
సాక్షి, విశాఖ: పేదలపై చంద్రబాబు నాయుడు చూపించేది కపట ప్రేమ అనే విషయం అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు విమర్శించారు. ఎన్నికల టైమ్‌లో బీసీలపై కపట ప్రేమ చూపడం చంద్రబాబుకు అలవాటేనని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. ‘నిరుద్యోగ భృతి పేరుతో యువతను చంద్రబాబు మోసం చేశారు.
చంద్రబాబు రోడ్‌షోకు జనం లేక అవస్థలు పడుతున్నారు. మాకేంటి ఖర్మ అని చంద్రబాబును టీడీపీ కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియని మానసిక స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు’ అని ముత్యాల నాయుడు విమర్శించారు.