మహారాణిపేట: ప్రధాని మోదీ రోడ్డు షో, బహిరంగ సభ కోసం వచ్చే ప్రజల కోసం ఆహారం తయారీలో సివిల్ సప్లయిస్ అధికారులు బిజీగా ఉన్నారు. రెండు లక్షల మందికి పైగా భోజనాలు, స్నాక్స్ తయారు చేయిస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ.110 చొప్పున తయారీ కోసం పలువురికి క్యాటరింగ్ అప్పగించారు. పెదగదిలి(తోటగరువు) వద్ద ఉన్న యెర్ని దుర్గామాంబ కల్యాణ మండపంలో ఓం సాయిరామ్ కేటరింగ్, పవన్ కేటరింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు.
రామాటాకీస్ వద్ద ఉన్న బి.ఆర్.అంబేడ్కర్ భవన్‌లో అమృతం కేటరింగ్, క్విక్ సప్లయిర్స్‌కు, అక్కయ్యపాలెం షాదీఖానా కల్యాణ మండపంలో కృష్ణారెడ్డి కేటరింగ్‌కు, ఫెర్రీ రోడ్డు(వన్ టౌన్) పొట్టి శ్రీరాములు కల్యాణ మండపంలో మణికంఠ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటేషన్లకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్, రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ అందించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment