
నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్ర
రాజానగరం: ఆదికవి నన్నయ యూనవర్సిటీలో విద్యార్థినులను లైంగి క వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను అరెస్టు చేశామని స్థానిక సీఐ ఎంవీ సుభాష్ తెలిపా రు. విద్యార్థినుల సెల్‌ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ, వారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రిజిస్టార్ ఆచార్య ఎస్. టేకి ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి క్రైమ్ నం.489/2019 యు/సెక్షన్స్, 354 (ఏ), 354 (డి), 509, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.
ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషనుకు చెందిన మహిళ ఎస్సై శ్రావణి కృష్ణా జిల్లా నందిగామలోని అతని స్వగృహంలో నిందితుడిని అరెస్టు చేసి, రాజమహేంద్రవరానికి తీసుకువచ్చారన్నారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment