Manish
-
ఒకే ఇంట్లో ముగ్గురి మృతి.. డైరీలో ఆమె ఫోన్ నంబర్!
వారిద్దరూ విద్యావంతులు. దానికి తోడు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదుగానీ తల్లితో కలిసి విగతజీవులుగా మారిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మరణాలు కేరళలో (Kerala) కలకలం రేపాయి. వారు ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు అకాల మరణం చెందారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయితేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.అసలేం జరిగింది?కొచ్చిలోని ఎకాముఖ్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం కనుగొన్నారు. మృతులు శాలిని విజయ్, మనీశ్ విజయ్, శకుంతలగా గుర్తించారు. శాలిని.. జార్ఖండ్ (Jharkhand) సాంఘిక సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, ఆమె సోదరుడు మనీశ్.. ఐఆర్ఎస్ అధికారి. కొచ్చిలోని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగంలో అడిషనల్ కమిషనర్ ఉద్యోగం చేస్తున్నాడు. లివింగ్ రూములో సీలింగ్ హుక్కు ఉరివేసుకుని మనీశ్ చనిపోయాడు. మరో గదిలో శాలిని నిర్జీవంగా కనిపించారు. వీరి తల్లి శకుంతల మృతదేహం తెల్లని వస్త్రంలో చుట్టివుందని, పూలు చల్లిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.మనీశ్ డైరీలో చెల్లెలి ఫోన్ నంబర్మనీశ్, శాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శకుంతల మరణానికి గల కారణాలు అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. ‘శకుంతల మరణం సహజమా, మరేదైనా కారణాలు ఉన్నాయనేది అటాప్సీ నివేదిక వచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంద’ని త్రిక్కకరా ఏసీపీ పీవీ బేబీ తెలిపారు. మనీశ్ డైరీలో ఫిబ్రవరి 15న రాసిన నోట్‌ను పోలీసులు గుర్తించారు. తమకు సంబంధించిన కొన్ని పత్రాలను దుబాయ్‌లో (Dubai) ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాలని కోరుతూ, ఆమె ఫోన్ నంబరు కూడా అందులో రాశారు.టాపర్‌గా నిలిచి.. కేసులో ఇరుక్కుని.. శాలిని.. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ) 2003లో నిర్వహించిన మొదటి సివిల్ సర్వీసెస్ కంబైన్డ్ పోటీ పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్ష ద్వారా 64 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో 2022, జూలైలో జార్ఖండ్ హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. శాలినితో పాటు మిగతా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 27న జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో శాలిని మరణించడం చర్చనీయాంశంగా మారింది.ప్రొఫెసర్ శకుంతల శకుంతల బొకారో (Bokaro) ప్రాంతానికి చెందిన వారని, వీరి కుటుంబం రాంచీలో 2013 వరకు అద్దె ఇంటిలో ఉందని తెలిసింది. శకుంతల కుటుంబ సభ్యులు భక్తిభావంతో మెలిగేవారని, తమతో స్నేహంగా ఉండేవారని పొరుగింటివారు వెల్లడించారు. బొకారోలో శకుంతల ప్రొఫెసర్‌గా పనిచేసేవారని తెలిపారు. ఆమె మరో కుమార్తె పెళ్లిచేసుకుని రాజస్థాన్‌లో స్థిరపడిందని చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాంచీ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో కలిసినప్పుడు మనీశ్ అప్యాయంగా పలకరించాడని.. అతడితో పాటు శాలిని, శకుంతల మరణించారన్న వార్త తెలిసి చాలా బాధపడ్డామన్నారు. కాగా వీరి ముగ్గురి మరణానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.చదవండి: వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయంఅన్నికోణాల్లోనూ దర్యాప్తుశాలినిపై సీబీఐ కేసు కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శకుంతల సహజంగా చనిపోయివుంటే ఆమె మరణాన్ని తట్టుకోలేక కూతురు, కొడుకు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వీరి మానసిక పరిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
AP: ఐపీఎల్ రేసులో చిన్నదోర్నాల మనీష్‌రెడ్డి
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్‌రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు. ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్‌రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. -
లోక్‌సభ అభ్యర్థికి పాలాభిషేకం!
బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆ ప్రాంతంలో విరివిగా పర్యటిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో మనీష్ కశ్యప్‌కు కొందరు మహిళలు పాలాభిషేకం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య ఒక కేసులో చిక్కుకుని,ఇటీవలే జైలు నుంచి విడుదలైన మనీష్ కశ్యప్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కొత్త బీహార్‌ను సృష్టించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మనీష్ చెబుతున్నారు. తూర్పు చంపారన్ జిల్లా బంజరియా బ్లాక్‌లోని రతన్‌పూర్ గ్రామానికి మనీష్ కశ్యప్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా అక్కడి మహిళలు అతనికి పాలాభిషేకం చేశారు. మనీష్ కశ్యప్ ఎన్నికల పర్యటనలో ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనీష్ కశ్యప్‌ను చూసేందుకు జనం తరలివస్తున్నారు. -
చిప్ తయారీకి విధానాలు ముఖ్యం
ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు. మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్‌లోని సణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు. భారత్‌కు అవకాశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్‌లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్‌కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే. -
దీపావళి పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
మాస్టర్ పీస్
అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో సినిమా బండి ప్రొడక్షన్స్ పై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విలన్ పాత్రధారి మనీష్ గిలాడా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్. -
ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు... కీలక పదవులు
వాషింగ్టన్: మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కీలక పదవులు లభించాయి. ఫ్లెక్స్ సీఈఓ రేవతీ అద్వైతి, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ సీఈఓ మనీశ్ బప్నాలకు వర్తక విధానం, సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించారు. అమెరికా వర్తక విధానాలు, పాలన, అమలు తదితరాలపై ఇది సలహాలు సూచనలు అందిస్తుంది. ‘‘అద్వైతి పలు కంపెనీల్లో కీలక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. వరుసగా నాలుగేళ్లు ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతులైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్థికవేత్త అయిన బప్నాకు పలు సంస్థల్లో కీలక హోదాల్లో పని చేసిన విశేషానుభవముంది’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
యాంకర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ దర్శకనిర్మాత!
బాలీవుడ్ మహిళా దర్శకనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యాంకర్, నటుడు మనీశ్ పౌల్ చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియోను మనీశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటే.. అమ్మాయిలకు పెద్దగా లెక్కలు రావని మనీశ్ అన్నాడు. అంత సినిమా లేదు, అది నిజం కాదని బదులిచ్చింది ఫరా ఖాన్. దీంతో అతడు రెండులోంచి రెండు తీసేస్తే ఎంత అని ఓ ప్రశ్న అడిగాడు. అందుకామె అసలు ప్రశ్నే అర్థం కావట్లేదంది. మనీశ్ అదే ప్రశ్నను మరోలా అడిగాడు. నువ్వు రెండు చపాతీలు తింటున్నావనుకో.. ఆ రెండింటినీ నేను తీసుకుంటే నీ దగ్గర ఎన్ని మిగులుతాయి? అని ప్రశ్నించాడు. అందుకామె ఇంకేం మిగులుతాయి. కేవలం కూర మాత్రమే మిగులుతుందని చెప్పింది. ఆ వెంటనే కోపంతో నా చపాతీ లాక్కోవడానికి నీకెంత ధైర్యం? అంటూ సరదాగా అతడి చెంప చెళ్లుమనిపించింది. ఫరాకు లెక్కలు ఎంత బాగా వచ్చో అంటూ మనీశ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. దీనికి ఫరా స్పందిస్తూ నా తిండి దొంగిలించాలని ఎప్పుడూ అనుకోకు అంటూ కామెంట్ చేసింది. కాగా మనీశ్ పౌల్ చివరగా జుగ్ జుగ్ జియో సినిమాలో నటించాడు. ఇందులో కియారా అద్వానీ సోదరుడి పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Maniesh Paul (@manieshpaul) చదవండి: కియారాతో పెళ్లనగానే నా భార్య విడాకుల దాకా వెళ్లింది మాటలు రావడం లేదు, ఈ అవార్డు భారత్‌కు అంకితమిస్తున్నా -
మనీశ్‌కు ఆరు వికెట్లు.. 147 పరుగులతో ఘన విజయం
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–16 స్కూల్, కాలేజీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–బేగంపేట)తో మ్యాచ్‌లో గౌతమ్ జూనియర్ కాలేజీ 147 పరుగుల తేడాతో నెగ్గింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు గౌతమ్ కాలేజీ జట్టు స్పిన్నర్ డి.మనీశ్ (6/26) ధాటికి 62 పరుగులకే కుప్పకూలింది. తొలుత గౌతమ్ కాలేజీ 209 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తేజ్ (100; 14 ఫోర్లు) సెంచరీ చేశాడు. -
‘అవికా-మనీశ్‌లకు సీక్రెట్ బిడ్డ’: స్పందించిన నటుడు
‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గౌర్ తన సహ నటుడు మనీశ్ రాయ్‌సింఘన్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉందని, వారిద్దరికి సీక్రెట్‌గా ఓ బిడ్డ కూడా ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అవికా స్పందిస్తూ.. ‘మనీష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మేము ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం’ అంటూ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టింది. అలాగే దీనిపై నటుడు మనీశ్ రాయ్‌సింఘన్ కూడా తాజాగా స్పందించాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీశ్ మాట్లాడుతూ... అవీకా, తను సీక్రెట్ రిలేషన్లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడించాడు. ‘అవికా నేను మంచి స్నేహితులం. తను చెప్పినట్లుగా మా మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం ఉంది. నేను తనకంటే 18 ఏళ్లు పెద్దవాడిని. సస్రూల్ సిమర్ కా సీరియల్ నుంచి మా మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది. ఇక మాకు సీక్రెట్‌గా ఓ బిడ్డ కూడా జన్మించిందని అనడం దారుణం. ఇది విని మొదట షాక్ అయ్యాను. కానీ ఇలాంటివి ఎలా సృష్టిస్తారా? అని ఆ తర్వాత నవ్వుకున్న. ఇది చూసి నా భార్య సంగీత కూడా నవ్వుకుంది’ అంటూ అతడు చెప్పుకొచ్చాడు. కాగా మనీశ్ రాయ్‌సింఘన్ గతేడాది జూన్‌లో భార్య సంగీతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక అవికా కూడా ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ఎమ్‌టీవీ రౌడీస్ కంటెస్టెంట్ మిలింద్ చంద్వాణీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తననే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల స్పష్టం చేసింది. కాగా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగులో బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సౌత్‌లో పలు సినిమాల్లో నటించి ఫేమ్ తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం నాగ చైతన్య, రాశీఖన్నాల 'థాంక్యూ' సినిమాలో నటిస్తోంది. చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ పెళ్లికి సిద్దం, అతడు ఎప్పుడంటే అప్పుడే: హీరోయిన్ -
అతడు స్నేహితుడు మాత్రమే, బిడ్డను కనలేదు: అవికా గోర్
అవికా గోర్.. సినిమాల్లోకి రాకముందే ఆమె అందరికీ తెలుసు. 'బాలికా వధు'గా హిందీ ప్రేక్షకులకు, 'చిన్నారి పెళ్లికూతురు'గా తెలుగు వీక్షకులకు ఆమె సుపరిచితురాలు. తర్వాత ఆమె 'ససురాల్ సిమర్ కా' అనే మరో సీరియల్లోనూ నటించింది. అందులో నటుడు మనీశ్ రాయ్‌సింఘన్‌తో కలిసి పని చేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, వీళ్లు సీక్రెట్‌గా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. తాజాగా దీనిపై స్పందించిన అవికా.. అందుకు ఆస్కారమే లేదని కుండ బద్ధలు కొట్టేసింది. 'మేం ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు' 'కానీ ఏం చెప్పను? అతడు మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్న వయసు. ఇక మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వచ్చిన కథనాలు మొదట్లో మా మీద ప్రభావాన్ని చూపించాయి. రెండు వారాలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు కూడా! కానీ మళ్లీ అలాంటి పుకార్లు వస్తూనే ఉంటడంతో అసలు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించింది. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్‌లా కలిసిపోయాం. మా గురించి రాసిన గాసిప్ వార్తలు చదివి ఇప్పటికీ సరదాగా నవ్వుకుంటున్నాం' అని అవికా గోర్ చెప్పుకొచ్చింది. చదవండి: పెళ్లికి సిద్దం, అతడు ఎప్పుడంటే అప్పుడే: అవికా గోర్ -
జూమ్ గీమ్ జాన్తా నయ్.. పీఎస్‌కి రావాల్సిందే!
కొత్త ఐటీ పాలసీ, రూల్స్ పాటించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, మైక్రో బ్లాంగిగ్ సైట్ ట్విటర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు మధ్యవర్తిత్వ హోదా కేంద్రం తొలగించగా.. ఘజియాబాద్ వృద్ధుడి దాడి ఘటనలో యూపీ పోలీసుల నోటీసులతో ఇరకాటంలో పడింది. తాజాగా ఈ కేసులో ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని తమ ఎదుట హాజరుకావాలని ఘజియాబాద్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. అయితే తాను వర్చువల్ విచారణకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో యూపీ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు. లక్నో: యూపీ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన స్వయంగా లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జూమ్‌లో విచారణ కుదరదని, స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది యూపీ పోలీస్ శాఖ. లేని పక్షంలో కేసు విచారణకు సహకరించడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో 26 సార్లు నోటీసులు పంపినప్పటికీ మనీష్ స్పందించలేదని ఘజియాబాద్ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడి మీద జరిగిన దాడి ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తే.. ట్విటర్ ద్వారా ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీంతో ట్విటర్ నిర్లక్ష్యం వహించిందనేది యూపీ పోలీసుల ఆరోపణ. ఈ మేరకు ట్విటర్‌పై ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో ఎండీ మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపారు. కాగా, ఇటువంటి వివాదాలతో తనకు సంబంధం లేదని, వీటిని తాన్ డీల్ చేయనని మనీష్ ఇదివరకే పోలీసులకు బదులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ వివరణపై సంతృప్తి చెందని ఘజియాబాద్ పోలీసులు.. ఫేస్ టు ఫేస్ విచారణను ఎదుర్కొవాల్సిందేనని తేల్చిబాధ్యత చెప్పారు. చదవండి: బాధ్యత ఉండక్కర్లా? -
మరేం చేయాలి.. లొంగిపోవాలి అంతే!
ముంబై: టీవీ నటులు మనీష్ రాయ్‌సింఘన్, సంగీత చౌహాన్ పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు మంగళవారం వివాహ బంధంలో అడుగుపెట్టారు. ముంబైలోని ఓ గురుద్వారలో అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వధూవరులిద్దరు తమ దుస్తులకు మ్యాచ్ అయ్యే మాస్కులు ధరించడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, అభిమానులు కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ‘ససురాల్ సిమర్ కా’ అనే హిందీ సీరియల్‌తో పాపులర్ అయిన మనీశ్ రాయ్‌సింఘన్.. ఆ తర్వాత ‘ఏక్ శ్రింగార్- స్వాభిమాన్’ మరో సీరియల్లో నటించాడు. (వెండితెరపై ‘1200 కిలో మీటర్ల పయనం’) ఈ క్రమంలో సహ నటి సంగీత ప్రేమలో పడిన అతడు ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహమాడనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ఇక పెళ్లి సందర్భంగా.. ‘‘అసలు ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఎన్నడూ ఊహించలేదు! నాకు పెళ్లా? మరి ఏం చేయను.. తన సింప్లిసిటీ, నిష్కల్మషమైన మనసుతో ఓ అమ్మాయి మనల్ని ఆకర్షిస్తే ఏం చేయగలం. లొంగిపోవాలి అంతే కదా.. ఆ లవ్లీ లేడీ సంగీత చౌహాన్. నాతో జీవితాంతం కలిసి ఉండే శిక్ష అనుభవించకతప్పదు. ఇకపై ఆ దేవుడే తనను కాపాడాలి. స్వాగతం సంగీత’’అంటూ కాబోయే భార్యను తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇక తన ప్రాణ స్నేహితుడినే భర్తగా పొందడం నమ్మలేకుండా ఉన్నానని సంగీత పేర్కొన్నారు. (బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ ) View this post on Instagram Its Finally Official ! WE ARE GETTING MARRIED !!! Swip left... This was the time when I met him first to know him as a great friend which landed me to fall in love with him head over heals soon for the kind of person he is...still can’t believe how time has passed and here we are today sharing our vows! ♥️♥️♥️Manish I Love U ♥️♥️♥️ Thankyou for choosing me🤗🤗🤗 . . And most importantly Thankyou @purvapandit aka my best friend ! For creating this wonderful invite for us... which speaks thousand words/thousand feelings in such a simple way💕 #sangva A post shared by Sangeita Chauhaan (@sangeitachauhaan) on Jun 29, 2020 at 11:06am PDT -
పెళ్లి చేసుకోనున్న స్టార్ జంట!
టీవీ నటుడు, ‘ససురాల్ సిమర్ కా’ ఫేం మనీశ్ రాయ్‌సింఘన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి సంగీత చౌహాన్‌ను వివాహమాడనున్నాడు. లాక్డౌన్ నిబంధనల మేరకు అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని గురుద్వారలో జూన్ 30న వీరి పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా సీరియల్ నటుడిగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మనీశ్.. ‘హీరోయిన్’సినిమాతో వెండితెరపై తళుక్కుమన్నాడు. (తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి) ఈ క్రమంలో తనతో కలిసి ఏక్ శ్రింగార్- స్వాభిమాన్ సీరియల్లో నటించిన సంగీతతో ప్రేమలో పడిన అతడు.. పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లిచేసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మనీశ్ స్నేహితురాలు, నటి అవికాగోర్ సోషల్ మీడియా వేదికగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజునే వీరి వివాహం జరుగనుందని హర్షం వ్యక్తం చేశారు. కాగా గతంలో మనీశ్- అవిక డేటింగ్ చేసినట్లు, పెళ్లి కూడా చేసుకున్నట్లు వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.(డబ్బుల్లేవు.. వేరే ఆప్షన్ లేదు: నటుడు) -
క్వార్టర్ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సచిన్ కుమార్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనీశ్ 5–0తో చు ఎన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో ఒమర్బెక్ బెక్జిగిట్ యులు (కిర్గిస్తాన్)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్ ఓడించాడు. -
అమితానందం
45 ఏళ్ల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏ భారత బాక్సర్‌కు సాధ్యం కాని ఘనతను అమిత్ పంఘాల్ సాధించాడు. ఇప్పటి వరకు కాంస్యాలకే పరిమితమైన మన బాక్సింగ్ ఘనత స్థాయిని తొలిసారి పెంచాడు. చాంపియన్‌షిప్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బాక్సర్‌గా నిలిచి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. తుది పోరులోనూ ఇదే రీతిలో సత్తా చాటితే అతని పంచ్ పసిడిని తాకడం ఖాయం. మరోవైపు సెమీస్‌లో ఓటమితో మనీశ్ కౌశిక్ కంచుకే పరిమితమయ్యాడు. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ఐదో బాక్సర్‌గా మనీశ్ నిలిచాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) ఈ ఘనత సాధించారు. ఎకతెరిన్‌బర్గ్ (రష్యా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్ రెండు పతకాలు సాధించిన సంబరం శుక్రవారం రెట్టింపయింది. 52 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాక్సర్ అతనే కావడం విశేషం. సెమీఫైనల్లో అమిత్ 3–2 తేడాతో సాకెన్ బిబోసినోవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. తుది పోరుకు అర్హత సాధించడంతో అమిత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అతను ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ షఖోబిదీన్ జొయిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. తనదైన వేగం, నైపుణ్యం కలగలిపి అమిత్ విసిరిన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద జవాబు లేకపోయింది. దీంతో పాటు అత్యుత్తమ డిఫెన్స్‌తో అతను బిబోసినోవ్‌ను నిలువరించాడు. అమిత్‌తో పోలిస్తే పొడగరి అయిన కజకిస్తాన్ బాక్సర్ తన ఎత్తును ఉపయోగించుకుంటూ శక్తిమేర అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అమిత్ తగినంత దూరం పాటిస్తూ తెలివిగా వ్యవహరించడంతో బిబోసినివ్ విసిరిన కొన్ని పంచ్‌లు అసలు భారత బాక్సర్‌ను తాకలేదు. కొన్ని దగ్గరగా వచి్చనా వాటిలో పెద్దగా పదును లేకపోయింది. మనీశ్‌కు నిరాశ... 63 కేజీల విభాగంలో మనీశ్ కౌశిక్ ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఆండీ గోమెజ్ క్రజ్ (క్యూబా) 5–0తో మనీశ్‌ను చిత్తుగా ఓడించాడు. కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత అయిన మనీశ్ తన ప్రత్యర్థి ముందు ఏమాత్రం నిలవలేకపోయాడు. వరుస పంచ్‌లతో క్యూబా స్టార్ విరుచుకుపడటంతో మూడు రౌండ్లలోనూ ఏమీ చేయలేక కౌశిక్ చేతులెత్తేశాడు. తన అత్యుత్తమ ప్రదర్శన ఇచి్చనా... కొన్ని లోపాలతో బౌట్‌ను కోల్పోయానన్న భారత బాక్సర్... భవిష్యత్తులో మరింత శ్రమిస్తానని వ్యాఖ్యానించాడు. ►చాలా సంతోషంగా ఉంది. అయితే నా పని పూర్తి కాలేదు. దీని కోసం ఎంతో కష్టపడ్డాను కాబట్టి స్వర్ణం సాధించేందుకు గట్టిగా ప్రయతి్నస్తా. ఫైనల్లో ఆడబోతున్న బాక్సర్తో గతంలో ఎప్పుడూ తలపడలేదు. కాబట్టి అతని వీడియోలు చూసి సిద్ధం అవుతాను. కేటగిరీ మార్చుకున్న తర్వాత నేను దానికి అనుగుణంగా ఎప్పుడో మారిపోయాను. నా పంచ్లలో వేగం కూడా పెరిగింది. –అమిత్ -
పతకాలకు పంచ్ దూరంలో...
ఎకతేరిన్‌బర్గ్ (రష్యా): ఆసియా చాంపియన్ అమిత్ పంగల్ ‘పంచ్’ అదిరింది. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ స్టార్ బాక్సర్ అడుగు క్వార్టర్ ఫైనల్లో పడింది. ఇతనితో పాటు మనీశ్ కౌశిక్, సంజీత్, కవీందర్ సింగ్ బిష్త్‌లు కూడా క్వార్టర్స్ చేరారు. మరో విజయం సాధిస్తే ఈ నలుగురికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మంగళవారం జరిగిన 52 కేజీల విభాగంలో ఆసియా స్వర్ణ విజేత, రెండో సీడ్ అమిత్ 5–0తో టర్కీ బాక్సర్ బటుహన్ సిట్‌ఫిసీను కంగుతినిపించాడు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ (2017)లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన అమిత్ ఈసారి పతకం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. తొలిసారి ప్రపంచ ఈవెంట్ బరిలో పాల్గొంటున్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) 5–0తో నాలుగో సీడ్ చిన్‌జోరిగ్ బాటర్సుక్ (మంగోలియా)ను బోల్తా కొట్టించగా... సంజీత్ (91 కేజీలు) 3–2తో రెండో సీడ్ సంజార్ తుర్సునోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, కవీందర్ సింగ్ బిష్త్ 3–2తో అర్స్లాన్ ఖతయెవ్ (ఫిన్లాండ్)పై సంచలన విజయాలు సాధించారు. ఈ నలుగురు భారత ఆర్మీకి చెందిన బాక్సర్లు కావడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో అమిత్... ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్లో పాలమ్‌తో, వాండర్సన్ డి ఒలివిరా (బ్రెజిల్)తో మనీశ్... ఏడో సీడ్ జులియో సెసా క్యాస్టిలో (ఈక్వెడార్)తో సంజీత్ తలపడనున్నారు. -
రెండో రౌండ్ దాటలేదు
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో సోమవారం మూడు విభాగాల్లో భారత రెజ్లర్లు రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయారు. గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు) రెండో రౌండ్లో ఓటమి చెందగా... నవీన్ (130 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే నవీన్‌ను ఓడించిన క్యూబా రెజ్లర్ ఆస్కార్ పినో హిండ్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో నవీన్‌కు నేడు ‘రెపిచేజ్’ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరుకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తొలి రౌండ్ బౌట్లలో వాగ్నర్ (ఆస్ట్రియా)పై గుర్ప్రీత్, జానెస్ (ఫిన్లాండ్)పై మనీశ్ గెలిచారు. అయితే రెండో రౌండ్ బౌట్లలో గుర్ప్రీత్ 1–3తో నెమిస్ (సెర్బియా) చేతిలో... మనీశ్ 0–10తో కియోబాను (మాల్డొవా) చేతిలో ఓడిపోయారు. -
భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. ఆదివారం గ్రీకో–రోమన్ విభాగంలో బరిలో నిలిచిన మనీశ్ (67 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) తొలి రౌండ్లో నిష్క్రమించగా... రవి (97 కేజీలు) రెండో రౌండ్లో ఓడాడు. మొదటి రౌండ్లో రవి 5–0తో చెంగ్ హో చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో రవి 0–7తో ఆర్టర్ ఒమరొవ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన 67 కేజీల విభాగం తొలి రౌండ్లో మనీశ్ 1–10తో డేవిడ్ తిహోమిరొవ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో, 87 కేజీల విభాగంలో సునీల్ 0–6తో జోసెఫ్ పాట్రిక్ (అమెరికా) చేతిలో ఓడారు. నేడు గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో దిగుతారు. -
మనీశ్ కౌశిక్ ముందంజ
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): ప్రతిష్టాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు, కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత మనీశ్ కౌశిక్ రెండోరౌండ్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల 63కేజీల బౌట్లో మనీశ్ 5–0తో ఉలూ అర్జెన్ కదిర్‌బెక్ (కిర్గిస్తాన్)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన మనీశ్ పెద్దగా కష్టపడకుండానే విజయాన్ని అందుకున్నాడు. అతని పదునైన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకుండా పోయింది. రెండో రౌండ్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్రికో లాక్రూజ్‌తో మనీశ్ తలపడతాడు. ఈ టోర్నీలో ఇప్పటికే బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రెండోరౌండ్‌కు అర్హత సాధించగా.. భారత బాక్సర్లు ముగ్గురికి తొలిరౌండ్లో ‘బై’ లభించింది. అమిత్ పంగల్ (52 కేజీలు), కవీందర్ సింగ్ (57 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) నేరుగా రెండోరౌండ్ బౌట్లో తలపడనున్నారు. -
ఒక అమ్మాయి.. ఇద్దరు ప్రేమికులు
సూర్య, మనీష్ హీరోలుగా, స్నేహ హీరోయిన్గా ఎల్.వి. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్షిప్ వెర్సస్ లవ్’. లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో నయన్ షా ఫిలిమ్స్ పతాకంపై గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఎల్.వి.రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధించారు? అనే నేపథ్యంలో రూపొందిన మా చిత్రం యువతరం ప్రేక్షకులతో పాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది’’ అన్నారు గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్. -
ఈ వంట... ఆ వంట... మన ఇంట
‘మనీష్ మెహ్రోత్రా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ చెఫ్’ అంటారు వీర్ సంఘ్వి. బిహార్‌లోని పాట్నాలో జన్మించిన మనీష్, ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న రోజుల్లోనే వంటకాల మీద అభిమానాన్ని ప్రేమను పెంచుకున్నాడు. ‘ఓల్డ్ వరల్డ్ హాస్పిటాలిటీ ఓరియెంటల్ ఆక్పోస్’ (ద పాపులర్ మెంబర్స్ రెస్టారెంట్ ఎల్ ఇండియా హాబిటేల్ సెంటర్, ఢిల్లీ) లో 2000 సంవత్సరంలో చేరిన తరువాత, ఆసియా ఖండమంతా పర్యటించి, అక్కడివారికి ‘పాన్ ఆసియా క్విజీన్’లో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక 2009లో ‘ఇండియా యాక్సెంట్’ను స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ఖ్యాతి చెందారు. అనేక అవార్డులు అందుకున్నారు. గ్రేట్ ఆర్ట్, సింపుల్ రెసిపీ... కుటుంబాన్ని ఒకచోట చేర్చుతారు, వారివే అయిన రుచులతో వారికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తారు. భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన చెఫ్ అయిన మనీష్, ఢిల్లీలోని ‘ద లోధీ రెస్టారెంట్’లో వంటలతో ఫ్యూజన్ చేస్తున్నారు. చ్యవనప్రాశను క్రీమ్ బ్రూలీతో, ఆమ్లా మురబ్బాను తందూరీతో, కిచ్డీని వేయించిన పోర్క్‌తో ఫ్యూజన్ చేస్తున్నారు. ఆయన మన ఆహారం గురించి ‘‘భారతీయ వంటకాలను అంతర్జాతీయ విధానంలోను, విదేశీ వంటకాలను భారతీయ విధానంలోనూ చూపుతాను’’ అంటున్నారు. భోజన ప్రియుల నాలుకలు నిరంతరం కొత్త రుచుల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రుచులకు అనుగుణంగానే మనీష్ మెహ్రోత్రా కొత్త కొత్త వంటకాలు కనిపెడుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన 50 రెస్టారెంట్లలో ‘ఇండియన్ యాక్సెంట్’ ఉంటోంది. 2017లో ట్రిప్ అడ్వయిజర్ ఈ రెస్టారెంట్‌కి మొదటి ర్యాంకు ఇచ్చింది. ఆసియాలో 2వ స్థానంలోను, ప్రపంచంలో 19వ స్థానంRecipesలోను ఉంది మ్యాస్ట్రో మెహ్రోత్రా రూపొందించిన ఈ రెస్టారెంట్. -
షాక్ ఇచ్చిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొంత కాలంగా లులియా వాంతూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. పలు వేదికల మీద ఇద్దరు కలిసి సందడిచేశారు. అంతేకాదు సల్మాన్ ఇంట్లో జరిగే వేడుకల్లోనూ లూలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన లులియా, సల్మాన్ అంటే నాకు గౌరవం మాత్రమే మా మధ్య ఏమీ లేదంటూ షాక్ ఇచ్చారు. అంతేకాదు నా పై వస్తున్న రూమర్స్ గురించి తెలిసింది. కానీ అవి ఎవరో పుట్టించిన రూమర్స్. వాటిని నేను ఆపలేను. నా జీవితం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నాకు తెలియడం లేదు. మూడు సంవత్సరాల క్రితం నేను నా జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను అంటూ వేదాంత ధోరణిలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలో ఈ భామ మనీశ్ పాల్ జంటగా ‘హర్ జై’ అనే వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
అథ్లెట్స్ ఖుష్బీర్ కౌర్, మనీశ్‌లపై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళా రేస్‌వాకర్ ఖుష్బీర్ కౌర్ పై వేటు పడింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్ షిప్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి ఆమెను తప్పించింది. జాతీయ చాంపియన్ షిప్లో శనివారం 20 కిలో మీటర్ల ఈవెంట్ నుంచి ఖుష్బీర్ కౌర్ చెప్పాపెట్టకుండా తప్పుకోవడంతో ఏఎఫ్ఐ ఆమెను జాతీయ జట్టు నుంచి తొలగించింది. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల ఖుషీ్బర్ 2014 ఇంచియోన్ సియా క్రీడల్లో 20 కిలోమీటర్ల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆసియా రేస్ వాకింగ్ ఈవెంట్ జపాన్ లోని నోమిలో వచ్చే నెల 20 నుంచి జరుగనుంది. మరోవైపు ‘రియో ఒలింపియన్ ’ మనీశ్ సింగ్ రావత్‌ను కూడా జాతీయ జట్టు నుంచి ఏఎఫ్ఐ తప్పించింది. జాతీయ చాంపియన్ షిప్లో 20 కిలోమీటర్ల నడక పోటీలో బరిలోకి దిగాల్సిన అతను ముందస్తు సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో వైదొలిగాడు. జాతీయ పోటీల్లో పాల్గొనని అథ్లెట్లను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేయబోమని ఏఎఫ్ఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గుర్బచన్ సింగ్ రణ్‌ధావా స్పష్టం చేశారు. జాతీయ శిబిరాల నుంచి వారిని తొలగించాలని కూడా ఏఎఫ్‌ఐకి సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. వారి కోచ్ అలెగ్జాండర్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఎఫ్ఐ కార్యదర్శి సీకే వాల్సన్ మాట్లాడుతూ ఇలాంటివి పునరావృతవైుతే భవిష్యతు్తలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
క్షణ క్షణం ఉత్కంఠగా..!
మనీశ్, తేజస్విని జంటగా నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. రఘురామ్ స్వర కర్త. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అందించారు. ఆర్పీ మాట్లాడుతూ - ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. రఘురామ్ గాయకుడిగా తెలుసు. వృత్తిపట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు’’ అన్నారు. ‘‘కమర్షియల్ హంగులతో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ అండ్ హారర్ చిత్రమిది. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగు తుంది’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘హారర్ చిత్రమే కానీ దెయ్యం ఉండదు. ట్విస్టులతో ప్రతి క్షణం ఆసక్తిగా సాగుతుంది. రఘు రామ్ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్స్. అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, సాయి వెంకట్, హీరో హీరోయిన్లు మనీశ్, తేజస్విని, స్వరకర్త రఘురామ్ పాల్గొన్నారు. -
నందిని, మనీషాల మృతిపై న్యాయ విచారణ జరపాలి
కడప ఎడ్యుకేషన్ : నారాయణ కళాశాలలో ఈనెల 17న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు నందిని, మనీషాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై న్యాయ విచారణ నిర్వహించాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కడపలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సంధ్యా సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ హరితా హోటల్ వరకు సాగింది. అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ.. నందిని, మనీషాలవి ముమ్మాటికి హత్యలేనన్నారు. ఇందుకు కారణమైన కళాశాల సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అనుమతులను రద్దు చేయాలని కోరారు. మరణించిన విద్యార్థుల ఇళ్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి.. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు తిష్ట వేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు నిత్య పూజయ్య, నాగార్జున రెడ్డి, మాసిన్, పెంచలయ్య, సందీప్, అబ్బాస్, సలావుద్ధీన్, సోహెల్, వెంకటేష్ పాల్గొన్నారు. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
మయాంక్, మనీష్ సెంచరీల మోత దక్షిణాఫ్రికా ‘ఎ’పై విజయం నేడు ఆసీస్‌తో అమీతుమీ చెన్నై: మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 176; 20 ఫోర్లు; 5 సిక్సర్లు), మనీష్ పాండే (85 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో ముక్కోణపు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు ఫైనల్‌కు చేరింది. చిదంబరం స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఉన్ముక్త్ చంద్ సేన 34 పరుగుల తేడాతో గెలిచింది. శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో తుది పోరు జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్, ఉన్ముక్త్ (77 బంతుల్లో 64; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు సెంచరీ (106) భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పాండే, మయాంక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టి20 తరహా హిట్టింగ్తో సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ఈ జోడి రెండో వికెట్‌కు 203 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ (86 బంతుల్లో 113; 10 ఫోర్లు; 6 సిక్సర్లు), ఖాయా జోండో (60 బంతుల్లో 86; 7 ఫోర్లు; 5 సిక్సర్లు) వేగంగా ఆడి విజయం కోసం ప్రయత్నించినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. హెండ్రిక్స్ (109 బంతుల్లో 76; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అక్షర్ పటేల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫైనల్ భారత్ ‘ఎ’ ఆసీస్ ‘ఎ’ ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
గూగుల్‌ను ఆకట్టుకొన్న యంగ్ టీమ్!
భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చే యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది... భవిష్యత్తులో వాళ్లంతా స్వదేశంలోనే సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెడతారు... అని అంటాడు రాహుల్ జైన్. ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ ద్వారా గూగుల్ ఐఎన్‌సీ నుంచి పెట్టుబడులను ఆకర్షించిన యువభారతీయ బృందంలో ఒకరు రాహుల్‌జైన్(27). జై శ్రీనివాసన్, మనీశ్‌లతో కలసి రాహుల్‌జైన్ అప్యూరిఫై అప్లికేషన్‌ను రూపొందించాడు. ఇప్పుడు ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్‌లో చదువు పూర్తి కాగానే రాహుల్ జైన్ జింగా అనే గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించాడు. చదివిన చదువు, చేస్తున్న పని అతడిలోని సృజనాత్మకతను మేల్కొల్పాయి. ఉద్యోగాన్ని వదిలి సొంతంగా కొత్త అప్లికేషన్‌ను రూపొందించాలనే ఆలోచనను కలిగించాయి. ఇలాంటి మేధోమథనం నుంచే ‘అప్యూరిఫై’ అనే అప్లికేషన్ పుట్టింది. తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఆ అప్లికేషన్‌కు ప్రాణం పోసే పనిలో పడ్డాడు రాహుల్. ఇతడి అప్లికేషన్ గురించి సమాచారమందుకొన్న గూగుల్ పెట్టుబడి దారుగా రంగంలోకి దిగింది. ఆ అప్లికేషన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్న గూగుల్ దాన్ని టేకోవర్ కూడా చేసింది. గూగుల్ మానసపుత్రిక అయిన ఆండ్రాయిడ్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఆ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచడానికి ఒకింత భారీ మెత్తాన్ని చెల్లించి జైన్‌తో ఒప్పందం చే సుకొంది. దీంతో ఈ యువకుడి దశ తిరిగింది. పేరు మార్మోగింది. తన అప్లికేషన్‌ను గూగుల్‌కు అమ్మడం ద్వారావచ్చిన డబ్బును మరిన్ని స్టార్టప్‌ల మీద పెట్టుబడిగా పెడుతున్నాడు రాహుల్ జైన్. వివిధ అవసరాల కోసం మనిషికి సదుపాయంగా ఉండే అప్లికేషన్‌ను అభివృద్ధి పరచడానికి సరికొత్త అప్లికేషన్ల రూపకల్పనకు పూనుకొన్నాడు. ప్రముఖ వ్యవస్థాపకుడిగా మారాడు. ‘భారత్‌లో వ్యాపారవేత్తల్లోఎక్కువమంది ఇన్నిరోజులూ సేవారంగానికి సంబంధించిన విభాగాలపైనే దృష్టిపెట్టారు. ఔట్సోర్సింగ్ రూపంలో కార్మికవృత్తికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయంలో మార్పు వస్తోంది. భారతీయులు తమ తెలివితేటలను విభిన్న రంగాల్లో వ్యాపారాభివృద్ధిని సాధించడానికి పెట్టుబడిగా పెడుతున్నారు...’ అనేది జైన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ ఇతరుల విషయంలో ఏమో కానీ... జైన్ విషయంలో అయితే మాత్రం వంద శాతం నిజమనిపిస్తుంది. జైన్ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు వచ్చి జై శ్రీనివాసన్, మనీశ్లను కలుపుకొని అప్లికేషన్ రూపకల్పన ఆలోచన చేశాడు. ఆ సాహసమే విజయానికి దారి చూపింది. అప్లికేషన్ ఐడియా గురించి చెప్పగా గూగుల్ వెంచర్స్ వాళ్లు 1.75 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడానికి ముందుకొచ్చారు. అనంతరం మరో 4.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించి ఆ అప్లికేషన్‌ను పూర్తిగా కొనేశారు. దీంతో జైన్ బృందం దశ తిరిగింది. రాజీ పడిపోయి ఉద్యోగాలు చేసుకొంటూ, కంఫర్ట్ జోన్లో ఉన్నామని ఆనందిస్తూనే, మరోవైపుగా ఆందోళన పడటం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటే సాహసం చేయడమే మంచిదనేది జైన్ సిద్ధాంతం. తను ఇప్పుడు అనుసరించిన ఈ బాటనే రానున్న రోజుల్లో మరింతమంది భారతీయ యువతీ యువకులు అనురిస్తారని జైన్ భావిస్తున్నాడు. ఈ మాటల ద్వారా అనేక మందిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. రాహుల్‌జైన్ కాన్పూర్‌కు చెందిన యువకుడు. తండ్రి ప్రభుత్వ పనులను చేసిపెట్టే కాంట్రాక్టర్. ఉద్యోగాన్ని వదిలి ఈ విధంగా అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మొదట ఇంట్లో మద్దతు లభించలేదని... అయినప్పటికీ తను రిస్క్ చేశానని జైన్ చెబుతాడు. మరి ఇప్పుడు ఆ రిస్క్‌కు తగినట్టుగా విజయాన్ని సాధించడం ఎంతో ఆనందాన్నిస్తుందని అంటాడు. -
దేవుడున్నాడని...!
మనీష్, యామిని జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ముళ్లపూడి వరతో కలిసి వి.వి.వరాంజనేయులు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నటి జయలలిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదిస్తుంటారు. నా అనుభవాలను బట్టి దేవుడున్నాడని నమ్ముతాను. దేవుడి విషయంలో నాకు ఎదురైన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నా. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలందించడం పెద్ద ఎస్సెట్. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉంటుంది. అరకు, తలకోన ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని వరాంజనేయులు చెప్పారు. వరాంజనేయులు చక్కని కథ తయారు చేశాడని ముళ్లపూడి వర అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. వి2 క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. -
స్వరానందంలో హమ్‌తుమ్
మనీష్, సిమ్రన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హమ్ తుమ్’. రామ్ భీమన దర్శకుడు. ఎం.శివరామిరెడ్డి నిర్మాత. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వరసారథ్యంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్రం యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పాటల్లాగే సినిమా కూడా విజయం సాధిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందని, నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్న వారిలా నటించారని దర్శకుడు చెప్పారు. ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, సూర్య, నాగినీడు, గుండు హనుమంతరావు, నందిని, ఐశ్వర్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జి.శివకుమార్, కూర్పు: నందమూరి హరి. -
స్వచ్ఛమైన ప్రేమ గెలుస్తుంది!
స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉందనే కాన్సెప్ట్‌తో ఆపిల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హమ్ తుమ్’. టైటిల్ చదివి, ఇదేదో హిందీ సినిమా అనుకునేరు. అచ్చమైన తెలుగు సినిమా అంటున్నారు యమ్. శివరామిరెడ్డి. ‘ఈరోజుల్లో’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించిన ఆయన ‘హమ్ తుమ్’ ద్వారా సోలో నిర్మాతగా మారారు. రామ్ బిమానను దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. మహతి స్వరపరచిన ఈ చిత్రం పాటలను వచ్చే నెల రెండో వారంలో, సినిమాని అదే నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ కథకు ఈ టైటిలే కరెక్ట్ కాబట్టి పెట్టాం.. చక్కని ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ యువతీయువకుడు ఒకరిపట్ల ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. ఆ ప్రభావం ప్రేమకు దారి తీస్తుంది. అనంతరం వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కథాంశం’’ అన్నారు. మనీష్, సిమ్రాన్, నిఖిల్ చక్రవర్తి, ఐశ్వర్య, ఎమ్మెస్, ధర్మవరపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహరచయితలు: దుర్గా చేపూరి, మురళి మడిచర్ల, కెమెరా: జి. శివకుమార్.