Riley fasting
-
సిసలైన సైకో చంద్రబాబు నాయుడే
తాడికొండ: ఓట్ల కోసం తోక పార్టీలతో కలిసి కులవాదులు డ్రామాలాడుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 832వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అందకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు, వికేంద్రీకరణ జరగనీయకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును జనం తరిమికొట్టడం ఖాయమన్నారు. మామ దగ్గర సైకిల్‌ను దొంగిలించి.. సైకో రాజకీయాలు చేస్తూ జనంలో తిరుగుతున్న సిసలైన సైకో చంద్రబాబేనని ధ్వజమెత్తారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రజలు చనిపోతే కనీసం చలించకుండా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కుప్పంలో పర్యటనలు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా.. అని ప్రశ్నించారు. బహుజనులను బలిచేస్తున్న దొంగ సభలను రద్దుచేయకుంటే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. ప్రచారార్భాటాల కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా బాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరనేది గుర్తుంచుకుంటే మంచిదని, ఇకనైనా కళ్లు తెరిచి పేదల పక్షాన నిలువకపోతే ఆయనను ప్రజల్లో తిరగకుండా అడ్డకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, బొలిమేర శామ్యూల్, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, కారుమూరి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్ -
నేడు రిలే నిరాహార దీక్షలు
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని నిరసన కేంద్రాల వద్ద ఈ దీక్ష జరుగుతుందని ఆదివారం ప్రకటించారు. మూడు వారాలకు పైగా సాగుతున్న నిరసన దీక్షల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా రైతులు ఆదివారం ‘శ్రద్ధాంజలి దివస్’ను పాటించారు. రైతులతో ఒకటి, రెండు రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని హోంమంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు నేతలతో చర్చలు పునః ప్రారంభిస్తారన్నారు. సింఘు సరిహద్దు వద్ద సోమవారం 11 మంది రైతులతో రిలే నిరాహార దీక్ష జరుగుతుందని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. హరియాణాలోని రహదారులపై ఈనెల 25 నుంచి 27 వరకు టోల్ ఫీజులను ఎవరూ చెల్లించకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్ యూనియన్ నేత జగ్జీత్ సింగ్ దలేవాలా ప్రకటించారు. 27న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రసంగం ఇచ్చే సమయంలో అంతా పళ్లాలపై చప్పుడు చేస్తూ నిరసన తెలపాలని దేశ ప్రజలను కోరారు. ‘ఫేస్బుక్’ను బ్లాక్ చేశారు రైతు ఆందోళనలను సోషల్ మీడియాలో ప్రజలకు వివరిస్తున్న ‘కిసాన్ ఏక్తా మోర్చా’ ఫేస్బుక్ పేజ్ని బ్లాక్ చేశారని రైతు నేతలు ఆరోపించారు. ఆదివారం రైతు నేతల విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం సాగుతుండగానే పేజ్‌ను బ్లాక్ చేశారన్నారు. 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తమ అధికారిక ఫేస్బుక్ పేజ్‌ను ఫేస్బుక్ సంస్థ తొలగించిందని కిసాన్ ఏక్తా మోర్చా తెలిపింది. రైతులకు మళ్లీ ఆహ్వానం తదుపరి విడత చర్చలకు రావాలని కోరుతూ రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం లేఖ రాసింది. ఏ తేదీన చర్చకు వస్తారో తెలియజేయాలంటూ వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఆ లేఖలో రైతు నేతలను కోరారు. 25న రైతులతో సంభాషించనున్న మోదీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజైన డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో సంభాషిస్తారని బీజేపీ తెలిపింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 2500 ప్రాంతాల్లో కిసాన్ సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సొంత పత్రిక ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు సొంతంగా ఒక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. రైతు ఉద్యమ వివరాలతో వారానికి రెండు సార్లు వచ్చే ఈ ‘ట్రాలీ టైమ్స్’ పత్రిక తొలి ప్రతిని శనివారం ప్రచురించారు. రైతు నేతల విలేకరుల సమావేశాల వివరాలు, ప్రభుత్వ తీరు, ఇతర రైతాంగ ఉద్యమ అంశాలను ప్రచురించనున్నామన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారం అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోషియార్ సింగ్ అనే రైతు తెలిపారు. -
చంద్రబాబు కన్నా.. బ్రిటీష్ వారే నయం
తాడికొండ: చంద్రబాబు ఆలోచనలు బ్రిటీష్ వారి పాలన కన్నా ఘోరంగా ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి సంఘాలు మండిపడ్డాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 81వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పలువురు దళిత నేతలు మాట్లాడుతూ సమాజంలో దళితులకు సమానత్వం, ఆత్మ గౌరవం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి హక్కులు కల్పిస్తే.. ఆ హక్కులను హరిస్తూ చంద్రబాబు కుల రాజధాని నిర్మాణం చేశాడన్నారు. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించి దళితులకు అడ్డుపడకుండా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బహుజన పరిరక్షణ సమితికి చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. కాగా, తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ నుంచి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు, పాలనా వికేంద్రీకరణ, పేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోరుతూ 56 దళిత సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి. మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పలువురు నేతలు మాట్లాడారు. బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు బేతపూడి సాంబయ్య, మల్లవరపు సుధారాణి, కిషోర్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అయ్యన్న నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లు కొడతామని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు గుడివాడ అమరనాథ్ హెచ్చరించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అయ్యన్నను నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆయన మాట్లాడారు. కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నాయి. పెందుర్తి నియోజక వర్గ ఇన్చార్జ్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తిప్పల నాగరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వవర్యంలో హోదా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు ముందు వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు రాస్తారాకో, బైఠాయింపులు చేపట్టారు. తగరపువలసలో భీమిలి నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
సేవలు బంద్
♦ రిమ్స్ కార్మికుల ఒక్క రోజు సమ్మె ♦ ఆదివారం రాత్రి 8 నుంచి మొదలు ♦ నిలవనున్న పారిశుద్ధ్య, ఇతర కార్యక్రమాలు ♦ సమ్మెలోకి సుమారు 552 మంది కార్మికులు ♦ రిలే నిరాహార దీక్షలు చేసినా స్పందన శూన్యం శ్రీకాకుళం పాతబస్టాండ్: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రిమ్స్‌లో కార్మికులు ఆం దోళనను ఉద్ధృతం చేశారు. వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా అధికారులు, ప్రభుత్వం, కా ంట్రాక్టు సిబ్బంది స్పందించకపోవడంతో 24 గంటల సమ్మెకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటల ను ంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు దీనిని చేపట్ట బోతున్నారు. పారిశుద్ధ్యం, ఎస్టీపీ ప్లాంట్, సెక్యూరిటీ వి భాగాలకు చెందిన వారితో పాటు ఎఫ్ఎంవో, ఎంఎన్‌వో, అటెండర్లు సుమారు 552 మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కార్మిక యూ నియన్ ప్రతినిధులు డి.గణేశ్, డి. సింహాచలం.. రిమ్స్ అధికారులకు తెలియజేశారు. దీంతో సోమవారం నుంచి ఆస్పత్రిలో పలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిలిచిపోనున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు సమ్మె వల్ల ప్రధానంగా రిమ్స్‌లో పారిశుద్ధ్యం క్షీణించనుంది. ఎస్టీపీ ప్లాంట్ సిబ్బంది కూడా లేపోవడంతో దుప్పట్లు, కాటన్ స్టెరిలైజేషన్, ఇతర పనులు నిలిచిపోనున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ సమ్మెలోకి వెళుతున్నారు. దీంతో రిమ్స్‌లో వివిధ వార్డులు, కళాశాల, ప్రధాన ద్వారం వద్ద ఈ సెక్యూరిటీ కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు కూడా సమ్మెలో ఉండడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. వార్డుల్లో రోగులకు కొన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఇవీ ప్రధాన డిమాండ్లు రిమ్స్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లించాలి. జీవో 151 ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించాలి, కొన్నేళ్లుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఎగవేస్తున్న టీడీఎస్‌ను వెంటనే చెల్లించాలి. పని పెరిగినందున సిబ్బందిని పెంచాలి. కార్మికుల సమస్యలు పట్టించుకుని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. రిమ్స్ అధికారులు, కలెక్టర్ కలుగజేసుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిమ్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారానికి ఏడో రోజుకు చేరాయి. వీరిని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కేవీ రమణ మాదిగ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలు కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ వంటిìవి వెంటనే చెల్లించాలన్నారు. కార్మికులు రిమ్స్ అభివృద్ధిలో భాగస్వాములని, వారికి నెలవారీ జీతాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏడో రోజు దీక్షలో చల్లా అప్పారావు, బి.సంతోషి, కె.విజయ, ఎస్.పాల్గుణరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డి.గణేష్, డి. సింహాచలం, బి.సత్యం, తిరుపతిరావు, ఎ.శ్యామల, డి.భారతి, అమ్మనమ్మ, తేజ, జ్యోతి, బాలసుందరం, ఎ ఆరుణ, విజయ, సరస్వతి, శ్రీదేవి, దమయంతి, తదితరులు ఉన్నారు.