సేవలు బంద్
♦ రిమ్స్ కార్మికుల ఒక్క రోజు సమ్మె
♦ ఆదివారం రాత్రి 8 నుంచి మొదలు
♦ నిలవనున్న పారిశుద్ధ్య, ఇతర కార్యక్రమాలు
♦ సమ్మెలోకి సుమారు 552 మంది కార్మికులు
♦ రిలే నిరాహార దీక్షలు చేసినా స్పందన శూన్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రిమ్స్‌లో కార్మికులు ఆం దోళనను ఉద్ధృతం చేశారు. వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా అధికారులు, ప్రభుత్వం, కా ంట్రాక్టు సిబ్బంది స్పందించకపోవడంతో 24 గంటల సమ్మెకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటల ను ంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు దీనిని చేపట్ట బోతున్నారు. పారిశుద్ధ్యం, ఎస్టీపీ ప్లాంట్, సెక్యూరిటీ వి భాగాలకు చెందిన వారితో పాటు ఎఫ్‌ఎంవో, ఎంఎన్‌వో, అటెండర్లు సుమారు 552 మంది కార్మికులు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కార్మిక యూ నియన్ ప్రతినిధులు డి.గణేశ్, డి. సింహాచలం.. రిమ్స్ అధికారులకు తెలియజేశారు. దీంతో సోమవారం నుంచి ఆస్పత్రిలో పలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
నిలిచిపోనున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు
సమ్మె వల్ల ప్రధానంగా రిమ్స్‌లో పారిశుద్ధ్యం క్షీణించనుంది. ఎస్టీపీ ప్లాంట్ సిబ్బంది కూడా లేపోవడంతో దుప్పట్లు, కాటన్ స్టెరిలైజేషన్, ఇతర పనులు నిలిచిపోనున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ సమ్మెలోకి వెళుతున్నారు. దీంతో రిమ్స్‌లో వివిధ వార్డులు, కళాశాల, ప్రధాన ద్వారం వద్ద ఈ సెక్యూరిటీ కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇక ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు కూడా సమ్మెలో ఉండడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. వార్డుల్లో రోగులకు కొన్ని సేవలు నిలిచిపోనున్నాయి.
ఇవీ ప్రధాన డిమాండ్లు
రిమ్స్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లించాలి. జీవో 151 ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించాలి, కొన్నేళ్లుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఎగవేస్తున్న టీడీఎస్‌ను వెంటనే చెల్లించాలి. పని పెరిగినందున సిబ్బందిని పెంచాలి. కార్మికుల సమస్యలు పట్టించుకుని కాంట్రాక్టు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. రిమ్స్ అధికారులు, కలెక్టర్ కలుగజేసుకొని సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
ఏడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిమ్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారానికి ఏడో రోజుకు చేరాయి. వీరిని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు కేవీ రమణ మాదిగ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలు కార్మికుల పీఎఫ్, ఈఎస్‌ఐ, టీడీఎస్ వంటిìవి వెంటనే చెల్లించాలన్నారు. కార్మికులు రిమ్స్ అభివృద్ధిలో భాగస్వాములని, వారికి నెలవారీ జీతాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏడో రోజు దీక్షలో చల్లా అప్పారావు, బి.సంతోషి, కె.విజయ, ఎస్.పాల్గుణరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డి.గణేష్, డి. సింహాచలం, బి.సత్యం, తిరుపతిరావు, ఎ.శ్యామల, డి.భారతి, అమ్మనమ్మ, తేజ, జ్యోతి, బాలసుందరం, ఎ ఆరుణ, విజయ, సరస్వతి, శ్రీదేవి, దమయంతి, తదితరులు ఉన్నారు.