‘అంతరిక్ష’లో దూసుకుపోతున్న భారత్‌ | space research india nannaya university | Sakshi
Sakshi News home page

‘అంతరిక్ష’లో దూసుకుపోతున్న భారత్‌

Published Wed, Oct 5 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

‘అంతరిక్ష’లో దూసుకుపోతున్న భారత్‌

‘అంతరిక్ష’లో దూసుకుపోతున్న భారత్‌

ఇస్రో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ప్రసాద్‌
‘నన్నయ’ లో  ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : అంతరిక్ష రంగంలో భారతదేశం మునుముందుకు దూసుకుపోతోందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బీవీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అన్నారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపే చూస్తున్నాయన్నారు.  ‘ప్రపంచ అంతరిక్ష వారోత్సవా’న్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు.  తొలిసారిగా 1956, అక్టోబరు 4న అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించినందుకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం సాధిస్తున్న విజయాలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలపడం, విద్యార్థులను ఈ రంగం వైపు ఆకర్షించడం ఈ వారోత్సవాల ముఖ్యోద్దేశమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు నన్నయ యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం వల్ల వారు ఈ రంగం వైపు ఆకర్షితులవుతారని నన్నయ వర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎం. ముత్యాలు నాయుడు పేర్కొన్నారు. సైన్సు కు మూలాలు గ్రీకు గ్రంథాలైన ఇలియడ్, ఒడిస్సీ, భారతీయ గ్రంథాలైన మహాభారతం మొదలైన వాటిలో ఉన్నాయంటూ పలు ఉదాహరణలను ఆయన వివరిం చారు. ఇస్రో శాస్త్రవేత్తలను వీసీ సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ. నరసింహారావు, ఇస్రో శాస్త్రవేత్తలు సత్యప్రకాశ్, ఎంవీ రమణయ్య, వెంకటరామయ్య, రాంబాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మట్టారెడ్డి, డాక్టర్‌ పి. సురేష్‌వర్మ, డీన్‌ వెంకటేశ్వరరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ రమేష్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement