సాక్షి, హైదరాబాద్: వరంగల్ నిట్‌లోని 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న నిట్‌లో సీట్ల సంఖ్య 120 నుంచి 540కి పెంచింది. అలాగే 60 సూపర్ న్యూమరరీ సీట్లు మంజూరు చేసింది. దీంతో వరంగల్ నిట్‌లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రం కోటా కింద తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. ఏపీ నిట్‌లో సీట్లు పెంచడంతో పాటు సొంత రాష్ట్రం కోటా కింద 300 సీట్లు ఏపీ విద్యార్థులకే కేటాయిస్తామని బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఏపీ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసిన సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.