nannaya university
-
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్‌లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
Albert Einstein Birth Anniversary: విశ్వనరుడు ఐన్‌స్టీన్
‘కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరాన గట్టు పడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’ అని జాషువా చెప్పినట్లుగా ఐన్‌స్టీన్ కూడా స్వయంగా ఎన్నోసార్లు ‘నేను ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జాతికో, ఒక మిత్ర బృందానికో, చివరికి ఒక కుటుంబానికో చెందినవాడను కాను. నేను ఈ ప్రపంచానికంతటికీ చెందినవాడను’ అని అన్నాడు. ‘టైమ్స్’ పత్రిక ఐన్‌స్టీన్‌ను శతాబ్దపు మహావ్యక్తిగానూ, గాంధీని రెండవ మహావ్యక్తిగానూ ప్రకటించినప్పుడు ఐన్‌స్టీన్ సంతోషపడకుండా ‘గాంధీయే నాకంటే గొప్పవాడు, మొదటి స్థానంలో గాంధీయే ఉండాలి’ అని అన్నాడంటే ఐన్‌స్టీన్ వ్యక్తిత్వం ఎంతటి విశిష్టమైనదో మనం ఊహించుకోవచ్చు. తను ఎప్పుడూ కలవని, తన జాతి, దేశ, మతానికి చెందని, తన ఖండానికే చెందిన మరొక శక్తివంతమైన దేశంతో (ఇంగ్లాడు) పోరాటం చేస్తున్న ఒక బక్క చిక్కిన వ్యక్తి గురించి ఆయన రాసిన మాటలు ఈ రోజు ప్రతి భారతీయుడు కంఠస్థం చేయవలసినవి: ‘మనలాగే రక్తమాంసాలతో కూడిన ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మలేకపోవచ్చు’ అని అంటూనే ఈ శతాబ్దపు మహామనిషి గాంధీజీ అని కొనియాడారు. ఒక విదేశస్తుడు, అందులోనూ ఒక ఐరోపా ఖండవాసి భారతదేశాన్ని, భారతీయులను సమర్థించడమే ఒక గొప్ప సాహసం అనుకునే ఆ రోజులలో ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన ఐన్‌స్టీన్ గాంధీజీని ఒక అవతార పురుషుడిలా వర్ణించాడంటే ఆయన ఎటువంటి స్వేచ్ఛాజీవినో అర్థం చేసుకోవచ్చు. నిరాడంబరుడు తన జీవితమంతా కూడా అధికారాలు, ఆడంబరాలకు దూరంగానే ఉన్నాడు. కారులో వెళ్ళడంకంటే సైకిలు ప్రయాణమే ఇష్టపడేవాడు. ఆయన ధరించే దుస్తులు చూచి చాలామంది ఆయనను లోభి అని, మరి కొంతమంది శుభ్రతకు ప్రాధాన్యమివ్వడని అనుకొనేవారు. కాని ఆయనకు తన పరిశోధనలపైనే తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. తన పనికి ఎవ్వరూ, ఏదీ ఆటంకంగా ఉండకుంటే చాలు అనుకునే మనస్తత్వం. తన 50వ జన్మదినం రోజున పాఠశాల పిల్లలు మెడకు కట్టుకునే ‘టై’ ని, పాదాలకు వేసుకునే సాక్సులను బహుమతిగా ఇచ్చారు. ఎందుకు వాటిని బహుమతిగా ఇచ్చారని పిల్లలను అడిగితే ఐన్‌స్టీన్ ఎప్పుడూ ఎక్కువగా ఇవి వాడరు కనుక ఈ రెండూ వీరి దగ్గర లేవేమోనని ఇచ్చాము అన్నారంటే ఐన్‌స్టీన్ దుస్తుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉండేవారో అర్థమవుతుంది. 1933 సంవత్సరంలో అమెరికాలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు జీతం ఎంత కావాలో తననే నిర్ణయించుకోమంటే సంవత్సరానికి మూడు వేల డాలర్లు నాకు, నా కుటుంబ ఖర్చులకు సరిపోతుంది, అంతే ఇవ్వండి అని చెప్పగా వారు ఆశ్చర్యపోయి వెంటనే ఐన్‌స్టీన్ సహచరి అయిన ఎల్సాతో మాట్లాడి సంవత్సరానికి 16,000 డాలర్లుగా నిర్ణయించారంటే ఆయన నిరాడంబర త్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోక్షగామి మానవ మేధస్సుకు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉన్నాయని ఆయన బలంగా నమ్మేవారు. వీటి కారణంగానే విశ్వగమనం ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుందని విశ్వసించేవారు. ఈ నమ్మకంతోనే తను అయార్టిక్ ఎన్యూరిజమ్ వ్యాధిగ్రస్తుడైనప్పుడు శస్త్రచికిత్స చేస్తే వ్యాధి తగ్గుతుందని వైద్యులు చెప్పినప్పుడు సున్నితంగా ఆయన తిరస్కరించారు. ‘కృత్రిమంగా జీవితాన్ని పొడిగించి రుచిలేని జీవి తాన్ని గడపడం నాకు ఇష్టం లేదు. నేను చేయవలసిన విధులన్నీ నిర్వర్తించాను. నేను అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరాయి. మరణ కాలం ఆసన్నమైంది. కావున ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదని చెప్పి మరణాన్ని కూడా ఆహ్వానించిన మోక్షగామి అతడు. అందరూ నమ్మే దేవునికి, ఆయన నమ్మే ఆధ్యాత్మిక శక్తులకు చాలా వ్యత్యాసం ఉండేది. మనకు వచ్చే ప్రతి ఫలితానికి దేవుడే కారణమనుకోవడాన్ని, అదృష్ట దురదృష్టాలను, విధిరాతలను ఆయన నమ్మేవారు కాదు. విశ్వానికి సంబంధించిన మానవాతీతమైన సూర్య, చంద్ర, గ్రహాలు మొదలగు వాటి విషయాలలోను, వాటి అప్రకటిత, అనిర్దేశిత, నియమబద్ధ గమన సంబంధిత విషయాలలోనూ అతీతమైన శక్తుల పాత్ర ఉంది అని నమ్మేవాడు. అటువంటి విశ్వసూత్రాల అస్తిత్వం మానవ మేధస్సుకు అతీతమైనదిగా భావించే వారు ఆయన. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన అభ్యాసము, పరిశీలన, పరిశోధనలు మాత్రం సాగుతూనే ఉండేవి. తన శాస్త్ర పరిశోధనా విజయ కేతనాన్ని ప్రపంచ పరిశోధనా గగనంలో ఉవ్వెత్తున ఎగురవేసిన విశ్వనరుడు ఐన్‌స్టీన్. వ్యాసకర్త: ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం -
నన్నయ శ్లోకాలు!
తాడేపల్లిగూడెం: క్యాంపస్ ఉంది.. విద్యార్థులు లేరు. కోర్సు ఉంది. బోధకులు లేరు. భవనం ఉంది.. దారులు లేవు. స్థలం ఉంది. కనపడదు. ఇదీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని తాడేపల్లిగూడెం పీజీ క్యాంపస్ దుస్థితి. 2004లో ఆంధ్రా యూనివర్సిటీ పరి ధిలో ఏర్పడిన ఈ క్యాంపస్ ఐదేళ్లపాటు మాత్రమే వెలిగింది. తర్వాత నన్నయ వర్సిటీపరిధిలోకి వచ్చాక వర్సిటీ చిన్నచూపు కారణంగా దయనీయస్థితిలోకి వెళ్లింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ ఉండగా క్యాంపస్‌కు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించినా.. దానిని క్యాంపస్ నిలుపుకోలేకపోయింది. చివరకు ప్రస్తుతం 18 ఎకరాల 46 సెంట్లు మాత్రమే పీజీ క్యాంపస్‌కు ఉంది. దీనికి సంబంధించిన రికార్డులు కూడా పీజీ క్యాంపస్‌లో లేకపోవడం గమనార్హం. బాలికల హాస్టల్ నిర్మాణం కోసం పనులు చేపట్టడానికి సాంఘిక సంక్షేమ శాఖ వెతగ్గా ఈ రికార్డులు లభ్యం కావడం గమనించాలి. ప్రాభవం మసకబారిందిలా.. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో క్యాంపస్ ఇక్కడ ఏర్పాటుచేసిన సందర్భంలో ఆర్ట్స్ కోర్సులు ఉండేవి. విద్యార్థులు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవారు. ఆంధ్రాయూనివర్సిటీ కేంద్రస్థానానికి చివరగా ఉన్న ఈ క్యాంపస్‌ను ఆ తర్వాత కాలంలో దాదాపుగా పట్టించుకున్న అధికారులు లేరు. క్యాంపస్‌కు ప్రత్యేక అధికారులుగా వచ్చిన వారిలో ఒకరిద్దరు తమ వ్యక్తిగత బలహీనతలు తీర్చుకొనే కేంద్రంగా మార్చుకున్నారు. ఇలాంటి ఉపద్రవాలను నిరోధించే చర్యలను 2009 తర్వాత పట్టించుకున్న నాథుడులేడు. దీంతో పీజీ క్యాంపస్ ప్రాభవం మసకబారింది. నన్నయ పరిధిలోకి వెళ్లినా.. ఆంధ్రా యూనివర్సిటీ పరిధి నుంచి పీజీ క్యాంపస్ ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లినా పీజీ క్యాంపస్ ప్రగతిలో మార్పు రాలేదు. వర్సిటీ పరిధిలోని కాకినాడ పీజీ కేంద్రంపై చూపిస్తున్న ప్రేమను వర్సిటీ గూడెం కేంద్రంపై చూపలేదు. సవతి తల్లి ప్రేమను చూపిస్తూ వచ్చింది. కాకినాడ ఆర్ట్స్ కేంద్రంగా, గూడెం సైన్సు పీజీ కేంద్రంగా చేస్తున్నామంటూనే గూడెంలో ఉన్న ఆర్ట్స్ కోర్సులను ఎలాంటి సమాచారం లేకుండా ఎత్తేశారు. ఇటీవల ఎంబీఏ కోర్సు ఎత్తివేసిన సందర్భంలో సాక్షిలో వచ్చిన కథనం, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చొరవతో కోర్సు ఇక్కడ నిలబడింది. అడహాక్ ఫ్యాకల్టీలే గతి క్యాంపస్‌లో ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలైటికల్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజిక్స్, తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి బీ.ఫార్మసీ ఇచ్చారు. ఈ కోర్సులు బోధించడానికి అడహాక్ అసిస్టెంటు ప్రొఫెసర్లు ఎంబీఏ కోసం ఇద్దరు, కెమిస్ట్రీకి ఇద్దరు ఉన్నారు. ప్రాంగణం లోపల చూస్తే లైటు వెలగదు. ఫ్యాన్ కనెక్షన్ ఉన్నా, ఫ్యాన్లు ఉండవు. ల్యాబ్ ఉన్నా, సౌకర్యాలు లేని స్థితి. లైబ్రరీ ఉందికానీ.. పుస్తకం ఇచ్చేవారు లేరు.. తీసుకొనేవారు లేరు. అతిథులు వస్తే కనీసం నీళ్లు ఇవ్వడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే అటెండర్లేని దుస్థితి. విద్యార్థులు ఇలా... ఎంబీఏలో 40 సీట్లు ఉన్నాయి. అన్నీ భర్తీ అయ్యాయి. రహదారి సౌకర్యం లేకపోవడం, హాస్టల్ వసతి లేనందు వల్ల కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే చేరారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 సీట్లకు 29 మంది విద్యార్థులు చేరారు. ఎమ్మెస్సీ అనలైటికల్ కెమిస్ట్రీలో 15 సీట్లకు 13 మంది చేరారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో 30 సీట్లకు 11 మంది మాత్రమే చేరారు. బీ.ఫార్మసీలో 40 సీట్లు ఇచ్చారు. ఎంపీసీ ఫార్మాట్లో 20 సీట్లు, బైపీసీ స్ట్రీమ్‌లో 20 సీట్లు ఇచ్చారు. బైపీసీ స్ట్రీమ్‌లో 20 సీట్లకు 18 మంది చేరారు. ఎంపీసీ ఫార్మెట్ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దారీ తెన్నూ లేదు. పీజీ క్యాంపస్‌కు వెళ్లడానికి సరైన సౌకర్యం లేదు. గతుకుల రోడ్డు మాత్రమే ఉంది. క్యాంపస్ ముందు భాగం పిచ్చిమొక్కలకు కేరాఫ్‌గా మారింది. వెనుక భాగం వాన నీటి స్థావరంగా, విష కీటకాల నివాస సముదాయంగా రూపాంతరం చెందింది. ఇవి కావాలి.. విద్యార్థులు, కోర్సుల అవసరాలకు అనుగుణంగా భవనాల నిర్మాణం జరగాలి. పరిశోధనశాలలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు వసతి భవనాలు సమకూరాలి. తొలి ఏడాది పీజీ విద్యార్థులకు జనరల్ కెమిస్ట్రీ, జనరల్ ఫిజిక్స్ బోధించడానికి , ఇనార్గానిక్ కెమిస్ట్రీ బోధించడానికి ఒక బోధకుడు కావాలి. రానున్న విద్యాసంవత్సరానికి వీరు కాకుండా మరో ఇద్దరు బోధకులు అవసరం ఉంది. కాయకల్ప చికిత్స జరగాలి.. విద్యా విషయంలో విజన్ కలిగిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ద్వారా చికిత్స జరిగితేనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం లభించగలదని ఆశిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకు ఉంది. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేసిన బీ.ఫార్మసీ అవసరాలకు అనుగుణంగా ల్యాబ్‌లు సమకూరాలి. ఫార్మసీ బిల్డింగ్ కోసం రూ.12 కోట్లు, బాలికల వసతి గృహం కోసం రూ.3 కోట్లు నిధులు విడుదలయ్యాయి. నేడు విద్యాశాఖమంత్రి రాక నన్నయ పీజీ క్యాంపస్‌లో నిర్మించబోయే బాలికల వసతి గృహం, పార్మసీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం హాజరవుతున్నారు. -
కీచక అధ్యాపకుడి అరెస్టు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనవర్సిటీలో విద్యార్థినులను లైంగి క వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను అరెస్టు చేశామని స్థానిక సీఐ ఎంవీ సుభాష్ తెలిపా రు. విద్యార్థినుల సెల్ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ, వారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రిజిస్టార్ ఆచార్య ఎస్. టేకి ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి క్రైమ్ నం.489/2019 యు/సెక్షన్స్, 354 (ఏ), 354 (డి), 509, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషనుకు చెందిన మహిళ ఎస్సై శ్రావణి కృష్ణా జిల్లా నందిగామలోని అతని స్వగృహంలో నిందితుడిని అరెస్టు చేసి, రాజమహేంద్రవరానికి తీసుకువచ్చారన్నారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. -
నన్నయ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్
-
నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. తల్లిదండ్రుల తరువాత గౌరవించేది అధ్యాపకులనే. ఇంతటి గౌరవప్రదమైన వృత్తికే కళంకం తెచ్చాడు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆ కీచకుడు స్పెషల్ క్లాసుల పేరుతో తన ఫ్లాట్‌కు విద్యార్థినులను రప్పించుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ అధ్యాపకుడిపై ఫిర్యాదు చేద్దామంటే వర్సిటీలో ఉన్నతాధికారులంతా ఆయన్నే వెనకేసుకొస్తూ బాధితులనే బెదిరిస్తుండడంతో చాలా కాలం పాటు మౌనందాల్చారు. చివరకు ధైర్యం చేసి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే లేఖ రాశారు. లేఖ అందుకున్న ముఖ్యమంత్రి తక్షణమే విచారణకు ఆదేశించారు. చరిత్ర ఘనం... కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని రాజానగరం వద్ద మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో వర్సిటీ కావాలనే సంకల్పంతో నాడు ఈ వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వర్సిటీకి అనుబంధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాలేజీలు అన్నింటా కలిపి 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. ఒక్క రాజా నగరంలో వర్సిటీ క్యాంపస్‌లోనే 2,200 మంది విద్యను అభ్యసి స్తున్నారు. అన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటు న్న ఈ వర్సిటీలో విద్యార్థినుల పట్ల అధ్యాపకుని లైంగిక వేధింపులపై వర్సిటీలో సహచర అధ్యాపకులెవరూ పెదవి విప్పడం లేదు. ఇంగ్లిషు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్‌గా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.సూర్యరాఘవేంద్ర ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచారు. చాలా కాలంగా ఈ వేధింపులున్నా భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో విద్యార్థునులెవరూ ముందుకు రాలేదు. కీచకుడుగా మారి... ఇంగ్లిషు పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు ప్రేమ పాఠాలు చెబుతూ లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలా కాలంగాప్రొఫెసర్ వేధింపులను భరిస్తూ వచ్చారు. వేధింపులు ఇటీవల మితిమీరిపోవడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను లేఖలో పూసగుచ్చినట్టు వివరించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. ఆ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ టేకీ ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో లేక, విద్యార్థినులు భయపడుతున్నట్టే వర్సిటీ పరిపాలనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కానీ విషయాన్ని బయటకుపొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై సస్పెన్షన్ వేటు పడిన ఉదంతం మరిచిపోకముందే నన్నయ్య వర్సిటీలో ఓ ప్రొఫెసర్ వేధింపుల బాగోతం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ‘ప్రత్యేకం’ పేరుతో... వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ కోర్సు చేస్తున్న కొంతమంది విద్యార్థినులు పాఠాలు అయిపోయాక స్పెషల్ క్లాసుల కోసమంటూ రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్‌కు రావాలని బలవంతం చేస్తున్నాడు. తెగించి ఎవరైనా పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాజెక్టులు ఆపేస్తా, పాస్ కాకుండా చేస్తాననే బెదిరింపులతో విద్యార్థినులు పెదవి విప్పలేని పరిస్థితి. ఒక దశలో కొందరు విద్యార్థినులు ఇన్‌ఛార్జి వైస్‌చాన్సలర్‌కు ఫిర్యాదు చేద్దామని అనుకున్నా ఆయన తనకు బాగా క్లోజ్ అని... ఒకవేళ చెబితే మీకే నష్టమని బెదిరింపులకు దిగడంతో ఫిర్యాదుకు వెనకడుగు వేశారు. విద్యార్థినుల మొబైల్ నంబర్లు సతీసుకుని వాట్సప్‌లో అసభ్య పదజాలంతో కూడిన సందేశాలు పంపిస్తూ చాటింగ్ కూడా చేసేవాడంటున్నారు. యూనివర్సిటీ పరిపాలనంతా తన చేతిలోనే ఉందని, పీజీలో చేరాలన్నా, పీహెచ్డీ చేయాలన్నా, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నా, చివరకు యూనివర్సిటీలో జాబ్ రావాలన్నా వీసీ తాను చెప్పిందే చేస్తారంటూ విద్యార్థినులను బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వేధింపుల వ్యవహారంపై అంతర్గత విచారణ జరుగుతోంది. సీఎంకు రాసిన లేఖలో ఇలా... ‘నీ ప్రాజెక్టు వర్కు కంప్లీట్ చేసి, ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా చేస్తాను. ఒక గంట నేను చెప్పినట్టుగా వింటే చాలు. కాదని విషయాన్ని ఎవరికైనా చెప్పావా, నీకే నష్టం. ఎందుకంటే వీసీ నేను చెప్పిందే వింటాడు, నీవు అంగీకరిస్తే బాక్లాగ్ సబ్జెక్ట్సు కూడా పాస్ చేయిస్తాను. లేకుంటే వాటిలో ఎప్పటికీ పాస్ కాలేవని’ అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇప్పటివరకూ వేధింపులలో బలైపోయి, బతుకులు నాశనం చేసుకున్న వారెందరున్నారో తెలియదు గానీ ఆ అధ్యాపకుని వికృత చేష్టలను బయటపెట్టే సాహసం చేసిన వారు మాత్రం కొంతమందే. ఆ కొద్దిమంది ముందుకు వచ్చి ‘శాడిస్టు అధ్యాపకునిపై తగిన చర్యలు తీసుకోవా’లని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు అవాస్తవం విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగుతున్నాననే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ప్రత్యేక తరగతుల కోసం యూనివర్సిటీకి ఉదయాన్నే రమ్మంటుంటాం. ఆ విధంగా రావడానికి ఇష్టపడని వారే ఇలా తప్పుడు ప్రచారం చేస్తుంటారనుకుంటున్నా. హెచ్ఓడీగా నేను గత నాలుగు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అది ఇష్టం లేని వారు కూడా ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు. – డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర,హెచ్ఓడీ ఆఫ్ ఇంగ్లిష్ విచారణవాస్తవామే ఇంగ్లిషు విభాగాధిపతిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు అవునా, కాదా తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో నిజంఏమిటనేది విచారణలో తేలుతుంది. – డాక్టర్ పి. సురేష్‌వర్మ, వైస్ చాన్సలర్ జగనన్నకు మా విన్నపం న్యాయం చేయాలని విద్యార్థినుల కన్నీటి లేఖ చాలా రోజులుగా ఈ ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న అఘాయిత్యాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము రాస్తున్న ఉత్తరం మా మానసిక మనో వేదనను ప్రతిబింబిస్తుంది.ఎన్నో ఆశలతో, మా తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకంతో నన్నయ యూనివర్సిటీలో ఉన్నత చదువులను పూర్తి చేయాలని అడుగుపెట్టాం. మా అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని మా జీవితాలతో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెడ్ ఎన్.సూర్యనాగేంద్ర ఆడుకుంటున్నాడు.వైస్ చాన్సలర్ పి.సురేష్‌వర్మ చాలా చాలా క్లోజ్ అని ఆయన చెప్పుకుంటున్నారు. అందువల్ల మాకు న్యాయం జరగదు. సూర్యరాఘవేంద్ర, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.సురేష్‌వర్మపై ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సాధించిన మీరు మా అన్నగా... తండ్రిగా ఆలోచించి మా జీవితాలను నాశనం చేస్తున్న ఒక శాడిస్ట్ ప్రొఫెసర్‌ను వర్సిటీ నుంచి డిస్మిస్ చేయాలని కోరుతున్నాం. చాలా మంది ఆడపిల్లలు మీ ముందుకు వచ్చి చెప్పుకోలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే ఎక్కడ చదువును అర్ధాంతరంగా ఆపేస్తారోనని భయం. మొత్తం మా బాధను వైస్ చాన్సలర్‌కు చెప్పినప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే మీ దృష్టికి మా బాధను తీసుకువస్తున్నాం. మేము విద్యార్థినులం. మా కన్నీళ్లు యూనివర్సిటీకి మంచిది కాదు. అందరూ విద్యార్థినులూ మాలా ముందుకు ధైర్యంగా రాలేరు. మాలాంటి అమాయకపు విద్యార్థినుల జీవితాలను కాపాడాలని ఈ ఉత్తరం ద్వారా విన్నవిస్తున్నాం. -
ఆర్ట్స్‌లో ఫెయిల్ అయిన నన్నయ పీజీ క్యాంపస్
పట్టణంలోని నన్నయ పీజీ క్యాంపస్‌లో ఒకటొకటిగా ఆర్ట్స్ కోర్సులు ఎత్తేస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ పీజీ క్యాంపస్‌గా దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలంలో ప్రారంభమైన ఈ క్యాంపస్ నన్నయ వర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఏయూ పీజీ క్యాంపస్‌గా వైఎస్ హయాంలో ఇక్కడ ప్రారంభమయ్యాక ఆర్ట్స్ విభాగంలో ఎంబీఏ, ఎంఏ ఇంగ్లిషు, ఎంఈడీ, ఎంకాం కోర్సులు ఉండేవి. అయితే విద్యార్థులు చేరడంలేదనే ఒకే ఒక్క కారణాన్ని ఫైళ్లలో రాసుకొని ఒకటొకటిగా కోర్సులను ఎత్తేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్ట్స్‌లో మిగిలిన ఒకే ఒక ఏంబీఏ కోర్సును ఎత్తేస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, తాడేపల్లిగూడెం : క్యాంపస్‌ను దశలవారీ విస్తరించడానికి అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక జీఓ ద్వారా క్యాంపస్‌కు వంద ఎకరాల స్థలం కేటాయించారు. క్యాంపస్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అయితే వైఎస్ అనంతరం మారిన ప్రభుత్వాల హయాంలో వైఎస్ కేటాయించిన భూమిని పూర్తిగా క్యాంపస్ వినియోగించలేకపోవడంతో, ఆ భూమిని తిరిగి రెవిన్యూ అ«ధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక అధికారులుగా వచ్చిన కొందరి వ్యక్తిగత ప్రవర్తనల కారణంగా క్యాంపస్ ప్రాధాన్యత మసకబారింది. చక్కని కోర్సులున్నా విద్యార్థులు చేరేవారు కాదు. కొత్త కోర్సులు తీసుకువస్తామని, ఉన్న కోర్సులలో మరింతమంది విద్యార్థులు చేరడానికి సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి నన్నయ వర్సిటీ ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు పలుమార్లు ఇక్కడ మీడియాకు చెప్పారు. ఆయన తర్వాత ప్రత్యేక అ«ధికారి పాలన, ఇన్చార్జి వీసీల నేతృత్వంలో ఇక్కడ ఆర్ట్స్ కోర్సులను ఎత్తేసే పరిస్థితి వచ్చినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్న ఒక్క ఎంబీఏ కోర్సును.. ప్రస్తుతం ఇక్కడి పీజీ క్యాంపస్‌లో ఎంబీఏ కోర్సు ఒకటే ఆర్ట్స్ విభాగంలో ఉంది. 2018–20 బ్యాచ్‌గా విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ నిబంధనావళి ప్రకారం ఈ బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య ఉంది. కానీ ఈ కోర్సును ఎత్తేస్తున్నామని, ప్రస్తుత ఈ బ్యాచ్ విద్యార్థులు కాకినాడ కాని, రాజమండ్రి కాని వచ్చి చదువుకోవాలని వర్సిటీ బాధ్యులు మౌఖికంగా చెప్పి విద్యార్థులను ఇక్కడి నుంచి తరలించనున్నారు. తద్వారా ఈ కోర్సును ఎత్తేసిన జాబితాలో చేర్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఒక కోర్సును రద్దు చేసే పక్షంలో ఆరు నెలల ముందు ప్రకటన రూపంలో బహిరంగపర్చాలి. ఏదైనా కోర్సులో చదివే విద్యార్థుల సంఖ్య నలుగురి కంటే తక్కువ ఉంటే మాత్రమే కోర్సును రద్దు చేయాలి. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో ఉన్న ఎంబీఏలో అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈ బ్యాచ్‌లో విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. జిల్లాలో ఎంబీఏ కోర్సు కలిగిన ఏకైక ప్రభుత్వ క్యాంపస్ నన్నయ క్యాంపస్ మాత్రమే. గూడెం పట్టణంలో ఉన్న ప్రయివేటు కళాశాలల్లో మూడింటిలో ఎంబీఏ కోర్సు ఉంది. ఇన్‌టేక్‌గా రెండు కళాశాలల్లో 120 సీట్లు ఉన్నాయి. అవి భర్తీ అవుతున్నాయి. మరో ప్రయివేటు కళాశాలలో కూడా ఎంబీఏకు విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఎంబీఏ చదివే విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థలతో పోల్చుకుంటే క్యాంపస్ ఫీజు చాలా తక్కువ. ప్రయివేటు కళాశాలల్లో ఎంబీఏ ఫీజు 60 వేల రూపాయల వరకు ఉంటే, క్యాంపస్‌లో ఎంబీఏ పీజు కేవలం 16,300 రూపాయలు మాత్రమే. పైగా ఇక్కడ విద్యార్థులను ఇండస్ట్రీయల్ టూర్స్‌కు తీసుకెళతారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఇక్కడ ఎంబీఏ కోర్సు రద్దు చేసే యోచనపై విద్యార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
మనసు, మాట, చేత ఒకటి కావాలి
‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని వక్తలు ఉద్బోధించారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం కల్చరల్: ‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి,. ముఖ్య అతిథిగా ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఈ దేశానికి రామకృష్ణ పరమహంస, వివేకానందుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, కానీ సోదరి నివేదిత గురించి తెలియనివారు చాలామంది ఉండవచ్చని అన్నారు. చికాగో వెళ్ళేటప్పుడు వివేకానందునికి బోస్టన్ నగరంలో నివసిస్తున్న ఒక మహిళ పరిచయమై, తన విజిటింగ్ కార్డును ఇచ్చిందన్నారు. చికాగో ప్రపంచ మత సమ్మేళన సభలు మూడు నెలలు వాయిదా పడి, తెచ్చుకున్న ధనం అయిపోవడంతో వివేకానందుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళి కొంతకాలం బస చేశారని చెప్పారు. అక్కడికి వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఒకరు వివేకానందుని వాగ్ధాటికి అచ్చెరువొంది ‘ఈ దేశంలో ప్రొఫెసర్లందరూ కలసినా వివేకానందునికి సాటి రా’రని అన్నారు. లండన్‌లో సోదరి నివేదిత వివేకానందుని ప్రసంగానికి ముగ్ధురాలై అన్ని మతాలూ ఒకే దారిచూపుతాయని గ్రహించిందని, వివేకానందుని పిలుపుమేరకు ఈ గడ్డపై కాలు మోపిందని వివరించారు. మహాత్మునికి, సోదరి నివేదితకు పోలికలు ఉన్నాయని, గోపాలకృష్ణ గోఖలే మహాత్ముని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించగా వివేకానందుడు నివేదితను ఈ గడ్డపై సామాజిక సేవ చేయవలసిందిగా పిలుపునిచ్చారన్నారు. నివేదిత, కాటన్, బ్రౌన్ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. గ్లోబల్ హాస్పిటల్స్ సలహాదారుడు డాక్టర్ కె.ఎస్.రత్నాకర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే సమాజం నాశనమవుతుందన్నారు. యువత పే, ప్రాస్పెక్ట్స్, ప్రమోషన్ అనే మూడు అంశాలపై మాత్రమే దృష్టి సారించరాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన రామకృష్ణ మిషన్, బేలూరు ప్రధాన కార్యదర్శి స్వామి అభిరామానందజీ మాట్లాడుతూ మన దేశంలో యువకులు, మానవవనరుల సంఖ్య ఇతర దేశాలకన్నా ఎక్కువన్నారు. విద్య అంటే కేవలం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసం మెరుగుపరుచుకోవాలని సూచించారు. నగరాధ్యక్షుడు స్వామి కపాలీశానంద స్వాగత వచనాలు పలికారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి శేవ్యానందజీ, విశాఖపట్టణం మిషన్‌కు చెందిన గుణేశానందజీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ముత్యాలునాయుడిని నిర్వాహకులు సత్కరించారు. స్వామి హరికృపానందజీ వందనసమర్పణ చేశారు. ఉత్సవాలు శని, ఆదివారాల్లో కొనసాగుతాయి. -
భావితరాలకు ఆక్సిజన్ సిలిండర్లే గతి
కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు సంభవించకపోతే మన భావితరాలు ఆక్సిజన్ సిలిండర్లతో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో గురువారం రాత్రి ‘శక్తి పునరుత్పాదకత’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించిన ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రకృతి పరంగా లభించే మంచినీటినే ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఉందని, వాతావరణంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఆక్సిజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. బొగ్గు, ఆయిల్, గ్యాస్‌ను స్థాయికి మించి తవ్వేస్తున్నాం. దాని దుష్ఫలితాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులు గాలి, నీరు, సౌర శక్తి, సముద్రం మన దగ్గర అధికంగా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కావలసినంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించారు. వీటన్నింటినీ మనం అందుబాటులోకి తీసుకువస్తే 2030 నాటికి 40 శాతం అభివృద్ధి సాధిస్తామన్నారు. 2050 నాటికి నూరు శాతం అభివృద్ధి సాధించి గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోగలుగుతామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశాలలో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. సోలార్ విద్యుత్‌పై త్వరలో తమ కళాశాలలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కళాశాల విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
జీవితాంతంరుణపడి ఉంటాం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ‘‘యూనివర్సిటీలో అడుగుపెట్టిన వెంటనే ఇది నా కుటుంబం అనే భావన కలిగింది. ఇక్కడి వాతావరణ, విద్యార్థులు, భవనాలు అన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం మనం మొదటిగా నేర్చుకోవలసిన విషయం, అది ఇక్కడ విద్యార్థుల్లో కనిపించడం ఎంతో ఆనందం వేస్తోంది. మా తండ్రి సత్యమూర్తికి ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన యూనివర్సిటీకి తాము జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు ఆదికవి నన్నయ యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా రచించిన యూనివర్సిటీ గీతాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అలాగే తన తండ్రి సత్యమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన యోగ విజ్ఞాన కేంద్రాన్ని తల్లి శిరోమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడికి ఒక ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చినట్టుగా లేదని, మా ఫ్యామీలీ ఫంక్షన్‌గా ఉందన్నారు. తన తండ్రి పుట్టినూరు వెదురుపాకైతే, తన తల్లి పుట్టింది అమలాపురమన్నారు. అందువల్లే అ.. అంటే అమలాపురం పాట చేశానన్నారు. అమ్మమ్మ పేరు దేవీమీనాక్షి, తాత పేరు ప్రసాద్‌లను శ్రీతో కలిపి తనకు దేవిశ్రీ ప్రసాద్‌గా పెట్టారన్నారు. పాటలతో జోష్ నింపుతూ.. విశ్వమే ఒక విద్యాలయం అంటారు. కానీ ఈ విద్యాలయమే ఒక విశ్వంగా కనిపిస్తుందన్నారు. ‘ఎర్రచొక్కానే నీ కోసం వేశాను, సర్‌మంటూ ఫారిన్ సెంటు కొట్టాను, గళ్ల లుంగీతో నీ కోసం వచ్చాను. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు అని పాడుతూ విద్యార్థులతో ఈలలు వేయించారు. యోగ సాధనలో నిష్టాతులుగా పేరొందిన తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రస్తావిస్తూ వన్, టూ, త్రీ, ఫోర్ చెయ్యి యోగా.. ఒంటికి యోగా మంచిదేగా అంటూ పాడి గ్యాలరీలో కేరింతలు కొట్టించారు. రంగా రంగా..రంగస్థలాన ఓ.. అంటూ రానున్న రంగస్థలం సినిమాలో పాటను పాడి వినిపించారు. వీడి పేరు గబ్బర్‌సింగ్., ఏ పిల్లా నీవులేని జీవితం., పాటలు పాడుతూ హుషారెత్తించారు. అలాగే ఆయన సోదరుడు, సినీ సంగీత దర్శకుడు సాగర్ విద్యార్థుల కోరిక మేరకు పాట పాడుతూ ‘తీసేద్దాం.. తీసేద్దాం ఎగ్జామ్ తాట తీసేద్దాం.. తెచ్చేద్దాం తెచ్చేద్దాం ఫస్ట్ మార్కు తెచ్చేద్దాం’ అంటూ వారిలో జోష్ పుట్టించారు. చదువు, ఉత్తీర్ణత లక్ష్యాలను గుర్తు చేశారు. మనస్సు పెట్టి చేస్తే ఏదైనా హిట్టే.. ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ మనస్సు పెట్టి చేస్తే ఏదైనా సూపర్ హిట్ అవుతుందనడానికి దేవీశ్రీప్రసాదే ఉదాహరణ అని వీసీ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయన సంగీతం అందించిన అనేక సినిమాలు విజయవంతమయ్యాయన్నారు. యూనివర్సిటీ కోసం గీతాన్ని రచించిన డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు, ఆలపించిన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఆవిష్కరించిన దేవిశ్రీప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. తరాలు మారిన తరగని ఆస్తి సాహిత్యమేనని గీత రచయిత డాక్టర్ వెనిగెళ్ల రాంబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవిశ్రీప్రసాద్‌తోపాటు ఆయన తల్లి శిరోమణి, సోదరుడు సాగర్, చెల్లెలు పద్మినిప్రియదర్శిని, బావ రాంబాబు, యూనివర్సిటీ అధికారులు డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ టి.హైమవతి, డాక్టర్ పి.పెర్సిస్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల కష్టం..ఉన్నత స్థానం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోట : జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొందరు జీవన పోరాటంలో కొంత దూరం ప్రయాణించి అలిసిపోతారు. మరి కొందరు అలుపెరుగని పోరాటంతో తమ జీవిత కలను సాకారం చేసుకుంటారు. ఈ ప్రయత్నంలో ఎన్నికష్టాలు ఎదురొచ్చినా అధిగమిస్తూ విజయతీరాలకు చేరుతారు. ఈ కోవకు చెందిన వారే కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన తుపాకుల అశోక్. మారుమూల గిరిజన కాలనీలో పుట్టిపెరిగిన అశోక్ నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నత స్థాయి బాధ్యతను గత ఆగస్టులో చేపట్టాడు. ఆదివారం కోటకు వచ్చిన ఆశోక్ ‘సాక్షి’తో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. సుబ్బరామయ్య, రాగమ్మ కుమారుడు అశోక్. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. నిరుపేదలు కావడంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. సిద్ధవరంలో ప్రాథమిక విద్య అనంతరం కోట ఎస్టీ గురుకుల పాఠశాలలో 1996లో టెన్త్ పూర్తి చేశారు. ఇంటర్,డిగ్రీ విద్యానగర్ ఎన్బీకేఆర్లో చదివారు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేశారు. అనంతరం పులివెందుల వైఎస్ రాజారెడ్డి లయోలా డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల పాటు ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కాకినాడ పీజీ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వేరుపడటంతో అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉత్తమ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆగస్టు 28న నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. తల్లిదండ్రులకు చదువు రాకపోయినా ఉన్నత లక్ష్యం అందుకోవాలన్న బలమైన కోరికే తన ఎదుగుదలకు కారణమని అశోక్ చెప్పారు. 38 ఏళ్లకే యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగినా తన ఉన్నతిని చూసేందుకు తల్లిదండ్రులు లేక పోవడం తీరని లోటని ఆశోక్ అన్నారు. 460 అఫిలియేటెడ్ కళాశాలలున్న నన్నయ్య యూనివర్సిటీ ఖ్యాతిని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. -
పట్టభద్రులు మంచి మార్గం ఎంచుకోవాలి
నన్నయ యూనివర్సిటీ వీసీ ముత్యాలనాయుడు పిలుపు ఘనంగా సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : యువత కేవలం ఉద్యోగం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా సమాజాన్ని ముందుకు నడిపేలా పట్టభద్రులు మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి(వీసీ)ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక సీఆర్‌రెడ్డి అటానమస్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే బడేటి బుజ్జి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ డిగ్రీ పట్టా పొందడం జీవితంలో మరుపురాని అనుభూతి అని అన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే సామర్థ్యం పెంపొందించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. సీఆర్ రెడ్డి విద్యా సంస్థల అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారని, వారిలో తాను కూడా ఒకరు కావడం గర్వంగా ఉందని చెప్పారు. అనంతరం 20162017 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన 600 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఎమ్మెల్యే బడేటి బుజ్జి, వీసీ ముత్యాలనాయుడు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 20 మందికి వీసీ బంగారు పతకాలను అందించారు. కార్యక్రమంలో సీఆర్‌రెడ్డి విద్యా సంస్థల ఉపా«ధ్యక్షులు వీవీ బాలకృష్ణారావు, కాకరాల రాజేంద్రప్రసాద్, సభ్యులతో పాటు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.వెంకట్రావు, ఐక్యూ ఏసీ కన్వీనర్ పీసీ స్వరూప్, సూపరింటెండెంట్ పతంజలి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
దేవరపల్లి : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని అంతర జిల్లాల ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం దేవరపల్లిలో ప్రారంభమయ్యాయి. స్థానిక భూపతిరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి. తొలుత ఈ పోటీలను రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ప్రారంభించారు. విద్యా సంస్థల చైర్మ¯ŒS డి.సువర్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మంది అభిమానులు కలిగిన ఆట పుట్‌బాల్ అని అన్నారు. క్రీడలకు నన్నయ యూనివర్సిటీ ఇస్తున్న ప్రాధాన్యం రెండు తెలుగు రాష్టాల్లో ఏ యూనివర్సిటీ ఇవ్వడంలేదన్నారు. జాతీయస్థాయిలో 600 యూనివర్సిటీల మధ్య నిర్వహించిన బాల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో నన్నయ యూనివర్సిటీకి ద్వితీయస్థానం లభించిందన్నారు. బాడీ బిల్డింగ్లోనూ ద్వితీయస్థానం లభించినట్టు చెప్పారు. 450 కళాశాలలు యూనివర్శిటీ పరిధిలో ఉన్నాయని, 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. సర్పంచ్ సుంకర యామినీ, జెడ్పీటీసీ కె.సుధారాణి, రాప్ట్ర క్రీడల అధికారి పేరం రవీంద్రనాథ్, ఏఎంసీ ఛైర్మ¯ŒS ముళ్లపూడి వెంకట్రావు, మానవత సంస్థ జిల్లా నాయకుడు పరిమి వెంకటేశ్వరరావు, కళాశాల పీడీ కె.వి.డి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ వి. ఆనందరావు, హెచ్ఎం పి.వీర్రాజు, యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘అంతరిక్ష’లో దూసుకుపోతున్న భారత్
