GUDIVADA Amarnath
-
కొత్త అల్లుడికి 250 రకాల వంటకాలు పెట్టినట్టు.. జగన్ కూడా ఒకేసారి ప్రజలకి ఇచ్చాడు
-
ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలన్నారుచంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి.. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదు.. విశాఖలో పుట్టిన వ్యక్తిగా మేం ప్రజలకు అండగా ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం కూటమి ప్రభుత్వానికి సమయమిస్తాం... ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎం జగన్ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశారు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ప్రజలకు ఇంటి దగ్గరికే పథకాలు వచ్చేలా చేశారు. గాజువాక అభివృద్ధి కోసం గెలిచిన అభ్యర్థికి సహకరిస్తా. ఏపీకి విశాఖ కీలకం.. ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలి విశాఖ నగరానికి ఉన్న అంశాలు, అవకాశాల్ని కూటమి గుర్తించాలి. రామయ్య పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ఈ కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. అమరావతి వద్దు.. విశాఖ ఒకటే అనలేదు. విశాఖతో పాటు కర్నూలు, అమరావతిని అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెప్పింది’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
'దర్శిని' టీమ్ కి అల్ ది బెస్ట్: మంత్రి గుడివాడ అమర్నాథ్
వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దర్శిని'. వికాస్, శాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్టుతో దీన్ని తెరకెక్కించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) మినిస్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ.. 'దర్శిని' పాటలు చూశాను. టీజర్ చూశాను. చాలా బాగున్నాయి, సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికి శుభాకాంక్షలు అని అన్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
భువనేశ్వరి చాలా లేట్ చేసింది.. భార్య కంటే చంద్రబాబు గురించి ఎవరికి తెలుస్తుంది
-
అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, ఈ విషయంలో కాంప్రమైజ్, కన్విన్స్ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు పార్టీని వీడటంపై గుడివాడ స్పందించారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ‘కొద్ది రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు. టికెట్లు రాని వ్యక్తులు ఎన్నికల వేళ పార్టీ కి దూరంగా ఉండటం వల్ల నష్టం లేదు’ ‘ఏపీలో 175 సీట్లే ఉన్నాయి. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆయన వాటిని తిరస్కరించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది’ అని గుడివాడ స్పష్టం చేశారు. ఇదీచదవండి..బాబు, పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి -
ఐఐటీఎఫ్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్
ఢిల్లీ: పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్)లో ఏపీ పెవిలియన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, తయారయ్యే వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.పెవిలియన్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , జగనన్న కాలనీల నమూనాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఏపీలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 45వేల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు. ఏపీలో పరిశ్రమల గ్రోత్ రేటు 11.43తో అందరి కంటే ముందుందని వెల్లడించారు. ఎగుమతులలో ఏపీ ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: దయాకర్ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ -
విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విజయవాడ: దసరా నుంచి విశాఖలో సీఎం పరిపాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నేటి కేబినెట్ మీటింగ్‌లోనూ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయం ఉద్ఘాటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సీఎం ఎక్కడ నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అధికారులతో ఓ కమిటీ వేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. సీఎంని విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదని అన్నారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనపై ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పారు. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తీసుకువచ్చిన చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఆధారాలు లేకుంటే న్యాయస్థానం రిమాండ్ ఎందుకు ఇస్తుందని అన్నారు. ఇదీ చదవండి: రాజ్యసభలో చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు -
ఐటీ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి చెందనుందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటీకీ జీవం పోస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రశంసించారు. ఎండాడ సమీపంలో ఐటీ సెజ్ హిల్ నంబర్–2లో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు కానున్న నూతన భవనాన్ని బుధవారం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమావేశంలో ఇన్ఫోసిస్ సంస్థ మౌలిక సదుపాయాల విభాగం వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ నీలాద్రి ప్రసాద్మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ దేశాయ్, మౌలిక సదుపాయాల రీజినల్ హెడ్ కులకర్ణి, సంస్థ ఇతర ప్రతినిధులు జయచంద్రన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ప్రారంభోత్సవ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు. -
బీజేపీ పురందేశ్వరి వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ కౌంటర్
-
మంత్రి అమర్నాథ్ పవన్ పెళ్లిళ్ల పై అదిరిపోయే పంచులు
-
దిగ్గజ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆహ్వానించారు. బుధవారం ముంబైలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రను పరిశ్రమలశాఖ డైరెక్టర్ సృజనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు. సంస్కృతి ఉట్టిపడేలా ఇన్విటేషన్ కిట్లు.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఇన్విటేషన్ కిట్స్’ను సిద్ధం చేసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆహ్వానితులను కలిసినప్పుడు కలంకారీ వర్క్‌తో చేసిన ఉప్పాడ శిల్క్ శాలువతో సత్కరించి, స్వరోవ్స్కీ క్రిస్టల్‌తో చేసిన రాష్ట్ర పక్షి రామ చిలుక ప్రతిమను అందించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నారు. సదస్సుకు ఆహ్వానిస్తూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సహజ వనరులు, మానవ వనరులు తదితరాలతో ముద్రించిన బ్రోచర్‌ను కూడా కిట్‌తో పాటు అందిస్తున్నారు. -
టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వ్యక్తి కొణతల రామకృష్ణ: మంత్రి గుడివాడ అమర్నాథ్
-
ఇప్పుడు ఉత్తరాంధ్రకు వెన్నుపోటా?
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి యాత్ర క్యాపటలిస్టులు వెనక్కి వెళ్లారని, కానీ ఇంకా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. ఉత్తరాంధ్రకు ఏం కావాలో చెప్పాల్సింది పోయి అమరావతి కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో 22 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రేపటి నుంచి టీడీపీ వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రపై విషం చిమ్మి అమరావతి వైపు పెట్టుబడులు వెళ్లేలా చేస్తున్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు చంద్రబాబు బూట్లు నాకుతారు. ఉత్తరాంధ్ర అంటే గంజాయి సాగు జరుగుతుందని పంటలు పండవని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం అమరావతికి అడ్డు పడటం లేదు.. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అది తప్పా? విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి పెట్టుబడులకు నష్టం వస్తుందని చంద్రబాబు తాబేదార్ల భయం. విశాఖలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. అమరావతి రైతులది వితండ వాదం.. భూములు ఇచ్చాం రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎలా? త్యాగం అంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులది. మీ కోసం మీరు భూములు ఇవ్వడం స్వార్థం.’ అని పేర్కొన్నారు మంత్రి అమర్నాథ్. టీడీపీ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగ్, భూముల రికార్డ్ల ట్యాంపరింగ్ జరిగిందని అందరికీ తెలుసునన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు నాయకుని వెనుక ఉన్న నాయకులు అదే ఆలోచనతో ఉత్తరాంధ్రకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష విశాఖ గర్జనలో కనిపించిందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు.. ఈనాడు, టీడీపీపై మంత్రి మండిపాటు -
చంద్రబాబును విశ్వసించేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు : గుడివాడ అమర్నాథ్
-
చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పేకలో జోకర్లా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన విశాఖ.. మన రాజధాని పేరుతో నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జన పిలుపు మేరకు తామంతా మద్దతు పలుకుతున్నామన్నారు. ఈ నెల 15న గర్జన పిలుపుతో ఉలిక్కిపడిన చంద్రబాబు.. దాన్ని తప్పుదోవ పట్టించేందుకు తన జోకర్ పవన్‌కల్యాణ్‌ను బరిలోకి దింపుతున్నాడని విమర్శించారు. గాజువాకలో చిత్తుచిత్తుగా ఓడించినందుకే పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంపై ద్వేషం పెంచుకున్నారన్నారు. పవన్‌ను చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ వాడుకుంటారని, బాబు డైరెక్షన్లో పనిచేస్తున్న పవన్‌కు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటుందని తాము భావించడం లేదని అభిప్రాయపడ్డారు. జనవాణి సాకుతో విశాఖ వస్తున్న పవన్ కల్యాణ్, ముందు.. వికేంద్రీకరణపై తన వాణి ఏమిటో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. 16న నిర్వహించే జనవాణికి వచ్చే పవన్‌ను వికేంద్రీకరణపై ఉత్తరాంధ్ర ప్రజలే నిలదీస్తారన్నారు. ఈ ప్రాంత ఆలోచనల్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు చేపడుతున్న విశాఖ గర్జన విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తామంతా వికేంద్రీకరణ కోసం గర్జిస్తుంటే.. పవన్ మాత్రం.. బాబు వెనక పిల్లిలా మ్యావ్ మ్యావ్ అని భజన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సినిమాలో వచ్చే రెమ్యూనరేషన్ కంటే చంద్రబాబు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉందని, అందుకే పవన్ సినిమా కాల్షీట్ల కంటే బాబు పొలిటికల్ కాల్షీట్లకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఒక్కో రాజధానిగా చేయండని సలహా ఇచ్చిన పవన్‌కు.. రాష్ట్రంలో 26 జిల్లాలున్నాయన్న జ్ఞానం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మంచి జరగాలన్న నినాదం, విధానంతో ప్రభుత్వం ముందుకువెళ్తుంటే.. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దండయాత్రకు వస్తున్న అమరావతి రైతులకు పైలట్‌గా ముందుగా పవన్ వస్తున్నారనీ.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గుర్తించి ఇప్పటికైనా తన పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు. ఆయనకు రాజధానులు కంటే రాణిధానుల గురించే ఎక్కువ ఆసక్తి ఉంటుందనీ.. ఇప్పటికే పవన్‌కు అంతర్జాతీయ రాజధానిగా మాస్కో, జాతీయ రాజధానిగా ముంబై, పక్కనే హైదరాబాద్ ఉన్నాయని చురకలంటించారు. ఫెడరల్ సిస్టమ్ గురించి తెలీని పవన్ లక్షా 80 వేల పుస్తకాలు చదివారా.? లేదా అందులోని బొమ్మలు మాత్రమే చూశారా అనే అనుమానం వస్తోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. -
ప్రజల ఆకాంక్షకు భిన్నంగా అమరావతి యాత్ర జరుగుతోంది : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!
సాక్షి, విశాఖపట్నం : ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సొంత భవనం సమకూర్చుకునే వరకు అక్కడే నడుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఆరంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచనుంది. త్వరలో హెచ్‌సీఎల్ కూడా.. మరోవైపు ఇన్ఫోసిస్‌తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. టైర్–2 నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడంతో ఇంకా మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బహుళ జాతి ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే మరో ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.14,634 కోట్లు వెచ్చిస్తోంది. కాగా విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, ఐటీ రంగానికున్న అనుకూలతల నేపథ్యంలో రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని, ఫలితంగా విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. (క్లిక్: మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్) -
లోకేష్ నీకు సిగ్గు,లజ్జా ఉందా: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
విశాఖపట్నం : ఫొటో ఎక్స్‌పోలో మోడల్స్ ర్యాంప్ వాక్ ఫొటోలు
-
ప్రజల దృష్టి మరల్చేందుకే బాబు క్షుద్ర రాజకీయం
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయానికి తెర తీశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఓటమి భయంతోనే గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడితో సీఎం వైఎస్ జగన్‌ను అసభ్యంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలోని అక్రమ నివాసంలో ఉంటూ చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడికి దిగడం దారుణమన్నారు. చంద్రబాబు తన కాపలాకుక్క బుద్ధా వెంకన్న, కాల్‌మనీ బ్యాచ్, టీడీపీ గూండాలను ఉసిగొల్పి దాడి చేయించడంతోపాటు జోగి వాహనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్, మంత్రులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే.. రాష్ట్రంలో ఎక్కడా చంద్రబాబును తిరగనివ్వబోమన్నారు. గంజాయి డాన్‌గా అయ్యన్న కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని.. అందులో చంద్రబాబుకు వాటా ఇచ్చారని విమర్శించారు. అయ్యన్నకు, పిచ్చికుక్కకు ఏమీ తేడా లేదన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం పెగ్గు వేస్తే తప్ప.. పనిచేయలేకపోయేవారని టీడీపీ నేతలే చెప్పేవారన్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పెగ్గు వేస్తున్నారేమోనన్నారు. అయ్యన్న తినేది అన్నమేనా? అయ్యన్న అన్నం తింటున్నాడా లేక గడ్డి తింటున్నాడా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. అయ్యన్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచి్చనట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో దళితులను అవమానించారన్నారు. బీసీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. జోగి రమే‹Ùపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దిశ ప్రతులు తగలబెట్టిన లోకేష్ కూడా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు అండ్ కో పంచభూతాలను దోచుకున్నారు
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు 2014 నుంచి 2019 వరకు పంచభూతాలను దోచుకుతిన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి ప్రాంతంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ప్రభుత్వం అడ్డుకున్నట్లు చంద్రబాబు ట్విట్టర్లో శుక్రవారం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సున్నిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి అనుమతులు లేకుండా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుంటే వారితో గొడవపడడం దుర్మార్గమన్నారు. ఇక్కడి పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గనులు, ఖనిజాలు దోచుకున్నది టీడీపీ నేతలే విశాఖ మన్యంలో గంజాయి, లేటరైట్ వ్యాపారం చేసింది టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులేనని అమర్నాథ్ స్పష్టంచేశారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, లోకేష్‌లు కలిసి విశాఖలో లేటరైట్‌ను దోచుకున్నారని మండిపడ్డారు. వారి అక్రమ మైనింగ్‌కు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బలైపోయారన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కిడారిని మభ్యపెట్టి టీడీపీలోకి లాక్కొని అతని హత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆయన హత్యలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అని అన్నారు. మరోవైపు.. టీడీపీ హయాంలో ఇసుకలో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందని అందులో చంద్రబాబు వాటా రూ.5 వేల కోట్లని అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ఇసుకను దోచుకుంటే.. గుంటూరు జిల్లాలో యరపతినేని శ్రీనివాస్ అక్రమ క్వారియింగ్‌కు పాల్పడ్డారని, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులు అక్రమ మైనింగ్‌లతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను దోచుకుని రూ.2 లక్షల కోట్లు ఆర్జించారని ధ్వజమెత్తారు. వారి అక్రమాలను గుర్తించే రాష్ట్ర ప్రజలు వారిని గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారని అమర్నాథ్ గుర్తుచేశారు. గిరిజనాభివృద్ధే సీఎం లక్ష్యం ఎన్నికలకు ముందు చింతపల్లి బహిరంగ సభలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని గిరిజన ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని అమర్నాథ్ గుర్తుచేశారు. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మైనింగ్‌కు కూడా లీజు అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుని మైనింగ్ చేస్తున్నది టీడీపీ వారేనన్నారు. చీమకుర్తి వంటి ప్రాంతాల్లో ఖనిజాలు దోచుకుతిన్న వారిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్ల మేర జరిమానా విధించిందన్నారు. గిరిజన అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని స్పష్టంచేశారు. రాష్ట్ర సంపదను కాపాడుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నమ్మకంతోనే వైఎస్సార్సీపీని గెలిపించారని అమర్నాథ్ వివరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నాం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని గుడివాడ అమర్నాథ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోపాటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో ఈ విషయంపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న బీజేపీని కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కార్మికులు, ఉద్యోగులు, ఇతర సంఘాలు చేస్తున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. -
‘ప్రైవేటీకరణను అడ్డుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది’
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని, వైజాగ్‌లో జింక్, షిప్ యార్డులను కాపాడిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డిదేనని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణకు అంకురార్పణ జరిగిందన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు. విశాఖ స్టీల్స్‌ను కాపాడుకునేందుకు కార్మికులంతా ఏకమై ఉక్కు సంకల్పంతో ఉద్యమం చేస్తుంటే నారా లోకేష్ అసందర్భ ప్రేలాపన చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. టీడీపీ శిబిరానికి వెళ్ళిన లోకేష్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న కార్మికుల దీక్షలు కనిపించ లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బీజం పడిందని, ఈ విషయాన్ని 2014 జూలై 14వ తేదీన పత్రికలు రాశాయని సాక్షాధారాలతో బహిర్గతం చేశారు. పరిశ్రమ రాష్ట్రంలో ఉన్నందున పోస్కో ప్రతినిధులు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, నాడు చంద్రబాబు అధికారంలో ఉండగా అదే ప్రతినిధులు ఆయన్ను ఎందుకు కలిసారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలోనే వున్నా దానిపై సర్వ హక్కులు కేంద్రానికే ఉంటాయన్న కనీస అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఏపీలోనే అత్యధికంగా 54 సంస్థలు ప్రైవేట్ పరం అయ్యాయని గుర్తు చేశారు. జింక్ కంపెనీ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్ పరం అయ్యిందన్న విషయాన్ని మరిచి, టీడీపీ నేతలు ఇప్పుడు జింక్ గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు కేంద్ర కేబినెట్లో టీడీపీ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వున్న విషయాన్ని మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏపీ ప్రజలకు శాపంగా మారాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారని, అందులో భాగంగా ప్రధానికి లేఖ కూడా రాశారని గర్తు చేశారు. ఇటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. లోకేష్ బరువు తగ్గించు కోవడానికని వెళ్లి బ్రెయిన్ తగ్గించు కున్నాడని ఎద్దేవా చేశారు. 420 యూనివర్సిటీ పెడితే చంద్రబాబు వైస్ ఛాన్సలర్ అవుతారని విమర్శించారు. లోకేష్ విశాఖలో అడుగుపెట్టే ముందు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. -
గీతం ఆక్రమణల్లో ఉన్నాయని అధికారుల నివేదిక
-
ఓడించారనే అక్కసుతో ప్రజలను విమర్శిస్తారా?
-
'చంద్రబాబు ఉచ్చులో రైతులెవరు పడొద్దు'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ రాజధానికి సంబంధించి పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమంటూ కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారంటూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కేంద్రానికి అర్థమైన విషయం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, రాజధాని చుట్టూ ఉన్న రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న బాబు మాటలు ఎవరు నమ్మొద్దని, అతని ఉచ్చులో రైతులెవరు పడొద్దని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్న విషయం నగ్నసత్యమని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని అప్పట్లో ప్రజలు బాబుకు అధికారమిస్తే రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మరింత నీచ స్థితికి దిగజార్చారని అమర్నాథ్ మండిపడ్డారు. (సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్‌లో చర్చించాలా?) -
‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’
సాక్షి, విశాఖపట్నం : రాజధాని మారితే తన భూముల రేట్లు తగ్గిపోతాయనే భయంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. తన భూముల ధరలు పడిపోతాయనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టుకొని ఒక శిఖండిలా చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు జోలె పట్టుకొని అడుక్కోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. 40 అనుభవం అనుకునే చంద్రబాబు తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఊసరవెళ్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. 13జిల్లాల అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు. తన వర్గం కోసం, తన బినామీల కోసం చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి అవసరం లేదా? సీపీఐ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు ఏరకంగా మద్దతు పలుకుతారని ఎమ్మెల్యే అమర్నాథ్ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి అవసరం లేదా అని ప్రశ్నించారు. చద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మనుషులు వేరు కానీ, మనసులు మాత్రం ఒకటే అన్నారు. సుజనా తీగ లాగితే.. సుజన డొంక కదులుతుంది రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దేశ ప్రతిష్టను కించపరిచేలా సుజనా మాట్లాడారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాగా సుజనా కూడా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుజనా చౌదరి తీగ లాగితే.. చంద్రబాబు డొంక కదులుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధే కావాలన్నదని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయాలకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే అమర్నాథ్ కోరారు. -
ఇసుక మాఫియా డాన్ కవాతుకు ముఖ్య అతిథా ?
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్లలో ఇసుకను దోచుకుతిన్న టీడీపీతో కలిసి జనసేన లాంగ్‌మార్చ్ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. లాంగ్‌మార్చ్‌తో పవన్‌కల్యాణ్, చంద్రబాబుల మధ్య బంధం బహిర్గతమైందన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సుపుత్రుడు రాజకీయాలకు పనికిరాడని దత్తపుత్రుడైన పవన్‌కల్యాణ్‌తో ఫ్యాకేజీకి మాట్లాడి లాంగ్‌మార్చ్ చేయిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుని గాజువాక, భీమవరాలలో పవన్‌కల్యాణ్ ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా అని విమర్శించారు. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడలో గానీ, గోదావరి పక్కన ఉన్న రాజమండ్రిలో గానీ పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ పెట్టగలడా అని ప్రశ్నించారు.ఇది లాంగ్ మార్చ్‌కాదు, రాంగ్‌మార్చ్ అని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అందుకనే ఇసుక కొరత ఉందని ప్రజలందరికీ తెలుస న్నారు. సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. సమావేశంలో మట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్యాకేజీ కోసం చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. రైతులు పల్లెల్లో సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీచేస్తే పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ కాదు కదా..షార్ట్ మార్చ్ కూడా చేయలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో రూ.4.90కే రవాణా చేస్తామంటే వారికే అనుమతిస్తున్నామన్నారు. సుమారు 267 రీచ్‌లు ఉంటే వరద కారణంగా కేవలం 67 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తరువాత అక్రమాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో ఇసుక అందిస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని డ్రామా ట్రూప్ అంతా కుటిల రాజకీయాలు మాని ప్రజల క్షేమం కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వానికి సలహాలివ్వండి, వాటిని స్వీకరించి ..ప్రజల క్షేమం కోసం పనిచేద్దామన్నారు. కాదని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: సినిమాల్లో అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేసిన పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో నారావారి ప్రొడక్షన్లో ప్యాకేజీలకోసం పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెం నగరపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదులు ఏ విధంగా పొంగిపొర్లుతున్నాయో ప్రజలందరికీ తెలుసని, ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ అయిన టీడీపీతో కలిసి లాంగ్‌మార్చ్ చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో ప్రగల్బాలు పలికాడని, మరి ఇప్పుడు నారా పవన్‌కల్యాణ్ అని ఎందుకు మార్చుకోలేదని విమర్శించారు. గాజువాకలో ఓటమి తర్వాత అక్కడి వారిని కలవని పవన్ ఇప్పుడు బాబు డైరెక్షన్లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి నచ్చకే విశాఖలో మాజీ మంత్రి బాలరాజు రాజీనామా చేశారన్నారు. ఇసుక మాఫియా డాన్ ముఖ్య అతిథా ? గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి లాంగ్‌మార్చ్‌కి ముఖ్య అతిథిగా పాల్గొంటుండడంపై ఆయన తీవ్రంగా విమరించారు. డ్రగ్ మాఫియా డాన్ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్ వెలగపూడి రామకృష్ణబాబులను పక్కనపెట్టుకుని లాంగ్‌మార్చ్ చేస్తారా అని విమర్శించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వందరోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉద్దానం సమస్యను పరిష్కరించడమే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పేర్ల విజయచంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, పరూఖి, జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
గ్రామస్వరాజ్యం దిశగా తొలి అడుగు - మంత్రి బొత్స
విశాఖపట్నం : గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం చేపట్టినట్టు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. గాంధీజయంతి రోజున గ్రామసచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి తొలి అడుగువేశామన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలతో ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహాత్ముని ఆశయాలు అమలు కోసం 1, 27,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కడా ఇంత పారదర్శకమైన ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని పల్లెల్లోకి తీసుకువెళ్లే బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉంది. గత ప్రభ్యత్వంలో కొంతమంది మంత్రులు, ఎమ్యెల్యేలు ఉద్యోగాలు కల్పిస్తామని రూ.10 లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేశారు. అలాంటి మీరు నేడు సచివాలయాలకు ఎంపికయిన ఉద్యోగులను, వాలంటీర్లను అవహేళన చేస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆత్మవిమర్శ చేసుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలరావు, సీఎండీఏ కమిషనర్ విజయ్‌కుమార్, నార్త్ కన్వీనర్ కేకే రాజు పాల్గొన్నారు. -
రాధాకృష్ణా.. ‘ఓపెన్ హార్ట్’ ఉందా?
సాక్షి, విశాఖపట్నం: అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ పథకాలను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తామని అనకాపల్లి ఎమ్యెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక లక్ష 27 వేల ఉద్యోగాలు సీఎం జగన్ మోహన్‌రెడ్డి కల్పించారని ప్రశంసించారు. వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పరీక్ష సమాధానాలకి ‘కీ’ విడుదల చేసే వరకు ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు రాలేదని వివరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని.. ఉద్యోగాలు సాధించిన బీసీలు, మహిళలను, చివరకు అధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన వారిని కూడా కించపరుస్తూ తన పచ్చపత్రిక ద్వారా అనుమానాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయ్యాయో గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబులకు తప్ప ఈ పరీక్షల మీద ఎవరూ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలను ఓర్వలేక చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ రాధాకృష్ణకు కట్టబెట్టిన పనులపై విచారణ చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో అసలు ఓపెన్ హార్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అసత్య, నిరాధార ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. -
‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’
సాక్షి, అమరావతి : కాపు సామాజిక వర్గాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటామని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాపులపై చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు కాపులకు ఏడాదికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి.. ఐదేళ్లలో రూ.2వేల కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాపులను బీసీలలో కలుపుతామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాల నష్టపోయిన కాపులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుదన్నారు. కాపులను సీఎం వైఎస్ జగన్ అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకై ఏడాదికి రూ. 2వేల కోట్లను బడ్జెట్లో కేటాయించామని గుర్తు చేశారు. ఇచ్చిన మాటాను నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. కాపులకు బడ్జెట్లో పెద్దపీట వేశారు కాపు సామాజిక వర్గాన్ని ఆదుకునేందుకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్లో పెద్ద పీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులను ఆర్థికంగా ఆదుకునేందుకు బడ్జెట్లో రూ. రెండు వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల అవసరాలకోసం కాపులను వాడుకున్నారని ఆరోపించారు. కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఆ సామాజికవర్గం ఎన్నడూ మర్చిపోలేదన్నారు. కాపులంతా జగన్ వెంటే ఉన్నారు మేనిఫెస్టో ప్రకారం వచ్చే ఐదేళ్లలో కాపులకు రూ. పదివేల కోట్లను సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయిస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన కాపులపై తప్పుడు కేసులు పెట్టించిన చంద్రబాబు.. ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కాపులమని చెప్పుకొని పార్టీ పెట్టిన నాయకులను కూడా ఆ సామాజిక వర్గం నమ్మలేదన్నారు. రాష్ట్రంలోని కాపులంతా సీఎం జగన్ వేంటే ఉన్నారని, వారందరికి ఆయన న్యాయం చేస్తారని ఎమ్మెల్యే కరణం అన్నారు. -
అయ్యన్న నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లు కొడతామని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు గుడివాడ అమరనాథ్ హెచ్చరించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అయ్యన్నను నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆయన మాట్లాడారు. కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నాయి. పెందుర్తి నియోజక వర్గ ఇన్చార్జ్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తిప్పల నాగరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వవర్యంలో హోదా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు ముందు వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు రాస్తారాకో, బైఠాయింపులు చేపట్టారు. తగరపువలసలో భీమిలి నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
‘ఆ నివేదికతో బ్లాక్మెయిల్ చేయడానికే’
విశాఖపట్నం : విశాఖ భూదందా విషయంలో సిట్ ఇచ్చిన నివేదికతో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తారని వైఎస్సార్సీపీ అనకాపల్లి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెద్దలను పక్కన పెట్టి..సిట్ ఎవ్వరి పేర్లు వెల్లడించకుండా నివేదికను సీపీకి ఇచ్చారని, ప్రభుత్వ ప్రతినిధిలుగా విచారణ చేపట్టినప్పడు.. ఎందుకు పేర్లు వెల్లడించలేదని ప్రశ్నించారు. టీడీపీ నాయుకుల హస్త ఉంది కాబట్టే పేర్లు బయట పెట్టలేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో బోండా ఉమా భూదందాలకు పాల్పడుతుంటే చంద్రబాబు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినరీతిలో భూదందాలకు పాల్లడుతున్నారని ఆరోపించారు. సిట్ విచారణ చేస్తున్న నేపధ్యంలో తాము కోర్టుకు వెళ్లలేకపోయామని, ఇప్పడు కోర్టుకు వెళ్లడానికి సిద్దమముతున్నామని చెప్పారు. విశాఖలో భూదందాలపై సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేయాలని తొలి నుంచి వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ తమ వారిని కాపాడుకోడానికే సిట్ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేవలం రాయపాటి, అవంతి తప్ప మరెవ్వరూ రైల్వే జోన్ కోసం లేఖ ఇవ్వలేదని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని, విశాఖ ఎంపీ హరిబాబు కేవలం వైఎస్ఆర్సీపీ మద్దతు కోరుతు ఇచ్చిన లేఖను మాత్రమే పంపించారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి ఒకటిన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. -
సంప్రదాయాలకు విలువిచ్చేవారే ప్రజానేతలు
♦ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ కోవకు చెందిన వ్యక్తి ♦ వేద పండితులు సుఖసంతోషాలతో ఉంటేనే దేశానికి మంచిది: శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పెందుర్తి: సనాతన సంప్రదాయాలు, పీఠాలు, మఠాలు, దేవాలయాలకు విలువనిచ్చే వారే నిజమైన ప్రజానాయకులు కాగలుగుతారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంప్రదాయ విలువలు, పీఠాలు, దేవుడిపై ఎనలేని భక్తి, గౌరవం ఉన్నాయని చెప్పారు. ప్రజానాయకులకు విలువలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శ్రౌత, శాస్త్రసభలో భక్తులనుద్దేశించి స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. మాజీ మంత్రులు, వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా కిరణ్‌కుమార్‌శర్మ (బాలస్వామి)ను నియమించినట్లు స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. తాను 2020లో రుషికేష్‌కు వెళ్లి అక్కడే భగవంతుని సేవకు అంకితమవుతానన్నారు. బాలస్వామిని వైఎస్ జగన్ చేతుల మీదుగా సత్కరించే ఏర్పాటు చేశామని, అయితే అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయారని స్వామీజీ చెప్పారు. పీఠమన్నా, తానన్నా జగన్‌కు అభిమానమని గుర్తుచేసుకున్నారు. బాలస్వామిని ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. -
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ హత్య
- స్థానికులు, అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆగ్రహం - నిందితులను శిక్షించాలని అగనంపూడి, అనకాపల్లిలో ధర్నా, ర్యాలీ - మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగనంపూడి/అనకాపల్లి టౌన్ : విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రదీప్ మరణం అగ్గి రాజేసింది. ప్రదీప్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, అవంతి కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాతో మంగళవారం అగనంపూడి జాతీయ రహదారి దద్దరిల్లింది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అసలేం జరిగింది?: అగనంపూడి నిర్వాసిత కాలనీ దానబోరుునపాలేనికి చెందిన దానబాల రాము కుమారుడు ప్రదీప్(20) అక్టోబర్ 28న కళాశాల నుంచి వస్తూ ఒక విద్యార్థినితో కలిసి కశింకోటలో బస్సు దిగాడు. అక్కడి కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రదీప్‌ను కొట్టి అపహరించుకుపోయారు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి దానబాల రాము కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజు ప్రదీప్ ఉమ్మలాడ వద్ద శారదా నదిలో శవమై తేలాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్‌ను దుండగులు హత్య చేశారని ఆరోపిస్తూ స్థానికులు, అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఉదయం అగనంపూడి కూడలి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నాకు దిగారు. అనకాపల్లిలోనూ ఆందోళన ప్రదీప్‌ది ముమ్మాటికీ హత్యేనంటూ అతడి కుటుంబ సభ్యులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, వైఎస్సార్సీపీ నేతలు, అవంతి కళాశాల విద్యార్థులు అనకాపల్లిలోనూ ర్యాలీ, ధర్నాలతో హోరెత్తించారు. అధికార టీడీపీ అండతో కశింకోటకు చెందిన కొందరు యువకులు ప్రదీప్‌ను హత్య చేశారని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో పట్టణ సీఐ విద్యాసాగర్ విద్యార్థులపై చేరుుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ప్రదీప్ మృతదేహం ఉంచిన ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి బాసటగా ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఆందోళనకారులకు మద్దతు పలికారు.