇద్దరు అధ్యాపకులకు సర్ది చెప్పారు. జరిగిన ఘటనపై నిట్‌లోనే అంతర్గత విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, నిట్‌లో మెకానిక్ హెడ్, ప్రొఫెసర్ గొడవపై తమకు సమాచారం అందించారు తప్ప.. ఫిర్యాదు చేయలేదని కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. ఇప్పుడూ అంతే.. తప్పులు దొర్లినప్పుడు అందుకు కారకులైన వారిపై క్రమశిక్షణ చర్యలు సకాలంలో తీసుకోవడంలో నిట్ యాజమాన్యం జాప్యం చేస్తుండటంతో ఒకటి వెనుక మరొకటి అన్నట్లుగా అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పలు అంశాల్లో విచారణ కమిటీలను వేసినా ఏ ఒక్కదాంట్లో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజా వివాదాన్ని సైతం ఇదే విధంగా తొక్కిపెడతారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులు కత్తిపోట్ల వ్యవహారం నిట్ ప్రతిష్టకు మచ్చగా మిగలగా.. తాజా ఘటన దానికి కొనసాగింపుగా ఉంది. -
వరంగల్ నిట్‌లో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ
-
వరంగల్ నిట్‌లో తన్నుకున్న విద్యార్థులు
సాక్షి, వరంగల్ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ-2018 ముగింపు వేడుకల్లో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు విద్యార్థి గ్రూపులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో త్రివంత్ అనే విద్యార్థి గాయపడటంతో అతడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ త్రివంత్ బీటెక్ సివిల్ తృతీయ సంవత్సరపు విద్యార్థి. మరోవైపు విద్యార్థుల గొడవ నేపథ్యంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో నిట్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. -
హాస్టల్ విద్యార్థి మృతికి ‘నిట్’దే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ మూడో ఏడాది చదివే రాజశేఖర్ మృతికి ఆ సంస్థదే బాధ్యతని తేల్చినట్లు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ప్రకటించింది. 2011 డిసెంబర్ 9న అమర్లపూడి రాజశేఖర్ క్రికెట్ ఆడుతూ లక్కవరం చెరువులో పడి మరణించ డానికి నిట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఫోరం ఈ తీర్పు వెలువరించింది. మృతుడి తల్లిదండ్రులకు రూ.9.70 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ చైర్మన్ బీఎన్ రావు నల్లా, సభ్యుడు పాటిల్ విఠల్‌రావుతో కూడిన డివిజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజశేఖర్ తల్లిదండ్రులు అమర్లపూడి శ్యాంరావు, జ్యోతి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఇటీవల ఈ తీర్పు చెప్పింది. ‘‘హాస్టల్ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు వార్డెన్ రిజిస్టర్ నిర్వహించాలి. విద్యార్థులు బయటకు ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారు, ఎవరి అనుమతి పొంది వెళ్లారు, తిరిగి ఎప్పుడు హాస్టల్‌కు వచ్చారు.. వంటి వివరాలతో కూడిన రిజిస్టర్ విధిగా నిర్వహించాలి. అయితే నిట్ హాస్టల్లో రిజిస్టర్ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందంటే యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మృతుడు రాజశేఖర్ తల్లిదండ్రులు దిల్‌సుఖ్‌నగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదన సరికాదు. నిట్ వంటి సంస్థలో బీటెక్ సీటుకు అర్హత పొందిన విద్యార్థి రాజశేఖర్‌కు కూడా ఆర్జన లేకపోవచ్చు. రాజశేఖర్ బతికి ఉంటే భవిష్యత్‌లో ఆర్జించబోయే ఆదాయం, కంప్యూటర్ కోర్సులకు ఉన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. నెలకు కనీసం రూ. పది వేలు జీతంతో కూడిన ఉద్యోగం ఉన్నట్లుగా అంచనా వేసి మోటారు వాహనాల చట్టం కింద పరిహారాన్ని రూ.9.70 లక్షలుగా నిర్ణయించాం. ఈ మొత్తంలో మృతుడి తల్లికి రూ.6.40 లక్షలు, తండ్రికి రూ.3.30 లక్షలు చొప్పున చెల్లించాలి. కేసు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.5 వేలు కూడా నిట్ యాజమాన్యం చెల్లించాలి’’అని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది. ఆరేళ్ల న్యాయపోరాటంలో విజయం నిట్ హాస్టల్ నుంచి రాజశేఖర్‌తోపాటు మరో 12 మంది విద్యార్థులు క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లారని, క్రికెట్ బాల్ చెరువులో పడటంతో తీసేందుకు వెళ్లిన రాజశేఖర్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని, ఇందులో తమ సంస్థ నిర్లక్ష్యం లేదని నిట్ యాజమాన్యం చేసిన వాదనను కమిషన్ తోసిపుచ్చింది. రాజశేఖర్ తొందరపాటు చర్య వల్లే మరణించినట్లుగా నిట్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా తేల్చిందని, మానవీయకోణంలో మృతుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించేందుకు సిద్ధమని నిట్ చేసిన వాదన వీగిపోయింది. తమ కుమారుడు రాజశేఖర్ మృతితో ఏర్పడిన మానసిక క్షోభకు రూ.10 లక్షలు, పరిహారంగా రూ.15 లక్షలు, అంత్యక్రియలు, రవాణా ఇతర ఖర్చుల నిమిత్తం రూ.లక్ష కలిసి మొత్తం రూ.26 లక్షలు ఇప్పించాలని తల్లిదండ్రులు శ్యాంరావు, జ్యోతి న్యాయపోరాటంలో ఆరేళ్లకు విజయం సాధించారు. -
వరంగల్ నిట్‌లో కృష్ణమాచారి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగుంటున్నాయని.. అందువల్లే అభివద్ధిలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. వరంగల్ నిట్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ.. 'నేను తమిళనాడు వాడినే అయినా అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది. విద్యార్థులు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలి' అని సూచించారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అంటూ కొనియాడారు. ఆయన కెప్టెన్సీలో కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. యువతకు కార్పొరేట్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చేందుకు 'కెరీర్ స్ట్రోక్స్' కంపెనీని ఏర్పాటుచేసిన కృష్ణమాచారి శ్రీకాంత్. టాస్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న సొంతూళ్లోనే ఉద్యోగాలు కల్పిస్తాం అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాం ఫాం టూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకేచోట తయారీ వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్థిక రాజధాని దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్తర తెలంగాణ లో పండుతుందని పరిశోధనలో తేలింది టెక్స్ టైల్ పార్కు తోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుతో వరంగల్ నగర విస్తరణ హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు.. 1.20 లక్షల మందికి ఉపాధి టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కలశాలతో ఎంఓయూ ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు ఎన్నికల స్టంట్లా కాకుండా ఏడాదిలోగా పనులు పూర్తవుతాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం ఫ్యాషన్ రంగంలో నిఫ్ట్ తోనూ సంప్రదింపులు జరుపుతాం -
వరంగల్ నిట్‌లో 50% సీట్లు తెలంగాణకే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నిట్‌లోని 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నిట్‌లో సీట్ల సంఖ్య 120 నుంచి 540కి పెంచింది. అలాగే 60 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరు చేసింది. దీంతో వరంగల్ నిట్‌లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రం కోటా కింద తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. ఏపీ నిట్‌లో సీట్లు పెంచడంతో పాటు సొంత రాష్ట్రం కోటా కింద 300 సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయిస్తామని బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసిన సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. -
నిట్‌లో 50% సీట్లు తెలంగాణ విద్యార్థులవే..
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక వరంగల్ నిట్‌లో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులవేనని, నిట్ అడ్మిషన్లకు 371డి వర్తించదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం కూడా అదే చెబుతోందని ఆయన మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నయం చూసుకోవాలని కడియం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 371-డి ఆర్టికల్ వర్తించబోదని చెప్పారు. రాష్ట్రంలోని సంస్థలకే 371-డి వర్తిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ రాష్ట్ర సంస్థలకే వర్తిస్తుందని చెప్పారు. 371-డి వర్తించే సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అమలవుతుందన్నారు. పార్లమెంటు చట్టప్రకారం, ఎన్ఐటి ప్రవేశాల మార్గదర్శకాలు, న్యాయపరంగా ఏ రకంగా చూసినా 50 శాతం సీట్లు తెలంగాణకే దక్కుతాయని అన్నారు. సీట్లు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు. కాగా స్థానిక కోటాలోని 50 శాతం సీట్లు తమవేని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి అడ్మిషన్ ద్వారా సీట్లు భర్తీ చేసి ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై చర్చించేందుకు కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లారు. -
వరంగల్ ఎన్ఐటీ 372 సీట్లు తెలంగాణవే..
- ప్రవేశాల నిబంధనలను మార్చేందుకు ఏపీ పెద్దలు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారు - తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లితే సహించం: కడియుం హైదరాబాద్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో హోం స్టేట్ కోటా కింద తెలంగాణకు రావాల్సిన 50 శాతం సీట్లు (372) తెలంగాణవేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏపీ పెద్దలు ఢిల్లీలో కూర్చొని ఆ సీట్లకు కోత పెట్టే కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇందుకు తాము ఒప్పుకునేది లేదని, తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని వివరించారు. సోమవారం సచివాలయంలో కడియం మాట్లాడుతూ ఎన్ఐటీలో ప్రవేశాల నిబంధనలు మార్చేందుకు ఏపీ పెద్దలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దానికి తలొగ్గే సీట్ల కేటాయింపు వెబ్సైట్లో ఇదివరకు పెట్టిన ప్రవేశాల నిబంధనలు డౌన్లోడ్ కాకుండా చేసి, మళ్లీ అప్డేటెడ్ చేస్తామంటూ మెసేజ్‌ను పెట్టారని విమర్శించారు. ‘జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 371 (డి) వర్తించదు. అది పార్లమెంట్ చట్టమే చెబుతోంది... ఎన్ఐటీల్లో ప్రవేశాల నిబంధనలు చెబుతున్నాయి. వాటి ప్రకారం 50 శాతం సీట్లు హోమ్ స్టేట్ కోటా కింద తెలంగాణ విద్యార్థులవే. ఏపీకి వీటిల్లో హక్కు లేదు. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు, పదో షెడ్యూల్లోని విద్యా సంస్థల్లోనే పదేళ్ల పాటు కామన్ అడ్మిషన్ ప్రొసీజర్ అమల్లో ఉంటుందని విభజన చట్టం చెబుతోంది. ఇదీ జాతీయ స్థాయి విద్యా సంస్థలకు వర్తించదు. ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఐటీలో స్టేట్ హోం కోటా కింద తక్కువ సీట్లు వస్తున్నందున వరంగల్‌లోని ఎన్ఐటీ సీట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు’ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కుట్రలను అడ్డుకుంటామని, అందుకే తాను ఈనెల 19న ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి మహంతితో మాట్లాడతానని, అవసరమైతే కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలుస్తానని కడియం వివరించారు. -
వరంగల్ NITలో స్ప్రింగ్ స్ప్రీ సందడి
-
వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్
కాజీపేట: కాజీపేటలోని నేషనల్ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో యువ ఇంజనీర్ల సృజనాత్మకతకు అద్దంపట్టిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ విదేశాలకు చెందిన 1500 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 6వేల మందికి పైగా విద్యార్థులు పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడురోజులపాటు 108 అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. ఆతిథ్య కళాశాల వరంగల్ నిట్‌కే 80 శాతం బహుమతులు రాగా, ఓవరాల్ చాంపియన్ షిప్‌ను దక్కించుకుంది. -
మహాకవి.. కాళోజీ !
ఇందూరు : కాళోజీ నారాయణరావు భారతదేశానికి పెద్ద కవిగానే కాకుండా సైద్ధాంతికంగా ఉదారవాది, ప్రజాస్వామ్య వాదిగా ఎన్నో పోరాటాలు చేశారని జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం అన్నారు. మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఈఓ జ్యోతి ప్రజ్వలన చేశారు. కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారని, తనలాగే అన్యాయాన్ని ఎదురించిన వారిని ఆదరించేవారన్నారు. 1914 సంవత్సరంలో జన్మించిన ఆయన పదహారేళ్లలోనే కవిత్వం రాశారని తెలిపారు. కాళోజీ ధ్యాస, శ్వాస మొత్తం అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకునేదన్నారు. మోసం చేసిన వారిని విడిచిపెట్టే మనస్తత్వం కాదన్నారు. అందులో మోసం చేసిన వాడు మనవాడైతే సహించేవారు కాదన్నారు. కాళోజీ జీవితంలో ఉద్యమం ఒక భాగంగా మారి, తరువాత ఉద్యమమే జీవితంగా మారిపోయిందన్నారు. నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గర నుంచి నక్సలైట్లపై హింసను ఖండించే వరకు ఆయన చివరివరకూ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచన ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం ఇలా ఎలాంటి న్యాయపోరాట ఉద్యమానికైనా కాళోజీ రెండు చేతులతో ఆహ్వానం పలికి ఉద్యమకారుడిగానే కాకుండా కవిగా, కథకుడిగా ఉద్యమాలకు ఆలంబనయ్యారని కొనియాడారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు జైలు జీవితాన్ని సైతం అనుభవించారన్నారు. ప్రజలపై అణచివేత ఛాయలు ఎక్కడ కనిపించినా ధిక్కరించడం ఆయనకు ముందునుంచి అలవాటుగా మారిందని, అదే ఆయుధంగా మలుచుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజాకవిగా గుర్తింపు పొంది కవి సంఘానికి అధ్యక్షపాత్ర పోషించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోకెక్కారని, అందుకే ఆయన మన మధ్య లేకున్నా ఎందరో మందికి ఆదర్శప్రాయుడిగా, స్పూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఆయన బతికున్న సమయంలో తాను చనిపోతే దేహాన్ని ఒక మెడికల్ కళాశాలకు అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తిగా భారతదేశ చరిత్రపుటలోక్లి ఎక్కారని కొనియాడారు. ఆయన ఆశయాలను మనమందరం నిజం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. -
వరంగల్ నిట్‌లో కుర్రకారు హంగామా