దళితులపై వివక్ష చూపినందుకే టీడీపీకి చావుదెబ్బ | Leaders Of Bahujana Parirakshana Samiti Comments On TDP | Sakshi
Sakshi News home page

దళితులపై వివక్ష చూపినందుకే టీడీపీకి చావుదెబ్బ

Published Sat, Nov 21 2020 5:15 AM | Last Updated on Sat, Nov 21 2020 5:15 AM

Leaders Of Bahujana Parirakshana Samiti Comments On TDP - Sakshi

మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాల ప్రతినిధులు

తాడికొండ: రాజధాని ప్రాంతంలో దళితులు, పేద వర్గాలపై వివక్ష చూపిన కారణంగానే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొట్టారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం 52వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతి ఉద్యమాన్ని భూతద్దంలో చూపిస్తున్నారన్నారు. కోర్టుల్లో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని.. ఇకనైనా బుద్ధి మార్చుకుని మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే దళితులు, బహుజనులు సంఘటితమై చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు.  వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, జేటీ రామారావు, నూతక్కి జోషి, కొలకలూరి లోకేష్, పులి దాసు, నత్తా యోనరాజు, బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement