Conference
-
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్ వ్యాక్సిన్‌ను మన తెలుగువాళ్లే తయారు చేశారన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ మహాసభ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. ఏ దేశానికి వెళ్లిన మన తెలుగు వారు కనిపిస్తారన్నారు.మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్ సూచించారు.పరభాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం
రిలయన్స్‌ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించు కున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ (ఐసిహెచ్)లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికాలోని బోస్టన్‌లో జరగనున్న హార్వర్డ్(ICH)లో ప్రధాన వక్తగా పాల్గొంటారని ఇండియా కాన్ఫరెన్స్ ఆదివారం ప్రకటించింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతి పెద్ద ఈవెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ "భారతదేశం నుండి ప్రపంచానికి" అనే థీమ్‌తో ఈ ఏడాది కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రెండు రోజుల పాటు విభిన్న రంగాలకు చెందిన 80 మంది ప్రముఖ వక్తలు పాల్గొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వివిధ గ్రాడ్యుయేట్ , అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. దాతృత్వం, విద్య ,సంస్కృతి రంగాల్లో విశేష సేవలందిస్తున్న నీతా అంబానీ తమ వార్షిక సదస్సులో కీలక ప్రసంగం చేస్తారని హార్వర్డ్ (ఐసిహెచ్)లోని ఇండియా కాన్ఫరెన్స్ ప్రకటించింది. శాంతి, శ్రేయస్సు, నూతన ఆవిష్కరణల్లో ప్రపంచ నాయకుడిగా భారతదేశం ఎదిగినతీరును ‘భారతదేశం నుండి ప్రపంచానికి' పేరుతో నీతా వివరిస్తారని ఐసీహెచ్ తెలిపింది. ఈవెంట్ 2025 ఫిబ్రవరి 15-16 తేదీల్లో బోస్టన్‌లో జరగనుంది. నీతా అంబానీ తన సామాజిక సేవల ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన ఘనతను దక్కించున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల తరువాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ నిర్వహించడంతోపాటు, 2036 ఒలింపిక్ క్రీడా వేదికగా భారత్నునిలపడం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎంపికైన తొలి భారత మహిళ కూడా.ఇదీ చదవండి: కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా? -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
సృజనాత్మకతలో దూసుకుపోతున్న పరిశ్రమ
వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దుఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు. -
హైదరాబాద్‌లో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25 శాతం మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు. నగరంలోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు దీనికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్లైన్లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఇప్పటికి దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్టర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు. -
గేమింగ్ ప్రియులకు శుభవార్త: హైదరాబాద్‌లో జాతీయ సదస్సు
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ యానివెర్సరీ ఎడిషన్ నవంబర్ 13 నుంచి 15వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. దక్షిణాసియాలో అతిపెద్ద పురాతనమైన ఈ సదస్సుకు 5,000 మంది ఆహ్వానితులు, 250 కంటే ఎక్కువ మంది వక్తలు పాల్గొంటారు.సుమారు 150 సెషన్లలో జరిగే ఈ సదస్సులో గేమింగ్ సెక్టార్‌కు సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. గేమింగ్ ఇండస్ట్రీలో దిగ్గజం 'జోర్డాన్ వీస్మాన్' వంటి ప్రముఖులు ముఖ్య వక్తలుగా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఈయన ఆర్పీజీ ఇండస్ట్రీలోని దీర్ఘకాల ఫ్రాంచైజీలైన బాటిల్టెక్, మెచ్వారియర్, షాడోరన్ సృష్టికర్తగా పేరుగడించారు.ఈ ఏడాది జరగనున్న ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ).. గతంలో కంటే కూడా భారీగా ఉండనుంది. ఇందులో లేటెస్ట్ గేమ్స్, టెక్నాలజీని ప్రదర్శించే 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఉండనున్నాయి. అవార్డ్స్ నైట్, ఇండీ ఇనిషియేటివ్, పాలసీ రౌండ్ టేబుల్లు, వర్క్‌షాప్ కూడా ఈ ఈవెంట్లో కనిపించనున్నాయి.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది ప్రత్యేకంగా ఇన్వెస్టర్-పబ్లిషర్ కనెక్ట్ సెషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వందమంది పెట్టుబడిదారులు దీనికి హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని ఒప్పందాలు కూడా జరుగుతాయి. గత సంవత్సరం ఈ సదస్సు 70 కంటే ఎక్కువ డెవలపర్లు, పెట్టుబడిదారులతో 1,800 సమావేశాలను నిర్వహించింది.ఈ సంవత్సరం ఐడీజీసీ కార్యక్రమంలో 'ఇంటర్నేషనల్ గేమ్ అవార్డ్’లను కూడా అందించనున్నారు. ఇందులో పది రెగ్యులర్ అవార్డ్స్, రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గేమింగ్ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ భారత్‌లో అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమకు ఐడీజీసీ సరైన వేదిక. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడానికి, సహకరించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి.. పరిశ్రమలోనో ప్రముఖులను, డెవలపర్లతో పాటు ఆవిష్కర్తలను ఒకచోటకు చెరచడానికి సహకరిస్తోంది. -
9న వలంటీర్ల ఆవేదనా సదస్సు
సాక్షి, విజయవాడ: ఈ నెల 9న వలంటీర్ల ఆవేదనా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఎనిమిది కేబినెట్ మీటింగ్‌లు జరిగినా వాలంటీర్ల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 6వ తేదీన జరగనున్న క్యాబినెట్లో వాలంటీర్లకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, బకాయిపడ్డ ఐదు నెలల గౌరవ వేతనం చెల్లించాలని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. -
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
ఢిల్లీ: ముగిసిన గవర్నర్ల సదస్సు
సాక్షి,ఢిల్లీ: రెండు రోజులపాటు జరిగిన గవర్నర్ల సదస్సు శనివారం(ఆగస్టు 3) ముగిసింది. సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కీలక అంశాలపై రెండు రోజులపాటు సదస్సులో చర్చలు కొనసాగాయి. మహిళా సాధికారత, గిరిజనుల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుకబడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి, ప్రధాని దిశానిర్దేశం చేశారు. -
శంకరన్, శ్రీధరన్‌లా పనిచేయండి: కలెక్టర్లతో సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని కోరారు. మంగళవారం(జులై 16) సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని మీతో జరిగిన తొలి సమావేశంలో ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతీ చర్య. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది’అని రేవంత్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్ ఇతర ఉన్నతాధిరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా @ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు.మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్‌ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి గానీ, మహిళలు, పిల్లల్లోనూ కనిపిస్తుంది.గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక కార్యదర్శి, ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్గంటి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి, ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యూటీఐ, ఎస్టీఐ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే అసలు మూత్రనాళం ఏర్పడదు. ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు క్యాథటర్స్ అమర్చుకోవడం, అదనపు వ్యాధులు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది” అని తెలిపారు. సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే.. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది.ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఏడాదికి 50 కేసులే చేసేవాళ్లం. ఇప్పుడు 200-250 వరకు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో మేం అగ్రస్థానంలో ఉన్నాం. నిపుణుల నుంచి నేర్చుకుని, శిక్షణ పొందడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, వీటిలో వైఫల్యాల రేటు ఎక్కువ. రోగుల కోణం నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు, నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. యూకే, ఉగాండా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, థాయ్ లాండ్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలోనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగణ్యులుగా పేరొందిన పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ప్రధానంగా ఈ సదస్సులో మాట్లాడారు. ఐఎస్బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఏఐఎన్‌యూ గురించి భారతదేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్వర్కులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి.యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మమిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది. యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, రోబోటిక్ యూరాలజీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది. -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్‌లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్‌లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్‌కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతిఆచార్య డా. కె. పద్మరాజుముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులునిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాలు ఈ నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖం తోపాటు ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం, ఇక తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.ఇక విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న,ప్రముఖ సినీగీత రచయితడా. సుద్దాల అశోక్ తేజ,‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమానిడా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి శ్రీ గొడిశాల జయరాజు, గద్దర్కుమార్తె డా. వెన్నెల గద్దర్,అరుణోదయ కళాకారిణిబండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్కుమారులుషేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు(డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీనోమ్ వ్యాలీ రెండో దశను 300 ఎకరాల్లో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ.2 వేల కోట్లతో దానిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. 10 ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసి.. రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, 5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో 21వ బయో ఏసియా–2024 సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జీవవైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాలకు ప్రోత్సహకాలపై వారు చర్చించనున్నారు. ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్.. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ చెప్పారు. ప్రముఖ టకేడా సంస్థ బయోలాజికల్–ఈ సంస్థతో కలసి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. హైదరాబాద్‌లో ఆర్అండ్డీ సెంటర్ ఏర్పాటుకు మిల్టెనీ బయోటెక్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రంగానికి రాజధానిగా మారింది. ప్రపంచంలో మూడు కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే.. అందులో ఒకదాన్ని అందించిన ఘనత హైదరాబాద్‌కే దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా నిలిచింది’’అని సీఎం చెప్పారు. మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం గంటా గంటన్నర ప్రయాణ దూరంలోనే ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందన్నారు. మూడు విభిన్న ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించేలా వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తామని.. అద్భుత మౌలిక సదుపాయాలతో సంపూర్ణమైన వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. స్టార్టప్‌లు, కార్పొరేట్ల మధ్య వారధిగా ఉన్న ఎంఎస్ఎంఈలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిపెడతామన్నారు. ‘‘మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్లా మా ప్రభుత్వం పనిచేస్తుంది..’’అని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నైపుణ్య రాజధానికి హైదరాబాద్: శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ను భారతదేశంలోనే నైపుణ్యం కలిగిన రాజధానిగా మార్చడానికి సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని విద్యార్థులందరికీ పరిశ్రమలతో కలసి పనిచేసే తప్పనిసరి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు. దీనిద్వారా విద్యారంగానికి విలువను అందించేలా కొత్త విప్లవం తీసుకువస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రెగ్యులేటరీ ఏజెన్సీల మధ్య సమ్మిళితమైన కొత్త డైనమిక్ లైఫ్ సైన్సెస్ పాలసీని కూడా తెస్తున్నామన్నారు. పలు దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ బయో ఏషియా సదస్సు సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని వారిని సీఎం కోరారు. వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్‌ను పూర్తి చేస్తామన్నారు. వెస్ట్రన్ ఆ్రస్టేలియా మంత్రి సాండర్సన్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెర్మిజూర్గన్స్, బెల్జియం అంబాసిడర్ డెడిర్ వాండర్ హసక్ తదితరులు సీఎంతో విడివిడిగా సమావేశమయ్యారు. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని, భారత్‌లో తమ తొలి కమర్షియల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నామని వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ ఈ సందర్భంగా వివరించారు. -
చిప్ తయారీకి విధానాలు ముఖ్యం
ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు. మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్‌లోని సణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు. భారత్‌కు అవకాశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్‌లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్‌కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే. -
ఒకే దేశం ఒకే వేదిక
ముంబై/న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల ప్రొసీడింగ్స్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతు న్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ముంబైలో శనివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల కార్యకలాపాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం త్వరలో సఫలమవనుంది. వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది బాటలు వేస్తోంది’’ అని చెప్పారు. శాసనసభ్యుల ప్రవర్తన బట్టే ఆ శాసనసభ ప్రతిష్ట ఇనుమడిస్తుందని మోదీ అన్నారు. ‘‘గతంలో సభాహక్కులను ఉల్లంఘించే సభ్యులను సీనియర్ సభ్యులు మందలించేవారు. ఇప్పుడా పరిస్థితే లేదు. తమ సభ్యులు ఎంతటి ఉల్లంఘనలకు పాల్పడినా పార్టీలు వెనకేసుకొస్తున్నాయి. ఈ సంస్కృతి మంచిది కాదు’’ అన్నారు. ‘‘ గతంలో సభ్యునిపై అవినీతి ఆరోపణలు వస్తే సమా జంలో ఆ సభ్యుడు బహిష్కరణకు గురైనట్లే. ఆ సంస్కృతిని ఇప్పుడు గాలికొదిలేశారు. అవినీతి సభ్యులకు పాపులారిటీ పెరుగుతోంది’’ అన్నారు. యువత చేతుల్లోనే అభివృద్ధి చెందిన భారత్ రూపుదిద్దుకోనుందని మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్సీసీ–పీఎం ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘అమ్మాయిలను సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేసేవారు. వారికి అన్ని మేం రంగాల్లో ద్వారాలు తెరవడంతో తమదైన ముద్ర వేస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో నారీశక్తి ప్రస్ఫుటంగా కనిపించింది’’ అన్నారు. -
ప్రమాణాలపై అవగాహన అవసరం: బీఐఎస్ సదస్సులో వక్తలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ క్లబ్బుల ద్వారా విస్తృత ప్రయోజనాలున్నాయని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఐఎస్ ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ముగిసింది. సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా సాంకేతిక విద్య బోర్డు కార్యదర్శి పుల్లయ్య, బీఐఎస్ సౌత్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యూఎస్పీ యాదవ్, సాంకేతిక విద్యాశాఖ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఏ. స్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన భవితను అందించే ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థి దశలోనే స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన సమాజం ఏర్పడుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. అనంతరం బీఐఎస్ డీడీజీఎస్ యూఎస్పీ యాదవ్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో కీలక భూమిక వహిస్తున్న భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు బీఐఎస్ విస్తృత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే బీఐఎస్ స్టాండర్డ్స్ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాల్ని రూపొందించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం -
వై నాట్ 175పై విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు
-
నేడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణ యించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఆదివా రం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్య ల గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వ నున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి మంగళ, శుక్రవా రాల్లో నిర్వహిస్తుండగా అదే విధానాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు. కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు పాలన ను ప్రజల ముంగిటకు ఎలా తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా వాటికి సంబంధించి కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకొనే అవకాశం ఉంది. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు.. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం, అధికార యంత్రాంగంలో జవా బుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనుండటంతో ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ప్రభు త్వం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని ప్రజా భవ న్లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇళ్లు, భూ సమస్యలు, ఉద్యోగాలు, ధరణి, పెన్షన్లకు సంబంధించి ఎక్కు వగా ఫిర్యాదులు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయి లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గ్రామ సభలకు మొగ్గు చూపిందని చెబుతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు (ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? ప్రజల నుంచి తీసుకోవాల్సిన దరఖాస్తులు, అర్హుల ఎంపిక.. అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లకు వివరించనున్నట్లు సమాచారం. కాగా, ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా సైతం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ నెల 27న ప్రజావాణి వెబ్‌సైబ్‌ను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి 4 నెలలకోసారి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా.. గ్రామ సభల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయి తీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చోట్ల అధికార బృందాలు పర్యటిస్తాయి. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ / కార్పొరేటర్ / కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసు కోనుంది. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖా స్తును పరిశీలించడానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు దరఖాస్తులను కంప్యూటరీ కరించనుంది. -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
చేటు చేసే మీడియా అది
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు చేటు చేస్తుందని ఏపీ సంస్కృత అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగా మేలు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రభుత్వంపై అసత్య కథనాలతో పాఠకులను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని పెన్షనర్స్ భవన్లో ‘తెలుగు మీడియా గమనం–గమ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన అల్లుడు చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు, వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నా, ఈ పత్రికలు విషం కక్కుతున్నాయని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా అద్భుతంగా చేశారని హడావుడి చేశాయన్నారు. కేవలం ఒక వ్యక్తిని, పార్టీని నిలబెట్టే తాపత్రయంతో దాదాపు 10 మీడియా సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ మీడియా కుయుక్తులను తిప్పికొట్టాలని ఇతర పత్రికలకు ఆమె పిలుపునిచ్చారు. ఆ మీడియా తీరు దారుణం : వీవీఆర్ కృష్ణంరాజు ఏపీ ఎడిటర్స్ అసోసియేష¯న్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు మీడియాలోని ఒక వర్గం తీరు అత్యంత దారుణంగా, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ మీడియా సమాచార కాలుష్యాన్ని ఏపీ అంతటా వెదజల్లి, ప్రజల ఆలోచనలను కలుíÙతం చేస్తోందని చెప్పారు. ఏపీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుండగా, చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకంజలో ఉందని అసత్య ప్రచారం చేస్తోందని వాపోయారు. ఆ మీడియాకు చెదలు పట్టింది:న్యాయవాది సుందరరామశర్మ సీనియర్ న్యాయవాది చుండూరు సుందరరామశర్మ మాట్లాడుతూ ఒక వర్గం మీడియాకు చెదలు పట్టాయని అన్నారు. పత్రికలు ప్రభుత్వాలకు వారధిలా ఉండాలని అన్నారు. కానీ కొందరికి కావాల్సిన విధంగా పత్రికలు నడుస్తున్నాయని చెప్పారు. గతంలో తప్పు చేస్తే ఎత్తిచూపడం, మంచి చేస్తే పట్టం కట్టేవారని చెప్పారు. ఈనాడు వచి్చన దగ్గర నుంచి జర్నలిజంలో విలువలు తగ్గాయని ఆరోపించారు. సాక్షి పేపర్ రాకపోతే నాణానికి రెండో వైపు కనిపించేదికాదని అన్నారు. తెలుగు మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 దుష్టచతుష్టయమని అన్నారు. ఈ మీడియా వైరస్‌కు ప్రజలు దూరంగా ఉండాలని చెప్పారు. ప్రజలు చైతన్యం కావాలి :ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వాస్తవానికి తెలుగు మీడియా, దేశీయా మీడియా ఒకేలా ఉన్నాయని, ఒకరికే కొమ్ముకాస్తున్నాయని అన్నారు. ప్రజల్లోకి ఏం సమాచారం తీసుకెళ్లాలనేది వారే నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై అబద్దాలు, తప్పులు ఎక్కడున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే అసత్య కథనాల ఒరవడి ఆగదని అన్నారు. -
విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల ప్రారంభం (ఫొటోలు)
-
ఏపీకి అవకాశం.. అదృష్టంగా భావిస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: అసామాన్యులకు సత్కారం -
ప్రపంచాన్ని తాకిన ‘వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్’ ఘుమఘుమలు
‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్‌లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, స్టార్టప్ సమ్మిట్లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
విశాఖలో నేడు ఎనిమిది రాష్ట్రాల డీజీపీల సదస్సు
-
కేసీఆర్.. మీ పార్టీ సిద్ధాంతం ఏంటో?: అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. తాము అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో మేధావుల సదస్సులో మాట్లాడిన అమిత్‌షా.. కేసీఆర్ తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలన్నారు. ఆయన లక్ష్యం కూతురును జైల్‌కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం. బీజేపీ సిద్ధాంత పార్టీ. విదేశాల్లో భారత్ గౌరవం పెరిగింది. 2014కు ముందు దేశంలో అశాంతి ఉండేది’’ అని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న ఆయన.. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా అభివర్ణించిన అమిత్‌షా.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది’’ అంటూ అమిత్‌షా ఎద్దేవా చేశారు. ‘‘వచ్చే ఐదేళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది.. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీపైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ‘‘కరోనా టైమ్‌లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్లు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంపాదించుకున్నాడు. నీళ్లు ఇవ్వలేదు.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. దేశాన్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్లే మోదీతో తెలంగాణ ఉంటుందా.. కొడుకును సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్‌తో ఎప్పుడు కలిసేది లేదు.. కలిసి వెళ్లేది లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది. అభివృద్ది తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. అంతకు ముందు ఆదిలాబాద్ జనగర్జన సభలో ప్రసంగించిన అమిత్‌షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్‌లో నినాదిస్తే.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వినిపించాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. చదవండి: కేసీఆర్‌ను గద్దె దించండి: అమిత్‌షా -
వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది: సీఎం జగన్
-
ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై సదస్సు: సీఎం జగన్ ఏమన్నారంటే..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. సదస్సులో సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోంది. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించింది. ►కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ►మా ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా... మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 నుంచి 50 కి తగ్గింది. ►ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లతో పంచుకుంటుంది. పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది. నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్‌ఫోర్స్‌లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి మాకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్కఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ... సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ►స్ధిరమైన అభివృద్ధి మరియు సామాజిక, ఆర్ధిక పురోగతి మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కీలక పరిష్కారాలు అని నేను ధృఢంగా విశ్వసిస్తున్నాను. పేదరికం, అవిద్య, అందుబాటులో లేని వైద్యం మరియు సమాజాన్ని పీడిస్తున్న పరిమితమైన ఉపాధి అవకాశాలే తీవ్రవాదానికి అత్యంత అనుకూల అంశాలు. సమర్ధవంతమైన విధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే దీన్ని రూపుమాపగలం. ►ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 2020–21 నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 9,371 ఎకరాల్లో గంజాయి సాగను ధ్వంసం చేశారు. 224 కేసులు నమోదు చేసి, 141 మంది నిందితులను అరెస్టు చేశారు. దాదాపు 3.24 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. నిరంతరాయంగా చేస్తున్న ఈ ఆపరేషన్ వల్ల.. 2022లో గంజాయి సాగు 1500 ఎకరాలకు తగ్గిందని, ప్రస్తుత సంవత్సరం అంటే 2023లో అది కేవలం 45 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ►గంజాయి సాగు చేసే గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం, పోలీసులు గంజాయి సాగు చేపడుతున్న గిరిజనులతో సంప్రదించి.. వారికి ప్రత్యామ్నాయ పంటలైన కాఫీ, నిమ్మ, జీడి మామిడి, నారింజ, కొబ్బరి, చింతపండు, సిల్వర్ ఓక్తో పాటు రాజ్మా, కందిపప్పు, వేసుశెనగ వంటి పంటలసాగును ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తోంది. తద్వారా వారిని గంజాయి సాగు నుంచి మరల్చే ప్రయత్నం చేస్తోంది. ►ఆర్ఓఎఫ్ఆర్.. అటవీ ప్రాంతంలో అర్హులైన 1.54 లక్షల మంది గిరిజన రైతులకు 3.22 లక్షల ఎకరాల మేరకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీచేశాం. వారి భూములను సాగు చేసుకునేందుకు మద్ధతుగా, పెట్టుబడి ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసాగా రూ.13,500 ఆర్ధిక సహాయం అందజేస్తోంది. ►మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారులతో అనుసంధానం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో మేము వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజమ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ స్కీం కింద ఇప్పటికే 1087 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసాం. ►ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా, పారదర్శకంగా త్వరితగతిన అందజేయడం కోసం మేము 897 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో భాగంగా మొబైల్ కనెక్టివిటీ పెంచడం కోసం 944 కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేశాం. ►వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో విద్య ప్రధానమైనది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆంధ్రప్రదేశ్‌లో 28 ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది. వాటిలో 24 పాఠశాలలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా మా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోంది. దీనితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం 1953 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు, 81 గురుకుల పాఠశాలలు, 378 ఆశ్రమ పాఠశాలలతో పాటు 179 ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తోంది. ►వీటిని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల కల్పిస్తూ... డిజిటలైజేషన్ పరంగా తరగతిగదులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తున్నాం. మరోవైపు పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు, వారికి ఆర్ధిక సహాయం అందించేందుకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి రూ.15,000 అందిస్తున్నాం. ►మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంవలను బలోపేతం చేయడానికి, మా ప్రభుత్వం కొత్తగా 879 విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు గిరిజన ప్రాంతాల్లో 75-108 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. 89 మొబైల్ మెడికల్ యూనిట్ల(104) ద్వారా గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను కూడా ప్రవేశపెట్టాం. ►సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులకు ఆరోగ్య పించను కింద నెలకు రూ.10వేలు అందజేస్తున్నాం. వృద్ధ్యాప్య ఫించను కింద గిరిజన ప్రాంతాల్లో 50 ఏళ్లనుంచే నెలకు రూ.2750 ఇస్తున్నాం. ►మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. గిరిజన ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలను పెంచాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దీని కోసం ఈ మావో ప్రభావిత జిల్లాల్లో కనీసం 15 కొత్త బ్యాంకు శాఖలు మంజూరు కావాల్సి ఉంది. ►గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్లో సిఫార్సు మేరకు వైజాగ్‌లో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని సైతం కేటాయించి దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దీనిని వీలైనంత త్వరగా మంజూరు చేయగలరు. ►వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, శాంతిని సాధించడం, వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించకుండా నిరోధించడం కోసం కేంద్ర, రాష్ట్రాల నడుమ నిరంతరం పరస్పర సహాయ సహకారాలు అవసరం. ►ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ... వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు.. అక్కడ పోలీసు బలగాల ఆధునీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్ధిక మరియు వ్యూహాత్మక మద్ధతును కేంద్రం అందించడం అన్నది చాలా కీలకం. ►హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ధృడమైన మార్గదర్శకత్వం, మద్దతుతో మేము మా రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను విజయవంతంగా రూపుమాపుతామని, మా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని నేను విశ్వసిస్తున్నాను. చదవండి: నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం -
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి హాజరైన సీఎం వైఎస్ జగన్
-
ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచేయాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలో మళ్లీ కొత్తగా ఉగ్ర గ్రూపు ఏర్పడకుండా కఠినమైన వైఖరిని అవలంబించాలని ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను కోరారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు అన్ని విభాగాలు ఉమ్మడిగా ముందుకు సాగాలన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రెండు రోజుల జాతీయ ఉగ్ర వ్యతిరేక సదస్సునును అమిత్ షా ప్రారంభించి, ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీలు, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, డ్రగ్స్– ఉగ్ర లింకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. ఎన్ఐఏ, ఉగ్ర వ్యతిరేక బృందాలు, రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లు కేవలం కేసుల దర్యాప్తునకే పరిమితం కారాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తమ పరిధిని దాటి వినూత్నవిధానాలను ఆలోచించాలని కోరారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే క్రమంలో అంతర్జాతీయ సహకారంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు, వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్రం పలు డేటా బేస్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎన్ఐఏ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధికార క్రమం, నిర్మాణం, విచారణ, కార్యాచరణ విధానం ఏకరీతిగా ఉండాలన్నారు. 94 శాతం కంటే ఎక్కువగా నేరారోపణ సాధించిన ఎన్ఐఏ కృషిని షా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్ సముద్రగుప్తతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగామన్నారు. -
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్‌యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్‌రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్‌యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్‌యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్‌యూ -
నేడు వర్సిటీలతో గవర్నర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ‘చాన్స్‌లర్ కనెక్ట్స్ అల్యూమినీ’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు. సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సిటీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి
సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోను బలంగా ఉందని చాటిచెప్పారు. ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎస్డీజీ సమ్మిట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు వీరు హాజరయ్యారు. యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్ అమ్మాజాన్ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌పై వారు ప్రసంగించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి.. ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్ హాబిటాట్, యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్, సివిల్ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్ఎఫ్, యూత్ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్–పేరెంట్ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది. ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారని అమ్మాజాన్ తెలిపింది. షకిన్‌కుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. -
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్‌కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్‌కుమార్ మిల్లెట్స్‌తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్‌పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్ బి.అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు. – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా రిమాండ్ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు. – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్ చెప్పడం దురదృష్టకరం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్డీఎఫ్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. – విఠల్ రావు, సీనియర్ న్యాయవాది సూత్రధారులకు శిక్ష తప్పదు ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు. – జయరాజ్, మాజీ పీపీ తీర్పులకు వక్రభాష్యం తగదు తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్ అసోసియేషన్ -
UNO సదస్సుకు ఎంపికైన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
-
నేటి నుంచి జీ–20 వ్యవసాయ సదస్సు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: ఈ ఏడాది జీ–20 సమావేశాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ‘వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం’అనే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్’, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలు సెప్టెంబర్ 4, 6 తేదీల మధ్య జరగనున్న ఈ చర్చలకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే హజరు కానున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్లో 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అంశాలపై చర్చలు జరపనున్నారు. జీ–20 సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రతినిధులు భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్యకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌ను సందర్శించనున్నారు. విదేశీ ప్రతినిధులకు దేశ సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో వారిని హైదరాబాద్‌లోని శిల్పారామానికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ప్రతినిధులందరూ ఐసీఏఆర్ క్రిడాలోని పరిశోధన క్షేత్రంలో పంటలను, వాటి నిర్వహణ పద్ధతులను పరిశీలించనున్నారు. -
'గ్లోబల్ ఇండియాఏఐ' తొలి సదస్సు ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ)కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా తొలిసారి ’గ్లోబల్ ఇండియాఏఐ 2023’ సదస్సును నిర్వహించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా ప్రణాళికలు ఉన్నట్లు మెయిటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ పరిశ్రమ వర్గాలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటారని వివరించారు. ఏటా తప్పనిసరిగా పాల్గొనాల్సిన ముఖ్యమైన కార్యక్రమంగా అంతర్జాతీయ ఏఐ పరిశ్రమ భావించేలా .. దీన్ని తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. కేంద్రం నిర్వహించిన సెమీకాన్ ఇండియా రెండు ఎడిషన్లతో భారత్‌కు అంతర్జాతీయ సెమీకాన్ మ్యాప్‌లో పటిష్టమైన చోటు దక్కిందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. అదే విధంగా, గ్లోబల్ ఇండియాఏఐ కూడా భారత ఏఐ వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందించగలదని చంద్రశేఖర్ తెలిపారు. -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
'కాళేశ్వరం అవినీతిపై యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైంది..'
హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి మీద యాక్షన్ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ అన్నారు. తొందరలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు వస్తుందని చెప్పారు. తమ పార్టీలోకి వచ్చే వాళ్ళే తప్ప.. వెళ్ళే వారు లేరని అన్నారు. బీజేపీలో చేరేవారిని ఈ నెల 27న అందరూ చూస్తారని పేర్కొన్నారు. నేటి ప్రెస్ మీట్ ట్రైలర్ మాత్రమే.. మూవీ త్వరలో చూపిస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్.. 9 ఏళ్లలో టీచర్, యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్ చేయలేదని మండిపడ్డారు. ఇచ్చిన నోటిఫికేషన్ లోనూ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసిఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత , సంతోష్, హరీష్ రావు లకు మాత్రమే ఎంప్లాయిమెంట్ దొరికిందని అన్నారు. కేసిఆర్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రతిపక్షాల ముందస్తు అరెస్టు చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ దుయ్యబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అడ్డుకుని అరెస్ట్ చేయడం ఎంటని మండిపడ్డారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని అన్నారు. బీజేపీకి భయపడే తమ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Hanumanth Rao Warns Harish Rao: సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా... మైనంపల్లి హనుమంత రావు -
ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని
ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లాలోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్‌కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్లైన్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కులకు గాను 94 మార్కులు సాధించి ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం. -
సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు సమకూరుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. బోధనలోనూ అత్యాధునిక పద్ధతులతో విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో స్కూళ్ల తీరుతెన్నులనే మార్చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, తరగతిలో వారి పరిస్థితిని తల్లిదండ్రులు తెసుకునేందుకు పేరెంట్ – టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పేరెంట్–టీచర్స్ సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మాటివ్ అసెస్మెంట్ అనంతరం పిల్లల ప్రగతిని తల్లిండ్రులకు వివరించేందుకు గురువారం 45,219 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు జరిగాయి. రెండురోజుల క్రితమే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పనులను సైతం పక్కనబెట్టి పాఠశాలలకు వచ్చారు. మొదటి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది తల్లిదండ్రులు హాజరై బడిలో వారి పిల్లల ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం వారి పిల్లల కోసం చేస్తున్న మంచిని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు 30 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి తల్లిదండ్రులు హాజరవడం.. పిల్లల మేలు కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనకు అద్దం పట్టింది. పూర్తి స్నేహపూరిత వాతావరణంలో జరిగిన ఈ సమావేశాల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్న వైనాన్ని, పాఠశాలల్లో కలి్పంచిన సౌకర్యాలను, విద్యా విషయక మార్పులను, సాధించిన పురోగతిని ఉపాధ్యాయులు తల్లిండ్రులకు వివరించారు. ఇంటి వద్ద పిల్లలు ఎలా మసలుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్స్ అనంతరం పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఉంటాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి సమావేశాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇవి తమ బాధ్యతను మరింత పెంచిందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ బడుల్లో ఎన్ని మార్పులు వచ్చాయో స్వయంగా చూశామని, ఈ పథకాలు, సమావేశాలు కొనసాగించాలని కోరారు. ఇంత బాగుంటుందని అనుకోలేదు మా అమ్మాయి భవాని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇక్కడ ఎలా ఉంటుందో, ఏం తింటుందో అని బెంగగా ఉండేది. మా ఊరు దూరమైనా బిడ్డ బాగుకోసం వచ్చాను. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి. ఎలా చదువు చెబుతున్నారో చెప్పారు. పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఈ సమావేశం లేకపోతే ఈ విషయాలు తెలిసేది కాదు. ఇది చాలా మంచి కార్యక్రమం. – కొర్ర తిలో, నిమ్మపాడు, చింతపల్లి మండలం ఎలా చదువుతుందో తెలుసుకున్నా నాతవరం మండలం గునుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా అమ్మాయి ఆశ్రిత ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మీటింగ్‌లో ఫార్మెటివ్ పరీక్ష ఫలితాలను మాకు తెలియజేశారు. మా పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పారు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ స్కూల్లో ఇలాంటి సమావేశాలు జరగలేదు. ఇప్పుడు మా బాధ్యత ఏంటో తెలిసింది. పిల్లలు కూడా జాగ్రత్తగా చదువుతారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి. – సాంబారు గోవింద, గునుపూడి, అనకాపల్లి జిల్లా -
శ్వేతసౌధానికి మన ప్రభుత్వ బడి విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదింటి విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో రాణించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా.. మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివే పది మంది విద్యార్థులకు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం వచ్చింది. తొలిసారి విద్యార్థులకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ను సందర్శించే చాన్స్ లభించింది. సెపె్టంబర్లో అమెరికా వెళ్లనున్న మన విద్యార్థులు ఆనెల 17 నుంచి 27 వరకు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యమితి ప్రధాన కార్యాలయంలో స్థిర అభివృద్ధి అనే అంశంపై జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల్లో విద్యావిధానం, కల్పించిన అవకాశాలపై చర్చించనున్నారు. ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, ‘మనబడి నాడు–నేడు’ పథకంతో మారిన పాఠశాలల పరిస్థితులు, వసతులు, ఇంగ్లి‹Ùలో బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫలితంగా వచ్చిన మార్పులపై మన విద్యార్థులు సదస్సులో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీలో జరిగే సదస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రసంగించే అవకాశాన్ని ఆ వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎడ్యుకేషన్) డైరెక్టర్ రాధికా అయ్యంగార్ కల్పించారు. ఈమేరకు గురువారం యూఎన్వో స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్‌కు అధికారికంగా తెలిపారు. అలాగే వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా మన విద్యార్థులు మాట్లాడే అవకాశం లభించిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై వివిధ దేశాల ప్రతినిధులు అభినందనలు తెలుపుతున్నారని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించడంపై స్వయంగా వివరించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సెపె్టంబర్లో జరిగే సదస్సుకు తీసుకెళతామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఇదో అద్భుత అవకాశంగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసి యా అఫైర్స్ విభాగం అవకాశం కల్పించిందన్నారు. త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ నేతృత్వంలో అమెరికా సందర్శించే విద్యార్థులను ఎంపిక చేస్తామని షకిన్ కుమార్ తెలిపారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. అందుకు అనుగుణంగా టోఫెల్, డిజిటల్ విద్య, స్మార్ట్ బోర్డుల బోధన, భాషా నైపుణ్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే స్వయంగా ప్రపంచ వేదికపై తెలియజేస్తారని ఆయన వివరించారు. -
24న స్టార్టప్‌ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్‌లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
సుపరిపాలనకు సమష్టిగా కృషిచేయండి
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
ఎన్ఈపీతో ‘ప్రాక్టికల్’ బోధన
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అఖిల భారత ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కొత్త జాతీయ విద్యా విధానంతో (ఎన్ఈపీ) బోధనలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలు చూసీ బట్టీ పట్టడమే ఉండేదని కానీ ఈ కొత్త విద్యావిధానం ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని అన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రాథమిక విద్య విద్యార్థులకు వారి వారి మాతృభాషలోనే ఉండాలని అప్పుడే విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికి వస్తాయని చెప్పారు. మన దేశంలో ఆంగ్ల భాషలో బోధనకే అధిక ప్రాధాన్యం ఉందని ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లోని ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఎన్ఈపీతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ వివరించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్షకు తావు లేదు గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ప్రారంభోత్సవంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల్లో కుల, మత వివక్షకు తావు లేదని అర్హులైన అందరికీ అవి చేరుతున్నాయని చెప్పారు. నిజమైన లౌకికవాదం ఉన్న చోట వివక్ష కనిపించదని అన్నారు. అందరూ సంతోషంగా ఉండడానికి కృషి చేయడం కంటే మించిన సామాజిక న్యాయం మరోటి లేదని అభిప్రాయపడ్డారు. 70% మంది మహిళల సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఒక పనిముట్టులా నిలిచిందని ప్రభుత్వ పథకాలన్నీ నూటికి నూరు శాతం లబ్ధి దారులకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. -
హైదరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఆర్‌ఎం సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల నిర్వహణ సంస్థల సమాఖ్య ఎస్హెచ్ఆర్ఎంకి సంబంధించిన ’ఎస్హెచ్ఆర్ఎంటెక్23’ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో 120 పైచిలుకు వక్తలు, 4,000 పైగా హెచ్ఆర్, టెక్నాలజీ నిపుణులు పాల్గొంటున్నారు. సంబంధిత అంశాలపై 60 పైగా సెషన్లు నిర్వహిస్తున్నారు. కొత్త ధోరణులు, నవకల్పనల గురించి హెచ్ఆర్ నిపుణులు చర్చించుకునేందుకు ఇది వేదికగా ఉపయోగపడగలదని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. సాంకేతిక పురోగతి, దాని పరిణామాలు మానవ సామరŠాధ్యలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని కోవీలింగ్ అండ్ ఫ్రాంక్లిన్కోవీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎంఆర్ కోవీ తెలిపారు. టెక్నాలజీ వినియోగంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
ఆర్థిక నేరాలకు మార్గదర్శితో ముగింపు!: ఉండవల్లి అరుణ్‌కుమార్
సాక్షి, విశాఖపట్నం: రిజిస్టర్ చేయకుండా చిట్‌ఫండ్ నిర్వహించిన కేసులో మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు గతంలో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, అప్పటి నుంచి ఆయన మోసాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. మార్గదర్శి కేసుతోనైనా దేశంలో ఆర్థిక నేరాలకు ఫుల్స్టాప్ పడాలని వ్యాఖ్యానించారు. 17 ఏళ్లుగా కొనసాగుతున్న మార్గదర్శి కేసు ఇక ముగిసిన అధ్యాయం అనుకున్న తరుణంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ సీఎం వైఎస్ జగన్ వేసిన ఎస్ఎల్పీ పిటిషన్‌తో కొత్త ఊపిరి వచ్చిందని, లక్షల మంది ఖాతాదారులకు ధైర్యం వచ్చిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం స్వర్ణాంధ్రవేదిక ఆధ్వర్యంలో ‘రామోజీరావు మార్గదర్శి అక్రమాలు– నిజానిజాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు. ఎవరికి ఫిర్యాదు చేయాలి?: ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ 17 ఏళ్ల తరువాత డబ్బులు ఎవరికి ఇచ్చారో వెల్లడించాలని మార్గదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఘన విజయం సాధించామని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. జూలై 18కి కేసు వాయిదా వేశారు. చాలా ఏళ్లు న్యాయస్థానాల్లో కేసు ఏమిటనేది వినే పరిస్థితి రాలేదు. 2021లో హైకోర్టులో కేసు కొట్టివేసిన తర్వాత ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)దాఖలు చేశా. ఏడాది తర్వాత ఏపీ ప్రభుత్వం నేరుగా ఎస్ఎల్పీ వేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన టైమ్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయడంతో నాకు నమ్మకం వచ్చింది. ఈ కేసు కథ ముగిసిపోతుందనుకున్న తరుణంలో వైఎస్ జగన్ వేసిన ఎస్‌ఎల్‌పీతో మళ్లీ మొదలైంది. దివంగత వైఎస్సార్ అనుకున్నది రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి చేయలేకపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎవరికి డబ్బులు చెల్లించారనే వివరాలు బయటకు వస్తే ఈ కేసు ఈడీకి వెళ్తుందా? మనీ ల్యాండరింగ్‌కు కిందకు వెళ్తుందా? చెల్లించిన డిపాజిటర్లు ఎవరు? అనే విషయాలు బయటకు వస్తాయి. మొత్తం 2.36 లక్షల మంది పేర్లు బయటికి వస్తాయి. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఇష్యూ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని రామోజీ అంటున్నారు. చిట్ డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పోలీస్ స్టేషన్లో ఇస్తే తీసుకుంటారా? కలెక్టరేట్లో తీసుకుంటారా? అదే బాటలో ధనలక్ష్మి, కార్తికేయ... రామోజీని చూసి మిగిలిన చిట్స్ కూడా మోసాల బాట పడుతున్నాయి. రామోజీ ఏం చేస్తున్నారో అందరూ అదే చేస్తున్నారు. మూడు నెలల క్రితం కాకినాడలో ధనలక్ష్మి సొసైటీ, నెల క్రితం కార్తికేయ సొసైటీ మూతపడ్డా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఎర్రన్నాయుడి వియ్యంకుడైన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడిని ఇదే మోసం కారణంగా అరెస్టు చేశారు. రామోజీని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు తీర్పు వచ్చింది. మరి అలాంటప్పుడు అప్పారావును ఎందుకు అరెస్టు చేశారని ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు? ఇద్దరికీ చెరో నీతా? రామోజీని ఇంటికెళ్లి విచారిస్తారు.. అప్పారావును ఎందుకు అరెస్టు చేస్తారు? అని అడగాలి కదా! ఆదిరెడ్డి అప్పారావు ఏమైనా పర్వాలేదు కానీ రామోజీకి ఏమీ జరగకూడదని టీడీపీ స్టాండ్ తీసుకుంది. అబిడ్స్ స్టేషన్లో రామోజీ.. ఈనాడుకు మొట్టమొదటి ఎడిటర్ ఉన్న ఏబీకే ప్రసాద్‌కు ఫోన్ చేస్తే.. ఏ పర్మిషన్ లేకుండా చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారన్న ఆరోపణలపై రామోజీరావు నాలుగు రోజుల పాటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న కొత్త విషయాన్ని చెప్పారు. ఆ తర్వాతే మార్గదర్శిని రిజిస్టర్ చేశారట. జీవీ రెడ్డి మార్గదర్శిపై చర్చకు వస్తామని ప్రకటించారు. కానీ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ని ఈ నెల 14న టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పేరుతో బుక్ చేసుకున్నారు. రామోజీ కోసం ఏమైనా చేస్తామని తద్వారా టీడీపీ నేరుగానే చెబుతోంది. రెండు దశాబ్దాల నిరంకుశత్వం రామోజీ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న మార్గదర్శితో ఈ వేదికపై ఉన్నవారెవరికీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఈనాడైనా.. చిత్తు కాగితాలైనా.. పచ్చళ్లైనా.. పరిశ్రమలైనా.. చిట్స్ అయినా.. తానే చేయాలన్నదే రామోజీరావు కాన్సెప్ట్. చిన్నవాడెవడూ బతకకూడదు. ఆయనకి యాడ్స్ ఇవ్వకపోతే వ్యతిరేకంగా వార్తలు రాయడం నిత్యకృత్యమైంది. బలవంతుడైన రామోజీతో పోరాటం చేయడం చిన్నవిషయం కాదు. అధికార శక్తి, మీడియా శక్తి ఏకమైతే ఎంత భయంకరంగా ఉంటుందో గత రెండు దశాబ్దాలుగా రామోజీ రూపంలో చూస్తున్నాం. మార్గదర్శి అక్రమాలపై త్వరలో తిరుపతిలో సదస్సు నిర్వహిస్తాం. – కేబీజీ తిలక్, స్వర్ణాంధ్ర దినపత్రిక ఎడిటర్ ‘చంద్రమతి మాంగల్యం’.. మార్గదర్శి ఆస్తులు! డిపాజిటర్లు మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి డిపాజిటర్లను కాపాడింది. కొత్త అప్పులు రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్లకు గుదిబండగా మారనున్నాయి. అనుబంధ కంపెనీలకు నిధులు ఎలా బదలాయిస్తారు? ‘చంద్రమతి మాంగల్యం’ మాదిరిగా ఆస్తులు వారికి మినహా ఇతరులకు కనపడటం లేదు. అగ్రిగోల్డ్, సహారా మోసాలు జరిగిపోయాయి. మరిన్ని జరగకుండా నివారించడం మన బాధ్యత. నిజంగా డిపాజిటర్లకు చెల్లించి ఉంటే సుప్రీం ఆదేశాల ప్రకారం వివరాలను వెల్లడించాలి. డిపాజిట్ రసీదుపై రామోజీరావు సంతకం ఉంటుంది. డిశ్చార్జ్ రసీదుపై ప్రొప్రైటర్ సంతకం చేయడం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేపట్టాలి. – శర్మ, ప్రముఖ న్యాయవాది. బ్రహ్మయ్య కంపెనీలో వందల ఫిర్యాదులు మార్గదర్శి, డాల్ఫిన్, ప్రియా ఫుడ్స్, ఈనాడుతో 1979 నుంచి నాకు అనుబంధం ఉంది. ఉండవల్లి పోరాటం జరిగిన తర్వాత రామోజీ మోసాలు ప్రతి ఒక్కటీ గుర్తుకొచ్చాయి. 100 టన్నుల న్యూస్ ప్రింట్ పేపర్ దిగుమతి చేసుకుంటే 90 టన్నులు మాత్రమే వినియోగించేవారు. ఇలాంటి ఎన్నో మోసాలు నా కళ్లముందే జరిగాయి. మా మామయ్య కేఎస్ రెడ్డి అన్నదాత ఎడిటర్‌గా ఉండేవారు. రామోజీ ప్రజల డబ్బులతో హోటల్స్.. ప్రింటింగ్ ప్రెస్‌లు, బిల్డింగ్లు కడుతున్నారని, చివరకు ఏమవుతుందోనని మామయ్య ఆందోళన చెందేవారు. చట్టాల్లో లొసుగులను అడ్డు పెట్టుకొని తప్పించుకోవడం రామోజీరావుకి వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ నుంచి వచ్చిన జీవీ రెడ్డికి, మార్గదర్శికి ఏం సంబంధం? మా గ్రామంలో ఒక వ్యక్తికి చిట్ అయిపోయిన 9 ఏళ్ల తర్వాత డబ్బులిచ్చారు. నేను ఆడిట్ చేసిన సమయంలో బ్రహ్మయ్య అండ్ కంపెనీలో మార్గదర్శిపై కొన్ని వందల కంప్లైంట్స్ ఉన్నాయి. – నాగార్జునరెడ్డి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
ఆహార సంక్షోభానికి ‘చిరు’ పరిష్కారం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలు పరిష్కారం కాగలవని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేగాక తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలను కూడా ఇవి దూరం చేస్తాయన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో చిరుధాన్యాల వాడకం 5 నుంచి 6 శాతమే ఉంది. దీన్ని ఇతోధికంగా పెంచి, ఆహారంలో చిరుధాన్యాలు తప్పనిసరిగా మారేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. అందులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం నేడు రెండు రకాల ఆహార సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాల్లోనేమో పేదలకు తినడానికి తిండి దొరకని దుస్థితి! ఉత్తరార్ధ గోళంలోనేమో తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రోగాలు కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. ఒకచోట ఆహార సంక్షోభం. మరోచోట అలవాట్ల సమస్య. సాగులో రసాయనాల మితిమీరిన వాడకంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వీటన్నింటికీ చిరుధాన్యాలు చక్కని పరిష్కారం’’ అని వివరించారు. పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిరుధాన్యాలకు స్థానం కల్పించాలన్నారు. అలాగే పొలం నుంచి మార్కెట్ దాకా, ఒక దేశం నుంచి మరో దేశం దాకా చిరుధాన్యాలకు పటిష్టమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్న రైతులకు భాగ్యసిరి చిరుధాన్యాలు గ్రామాలు, పేదలతో ముడిపడి ఉన్నాయని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అవి సిరులు కురిపించగలవని అభిప్రాయపడ్డారు. ‘‘దాదాపు 2.5 కోట్ల మంది రైతులు వీటిని పండిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చిరుధాన్యాల ప్రచారం వారికి ఎంతో మేలు చేయనుంది. వీటిని రసాయనాల అవసరం లేకుండా, తక్కువ నీటితో పండించవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల సమస్యకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. గనుకనే వీటికి శ్రీ అన్న అని నామకరణం చేశాం’’ అని చెప్పారు. చిరుధాన్యాలు దేశమంతటా సమగ్ర ఆహారపుటలవాట్లకు మాధ్యమంగా మారుతున్నాయన్నారు. భారత్ తన వ్యవసాయ పద్ధతులను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. చిరుధాన్యాలపై 500కు పైగా స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా పోస్టల్ స్టాంపును, 75 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు. -
పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. తాజాగా గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర భారీగా పెంచడంపై మండిపడ్డారు. 'ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణం. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు? శుక్రవారం అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సిలిండర్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడి వారక్కడ వినూత్నంగా ఆందోళనలు చేయాలి. మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ.1,160 దాటి రూ.1,200లకు చేరుకుంది. ఉజ్వల స్కీంలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ సైతం ఈరోజు సిలిండర్‌ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. చదవండి: బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి -
తానా: అమ్మభాషా సేవలో అంధమేధావుల సభవిజయవంతం
డాలస్, టెక్సాస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెలనెలా తెలుగువెలుగ్ఙు కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “జ్ఞాననేత్రులు తెలుగు దివ్వెలు అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొంటున్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుఅన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంమే ఆయుధాలుగా చేసుకుని జీవనపోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ ఆదర్శమంటూ స్వాగతం పలికారు. ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖముఖ్య కార్యనిర్వహణాధికారిఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు,విశ్రాంతతెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు,ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్),షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా.బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు,నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు. మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులకు, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
ముందస్తు గుర్తింపుతో గుండె ముప్పునకు చెక్.. వారిలో 63% మందికి 3 నాళాలు బ్లాక్?
