విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. తల్లిదండ్రుల తరువాత గౌరవించేది అధ్యాపకులనే. ఇంతటి గౌరవప్రదమైన వృత్తికే కళంకం తెచ్చాడు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆ కీచకుడు స్పెషల్ క్లాసుల పేరుతో తన ఫ్లాట్‌కు విద్యార్థినులను రప్పించుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ అధ్యాపకుడిపై ఫిర్యాదు చేద్దామంటే వర్సిటీలో ఉన్నతాధికారులంతా ఆయన్నే వెనకేసుకొస్తూ బాధితులనే బెదిరిస్తుండడంతో చాలా కాలం పాటు మౌనందాల్చారు. చివరకు ధైర్యం చేసి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే లేఖ రాశారు. లేఖ అందుకున్న ముఖ్యమంత్రి తక్షణమే విచారణకు ఆదేశించారు.
నన్నయ యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్
Published Fri, Oct 11 2019 12:07 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM