సాక్షి, విశాఖపట్నం: మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారు?. విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో భారతీయుల కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
కేఏ పాల్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మన దేశ పౌరులకు బేడీలు వేశారు. వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా?. ఇంత జరుగుతుంటే ప్రదాని మోదీ ఏం చేస్తున్నారు?. మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలి?. విదేశాంగ మంత్రి బాధత్య వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. చైనాను ఎదిరించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరం.
ఒకప్పుడు మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నాడు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏం చేస్తున్నారు?. విశాఖ ఎంపీ భరత్.. ఆయన మావయ్య పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలో ఇబ్బందిలో ఉన్న భారతీయులు కేఏ పాల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వార్నింగ్ ఇస్తున్నాను. ట్రంప్ భార్య కూడా అమెరికాకు విజిట్ వీసాపై వచ్చింది. వారిని ఇప్పుడు పంపించేస్తే కుదురుతుందా?. ట్రంప్‌కి మిలానియా మూడో భార్య. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ట్రంప్‌ను ఫాలో అవుతున్నాడు. పవన్ సనాతన ధర్మం అంటున్నందుకు ఆయన భార్య విడాకులు ఇవ్వచ్చు. మళ్ళీ ఆమె సొంత దేశానికి వెళ్లిపోవచ్చు.
నేను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గలాన్ని విప్పాలి. రేవంత్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. లోకేష్ దగ్గరకు వెళ్తే ఏం సాయం చేస్తారు. వాళ్ళ నాన్న దోచుకోవడమే లోకేష్‌కు నేర్పించాడు. వాళ్ళ దగ్గర పవన్ నేర్చుకొని.. కోట్లు దోచుకుంటున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment