పట్టభద్రులు మంచి మార్గం ఎంచుకోవాలి
Published Fri, Jul 28 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM
నన్నయ యూనివర్సిటీ వీసీ ముత్యాలనాయుడు పిలుపు
ఘనంగా సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :
యువత కేవలం ఉద్యోగం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా సమాజాన్ని ముందుకు నడిపేలా పట్టభద్రులు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి(వీసీ)ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే బడేటి బుజ్జి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ డిగ్రీ పట్టా పొందడం జీవితంలో మరుపురాని అనుభూతి అని అన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే సామర్థ్యం పెంపొందించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. సీఆర్ రెడ్డి విద్యా సంస్థల అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని, వారిలో తాను కూడా ఒకరు కావడం గర్వంగా ఉందని చెప్పారు. అనంతరం 20162017 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన 600 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, వీసీ ముత్యాలనాయుడు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 20 మందికి వీసీ బంగారు పతకాలను అందించారు. కార్యక్రమంలో సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల ఉపా«ధ్యక్షులు వీవీ బాలకృష్ణారావు, కాకరాల రాజేంద్రప్రసాద్, సభ్యులతో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.వెంకట్రావు, ఐక్యూ ఏసీ కన్వీనర్ పీసీ స్వరూప్, సూపరింటెండెంట్ పతంజలి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు.
Advertisement