‘ఆ నివేదికతో బ్లాక్‌మెయిల్‌ చేయడానికే’ | to blackmail mla with sit’s report: gudivada | Sakshi
Sakshi News home page

‘ఆ నివేదికతో బ్లాక్‌మెయిల్‌ చేయడానికే’

Published Tue, Jan 30 2018 5:42 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

to blackmail mla with sit’s report: gudivada - Sakshi

వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం : విశాఖ భూదందా విషయంలో సిట్‌ ఇచ్చిన నివేదికతో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేస్తారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పెద్దలను  పక్కన పెట్టి..సిట్‌ ఎవ్వరి పేర్లు వెల్లడించకుండా నివేదికను సీపీకి ఇచ్చారని, ప్రభుత్వ ప్రతినిధిలుగా విచారణ చేపట్టినప్పడు.. ఎందుకు  పేర్లు వెల్లడించలేదని  ప్రశ్నించారు. టీడీపీ నాయుకుల హస్త ఉంది కాబట్టే పేర్లు బయట పెట్టలేదని వ్యాఖ్యానించారు. 

విజయవాడలో బోండా ఉమా భూదందాలకు పాల్పడుతుంటే చంద్రబాబు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినరీతిలో భూదందాలకు పాల్లడుతున్నారని ఆరోపించారు. సిట్ విచారణ చేస్తున్న నేపధ్యంలో తాము కోర్టుకు వెళ్లలేకపోయామని, ఇప్పడు కోర్టుకు వెళ్లడానికి సిద్దమముతున్నామని చెప్పారు. విశాఖలో భూదందాలపై సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేయాలని తొలి నుంచి వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.

కానీ తమ వారిని కాపాడుకోడానికే సిట్ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేవలం రాయపాటి, అవంతి తప్ప మరెవ్వరూ రైల్వే జోన్‌ కోసం లేఖ ఇవ్వలేదని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని, విశాఖ ఎంపీ హరిబాబు కేవలం వైఎస్ఆర్సీపీ మద్దతు కోరుతు ఇచ్చిన లేఖను మాత్రమే పంపించారని చెప్పారు. రైల్వే జోన్ కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విశాఖలో ఫిబ్రవరి ఒకటిన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement