చంద్రబాబు కన్నా.. బ్రిటీష్‌ వారే నయం | Bahujan Parikshana Samiti Riley fasting initiations on the 81st day | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కన్నా.. బ్రిటీష్‌ వారే నయం

Published Sun, Dec 20 2020 3:55 AM | Last Updated on Sun, Dec 20 2020 12:58 PM

Bahujan Parikshana Samiti Riley fasting initiations on the 81st day - Sakshi

ర్యాలీ నిర్వహిస్తున్న బహుజన పరిరక్షణ సమితి సంఘాలు

తాడికొండ: చంద్రబాబు ఆలోచనలు బ్రిటీష్‌ వారి పాలన కన్నా ఘోరంగా ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి సంఘాలు మండిపడ్డాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 81వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పలువురు దళిత నేతలు మాట్లాడుతూ సమాజంలో దళితులకు సమానత్వం, ఆత్మ గౌరవం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించి హక్కులు కల్పిస్తే.. ఆ హక్కులను హరిస్తూ చంద్రబాబు కుల రాజధాని నిర్మాణం చేశాడన్నారు.

చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించి దళితులకు అడ్డుపడకుండా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బహుజన పరిరక్షణ సమితికి చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. కాగా, తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు, పాలనా వికేంద్రీకరణ, పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య కోరుతూ 56 దళిత సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి. మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పలువురు నేతలు మాట్లాడారు.  బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, కిషోర్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement