Mutyala Naidu
-
పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దే..
-
బ్యాంకుల మోసగాడు ఎంపీ అభ్యర్థా?
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): బ్యాంకులను మోసగించి, సంతకాలు ఫోర్జరీ చేసి వేల కోట్లు దోచుకున్న వ్యక్తా కూటమి అనకాపల్లి అభ్యర్థి అంటూ సీఎం రమేశ్‌పై డిప్యూటీ సీఎం, అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతబయలు వద్ద అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను పదవులు కొనుక్కోలేదన్నారు. జగనన్న తనకు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచానని, మంత్రిపదవి ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశారన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదన్నారు. పెత్తందార్లకు, పేదలకు మధ్య పోటీ జరుగుతోందని, జగనన్న సైన్యంగా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దిగుమతి మోసగాళ్లకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రాంతంతో పరిచయం లేని, ముక్కుముఖం తెలియని వ్యక్తిని ఇక్కడ పోటీ చేయించి ఈ ప్రాంత సంపదను తన బినామీ ద్వారా దోచుకోడానికే చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. స్థానికేతరులను అనకాపల్లి ప్రజలు ఓడిస్తారని, గతంలో అల్లు అరవింద్, నూకారపు సూర్యప్రకాశరావులకు పట్టిన గతే సీఎం రమేశ్కూ పడుతుందన్నారు. బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సీఎం రమేశ్ అని ముత్యాలనాయుడు చెప్పారు. బీజేపీ అభిమానులు ఇది గమనించాలన్నారు. చీటింగ్ ఫోర్జరీ కేసులనుంచి బయటపడేందుకే సీఎం రమేశ్ బీజేపీలో చేరాడన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ పేదలకు పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధంలో బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాలవారు జగనన్నకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. జగనన్న అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా కంబాల జోగులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ పాల్గొన్నారు. -
పేదల సంక్షేమ రాజ్యం
‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చింది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పేద, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమం అందుతోంది. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని అనకాపల్లి జిల్లా మాడుగుల సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సాక్షి, అనకాపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా మాడుగుల వద్ద జరిగిన బహిరంగ సభలో వేలాది ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం మరే రాష్ట్రంలోనూ అందడంలేదని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఇందులో మూడింట రెండు వంతులు బడుగు, బలహీన వర్గాలకే అందుతున్నాయని తెలిపారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకే సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని, దీనివల్ల సామాజిక సాధికారత సాధ్యమైందని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వం సామాజిక పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు. రెండు వేళ్లు చూపించే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలకు వృద్ధులు ఇకపై మూడు వేళ్లు చూపించాలని అన్నారు. పేదల ఉన్నతి కోసం సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే అలీబాబా 40 దొంగలు హేళన చేశారని, చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మనవళ్లు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవచ్చా అని నిలదీశారు. ఇదీ పేదలపై వారికి ఉన్న ప్రేమ అని అన్నారు. సీఎం జగన్ పాలనలో నేరుగా లబ్ధి: డిప్యూటీ సీఎం రాజన్నదొర చంద్రబాబు పాలనలో పేదల కోసం అరకొరగా ఖర్చు చేశారని, అందులోనూ అధికభాగం టీడీపీ నేతలే తినేసేవారని, సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవాడికి నేతలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి జరుగుతోందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. బడుగు, బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఇంతలా అభివృద్ధి చెందుతున్నారంటే అందుకు జగనన్న సంక్షేమ పాలనే కారణమని తెలిపారు. టీడీపీ హయాంలో పేదలకు ఖర్చు చేసిన దానికి మూడు రెట్లు సీఎం జగన్ వెచ్చిస్తున్నారని చెప్పారు. గతంలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ మన ముందుకు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమ పాలన: మంత్రి ధర్మాన రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రోడ్ వేస్తేనో, బిల్డింగ్ కడితేనో అభివృద్ధి కాదని, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలని, సీఎం జగన్ ఇదే చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పథకాలను హేళన చేసిన చంద్రబాబే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నారన్నారు. సమాజాభివృద్ధికి విద్య ఎంత అవసరమో సీఎం జగన్‌కు తెలుసునని, అందుకే ప్రతి పేద పిల్లవాడికి యూనిఫారం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువు, ఫీజ్ రీయింబర్స్మెంట్ అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రజల సొమ్ము వారి ఖాతాల్లో వేసుకున్నారని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పథకాల సొమ్ము ప్రజల ఖాతాల్లో వేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ తేడా ప్రజలు గమనించాలని కోరారు. అవినీతి జరిగిందని చంద్రబాబు కూడా ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించలేకపోవడమే వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగ కంపెనీలు క్రియేట్ చేసి స్కిల్ పేరిట అవినీతి చేసి జైలు పాలైన చంద్రబాబు తప్పు చేయలేదంటే ఎవరు నమ్ముతారన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ మనవడు ఈ విషయం అడగలేదా?: మంత్రి గుడివాడ ‘స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన చంద్రబాబు మనవడు తాతేడని అడిగితే విదేశాలకు వెళ్లారని చెప్పామని బాబు సతీమణి భువనేశ్వరి ఇటీవల ఒక సభలో చెప్పారు. మరి తాత విడుదలైనప్పుడు అదే మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకెళ్లారు. విదేశాలకు వెళ్లిన తాత ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రావాలి కదా.. జైలు నుంచి ఎందుకు వచ్చావు తాతా అని మనవడు అడగలేదా’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ సభలో చమత్కరించారు. చంద్రబాబుకు ఇటీవల జనసేన అనే ఒక ఖరీదైన చేతికర్ర దొరికిందన్నారు. ఎన్ని కోట్లు పెట్టినా ప్రజల అభిమానాన్ని మాత్రం వారు కొనలేరని అన్నారు. -
సీఎం జగన్ గురించి ఈ అవ్వ ఎంత బాగా మాట్లాడిందో చూడండి
-
‘పేదలపై చంద్రబాబుది కపట ప్రేమ’
సాక్షి, విశాఖ: పేదలపై చంద్రబాబు నాయుడు చూపించేది కపట ప్రేమ అనే విషయం అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు విమర్శించారు. ఎన్నికల టైమ్‌లో బీసీలపై కపట ప్రేమ చూపడం చంద్రబాబుకు అలవాటేనని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ‘నిరుద్యోగ భృతి పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు రోడ్‌షోకు జనం లేక అవస్థలు పడుతున్నారు. మాకేంటి ఖర్మ అని చంద్రబాబును టీడీపీ కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని మానసిక స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు’ అని ముత్యాల నాయుడు విమర్శించారు. -
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు : ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
-
ప్రభుత్వం పై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి : ముత్యాల నాయుడు
-
బీసీలను వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు : ముత్యాల నాయుడు
-
ఏపీ: కొనసాగుతున్న వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: బుధవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1, 543.80 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఉదయం 07.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. -
‘భూ కబ్జాలపై చట్టం తన పని తను చేసుకుంటుంది’
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ కబ్జాలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం నుంచి ఆక్షేపణ వస్తే కోర్టులకు వెళ్ళడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించుకున్న వారిని ఉపేక్షించేది లేదని, టీడీపీ నాయుకులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. టీడీపీ నాయుకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తన అనుయులకు దోచిపెట్టారని ఆయన పేర్కొన్నారు. -
జగనన్న రుణం తీర్చుకుంటా.. .ప్రభుత్వ విప్
సాక్షి, విశాఖపట్నం: అతి సామాన్య జీవితం నుంచి రాజకీయాలోకి వచ్చిన తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకుంటానని, జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తానని మాడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తనకు తుది శ్వాస ఉన్నంతవరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని... మరో 25 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారం అమరావతి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా టీడీపీ అరాచక పాలనతో విసుగు చెం దిన రాష్ట్ర ప్రజలందరూ రాజన్న రాజ్యం కావాలని కోరుకుని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపిం చారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా హామీలను అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు, మధ్యాహ్నం భోజన సహా యకులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల జీతా లు, పోలీసులకు వీక్లీ ఆఫ్, వృద్ధాప్య పింఛన్లు పెంచి రాజన్న రాజ్యానికి స్వాగతం పలికారన్నా రు. మంత్రివర్గ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. అణగారిన కూలాలకు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులానికి చెందిన తమ్మినేని సీతారాంని స్వీకర్‌గా, తనను ప్రభుత్వ విప్‌గా నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల గుండెల్లో జగన్మోహన్రెడ్డి చెరగని ముద్ర వేసుకుంటారన్నారు. అడుగడుగునా బ్రహ్మరథం సుమారుగా 5 వేలకుపైగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్‌చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు శాలువాలతో, పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట సీనియర్ నేతలు చిక్కాల రామరావు, వీసం రామకృష్ణ, అనకాపల్లి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరావు ప్రభావతి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విశాఖ, అరకు పార్లమెంట్ విద్యార్థి విభాగం నాయకులు కాంతారావు, సురేష్, మాడుగుల, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గ పార్టీ నాయకులు సంజీవరావు ప్రభావతి, అట్టాడ శివకుమార్, డి.బాబురావు, పోలగట్ల పాపారావు, యర్రా అప్పారావు, టి.రాజారామ్, కిలపర్తి భాస్కర్‌రావు, కర్రిసత్యం, రెడ్డి జగన్మోహన్, కె.డేవిడ్, పెదబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం నమ్మకాన్ని నిలబెడతా..
సాక్షి, విశాఖపట్నం: బూడి ముత్యాలనాయుడు.. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికైన శాసనసభ్యుడు. ఇప్పుడు కీలకమైన ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో తొలిసారి, 2019 ఎన్నికల్లో మలిసారి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలోకి జంప్ అయ్యారు. ముత్యాలనాయుడిని కూడా ప్రలోభపెట్టినా నీతిగా నిలబడి వైఎస్సార్సీపీలోనే కొనసాగారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం తగినన్ని నిధులివ్వకుండా కక్ష సాధించింది. అయినప్పటికీ తనవంతు అభివృద్ధికి పాటుపడ్డారు. తన సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు ఆసరాగా నిలిచారు. పేదలు, వారి పశువులు చనిపోయినా, ఇళ్లు, పశువుల పాకలు కాలిపోయినా నగదు సాయం చేసి ఉదారంగా ఆదుకున్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి, ప్రభుత్వం పగబట్టి నిధులు మంజూరు చేయకపోయినా తన చేతనైన సాయం చేస్తూ ప్రజల మనసును చూరగొన్నారు. మరోవైపు జగన్మోహన్రెడ్డి .. బూడి ముత్యాల నాయుడుకు శాసనసభలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడి హోదా కూడా ఇచ్చారు. జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో పాటు ఆయనకు వెన్నంటి ఉన్నారన్న భావనతో మాడుగుల నియోజకవర్గ ప్రజలు రెండోసారి ముత్యాలనాయుడిని గెలిపించారు. అలా ఇలా కాదు.. మునుపటికంటే నాలుగు రెట్ల మెజార్టీనిచ్చి విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు ప్రభుత్వ విప్ పదవినిచ్చి సముచిత గౌరవం కల్పించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన బూడికి విప్ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదీ బూడి రాజకీయ ప్రస్థానం.. ముత్యాలనాయుడు ఇంటర్ వరకు చదువుకున్నారు. తన స్వగ్రామం తారువాలో వార్డు సభ్యుడు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీ డీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడిపై 4,761 ఓట్ల మెజా ర్టీతో గెలిచారు. 2019లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడిపై 16,392 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకున్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెడతాః ముత్యాలనాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన విప్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని బూడి ముత్యాలనాయుడు చెప్పారు. విప్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు రాజకీయంగా ఇంత గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ జగన్ వల్లనేనని ఆయన భావోద్వేగంతో అన్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం వైఎస్ జగన్ ఆశీస్సులతోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తనపై ఎంతో విశ్వాసంతో వైఎస్సార్సీపీ ఎల్పీ ఉప నాయకుడిగా కీలక బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. ఇప్పుడు విప్‌గా నియమించారని, జగన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడమే తనకు తెలుసునని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో మారుమూల నియోజకవర్గంగా పేరొందిన మాడుగులను వైఎస్ జగన్ ఆశీస్సులు, సహకారంతో అభివృద్ధిలో నెంబరు 1గా తీర్చిదిద్దుతానని ముత్యాలనాయుడు తెలిపారు. -
పట్టభద్రులు మంచి మార్గం ఎంచుకోవాలి
నన్నయ యూనివర్సిటీ వీసీ ముత్యాలనాయుడు పిలుపు ఘనంగా సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : యువత కేవలం ఉద్యోగం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా సమాజాన్ని ముందుకు నడిపేలా పట్టభద్రులు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి(వీసీ)ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే బడేటి బుజ్జి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ డిగ్రీ పట్టా పొందడం జీవితంలో మరుపురాని అనుభూతి అని అన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే సామర్థ్యం పెంపొందించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. సీఆర్ రెడ్డి విద్యా సంస్థల అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని, వారిలో తాను కూడా ఒకరు కావడం గర్వంగా ఉందని చెప్పారు. అనంతరం 20162017 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన 600 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, వీసీ ముత్యాలనాయుడు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 20 మందికి వీసీ బంగారు పతకాలను అందించారు. కార్యక్రమంలో సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల ఉపా«ధ్యక్షులు వీవీ బాలకృష్ణారావు, కాకరాల రాజేంద్రప్రసాద్, సభ్యులతో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.వెంకట్రావు, ఐక్యూ ఏసీ కన్వీనర్ పీసీ స్వరూప్, సూపరింటెండెంట్ పతంజలి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు: ఉప్పులేటి
విజయవాడ : తాను టీడీపీలో చేరతానంటు వస్తున్న వార్తలు అవాస్తవమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె తెలిపారు. 'చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు. భవిష్యత్ కావాలనుకునేవారు వైఎస్ఆర్ సీపీని వీడరు' అని ఉప్పులేటి కల్పన అన్నారు. చివరి వరకూ జగన్‌తోనే: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో తాము ఎవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. వైఎస్ జగన్ వల్లే తాము గెలిచామని, చివర వరకూ జగన్‌తోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన విషయాన్ని దృష్టి మల్లించడానికే టీడీపీ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరతానంటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు చేయనని ఆయన తెలిపారు. చివరివరకూ వైఎస్ జగన్‌తోనే ఉంటానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. -
మ్యానిఫెస్టో చూపిస్తే.. ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతారా?
-
మ్యానిఫెస్టో చూపిస్తే.. ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ముత్యాలనాయడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. టీడీపీ మ్యానిఫెస్టోను చూపించి చంద్రబాబును ప్రశ్నిస్తే... ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతారా అని కొడాలి నాని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప... టీడీపీ నేతగా వ్యవహరించవద్దని తాము స్పీకర్‌ను కోరామని తెలిపారు. రౌడీల్లాగా బెదిరిస్తే సభలో నెగ్గొచ్చనుకోవడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి, ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. మీ తప్పులను లెక్కలతో సహా చూపిస్తే మైక్‌లు కట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. ఓ ప్రతిపక్ష నేతను 'యు కాంట్ టాక్' అని స్పీకర్ అనడం చట్టసభల్లో ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ప్రతిపక్షం... దాని గొంతు కూడా నలిపేసి సభను ఎలా నడుపుతారు అన్నారు. మరో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మాట్లాడుతూ... సభ్యులను భయపెట్టి, భయభ్రాంతులను చేసి సభను నడిపించాలనుకోవడం అర్థరహితమన్నారు. గ్రామాల్లో తిరగనీయబోమంటూ బెదిరించడం టీడీపీ నేతలను తగదని ఆయన అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబు టివికే పరిమితం అయ్యారు: ముత్యాలనాయుడు
-
'పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు'
-
'పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు'
విశాఖపట్నం: పదవుల కోసమే దాడి వీరభద్రరావు పిచ్చివాగుడు వాగుతున్నారని వైఎస్ఆర్ సిపి మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు విమర్శించారు. పలువరు పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిస్తేనే దాడి అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. పార్టీలోకి రమ్మని దాడిని ఎవరూ ఆహ్వానించలేదని చెప్పారు. దాడి ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. పదవుల కోసమే దాడి ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోదలచుకుంటే వెళ్లిపోవాలని, ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిదికాదని అన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర నాయకులు మాట్లాడుతూ జగన్ ఓ శక్తి అని, ఆ శక్తిని అడ్డుకునే దైర్యం ఎవరికీ లేదన్నారు. పార్టీ మారాలన్న ఉద్దేశం, అధికార దాహంతో దాడి అలా మాట్లాడుతున్నారన్నారు. టిడిపిలో పదవులు అనుభవించిన దాడి, అధికారంలో ఉండే పార్టీలోకి వెళ్లడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ పార్టీ మారడానికే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారే దాడి నైజం మరోసారి బయటపడిందన్నారు. దాడి కోవర్టుగా వచ్చినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించారు. ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరే సమయంలో చంద్రబాబు నాయుడుని విమర్శించారు. ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తున్నారు. ఆయన నైజం అదేనన్నారు. ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పారు. ఆయన ఎక్కువగా మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనం కావలసిన పరిస్థితి లేదన్నారు. జగన్‌పై అభిమానంతో తమ పార్టీకి జనం బాగానే ఓట్లు వేసినట్లు చెప్పారు. కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.