సాక్షి, హైదరాబాద్: బయో ఆసియా సదస్సు–2023 రెండోరోజు కార్య క్రమాల్లో భాగంగా శనివారం జరిగిన ముఖా ముఖి సంభాషణలో దిగ్గజ సంస్థ యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు. ప్రజారోగ్యం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం అనే అంశాలపై చర్చించారు. ఆరోగ్య సమాజం కోసం యాపిల్ చేస్తున్న కృషిని డాక్టర్ సుంబుల్ దేశాయ్ వివరించగా అపోలో హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలందిస్తున్న తీరు ను, భవిష్యత్ కార్యాచరణను డాక్టర్ సంగీతారెడ్డి ప్రస్తావించారు. అవి వారి మాటల్లోనే.. సంగీత: లింగ సమానత్వం, సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో మేటిగా ఉంది. కానీ ప్రస్తుత సవాళ్లలో ప్రజారోగ్య పరిరక్షణ అతిపెద్దది. దీనికి పరిష్కారాలను చూపుతున్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ప్రస్థానాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభించి మరో చోటకు మారారు. మిమ్మల్ని ఉత్తేజపర్చిందేమిటి? సుంబుల్: ఏ పని చేసినా అర్థవంతంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించాలనే అంశానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మా ణాన్ని కాంక్షిస్తున్న యాపిల్ లక్ష్యం ఆ సంస్థ ఉద్యోగిగా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. సంగీత: విజ్ఞానాన్ని పంచుకోవడానికి సాంకేతికత ఇప్పుడు కేంద్రంగా ఉందంటారా? సుంబుల్: అవును. నేను దాని గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. అపోలో ద్వారా వైద్యసేవలందిస్తున్న మీరు ఆరోగ్యకర జీవన అంశాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? సంగీత: గుండెపోటు అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్‌గా మారుతోంది. దీని ముందస్తు హెచ్చరిక లక్షణాల గురించిన విశ్లేషణలను ప్రజల చేతుల్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. రెండు వారాల క్రితం మేము క్లినికల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్‌ను ప్రారంభించాం. ఇది దేశంలోని వైద్యులకు ఉచితంగా విడుదల చేయాలని భావిస్తున్నాం. మీరు మహిళల ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు? సుంబుల్: మా ప్రాధాన్యతలో కీలకమైన అంశం మహిళల ఆరోగ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చాప్టర్‌ను తెరిచాం. మహిళల కోసం సైకిల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరతను అధిగమించేందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంగీత: కృత్రిమ మేధను మరింత విస్తృతం చేస్తున్నాం. దీంతో ఆరోగ్య సంరక్షణ రంగానికి కొంత వెసులుబాటు కలుగుతోంది. కానీ నిపుణుల కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు అవసరం. సుంబుల్: జీ–20 స్టాండ్ పాయింట్... మహిళలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? సంగీత: ఆరోగ్య సంరక్షణలో, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం నిజంగా తగ్గింది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో మహిళలు 60 శాతం ఉన్నారు. మహిళలకు అవకాశాలు అపారమవుతున్నాయి. నాయకత్వం శారీరక బలంతో కాదు.. మానసిక పరాక్రమంతో సాధ్యమవుతుంది. సంగీత: అపోలోను 40 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అత్యాధునిక ఆరోగ్య సేవలను ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యంతో అడుగులు వేశాం. కానీ ఇప్పటికీ ముందస్తు వ్యాధి నిర్ధారణ సవాలుగానే ఉంది. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలోని కార్డియాక్ పేషంట్లలో 63 శాతం మందిలో గుండెలో మూడు నాళాలు మూసుకుపోయాయి. మొదటి నాళం మూసుకున్నప్పుడే విషయాన్ని గుర్తిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగుల్లో 73 శాతం మంది మూడో దశ, నాలుగో దశలోనే వ్యాధి బయటపడుతోంది. వారిని మొదటి దశలోనే గుర్తించగలిగితే చరిత్రను తిరగరాయొచ్చు. వాటి గుర్తింపునకు కృత్రిమ మేధ (ఏఐ) మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలి. దీనిపై యాపిల్ ఏవిధంగా ఆలోచిస్తోంది? సుంబుల్: ప్రజారోగ్యానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య అంశాల కోసం యాప్‌లు తీసుకొచ్చాం. గుండె స్పందన, నడక తదితరాల కోసం ప్రత్యేక ఫీచర్లు అందించాం. ఇంకా ఎన్నో రకాలను ఆవిష్కరిస్తున్నాం. దీంతోపాటు మహిళల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాం. -
Global Investors Summit 2023: భారత సౌభాగ్యంతోనే ప్రపంచ సౌభాగ్యం
లక్నో: ప్రపంచ సౌభాగ్యం భారతదేశ అభివృద్ధితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తే ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుకు హామీ అని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమైంది. విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆర్థిక ప్రగతి ఇండియాతో అనుసంధానమై ఉందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వివరించారు. ఇక్కడున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఇండియా ప్రగతికి ఉత్తరప్రదేశ్ కీలకమైన నాయకత్వాన్ని అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి సంక్షోభాల నుంచి భారత్ వేగంగా బయటపడిందని, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో యువత ఆలోచనా ధోరణిలో, సమాజం ఆకాంక్షల్లో భారీ మార్పు కనిపిస్తోందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా మరింత అభివృద్ధిని చూడాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటున్నాడని వెల్లడించారు. ఆరేళ్లలో యూపీకి సొంత గుర్తింపు భారత్‌లో సంస్కరణల పర్వం కొనసాగుతుందని మోదీ తెలియజేశారు. ఆధునిక భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గతంలో ‘బీమారు’ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేదని, ఇప్పుడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని వ్యాఖ్యానించారు. ఆరేళ్ల వ్యవధిలో సొంత గుర్తింపును సాధించిందని చెప్పారు. సుపరిపాలన, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరత్వం వంటి వాటితో సంపద సృష్టికర్తలకు అవకాశాల గనిగా మారిందన్నారు. సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఎన్.చంద్రశేఖరన్ తదితరులు మాట్లాడారు. వివిధ కంపెనీలతో 18,000 ఎంఓయూ కుదుర్చుకుంటామని యోగి వివరించారు. మధ్యతరగతి బడ్జెట్ ముంబై: కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మధ్యతరగతిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీఏ పాలనలో ప్రజల ఆదాయంపై 20 శాతం దాకా పన్ను ఉండేదని, ఈ బడ్జెట్లో సున్నా శాతం పన్ను విధించినట్లు గుర్తుచేశారు. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి షోలాపూర్, షిర్డీకి వందేభారత్ రైళ్లను మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వేతన జీవులను, మధ్యతరగతి ప్రజలను బడ్జెట్ సంతోషపెట్టిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తమ నియోజకవర్గాల్లోని స్టేషన్లలో రైళ్లను ఒక ట్రెండు నిమిషాలపాటు ఆపాలని గతంలో లేఖలు రాసిన ఎంపీలు ఇప్పుడు వందేభారత్ రైళ్ల కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి నారాయన్ రాణే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. -
వ్యాధులపై అవగాహన పెరగాలి
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: వ్యాధుల సమర్థ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడం ఒక్కటే మేలైన మార్గమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం) అవిశ్రాంత కృషి చేస్తోందని కొనియాడారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. సామాజిక, ఆర్థిక అంశాల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో పరిశోధించే సోషల్ మెడిసిన్ రంగాల్లో ఐఏపీఎస్ఎం పనిచేస్తోంది. ఐఏపీఎస్ఎం ఏర్పాటై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ సంయుక్తంగా ‘ఐఏపీఎస్ఎంకాన్’పేరుతో సదస్సును నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సు గురువారం ఎన్ఐఎన్లో ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ఐఏపీఎస్ఎం వంటి సంస్థలు, ప్రజారోగ్య సిబ్బంది కీలకపాత్ర పోషించారని అన్నారు. వ్యాధుల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సి చర్యలు.. అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త చికిత్స పద్ధతులను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు ఐఏపీఎస్ఎం మరింత కృషి చేయాలని సూచించారు. ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడితే సమస్య సగం పరిష్కారమైనట్లేనని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమస్య దాదాపుగా సమసిపోయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సాంక్రమిక వ్యాధులు మరికొన్నింటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని గవర్నర్ హెచ్చరించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య, మరికొన్ని చోట్ల మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ఇలా వివిధ ప్రాంతాల్లో వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయో పరిశోధించాలని గవర్నర్ కోరారు. యంగెస్టు స్టేట్‌కు యంగ్ గవర్నర్‌ను ‘భారతదేశంలోనే యంగెస్టు స్టేట్ తెలంగాణ. దానికి దేశంలోని అందరు గవర్నర్లతో పోలిస్తే నేనే యంగ్ గవర్నర్’అని గవర్నర్ తమిళిసై అన్నారు. నూతన రాష్ట్రాన్ని నూతన గవర్నర్ ఏవిధంగా మెనేజ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారని, అయితే తాను వృత్తి రీత్యా గైనకాలజిస్టును అయినందున కొత్తగా పుట్టిన బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నానని పేర్కొన్నారు. పైగా పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నానని.. దీంతో తాను కవల పిల్లలను చూసుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నానని వివరించారు. ఐఏపీఎస్ఎంకాన్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ వికాస్ భాటియా, ఉపాధ్యక్షురాలు డాక్టర్ రష్మీ కుందాపూర్, ఐఏపీఎస్ఎం ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ ఎ.ఎం.ఖాద్రీ పాల్గొన్నారు. -
జీవ వైవిధ్యం రక్షణ లక్ష్యాలు నెరవేరేనా?
కెనాడా నగరం మాంట్రియల్లో 2022 డిసెంబర్లో జరిగిన 15వ జీవవైవిధ్య సదస్సులో కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను ఆహ్వానించవలసిందే. అయితే వాస్తవ పరిస్థితులను చూస్తే లక్ష్యాలు నెరవేరతాయా అనిపిస్తోంది. భారత్ సహా 190 దేశాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి ఈ ధరిత్రిపై 30 శాతం జీవవైవిధ్యం కాపా డాలన్నది ఒప్పందంలో ప్రధాన అంశం. ఈ విశ్వంలోగల జీవరాశులన్నిటినీ కలిపి జీవావరణం అంటున్నాం. జీవరాశులన్నీ సురక్షితంగా ఉంటేనే జీవవైవిధ్యం చక్కగా ఉంటుంది. అయితే ఇప్పటికే జీవవైవిధ్యం గణనీయంగా ధ్వంసమైపోయింది. ఇందుకు ప్రధానకారణం మానవ కార్యకలాపాలే. 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ధరిత్రి పరిరక్షణ సదస్సు తర్వాత ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో ఇంతవరకు 27 కాప్ సదస్సులు జరిగాయి. మొత్తం సదస్సుల్లో క్యోటో ఒప్పందం, గతంలో జరిగిన మాంట్రి యల్ ఒప్పందం, పారిస్ సదస్సు, 2021లో జరిగిన గ్లాస్గో, 2022లో ఈజిప్టు షర్మెల్ షేక్ నగరంలో జరిగిన సదస్సుల్లో జరిగిన ఒప్పందాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. చేసినా అరకొర నిర్ణయాలే తీసుకొని అమలు చేశారు. గ్లాస్గో ఒప్పందంలోనే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యా లను నిర్ణయించారు. వీటిలో చాలా తక్కువగానే సాధించారనీ, రానున్న ఐదేళ్ల కాలంలో సైతం సాధించే అవకాశం కనిపించడంలేదనీ, ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ఐదేళ్ల ప్రణాళికలను బట్టి గ్లాస్గో సదస్సుకు ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన జీవ వైవిధ్య సదస్సు చేసిన నిర్ణయాలను, లక్ష్యాలను సాధించడం సాధ్యమేనా? ఇప్పటికే 14 లక్షల జీవజాతులు అంతరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా మేరకు గడచిన నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవపరిణామ క్రమంలో జీవవైవిధ్యం ఏర్పడింది. దీని పరిరక్షణకు ముందు వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. ఇందులో భాగంగా కృత్రిమ ఎరువులు, పురుగు మందులను నిలిపి వేసి సంప్రదాయ సేద్యాన్ని చేపట్టాలి. ఇది చాలా నెమ్మదిగా, దీర్ఘకాలం అమలు చేయవలసిన ప్రక్రియ. 2030 నాటికి ఈ మార్పును సాధించగలమా? జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం అమలు చేయాలంటే ధనిక దేశాలు... పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చాలనీ, లేకపోతే ఒప్పందం నుండి వైదొలగుతామనీ కాంగో చివరిలో హెచ్చరించింది. అనేక దేశాలు ఈ బాటను ఎంచుకొనే అవకాశం ఉంది. వ్యవ సాయానికిచ్చే సబ్సిడీలను కొనసాగించాలని భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు డిమాండ్ చేశాయి. అమెరికా తదితర కొన్నిదేశాలు 60 శాతానికి పైగా సబ్సిడీలు ఇస్తున్నాయి. సబ్సిడీల విషయాన్ని తుది ఒప్పందం పత్రంలో చేర్చారా లేదా అన్న సందేహాలు వ్యక్తమ య్యాయి. సబ్సిడీలు లేకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే ఆర్థిక రంగానికి హాని కలిగించే సబ్సిడీలను తగ్గించాలని ఒప్పందంలో చేరుస్తామని ఒప్పందం రూపొందించిన దేశాలు చెప్పాయి. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలంటే కేవలం ఆసియా – పసిఫిక్ ప్రాంత దేశాలకే 300 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఆ ప్రాంత ఐరాస ఆర్థిక, సామాజిక కమిషన్ (యుఎన్ఈపీ) అంచనా వేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తామని సంపన్న దేశాలు అంగీకరించాయి. మరి లక్ష్యాలు సాధిం చడం సాధ్యమవుతుందా? వాతావరణ విపత్తులు.. పర్యావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల మూలంగా అధికమయ్యాయి. 200 ఏళ్లకు పైగా పారిశ్రామికీకరణ, పెట్రో ఉత్పత్తులు, వ్యవసాయానికి వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, విచ్చలవిడిగా అడవుల నరికివేత పెరిగాయి. మన దేశంలో 75 జిల్లాల్లో వాతావరణ వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వివిధ అధ్యయనాలతో పాటూ, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు ప్రకటించింది. ఇక అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతుందనేది వాస్తవం. ఇందుకు తాజా ఉదాహరణలు లక్ష దీవులు, నికోబార్ దీవుల్లో జరుగుతున్న విధ్వంసం. ఈ ప్రాంతాల్లో వందలు, వేల ఎకరాల భూభాగంలో పచ్చదనం నాశనం అవుతోంది. ఫలితంగా వేలాదిమంది ఆదివాసీ తెగల జన జీవనం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బ తింటోంది. వందలాది పక్షులు, జంతువుల రకాలు, ఇతర లెక్కలేనన్ని జీవరాసులు అంతరించిపోతాయి. సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతాల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం మళ్లీ కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో నివసించే జంతువులు, పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు తదితర అనేక రకాల జీవులలో 1970 నుంచి ఇప్పటి వరకు 69 శాతం నశించాయని లివింగ్ ప్లానెట్ రిపోర్టు (ఎల్పీఆర్)– 2022 నివేదిక తెలిపింది. ప్రపంచ జంతుజాల నిధి సంస్థ పరిధిలో ఎల్పీఆర్ పనిచేస్తోంది. భారత ప్రభుత్వం వాతావరణంపై 2023లో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. గతేడాది పారిస్ ఒప్పందంలో భాగంగా జాతీయ నిర్ణయ కార్యాచరణలు (ఎన్డీసీలు) రూపొందించింది. తక్కువ కాలుష్యం వెలు వరించే దీర్ఘకాలిక కార్యాచరణను మన ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 2070 నాటికి కాలుష్య రహిత వాతావరణం సాధిస్తామని పారిస్ సదస్సులో ప్రకటించింది. మరి ఈ లక్ష్యాలను సాధించి మన దేశమన్నా మాట నిలుపుకొంటుందేమో చూడాలి. (క్లిక్ చేయండి: లోహియా లోకదర్శన సులోచనాలు!) – టీవీ సుబ్బయ్య, సీనియర్ జర్నలిస్ట్ -
సమయం లేదు మిత్రమా!
‘మానవాళి సమష్టిగా పోరాడాలి. లేదంటే అది సామూహిక ఆత్మహత్యా సదృశమే!’ ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి చేసిన ఈ హెచ్చరిక అందరినీ ఆలోచింపజేస్తుండగా, ఐరాస సారథ్య ‘పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్–కాప్–27) ఆదివారం ఆరంభమైంది. ఈజిప్టులో సముద్రతీరంలోని రేవుపట్నమైన షర్మ్ ఎల్–షేక్‌లో 12 రోజుల ఈ సదస్సు మరోసారి పర్యావరణ సమస్యలపై దృష్టి సారించేలా చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య ప్రపంచం మళ్ళీ బొగ్గు వాడకం వైపు వెళుతున్న పరిస్థితుల్లో, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సైతం బొగ్గువాడకం ఆపేస్తామనే పాత వాగ్దానం నుంచి పక్కకు తప్పుకొంటున్న వేళ ఈ సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉండే ఈజిప్ట్‌లో, లక్ష్యాల్లో భాగస్వాములు కావాల్సిన స్వతంత్ర పౌర సమాజం పట్ల వ్యతిరేకత చూపే ప్రభుత్వ హయాంలో సదస్సు సాగడం విచిత్రం. యుఎన్–కాప్‌లోని 195 సభ్యదేశాలతో పాటు వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమకారులు – ఇలా సుమారు 45 వేల మందికి పైగా ఈసారి సదస్సులో పాల్గొంటున్నారు. పెరుగుతున్న వాతావరణ సంక్షోభం నేపథ్యంలో దశాబ్దాలుగా ఏటా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ మరోసారి ప్రాథమిక అంశాలపై చర్చకు తెర తీసింది. ధరిత్రి ఉష్ణోగ్రతలో పెంపు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించరాదనేది ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాం. మరి, ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? వాస్తవానికి ఈ శతాబ్ది చివరకు 2 డిగ్రీల మించి తాపం పెరుగుతుందంటూ వాతావరణ మార్పులపై ఐరాస ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) చేసిన తాజా హెచ్చరిక మన మొద్దునిద్రకు దర్పణం. లక్ష్యాలు పెట్టుకోవడం కాదు... వాటిని సాధించడానికి నిజాయతీగా కృషి అవసరమని అది చెప్పకనే చెబుతోంది. అందుకే వాతావరణ నష్టనివారణకు ధనిక దేశాలు నిధులివ్వాలంటూ వర్ధమాన ప్రపంచం పట్టుబట్టే పరిస్థితి ఈసారి నెలకొంది. వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల రీత్యా 2020 నుంచి 2025 వరకు ఏటా 100 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తామని ధనిక దేశాలు ఎప్పుడో వాగ్దానం చేశాయి. 2009లో కోపెన్‌హాగెన్ (కాప్15)లో ఇచ్చిన ఆ మాటనే 2015లో ప్యారిస్ (కాప్21)లోనూ పునరుద్ఘాటించాయి. కానీ, అతీగతీ లేదు. ఆ ‘వాతావరణ ద్రవ్యసహాయం’ కిందకు ఏవేం వస్తాయో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, పారదర్శకంగా ఆ రుణాలిచ్చే వ్యవస్థ ఏర్పాటు కాకపోవడం విడ్డూరం. భూగోళంపై వాతావరణ మార్పుల పర్యవసానం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదు. ఈ మార్పులకు ప్రధాన కారణమవుతున్న ధనిక దేశాలు తమ పొరుగునున్న బాధిత దేశాలపై సానుభూతి చూపితే సరిపోదు. దేశాల పరస్పర సహకారంతోనే వాతావరణ విపర్యయాల నుంచి బయటపడి మానవాళి మనుగడ సాగించగలదని గుర్తించాలి. ‘వాతావరణంపై సంఘీభావ ఒప్పందం’ అన్న ఐరాస పెద్ద తాజా అభిభాషణను ఆ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది వివిధ దేశాల్లో తలెత్తిన వాతావరణ సంక్షోభాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాకిస్తాన్లో వచ్చిన భారీ వరదల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆహార భద్రత సైతం చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. పెనుతుపాను ఇయాన్ దెబ్బకు క్యూబాలో ప్రాథమిక వసతులన్నీ ఛిన్నాభిన్నమై, రోజుల తరబడి విద్యుచ్ఛక్తి లేకుండా గడపాల్సి వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల 55 బాధితదేశాలు ఇప్పటికే 525 బిలియన్ డాలర్ల మేర నష్టపోతున్నా యని లెక్క. 2030 కల్లా అది మరింత పెరగనుంది. ధనిక దేశాల వాతావరణ విధ్వంసం దెబ్బకు, తమకే సంబంధం లేని వర్ధమాన దేశాలు 2040కి 1 ట్రిలియన్ డాలర్ల దాకా నష్టపోతాయట. అభివృద్ధి చెందిన దేశాలే ఈ నష్టాన్ని భర్తీ చేయాలని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు కోరుతున్నాయి. నష్టపరిహార నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజా ‘కాప్27’లో దీనిపై చర్చ జరగడం అభిలషణీయమే! గ్రీన్హౌస్ వాయువులను భారీగా విడుదల చేస్తున్న అమెరికా, ఐరోపా సమాజం (ఈయూ) మంకుపట్టు పడుతున్నాయి. నిరుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన ‘కాప్26’లో శాశ్వత నష్టం, సరిదిద్దుకోగల నష్టాల గురించి చర్చ జరపాలని వర్ధమాన దేశాలు కోరాయి. అమెరికా, ఈయూల తీవ్ర అభ్యంతరంతో అది జరగనే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మొదలు సోమాలియా, పసిఫిక్ మహా సముద్ర ద్వీపదేశాల దాకా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వాతావరణ మార్పులతో అతలాకుతలమవుతుండడంతో ‘చిరు ద్వీపదేశాల కూటమి’ సైతం ఆ బాధను బాపేలా ప్రపంచ ‘ప్రతిస్పందన నిధి’ కావాలని ప్రతిపాదిస్తోంది. భారత్ సైతం ఈ బాధల నివారణను భుజానికెత్తు కోవాలి. అభివృద్ధి చెందిన దేశాలను చర్చలకు రప్పించే నైతిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాల్ని సాకుగా చూపి, గ్లోబల్ నార్త్ దేశాలు వాతావరణ మార్పుల నివారణకు పెట్టుకున్న లక్ష్యాలను వెనక్కి నెట్టడం అభిలషణీయం కాదు. దాని పర్యవసానం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులతో, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర దేశాల గ్లోబల్ సౌత్‌కే ఎక్కువ. నిజానికి, అమెరికాలో అనావృష్టి, ఆఫ్రికాలో కరవు, యూరప్‌లో వడగాడ్పులు ధనిక దేశాలకూ ప్రమాదఘంటికలే. ఇప్పుడు భూతాపోన్నతి నివారణ, నిధులపై మీనమేషాలు లెక్కిస్తే మొదటికే మోసం. సమయం లేదు మిత్రమా! త్వరపడాలి! -
డిసెంబర్లో ఐహెచ్‌డబ్ల్యూ–22 సదస్సు
సాక్షి,హైదరాబాద్: మొదటి సారిగా అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ వెల్నెస్ (ఐహెచ్‌డబ్ల్యూ)–22 సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. హార్ట్ఫుల్నెస్, దాని సహాయక సంస్థలతో కలిసి జరిగే ఈ సదస్సు డిసెంబర్ 16–18 తేదీల్లో హార్ట్ఫుల్నెస్ ప్రధాన కార్యా లయం కన్హా శాంతివనంలో నిర్వహించనున్నా మని ఆ సంస్థ తెలిపింది. సదస్సుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ఉద్యానవన శాఖ, రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మద్దతుని స్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మంది హాజరయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇందులో వైద్యులు, నర్సు లు, అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపు ణులు, వర్ధమాన పరిశోధకులు, విద్యార్థులు, నాన్ ఫార్మాస్యూటికల్ విధానాల ఔత్సాహికులు పాల్గొంటారని వివరించింది. -
కోర్టుల్లో స్థానిక భాష: మోదీ
కేవడియా (గుజరాత్): న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి. కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్లో శనివారం మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు. ‘‘లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి. పేదలకు సులువుగా సత్వర న్యాయమూ దొరుకుతోంది. చట్టాల్లోని కాఠిన్యం, గోప్యత లేనిపోని సంక్లిష్టతలకు దారి తీస్తుంది. అలాగాక అవి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారు. స్థానిక భాషలోనూ రాస్తారు. అలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలి. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు భారత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇంధనావసరాలు తీర్చేందుకు ఉమ్మడి కృషి పరిశోధన సంస్థలకు మోదీ పిలుపు న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు పరిశ్రమ, పరిశోధన, విద్య తదితర రంగాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటివాటి వాడకాన్ని పెంచాలన్నారు. శనివారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌ను ప్రపంచ సారథిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ 2047 దిశగా కృషి చేయాలని సూచించారు. -
శాస్త్రీయ పద్ధతులతో సమగ్ర దర్యాప్తు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కీలకమైన కేసులకు సంబంధించి శాస్త్రీయమైన పద్ధతుల్లో దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు. శనివారం గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. నమోదైన కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు దశ, చార్జిషీటు దాఖలు వరకు పురోగతిపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించి నిర్ణిత గడువులోపు పెండింగ్ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. నిందితుల అరెస్టు, చార్జ్ షీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల ఛేదింపు, నేర నియంత్రణకు దోహదం చేసే నైపుణ్యాలను వివరించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలతో ప్రవేశపెట్టి శిక్ష పడే విధంగా చేయాలన్నారు. హత్య కేసులు, మహిళలపై నేరాలు, చిన్నారుల అదృశ్యం తదితర కేసుల్లో అలసత్వం చూపకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని, సొత్తు రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అనధికార ఆన్లైన్ లోన్ యాప్‌ల మోసాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి వారు కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చుకునేలా చూడాలన్నారు. రహదారులపై ప్రమాదాలు, నేరాల నియంత్రణకు హైవే మొబైల్ టీంతో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. గుట్కా, మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. (చదవండి: జగనన్న కాలనీలో మహిళలకు ఉపాధి) -
డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: సాంకేతికత, నూతన ఆవిష్కర ణల ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయాలని వక్తలు సూచించారు. సోమవారం హైదరాబాద్ కేంద్రంగా 7వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సదస్సు జరిగింది. రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ, ఐ లాంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సంబంధిత రంగ నిపుణులు, స్టార్టప్ కంపెనీలు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యారంగ నిపుణులు పాల్గొ న్నారు. 18కిపైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రతినిధులు చర్చించారు. నాలుగు సెషన్లుగా జరిగిన ఈ సదస్సులో సుమారు 50 మందికిపైగా వక్తలు డిజిటల్ పరివర్త నను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై పలు సూచనలు చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా అవసరమైన ఫలితాలు సాధించేందుకు వివిధ రాష్ట్రాలు, ఆయా రంగాల నడుమ భాగస్వా మ్యాలు ఏర్పడాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వ పని విధానాలు, పౌరసేవలు అందించడంలో సంప్రదా యక పద్ధతుల స్థానంలో సాంకేతికత వినియోగం పెరిగిన తీరుపై చర్చించారు. నో కోడ్, ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రభుత్వ విభాగాలు మరిన్ని ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ తరఫున ఐటీ శాఖ అనుబంధ ‘ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం’డైరె క్టర్ లంక రమాదేవి పాల్గొని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మే షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. -
న్యూజీలాండ్‌లో జరగనున్న 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఆక్లాండ్ (న్యూజీలాండ్): 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రంగా అంగరంగ వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 17-18, అక్టోబర్ 2, 2022 తేదీలలో నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు. ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారాలను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (ఇండియా) కు ప్రదానం చేయనున్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (ఇండియా), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు. బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు . ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో ప్రేక్షకులను ఉర్రూతలూగారు. =అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వెండర్ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్ని పించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు. -
ఆటా వేడుకలకు సర్వ సిద్ధం: అతిథులతో కళకళ లాడుతున్న వేదిక
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకలకోసం తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాషింగ్టన్ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు తమన్, చంద్రబోస్, శివారెడ్డి , సింగర్ మంగ్లీ తదితరులు ఏటీఏ కాన్ఫరెన్స్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న వేడుకల కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా కోవిడ్ కారణంగా రెండేళ్ళలో వేడుకలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడం, కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత ఉత్సాహం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా, ఉత్సాహంగా సభలను నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆటా అధ్యక్షుడు తెలిపారు. -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు. అత్యాధునిక నీటి పారుదల విధానాలను ఈ సమావేశాల్లో ప్రదర్శిస్తారు. వాటిని అందిపుచ్చుకుని.. నీటి వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకుని.. అత్యధిక విస్తీర్ణంలో ఆయకట్టుకు నీరందించి, రాష్ట్రాన్ని సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు. ఆ సంస్థ 23వ కాంగ్రెస్‌ను మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీలో 2017, అక్టోబర్ 8 నుంచి 14 వరకూ నిర్వహించారు. ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌ను నిర్వహించే బాధ్యతను ఆస్ట్రేలియా దక్కించుకోగా, 25వ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలను భారత్ చేజిక్కించుకుంది. ఆ సదస్సును విశాఖలో నిర్వహించాలని ఐసీఐడీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ కె.యల్లారెడ్డి చేసిన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేసే దిశగా.. ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌కు విశాఖపట్నాన్ని వేదికగా చేసుకోవడం నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతకు దక్కిన గౌరవంగా సాగు నీటిరంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో శతాబ్దాల కిందట నిర్మించిన చెరువులను సంరక్షించుకుని, ఆయకట్టుకు నీళ్లందించడం దగ్గర్నుంచి.. చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించడం, సూక్ష్మ నీటిపారుదల విధానాలను అందిపుచ్చుకుని.. తక్కువ నీటితో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తుండటాన్ని ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ప్రతిపాదించే అత్యా«ధునిక నీటి పారుదల విధానాలను పరిశీలించి.. వాటిని అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆటా వేడుకలకు వేళాయే
అమెరికన్ తెలుగు అసొసియేషన్ కన్వెన్షన్ వేడుకలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు అలుపెరుగకుండా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరు అవుతున్నారు. గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు ఈవెంట్ ఏదీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. చారిత్రక వేదిక డిసి కన్వెన్షన్ సెంటర్ వేడుకలు నిర్వహించనున్న వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అరు వేర్వేరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థి సమావేశాలకు ఇదే కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకున్నారు... * 23 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా * అల్ట్రా మోడర్న్ స్ట్రక్చర్ * 40 వేల మందితో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం * పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్ వాల్స్ * మూడు ఎయిర్‌పోర్ట్‌లకు సులువుగా చేరుకునే సదుపాయం * అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. వాషింగ్టన్ డీసీలో జులై 1,2,3 తేదీల్లో జరగనున్న వేడుకలకు తరలిరండి!మా ఆతిథ్యాన్ని స్వీకరించండి!! ఆటా కుటుంబంలో భాగం కండి!!! - భువనేష్ భుజాల, ఆటా అధ్యక్షుడు ఎంతో ఘనకీర్తి, ఎన్నో విజయాలు సాధించిన తెలుగు వారికి ఆటా ఒక కేంద్ర బిందువు అవుతుందని భావిస్తున్నాం. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్.. ప్రవాసాంధ్రులందరినీ ఒక్క తాటిపైకి చేర్చబోతుంది. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్ మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించబోతున్నాం. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లు, రాకపోకలకు ఆధునాతన రవాణా వసతులు, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. హరిప్రసాద్ లింగాల, ఆటా సెక్రటరీ -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్‌తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్‌కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్‌తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
భారత్, చైనా, జపాన్‌లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక
Lanka Plans Donor Conference: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అదీగాక విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం, మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని దారుణ స్థితిలో ఉంది. ఏవిధంగానైన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్, జపాన్‌లతో దాతాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. తమకు చారిత్రాత్మక మిత్రదేశాలుగా ఉన్న ఈ దేశాల సాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. అమెరికా నుంచి కూడా సాయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి అదనపు మద్దతుపై చర్చల కోసం భారత్ నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం వస్తుందని, అలాగే యూఎస్ ట్రెజరీ నుంచి ఒక బృందం వచ్చేవారం శ్రీలంక రానుందని వెల్లడించారు. అదీగాక భారత్ శ్రీలంకకి సుమారు రూ. 2 లక్షల కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే. కొన్ని దిగుమతుల కోసం దాదాపు 1.5 బిలయన్ డాలర్ల ( దాదాపు రూ.11 కోట్లు) యువాన్ డినామినేట్ స్వాప్ నిబంబధనలపై చర్చలు జరపాలని చేసిన శ్రీలంక చేసిన విజ్ఞప్తిని చైనా పరీశీలిస్తుందని తెలిపారు. అంతేగాక శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబో చేరుకున్న ఐఎంఎఫ్ బృందంతో చర్చలు పురోగతి సాధించాయని, ఈ నెలాఖరులోగా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమ్ సింఘే చెప్పారు. (చదవండి: క్షణాల్లో అంటుకున్న మంటలు, వీడియో వైరల్) -
ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్
లక్నో/కాన్పూర్: 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెప్పారు. నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు మాత్రమే ఉందన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడో పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్‌కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... అదొక సరికొత్త రికార్డు ‘‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో మూడో స్థానంలో ఉంది. గతేడాది 100కు పైగా దేశాల నుంచి ఇండియాకు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 417 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఇదొక సరికొత్త రికార్డు. సంస్కరణలు కొనసాగుతాయ్ మన ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా సంస్కరణ–పనితీరు–మార్పు అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. విధాన నిర్ణయాల్లో స్థిరత్వం, పరస్పర సహకారం, సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నాం. ‘ఒకే దేశం–ఒకే పన్ను, ఒకే దేశం–ఒక్కటే రేషన్ కార్డు’ వంటివి మన స్పష్టమైన, బలమైన ప్రయత్నాలకు నిదర్శనం. రక్షణ రంగంలో తయారీకి గతంలో ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా 300 రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారు చేసుకోబోతున్నాం. రక్షణ తయారీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టబోతున్నవారికి మార్కెట్ సిద్ధంగా ఉంది. దేశంలో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని రంగాల్లో సంస్కరణలు చేపడతాం. నవ్య కాశీని సందర్శించండి 2014 పోలిస్తే ఇప్పుడు దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. అప్పట్లో 6 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులు ఉండేవారు. ఇప్పుడు 78 కోట్లకు చేరారు. జీబీ డేటా ధర రూ.200 ఉండేది రూ.11–12కు దిగొచ్చింది. 2014లో 100 కంటే తక్కువ గ్రామాలే ఆప్టికల్ ఫైబర్‌తో కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 1.75 లక్షలు. 70 వేల దాకా రిజిస్టర్డ్ స్టార్టప్‌లు ఉన్నాయి. యూపీలో నా సొంత నియోజకవర్గం వారణాసిని సందర్శించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా. ఘనమైన పురాతన చరిత్ర ఉన్న కాశీ నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది’’ అని మోదీ వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దారుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, కుమార మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పెట్టుబడులు, ఉద్యోగాల గురించి వివరించారు. మోదీ విజన్‌కు అనుగుణంగా పని చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బలమైన ప్రతిపక్షం ఉండాలి వంశ పారంపర్య రాజకీయాలపై (పరివార్వాద్) ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. యూపీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామమైన పరౌంఖ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంశ పారంపర్య రాజకీయాల వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు దక్కకుండా పోతాయన్నారు. అలాంటి రాజకీయాలు చేసేవారంతా తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని చెప్పారు. వారి ఆటలను ప్రజలు సాగనివ్వరని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో జన్మించిన వారు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి కావాలంటే వంశ పారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తానని మోదీ చెప్పారు. దానివల్ల రాజకీయాల్లో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అంతకముందు కాన్పూర్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి రాష్ట్రపతి కోవింద్ స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రపతి రావడం పట్ల తనకు సిగ్గుగా ఉందని మోదీ అన్నారు. కోవింద్ మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. తమ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన మోదీకి రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. పరౌంఖ్‌లో పథ్రీమాత ఆలయాన్ని, బీఆర్ అంబేడ్కర్ భవనాన్ని, మిలన్ కేంద్రాన్ని కోవింద్‌తో కలిసి మోదీ సందర్శించారు. -
జాతీయ మహిళా లెజిస్లేచర్ సదస్సుకు కవిత
సాక్షి,హైదరాబాద్: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే జాతీయ మహిళా లెజిస్లేచర్ సదస్సులో పాల్గొనాల్సిందిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు జాతీయస్థాయి నేతలు హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ నెల 27న ‘నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం’అనే అంశంపై లోక్‌సభ సభ్యురాలు రమ్యా హరిదాస్ అధ్యక్షతన జరిగే చర్చా గోష్టిలో కవిత ప్రసంగించనున్నారు. కవితతో పాటుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రితు ఖండూరీ, భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా పాల్గొననున్నారు. కేరళ ఎమ్మెల్యేలు ఓఎస్ అంబిక, దలీమా సమన్వయం చేస్తారు. -
కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... సదస్సుకు చాలా సీనియర్ని ‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని. డిజిటల్ ఇండియా మిషన్ డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్‌చెయిన్‌లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం. పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్ కాల్లో మన విజన్(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం. Delhi | PM Narendra Modi, Union Minister of Law & Justice Kiren Rijiju and Chief Justice of India NV Ramana attend the Joint Conference of CMs of States & Chief Justices of High Courts at Vigyan Bhawan pic.twitter.com/cmawTEOWOl — ANI (@ANI) April 30, 2022 న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని ♦ అందరూ గౌరవించాల్సిందే ♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు ♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు ♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్సస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పెండింగ్ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది. ‘పిల్’ దుర్వినియోగం కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. -
ఖాళీల భర్తీకి పేర్లు పంపండి: సీజే ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ వ్యవస్థ తన వంతు కృషి చేసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమష్టి కృషితో వివిధ కోర్టుల్లో ఏడాదిలో 126 జడ్జీ పోస్టులను భర్తీ చేయగలిగామని అన్నారు. త్వరలో మరో 50 నియామకాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత శుక్రవారం ఢిల్లీలో జరిగిన 39వ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే సమస్యలను గుర్తించి, చర్చించడం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఇంకా ఖాళీలు ఉన్నాయని, వీటి భర్తీ కోసం వీలైనంత త్వరగా పేర్లను పంపించాలని, అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. హైకోర్టుల నుంచి ప్రభుత్వానికి 100 ప్రతిపాదనలు గత ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు 9 మంది నూతన న్యాయమూర్తులు, హైకోర్టులకు 10 మంది నూతన ప్రధాన న్యాయమూర్తులు వచ్చారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హైకోర్టుల స్పందన ప్రోత్సాహకరంగా ఉందన్నారు. గతేడాది తాను సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైకోర్టుల్లో నియామకాల కోసం కొలీజియం ఇప్పటివరకు 180 సిఫార్సులు చేసిందని, ఇందులో 126 నియామకాలు జరిగాయని వెల్లడించారు. మరో 54 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఉన్నాయని చెప్పారు. వివిధ హైకోర్టుల నుండి ప్రభుత్వానికి దాదాపు 100 ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే అవి ఇంకా సుప్రీం కోర్టుకు చేరలేదన్నారు. మిగిలిన 212 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలను పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన పట్టుదల, ధృఢ సంకల్పంతో న్యాయస్థానాల పనితీరు దెబ్బతినకుండా చూసుకోగలిగామని హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో కోర్టుల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడకుండా స్థిరమైన ఆన్లైన్ వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు. సుప్రీంకోర్టులో వినూత్నమైన ఫాస్టర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 2016లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆమోదించిన తీర్మానాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఐటీ, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, దేశంలోని అన్ని కోర్టు సముదాయాల కనెక్టివిటీ, మానవ వనరులు, జిల్లా కోర్టులు, మౌలిక సదుపాయాలు, కోర్టుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేడు సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సదస్సు న్యూఢిల్లీ: రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సదస్సులో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా చర్చిస్తారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలంటూ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రతిపాదనను సదస్సు ఎజెండాలో చేర్చారు. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, ప్రజలకు న్యాయ సహాయం, న్యాయ సేవలు, ఈ–కోర్టుల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా చర్చించనున్నారు. ప్రారంభోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్ బదులుగా న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నారు. -
అఫ్గాన్‌కు తక్షణ మానవతా సాయం
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని భారత్, ఐదు సెంట్రల్ ఆసియా దేశాలు నిర్ణయించాయి. అదేసమయంలో, అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరా దని ఆదివారం న్యూఢిల్లీలోని జరిగిన మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు పేర్కొంది. సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మం త్రులు పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ సాయం అందజేయడం కొనసాగించాలని తీర్మానించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉం డాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి జై శంకర్ చెప్పారు. -
కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హెచ్ఐసీసీలో మీడియేషన్, ఆర్బిట్రేషన్‌పై జరిగిన సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వివిధ కారణాల వల్ల పరిశ్రమల్లో వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. వివాదాల పరిష్కరానికి మధ్యవర్తిత్వాలు ముఖ్యమన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్‌కు హైదరాబాద్ అనుకూలమని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం సత్వరమే జరగాలన్నారు. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలన్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల ద్వారా సమయం వృధా అవుతోందన్నారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: Omicron: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు ‘లార్డ్ కృష్ణ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పరిస్,సింగపూర్, లండన్, హంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీలు సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నంబర్‌వన్‌గా ఉంది. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేనని’’ సీజేఐ అన్నారు. త్వరలో శాశ్వత భవనం: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రస్తుతం 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
తెలుగు భాష అజరామరం
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు భాష అజరామరమైందని, మరెన్ని శతాబ్దాలు గడిచినా నవనవోన్మేషితంగా వెలుగొందుతూనే ఉంటుందని తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు భాషకు మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, ఆస్ట్రేలియాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ వేదికగా జరిగిన రెండవ తెలుగు సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుమల్లి వ్యవస్థాపకులు మల్లికేశ్వర్‌రావు కొంచాడ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీలత మగతల ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. గోల్కొండ కుతుబ్‌షాహీలు, ఆ తరువాత వచ్చిన అసఫ్‌జాహీల కాలంలో అధికార భాషలుగా పర్షియా, ఉర్ధూ వంటివి కొనసాగినప్పటికీ ప్రజల భాషగా తెలుగు వర్ధిల్లిందన్నారు. కాకతీయుల కాలం నాటికే తెలంగాణలో గొప్ప సాహిత్యం వెలువడిందని పేర్కొన్నారు. ఎంతోమంది కవులు, కవయిత్రులు తెలుగు భాషలో సాహితీ సృజన చేశారన్నారు. బసవపురాణం రాసిన పాల్కురికి సోమనాథుడు తన ద్విపద కావ్యాలతో తెలుగును సుసంపన్నం చేశారని అన్నారు. ప్రముఖ అధ్యాపకులు,వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకేళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ, నిరంతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల మూర్తిమత్వం వికసిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోవిడ్ మమ్మారి సృష్టించిన పరిణామాలపై న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రచురించిన రెప్పవాల్చని కాలం పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి రత్నకుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి,తదితరులు పాల్గొన్నారు. అలాగే న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,మలేసియా, సింగపూర్, తదితర దేశాలకు చెందిన తెలుగు కవులు, రచయితలు పాల్గొన్నారు. -
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
ఈ నెల 18 నుంచి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2021’ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ‘నెట్‌జీరో బిల్డింగ్–బిల్ట్ ఎన్విరాన్మెంట్’ థీమ్‌తో వర్చువల్‌లో ఈ సదస్సును నిర్వహిం చనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఈ సదస్సులో 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 500లకు పైగా హరిత భవనాల ఉత్పత్తుల ప్రదర్శన, బృంద చర్చలు, ఉపన్యాసాలుంటాయి. సీఐఐ–ఐజీబీసీ చైర్మన్ వీ సురేష్, వైస్ చైర్మన్ గుర్మిత్‌సింగ్ అరోరా, మాజీ ప్రెసిడెంట్ జంషెడ్ ఎన్ గోద్రె జ్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్ట ర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, కో–చైర్మన్ అభయ శంకర్ తదితరులు పాల్గొననున్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 2001లో ఐజీబీసీని ఏర్పాటు చేసింది. దేశంలో హరిత భవనాల నిర్మాణం, అభివృద్ధి, ఉత్పత్తుల పరిశోధన, అవగాహన వంటివి చేపడుతుంది. ప్రస్తుతం దేశంలో 6,781 ప్రాజెక్లు, 786 కోట్ల చదరపు అడుగుల హరిత భవనాలు ఉన్నాయి.