games
-
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు ...!
-
IPL 2025: IPL కప్ మనదేనా?
-
హ్యాండ్‌బాల్..డిఫెండర్స్..
క్రికెట్.. ఫుట్‌బాల్.. బ్యాడ్మింటన్.. ఈ సరసన హ్యాండ్బాల్కూ ఎనలేని ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇక్కడి కోచ్‌లు నిరి్వరామంగా కృషి చేస్తున్నారు. క్రీడలపై ఉన్న ప్రీతితో నేటి తరం వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చిన్ననాటి నుంచే బీజాలు వేస్తున్నారు. ఇందు కోసం స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తూ హ్యాండ్‌బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. వారే సనత్‌నగర్ కార్మిక సంక్షేమ మైదానం కేంద్రంగా దశాబ్దాల కాలంగా హ్యాండ్‌బాల్ శిక్షణ ఇస్తున్న అసోసియేషన్ సభ్యులు. – సనత్‌నగర్ సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ హ్యాండ్‌బాల్ క్రీడలో ఎందరో ఆణిముత్యాలను అందించింది. పారిశ్రామికవాడగా కార్మికుల ఆవాసంగా ఉన్న సనత్‌నగర్‌లో పలువురు హ్యాండ్‌బాల్ ఆటలో ఆసక్తి చూపిస్తున్న క్రమంలో 1975లో స్థానిక ఎస్ఆర్టీ కాలనీలోని కార్మిక సంక్షేమ సంఘం భవనం ఆవరణలో ప్రత్యేక క్రీడా శిబిరం నిర్వహించారు. అలా మొదలైన శిబిరం క్రీడాకారుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని రగిలించారు. వారిలో సనత్‌నగర్ మాజీ కార్పొరేటర్ అయూబ్‌ఖాన్, మక్సూద్, జగన్నాథం, సుబోద్ విల్సన్, ప్రబోద్ విల్సన్, డాక్టర్ నగేశ్, విద్య, ఏఎస్ మునవర్, పీవీ నాగార్జున, ధన్‌రాజ్ తదితరులు హ్యాండ్‌బాల్ క్రీడాకారులుగా వెలుగులోకి వచ్చినవారే. అలాగే సనత్‌నగర్‌కు చెందిన ఎంఏ అజీజ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న ఘనతను దక్కించుకున్నారు. మరో క్రీడాకారుడు బాసిత్ ఆసియా క్రీడల ప్రొబబుల్స్‌లో స్థానం కైవసం చేసుకున్నాడు. వీరంతా వృత్తిపరంగా వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ హ్యాండ్‌బాల్ క్రీడపై అభిమానాన్ని విడవలేదు. ఇక్కడే శిక్షణ తీసుకుని కోచ్‌లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. నిరంతర శిక్షణనిస్తూ.. జాతీయ స్థాయిలో రాణించిన ఆనాటి మేటి క్రీడాకారులంతా సంఘటితమై 1980లో అప్పటి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత మేడ్చెల్ జిల్లా) హ్యాండ్‌బాల్ అసోసియేషన్ (రిజిస్టర్డ్ నెంబర్: 1859)ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని వేల మంది హ్యాండ్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఎక్కడ ఏ పోటీ జరిగినా జిల్లా నుంచి పాల్గొనే టీమ్‌ను సన్నద్ధం చేసేది ఈ అసోసియేషనే సభ్యులే. ఇక్కడ శిక్షణ పొందేవారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నారు. అండర్–12, అండర్–16, అండర్–19, సీనియర్స్ విభాగాల్లో ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. మొదట స్కూల్ లెవల్ క్యాంపులు నిర్వహించి హ్యాండ్‌బాల్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తారు. ఆ తరువాత వారిలో నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి క్రీడలో మెళకువలు నేర్పిస్తారు. ఆ తరువాత వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తగిన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. వారే కోచ్‌లుగా, ఇక్కడి గ్రౌండ్‌లోనే శిక్షణ పొందిన వారే కోచ్‌లుగా వ్యవహరిస్తూ ఉచిత శిక్షణ అందిస్తుండడం గమనార్హం. స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించిన వారు ఎందరో.. జనరల్ కోటాలో సీటు రానివారికి హ్యాండ్‌బాల్ క్రీడే ఆపన్నహస్తంగా మారుతోంది. ఈ క్రీడలో గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడినవారు పదుల సంఖ్యలో స్పోర్ట్స్ కోటాలో సులభంగా సీట్లు సాధించడం గమనార్హం. -
సెంచరీతో రికార్డ్ సాధించిన భద్రాచలం యువతి త్రిష
-
వయసుకే వృద్ధాప్యం.. !
వయసుకే వృద్ధాప్యం..మనసుకు మాత్రం కాదు.. అన్నట్లు హుషారైన వాతావరణం అక్కడి వారి సొంతం. ఆట ఏదైనా సై అంటూ రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రతిభను చాటుతుంటారు హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీకి చెందిన సీనియర్ సిటిజన్స్ అంతా ఒకచోట చేరి సందడిగా గడుపుతున్నారు. అలాంటి హుషారైన వేదికకు అసోసియేషన్ కార్యాలయం.. సీనియర్ సిటిజన్స్ ఆనందానికి నెలవైంది. వయస్సు మీద పడింది కదా.. అని ఏదో మూలన కూర్చోవడం ఒకప్పటి మాట. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం ఆటలతో అదరగొట్టేస్తున్నారు. కేరమ్స్, చెస్ వంటి ఆటలతో మానసికోల్లాసం పొందడమే కాకుండా థ్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. చాలా కుటుంబాల్లో తమవారంతా కార్యాలయాలకో, పిల్లలు స్కూళ్లకో, కళాశాలలకో వెళ్లిపోతుండగా.. సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి ఎవరికి ఇష్టమైన గేమ్‌లో వారు ఆడుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటున్నారు. రెండు వేల పుస్తకాలతో.. ఆడుకునేవారు ఆడుకుంటుంటే.. మరికొందరు ఇక్కడి లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతూ విజ్ఞాన సముపార్జన చేస్తుంటారు. సాహిత్యం, ఆధ్యాతి్మకం, హిస్టరీ.. ఇలా దాదాపు నాలుగు వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. కాలనీవాసులు ఇంటికీ తీసుకెవెళ్లేందుకు కూడా అనుమతిస్తారు. అలాగే దినపత్రికలు, మ్యాగజైన్స్ చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు. ప్రతిరోజూ ఇక్కడికి నాలుగు రకాల పత్రికలతో పాటు వివిధ రకాల వీక్లీ మ్యాగజైన్స్ వస్తుంటాయి. వాటిని చదువుతూ ప్రపంచ విశేషాలను తెలపడమే కాదు.. ఇంటికెళ్లి తమ వారితో పంచుకుంటుంటారు. ఆటల పోటీల్లో.. జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 1 (సీనియర్ సిటిజన్స్ డే) సందర్భంగా ఆసరా కమిటీ సహకారంతో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్లోని సీనియర్ సిటిజన్స్ పలు క్రీడాంశాల్లో పోటీ పడుతుంటారు. కేరంబోర్డు, చదరంగం, బ్రిస్క్ వాకింగ్, టగ్ ఆఫ్ వార్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేస్తారు. ఏడు పదులు దాటిన వయోధికులకు మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతియేటా సన్మానిస్తూ ఎప్పటికప్పుడు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది. భవిష్యత్తు తరాలకు సీనియర్ సిటిజన్స్‌కు ఏవిధమైన గౌరవం, ఆప్యాయత చూపించాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుండడం విశేషం. ఆత్మాభిమానంతో బతకాలి.. ఏ సమాజంలో వృద్ధులు తల ఎత్తుకుని ఆత్మాభిమానంతో మనుగడ సాగిస్తారో ఆ సమాజమే నాగిరిక సమాజం. ఆ సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ముందంజవేసి భావితరాలకు కరదీపికగా నిలుస్తుంది. ఇది ఒక భావన, ఆకాంక్ష, స్వప్నం. దీనిని సాకారం చేసుకోవాలంటే కలలో నుంచి ఇలలోకి రావాలి. నేటి సమాజంలోని వృద్ధుల స్థితిగతులను సామాజిక, శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. – జేఎస్టీ శాయి, ప్రధాన కార్యదర్శి, మోడల్‌కాలనీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ -
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
టీమిండియాకు కొత్త తలనొప్పి..!
-
ఫ్యాన్స్‌కు భారీ షాక్ నితీశ్రీ రెడ్డి ఔట్?
-
ఆంతా వాళ్లే చేశారంట..! క్రికెటర్ల తండ్రుల ఆవేదన
-
స్నేహితుడే కారణమా..? అశ్విన్ రిటైర్మెంట్ వెనుక సంచలన నిజాలు
-
రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన రోహిత్...
-
Vinod Kambli: కాంబ్లీకి ఏమైంది..?
-
అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా ఫోన్లలో పాత గేమ్స్ అన్నీ కనుమరుగయ్యాయి. ఇందులో ఒకటి.. ఒకప్పుడు అందరికీ ఇష్టమైన 'స్నేక్ గేమ్'. నోకియా ఫోన్ ఉపయోగించిన ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. 4జీ, 5జీ ఫోన్లు రానప్పుడు ఎంతోమంది ఫేవరేట్ గేమ్ కూడా ఇదే. ఆ గేమ్ మళ్ళీ వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బ్రిటీష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్.. ఐకానిక్ స్నేక్ గేమ్‌ను నథింగ్ హోమ్ స్క్రీన్ విడ్జెట్‌గా తీసుకొచ్చింది. దీనిని నథింగ్ కొత్త కమ్యూనిటీ విడ్జెట్ల యాప్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లేటెస్ట్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌తో సహా ప్రతి నథింగ్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.నిజానికి ఈ స్నేక్ గేమ్‌ను మొట్టమొదట నథింగ్ యూజర్ రాహుల్ జనార్ధనన్ ఒక కాన్సెప్ట్‌గా ప్రారభించారు. దీనితో పాటు మరో తొమ్మిది కాన్సెప్ట్‌లను రూపొందించి.. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. జనార్దనన్ కాన్సెప్ట్‌లు కంపెనీ దృష్టిని ఆకర్షించింది. దీంతో రూపొందించడానికి నథింగ్స్ సాఫ్ట్వేర్ బృందం కమ్యూనిటీ డెవలపర్‌తో భాగమయ్యారు.ఈ స్నేక్ గేమ్ 26 సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పామును కంట్రోల్ చేయడానికి నోకియా ఫోన్లో బటన్స్ ఉండేవి. ఇప్పుడు ఫోన్లలో బటన్స్ లేవు, కాబట్టి పాము కదలికను కంట్రోల్ చేయడానికి డైరెక్షనల్ వైపు టచ్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చూడటానికి విడ్జెట్‌పై రెండుసార్లు నొక్కాలి.Snake just got a reboot. Head to Google Playstore to get involved. pic.twitter.com/9MVKM1yKBc— Nothing (@nothing) December 4, 2024 -
ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు.రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది. హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ గుర్తుచేశారు.క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు.కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి.. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. -
Virat Kohli: చరిత్ర సృష్టించిన చి విరాట్ కోహ్లి..
-
గేమింగ్ ప్రియులకు శుభవార్త: హైదరాబాద్‌లో జాతీయ సదస్సు
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ యానివెర్సరీ ఎడిషన్ నవంబర్ 13 నుంచి 15వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. దక్షిణాసియాలో అతిపెద్ద పురాతనమైన ఈ సదస్సుకు 5,000 మంది ఆహ్వానితులు, 250 కంటే ఎక్కువ మంది వక్తలు పాల్గొంటారు.సుమారు 150 సెషన్లలో జరిగే ఈ సదస్సులో గేమింగ్ సెక్టార్‌కు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. గేమింగ్ ఇండస్ట్రీలో దిగ్గజం 'జోర్డాన్ వీస్మాన్' వంటి ప్రముఖులు ముఖ్య వక్తలుగా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఈయన ఆర్పీజీ ఇండస్ట్రీలోని దీర్ఘకాల ఫ్రాంచైజీలైన బాటిల్టెక్, మెచ్వారియర్, షాడోరన్ సృష్టికర్తగా పేరుగడించారు.ఈ ఏడాది జరగనున్న ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ).. గతంలో కంటే కూడా భారీగా ఉండనుంది. ఇందులో లేటెస్ట్ గేమ్స్, టెక్నాలజీని ప్రదర్శించే 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఉండనున్నాయి. అవార్డ్స్ నైట్, ఇండీ ఇనిషియేటివ్, పాలసీ రౌండ్ టేబుల్లు, వర్క్‌షాప్ కూడా ఈ ఈవెంట్లో కనిపించనున్నాయి.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది ప్రత్యేకంగా ఇన్వెస్టర్-పబ్లిషర్ కనెక్ట్ సెషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వందమంది పెట్టుబడిదారులు దీనికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి. గత సంవత్సరం ఈ సదస్సు 70 కంటే ఎక్కువ డెవలపర్లు, పెట్టుబడిదారులతో 1,800 సమావేశాలను నిర్వహించింది.ఈ సంవత్సరం ఐడీజీసీ కార్యక్రమంలో 'ఇంటర్నేషనల్ గేమ్ అవార్డ్’లను కూడా అందించనున్నారు. ఇందులో పది రెగ్యులర్ అవార్డ్స్, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గేమింగ్ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ భారత్‌లో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమకు ఐడీజీసీ సరైన వేదిక. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడానికి, సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి.. పరిశ్రమలోనో ప్రముఖులను, డెవలపర్లతో పాటు ఆవిష్కర్తలను ఒకచోటకు చెరచడానికి సహకరిస్తోంది. -
DSP నిఖిత్ జరీన్.. హైదరాబాద్ లో సరైన ట్రైనింగ్ సెంటర్ లేదు
-
జావెలిన్ దిగిందా లేదా!
మొహమ్మద్ అబ్దుల్ హాది ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్‌లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్‌లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు. రాష్ట్రపతి అవార్డుతో..నవదీప్‌ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్‌లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్‌కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యేక శిక్షణతో ..బాల్పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్‌కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్‌పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్‌లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్‌కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు. కఠోర సాధనతో..ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్‌లో ఏదైనా ఒక ఈవెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం నవదీప్‌ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్‌ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్‌ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు. ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్‌లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు. -
ట్రామ్ పోలిన్ పిల్లలాటతో ఫిట్‌గా..
కొన్నిపార్కుల్లోనూ, మాల్స్‌లోనూ పిల్లలకోసం కేటాయించిన వలయాకారపు ట్రామ్ పోలిన్లు చూసే ఉంటారు. ‘మనమూ అలా గెంతితే ఎంత బాగుంటుంది’ అనుకుంటారు పెద్దవాళ్లు. కానీ, శరీరం సహకరించదేమోనని సందేహిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ల కోసం గెంతుతూ సరదాగా వ్యాయామం చేసే ట్రాంపోలిన్ వాక్ అందుబాటులోకి వచ్చింది.పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లోని ఫిట్నెస్ కేంద్రాలు వినోదానికి– వ్యాయామాలకు మధ్య ఉన్న విభజన రేఖను తొలగిస్తూ ఈ ట్రామ్ పోలిన్ పరికరాలను పరిచయం చేస్తున్నాయి. జిమ్‌లో రొటీన్‌గా వ్యాయామాలు చేయడం బోర్ అనిపిస్తే, ఈ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు.అనేక ప్రయోజనాలు...⇒ ట్రామ్ పోలిన్పై గెంతడం వల్ల గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేంత ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రామ్ పోలిన్ వర్కౌట్లు హృదయనాళాల పనితీరును బాగుచేయడంతోపాటు ఒత్తిడిని త్వరగా నివారిస్తాయి. ⇒ ‘ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది’అని ఢిల్లీకి చెందిన జుంబా శిక్షకుడు, ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ కోచ్ ఆరుషి పస్రిజా తెలియజేస్తున్నారు.⇒ ట్రామ్ పోలిన్ మృదువైన ఉపరితలం రన్నింగ్ లేదా ఇతర భారీ వ్యాయామాలతోపోలిస్తే కీళ్లపై భారాన్ని తగ్గిస్తుందని వైద్యులు గమనించారు, ఇది తేలికపాటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రామ్ పోలిన్ వ్యాయామాలు ఎముక ఆరోగ్యానికి, కండరాల బలోపేతానికి, సమతుల్యతకు సహకరిస్తాయి. ⇒ కదలికలు బాగా ఉండటం వల్ల త్వరగా కేలరీలు ఖర్చవుతాయి, బరువు తగ్గుతారు. హృదయ స్పందన రేటు పెరగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.⇒ ‘జంపింగ్ ఎముక సాంద్రతను ప్రేరేపిస్తుంది, ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది‘ అని ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యుగల్ తెలియజేశారు.మొదట్లోనే జంపింగ్‌లు వద్దు...ట్రామ్ పోలిన్ వర్కౌట్లలో స్క్వాట్ జంప్‌లు, జంపింగ్ జాక్స్, టక్ జంప్‌లు వంటి కఠినమైన కదలికలు కూడా ఉంటాయి. కానీ అదంతాప్రారంభ దశలో కాదు. పూర్తి శరీర వ్యాయామాలుగా మార్చడానికి వర్కౌట్స్, యోగా వంటి అనుకూలమైన వ్యాయామాలతో కలపాలి. ఈ వ్యాయామాలు చేయడానికి రెసిస్టెన్ ్స బ్యాండ్లను కూడా ఉపయోగించవచ్చు.ప్రమాదం.. నివారణఫిట్నెస్లో ట్రామ్ పోలిన్ను చేర్చాలనే ఆలోచన ఉత్తేజకరమైనదిగా అనిపించవచ్చు. అయితే గాయాలను నివారించడానికి జాగ్రత్త అవసరం. నేలపైన సరిగా సెట్ కాకపోతే ట్రామ్ పోలిన్ పడిపోవడం,పాదాలు బెణకడం, గాయాలకు దారితీయడం వంటివి. అందుకని నిపుణుల సూచనలు తీసుకొని, వీటి కొనుగోలులోనూ, ఉపయోగించడంలోనూ మెలకువలు తెలుసుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్పై ఉన్నప్పుడు ముందుగా మోకాళ్లను వంచి, శరీర బ్యాలెన్స్ చూసుకోవాలి. ⇒పరధ్యానంగా ఉండకూడదు. ట్రామ్ పోలిన్ పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టీని గట్టిగా పట్టుకోవాలి. ⇒ ట్రామ్ పోలిన్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు మంచి గ్రిప్ సాక్స్ లేదా షూ ధరించాలి. ⇒ నెమ్మదిగాప్రారంభించి, క్రమంగా తీవ్రతను పెంచాలి. ⇒ వారానికి 2–3 సార్లు చేసి, శరీర అనుకూలతను బట్టి వ్యవధిని పెంచుకోవచ్చు. సమస్యలు ఉంటే.. ఆస్టియోపొరోసిస్, కీళ్లనొప్పులు, వెన్ను లేదా మోకాలి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్యాయామాలను చేయకూడదు. గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ముందుగా తమ వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా కింద పడిపోయే వ్యక్తులు కూడా ఆలోచించాలి. వృద్ధులయితే తప్పకుండా ఇతరుల సాయం తీసుకోవాలి.డెస్క్ ఉద్యోగులకు మరింత ప్రయోజనండెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రాఅందరికీ ధన్యవాదాలు డెస్క్ జాబ్‌లు చేసేవారికి ట్రామ్ పోలిన్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ అద్భుతమైనది. ఈ వ్యాయామం వల్ల కడుపు, దిగువ శరీర కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను అధిగమించడంలో ఈ వ్యాయామం సహాయపడుతుంది. అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ఉద్యోగుల కోసం ట్రామ్ పోలిన్ వర్కౌట్ సెష¯న్లను నిర్వహించడం ప్రారంభించాయి. అయితే, పిల్లల పార్కుల్లో చూసే వాటికి పెద్దవారి ఫిట్నెస్ ట్రామ్ పోలిన్ భిన్నంగా ఉంటుంది. ఇంట్లోనే పెద్దవాళ్లు ఉపయోగించే ట్రామ్ పోన్లు సాధారణంగా చిన్నవిగా, దృఢంగా ఉంటాయి. ఇవి క్రీడా పరికరాలు దొరికే చోట, ఆన్లైన్ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అయితే, బరువును మోయగలిగే దృఢమైన ట్రామ్ పోన్లను ఎంచుకోవాలి. అదేవిధంగా ఫిట్నెస్ నిపుణుల సూచనలు ΄ాటించాలి. ఇందుకు ఆ¯న్‌లైన్ ట్రైనర్స్ సాయం కూడా తీసుకోవచ్చు. – ఆరుషి, ఫిట్నెస్ ట్రైనర్ -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
ధోని కంటే రోహిత్ చాలా బెస్ట్...
-
ఆ రోజులే బాగుండేవి..
-
భారత్‌లో మహిళల క్రీడా అభివృద్దికి యూఎస్ కృషి..
క్రీడల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని, లీడర్ షిప్ స్కిల్స్ ను పెంచేందుకు యూనైటడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఎ) ముందడుగు వేసింది. ఈ క్రమంలో యూఎస్ రాయబార కార్యలయం, కాన్సులేట్లు గేమ్ ఛేంజర్స్ అల్టిమేట్ ఫ్రిస్బీ అనే ప్రాజెక్ట్ ను లాంఛ్ చేశారు. అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్ ద్వారా లింగ సమానత్వం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని యూఎస్ ఎంబసీ భావిస్తోంది. తొలుత ఈ కార్యక్రమం భారత్‌లోని ముఖ్య నగరాలు ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, చెన్నైలలో ఆగస్టు 19 నుండి 24 వరకు జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 26 నుండి 31 వరకు ముంబైలో ఈ గేమ్ ఛేంజర్స్ పోగ్రాంను నిర్వహించనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 100 మంది మహిళా కోచ్‌లను తాయారు చేయడమే ఈ ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యం. ఈ కార్యకమాన్ని నగరాల్లోని పలు విద్యా సంస్థలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో నిర్వహించనున్నారు. కోచ్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు, జెండర్ ఈక్విటీ క్లాస్‌లతో ఈ పోగ్రాం ప్రారంభం కానుంది. ఆ తర్వాత అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్‌కు సంబంధించిన సెషన్స్‌లో సదరు మహిళలు పాల్గోనున్నారు. కాగా అల్టిమేట్ ఫ్రిస్బీ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడ. కాగా ఈ గేమ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి పాల్గోనవచ్చు -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోనున్న వినేష్ ఫోగట్
-
2025 ఐపీఎల్ లో ధోని ఆడుతాడా..?
-
శభాష్ వినేష్.. ఓడినా నువ్వే బంగారం
-
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
రామ్ చరణ్‌తో పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం!
పారిస్ ఒలింపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్‌ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది. View this post on Instagram A post shared by Rhyme Konidela (@alwaysrhyme) -
నటాషాను మరిచిపోలేకపోతున్నాడా..?
-
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
ఆన్లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ..
సాక్షి, సిటీబ్యూరో: భారత్‌లో ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’(బీజీఐఎస్) గ్రాండ్ ఫినాలేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా గ్రాండ్ ఫినాలే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.దేశంలోనే అతిపెద్దదైన ఈ రాయల్ ఎస్పోర్ట్స్ ఇండియా సిరీస్ టోర్నమెంట్లో రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందించడం విశేషం. దేశంలోని యువ ఆటగాళ్లతో కూడిన చివరి 16 అగ్రశ్రేణి జట్లు చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవడానికి ఆన్లైన్ రౌండ్లలో పోటీ పడనున్నారు. గేమింగ్ ఔత్సాహికులు ఈ సీరీస్‌ను ప్రత్యక్షంగానే కాకుండా క్రాఫ్టన్ ఇండియా ఈ–స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్‌చాట్! -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ సా(షా)మి
-
వైఎస్సార్ హెల్త్ క్లినిక్ అండ్ వెల్నెస్ భవనాలను ప్రారంభించిన రోజా
-
భారత్ క్రికెట్ లో సచిన్ దాస్ పేరు ట్రెండింగ్
-
ఆడుదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్..!
-
నాలుగేళ్ల క్రితం మ్యాచ్ కు ఇప్పుడు ఇంత క్రేజా..?
-
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్‌లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
మహ్మద్ షమీకి అర్జున అవార్డు
-
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్‌పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్‌స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్‌లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్‌ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్‌లను సీరియస్‌గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్‌పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్‌ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్‌ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్‌ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్‌లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్‌ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం డిజిటల్ గేమ్‌లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్‌లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్‌లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
-
విశాఖలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: రానున్న నాలుగైదు నెలల్లోనే విశాఖలో 25 ఎకరాల్లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకునేందుకు అనువుగా ఇంటిగ్రేటేడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు విశాఖలో తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్) జరగనున్న నేపథ్యంలో ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్‌లో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం చెంత ఈ పరుగును సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘మన ఏపీఎల్ మన ఆంధ్రా’ పేరిట ఏపీఎల్ రెండో సీజన్ బ్రాండింగ్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు 3కే రన్ నిర్వహించినట్లు చెప్పారు. ఏపీఎల్‌లో ప్రతిభ చూపిన క్రికెటర్లు ఐపీఎల్‌కు ఆడే అవకాశం ఉందన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ , ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, మేయర్, కలెక్టర్ పాల్గొన్నారు. చదవండి టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో చిన్నారులకు 2 గంటల వరకే అనుమతి.. -
5కే,10కే రన్ చేసేటప్పుడు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు
-
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్‌బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్‌ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్‌బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్‌లా ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్‌బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్‌ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్‌షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్‌కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్‌ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్‌ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆటల పోటీలతో ఉద్యమం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త మండలాల కోసం ఉద్యమిస్తున్న ఆయా పార్టీలు, సంఘాలు ధర్నాలు, ర్యాలీలతో లాభం లేదని గ్రహించి వినూత్న పద్ధతిలో ప్రయత్నిస్తున్నాయి. ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం, బోడు కేంద్రంగా నూతన మండలాల ఏర్పాటుకోసం వామపక్షాలు, ఇతర పార్టీలు ఏళ్ల ఉద్యమిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ పద్ధతుల్లోనే సంతకాల సేకరణ, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు చేపట్టాయి. అయితే ఇందులో రాజకీయ పార్టీల నాయకులు భాగస్వాములు అవుతున్నారు తప్పితే ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేదని నేతలు గ్రహించారు. దీంతో పార్టీలు.. ప్రజలను కూడా భాగం చేసేందుకు సరికొత్త ఎత్తుగడ కింద ఆటల పోటీలను ఆయుధంగా ఎంచుకున్నాయి. ఈ క్రమంలో పురుషులకు వాలీబాల్ పోటీలు, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించాయి. గతంలో కూడా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగినా.. అవి ఏదైనా జాతీయ పండుగలను పురస్కరించుకుని లేదా ఆయా పార్టీలకు చెందిన నేతల స్మారకార్థం జరిగేవి. కానీ తొలిసారిగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆటల పోటీలు నిర్వహించడం విశేషం. 2016 నుంచి డిమాండ్లు.. 2016 అక్టోబర్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన సందర్భంగా ఇల్లెందు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌తో పాటు కొమరారం మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను రాజకీయ పక్షాలు భుజానికి ఎత్తుకున్నాయి. సుమారు మూడు నెలల పాటు వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహించాయి. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అయితే, ఈ డిమాండ్లపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది తప్పితే ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత కాలంలో ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలాన్ని విభజించి బోడు కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు అంశం కూడా తెరపైకి వచ్చింది. మలి దశలో ఉద్యమం తీరుతెన్నులు ఈ ఏడాది జనవరిలో ఇల్లెందు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం, సంతకాల సేకరణ, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు నెలపాటు ప్రజాపంథా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. మార్చి 4 నుంచి 12 వరకు ఇల్లెందు మండలం మర్రిగూడెం నుంచి ఇల్లెందు వరకు 32 కిలోమీటర్లు సీపీఐ (ఎంఎల్) – న్యూడెమొక్రసీ ఆధ్వర్యాన పాదయాత్ర చేపట్టారు. మార్చి 28, 29వ తేదీల్లో పురుషులకు మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈనెల 1, 2వ తేదీల్లో ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల స్థాయిలో మహిళలకు కబడ్టీ పోటీలు ఏర్పాటు చేశారు. -
భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు
మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్‌కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే! మ్యాథ్స్ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఫలితం ఇప్పుడా టీచర్ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్‌కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబర్చి, టీచర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు. చార్పత్తర్తో.. విద్యార్థులు ఆడుకునే చార్ పత్తర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. డయల్ యువర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. పాటలతో ఎక్కాలు బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్ డిజిటిల్స్ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. నాన్న స్పూర్తితోనే! మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. టూర్లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్‌ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్ పర్సంటెజ్ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజ్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాను. – పెందోట రూపారాణి జాతీయ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్ బోధించే విధానాన్ని జాయ్ ఫూల్ లెర్నింగ్ మ్యాథ్స్ బై గేమ్స్ యూజింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పేరుతో ఎగ్జిబిట్లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్ కుమార్ -
మేడిన్ ఇండియా బొమ్మల హవా
చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్ బేతాళ్ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్‌తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్ లీడర్లయిన ఫన్‌స్కూల్, హాస్బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. సంప్రదాయ భారతీయ గేమ్స్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్‌స్కూల్ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బొమ్మలు, గేమ్స్ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్‌ను కూడా ప్రవేశపెడుతోంది. 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే.. దేశీ టాయ్స్ మార్కెట్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్ పరిమాణం 2–3 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్‌లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శరద్ కపూర్ తెలిపారు. -
ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్ యాప్స్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్ 28 నుంచి 2023 సెప్టెంబర్ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్ఎస్ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్ సంస్థ విన్జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్ .. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్ గేమ్స్ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది. -
భారత్‌లో యాప్స్, గేమ్స్‌కి పెరిగిపోతున్న క్రేజ్!
న్యూఢిల్లీ: దేశీ యాప్స్, గేమ్స్‌కి డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో యాక్టివ్ నెలవారీ యూజర్ల సంఖ్య 200 శాతం పెరిగింది. గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ ఆదిత్య స్వామి ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాలు వెల్లడించారు. గూగుల్ ప్లేలో వినియోగదారులు చేసే వ్యయాలు 2019తో పోలిస్తే 2021లో 80 శాతం పెరిగినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా విద్య, చెల్లింపులు, వైద్యం, వినోదం, గేమింగ్ వంటి విభాగాల్లోని యాప్‌ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే గేమింగ్‌కు కూడా ఆదరణ పెరిగిందన్నారు. లూడో కింగ్ వంటి గేమ్స్ తొలిసారిగా 50 కోట్ల పైచిలుకు డౌన్లోడ్స్ నమోదు చేసుకున్నాయని స్వామి వివరించారు. ‘గూగుల్ ప్లేలో భారతీయ యాప్‌లు, గేమ్‌ల విషయంలో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2019తో పోలిస్తే 2021లో 200 శాతం, చేసే వ్యయాలు 80 శాతం పెరిగాయి. అలాగే దేశీ యాప్‌లు, గేమ్‌లపై విదేశాల్లోని యూజర్లు వెచ్చించే సమయం 150 శాతం పెరిగింది‘ అని స్వామి వివరించారు. భారత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించిన కంపెనీల్లో ఎక్కువ భాగం వాటా ఈ తరహా యాప్ సంస్థలదేనని ఆయన పేర్కొన్నారు. గూగుల్ ప్లే భారత్‌లో వివిధ కేటగిరీల్లో అద్భుతమైన యాప్‌ల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడి డెవలపర్లు, స్టార్టప్‌ల వ్యవస్థ ఎంతగానో తోడ్పడిందని స్వామి వివరించారు. -
ఆన్లైన్ గేమ్స్‌పై కేంద్రం జీఎస్టీ బాదుడు! ఎంతంటే!
ఎస్. ఊహించినట్లుగానే జరిగింది. కొద్ది సేపటి క్రితమే కేంద్ర మంత్రుల బృందం ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్‌లపై 28శాతం జీఎస్టీ విధించేలా సిఫార్స్ చేసినట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీనిపై త్వరలో మంత్రుల బృందం నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రుల సిఫార్స్‌లపై స్కిల్‌గేమింగ్ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ రేటునే కొనసాగించాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత 28 శాతం పన్ను పరిధిలోకి మారిస్తే 2.2 బిలియన్ డాలర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అధిక పన్ను పరిధిలోకి చేర్చడం వల్ల పరిశ్రమ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ, భారత పన్ను చట్టం పరిధిలోకి రాని వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని గేమ్స్ 24ఇంటూ7 సీఈవో త్రివిక్రమ్ తంపి పేర్కొన్నారు. ‘‘ఇది ముప్పేట ప్రభావాన్ని చూపిస్తుంది. పరిశ్రమ నష్టపోతుంది. ప్రభుత్వం పన్ను ఆదాయం రూపంలో నష్టపోతుంది. విశ్వసనీయత లేని ఆపరేటర్ల చేతుల్లో పడి ఆటగాళ్లు నష్టపోతారు’’అని తంపి అభిప్రాయపడ్డారు. 400 సంస్థలతో 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు 18 శాతం జీఎస్టీనే కొనసాగించాలని ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల సమాఖ్య ఇప్పటికే అధికారులకు వినతిపత్రాన్ని కూడా సమర్పించింది. ఈస్పోర్ట్స్, ఫాంటసీ గేమ్స్, రమ్మీ, పోకర్, చెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ స్కిల్ గేమ్‌ల కిందకు వస్తాయి. ఈ తరహా ఆటలు ఉచితంగా లేదంటే ప్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో నడుస్తుంటాయి. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ స్కిల్ గేమింగ్ సేవలను 18 శాతం నుంచి 28 శాతం జీఎస్టీ శ్లాబులోకి మార్చాలన్న ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి👉ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్‌తో కలిసి గూగుల్ .. యాప్‌స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్‌స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
రమ్మీ విస్ఫోటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందటే నిషేధం విధించిన ఆన్లైన్ రమ్మీ మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్రంలో నిషేధం ఉన్నా ముంబై ఆన్లైన్ రమ్మీ మాఫియా కొత్త యాప్‌లను తాజాగా రాష్ట్రంలోకి వదిలింది. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో భారీగా ప్రకటనలు ఇస్తోంది. దీంతో లక్షలాది మంది యువత వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఆడుతూ రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఫేక్ లొకేషన్‌తో జూదరులు ఆట ఆడగా.. ఇప్పుడు నేరుగానే పేకాట ఆడేలా యాప్‌లను మాఫియా తీసుకొచ్చింది. గేమింగ్ యాక్ట్‌ను సవరిస్తూ, ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేస్తూ చట్టం తీసుకొచ్చినా బరితెగించి యాప్‌లు వదిలిన రమ్మీ మాఫియాపై ప్రభుత్వ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా.. ముంబైకి చెందిన ప్రముఖ రమ్మీ సంస్థ డ్యాష్ రమ్మీ, రమ్ రమ్మీ, రోజ్ రమ్మీ యాప్‌లను రూపొం దించింది. డబ్బు లేకపోతే రమ్మీ ఆడి గెలుచు కోవచ్చని, సులభంగా సంపాదించు కోవచ్చని యూట్యూబ్, ఫేస్బుక్ తదితర మా«ధ్యమాల్లో ప్రకటనలిచ్చింది. గతంలో ఆన్లైన్ రమ్మీ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకున్నా రాష్ట్రం లొకేషన్ ఉండటం వల్ల ఆడేందుకు అనుమతి వచ్చేది కాదు. దీంతో ఫేక్ లొకేషన్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకొని నకిలీ లొకేషన్‌తో రమ్మీ ఆడేవారు. అయితే ఈ 3 యాప్స్‌లో ఇలాంటి ఆప్షన్ లేదు. ఈ–మెయిల్, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకొని నేరుగా గేమ్‌లోకి వెళ్లేలా అవకాశం కల్పించారు. డబ్బులు జమ చేసి ఆడాలి ♦ ఓసారి రిజిస్టర్ అయ్యాక పేకాట ఆడేందుకు డబ్బులు జమ చేసుకోవాలి. ఇందుకోసం యూపీఐ (ఫోన్ ఫే, గూగుల్ పే) ద్వారా రూ.50 నుంచి 10వేల వరకు యాడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు. ♦ డబ్బు జమయ్యాక పాయింట్ రమ్మీ, పూల్ రమ్మీ, డీల్స్ అని మూడు రకాల పేకాట ఆప్షన్ వస్తుంది. వాటిలో ఎంపిక చేసుకొని డబ్బులు పెట్టి ఆడాలి. ♦ డబ్బులు వస్తే విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. ఇందుకు యాప్‌లో ప్రొఫైల్, కేవైసీ, అడ్రస్ ఫ్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ, బ్యాంకు వివరాల్లాంటివి అప్లోడ్ చేశాక ప్రొఫైల్ అప్లోడ్ సక్సెస్ ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాతే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశముంది. బ్యాంకు లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవాలని యాప్ సూచిస్తుంది. ♦ డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్.. పలు రాష్ట్రాల్లో బ్యాన్ ఉం దని యాప్‌లో పేర్కొంటున్నారు. అయినా ఆడేలా ఆప్షన్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. బరితెగించినట్టా.. లేక డీల్ సెటిలైందా? ఆన్లైన్ రమ్మీ దందా చేస్తున్న మాఫియా గతంలో అనుమతి ఉన్న రాష్ట్రాల లొకేషన్స్తోనే గేమ్‌లోకి అనుమతించేవి. ఇప్పుడు కొత్త యాప్స్‌ను రాష్ట్రం లోకి వదలడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 6 నెలల క్రితం ముంబైకి చెందిన ప్రముఖ ఆన్లైన్ రమ్మీ సంస్థ, ఆన్లైన్ రమ్మీకి చెందిన కీలక సూత్రధారి.. రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీకి సడలింపులు లేదా దొంగచాటున అనుమతి ఇచ్చేలా ఓ నేతతో రూ.70 కోట్లకు డీల్ చేసుకు న్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించినా ఇప్పుడు ఈ ఆన్లైన్ రమ్మీ పగడ విప్పడంతో వెనుకున్నది ఎవరని చర్చ జరుగుతోంది. మొదట్లో వచ్చాయి.. తర్వాత పోయాయి జనవరి 14న ఆన్లైన్ రమ్మీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా. అడ్రస్‌తో సహా అన్ని సబ్మిట్ చేసి గేమ్ ఆడాను. ఇప్పుడూ ఆడుతున్నా. రెండ్రోజుల కిందట రూ.3 వేలు వచ్చాయి. డబ్బులు వస్తున్నాయని ఆడుతుంటే రూ.3 వేలతో పాటు మరో రూ.2 వేలు కూడా పోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఓ 50 మంది వరకు ఆడుతున్నాం. – వెంకటేశ్, హైదరాబాద్ అప్పుడు ఫేక్ లొకేషన్‌తో ఆడా.. గతంలో ఆన్లైన్ రమ్మీ రాష్ట్రంలో ఆడేందుకు ఫేక్ లొకేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు డ్యాష్ రమ్మీలో ఆ ఇబ్బంది లేదు. కానీ ఆధార్ కార్డు, బ్యాంకు ఇతర వివరాలు అడగడం భయంగా ఉంది. డబ్బును విత్‌డ్రా సమయంలో రాష్ట్రంలో బ్యాన్ ఉందంటూనే ఇక్కడి లొకేషన్లోనే యాప్ ఓపెన్ అవడం ఆశ్చర్యం. – శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ఫీచర్.. మొబైల్ గేమ్స్.. ఆడటం ఎలా?
న్యూఢిల్లీ: ఓవర్ ద టాప్ మీడియా సేవల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ మొబైల్ గేమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ముందుగా అయిదు గేమ్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. యూజర్లు నెట్‌ఫ్లిక్స్ చందాదారులైతే చాలు. ఎటువంటి ప్రకటనలు, అదనపు రుసుం, ఖర్చులు లేవని కంపెనీ తెలిపింది. చాలా భాషల్లో ఈ గేమ్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు వెల్లడించింది. పిల్లల ప్రొఫైల్స్‌కు ఇవి అందుబాటులో ఉండవని వివరించింది. గేమ్స్ ఇవే ది స్ట్రేంజర్ థింగ్స్:1984 (బోనస్ ఎక్స్పీ) స్ట్రేంజర్థింగ్స్ 3: ది గేమ్ (బోనస్ ఎక్స్పీ) షూటింగ్ హూప్స్ (ఫ్రోస్టీ పాప్) కార్డ్ బ్లాస్ట్ ( అమ్యూజో అండ్ రోగ్ గేమ్) టీటర్ అప్ (ఫ్రోస్టీ పాప్) గేమ్స్ ఆడాలంటే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పని చేసే డివైజ్‌లో అకౌంట్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ నెట్‌ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ని ఎంచుకోవాలి. వెంటనే గేమ్స్ హోం పేజీలోకి వెళ్తుంది. అక్కడ నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్‌లో నెట్‌ఫ్లిక్స్ గేమ్ ఆప్షన్ కనిపించని పక్షంలో.. కొంత కాలం ఎదురు చూడాల్సిందే. నెట్‌ఫ్లిక్స్ క్రమంగా ఈ సేవలను విస్తరింపచేస్తోంది. ఈ గేమ్స్ పిల్లలకు కాదు గేమ్స్ అందుబాటులో ఉన్న చందాదారులు ఒకేసారి మల్టీపుల్ డివైజ్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే ఈ గేమ్స్ కిడ్స్ విభాగంలో అందుబాటులో ఉండవు. వీటిని నెట్‌ఫ్లిక్స్ అడల్ట్ కేటగిరీలోనే ఉంచింది. మరింతంగా భవిష్యత్తులో గేమ్స్ విభాగాన్ని మరింతగా విస్తరించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్, వెబ్‌సిరీస్, డాక్యుడ్రామాల తరహాలోనే గేమ్స్‌ని కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. చదవండి:నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
అట్ల తద్ది ప్రత్యేకం: వయసులో ఉన్న ఆడపిల్లలూ ... ఆడుకుందామా...!
ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ పవిత్రబంధం సినిమాలో కథానాయికగా వేసిన వాణిశ్రీ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాలలో అట్లతద్దికి అంత ప్రాధాన్యత ఉంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు ఆట పట్టిస్తారు. ఎవ్వరూ ఎవరితోనూ గొడవపడరు. ఆట పట్టించటాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తారు. తెల్లవారుజామునే పిల్లలంతా పొరపచ్చాలు, హెచ్చుతగ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐకమత్యానికి ఈ పండుగ ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా ఈ పండుగలో అనేక కోణాలున్నాయి... ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! ఇక్కడితో ఆగదు... అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. చదవండి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి... నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ పీట కింద పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్... ఎంతో అందమైన పాట ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో కలిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా తయారవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఆడపిల్లల శరీరంలో కలిగే మార్పులకి ఇది చాలా అవసరం. ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్లతద్దిని అందరూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉదయాన్నే కార్యక్రమం పూర్తయ్యాక, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, చందమామను చూశాకే భోజనం చేస్తారు. నోము అంటే మొక్కుబడిగా కాకుండా, త్రికరణశుద్ధిగా ఆచరించాలి. చాదస్తాలకు దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండేలా ఈ పండుగను జరుపుకోవాలని చెబుతుంది మన సంప్రదాయం. ఇదే అట్లతద్దిలోని అంతరార్థం. - వైజయంతి పురాణపండ చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..! -
ఎయిర్టెల్ మరో రికార్డు.. అదేంటంటే!
ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ మరో రికార్డు సాధించింది. భారత దేశంలో 5జీ టెక్నాలజీ సహాయంతో మొట్ట మొదటి క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్(డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్ లో భాగంగా మనేసర్(గుర్గావ్)లో ఈ ప్రదర్శన నిర్వహించారు. గేమర్లు డెమో కోసం వన్ ప్లస్ 9ఆర్ మొబైల్ ఉపయోగించారు. ముఖ్యంగా, ఎయిర్టెల్ సీటీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. "వచ్చే ఏడాది మొదట్లో 5జీ రావచ్చు" అని ఆయన అన్నారు. ఎయిర్టెల్ నిర్వహించిన 5జీ క్లౌడ్ గేమింగ్ సమావేశంలో భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ గేమర్లు మోర్టల్(నమన్ మాథుర్), మాంబా(సల్మాన్ అహ్మద్)లు పాల్గొన్నారు. "ఈ స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ పీసీ, కన్సోల్ క్వాలిటీ గేమింగ్ ఆడిన అనుభవం కలిగింది. 5జీ నిజంగా భారతదేశంలో ఆన్ లైన్ గేమింగ్ ను అన్ లాక్ చేస్తుందని" అని గేమర్స్ అన్నారు. వీరు గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ కు కనెక్ట్ అయినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్ ప్రియులు హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ క్లౌడ్ గేమింగ్ ద్వారా రియల్ టైమ్ లో గేమ్స్ స్ట్రీమ్ చేయవచ్చు.(చదవండి: అదే జరిగితే ఇంటర్నెట్ బంద్!) "భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. రోజు రోజుకి 5జీ విక్రయాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ గేమింగ్ $2.4 బిలియన్ మార్కెట్ గా అభివృద్ధి చెందనుంది. దేశంలో ఆన్ లైన్ గేమర్లు సంఖ్య 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది" అని ఎయిర్టెల్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియాతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో లైవ్‌గా 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. -
2016 ఒలింపిక్స్‌లో చానుకి ఏమైంది? తల్లి భావోద్వేగం
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారం పతకం దక్కకపోయినా..బంగారం లాంటి తన బిడ్డ మీరాబాయ్ విజయాన్ని చూసి ఆమెతల్లి భావేద్వేగానికి లోనయ్యారు. తమ కష్టం ఫలిచిందంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ సందర్బంగా ఇంతటి అద్భుతాన్ని సాధించేందుకు మీరాబాయి పడిన శ్రమను, కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తల్లి సైఖోమ్ ఒంగ్బీ టోంబి లీమా ఆమెకు తను బహుమతిగా ఇచ్చిన చెవిరంగులపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు మెడల్ సాధించిన ఘనత మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను సొంతం. టీవీలో చాను చెవిపోగులు చూశాను, (రియో) ఒలింపిక్స్‌కు ముందు తానే వాటిని 2016లో ఆమెకు ఇచ్చానంటూ చాను తల్లి చెప్పారు. అవి అదృష్టం..విజయాన్ని తీసుకొచ్చాయంటూ ఆమె మురిసిపోయారు. తను చెవి రింగులను చూసినప్పుడల్లా చానులో పట్టుదల మరింత పెరిగిందని తల్లి ఉద్వేగంతో చెప్పారు. చాను పతకాన్ని సాధించడంతో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పుకొచ్చారు. ఈ ఒలింపిక్స్‌లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్పిందనీ, కనీసం ఏదో ఒక పతకంతో వస్తానని చాను చెప్పిందని వెల్లడించారు. ఒలింపిక్ రింగ్స్ లా కనిపించే వీటి వివరాలను పరిశాలిస్తే.. 2016 రియో ఒలిపింక్స్..సందర్బంగా చానూకు చెవిదిద్దుల తయారీకోసం తల్లి తన దగ్గర ఉన్న చిన్నా చితకా బంగారాన్ని మొత్తం అమ్మేసారట. 2016 రియో ఒలింపిక్స్‌లో చాను ఆశలు ఆవిరి 2016 రియో ఒలింపిక్స్‌లో 192 కిలోల విభాగంలో 190 కిలోల బరువును ఎత్తి తన గురువు కుంజారాణి దేవి రికార్డును బద్దలు కొట్టారు. కానీ క్లీన్ అండ్ జెర్క్‌లో బరువు ఎత్తుతున్న సమయంలో పట్టు కోల్పోయింది. 21ఏళ్ల మీరాబాయి చాను సరిగ్గా 22వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు 2016లొ క్లీన్ అండ్ జెర్క్‌లో ఆమె చేసిన మూడు ప్రయత్నాలు విఫలమైనాయి. దీంతో పతకం కలలు కల్లలై పోయాయి. ఫలితంగా తీవ్ర డిపప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇందుకు ఆమె మానసిక వైద్యులను కూడా సంప్రదించారు. కట్ చేస్తే.. అయిదేళ్ల తరువాత అటు తన కలను, ఇండియా కలను నెరవేర్చారు. చాను ఇంట్లో సంబరాలు కోచింగ్ కారణంగా చాలా తక్కువగా ఇంటికి వస్తుందని అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నామని చాను బంధువు అరోషిని చెప్పారు. గేమ్‌కు వీడియో కాల్ చేసి, అందరికీ నమస్కరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందని చెప్పారు. చాను సాధించిన అపూర్వ విజయంతో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పోక్ కాచింగ్ గ్రామంలోని చాను ఇల్లు సంబరాలతో నిండిపోయింది. కరోనా కారణంగా కొంతవరకు కర్ఫ్యూ ఉన్నప్పటికీ శుక్రవారం నుంచే ఆమె ఇంటి వద్ద సందడి మొదలైంది. చానుకు ఆరుగురు తోబుట్టువులు. ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. కోచ్ కుంజారాణీ దేవి స్పందన ఇంఫాల్‌లో జన్మించిన చాను మరో మణిపురి వెయిట్‌లిఫ్టర్ కుంజారాని దేవి స్ఫూర్తితోనే వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకున్నారు. కుంజారాణీ దేవి చాలా గొప్ప క్రీడాకారిణి అని చాను ఒక సందర్భంలో చెప్పారు. చిన్నప్పటినుంచి ఆమె గురించి పుస్తకాల్లో, పేపర్లో చదివాను.. అందుకే నేను భారీ బరువులు ఎత్తి ప్రపంచానికి చూపాలనుకున్నాను అని చాను గతంలో తెలిపారు. తాజా చాను విజయంపై కుంజారాణి స్పందించారు. 2011లో జూనియర్ జాతీయ శిబిరానికి వచ్చినప్పుడు ఆమెను మొదటిసారి చూశాను. ఆమెలో చాలా ప్రతిభ, సంకల్ప బలం చాలా ఉన్నాయి. మిగతా అథ్లెట్లతో పోలిస్తే మీరా చాలా టాలెంటెడ్. కోచ్‌లు చెప్పే ప్రతిదాన్ని అనుసరిస్తూ తెలివిగా ఆడేదని, అదే ఆమెను ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా చేసిందని 2015 వరకు చానుకు కోచ్‌గా ఉన్న కుంజరాణి దేవి అన్నారు. ఒలింపియన్ కావాలనుకుంటే లేదా పతకం సాధించాలన్నా. లేదా అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అవార్డులు గెలుచుకోవాలనుకుంటే, కష్టపడి పనిచేయాలని చెప్పానని శనివారం తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఆమెలోని చిన్న లోపాలను తీర్చడానికి మాత్రమే తాను సహాయపడ్డానని తెలిపారు.2016 ఒత్తిడినుంచి బైటపడి 2017లో తిరిగి బౌన్స్ బ్యాక్ అయిందన్నారు. అయితే 2018నుండి మిరాబాయితో మాట్లాడలేక పోయినా.. ఆమె విజయాలను గమనిస్తున్నాననీ, ఈ రోజు తన స్టూడెంట్ మొత్తం భారతదేశం గర్వపడేలా చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
టోక్యో ఒలింపిక్స్ 2021
-
ఒలింపిక్స్‌లో కరోనా వివాదం
-
ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం)/శ్రీకాకుళం రూరల్: కోవిడ్ కేర్ సెంటర్లో కోవిడ్ బాధితులకు చికిత్సలో అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఆటలను అస్త్రంగా వాడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురంలోని కోవిడ్ కేర్ సెంటర్లో సుమారు 50 మంది బాధితులు ఉన్నారు. మొన్నటివరకు వీరిలో చాలామంది వ్యాధి వచ్చిందన్న మనోవేదనతో కుమిలిపోయేవారు. ఆహారం కూడా సరిగా తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన కోవిడ్ కేర్ ప్రత్యేక అధికారి, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు బాధితుల్లో ఎలాగైనా మనోధైర్యాన్ని నింపాలనుకున్నారు. వారి మనస్సును ఆటల మీదకు మళ్లించగలిగితే వ్యాధి ఉందన్న భావన మనస్సులో నుంచి పోతుందని, దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. వెంటనే తన ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా చర్యలు తీసుకున్నారు. బాధితులు ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, దాయాలు, తదితర ఆట వస్తువులను సమకూర్చారు. మూడు పూటల భోజనం అనంతరం బాధితులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆడుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి బాధితులు ఆటల్లో నిమగ్నమైపోయారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఆటలు సత్ఫలితాలనిస్తున్నాయని, గతంలో కంటే బాధితులు ఉత్సాహంగా ఉంటున్నారని, వారి ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతోందని ప్రత్యేకాధికారిశ్రీనివాసరావు తెలిపారు. బుర్రకథ.. యోగా.. కోవిడ్ రోగులకు స్వాంతన కలిగించేందుకు శ్రీకాకుళం జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్లో గురువారం బుర్రకథ ప్రదర్శన నిర్వహించారు. రోగుల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలిగించేందుకు వినోదభరిత కార్యక్రమాలతోపాటు ఉదయం పూట యోగా నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి రవికుమార్ తెలిపారు. చదవండి: కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు భారతి సిమెంట్ వితరణ -
సెల్ఫోన్లో గేమ్స్: తల్లిదండ్రులు మందలించారని..
నెల్లూరు రూరల్: సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుందని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని నరుకూరు సెంటర్లో ఆదివారం జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నరుకూరు సెంటర్లో నివాసం ఉంటున్న యదపర్తి మల్లికార్జున్, శైలజ దంపతుల కుమార్తె సుష్మశ్రీ (16) 8వ తరగతి వరకు చదువుకుని ఏడాది నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. కొంత కాలంగా సుష్మ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లిదండ్రులు మందలిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లి శైలజ గమనించి సెల్‌ఫోన్ తీసుకుని మందలించింది. అదే సెంటర్లో వీరు టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తల్లి టిఫిన్ సెంటర్‌కు వెళ్లిన ఆనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని వంట గదికి ఉన్న ఇనుప రాడ్లకు తన చున్నీతో ఉరేసుకుంది. పక్కింటి వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సుష్మను కిందకు దింపి నగరంలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. విషాదం: మృత్యువులోనూ సహచర్యం.. -
గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌పంక్ 2077 గేమ్ డిసెంబర్ 10 విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఈ గేమ్ విడుదల అనేది మీరు నివసించే ప్రాంతం, మీరు ఆడే ప్లాట్‌ఫామ్ బట్టి మార్పు ఉంటుంది. ఇంతక ముందు తెలిపిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఊహించిన దాని కంటే ముందే ఆడవచ్చు. ఈ గేమ్ అన్ని దేశాల కంటే ముందు లాస్ ఏంజెల్స్ లో డిసెంబర్ 9 సాయంత్రం గంటలకు విడుదల అవ్వగా. చివరగా న్యూజిలాండ్ రాజదాని వెల్లింగ్టన్ లో డిసెంబర్ 10 మధ్యాహ్నం 1కి విడుదల అవుతుంది. వచ్చే వారం విడుదల అయ్యే సైబర్‌పంక్ 2077 మీ పిసిలో డిసెంబర్ 7 నుండి ఆటను ప్రీలోడ్ చేసుకోవచ్చు. ప్రీలోడ్‌లు జీఓజిలో 12పీఎం వద్ద మరియు ఎపిక్ గేమ్స్ స్టోర్‌లో 5పీఎం వద్ద ప్రారంభమవుతాయి. ఎక్స్ బాక్స్ వన్, ఎక్స్ బాక్స్ సిరీస్ కన్సోల్‌లలో ఇప్పటికే ఆటను ప్రీలోడ్ చేయవచ్చు. ప్లేస్టేషన్ 4 మరియు ప్లేస్టేషన్ 5లలో ప్రీలోడ్‌లు “విడుదల తేదీకి రెండు రోజుల ముందు” ప్రారంభమవుతాయి. (చదవండి: గూగుల్ మాప్స్‌లో సరికొత్త ఫీచర్) విడుడలకు సిద్ధంగా ఉన్న సైబర్‌పంక్ 2077 గేమ్ ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఈ గేమ్ మన దేశంలో కూడా మరింత ఆసక్తి రేపుతోంది. గేమింగ్ లవర్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన పిసి గేమ్‌గా నిలిచింది అని అంచనా. సైబర్‌పంక్ 2077 ఇప్పటికే జీవితకాల అమ్మకాలలో విట్చర్ 3 గేమ్ ను దాటిందని డెవలపర్ ఇంతకుముందే ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు, విట్చర్ 3 చాలా ప్రజాదరణ పొందిన గేమ్. భారతదేశంలో ఇంతకుముందు పిసి గేమింగ్ అనేది అత్యంత ఖరీదైన భావించేవారు. "సైబర్‌పంక్ 2077 భారతదేశంలో అని కన్సోల్ వెర్షన్ల కంటే పిసి గేమ్ ని ఆరు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న బహుళ రిటైలర్లు" తెలిపారని సంస్థ పేర్కొంది. కన్సోల్ వెర్షన్లతో పోల్చితే రిటైల్ ధర తక్కువగా ఉండటంతో పాటు డెస్క్‌టాప్ పిసిలకు డిమాండ్ పెరగడం ఈ పిసి గేమ్ సేల్ స్పైక్‌కు కారణమని నిపుణుడు అల్వానీ పేర్కొన్నారు. -
‘రిమూవ్ చైనా యాప్స్’కు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి చైనా గేమ్స్, ఇతర సాఫ్ట్‌వేర్‌ను తొలగించేందుకు ఉపయోగపడే దేశీ మొబైల్ యాప్ ’రిమూవ్ చైనా యాప్స్’కు గూగుల్ షాకిచ్చింది. తమ విధానాలకు విరుద్ధంగా ఉందంటూ ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు తమ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన చైనా యాప్స్‌ను ప్రధానంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడేది. ఆయా యాప్స్‌ను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సూచించేది. భారత్‌తో సరిహద్దుల్లో చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనితో పాటు చైనాకు చెందిన టిక్–టాక్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చిన భారతీయ యాప్ ’మిత్రో’ను కూడా గూగుల్ ఇటీవలే ఇదే కారణాలతో తొలగించింది. ఈ రెండు యాప్‌లను లక్షల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రిమూవ్ చైనా యాప్స్ యాప్‌ను వన్ టచ్ యాప్ల్యాబ్స్ రూపొందించింది. -
రకుల్ చిన్నప్పటి ఆటలు చూశారా?
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ రద్దవ్వడంతో సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనూహ్యంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్ మీడియాలో వారు రోజు ఇంట్లో చేస్తున్న పనులు అదేవిధంగా ఈ కరోనా సమయంలో కచ్చితంగా పాటించాల్సినవి అభిమానులకు సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఈ లాక్డౌన్ సమయంలో చేసిన యోగా వీడియోలు, ఇంట్లో సరదాగా చేసిన వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన తమ్ముడు అమన్‌తో కలిసి చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేసింది. తన చిన్నప్పుడు ఆడుకున్న అందమైన ఆటలన్నింటిని సోదరుడితో కలిసి ఇంట్లోనే ఆడింది రకుల్.‘ఇలాంటి సమయం మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్తుంది’అంటూ కామెంట్ కూడా జతచేసింది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram #quarantinediaries with @amanpreetoffl ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on May 2, 2020 at 12:28am PDT చదవండి: ‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు ‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’ -
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!
న్యూయార్క్: లీగ్‌లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు. 12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. -
గురి కుదిరింది
‘నేషనల్స్‌లో గోల్డ్ మెడల్ నా లక్ష్యం’ అన్నాడు ఈశ్వరాదిత్య. ‘ఒలింపిక్స్‌లో ఇండియాని రిప్రెజెంట్ చేయడమే నా కల’ అన్నాడు బిందుసాయి. ఈ హైదరాబాద్ అన్నదమ్ముల్లో... అన్న పిస్టల్‌తో టార్గెట్‌కి గురి పెడితే.. తమ్ముడు రైఫిల్ ఎక్కుపెడతాడు. ఈ పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటే... పేరెంట్స్ వాళ్లకోసం నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ‘అంకిత భావం ఉంటే స్పోర్ట్స్ పర్సన్స్ తయారు కావడం కష్టమేమీ కాదు’ అంటున్నారు తల్లి శిల్ప. ‘‘బండ్లగూడలోని డాన్‌బాస్కో స్కూల్లో పెద్దబాబు నైన్త్, చిన్నవాడు సెవెన్త్ చదువు తున్నారు. పిల్లల్ని ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచాలనేది నా కోరిక. వాళ్లకు ఇష్టమైన ఆటల్లోనే ట్రైనింగ్ ఇప్పించాం. మొదట్లో ఇద్దరికీ కరాటే నేర్పించాం. బ్లాక్ బెల్ట్ లెవెల్‌కి చేరిన తర్వాత స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, షటిల్లో ట్రైనింగ్ ఇప్పించాం. చిన్నప్పుడు ఇద్దరూ ఎన్ని గన్లు కొనిపించుకున్నారో లెక్క చెప్పలేను కూడా. అయినా సరే... దానిని పిల్లల ఇంటరెస్ట్ గేమ్ అని అప్పుడు డిసైడ్ చేయలేం. కనీసం పదేళ్లు నిండిన తర్వాత వాళ్లు చూపించే ఆసక్తే అసలైనది. ఆ వయసులో షూటింగ్ మీద ఆసక్తి కనబరిచారు. గగన్‌నారంగ్ అకాడమీలో చేర్చాం. కానీ కొనసాగించడం కుదరలేదు. ఇంటికి వచ్చి నేర్పించడానికి ఒక కోచ్ ఉప్పల్ నుంచి వచ్చేవారు. రెగ్యులర్‌గా మేముండే బండ్లగూడ వరకు రావడం అతడికి కష్టం కావడంతో కంటిన్యూ కాలేకపోయారాయన. దాంతో ఆయన నేర్పించిన మెళకువలతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేయిస్తూ కొత్త కోచ్‌ల కోసం ప్రయత్నించాను. ఈ క్రమంలో షూటింగ్ మీదున్న పుస్తకాలు చదివాను, వీడియోలు చూశాను. నాకు సబ్జెక్టు మీద పట్టు వచ్చేసింది. మా పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గమనించి, వాళ్లకు వీడియోలో ఆ పార్ట్ వరకు బాగా అబ్జర్వ్ చేయమని చెప్పేదాన్ని. గచ్చిబౌలిలో ఎక్స్పర్ట్ కోచ్ దగ్గర చేర్చే వరకు పిల్లలకు నేను బ్రిడ్జి కోచ్నయ్యాను. పెద్దవాడు ఈశ్వరాదిత్య పిస్టల్ షూటింగ్‌ను కంటిన్యూ చేశాడు. చిన్నవాడు బిందు సాయి మాత్రం రైఫిల్ షూటింగ్‌కి మారతానన్నాడు. సాయికి రైఫిల్ షూటింగ్ కోసం ధరించే డ్రస్ మీదనే మోజెక్కువ’’ అన్నారు శిల్ప నవ్వుతూ. ‘‘పిల్లలిద్దరూ స్టేల్ లెవెల్ దాటి జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ గత ఏడాది త్రివేండ్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో ఈశ్వరాదిత్యకి 522 స్కోర్ వచ్చింది. రానున్న డిసెంబర్లో జరిగే పోటీలకు ప్రిపేరవుతున్నాడు. భోపాల్‌లో ఈ ఏడాది జరిగిన ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ స్థాయి పోటీల్లో పెద్ద బాబు 359 స్కోర్, బిన్న బాబు 369 స్కోర్ చేశారు. స్పోర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్న పిల్లలు ప్రత్యేకమైన డైట్ చార్ట్ ఫాలో కావాలి. అలాగే కాంపిటీషన్లకు వెళ్లడానికి వారం ముందు నుంచి బయటి ఫుడ్‌ను ముట్టుకోకూడదు’’ అని చెప్పారు శిల్ప. కాంపిటీషన్ల కోసం ఒక్కోసారి వారం రోజుల పాటు స్కూల్ మిస్సవుతారు. అప్పుడు వేరే స్టూడెంట్స్ నోట్స్‌ని జిరాక్స్ చేయించేవారు శిల్ప. ఆమె చెప్పినట్లు క్రీడాకారులను తీర్చిదిద్దడం శ్రమతో కూడిన పనే కానీ అసాధ్యం కాదని, ప్రతి విజేతా నిరూపిస్తూనే ఉన్నారు. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి తల్లి త్యాగమే గొప్పది పిల్లల ప్రాక్టీస్‌కి అవసరమైన డబ్బు సర్దుబాటు చేయడం వరకే నా బాధ్యత. పిల్లల కోసం శిల్ప కొన్నేళ్లపాటు వెకేషన్ లేకుండా తనను తాను త్యాగం చేసుకుంది. వేసవి సెలవుల్లో ఉదయం ఎనిమిది గంటలకే పిల్లలిద్దరినీ రెడీ చేసి, వంట చేసి, రోజు మొత్తానికి అవసరమైన ఫుడ్ సర్దుకుని తను రెడీ అయిపోయేది. ముగ్గురినీ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రాక్టీస్‌కి వదిలి నేను ఆఫీస్‌కి వెళ్లేవాడిని. సాయంత్రం నాలుగున్నర వరకు పిల్లలు ప్రాక్టీస్ చేసేవాళ్లు. అప్పుడు ఇంటికి వస్తే మళ్లీ ఇంటి పనులు. రాత్రి వరకు తనకు ఖాళీ ఉండేది కాదు. పైగా ఇది ఖర్చుతో కూడిన ప్రాక్టీస్. నాకు ఇబ్బందేమీ లేదని చెప్తున్నా సరే... ఇంటీరియర్ వర్క్‌ను కొద్దికాలం పోస్ట్‌పోన్ చేద్దాం. ఇప్పుడున్న వసతులు చాలనేది. – యుగేంద్ర కుమార్ గుంటూరి రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందే షూటింగ్ ప్రాక్టీస్ రోజూ చేయాల్సిందే. వెకేషన్‌కు వెళ్లినప్పుడు నాలుగు రోజులు గ్యాప్ వస్తే ఐదో రోజు పిస్టల్, రైఫిల్ పట్టుకున్నప్పుడు చేయి వణుకుతుంది. అందుకే కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా హోటల్ రూమ్‌లో అయినా సరే గంట– రెండు గంటల పాటు హోల్డింగ్ ప్రాక్టీస్ చేయాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి రోజూ సూర్యనమస్కారాలు, గుంజిళ్లు, మెడిటేషన్ చేయాలి. వెపన్ కంట్రోల్ కోసం డంబుల్స్తో ప్రాక్టీస్ చేయాలి. షూటింగ్ ప్రాక్టీస్‌లో పిల్లల్లో వచ్చే పరిణతిని నేను దగ్గరగా గమనించగలిగాను. లక్ష్యం మీద ఎక్కువ సమయం దృష్టి పెట్టినప్పుడు చూపు చెదురుతుంది. అలాంటప్పుడు ఆందోళన చెందకుండా పక్కన కూర్చుని మామూలైన తర్వాత మళ్లీ ఎక్కుపెట్టడం వంటివి అలవడ్డాయి. ఈ ఆటలో ఎవరికి వారే ప్రత్యర్థి. తమతో తామే పోటీ పడాలన్నమాట. ఇది గుడ్ షాట్, ఇది బ్యాడ్ షాట్ అనేది ఉండదు. ప్రతి షాట్ నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఈ ఆటతో పిల్లల్లో స్థితప్రజ్ఞత వస్తుంది. – శిల్ప -
ఆరోగ్యంతో ఆడుకోకండి.. ఆరోగ్యం కోసం ఆడండి
ఆధునికత పెరిగిన తర్వాత జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలాడే వయసులోని పిల్లలను మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు లేని ఇరుకిరుకు పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరు బాల్యంలోనే స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇంకొందరు రోగనిరోధక శక్తి నశించి, తరచు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆటలు ఆడే వారికన్నా టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, టెన్నిస్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసే జనాలే ఎక్కువవుతున్నారు. ఆటలు ఆడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గాని, కుదిరితే స్టేడియంలో, కుదరకుంటే ఇంట్లోనే టీవీల్లో క్రీడల మ్యాచ్‌లు చూసినంత మాత్రాన ఆరోగ్యానికి ఒరిగేదేమీ ఉండదు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల గురించి ఒక సింహావలోకనం... ఆటలాడటం మనుషుల సహజ లక్షణం. పాకే వయసు నుంచే పిల్లలు ఆటల వైపు మొగ్గు చూపుతారు. బుడి బుడి అడుగులు వేసే వయసులో చేతికందిన వస్తువులతో తోచిన రీతిలో ఆటలాడతారు. ఆ వయసులోనే వారికి ప్రమాదాలకు తావులేని ఆటబొమ్మలను ఇవ్వాలి. సమవయస్కులైన పిల్లలు కూడా జత చేరితే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటలాడతారు. కాస్త ఊహ తెలిసిన వయసు వచ్చాక వీధుల్లోకి వెళ్లి ఆరుబయట స్నేహితులతో ఆటలాడేందుకు ఇష్టపడతారు. ఆటల వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఆటల్లోని సహజ వ్యాయామం వల్ల శరీరం తీరుగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. బృందంతో కలసి పనిచేయడం, బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి. చరిత్రపూర్వయుగం నుంచే ఆటలు... చరిత్రపూర్వయుగంలోని ఆదిమానవులు సైతం ఆటలాడేవారు. పాతరాతి యుగంలోనే అప్పటి మానవులు ఆటలాడేవారు. నాటి మానవులు ఆటలాడిన ఆనవాళ్లు ఫ్రాన్స్‌లోని లాస్కాక్స్ గుహల్లో లభించాయి. ఆ గుహల్లోని రాతి గోడలపై అప్పటి మనుషులు పరుగు పందేల్లో పాల్గొంటున్నట్లుగా, కుస్తీలు పడుతున్నట్లుగా ఉన్న చిత్రాలు ఆదిమానవుల క్రీడాస్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. రాతిగోడలపై ఉన్న ఆ చిత్రాలు కనీసం 15,800 ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొత్తరాతి యుగం నాటికి మనుషులు మరిన్ని కొత్త క్రీడలను కనిపెట్టారు. ఈతకొట్టడం, ధనుర్బాణాలను తయారు చేసి, గురితప్పకుండా బాణాలను కొట్టడం వంటి క్రీడలకు సంబంధించిన గుహా చిత్రాలు జపాన్‌లో లభించాయి. అవి పదివేల ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తల అంచనా. మానవుల మేధస్సు వికసించి, నెమ్మదిగా నాగరికతలు ఏర్పడిన కాలంలో మరికొన్ని క్రీడలను మనుషులు కనుగొన్నారు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్టు, గ్రీకు, రోమన్, సింధులోయ నాగరికతల కాలంలో మనుషులు ఉత్సాహభరితంగా క్రీడా వినోదాన్ని ఆస్వాదించినట్లుగా అనేక ఆనవాళ్లు దొరికాయి. నాగరికతల వికాసంలో క్రీడలు సుమేరియన్ల కాలంలో కుస్తీలు, బాక్సింగ్, గాలాలతో చేపలు పట్టడం వంటి క్రీడలు ఉండేవి. ఈజిప్టు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, చేపలు పట్టడం, లాంగ్ జంప్, ఈత, విలువిద్య వంటి క్రీడలు ఉండేవి. గ్రీకు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, విలువిద్యలతో పాటు బల్లేలు విసరడం, బరువైన చక్రాలు విసరడం, రథాల పందేలు వంటి క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతలు వికసించిన తొలినాళ్లలో ప్రపంచంలో పలుచోట్ల రకరకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. ప్రాచీన రోమ్, మెసొపొటేమియా, చైనా, ఐర్లాండ్, స్కాట్లాండ్ తదితర ప్రాంతాల్లో క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతల్లో నాటి మనుషులు ఆడిన క్రీడల్లో కొన్ని నేటికీ ఉనికిలో ఉన్నాయి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోని ఒలింపియా పట్టణంలో క్రీస్తుపూర్వం 776లోనే తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల పోటీలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభమైన కొన్నాళ్లకు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఇస్త్మియాన్, నెమియాన్, పైథియాన్ క్రీడల పోటీలు కూడా జరిగేవి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. పైథియాన్ క్రీడల పోటీలు కూడా నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. ఒలింపిక్స్ జరిగిన రెండేళ్లకు పైథియాన్ క్రీడల పోటీలు జరిగేవి. ఇస్త్మియాన్, నెమియాన్ పోటీలు రెండేళ్లకు ఒకసారి జరిగేవి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఈ నాలుగు క్రీడల పోటీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండేవి. మధ్యయుగాల నాటికి మరిన్ని క్రీడలు కొత్తగా వచ్చి చేరాయి. గుర్రపు పందేలు, ఫుట్‌బాల్ తరహా క్రీడలు మధ్యయుగాల నాటివే. ప్రాచీన భారతదేశంలో క్రీడలు ప్రాచీన భారతదేశంలోనూ క్రీడలు ఉండేవి. వేదకాలంలోనే భారత భూభాగంలో జనాలు క్రీడలు ఆడేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ‘‘కర్తవ్యం నా కుడి చెయ్యి... విజయఫలం నా ఎడమచెయ్యి’’ అనే అర్థంతో కూడిన అధర్వణవేద మంత్రం నాటి భారతీయుల క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కుస్తీ (మల్లయుద్ధం), బాక్సింగ్ (ముష్టియుద్ధం) వంటి క్రీడలు పురాణకాలంలోనే ఉండేవి. రామాయణ, మహాభారతాల్లో ఈ యుద్ధక్రీడల ప్రస్తావన కనిపిస్తుంది. కంసుడి ఆస్థానంలోని చాణూర ముష్టికులనే మల్లయోధులను కృష్ణబలరాములు మట్టి కరిపించిన పురాణగాథ అందరికీ తెలిసినదే. రథాల పోటీలు, గుర్రపు స్వారీ పోటీలు, విలువిద్య, ఈత, పోలో వంటి క్రీడలతో పాటు మల్లయుద్ధం, ముష్టియుద్ధం, బరువులను ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), కత్తియుద్ధం (ఫెన్సింగ్), గదాయుద్ధం, బల్లేలను గురిచూసి విసరడం (జావెలిన్ త్రో), కరాటేకు మూలంగా భావిస్తున్న కలరి వంటి యుద్ధ క్రీడలకు కూడా ప్రాచీన భారతదేశంలో విశేష ఆదరణ ఉండేది. బౌద్ధం ద్వారా కలరి యుద్ధక్రీడ క్రీస్తుశకం ఐదో శతాబ్దినాటికి చైనా, జపాన్ వంటి తూర్పుదేశాలకు వ్యాపించి, తర్వాతి కాలంలో ఆధునిక కరాటేగా రూపుదిద్దుకుందని కొందరు క్రీడాచరిత్రకారులు అభిప్రాయపడతారు. బౌద్ధాన్ని బోధించిన గౌతమబుద్ధుడు స్వయంగా మేటి విలుకాడు. ఆయనకు సుత్తి వంటి బరువైన వస్తువులను దూరంగా విసరడంలోనూ నైపుణ్యం ఉండేది. నేటికీ వీధుల్లో పిల్లలు ఆడుకునే గిల్లీదండా, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు ప్రాచీనకాలం నాటివే. మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీన భారతీయులు క్రీడలకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేవారు. సింధులోయ నాగరికత నాటి ప్రజలు బల్లెం, ధనుర్బాణాలు, గద, చక్రం, కత్తి, బాకు, గొడ్డలి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు. వాటితో యుద్ధక్రీడలూ ఆడేవారు. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్, పాహియాన్‌లు తమ రచనల్లో నాటి భారతీయులు ఆడుకునే రకరకాల క్రీడలను గురించి వివరించారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు పరుగు పందేలు, కుస్తీ పోటీలు, బంతులతో ఆడే రకరకాల ఆటలు, ఈత, బరువులెత్తడం వంటి క్రీడలతో ఉల్లాసం పొందేవారని వారు రాశారు. పన్నెండో శతాబ్దికి చెందిన సోమేశ్వరుడు తన ‘మనోల్లాస’ గ్రంథంలో భారశ్రమ (వెయిట్‌లిఫ్టింగ్), భ్రమణశ్రమ (పరుగు), మల్లస్తంభ (రెజ్లింగ్), ధనుర్వినోద (విలువిద్య) సహా నాటి జనాలు ఆడుకునే రకరకాల క్రీడలను విపులంగా వివరించాడు. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించుకున్న పోర్చుగీసు రాయబారి డోమింగో పేస్ ఇక్కడి క్రీడలను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మల్లయోధుడని, గుర్రపుస్వారీలోను, కత్తియుద్ధంలోను ఆయనకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని డోమింగో పేస్ తన రచనల్లో రాశారు. మొఘల్ చక్రవర్తుల హయాంలో కూడా భారతదేశంలో క్రీడలకు విశేషమైన ఆదరణ ఉండేది. ఆగ్రా కోట, ఢిల్లీలోని ఎర్రకోట మొఘల్‌ల హయాంలో క్రీడాపోటీలకు ప్రధాన వేదికలుగా ఉండేవి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో విరివిగా హనుమాన్ ఆలయాలను స్థాపించి, ఆ ఆలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా వ్యాయామశాలల ద్వారా యువకులను క్రీడల వైపు, వ్యాయామం వైపు ప్రోత్సహించాడు. స్వాతంత్య్రపూర్వం నాటి ప్రముఖుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప క్రీడాకారుడు, క్రీడాభిమాని కూడా. ఆయనకు ఫుట్‌బాల్, ఫెన్సింగ్, బాక్సింగ్, ఈత, మల్లయుద్ధం వంటి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ఒకసారి వివేకానంద ‘భగవద్గీత చదవడం కంటే ఫుట్‌బాల్ ఆడటం ద్వారా స్వర్గానికి త్వరగా చేరువకాగలం’ అని చెప్పిన మాటలు ఆయన క్రీడాభినివేశానికి అద్దం పడతాయి. బ్రిటిష్‌కాలంలో ఆధునిక క్రీడలు బ్రిటిష్‌కాలంలో భారతదేశంలోకి ఆధునిక పాశ్చాత్య క్రీడలు అడుగుపెట్టాయి. బ్రిటిష్‌వారు భారత్‌కు వచ్చేనాటికి ఇక్కడ బాగా ఆదరణ పొందిన క్రీడలను వారు కూడా నేర్చుకున్నారు. బ్రిటిష్‌వారు ఇక్కడకు వచ్చేనాటికి పుణే ప్రాంతంలో ‘పూనా’ అనే ఆట ఆడేవారు. బ్రిటిషర్లు దీనికే కొద్దిపాటి మార్పులు చేసి, ఆధునిక బ్యాడ్మింటన్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. బ్రిటిష్ నావికులు 1721లో కాంబే తీరంలో ఆడటం ద్వారా క్రికెట్‌ను భారతీయులకు పరిచయం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వకాలంలో నాటి సంపన్నులు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. పోలో ఆటను అంతకుముందు రకరకాలుగా ఆడేవారు. గుర్రాలపైనే కాకుండా, ఏనుగుల పైనుంచి కూడా ఆడేవారు. అయితే, ఇప్పటి నిబంధనలతో ఆధునిక పోలో క్రీడ పంతొమ్మిదో శతాబ్దిలో మణిపూర్‌లో రూపుదిద్దుకుంది. తర్వాత ఇది యూరోప్, ఉత్తర అమెరికాలకు వ్యాపించింది. భారత్‌లో తొలి ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభమైంది. అప్పట్లో భారతీయులు ఈ క్రీడలో కొంత వెనుకబడి ఉండేవారు. దీనిపై బ్రిటిషర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. దీనిని సవాలుగా తీసుకున్న బెంగాలీ యువత పట్టుదలతో సాధన చేసి, 1911లో బ్రిటిష్ జట్టుతో తలపడినప్పుడు ఫైనల్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌నే గెలుపు వరించింది. భారత క్రీడాకారులు 1920 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ 28 పతకాలను దక్కించుకోగలిగింది. 1928–1980 మధ్యకాలంలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తొమ్మిది బంగారు పతకాలను దక్కించుకోగా, వాటిలో ఎనిమిది పతకాలు మన హాకీ జట్టు గెలుచుకున్నవే కావడం విశేషం. హాకీని మన జాతీయ క్రీడగా చాలామంది పొరబడతారు గాని, భారత్ ఇంతవరకు ఏ క్రీడనూ జాతీయక్రీడగా ప్రకటించలేదు. ఈ సంగతిని సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్వయంగా స్పష్టం చేసింది. అయితే, హాకీ వల్లనే ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక బంగారు పతకాలు సాధించిందన్నది మాత్రం వాస్తవం. 1928, 1932, 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టకు సారథ్యం వహించి, పతకాల పంట పండించిన నాటి మన హాకీజట్టు కెప్టెన్ ధ్యాన్‌చంద్ గౌరవార్ధంగానే ఆయన పుట్టిన రోజును ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. 1928 నాటి ఒలింపిక్స్ పోటీల్లో ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఏకంగా 178 గోల్స్ సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఆ పోటీల్లో మరే జట్టు కూడా భారత జట్టుకు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టు అంతర్జాతీయ పోటీల్లో ఇదే దూకుడును కొనసాగించింది. కాలక్రమేణా క్రికెట్‌కు జనాదరణ పెరగడంతో హాకీకి ప్రోత్సాహం కరువైంది. భారత హాకీ జట్టు 1980లో చివరిసారిగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అది జరిగిన మూడేళ్లకు 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి దేశంలో క్రికెట్‌కు విపరీతంగా జనాదరణ పెరిగింది. అంతకుముందు సంపన్నవర్గాలకే పరిమితమైన క్రికెట్ గల్లీలకు వ్యాపించింది. దేశంలోని ఏ క్రీడాకారుడికీ దక్కని గౌరవం ‘భారతరత్న’ అవార్డు క్రికెట్ క్రీడాకారుడైన సచిన్ టెండూల్కర్‌కు దక్కింది. భారత క్రీడాకారులు పరుగుపందేలు, బ్యాడ్మింటన్, విలువిద్య వంటి క్రీడల్లో సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, క్రికెటర్లకు దక్కుతున్న ప్రోత్సాహం, ఆదరణ మిగిలిన క్రీడాకారులకు దక్కడంలేదు. క్రీడల గురించి కొన్ని విశేషాలు ► మనకైతే జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదుగాని, మన పొరుగు దేశమైన భూటాన్ విలువిద్యను జాతీయక్రీడగా గుర్తించి, ఆ క్రీడను ప్రోత్సహిస్తోంది. ► క్రీడారంగంలో అతి తేలికపాటి, గౌరవనీయమైన పదవి ఒకటి ఉంది. గాలిపటాల క్రీడ (కైట్ సర్ఫింగ్) కోసం సృష్టించిన ఈ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనల్లా గాలిపటాలు ఎగరవేయడానికి గాలి అనుకూలంగా ఉందో లేదో చెప్పడమే. ఈ పదవిలో ఉన్న వ్యక్తిని ‘విండ్ డమ్మీ’ అంటారు. ‘గినీపిగ్’ అని కూడా ముద్దుగా పిలుస్తారు. ► సాధారణంగా క్రీడల్లో మహిళలు, పురుషులు ఒకే జట్టులో సమాన సంఖ్యలో ఉండటం కనిపించదు. ‘కోర్ఫ్‌బాల్’ క్రీడలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ‘కోర్ఫ్‌బాల్’ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారు. తప్పనిసరిగా సమాన సంఖ్యలో పురుషులు, మహిళలతో కలిసిన జట్టును ఏర్పాటు చేయడమే ‘కోర్ఫ్‌బాల్’ ప్రత్యేకత. ► టెన్నిస్‌లో ఒకప్పుడు కోర్టు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి తెలుపు లేదా నలుపు రంగు బంతులను మాత్రమే వాడారు. అయితే, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) 1972లో తొలిసారిగా పసుపు రంగు బంతులను ప్రవేశపెట్టింది. కలర్ టీవీ తెరలపై కొట్టొచ్చినట్టు కనిపించాలనే ఉద్దేశంతోనే ఐటీఎఫ్ నిపుణులు పసుపు రంగును ఎంపిక చేసుకున్నారు. ► కండలను పెంచుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళుతుంటారు గాని, చాలామందికి వాటి చరిత్ర తెలీదు. తొలిసారిగా ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం తొమ్మిదో శతాబ్దిలో జిమ్నాసియమ్లు ఏర్పాటయ్యాయి. వాటిలో వ్యాయామం కోసం వెళ్లేవారు దుస్తులన్నీ తీసేసి పూర్తి నగ్నంగా వ్యాయామాలు చేసేవారు. ఒకవైపు వ్యాయామాలు కొనసాగుతుంటే మరోవైపు ఒక బృందం వాద్యసంగీతం వినిపించేది. ► ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్’గా రెండుసార్లు ‘టైమ్స్’ మ్యాగజైన్ కవర్పైకెక్కిన ఘనత దక్కించుకున్న ఏకైక క్రీడాకారుడు గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్. ‘టైమ్స్’ మ్యాగజైన్ 2000 ఆగస్టు సంచికలో ఒకసారి, ఈ ఏడాది ఆగస్టు సంచికలో ఒకసారి కవర్ పేజీకెక్కాడాయన. క్రీడల్లో మనది ఇంకా కొంత వెనుకబాటే... క్రీడారంగంలో భారత్ ఇంకా కొంత వెనుకబాటలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అగ్రగాములుగా నిలుస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇంకా తొలి పదిస్థానాల్లో చోటు పొందలేదు. నాలుగేళ్లకు ఒకసారి వెలువడే ఈ జాబితా గత ఏడాది విడుదలైంది. ఇందులో భారత్ కేవలం 37వ స్థానంలో నిలిచింది. క్రీడల్లో టాప్–10 దేశాలు ఇవే... 1. అమెరికా 2. ఫ్రాన్స్ 3. యునైటెడ్ కింగ్డమ్ 4. స్పెయిన్ 5. ఆస్ట్రేలియా 6. జర్మనీ 7. రష్యా 8. బ్రెజిల్ 9. జపాన్ 10. కెనడా క్రీడలతోనే ఆరోగ్యం క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. చిన్నారులు ఆడుకునేటప్పుడు వారిని ఆటల నుంచి నివారించడం చాలామంది పెద్దలు చేసే పొరపాటు. ఆటల వల్ల పిల్లలు చదువులను నిర్లక్ష్యం చేస్తారని, ఆటల వల్ల పిల్లలు దుందుడుకుగా మారిపోతారని చాలామంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తోటిపిల్లలతో కలసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకోగలుగుతారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రీడల వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేమిటంటే... స్థూలకాయం రాదు తరచు క్రీడలు ఆడటం వల్ల స్థూలకాయం రాదు. ఒంట్లోని కొవ్వు కరిగి శరీరం తీరుగా తయారవుతుంది. చురుకుదనం పుంజుకుంటుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మానసిక ఆరోగ్యం క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు చెబుతుండటం విశేషం. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి. గుండెకు ఆరోగ్యం క్రీడలు ఆడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. క్రీడలు గుండె కండరాల దారుఢ్యానికి దోహదపడతాయి. క్రీడల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. క్రీడాకారుల్లో గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు. అదుపులో రక్తపోటు క్రీడలు ఆడటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కేవలం ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తపోటును నియంత్రించడం దుస్సాధ్యం. ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ నిపుణులు సూచిస్తున్నారు. క్రీడల వల్ల రక్తపోటును అదుపులో ఉండటమే కాకుండా, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. మెరుగైన రక్తసరఫరా క్రీడల వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి జీవకణానికీ తగినంతగా ఆక్సిజన్ అందుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. క్రీడలు ఆడేవారికి వెన్నునొప్పి, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు బాధించే అవకాశాలు తక్కువ. ఈ కారణం వల్లనే క్రీడలు ఆడేవారిలో చాలాకాలం వరకు కండరాలు పట్టు సడలకుండా బిగువుగా ఉండటంతో పాటు వార్ధక్య లక్షణాలు త్వరగా కనిపించకుండా ఉంటాయి. మెరుగైన రోగనిరోధక శక్తి క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారికి బాగా చెమట పట్టి, శరీరంలోని మాలిన్యాలు త్వరగా బయటకు పోతాయి. వేగంగా పరుగులు తీయడం, ఆటలాడటం వల్ల శరీరం ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, త్వరగా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది. సానుకూల దృక్పథం క్రీడలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను నిర్దేశించుకుని, ఒకరకమైన స్పష్టతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం, క్రమశిక్షణ వంటి సానుకూల లక్షణాలు క్రీడల వల్ల అలవడతాయని ‘జర్నల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్స్’ ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపింది. – పన్యాల జగన్నాథదాసు -
పబ్జీగేమ్ వద్దంటేనే ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి..
సోమాజిగూడ: వాస్తవికానికి దూరంగా.. ఇంటర్నెట్ గేమింగ్‌కు దగ్గరగా యువతరం వెళ్తున్నట్లు మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు సైతం ఇంటర్నెట్ గేమింగ్‌కు అలవాటు పడుతున్నారు. అందుకు బాధ్యత వహించాల్సింది కూడా తల్లితండ్రులే అంటున్నారు వైద్య నిపుణులు. 10 సంవత్సరాల క్రితం ఇటు వంటి వ్యాధులతో తమ వద్దకు వచ్చిన వారు లేరని, అసలు తాము చదివిన చదువుకు ఇప్పుడొస్తోన్న వ్యాధులకు అసలు పొంతన ఉండటం లేదంటున్నారు. నగరాల్లోని పిల్లల తల్లితండ్రులు క్షణం తీరిక లేని జీవితాలు గడుపుతున్నారు. చిన్నారి మారాం చేస్తే ఆడుకో అంటూ సెల్ఫోన్లను చేతికి అందిస్తున్నారు. సెల్ ఫోనే ప్రపంచంగా వారికి తల్లితండ్రులే అలవాటు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పిల్లలకు మరో ధ్యాస ఉండటంలేదు. వారు యుక్త వయసుకు వచ్చినా... మదిలో అవే ఆలోచనలు మెదలడంతో ఎప్పుడూ ఫోన్లతో గడపం, చాటింగ్ చేయడం, ఇంటర్నెట్ గేమింగ్.. అదే ప్రపంచంగా వారు భావిస్తున్నారని నిమ్స్ ఆసుపత్రిలోని మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ జి.పద్మజ అభిప్రాయం వ్యక్తంచేశారు. పబ్జీగేమ్... పబ్జీగేమ్ వద్దంటేనే పిల్ల్లలు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి వచ్చారంటే అందులో తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉందంటున్నారు మానిసిక వైద్య నిపుణులు. అపార్ట్మెంట్ కల్చర్‌కు అలవాటుపడిన నగరవాసులు పిల్లల్ని స్కూలుకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. డబ్బాల్లాంటి ఇరుకు గదుల్లో చదువు సాగుతూ వాస్తవిక పరిస్థితులకు పిల్లలను దూరం చేస్తున్నారు. చదువు, మార్కులు తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు నేర్పాలనే విషయాన్నే మరిచిపోతున్నారు. ఇయర్ ఫోన్ మాట్లాడుతూ రైలు ఢీకొని మృతి నగరంలోని ఎమ్మెస్ మక్తాలో నివసించే ఓ యువతి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాకింగ్‌కు వెళ్లింది. నడక పూర్తి అయిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాల్సి ఉంది. పట్టాలు దాటే సమయంలో అటుగా వచ్చే రైలును ఆమె గుర్తించలేదు. వెనుక నుంచి వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. నడిచినా.. ప్రయాణం చేసినా.. చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్కనున్నవారిని కనీసం గమనించడంలేదు. కాస్త ఆగి అటు.. ఇటు.. చూసినా ఆమె ప్రాణాలు దక్కేవి. రైలు పట్టాలు వద్ద సెల్ఫీ.. ప్రస్తుతం సెల్ఫీ అన్నది అందరికీ పట్టిన పెద్ద జాడ్యంలా మారింది. చిన్నా.. పెద్దా తేడా లేకుండా సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఇటీవల కాలంలో ఓ యువకుడు రైలు పట్టాల సమీపంలో నడిచే రైలుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. దీనినే సెల్ఫీ టేకింగ్ ఎడిక్షన్ డిజార్డర్ అంటారని వైద్యులు చెబుతున్నారు. పులితో సెల్ఫీ.. పులితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో లైకుల కోసం ఎగబడిన ఓ యువకుడు ఆపులికి ఆహారంగా మారిన ఘటన అందరికీ తెలిసిందే. ఇలా ంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నా.. వారిలో మార్పు రాకపోగా... ఇంకా పెడదారి పడుతున్నారు. దీనికి కారణం ఇంటర్నెట్.. పిల్లల గేమ్స్‌పై దృష్టిపెట్టాలి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాధులు అధికం అతున్నాయి. ఇంటర్నెట్ విస్తరించిన అనంతరం మంచితోపాటు చెడూ పెరిగింది. మంచిని వదిలి యువతరం చెడును ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహ భావంగా ఉండాలి. వారు ఎంచుకున్న మార్గం.. అనుసరిస్తున్న పద్ధతులను సున్నితంగా వివరించాలి. ఈ గేమ్స్ అన్నీ కల్పితమని, వాస్తవిక క్రీడలు ఎన్నో ఉన్నాయని, వాటిని పరిచయం చేయాలి. సూళ్లలో అధ్యాపకులు విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలి. పాఠశాల నుంచి వచ్చిన బిడ్డ ఏమిచేస్తున్నాడు.. అనే విషయాన్ని తెలుసుకోవాలి. – డాక్టర్ పద్మజ -
కుదురులేని వాడు క్యూబ్‌లో ఒదిగాడు
అమెరికాలో జాతీయ స్థాయిరూబిక్ క్యూబ్ పోటీల్లో విజేతగా నిలిచినపాలడుగు హర్ష హైదరాబాద్ వచ్చి,తన లాంటి పిల్లలకు రూబిక్ క్యూబ్ గేమ్మీద ఆసక్తి పెంచేందుకు ఓ ప్రత్యేకఈవెంట్ ఏర్పాటు చేశాడు. అతడి హైపర్యాక్టివ్నెస్కి తండ్రి కనిపెట్టిన రూబిక్ గేమ్ పరిష్కారమే... అమెరికాలో ఏ తెలుగు కుర్రాడికీ దక్కని ఘనతను హర్షకు సాధ్యం చేసింది! ఒకప్పుడు పిల్లలు చురుకుగా ఉండడం లేదనేదే ఎక్కువగా పెద్దవాళ్ల ఫిర్యాదుగా ఉండేది. అయితే ఇప్పుడు ‘మా వాడు హైపర్ యాక్టివ్ అండీ. ఏం చేయాలో తెలియడం లేదు’’ అనే పేరెంట్స్ కోకొల్లలు. కారణాలేవైనా గాని.. దీనికి రూబిక్ క్యూబ్ గేమ్‌ను ఒక మంచి పరిష్కారం అని కనుగొన్నారు అమెరికాలో ఉంటున్న పాలడుగు శ్రీకాంత్. ఈ గేమ్‌లో రాణిస్తున్న తమ కుమారుడు హర్ష ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఆయన క్యూబ్ గేమ్ మీద రోజు మొత్తం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా హర్షతో ముచ్చటించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హైపర్ టూ... సూపర్ ‘‘మాది ఆంధ్రప్రదేశ్. (తండ్రి కాకినాడ, తల్లి విశాఖపట్టణం) చిన్నప్పుడు తన పదేళ్ల వయసులో నాన్న క్యూబ్ గేమ్ ట్రై చేశారట. కొంత కాలం దాని మీద ఇష్టంతో ఆడి తర్వాత వదిలేశారు. చిన్నప్పటి నుంచీ నేను హైపర్యాక్టివ్గా ఉండేవాడిని. దేనిపై సరిగా ఫోకస్ ఉండేది కాదు. నాలో ఫోకస్ పెంచడానికి ఏ గేమ్ సరిగా ఉపయోగపడుతుందా అని నాన్న ఆలోచించి, చిన్నప్పుడే నాకు క్యూబ్ కొనిచ్చారు. మొదట్లో నేను అంత ఆసక్తి చూపలేదు. కొన్ని రోజులు ఆడి వదిలేశా. అయితే అనుకోకుండా నా ఫ్రెండ్ కూడా ఇదే ఆట మొదలుపెట్టగానే ఇద్దరం పోటా పోటీగా ఆడడం, అలా అలా కాంపిటీషన్స్‌కి కూడా వెళ్లడం, గెలవడం మొదలైంది. రెండేళ్ల క్రితం ఆగస్ట్ 27న మిషిగన్ క్యూబింగ్ క్లబ్ నిర్వహించిన పోటీలో గెలిచాను, ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ ర్యాంక్, వరల్డ్ వైడ్‌గా 6వ ర్యాంక్ సాధించాను. చదువు మెరుగయింది ఒక క్యూబ్స్ సాల్వ్ చేయాలంటే వందల అల్గోరిథెమ్స్ అవసరం. దీని వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, ఫింగర్స్ మూవ్మెంట్స్ వల్ల నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఈ గేమ్‌ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల నా చురుకుదనం క్రమబద్ధం అయింది. ఏకాగ్రత పెరిగింది. కళ్లు, మైండ్, చేతులు అన్నింటి సమన్వయం వచ్చింది. ఫైనల్‌గా దీని వల్ల స్టడీస్‌లో కూడా బాగా బెటర్ అయ్యా. సాధారణ ఆటగాడి నుంచి ఛాంపియన్ కావాలంటే.. విపరీతమైన ఏకాగ్రత కావాలి. మీకు తెలుసా? ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆటగాళ్లు ఆటలోకి దిగి ఒక్కసారి క్యూబ్‌ని చూశాక దాన్ని అచ్చం అలాగే మైండ్‌లో ప్రింట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేతుల్లో ఉన్న క్యూబ్ కనిపించదు. మైండ్ గేమ్ మాత్రమే ఉంటుంది. చేతుల్లో క్యూబ్ కనిపిస్తే ఆడలేం. దీనిని బ్లైండ్ కిడ్స్ ఇంకా బాగా ఆడగలగడానికి కారణం వాళ్లకి ఫోకస్ మరింత బాగా ఉండడమే. పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనేది నా లక్ష్యం. పిల్లలకు ఆసక్తి కల్పించాలి అమెరికాలో దేశవ్యాప్తంగా ఈ గేమ్‌కు సంబంధించి నెలకు 50 వరకూ జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుంటాయి. మనకు చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం మరింత తక్కువ. ఇది విద్యార్ధి దశలోని పిల్లలకు బాగా ఉపయుక్తమైంది. అందుకే దీన్ని వీలున్నంతగా ప్రమోట్ చేయాలని ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ, పోటీల ఈవెంట్స్ ద్వారా వచ్చిన విరాళాలు, ఫీజులు రూపంలో సేకరించిన నిధులు పూర్తిగా కేన్సర్ వ్యాధి బాధిత చిన్నారుల కోసం కృషి చేసే ల్యుకేమియా అండ్ లింఫోమా సొసైటీకి అందిస్తున్నాం’’ అని తెలిపారు హర్ష. – ఎస్.సత్యబాబు -
బ్లూవేల్ పోయె పబ్జి వచ్చె
నగరంలోని విద్యారణ్యపురకు చెందిన ఒక అబ్బాయి తరగతిలో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేవాడు. కానీ ఇటీవల తరచూ స్కూల్‌కు వెళ్లడం లేదు. మార్కులు తగ్గిపోయాయి. తల్లిదండ్రులతోనూ మాట్లాడడం లేదు. నిరంతరం మొబైల్లో, కంప్యూటర్లో పబ్జి గేమ్ ఆడడమే. మరో 15 ఏళ్ల అబ్బాయి రాత్రి 2–3 గంటలవరకు పబ్జి ఆడడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా స్కూల్‌కు వెళుతున్నాడు. గంటల తరబడి మొబైల్లో పబ్జి గేమ్ ఆడుతూ ప్రపంచాన్ని మరచిపోతున్నాడు. గత్యంతరం లేని తల్లిదండ్రులు నిమ్హాన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాక్షి బెంగళూరు/ యశవంతపుర: ప్రాణాంతక బ్లూ వేల్ గేమ్ ముగిసిపోయిందనుకున్న తరుణంలో పబ్జి అనే కొత్త గేమ్ వచ్చిపడింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాలలు, కుర్రకారు ఈ ఆటకు బానిసలుగా మారారు. తిండితిప్పలు వదిలేసి మరీఈ గేమ్‌కు అంటుకుపోతూ మానసికంగా దెబ్బతింటున్నారు. విద్యార్థులు విపరీతంగా ఆడడం వల్ల నిద్రలేమీ, స్కూల్‌కు గైర్హాజరు, హింసాత్మక ప్రవృత్తి పెరగడం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ దూసుకుపోతోంది. మూడునెలల్లో 120 కేసులు ఈ కొత్త ఆన్లైన్ గేమ్‌కు బానిసలవుతున్న వారిలో బెంగళూరు ప్రముఖ స్థానం ఉంది. పబ్జి గేమ్ వ ల్ల మానసకి రుగ్మతలకు గురై ఇటీవల చాలా మం ది నిమ్హాన్స్కు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల నుంచి ఇప్పటివరకు నిమ్హాన్స్లోని సర్వీసెస్ ఫర్ హెల్తీ యూ జ్ ఆఫ్ టెక్నాలజీ (షట్)కు 120 కేసులు వచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఈ గేమ్ ఆడిన తర్వాత జీవితంపై ఆసక్తి లేకపోవడం, నిద్ర లేమీ, చదువులో వెనుకబడిపోవడం తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం వస్తున్నారని పేర్కొన్నారు. జీవితాన్ని కోల్పోతున్నారు ‘దేశంలో 8 నెలల క్రితం ఈ గేమ్ యాప్ ప్రారంభించారు. తొలి మూడు నెలల్లో నెలకు మూడు లేదా ఐదు కేసులు మాత్రమే వస్తుండేవి. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి కేసుల సంఖ్య పెరగడం గమనించాం. ఇప్పుడు నెలకు సగటున 40 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి. ఈ గేమ్ ప్రతిఒక్కరి జీవితాన్ని కబళిస్తోంది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఆడడం వల్ల జీవితంలో అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. గేమ్‌కు అలవాటైన పిల్లలను ఫోన్‌కు దూరం చేస్తే చాలా కోపంగా, హింసాత్మకంగా మారిపోతున్నారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆస్పత్రికి వస్తున్న రోగులు తమ తల్లిదండ్రుల మీదే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి గేమ్స్ బారినపడకుండా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అసహజ వైఖరి, ప్రవర్తన కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలి’ – డాక్టర్ మనోజ్ శర్మ, శ్రీధర్, సైకియాట్రిస్టులు యుద్ధం చెయ్యడం, చంపడమే ఈ గేమ్ ఇది ఒక యుద్ధానికి సంబంధించిన గేమ్. 100 మందితో ఈ గేమ్ ప్రారంభమవుతుంది. విమానం నుంచి 100 మంది ఒక ద్వీపంలోకి దిగుతారు. యుద్ధ రంగంలోకి అడుగిడి భారీ తుపాకులు, ఆయుధాలతో గేమ్‌లో ఉన్న ప్రత్యర్థులను చంపుకుంటూ వెళుతుంటారు. బైకులు, కార్లు, బోట్లు ఉపయోగించుకుని ద్వీపంలో తిరుగుతూ దాడులు చేస్తారు. అలా చంపుకుంటూ వెళ్లి చివరికి ఆ నూరు మందిలో ప్రాణాలతో మిగిలే వారే విజేతలుగా నిలుస్తారు. -
ఘనంగా ముగిసిన 'లాటా' మిని ఒలింపిక్స్
లాస్ ఏంజెల్స్ : అమెరికాలో లాస్ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్(లాటా) నిర్వహించిన మినీ ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2016 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యాష్లీ జాన్సన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, ట్రోపీలను అందజేశారు. స్థానిక కళాకారులు శ్రీమాన్ కొమరగిరి, రమ్య పుచ్చలు తమ ఆటాపాటలతో అతిథులను ఉర్రూతలూగించారు. ఎనిమిది క్రీడా పోటీల్లో ఆరు చోట్ల లీగ్ మ్యాచ్‌లు, ప్రతీ ఆటకూ ఫైనల్స్‌తో కలిపి 6 వారాలపాటూ ఈ పోటీలను నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ దాదాపు 1100 మంది క్రీడాకారులు ఈ మినీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఓ తెలుగు సంస్థ ఇంత పెద్ద క్రీడాపోటీలను నిర్వహించడం అమెరికాలో ఇదే తొలిసారి అని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు తెలిపారు. మే 26న మొదలైన ఈ క్రీడాపోటీలు జూలై 1న క్రికెట్ ఫైనల్స్‌తో ముగిశాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికాయిట్, చెస్, క్యారంస్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడలను ఇర్వైన్, ఈస్ట్ వెల్, వాలెన్సియా, టోరెంస్, సైప్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడియా నగరాల్లో నిర్వహించారు. 145 మంది లాటా కార్యకర్తలు ఈ పోటీలను పర్యవేక్షించారు. యాష్లీ జాన్సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆటల్లో, చదువుల్లో, జీవితంలో అయినా చిన్న చిన్న లక్ష్యాలని సాధించడం ద్వారా ఎంత పెద్ద లక్ష్యం అయినా ఛేదించవచ్చు అని తాను ఒలింపిక్స్‌లో బంగారు పథకం ఎలా సాధించారో వివరించారు. మినీ ఒలింపిక్స్‌ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కృతజ్ఞలు తెలిపారు. అతి తక్కువ ఫీజుతో ఆగష్టు 4, 5 తేదీల్లో స్క్రమ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు కోసం latausa.org వెబ్‌సైట్‌ను సందర్శంచాలని కోరారు. -
ఆటలూ ముఖ్యమే..
మెదక్‌జోన్ : చదువుతో పాటు ఆటలూ ముఖ్యమేనని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ పట్టణంలో ఒక కిలో మీటర్ పరుగు పోటీలను జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఆయన పరుగు పందెం పోటీలను జెండాఊపి ప్రారంభించారు. ఈ పరుగు స్థానిక గుల్షన్‌క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ పరుగులో కలెక్టర్‌తోపాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు, పీఈటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమ యం కేటాయించాలన్నారు. ప్రతిరోజు తను వ్యాయమం చేయనిదే విధులకు హాజరుకానని తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ నుంచి స్టేడియంను, అ«థ్లెటిక్ సెంటర్‌ను తరలించకుండా తగుచర్యలు తీసుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులు కలెక్టర్ కోరారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ రాష్ట్ర క్రీడల అధి కారి దినకర్‌బాబుతో మాట్లాడి ఇక్కడే ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఒలింపిక్ డే రన్–2018 కమిటీ కన్వీనర్ పీడి ఆర్.నాగరాజు మాట్లాడుతూ ఈ రన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రన్ ద్వారా క్రీడల పట్ల అందరికి అవగాహన కల్పించడంతోపాటు క్రీడలపై ఉన్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్, పీఈటీల బృందం జిల్లా కలెక్టర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎస్.నాగరాజు, శ్రీనివాస్‌రావు, సెక్టోరియల్ అధికారి మధుమోహన్, డీవైఎస్ఓ రమేశ్‌బాబు, పలువురు అధికారులు పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహిపాల్, రాజేందర్, నరేశ్, జమాల్, గోపాల్‌గౌడ్, రమేష్, సత్యం, కిరణ్, రూపెందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే..అపాయమే!
‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. అయితే పులితోనే కాదు ఏ జంతువుతో అయినా సెల్ఫీలు, ఆటలు ప్రమాదమే. మచ్చిక చేసుకున్నవైనా, శిక్షణలోనివి అయినా.. క్రూర జంతువుల దగ్గర అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాస్తంత పరధ్యానంగా ఉన్నా, సెల్ఫీల పేరుతో వాటితో ఆటలాడ్డానికి ప్రయత్నించినా అంతే సంగతులు. ఒక్కోసారి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి వాటికి నిదర్శనంగా నిలిచే కొన్ని సంఘటనలివీ.. సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.. ఇది రెండేళ్ల కిందట మన హైదరాబాద్‌లోనే జరిగింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి(35) నెహ్రూ జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ సింహాలున్న ఎన్‌క్లోజర్ ప్రాంతంలోకి హఠాత్తుగా దూకాడు. అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్న ఆ వ్యక్తి సమీపంలోని సింహాలను చూస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకన్నట్లు చేయి చాపాడు. గమనించిన జూ నిర్వాహకులు వెంటనే సింహాల దృష్టిని మరల్చి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించారు. చిన్నారి తలను దొరకబుచ్చుకుంది సౌదీ అరే బియాలోని జెడ్డా లో జరిగింది ఈ సంఘటన. జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్లో భాగంగా పదేళ్ల లోపు చిన్నారులు కొంత మంది ఓ జూ లోకి వెళ్లారు. అక్కడ శిక్షకుడి పర్యవేక్షణలోని ఓ సింహం(ఆరు నెలల వయస్సు) చుట్టూ మూగారు. సరదాగా దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఉన్నట్లుండి ఆ సింహం పిల్ల ఓ చిన్నారిపై దాడికి దిగింది. ఆ చిన్నారి తలను నోట కరుచుకుంది. దీంతో భయపడిన మిగిలిన పిల్లలు దూరం జరిగారు. శిక్షకుడు అతికష్టమ్మీద ఆ చిన్నారిని సింహం పిల్ల నుంచి విడిపించగలిగాడు. ఈ ఘటనలో చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు అక్కడక్కడా కుట్లు పడ్డాయి. ఎన్‌క్లోజర్‌లో దూకి బలయ్యాడు.. మన దేశ రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక్కడి నేషనల్ జులాజికల్ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు హఠాత్తుగా పులుల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఓ తెల్లపులి కంట పడ్డాడు. ఆ పులి ఓ పదిహేను నిమిషాలు అతనిపై దాడికి దిగలేదు. ఈ లోపు మిగిలిన సందర్శకులు దాన్ని బెదరగొట్టడానికి, దాని దృష్టిని మరల్చడానికీ రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసర డం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అది హఠాత్తుగా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి పంజాతో దాడి చేసి చంపి లాక్కెళ్లింది. పులి దాడికి దిగుతుండగా ఆ యువకుడు నమస్కరిస్తూ ప్రాధేయపడిన వీడియో అప్పట్లో సామా జిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. జూ యజమానిపై దాడి.. ఇది రెండు వారాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ జూ నిర్వాహకుడు(85).. సందర్శకులకు జూ చూపిస్తుండగా సింహాల ఎన్‌క్లోజర్‌లో దుర్వాసన రావడం గమనించాడు. వెంటనే పరధ్యానంగా లోపలికి వెళ్లాడు. సమీపంలోనే ఓ సింహం ఉండడం గమనించి గేటు వైపు పరిగెత్తబోయాడు. ఈ లోపలే అతన్ని దొరకబుచ్చుకున్న సింహం..పంజాతో దాడికి దిగి లోపలికి లాక్కెళ్లింది. ఇంతలో సందర్శకుల్లో ఎవరో తుపాకీతో సింహాన్ని కాల్చడంతో ఆ జూ నిర్వాహకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీసుకోవాల్సిన జాగ్రతలు: జూ, అడవుల సందర్శనకు వెళ్లినపుడు అక్కడి సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం, వాటితో సెల్ఫీలు దిగాలనుకోవడం ప్రమాదకరం. అడవి జంతువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. సింహాలు, పులులు లాంటి క్రూర జంతువులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్లకూడదు. జంతువులకు చేత్తో ఆహారపదార్థాలు తినిపించేందుకు ప్రయత్నించకూడదు. జంతువులను భయపెట్టేలా శబ్దాలు చేయకూడదు. పాటలు పెట్టకూడదు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలి వెళ్లకూడదు. -
'గుర్తుకొస్తున్నాయి'... : ఎమ్మెల్యే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : చిన్నప్పుడు ఆడిన గోలీల ఆటను ఒక్కసారి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ రైతు బజార్ పనులను శనివారం పరిశీలించిన ఎమ్మెల్యే తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో అక్క డే గోలీలు ఆడుకుంటున్న చిన్నారులను చూసిన ఆయన పరిశీలిస్తుండగా.. వారు మీరు కూడా ఆడతారా అంటూ అడిగారు. దీంతో ఎమ్మెల్యే వారి వద్ద నుంచి గోలీ తీసుకుని కాసేపు సరదాగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఇలాంటి ఆటలకు ప్రాధాన్యత ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి తరం ఇండోర్ గేమ్స్, కంప్యూటర్లకే పరిమిత మవుతున్నారని తెలిపారు. అయితే, వేసవి సెలవుల సందర్భంగా పిల్లల విషయమై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. -
గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్‌పై మాల్వేర్ అటాక్
శాన్ఫ్రాన్సిస్కో : గూగుల్ ప్లే స్టోర్‌లోని గేమ్స్‌పై పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ అటాక్ చేసింది. ఈ అటాక్ బారితో దాదాపు 60 గేమ్స్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించేసింది. తొలగించిన గేమ్స్‌లో ఎక్కువగా చిన్నపిల్లలు ఆడుకునేవే ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌పై అటాక్ చేసినట్టు ఇజ్రాయిల్‌కు చెందిన సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఫేక్ సెక్యురిటీ సాఫ్ట్‌వేర్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు డిజైన్ చేసినట్టు రీసెర్చర్లు రిపోర్టు చేశారు. గేమ్స్ యాప్‌లో పోర్నో యాడ్స్ ద్వారా ఈ మాల్వేర్ అటాక్ చేస్తుందని, ఒకవేళ వీటిని క్లిక్ చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఈ మాల్వేర్పై అలర్ట్ అయిన గూగుల్, వెంటనే తన ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్‌ను తొలగించింది. ప్లే స్టోర్ నుంచి తాము ఈ యాప్స్‌ను తొలగించామని, డెవలపర్ల అకౌంట్‌ను డిసేబుల్ చేశామని గూగుల్ తెలిపింది. వీటిని ఇన్స్టాల్ చేసుకునే వారికి తాము గట్టి హెచ్చరిక జారీచేస్తున్నామని పేర్కొంది. యూజర్లను సురక్షితంగా ఉంచేందుకు చెక్ పాయింట్స్ చేసిన ఈ పనిని తాము అభినందిస్తున్నామని తెలిపింది. అయితే ఈ మాల్వేర్ ప్రభావానికి యూజర్ల డివైజ్‌లు ప్రభావితం కాలేదని చెప్పింది. మాల్వేర్ ప్రభావానికి గురైన యాప్స్‌ను మూడు నుంచి ఏడు మిలియన్ సార్లు డౌన్లోడ్ అయ్యాయి. వాటిలో ఫైవ్ నైట్స్ సర్వైవల్ క్రాఫ్ట్, మెక్వీన్ కారు రేసింగ్ గేమ్ ఉన్నాయి. -
నేమ్స్‌తో గేమ్స్
ఆటల్లో గాట్లు, కట్లు ఉండనే ఉంటాయి. ఆటల్లో కాకుండా కూడా ఉంటాయిగా!! అదే చిత్రం. గేమ్స్‌లో వచ్చేవాటికి, గేమ్స్‌లో రానివాటికి కూడా గేమ్స్ నేమ్స్ పెట్టారు. ఆసక్తికరమైన ఆ జబ్బుల పేర్లు... మనకు ఎవరికైనా అలాంటివి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఈ నేమ్స్, గేమ్స్! గోల్ఫర్స్ ఎల్బో: దీనిపేరు ‘గోల్ఫర్స్ ఎల్బో’ అయినప్పటికీ గోల్ఫ్ ఆడనివారిలోనూ ఈ సమస్య రావచ్చు. టెన్నిస్ ఆడేవారిలోనూ, క్రికెట్లో బేస్‌బాల్ ఆటలో బౌలింగ్ చేసేవారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. అందుకే కొన్నిసార్లు దీన్ని ‘పిచ్చర్స్ ఎల్బో’ అని కూడా పిలుస్తారు. ఈ సమస్యలో మోచేతి ప్రాంతంలో నొప్పితో పాటు మంట, వాపు (ఇన్ఫ్లమేషన్) కూడా కనిపించవచ్చు. వైద్య పరిభాషలో దీన్ని ‘మీడియల్ ఎపికాండిలైటిస్’ అంటారు. వాహనం నడిపే కారణాలతో మాటిమాటికీ పిడికిలి బిగించి పనిచేయడం, చేతిని ఊపుతూ పనిచేయాల్సి రావడం వల్ల టెండన్ దెబ్బతిని కూడా ఈ సమస్య రావచ్చు. స్క్రూడ్రైవర్లు వాడటం, సుత్తితో కొట్టడం, పెయింటింగ్ చేసేవారిలోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. మన గోల్ఫర్స్ ఎల్బోను టెన్నిస్ ఎల్బో తాలుకు కజిన్‌గా పేర్కొనవచ్చు. అయితే దీనికి ‘టెన్నిస్ ఎల్బో’ అంతటి ప్రాచుర్యం లేదు. ఈ రెండూ మోచేతిలోని టెండన్ల ఇన్ఫెక్షన్ సమస్యతో వచ్చేవే. తేడా అల్లా... టెన్నిస్ ఎల్బోలో మోచేతి వెలుపలి (అంటే బయటివైపు) టెండన్లతో సమస్య వస్తుంది. అదే గోల్ఫర్స్ ఎల్బోలో లోపలివైపు టెండన్లతో వస్తుంది. తగినంత విశ్రాంతి, ఐస్ అద్దడం, కాస్త చేతులు పైకి ఉంచి పడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి నొప్పి నివారణ మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. కొంతమందిలో స్టెరాయిడ్స్ కూడా అవసరమే అయినా అవి డాక్టర్ విచక్షణ మేరకు వాడాలి. టెన్నిస్ ఎల్బో: ‘టెన్నిస్ ఎల్బో’ టెన్నిస్ ఆడేవారితో పాటు చేతితో చాలా ఎక్కువగా పనిచేసేవారిలో ఎక్కువ. వైద్య పరిభాషలో దీన్ని లాటరల్ ఎపికాండిలైటిస్ అంటారు. చెట్లు కొట్టడం వంటివి చేస్తూ ఉండటం, కార్పెంటరీ, మాంసం కొడుతుండే వారిలోనూ ఈ సమస్య వస్తుంటుంది. ఒక్కోసారి గట్టిగా షేక్‌హ్యాండ్ ఇవ్వడం వల్ల కూడా టెన్నిస్ ఎల్బో రావచ్చు. (అందుకే విపరీతంగా, గట్టిగా ఊపుతూ షేక్‌హ్యాండ్ ఇవ్వడం అంత సరికాదు). కొన్ని రకాల వ్యాయామాలు, నొప్పి నివారణ మందులతో దీన్ని నయం చేయవచ్చు. జంపర్స్ నీ : మోకాలిచిప్పకు సంబంధించి తీవ్రమైన నొప్పి వచ్చే పరిస్థితి ఇది. వైద్యపరిభాషలో దీన్ని పటెల్లార్ టెండనైటిస్ అంటారు. సాధారణంగా అథ్లెట్లు ఎదుర్కొనే వేదనల్లో ఇది ఒకటి. తరచూ దుముకుతూ ఉండే సమయంలో ఈ టెండన్ మీద చాలా ఎక్కువ బరువు పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. బాస్కెట్‌బాల్, వాలీబాల్, హైజంప్, లాంగ్ జంప్‌లో ఎగిరి గెంతినప్పుడు కాలిమీద పడ్డ బరువు కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. గట్టి నేల (హార్డర్ సర్ఫేస్) మీద స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవారిలో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువే. రన్నర్స్ నీ : కేవలం పరుగులు పెట్టే క్రీడాకారులకే గాక... మోకాళ్లను చాలా ఎక్కువగా వంచే పనుల్లో ఉండేవారికీ ఇది వచ్చే అవకాశం ఉంది. వాకింగ్, బైక్‌లు నడపడం, గెంతడం వంటివి చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ‘పటెల్లోఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఇది నిర్దిష్టంగా ఏదైనా గాయం కావడం వల్ల కాకుండా మోకాలి దగ్గర నొప్పితో కనిపిస్తుంది. షిన్ స్ప్లింట్ : మోకాలి కింది భాగం నుంచి పాదం మొదలయ్యే వరకు ఉండే భాగాన్ని షిన్ అంటారు. ఏదైనా కారణాల వల్ల ఆ భాగంలో వాపు, ఒక్కోసారి వెంట్రుకవాసి అంతటి పగులు (హెయిల్లైన్ ఫ్రాక్చర్), వెన్నెముక కింది భాగం బలహీనంగా ఉండటం వంటి అనేక అంశాల వల్ల ఈ భాగంలో నొప్పి వస్తుంది. దీన్నే షిన్ స్పి›్లంట్ అంటారు. రన్నింగ్ చేసే క్రీడాకారుల్లో ఇది చాలా సాధారణమైన సమస్య. ఒక్కోసారి తీవ్రమైన వ్యాయామం చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. విపరీతంగా నృత్యం చేసే డాన్సర్లలోనూ ఈ సమస్య వస్తుంటుంది. గేమ్కీపర్స్ థంబ్ (స్కీయర్స్ థంబ్ ) : మన బొటనవేలిని మిగతా వేళ్లతో కలిపి ఉండే మృదువైన కణజాలం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యను స్కీయర్స్ థంబ్ అని అంటారు. అంటే లిగమెంట్స్ అని పిలిచే అక్కడి మృదుకణజాలం గాయపడటం వల్ల ఈ సమస్య వస్తుందన్న మాట. సాధారణం స్కీయింగ్ చేసేవారిలో స్కీయింగ్రాడ్ పట్టుకున్నప్పుడు బొటనవేలు గాయపడటం వల్ల ఈ సమస్య రావచ్చు. అయితే ఆటల్లో గానీ లేదా ఇతరత్రా గానీ బొటనవేలికి బలమైన గాయం తగిలి, అది మిగతా వేళ్ల నుంచి దూరం జరిగేలా బలమైన విఘాతం కలిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. సాధారణంగా ఆటోమొబైల్ యాక్సిడెంట్స్‌లో ఇలా బొటనవేలికి దెబ్బతగిలే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు క్రీడాకారుడి పేరు ఉన్నప్పటికీ ఈ కింద పేర్కొన్నది ఫంగల్ ఇన్ఫెక్షన్తో వచ్చే సమస్య. అథ్లెట్స్ ఫుట్ : ఇది ఒకరకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని వైద్య పరిభాషలో టీనియా పెడిస్ అంటారు. ఇది పాదంలోని బొటనవేలు... ఇతర వేళ్ల మధ్య రావచ్చు. చేతి వేళ్లకూ సోకవచ్చు. అయితే తరచూ కాలివేళ్ల మధ్యే కనిపిస్తుంటుంది. ఇది ఏమంత తీవ్రమైన జబ్బు కాదు. అయితే తగ్గడానికి మొరాయిస్తుంది. అంత తేలిగ్గా తగ్గక బాధపెడుతూ ఉంటుంది. డయాబెటిస్ లేదా తక్కువ వ్యాధి నిరోధకశక్తి ఉన్నవారిలో ఇది మరింత బాధిస్తుంది. ఇటీవల మన క్రీడాకారిణులు సానియా, సైనా నెహ్వాల్, సింధూల సక్సెస్‌లతో ఆటల పట్ల ఆసక్తి, గ్రౌండ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆరోగ్యానికి ఆటలు ఎంత సురక్షితంగా ఆడుకోవడమూ అంతే అవసరం. జాగ్రత్తలు– చికిత్స ఇక్కడ పేర్కొన్న దాదాపు అన్ని సమస్యలకు మొదట తగినంత విశ్రాంతి, ఐసు ముక్కలతో అద్దడం, అవసరాన్ని బట్టి ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో తగిన సపోర్టు ఇవ్వడం, ఫిజియోథెరపీ లాంటి వ్యాయాయ ప్రక్రియల్ని అనుసరించడం వంటివాటితో ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడాలి. చాలా అరుదుగానే కొన్ని సమస్యలకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. క్రీడల పేరు కలిగి ఉన్న మానసిక సమస్యలు ఫీమేల్ అథ్లెట్స్ ట్రెయిడ్ : ఇది ఒక ‘ఈటింగ్ డిజార్డర్’. తాము మరింత సన్నగా ఉంటే రన్నింగ్ వంటి క్రీడల్లో ఇంకా బాగా చురుగ్గా రాణించగలమనే అభిప్రాయంతో కొందరు క్రీడాకారులు తాము తీసుకుంటున్న భోజనం, పోషకాలతో కూడిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తారు. దాని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని భావించి లేనిపోని అనర్థాలు తెచ్చుకుంటారు. ఇలా రన్నింగ్ క్రీడాకారుణులు మాత్రమే కాకుండా ఇదే పని కొంతమంది టీన్స్‌లో ఉన్న యువతులూ చేస్తారు. అయితే సాధారణంగా ఇది క్రీడాకారిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే ఈ పేరు. ఇలా సరిగా తినకపోవడం, అదేపనిగా వ్యాయామాన్ని మాత్రం కొనసాగించడం ఫలితంగా వారు ఒక తిండికి సంబంధించిన ఒక రుగ్మత (ఈటింగ్ డిజార్డర్)ను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిపేరే ఫీమేల్ అథ్లెట్ ట్రెయిడ్. అనొరెక్సియా అథ్లెటికా : దీన్ని ‘హైపర్ జిమ్నాషియా’ అని కూడా అంటారు. ఇది కూడా ఒక రకమైన ఈటింగ్ డిజార్డర్. తమ ఫిగర్ మీద చాలా ఎక్కువగా శ్రద్ధ పెడుతూ, చాలా తక్కువగా తింటూ, చాలా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల తాము ఫిట్‌గా ఉంటామన్న భావనతో అతిగా వ్యాయామం చేసే రుగ్మత ఇది. ఈ రుగ్మత ఉన్నవారు తమకు ఆహారం మీద, వ్యాయామం మీద ఉన్నంత నియంత్రణ జీవితంలోని మిగతా అంశాల మీద లేదని భావిస్తుంటారు. అయితే వాస్తవానికి, విచిత్రంగా వారికి తమ వ్యాయామం, ఆహారం మీదే నియంత్రణ ఉండదు. ఒకసారి ఈ భావన మొదలైన తర్వాత వారు అదేపనిగా వ్యాయామం చేస్తూ, (ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే భావనతో) అదేపనిగా తింటూ ఉంటారు. ఇది బయటపడలేని ఒక వ్యసనంగా మారు తుంది. మానసిక వ్యాధిగా పరిణమించే ఇది ఒక పట్టాన తగ్గదు. సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, అవసరాన్ని బట్టి బిహేవియరల్ థెరపీ వంటి ప్రక్రియలతో ఈ మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. – డాక్టర్ ప్రవీణ్‌రావు, సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్పర్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చైనా ఫోన్లు వాడితే.. కళ్లు పోతాయ్..!?
చైనా ఫోన్లు వాడిదే ప్రమాదమా? చైనా మొబైల్ ఫోన్లలో రేడియేషన్ అధికంగా ఉంటుందా? టచ్ స్క్రీన్లు.. కంటిచూపును దెబ్బతీస్తాయా? చౌక ధరకు అధిక ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు వాడితే.. ఆరోగ్యానికి ప్రమాదమా? చైనా ఫోన్లు వాడితే రెటీనా దెబ్బంతింటుందనే వాదనలు.. వార్తలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి.. ఇవి నిజమేనా? ఇటువంటి వివరాలను తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి. చైనా స్మార్ట్ ఫోన్లు దాదాపు దేశాన్ని ముంచేస్తున్నాయి. పదిమందిలో ఆరుగురి చేతుల్లో కనిపించేవి చైనా ఫోన్లే. తక్కువ ధరతో మ్యాగ్జిమమ్ ఫీచర్లతో వినియోగదారులను ఈ ఫోన్లు కట్టిపడేశాయి. ఈ ఫోన్లను అధికంగా వాడితే ఆరోగ్యానికి, కంటికి ప్రమాదమనే సంకేతాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చైనా ఫోన్లవల్ల మన దేశంలో చాలా కాలంగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయినా మనవాళ్లు వాటిని వినియోగిస్తూనేఉన్నారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో 21 ఏళ్ల అమ్మాయి.. 24 గంటల పాటు మొబైల్ ఫొన్లో గేమ్స్ అడుతూ.. కంటి చూపును కోల్పోయింది. ఈ విషయంలో ఇప్పుడు చైనాలో హాట్‌టాపిక్‌గా మారింది. సుదీర్ఘ సమయంపాటు ఆన్లైన్ గేమ్ అయిన ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్‌ను అమ్మాయి ఆడుతూనే ఉంది. ఆట ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె. కుడి కన్ను పూర్తిగా మసకబారింది. చూపు కోల్పోయిన కంటిని వైద్యులు పరీక్షలు జరిపి ఆశ్చర్యకర విషయాన్ని తెలిపారు. ఇటువంటి వ్యాధిని రెటినల్ ఆర్టెరీ అక్లూషన్ (ఆర్‌ఏఓ)గా పిలుస్తారని చెప్పారు. ఇటువంటి వ్యాధి సాధారణంగా వయసు మళ్లిన వారికి వస్తుందని.. ఇంత చిన్న వయసులో రావడం అరుదని అన్నారు. ఈ అమ్మాయికి చాలా సమయం స్క్రీన్‌కేసి చూడడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చైనాలో ’హానర్ ఆఫ్ కింగ్స్‘ గేమ్‌కు ఫాలోవర్లు లక్షల్లో ఉన్నారు. ఇటువంటి గేమ్స్ ఆడే సమయంలో స్క్రీన్ నుంచి తక్కువ రేడియేషన్ వచ్చే ఫోన్లను వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
మృత్యుపాశాలుగా మారుతున్న గేమ్స్
-
సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్
ఆదిలాబాద్‌కల్చరల్: సాధనతోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రీడాపాఠశాల అకాడెమికి ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన క్రీడాకారులు 34మంది హాజరు కాగా వయస్సు కారణంగా 15మందిని అనర్హులుగా గుర్తించి 15మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు సాధనతోనే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. క్రీడాకారులు కష్టపడితే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. క్రీడా పాఠశాలల్లో చేరితే అన్ని రకాలుగా సౌకర్యాలుంటాయని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.