bahujana parirkshana meeting
-
‘చందాలు దండుకునేందుకే అమరావతి పేరుతో యాత్రలు’
తాడికొండ: అమరావతి పేరుతో చందాలు దండుకునేందుకు కులవాదులు యాత్రలు చేయడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 689వ రోజు రిలే నిరాహార దీక్షలకు బుధవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం ఈ పాదయాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు రాష్ట్రమంతా తిరిగి చందాలు వసూలు చేసుకుంటూ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటూ వీరు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పేదల సమస్యలను పక్కన పెట్టిన రాజకీయ పార్టీలు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు పాట్లు పడుతుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎల్లో మీడియాలో తమ ఉద్యమాన్ని చూపనప్పటికీ.. బహుజన హక్కుల కోసం పోరాడుతున్న తమకు, మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శ్యామ్యూల్, ఇంటూరి రాజు పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమరావతిపై ‘డబ్బుల్’ గేమ్! -
అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రకాదు..
అమరావతి: అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది ఒక రాజకీయ యాత్ర అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ యాత్రకు కర్త,కర్మ,క్రియ అన్ని చంద్రబాబే.. అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. బహుజన పరిరక్షణ సమితి నేతల దీక్షలు 400వ రోజులకు చేరుకున్నాయి. పేదవారికి ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ‘న్యాయస్థానం–దేవస్థానం’ అంటూ చంద్రబాబు కొత్తనాటకానికి తెరతీశారని మండిపడ్డారు. -
దీక్షను భగ్నం చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
-
250వ రోజుకు బహుజన పరిరక్షణ సమితి దీక్ష
సాక్షి, గుంటూరు: మందడంలో బహుజన పరిరక్షణ సమితి దీక్ష 250వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకోవడం నిరసిస్తూ దీక్ష కొనసాగుతోంది. దీక్షకు 643 ప్రజా, మహిళ, ఓసీ, బీసీ, మైనార్టీ, దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. 250వ రోజు కొనసాగుతున్న దీక్షలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రకటించడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. చదవండి: విషాదం: నాన్నా... ఇది తగునా !.. దారుణం: భార్య చేతిలో భర్త హతం -
ఉమ్మడి రాజధాని: పదేళ్ల హక్కు కేసీఆర్‌కు చంద్రబాబు తాకట్టు
తాడికొండ: రాష్ట్ర విభజన అనంతరం 2024 వరకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను వాడుకునే హక్కును కేసీఆర్‌కు తాకట్టు పెట్టి అర్ధరాత్రి ఆంధ్రా కరకట్టకు పారిపోయి వచ్చిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 227వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. కరోనా రోగులను హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటుంటే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు అండ్ కో కేసీఆర్‌ను పల్లెత్తు మాట ప్రశ్నించకుండా.. ఇక్కడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా పారిపోయి వచ్చినందునే.. నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. బాబుకు కొమ్ముకాస్తూ ఏపీ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలిన ఎంపీ రఘురామకృష్ణరాజు పాపం పండి జైలుకు వెళ్లాడని, ఇక చంద్రబాబు, నారా లోకేష్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి
తాడికొండ: అమరావతి రాజధాని పేరిట యథేచ్ఛగా దోచుకునేందుకే చంద్రబాబు సీఆర్డీఏను ఏర్పాటు చేసి, అనుకూలమైన ఉద్యోగులను నియమించుకుని కొత్త జీవోలు, చట్టాలతో భారీ మోసానికి పాల్పడ్డారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా ఆ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం 173వ రోజు కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆదివారం పలువురు నాయకులు మాట్లాడుతూ 480 ఎకరాల అసైన్డ్ భూములను బెదిరించి కొనుగోలు చేసిన వ్యవహారం అందిరికీ తెలిసిందేనని, దళితుల భూములు వారికి ఇవ్వడంతో పాటు దానికి కారకులైన చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదితరులను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసిన చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నాలుగు వారాల గడువిస్తే వ్యవస్థలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టుల్లో వేసిన తప్పుడు కేసుల్ని చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబుకు బహుజనుల ఉసురు తగలడం ఖాయం
తాడికొండ: బహుజనులను మోసం చేసిన చంద్రబాబుకు వారి ఉసురు తగిలి జైలుకెళ్లడం ఖాయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 171వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. దళితులు తమ సమస్యలపై ఎమ్మెల్యే ఆర్కేకు విన్నవిస్తే..ఎంపీ రఘురామకృష్ణరాజు దళితుల సమస్యలు దళితులతోనే మాట్లాడుకోవాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కుల ముసుగులో నటుడు శివాజీ, లగడపాటి, రాధాకృష్ణ, రామోజీ, ప్యాకేజీ నాయకులు పవన్, రామకృష్ణ చెప్పే మాటలు విని రైతులు ఇప్పటికే మోసపోయారని ధ్వజమెత్తారు. ఇంకా అదే పంథాలో వెళితే 29 గ్రామాల్లో ఉన్న రైతులు వారిని తరిమికొట్టడం ఖాయమన్నారు. కాగా, తమిళనాడుకు చెందిన పలు దళిత సంఘాల నాయకులు ఈ దీక్షల్లో పాల్గొని నిరసన తెలియజేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పెరికే వరప్రసాద్, మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, తమిళనాడు రాష్ట్ర దళిత నాయకులు రంభ వనకం మురుగన్, గంజడా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
బాబు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి
తాడికొండ: రాజధాని పేరిట రూ.3.50 లక్షల కోట్లు లూటీ చేసిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణ వేసి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 169వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే సీఆర్డీఏ చైర్మన్‌గా ఉండి దళితుల్ని మోసగించి రూ.2 వేల కోట్లను దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు బయట తిరిగితే వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బెదిరింపుల ద్వారా కేసును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆయనను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకొని తండ్రీకొడుకులు దాచిన అవినీతి హెరిటేజ్ సంస్థ నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, బూదాల సలోమీ, కొలకలూరి లోకేష్, పులిదాసు పాల్గొన్నారు. -
చంద్రబాబు జాతి నాయకుడే
తాడికొండ: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జాతీయస్థాయి నేతనుంచి జాతి నాయకుడిగా దిగజారిపోయారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 162వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు. 14 సంవత్సరాల సీఎం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కుల నాయకుడిగా తయారై.. చరమాంకంలో అట్టర్ ఫ్లాప్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరిట దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు ఎన్ఆర్ఐల చందాలతో ఉద్యమం పెట్టించి డ్రామా కంపెనీ మేనేజర్‌లాగా తయారయ్యాడని మండిపడ్డారు. రాజధాని రైతులకు ఒక ఎజెండా లేకుండా దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటే పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో సమాధానం చెప్పి..అమరావతి ఉద్యమం కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల రెఫరెండంగానే పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారనే నిజం తెలుసుకుని చంద్రబాబు ఆయన సుపుత్రుడు లోకేష్ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు నానా తంటాలు పడడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బహుజనుల రాజ్యాంగబద్ధ హక్కుల కోసం.. పోరాటంలో విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
తాడికొండ: అమరావతిని కాపాడుకోకపోతే వేరే రాష్ట్రాలకు పోయి పాచిపని చేసుకోవాల్సి వస్తుందంటూ పేద, దళిత వర్గాల వృత్తిని కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలులో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 160వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్న చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు రెచ్చిపోయిన పెయిడ్ ఆర్టిస్టులంతా రాజధాని నుంచి డ్రామా కంపెనీని వేసుకుని బయలుదేరి మహిళా దినోత్సవం పేరుతో దుర్గమ్మను అడ్డు పెట్టి కుట్రలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 160 రోజులుగా దీక్షల్లో పాల్గొంటున్న పలువురు మహిళా సంఘాల నాయకులను శాలువాలతో ఘనంగా సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. -
ఎల్లో మీడియానే బాబుకు దిక్కు
తాడికొండ: అమరావతి ఉద్యమం చతికిలపడడంతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకున్న బాబు.. తనకు అనుకూలంగా ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వమే బంద్‌కు సహకరించి స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయించిందని, ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారని గుర్తు చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చివరకు మున్సిపల్ ఎన్నికల్లో దిగజారుడు ప్రచారానికి దిగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసిన దాఖలాలు లేవని, విశాఖపట్నంలో జనం లేక వెలవెలబోయిన ప్రచార సదస్సులకు రూ.500 ఇచ్చి కార్యకర్తలను మీటింగులకు తరలించారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా పేదలకు రావాల్సిన హక్కులను హరించిన చంద్రబాబుకు బహుజనులంతా కలిసి 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు లేకుండా గల్లంతయ్యేలా చేయడం ఖాయమన్నారు. మూడు రాజధానులు, పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 54 వేల ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఉద్యమం విశ్రమించేది లేదని తెలిపారు. నేతలు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, పలు సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
విశాఖ ఉక్కు యావత్ ఆంధ్రుల హక్కు
తాడికొండ: ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు నినదించారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 157వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కులం కోసం చేస్తున్న అమరావతి ఉద్యమం దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడటంతో టీడీపీ నాయకులతో కలిసి జనసేన, వామపక్ష పార్టీలు విశాఖపై కపట ప్రేమను ఒలకబోస్తూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఉనికిని కాపాడుకొనేందుకు యతి్నస్తున్నారన్నారు. రాజ్యాంగ పరంగా అంబేడ్కర్ ప్రసాదించిన హక్కుల సాధనే లక్ష్యంగా చిత్తశుద్ధితో చేస్తున్న బహుజన ఉద్యమంతో పాటు విశాఖ ఉక్కు ఉద్యమానికి బహుజన పరిరక్షణ సమితి మద్దతిస్తుందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనులందరినీ కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. -
రాజకీయ లబ్ధి కోసం బాబు కుట్ర
తాడికొండ: రాజధాని ముసుగులో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు చంద్రబాబు అండ్‌కో, టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. బహుజనులు కనీసం ఫ్యాను కూడా లేకుండా నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు అమరావతి రైతుల పేరిట బినామీల కనుసన్నల్లో ఎన్ఆర్ఐల ఫండ్‌తో ఏసీలతో ఉద్యమం సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 154వ రోజు బుధవారం కొనసాగిన రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిన తరువాత ప్రజలు తమను తిప్పికొట్టారని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు ఎత్తుగడలు మార్చి అమరావతిలో ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే అడ్డుకుంటామని దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్రంలో ఉన్న 3.50 కోట్ల మంది బహుజనులు బాబు అంతు చూస్తారని హెచ్చరించారు. అమరావతి బినామీ ఉద్యమం పేరిట ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, సినిమాల్లేని శివాజీ తదితర కృష్ణులొచ్చి పారిపోయారని, ఇప్పుడు 11వ కృష్ణుడుగా వడ్డే శోభనాద్రీశ్వరరావు వచ్చారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు, ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 54 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ సాధించి తీరతామన్నారు. నాయకులు నత్తా యోనారాజు, మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి
తాడికొండ: పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 153వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా చంద్రబాబు పర్యటన పేరిట అనుమతులు లేకుండా వెళ్లడమేగాక రాజకీయ లబ్ధి కోసం ఎయిర్‌పోర్టుల్లో నిరసనల పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్ర చేస్తున్నాడన్నారు. బహుజనుల హక్కులను హరించేలా బాబు కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో బహుజనులు టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. -
నిపుణుల కమిటీ చెప్పినట్లే రాజధానిలో భూ ప్రకంపనలు
తాడికొండ: నిపుణుల కమిటీ చెప్పినట్లుగానే అమరావతి రాజధానిలో భూ ప్రకంపనలు వస్తున్నాయని, ఆ నివేదికను తుంగలో తొక్కిన పాపం చంద్రబాబుదేనని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 151వ రోజు కొనసాగుతున్న దీక్షల్లో పలువురు ప్రసంగించారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీతో పాటు పలు కమిటీలు ఇది లోతట్టు ప్రాంతమే గాక, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని, భారీ నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా లేదని, కుంగిపోతుందని నిపుణుల కమిటీలు చెప్పాయని తెలిపారు. అయితే బాబు అండ్‌కో తమ స్థార్థం కోసం ఆ నివేదికలను పెడచెవిన పెట్టి మూర్ఖంగా రాజధాని నిర్మాణం చేశారని విమర్శించారు. రాజధాని పర్యటనకు వచ్చిన.. సినిమాల్లేని సినీ నటుడు శివాజీ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఓ టీవీ చానల్లో దోపిడీ చేసి.. విదేశాలకు పారిపోవాలని చూసిన శివాజీ ఇప్పటికే జైలు ఊచలు లెక్కించాడని, రాజధాని భూముల స్కామ్‌లో ఉన్న నిందితులంతా జైలు ఊచలు లెక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, బేతపూడి సాంబయ్య, మాదిగాని గురునాధం, గంజి రాజేంద్ర, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
బాబును నమ్మితే నట్టేట మునిగినట్లే..
తాడికొండ: చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచేస్తాడని, అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రాజధాని అభివృద్ధికి సహకరించాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు సూచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 148వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పలువురు ప్రసంగించారు. రూ.3 వేల కోట్లతో అమరావతి ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ఇకనైనా ఈ ప్రాంత రైతులు సీఎంను కలిసి సమస్యలు చెప్పుకుని రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కావాలో లేక చంద్రబాబు అభివృద్ధి కావాలో తేల్చుకోవాలని సూచించారు. రైతుల ముసుగులో జేఏసీ పేరిట కులవాదాన్ని బయటకు తీసుకొచ్చి చంద్రబాబు అండ్ కో విరాళాలు ఇచ్చి మరీ దొంగ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కుతో జనం పంచాయతీ కార్యాలయాల్లో అడుగుపెట్టకుండా బుద్ధి చెప్పినా.. బాబు తీరు మార్చుకోకపోతే తరిమికొట్టడం ఖాయమన్నారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో అవినీతిపై విచారణ జరపండి
తాడికొండ: అమరావతిలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ, సిట్ కేసులపై ఉన్న స్టేలను ఎత్తివేసి బాబు సహా బినామీలను జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 147వ రోజు కొనసాగుతున్న దీక్షల్లో పలువురు ప్రసంగించారు. రాజధానిలో రూ.5,370 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించి చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దుబారా చేశాడన్నారు. బహుజనుల రాజ్యాంగ హక్కులైన ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు, మూడు రాజధానులు సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో వేసిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరుగనున్న150వ రోజు దీక్షల్లో వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తామని తెలిపారు. కాగా, మంగళవారం కేబినెట్ భేటీలో భాగంగా సచివాలయం వెళుతూ, వస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రిలే దీక్షల శిబిరం వద్ద తన వాహన శ్రేణి వేగం తగ్గించి బహుజనులకు అభివాదం చేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్రకు ఏ మొహంతో వెళ్లావు బాబూ..
తాడికొండ: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కుల రాజధాని మాత్రమే కావాలంటూ దొంగ దీక్షలు చేయించిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని విశాఖ వెళ్లారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. ఉక్కు ఉద్యమాన్ని సైతం అడ్డుపెట్టుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 140వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు ప్రసంగించారు. విశాఖలో పాలనా రాజధాని ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా బహుజనులు దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని గతంలోనే తాడికొండ తొలి దళిత ఎమ్మెల్యే టి.అమృతరావు నిరాహార దీక్ష చేసి సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విశాఖపట్నం అంధ్రుల పాలనా రాజధాని అని ఒప్పుకుని మూడు రాజధానులకు మద్దతిస్తేనే చంద్రబాబును అక్కడకు రానివ్వాలని, లేకుంటే ఆయనను తరిమికొట్టాలని విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 శాతం ఓట్లతో హవా చాటిన వైఎస్సార్ సీపీ జోరు తిరిగి మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని తెలిపారు. పార్టీ గుర్తులతో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని రిఫరెండంగా తీసుకుని చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బేతపూడి సాంబయ్య, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, జూపూడి బాలస్వామి, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. -
బినామీ రైతులది మొసలి కన్నీరు
తాడికొండ: విశాఖలో రాజధాని వద్దన్న అమరావతి బినామీ రైతులు.. ఉక్కు ఉద్యమానికి మద్దతంటూ మొసలి కన్నీరు కార్చడం హేయనీయమని బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు మండిపడ్డారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో 139 రోజు పలువురు ప్రసంగించారు. విశాఖలో రాజధాని వద్దు.. మాకే రాజధాని కావాలని ఏడాదికి పైగా ఉద్యమాలు చేస్తున్న వీరు.. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వెళ్లడం ఉక్కు ఉద్యమాన్ని అవమాన పర్చడమేనన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్ చూపించి రియల్ ఎస్టేట్ చేశాడని తేటతెల్లం కావడంతోనే అన్ని ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు. నేతలు నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, ఊపూరి ఆదాం తదితర దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో బహుజన వాదానిదే విజయం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన వాదానిదే విజయమని, పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో 126వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో అధిక శాతం ఓట్లు బహుజనులవేనన్నారు. చంద్రబాబు పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టుల్లో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబుపై కోర్టుల్లో ఉన్న స్టేలు తొలగించి విచారణకు స్వీకరించి వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు తదితరులు పాల్గొన్నారు. -
124వ రోజుకు మూడు రాజధానుల మద్దతు దీక్షలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 124వ రోజుకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు, బహుజనులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజధాని పేరిట 29 గ్రామాల్లో జరిగిన రూ.3.56 లక్షల కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును సీఆర్డీఏ పేరుతో నిలువునా దోచేసిన చంద్రబాబు అండ్ కో పేదలకు ఇళ్ల పట్టాలు రానివ్వకుండా సీఆర్డీఏ పేరుతో కోర్టుల్లో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అడ్డగోలు దోపిడీలు చేసి వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్న చందబ్రాబు అండ్ కోపై కేంద్ర ప్రభుత్వం స్పందించి రాజధాని పేరిట జరిగిన దోపిడీని బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిని నిగ్గుతేల్చి శిక్ష విధించకపోతే బహుజనులకు జీవితాంతం అన్యాయం జరుగుతూనే ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగిన టీడీపీ, దాని తోక పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. -
మేనిఫెస్టో పేరిట మరో మోసమా చంద్రబాబూ..
తాడికొండ: పార్టీలతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో పేరిట మోసానికి దిగిన చంద్రబాబుకు..ఒకే రాజధాని కావాలని, పేదలకు ఇంగ్లిష్ మీడియం, ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని మేనిఫెస్టోలో పెట్టి రిఫరెండంగా ఎన్నికలకు వచ్చే దమ్ముందా అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 122వ రోజుకు చేరాయి. దీక్షలో పలువురు దళిత నేతలు మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పగలు రగిల్చేందుకు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను హరించేలా కోర్టుల్లో చంద్రబాబు అక్రమ కేసులు వేసి అడ్డుకుంటున్న నేపథ్యంలో బాబును ఏపీలో భూ స్థాపితం చేయడం ఖాయమన్నారు. పార్టీ రహిత ఎన్నికలకు చంద్రబాబు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా నిమ్మగడ్డ చర్యలు తీసుకోకపోవడం ఆయన పక్షపాతానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో జీరో అయిన చంద్రబాబును ఏపీలో కూడా ఇక పత్తా లేకుండా చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, కోర్టులు జోక్యం చేసుకుని, ఎన్నికల కమిషనర్‌ను వెంటనే బదిలీ చేసి బహుజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు పెరికే వరప్రసాద్, మాదిగాని గురునాథం, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, నూతక్కి జోషి, రుద్రపోగు సురేష్, పలువురు మహిళలు, బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబును చూసి జనం ఛీత్కరించుకుంటున్నారు
తాడికొండ: వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న చంద్రబాబు రెండేళ్లుగా పాలక పక్షాన్ని ముందుకెళ్లనీయకుండా, చివరకు సంక్షేమాన్ని సైతం అడ్డుకోవడాన్ని చూసి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని బహుజన పరిరక్షణ సమితి, దళిత నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 120వ రోజు రిలే నిరాహార దీక్షలకు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రం యావత్తూ అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తుంటే.. చంద్రబాబు తన బినామీలను పెట్టి అమరావతి ఉద్యమం పేరిట చేయిస్తున్న దొంగ దీక్షలను ఎల్లో మీడియాలో పెద్దదిగా చూపడం విడ్డూరమన్నారు. సీపీఐ నాయకులు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్రాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, రుద్రపోగు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుల్లో కేసులు వేయడం అన్యాయం
తాడికొండ: స్థానికంగా ఉండే పేదలకు ఇళ్ల స్థలాలిస్తే డెమోగ్రాఫికల్ ఇన్‌బ్యాలెన్స్ నెలకొంటుందంటూ కోర్టుల్లో కేసులు వేయడం అన్యాయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో 116వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన ఓ అగ్రకులం సెటిలర్స్గా చేరి పెత్తనం చేసినపుడు డెమోగ్రాఫికల్ ఇన్‌బ్యాలెన్స్ కనిపించలేదా అని మండిపడ్డారు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను కొంతమంది అగ్రకుల పెత్తందారులు అనుభవిస్తూ వ్యవస్థలను లోబర్చుకుని పేదలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కో అడ్డదారుల్లో వెళుతూ పేదల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు సహకరించకుండా అడ్డుకుంటే బహుజనులంతా కలిసి ఏకమై.. రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. 5 సంవత్సరాలు అధికారం అనుభవించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కోట్లాది రూపాయలు లాభం పొందిన చంద్రబాబు అండ్ కో పేదల అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలతో ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం, నత్తా యోనారాజు, మల్లవరపు సుధారాణి, జూపూడి బాలస్వామి, బొందపల్లి గిరిజ, యాతం క్రాంతి కుమార్, మంద గిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే ఎన్నికల్ని బహిష్కరిస్తాం
తాడికొండ: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తరుణంలో పేదల ప్రాణాలను పణంగా పెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ మొండిగా ముందుకెళితే రాష్ట్రంలోని 3.50 కోట్ల మంది బహుజనులు ఎన్నికలను బహిష్కరించేలా చేస్తామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 115వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ పేరుతోదళిత, బహుజనులైన ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్, నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సీఐ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించటం అమానుషమన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉండరనే అనుమానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను ఎన్నికల కోడ్ పేరుతో తొలగించారన్నారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు బి.శామ్యూల్, నత్తా యోనారాజు, మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పల్లె బాబు పాల్గొన్నారు.