ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ యానివెర్సరీ ఎడిషన్ నవంబర్ 13 నుంచి 15వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. దక్షిణాసియాలో అతిపెద్ద పురాతనమైన ఈ సదస్సుకు 5,000 మంది ఆహ్వానితులు, 250 కంటే ఎక్కువ మంది వక్తలు పాల్గొంటారు.
సుమారు 150 సెషన్లలో జరిగే ఈ సదస్సులో గేమింగ్ సెక్టార్‌కు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. గేమింగ్ ఇండస్ట్రీలో దిగ్గజం 'జోర్డాన్ వీస్‌మాన్' వంటి ప్రముఖులు ముఖ్య వక్తలుగా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఈయన ఆర్‌పీజీ ఇండస్ట్రీలోని దీర్ఘకాల ఫ్రాంచైజీలైన బాటిల్‌టెక్, మెచ్‌వారియర్, షాడోరన్ సృష్టికర్తగా పేరుగడించారు.
ఈ ఏడాది జరగనున్న ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ).. గతంలో కంటే కూడా భారీగా ఉండనుంది. ఇందులో లేటెస్ట్ గేమ్స్, టెక్నాలజీని ప్రదర్శించే 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఉండనున్నాయి. అవార్డ్స్ నైట్, ఇండీ ఇనిషియేటివ్, పాలసీ రౌండ్ టేబుల్‌లు, వర్క్‌షాప్ కూడా ఈ ఈవెంట్‌లో కనిపించనున్నాయి.
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది ప్రత్యేకంగా ఇన్వెస్టర్-పబ్లిషర్ కనెక్ట్ సెషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వందమంది పెట్టుబడిదారులు దీనికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి. గత సంవత్సరం ఈ సదస్సు 70 కంటే ఎక్కువ డెవలపర్లు, పెట్టుబడిదారులతో 1,800 సమావేశాలను నిర్వహించింది.
ఈ సంవత్సరం ఐడీజీసీ కార్యక్రమంలో 'ఇంటర్నేషనల్ గేమ్ అవార్డ్’లను కూడా అందించనున్నారు. ఇందులో పది రెగ్యులర్ అవార్డ్స్, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గేమింగ్ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్
భారత్‌లో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమకు ఐడీజీసీ సరైన వేదిక. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడానికి, సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి.. పరిశ్రమలోనో ప్రముఖులను, డెవలపర్లతో పాటు ఆవిష్కర్తలను ఒకచోటకు చెరచడానికి సహకరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment