
కాజీపేట అర్బన్ : బాలీ వుడ్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి ఆగస్టు 2వ తేదీన కాజీపేటలోని నిట్‌కు రానున్నట్లు సమాచారం. నిట్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రేరణ కల్పించేందుకు వివేక్ అగ్నిహోత్రి హాజరుకానున్నట్లు తెలిసింది. జిద్, హేట్‌స్టోరీ, చాక్లెట్ వంటి పలు చిత్రాలతో ఆయన సత్తా చాటారు.