
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆక్షేపణ వస్తే కోర్టులకు వెళ్ళడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించుకున్న వారిని ఉపేక్షించేది లేదని, టీడీపీ నాయుకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. టీడీపీ నాయుకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తన అనుయులకు దోచిపెట్టారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment