సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ(visakhapatnam)లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్‌స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment