Ambedkar Bhavan
-
అంబేడ్కర్ భవన్ల తుది డిజైన్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువత ఉపాధికి బాటలు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ భవనాలను నిర్మిస్తోంది. ఇందులో స్టడీ సర్కిల్ తో పాటు కెరీర్‌గైడెన్స్ కార్యక్రమా లను చేపట్టనుంది. అంబేడ్కర్ భవనాల నిర్మాణానికి సంబంధిం చి సోమవారం తుది డిజైన్లు ఖరారయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో స్టడీ సర్కిల్‌తో పాటు కేరీర్ గైడెన్స్ సెంటర్, వెయ్యి మంది పట్టే సామర్థ్య మున్న ఆడిటోరియం ఉంటుంది. తొలి విడతగా ఆరు జిల్లాల్లో ఈ భవనాలు నిర్మించనున్నారు. డివిజన్, మండల కేంద్రాల్లోనూ.. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అంబేడ్కర్ భవన్లతో పాటు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రూ.50 లక్షలు, మండల స్థాయిలో రూ.25 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మా ణానికి స్థలాలను గుర్తించాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశిం చింది. డివిజన్, మండల స్థాయి కార్యక్రమాలకు వేదికగా వినియోగించుకునేలా నిర్మాణా లు చేపట్టాలని సూచించింది. గ్రామ స్థాయి అంబేడ్కర్ భవనాలకు రూ.7లక్షలు ఖర్చు చేయాలని ఆ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రాల్లో నిర్మిం చే భవనాలకు ఏకకాలంలో త్వరగా టెండర్లు పిలవాలని.. నిర్మాణాలు ఒకేసారి పూర్తి చేయాలని ఆదేశించారు. -
జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ అమ్రపాలి అంబేద్కర్ భవన్లో జగ్జీవన్ రాం జయంతి వేడుకలు నివాళులర్పించిన అధికారులు, వివిధ సంఘాల నాయకులు హన్మకొండ : దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి సూచించారు. చేస్తున్న పనిలో అంకితభావం చూపించి పేద, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అమ్రపాలి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు అధికారులు, సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ దాదాపు యాభై ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగిన జగ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా కొనసాగిన కాలంలో పాకిస్తాన్‌పై యుద్ధం జరగగా ఆయన ఎంతో సమర్థంగా యుద్ధాన్ని ఎదుర్కొన్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వచ్చిన కరువు కాటకాల నుంచి సామాన్య ప్రజలు, రైతులను ఆదుకొనేందుకు గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చారన్నారు. మహనీయుల జయంతులు ఏప్రిల్‌లో వస్తాయని.. ఈ మేరకు విద్యార్థులు ఏదో పనిని అసాధారణంగా చేసి చూపించాలని సూచించారు. తన విషయానికొస్తే ఈ నెలలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గోడలపై పెయింటింగ్ వేయించనున్నట్లు కలెక్టర్‌వెల్లడించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహ స్థాపనకు తన ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అర్హులకు పథకాలు చేరాలి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరినప్పుడే జగ్జీవన్ రామ్ వంటి మహనీయులకు నివాళులర్పించినట్లవుతుందని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జగ్జీవన్‌రామ్ కేవలం దళితులకే కాక పేద ప్రజలందరికి సహాయం చేశారని అన్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ దళితులైన మిగిలినవారైనా ఆత్మన్యూనతాభావం విడనాడాలని సూచించారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ ఇచ్చిన శక్తి, హక్కులను వదలకుండా విజ్ఞానం పెంపొందించుకుని సమాజానికి సేవ చేసే విధంగా ఎదగాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.దయానంద్, డీఆర్వో కె.శోభ, కార్పొరేటర్లు జోరిక రమేష్, డిన్నా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్, వివిధ సంఘాల నాయకులు బొమ్మల కట్టయ్య, మంద కుమార్ పి.జయాకర్, శ్రీఖర్, ఎల్లయ్య, పరంజ్యోతి, నర్సయ్య, సారంగపాణి, వివిధ శాఖల అధికారులు శంకర్, వెంకట్‌రెడ్డి పాల్గొనగా మగ్దుం వ్యాఖ్యతగా వ్యవహరించారు. -
రిజర్వేషన్లు అమలు చేయాలి
నల్లగొండ టౌన్ : జనాభా ప్రకారం మాదిగలు, ము స్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చే యాలని మాదిగ,ముస్లిం జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన లేని కారణంగా చాలా వెనుకబాటులకు గురవుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ముస్లింలకు 12 శా తం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాదిగ, ముస్లింలకు అన్ని ప్రాంతాల్లో నామినేటెడ్ పదువులు కల్పించాలన్నారు. మాదిగలు, ముస్లిలు రిజర్వేషన్లను సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాదిగ యూత్ జేఏసీరాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరంజయ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సయ్యద్ ఎహసానొద్దీన్, అనీష్, ఖలీం బాయ్, హఫీజ్‌ఖాన్, సలీం,మైళాన అ బ్బర్, హాషం, ఎంఎ నాజీర్, కత్తుల నర్సింహ్మ, పెరిక ఉమామహేశ్వర్, దున్నయాదగిరి, కొంపెల్లి భిక్షపతి, పెరి కరాజు, తలారి పరమేష్, మేడి రాజు, బొజ్జ నర్సింహ్మ, మహ్మద్‌షరీఫ్, షమీ, ఆసిస్, రిజ్వాన్, కొండల్, మేడి నర్సిం హ్మ, హరికృష్ణ, చింత జయసేన, కత్తుల తులసీదాస్, అంబేద్కర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి
మచిలీపట్నం(చిలకలపూడి): దళితులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని డీఆర్వో సీహెచ్ రంగయ్య సూచించారు. అంబేడ్కర్‌భవన్‌లో దళిత బహుజన పరిరక్షణ సంఘ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్వో మాట్లాడుతూ రాజ్యాంగం లో దళితులకు పొందుపరచిన హక్కులు, చట్టాలు వివరించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రిటైర్డ్ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళితులు ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఖైతేపల్లి దాసు పాల్గొన్నారు. డీఆర్వో రంగయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణ, రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌కుమార్‌ను సత్కరించారు. సంఘ రాష్ట్ర కన్వీనర్ అన్నవరపు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఎగ్గోని గాంధీ పాల్గొన్నారు. -
'సోషలిజాన్ని అనుసరించి ఉండాల్సింది'
సీతంపేట: దేశంలో రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధమైన వ్యవస్థ లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో సీపీఐ(ఎం) 21వ అఖిల భారత మహాసభలలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్లో ‘ప్రైవేటు రంగం, రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆమె ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ వ్యవస్థను కాకుండా సోషలిజాన్ని అనుసరించి ఉంటే కుల, మత, అసమానతలు లేని గొప్ప ప్రజాస్వామ్య భారతదేశం ఆవిష్కృతమయ్యేదని అభిప్రాయపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు ఒక వివాదస్పదమైన అంశమని, ఎందుకు వివాదస్పదమైనదో సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. శతాబ్దాల నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్నా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కన్పించడం లేదని తెలిపారు. కేవలం పారిశుద్ధ్యం, చేతివృత్తులకే దళిత వర్గాలు పరిమితమయ్యాయని, అత్యున్నత స్థానాలు వారికి దక్కడం లేదని బృందా కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. 2010లో ప్రభుత్వ సర్వేల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 41 శాతం ఉపాధి పొందగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 14 శాతం మాత్రమే ఉపాధి పొందారని స్పష్టమైందని ఆమె తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 37 శాతం ఉపాధి పొందగా, దీనిలో మూడవ వంతు షెడ్యూల్ కులాలు ఉపాధి పొందుతున్నట్లు సర్వేలలో స్పష్టమైందన్నారు. ఈ పరిస్థితులలో మార్పు రావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థ, విధానాలు అనుసరించాలని బృందా కారత్ కోరారు. -
రాజకీయ అధికారమే మాలల సమస్యకు పరిష్కారం
మాలల సమావేశంలో సామాజిక విశ్లేషకులు గోపీనాథ్ హైదరాబాద్: రాజకీయ అధికారంతోనే మాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందుకు సామాజిక, రాజకీయ శక్తులుగా మాలలు ఎదగాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే వర్గం రాదేమో కానీ, కులం మాత్రం తప్పకుండా మన వెంటే వస్తుందన్నారు. భారత్‌లోని వామపక్ష పార్టీలు 90 ఏళ్ల తర్వాత కులం ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తిస్తున్నాయని చెప్పారు. మాజీ మంత్రి శంకర్రావు మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్మానాన్ని ఈ సమావేశం వ్యతిరేకించింది. కార్యక్రమంలో మాల సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ నేత డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే లింగయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాల సంఘాల నేతలు చెన్నయ్య, పసుల రామ్మూర్తి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమంలో దళిత, గిరిజనులే కీలకం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజనులు పోషించిన పాత్ర మరువలేనిదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎ.సీతారాంనాయక్ అన్నారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ఆదివారం తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో మాదిగ సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సభలో ప్రొఫెసర్ సీతారాంనాయక్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ 1200 మందికి పైగా బలిదానాలు, సుదీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధన, వర్గీకరణ సాధన లక్ష్యంగా తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఏర్పా టైందన్నారు. ఈ మేరకు దళితుల హక్కులు, మాదిగల హక్కులు కూడా సాధించుకుందామన్నారు. అనంతరం మాదిగ సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ర్యాలీలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని సంఘీభావం తెలపగా, కార్యక్రమాల్లో టీఎమ్మార్పీఎస్ నాయకులు బొట్ల రమేష్, బోడ యుగేందర్, వక్కల వెంకట్, కనకం రమేష్, వేల్పుల వెంకన్న, నత్తి కొర్నేలు, అనుమాండ్ల విద్యాసాగర్, కొమ్ముల వజ్రమ్మ, నవీన్, పాము రమేష్, కాళ్ల నవీన్, రామంచ అయిలయ్య, కొయ్యడ సునీల్, నాగరాజు, సిరగొమ్ముల మనోహర్, జంద్యాల బాలస్వామి, సిలువేరు కృష్ణప్రసాద్, దైద సాగర్, నల్లగట్ల వెంకటేశ్వర్లు, బొక్క ఏలియా పాల్గొన్నారు. -
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారుల సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత ్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దన్నారు. పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రకాష్‌కుమార్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్‌లు, డిపార్టుమెంటల్ అధికారులు ఆదేశించారు. తప్పు చేస్తే సస్పెన్షన్.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో తప్పు చేస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు బల్లల మీద కూర్చొని పరీక్షలు రాసేలా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, అత్యవసర మందులతో వైద్య సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలన్నారు. విద్యార్థులను ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. 26వ తేదీన ఇన్విజిలేటర్లుతో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలివ్వాలన్నారు. చీఫ్‌లు, డిపార్టుమెంట్ అధికారులు ప్రతిరోజు ప్రశ్నపత్రాలను బయటకు తీసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆరోజు తేదీ ఏ సబ్జెక్టు, ఏ పేపర్ అన్ని విషయాలను గమనించి ప్రశ్నపత్రాలను బయటకు తీయాలన్నారు. యాక్టు 25 అమలు.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఆదేశాల మేరకు యాక్టు 25 అమలు చేస్తున్నట్లు డీఈఓ రాజేశ్వరరావు తెలిపారు. ఈ చట్టం కింద పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా రూ.500 నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అవసరమైతే 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జరిగిన పొరపాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధిస్తారు. పరీక్షల హాలులో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే ఆ విద్యార్థిని డీబార్ చేయడంతో పాటు అక్కడి ఇన్విజిలేటర్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తామని డీఈఓ హెచ్చరించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని డీఈఓ కోరారు. 14 సిట్టింగ్ స్క్వాడ్లు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 39,601 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 35,304 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4297 మంది ప్రైవేట్ విద్యార్థులు, మొత్తం 195 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 173 కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థులకు, 22 కేంద్రాలు ప్రైవేట్ విద్యార్థులకు కేటాయించారు. మొత్తం 14 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు డీఈఓ చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాలన్నింటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ కేంద్రాలన్నింటి కీ ప్రత్యేకంగా 14 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, 31 మంది సీ సెంటర్ కస్టోడియన్లు ఆయా పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 48 మంది స్క్రైబ్‌లను ఏర్పాటు చేసినట్లు రాజేశ్వరరావు చెప్పారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని డీఈఓ కోరారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బి.విజయభాస్కర్, ఇ.సాల్మన్, కొల్లా వెంకట్రావు, కాశీశ్వరరావు, షేక్ చాంద్‌బేగమ్, వి. రామ్మోహనరావు, అసిస్టెంట్ కమిషనర్ సి.నాగప్ప, చీఫ్‌లు, డీఓలు పాల్గొన్నారు. సమావేశానికి హాజరుకాని చీఫ్‌లు, డీఈఓలకు మెమోలు జారీ చేయాలని డీఈఓ ఆదేశించారు. -
అవగాహనతో ఎయిడ్స్ నియంత్రణ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నగరంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ విజయకుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారం నిర్మించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ భావితరాలు హెచ్ఐవీ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రించగలమన్నారు. అనంతరం ర్యాలీ రిమ్స్ వైద్యశాల నుంచి అంబేద్కర్ భవన్‌కు చేరుకుంది. ర్యాలీలో జిల్లా వైద్యాధికారి రామతులశమ్మ, ఎయిడ్స్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ వాణిశ్రీ, ప్రాజెక్టు మేనేజర్ రంగారావు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణలో భాగస్వాములవుదాం ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వీ మోహన్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, యువత సమష్టిగా కృషి చేస్తేనే భవిష్యత్తు తరాలను ఎయిడ్స్ నుంచి కాపాడగలమన్నారు. హెచ్ఐవీ బాధితులకు తమ సంస్థ తరఫున న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి రామతులశమ్మ మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని కోరారు. కుష్టు, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ టీ వాణిశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ఎయిడ్స్ డీపీఎం టీ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎయిడ్స్ కేసులు 3.04 శాతం నుంచి 2.55 శాతం తగ్గాయని తెలిపారు. గర్భిణుల్లో హెచ్ఐవీ వ్యాప్తి 0.23 శాతం నుంచి 0.18 శాతం తగ్గిందన్నారు. హెచ్ఐవీ బాధితులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 200 మందికి పౌష్టికాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యవిధాన పరిషత్ కో-ఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ రమేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ విద్యావతి, డాక్టర్ వీ నాగరాజ్యలక్ష్మి, పీపీఎన్ ప్రెసిడెంట్ నరేంద్ర, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులను చైతన్యపరచండి : కలెక్టర్
కలెక్టరేట్(కాకినాడ), న్యూస్‌లైన్ : ఆధార్ బ్రిడ్జి పేమెంట్ విధానం కింద పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల కోసం, ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకునేలా అర్హులైన విద్యార్థులను చైతన్యపరచాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. అంబేద్కర్ భవన్లో ఆయా అంశాలపై ప్రిన్సిపాళ్లకు మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం లక్షా 35 వేల మంది కళాశాల విద్యార్థులు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత కలిగి ఉన్నారన్నారు. వీరిలో ఇప్పటివరకూ 65,855 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. వీరిలో 29,533 మందికి బ్యాంకు అకౌంట్లు, 31,323 మందికి ఈ పాస్-ఆర్ఎఎస్ఎఫ్ అంశాల పరిశీలన పూర్తయిందన్నారు. కాగా, 14,414 మందికి ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తయిందన్నారు. ఇంకా నమోదు చేయించుకోవాల్సిన విద్యార్థులందరూ నూతన విధానంలో రానున్న 10 రోజుల్లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు 55 వేల మంది ఉండగా వీరిలో ఇప్పటివరకూ సుమారు 20 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, మిగిలిన 35 వేల మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ కార్నన్, అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఆర్డీవోలు జవహర్లాల్ నెహ్రూ, వేణుగోపాలరెడ్డి, ప్రియాంక, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, డీఈఓ కె.శ్రీనివాసులురెడ్డి, డీఎస్‌డబ్ల్యూవో రామారావు, ఎన్ఐసీ అధికారులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులు నష్టపోతున్నారు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతి గృహాలను మినహాయించాలని దళిత ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలే విద్యనభ్యసిస్తుంటారని చెప్పారు. ఉద్యమం వల్ల వారి భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రైవేటు విద్యాసంస్థలను బంద్ నుంచి మినహాయించడం దారుణమని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, మానవ హక్కుల సంఘం, లోకాయుక్తలకు.. ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని మూసివేసి.. ప్రైవేటు బస్సులను మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. స్వార్థ పరుల కోసం సమైక్య ఉద్యమానికి మద్దతిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య, వికలాంగుల పింఛనులను నిలిపివేయడం దివాలాకోరుతనమన్నారు. పేదలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరారు. ఎక్కువ కాలం పాఠశాలలు మూతబడితే డ్రాపవుట్స్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. -
అంబేద్కర్ ఆలోచనా విధానాలు అనుసరణీయం
కవాడిగూడ, న్యూస్‌లైన్ : అంబేద్కర్ ఆలోచనా విధానాలు అందరికీ అనుసరణీయమని, పేదవారి అభ్యున్నతికి ఆయన భావజాలం మార్గదర్శకంగా నిలుస్తుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2012 టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఆదివా రం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ స్కాలర్షిప్లు అందించారు. ముఖ్య అతిథులుగా ప్రవీణ్‌కుమార్, ఆధార్ కేంద్రాల అడిషనల్ డెరైక్టర్ జనరల్ పీఎస్ఎన్ మూర్తి, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ దయాసాగర్‌లు హాజరయ్యారు. దళిత, బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక త్యాగాలు చేసి వారికి ఒక గమ్యాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. జీవితంలో క్రమశిక్షణతో బతకటం కార్ల్‌మార్క్స్, ప్లేటో, అంబేద్కర్ల నుంచి నేర్చుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అన్వయిస్తే సమాజంలో మార్పు తథ్యమన్నారు. ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిద్ధోజీరావు, ప్రధాన కార్యదర్శి జయవర్ధన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సుమారు రూ.6 లక్షల నగదు చెక్కులు అందజేశారు.