ఇస్రో డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాద్ ‘నన్నయ’ లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : అంతరిక్ష రంగంలో భారతదేశం మునుముందుకు దూసుకుపోతోందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్ఆర్ఓ) డిప్యూటీ జనరల్ మేనేజర్ బీవీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. ‘ప్రపంచ అంతరిక్ష వారోత్సవా’న్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా 1956, అక్టోబరు 4న అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించినందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం సాధిస్తున్న విజయాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలపడం, విద్యార్థులను ఈ రంగం వైపు ఆకర్షించడం ఈ వారోత్సవాల ముఖ్యోద్దేశమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు నన్నయ యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం వల్ల వారు ఈ రంగం వైపు ఆకర్షితులవుతారని నన్నయ వర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎం. ముత్యాలు నాయుడు పేర్కొన్నారు. సైన్సు కు మూలాలు గ్రీకు గ్రంథాలైన ఇలియడ్, ఒడిస్సీ, భారతీయ గ్రంథాలైన మహాభారతం మొదలైన వాటిలో ఉన్నాయంటూ పలు ఉదాహరణలను ఆయన వివరిం చారు. ఇస్రో శాస్త్రవేత్తలను వీసీ సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, ఇస్రో శాస్త్రవేత్తలు సత్యప్రకాశ్, ఎంవీ రమణయ్య, వెంకటరామయ్య, రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ పి. సురేష్‌వర్మ, డీన్ వెంకటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రమేష్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన చదరంగం పోటీల పురుషుల విభాగంలో నన్నయ యూనివర్సిటీ ప్రథమ, పీఆర్ ప్రభుత్వ కళాశాల (కాకినాడ) ద్వితీయ, డాక్టర్ బీవీఆర్ కళాశాల (భీమవరం) తృతీయ, బీఎస్ఎం కళాశాల (రామచంద్రపురం) చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అలాగే మహిళల విభాగంలో ఒకటి నుంచి నాలు స్థానాలను ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల, సెయింట్ మేరీస్ కళాశాల, సీఆర్ఆర్ మహిళా కళాశాల, వీఎస్ఎం కళాశాలలు దక్కించుకున్నాయి. విజేతలకు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు బహుమతులు అందజేశారు. 2016–17 యూనివర్సిటీ చదరంగం జట్టుకు ఎంపికైన బాలురులో వి.బాలరాజు (ఎస్‌కేవీఎస్, గోకవరం), కె.మహేష్ (నన్నయ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం), వై.వినయ్‌చంద్ (సీఎస్టీఎస్, జంగారెడ్డిగూడెం), టి.నగేష్ (పీఆర్ ప్రభుత్వ కళాశాల, కాకినాడ), బి.హరీష్ (వీఎస్ఎం కళాశాల, రామచంద్రపురం), జేజేఎస్ మణికుమార్ (జీబీఆర్ కళాశాల, అనపర్తి) ఉన్నారు. బాలికల విభాగంలో బి.సంకల్ప (సీఆర్ఆర్, ఏలూరు), ఎన్.పద్మకళ (ఎస్ఎంబిటీ – ఏవీఎస్‌ఎన్, వీరవాసరం), పీజీఎస్ సామరంజని (పీఆర్జీ, కాకినాడ), బి.మోహినికుమారి, ఎ.మౌనిక (ఎస్టీ థెరీసా, ఏలూరు), పి.కీర్తి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు), ఎంపికయ్యారు. విజేతలను, టీమ్ సభ్యులను ఉపకులపతితోపాటు రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, పలువురు అధ్యాపకులు అభినందించారు. -
మానవ వనరుల సక్రమ వినియోగం అవసరం
తాడేపల్లిగూడెం: మానవ వనరులను సక్రమంగా ఉపయోగించాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉందని ఆదికవి నన్నయ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ముత్యాలునాయుడు అన్నారు. వికాస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వాసవీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మానవవనరుల అభివద్ధి కేంద్రాన్ని (హెచ్ఆర్డీ సెంటర్) బుధవారం ఆయన ప్రారంభించారు. యువత సత్తా ప్రపంచానికి తెలియాలంటే మానవ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. యువతలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు నన్నయ వర్సిటీ ద్వారా వికాస్ సంస్థ సహకారంతో హెచ్ఆర్డీ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గోదావరి జిల్లాలో 16 కేంద్రాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో 16 హెచ్ఆర్డీ కేంద్రాలు ఎంపిక చేయాలనేది లక్ష్యం కాగా, 11వ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేశామని వీసీ అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 250 కళాశాలలు, లక్ష మందికి పైగా విద్యార్థులున్న ఏకైక యూనివర్సిటీగా నన్నయ వర్సిటీ నిలిచిందని చెప్పారు. వర్సిటీలో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టడంతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను ఏర్పాటుచేయడం, పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను మార్పులు చేయడం వంటివి చేస్తున్నామని చెప్పారు. 45 రోజులపాటు శిక్షణ .. కాకినాడలోని వికాస్ కేంద్రంతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుందని వీసీ చెప్పారు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హెచ్ఆర్డీ కేంద్రం ద్వారా 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు పెంచడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కషిచేస్తున్నామన్నారు. కళాశాలకు రహదారి సౌకర్యం ఏర్పాటుచేయడానికి సహకారం అందిస్తామని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు చెప్పారు.