అయ్యన్న నోరు అదుపులో పెట్టుకో | YCP Leader Gudivada Amarnath Fires On Minister Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

అయ్యన్న నోరు అదుపులో పెట్టుకో

Published Mon, Apr 9 2018 4:20 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

YCP Leader Gudivada Amarnath Fires On Minister Ayyanna Patrudu - Sakshi

గుడివాడ అమరనాథ్‌

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యన్నపాత్రుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లు కొడతామని విశాఖ జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుడివాడ అమరనాథ్‌ హెచ్చరించారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశిస్తే అయ్యన్నను నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆయన మాట్లాడారు.

కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నాయి. పెందుర్తి నియోజక వర్గ ఇన్‌చార్జ్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద  నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త తిప్పల నాగరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి.

నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వవర్యంలో హోదా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు​కు చేరుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు ముందు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు రాస్తారాకో, బైఠాయింపులు చేపట్టారు. తగరపువలసలో భీమిలి నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement