ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు.
మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్‌లోని సణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు.
భారత్‌కు అవకాశాలు
ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్‌లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్‌లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్‌కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment