ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
Published Sun, Nov 27 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
దేవరపల్లి : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని అంతర జిల్లాల ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం దేవరపల్లిలో ప్రారంభమయ్యాయి. స్థానిక భూపతిరాజు విద్యాసంస్థల ఆధ్వర్యంలో అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు రెండు రోజులు జరగనున్నాయి. తొలుత ఈ పోటీలను రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ప్రారంభించారు. విద్యా సంస్థల చైర్మ¯ŒS డి.సువర్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మంది అభిమానులు కలిగిన ఆట పుట్‌బాల్ అని అన్నారు. క్రీడలకు నన్నయ యూనివర్సిటీ ఇస్తున్న ప్రాధాన్యం రెండు తెలుగు రాష్టాల్లో ఏ యూనివర్సిటీ ఇవ్వడంలేదన్నారు. జాతీయస్థాయిలో 600 యూనివర్సిటీల మధ్య నిర్వహించిన బాల్ బ్యాడ్మింట¯ŒS పోటీల్లో నన్నయ యూనివర్సిటీకి ద్వితీయస్థానం లభించిందన్నారు. బాడీ బిల్డింగ్‌లోనూ ద్వితీయస్థానం లభించినట్టు చెప్పారు. 450 కళాశాలలు యూనివర్శిటీ పరిధిలో ఉన్నాయని, 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. సర్పంచ్ సుంకర యామినీ, జెడ్పీటీసీ కె.సుధారాణి, రాప్ట్ర క్రీడల అధికారి పేరం రవీంద్రనాథ్, ఏఎంసీ ఛైర్మ¯ŒS ముళ్లపూడి వెంకట్రావు, మానవత సంస్థ జిల్లా నాయకుడు పరిమి వెంకటేశ్వరరావు, కళాశాల పీడీ కె.వి.డి.వి.ప్రసాద్, ప్రిన్సిపాల్ వి. ఆనందరావు, హెచ్‌ఎం పి.వీర్రాజు, యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement