
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ హత్య
- స్థానికులు, అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆగ్రహం
- నిందితులను శిక్షించాలని అగనంపూడి, అనకాపల్లిలో ధర్నా, ర్యాలీ
- మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
అగనంపూడి/అనకాపల్లి టౌన్ : విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రదీప్ మరణం అగ్గి రాజేసింది. ప్రదీప్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు, అవంతి కళాశాల విద్యార్థులు చేపట్టిన ధర్నాతో మంగళవారం అగనంపూడి జాతీయ రహదారి దద్దరిల్లింది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అసలేం జరిగింది?: అగనంపూడి నిర్వాసిత కాలనీ దానబోరుునపాలేనికి చెందిన దానబాల రాము కుమారుడు ప్రదీప్(20) అక్టోబర్ 28న కళాశాల నుంచి వస్తూ ఒక విద్యార్థినితో కలిసి కశింకోటలో బస్సు దిగాడు. అక్కడి కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రదీప్‌ను కొట్టి అపహరించుకుపోయారు. తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి దానబాల రాము కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటిరోజు ప్రదీప్ ఉమ్మలాడ వద్ద శారదా నదిలో శవమై తేలాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్‌ను దుండగులు హత్య చేశారని ఆరోపిస్తూ స్థానికులు, అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం ఉదయం అగనంపూడి కూడలి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ధర్నాకు దిగారు.
అనకాపల్లిలోనూ ఆందోళన
ప్రదీప్‌ది ముమ్మాటికీ హత్యేనంటూ అతడి కుటుంబ సభ్యులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు, అవంతి కళాశాల విద్యార్థులు అనకాపల్లిలోనూ ర్యాలీ, ధర్నాలతో హోరెత్తించారు. అధికార టీడీపీ అండతో కశింకోటకు చెందిన కొందరు యువకులు ప్రదీప్‌ను హత్య చేశారని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో పట్టణ సీఐ విద్యాసాగర్ విద్యార్థులపై చేరుుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ప్రదీప్ మృతదేహం ఉంచిన ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి బాసటగా ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఆందోళనకారులకు మద్దతు పలికారు.