
విశాఖ పట్నం పాలన రాజధానిగా విజయదశమి నుంచే అమలులోకి వస్తుందని..
సాక్షి, విజయవాడ: దసరా నుంచి విశాఖలో సీఎం పరిపాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నేటి కేబినెట్ మీటింగ్‌లోనూ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయం ఉద్ఘాటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు.
సీఎం ఎక్కడ నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అధికారులతో ఓ కమిటీ వేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. సీఎంని విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదని అన్నారు.
చంద్రబాబు అవినీతి చేసి జైలుకి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనపై ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పారు. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తీసుకువచ్చిన చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఆధారాలు లేకుంటే న్యాయస్థానం రిమాండ్ ఎందుకు ఇస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభలో చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు