ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు | PM Modi Receives 17th International Rare Award In Nigeria, Which Only Queen Elizabeth Received | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు

Nov 17 2024 12:49 PM | Updated on Nov 17 2024 2:52 PM

PM Modi Receives 17th International Award in Nigeria

అబుజా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలలో పర్యటనలో ఉ‍న్నారు. దీనిలో భాగంగా నేడు(ఆదివారం) నైజీరియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నైజీరియా అత్యున్నత పురస్కారం "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్"తో ప్రధాని మోదీని సత్కరించారు.  


ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. ప్రధాని  మోదీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రపంచంలోనే రెండవ నేతగా నిలవనున్నారు. దీనికి ముందు 1969లో నైజీరియా నుంచి ఈ గౌరవాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి.

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement