ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి | DBPS meeting | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి

Published Wed, Oct 19 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి

ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోండి


 


మచిలీపట్నం(చిలకలపూడి): దళితులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని డీఆర్వో సీహెచ్‌ రంగయ్య సూచించారు. అంబేడ్కర్‌భవన్‌లో దళిత బహుజన పరిరక్షణ సంఘ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్వో మాట్లాడుతూ రాజ్యాంగం లో దళితులకు పొందుపరచిన హక్కులు, చట్టాలు వివరించారు. ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ ఎస్సీ యువతకు నైపుణ్యంలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రిటైర్డ్‌ ఎస్పీ వి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజంలో దళితులు ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఖైతేపల్లి దాసు పాల్గొన్నారు. డీఆర్వో రంగయ్య, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ సత్యనారాయణ, రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమ్‌కుమార్‌ను సత్కరించారు. సంఘ రాష్ట్ర కన్వీనర్‌ అన్నవరపు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఎగ్గోని గాంధీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement