రెండో రౌండ్‌ దాటలేదు | World Wrestling Championship Gurpreet And Manish Loses In The Second Round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌ దాటలేదు

Published Tue, Sep 17 2019 3:26 AM | Last Updated on Tue, Sep 17 2019 3:26 AM

World Wrestling Championship Gurpreet And Manish Loses In The Second Round - Sakshi

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌  పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో సోమవారం మూడు విభాగాల్లో భారత రెజ్లర్లు రెండో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేకపోయారు. గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77 కేజీలు), మనీశ్‌ (60 కేజీలు) రెండో రౌండ్‌లో ఓటమి చెందగా... నవీన్‌ (130 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. అయితే నవీన్‌ను ఓడించిన క్యూబా రెజ్లర్‌ ఆస్కార్‌ పినో హిండ్స్‌ ఫైనల్‌కు చేరుకోవడంతో నవీన్‌కు నేడు ‘రెపిచేజ్‌’ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరుకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తొలి రౌండ్‌ బౌట్‌లలో వాగ్నర్‌ (ఆస్ట్రియా)పై గుర్‌ప్రీత్,  జానెస్‌ (ఫిన్‌లాండ్‌)పై మనీశ్‌ గెలిచారు. అయితే రెండో రౌండ్‌ బౌట్‌లలో గుర్‌ప్రీత్‌ 1–3తో నెమిస్‌ (సెర్బియా) చేతిలో... మనీశ్‌ 0–10తో కియోబాను (మాల్డొవా) చేతిలో ఓడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement