Gurpreet Singh
-
జాతీయ జట్టులోకి విదేశీ ఆటగాళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాల్లో మాదిరిగా భారత్‌లో కూడా విదేశీ ప్లేయర్లను జాతీయ జట్టు తరఫున ఆడించే నిబంధనలను అమల్లోకి తెస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. చాలా దేశాల్లో విదేశీ క్రీడాకారులు నిర్దిష్ట సమయంపాటు నివసిస్తే వాళ్లకు ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చే నిబంధన అమల్లో ఉంది. అయితే భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆ దిశగా ఆలోచన చేయడం మంచిదని గుర్ప్రీత్ సూచించాడు. దాని కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తే మంచిదని సూచనాప్రాయంగా అన్నాడు. ఇలా విదేశీ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున ఆడితే... మన ప్లేయర్లకు కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఏఎఫ్సీ ఆసియా కప్‌నకు అర్హత సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్న గుర్ప్రీత్... కొత్త కోచ్ మానొలో సారథ్యంలో జట్టు మంచి విజయాలు సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ముందు భారత్ చివరి అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా మలేసియాతో తలపడుతుంది. మలేసియా జట్టులో పలువురు విదేశీ ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో గుర్ప్రీత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం గుర్ప్రీత్ ఆన్లైన్లో మాట్లాడుతూ... ‘గతం గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. జరిగిందేదో జరిగింది. ప్రతీసారి గెలవాలనే లక్ష్యంతోనే మైదానంలో అడుగు పెడతాం. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. మలేసియాతో పోరు కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు మాకు ఇదే చివరి మ్యాచ్. మలేసియా జట్టులో విదేశాలకు చెందిన 14 మంది ప్లేయర్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మారాలెస్, బ్రెజిల్‌కు చెందిన ఎన్డ్రిక్ డాస్, సాన్టోస్ వంటి పలువురు ఆటగాళ్లు మలేసియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నిబంధన వల్ల వాళ్లకు అదనపు ప్రయోజనం చేకూరడం ఖాయం. మనం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. శ్రీలంక జట్టు కూడా ఇలా విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇస్తోంది’ అని అన్నాడు. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే గతంలో విదేశాల్లోస్థిరపడిన భారత సంతతి ఆటగాళ్లను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా... అది కార్యరూపం దాల్చలేదు. -
పంజాబ్‌లో ఆప్ కార్యకర్త కాల్చివేత
అమృత్సర్: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్‌తారన్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు. కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
Wrestler Gurpreet Singh: గుర్‌ప్రీత్‌కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు ఆదివారం పురుషుల గ్రీకో రోమన్ 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్లో గుర్ప్రీత్ 4–2 పాయింట్ల తేడాతో విక్టర్ నెమిస్ (సెర్బియా)పై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీకాగా... ఈ టోర్నీ ద్వారా భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను ఖరారు చేసుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుమిత్ మలిక్ (125 కేజీలు) రజతం నెగ్గి, మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా బిస్లా (50 కేజీలు) స్వర్ణ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కేవలం ఫైనల్‌కు చేరిన రెజ్లర్లే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ విభాగం 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. అయితే గుర్ప్రీత్ సింగ్‌ను ఓడించిన రఫీగ్ హుసెనోవ్ (అజర్బైజాన్) ఫైనల్‌కు చేరుకోవడంతో గుర్ప్రీత్ సింగ్‌కు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కింది. -
యూఏఈలో భారతీయుడికి 20 కోట్ల లాటరీ
దుబాయ్: యూఏఈలోని ఉంటున్న భారతీయుడొకరు లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీకి మేనేజర్‌గా పనిచేస్తున్న గుర్ప్రీత్ సింగ్(35) 10 మిలియన్ దిర్హామ్స్(సుమారు 19.90 కోట్లు) గెలుచుకున్నట్లు ఖలీజ్ టైమ్స్ తెలిపింది. పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ ఆగస్టు 12వ తేదీన లాటరీ టికెట్ కొన్నారు. ఈ నెల 3వ తేదీన బిగ్ టికెట్ లాటరీ సంస్థ ప్రకటించిన ఫలితాల్లో గురుప్రీత్ సింగ్ జాక్‌పాట్ గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి బిగ్ టికెట్ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్న గురుప్రీత్‌ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ఈ డబ్బుతో దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుని, పంజాబ్‌లో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులను తీసుకువస్తానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పారు. -
రెండో రౌండ్ దాటలేదు
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో సోమవారం మూడు విభాగాల్లో భారత రెజ్లర్లు రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయారు. గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు) రెండో రౌండ్లో ఓటమి చెందగా... నవీన్ (130 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే నవీన్‌ను ఓడించిన క్యూబా రెజ్లర్ ఆస్కార్ పినో హిండ్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో నవీన్‌కు నేడు ‘రెపిచేజ్’ పద్ధతి ద్వారా కాంస్య పతక పోరుకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తొలి రౌండ్ బౌట్లలో వాగ్నర్ (ఆస్ట్రియా)పై గుర్ప్రీత్, జానెస్ (ఫిన్లాండ్)పై మనీశ్ గెలిచారు. అయితే రెండో రౌండ్ బౌట్లలో గుర్ప్రీత్ 1–3తో నెమిస్ (సెర్బియా) చేతిలో... మనీశ్ 0–10తో కియోబాను (మాల్డొవా) చేతిలో ఓడిపోయారు. -
రజతాలు నెగ్గిన గుర్ప్రీత్, సునీల్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు) రజత పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్లో గుర్ప్రీత్ 0–8తో హైనోవూ కిమ్ (కొరియా) చేతిలో... సునీల్ 0–2తో హుస్సేన్ అహ్మద్ నూరీ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. అంతకుముందు సెమీఫైనల్స్‌లో గుర్ప్రీత్ 6–5తో షదుకయెవ్ (కజకిస్తాన్)పై, అజామత్ (కజకిస్తాన్)పై సునీల్ గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో గుర్ప్రీత్ 10–0తో షరీఫ్ బాదర్ (ఖతర్)పై, సునీల్ 14–7తో ఒఖోనోవ్ (తజికిస్తాన్)పై నెగ్గారు. మరోవైపు 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో ప్రేమ్ కుమార్ 0–5తో దామిర్ కుజుమ్బయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 55 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంజీత్ 3–5తో సులైమనోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో విక్రమ్ 0–8తో జిన్వూంగ్ జంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఆకాశంలో విమానం : కాక్‌పిట్‌లో టెన్షన్
న్యూఢిల్లీ : విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా అది అత్యంత ప్రమాదమే. విమానంలో ఉన్న ప్రయాణికులందరి ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ ఎయిరిండియా విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఓ వ్యక్తి, విమానాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన వ్యవస్థ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి తెగ రచ్చ రచ్చ చేశాడు. దీంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న 250 మంది ప్రయాణికులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. మిలాన్ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ 138 న్యూఢిల్లీకి బయలుదేరింది. గుర్ప్రీత్ సింగ్ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లో ఉండగానే రూట్ మార్చేసిన విమానం తిరిగి మిలాన్ వెళ్లిపోయింది. మిలాన్‌లో ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుకున్న సమయానికే మిలాన్ నుంచి ఈ విమానం టేకాఫ్ అయినప్పటికీ, ఓ విచిత్ర ప్రయాణికులు కాక్ పిట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా పేర్కొంది. అప్పటికే విమానం గంటకు పైగా ప్రయాణించిందని తెలిపింది. ఈ గందరగోళంతో తిరిగి మిలాన్ వెళ్లాలని నిర్ణయించాం. ఇలా రెండు గంటల 37 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సెక్యురిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి బయలుదేరిందని ఎయిరిండియా ప్రకటన చేసింది. -
తప్పతాగిన లాయర్.. ఛేజ్ చేసి మరీ..!
సాక్షి, న్యూఢిల్లీ : పబ్లిక్‌లో స్మోకింగ్ చేయవద్దని చెప్పిన కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తప్పతాగిన లాయర్ విద్యార్థిపై నుంచి కారు తీసుకెళ్లడంతో దాదాపు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. ఈ దారుణం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్‌లోని భాటిండాకు చెందిన గుర్ప్రీత్ సింగ్(21) ఉత్తర ఢిల్లీలోని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో కోర్సు చేస్తున్నాడు. మనిందర్ సింగ్ అనే స్నేహితుడితో స్థానిక షాహ్‌బాద్ డైరీలో ఉంటున్నాడు. డాక్యుమెంటరీ పనుల్లో భాగంగా గుర్ప్రీత్, మనిందర్ ఆదివారం వేకువజామున 3:30గంటలకు బైక్‌పై దక్షిణఢిల్లీలోని ఏయిమ్స్ కాలేజీకి వెళ్లారు. కొంత సమయం తర్వాత అక్కడినుంచి బయటకు వస్తుండగా తప్పతాగిన ఓ వ్యక్తి రోహిత్ కృష్ణా మహంతా వీరిని అడ్డుకున్నాడని మనీందర్ తెలిపాడు. సిగరెట్ తాగుతూ అదేపనిగా తమ ముఖాలపైకి పొగ వదులుతున్నాడు. పబ్లిక్ ప్లేస్‌లో స్మోకింగ్ చేయడం తప్పవని చెప్పిన మమ్మల్ని అసభ్యంగా దూషించడంతో పాటు చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడ ఉండటం మంచిదికాదని విద్యార్థులు తమ బుల్లెట్ బైక్‌పై అక్కడినుంచి పోయారు. అసలే తాగిన మైకంలో ఉన్న రోహిత్ కృష్ణా తనకే నీతివాక్యాలు చెబుతారా అంటూ కోపం పెంచుకుని తన ఫోర్డ్ ఫిస్టా కారులో విద్యార్థులను ఛేజ్ చేశాడు. ఈ క్రమంలో ఓ ఆటో, ఓలా క్యాబ్‌ను ఢీకొట్టిన ఆ లాయర్ అనంతరం ఏయిమ్స్ సెంటర్ సమీపంలో గుర్ప్రీత్, మనీందర్ వెళ్తున్న బుల్లెట్‌ను ఢీకొట్టాడు. కిందపడ్డ గుర్ప్రీత్ పై నుంచి కారు తీసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని మనీందర్ హాస్పత్రికి తీసుకెళ్లాడు. ఆదివారం నుంచి మృత్యువుతో పోరాడుతున్న గుర్ప్రీత్ బుధవారం మృతిచెందాడని చెబుతూ మనీందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. యాక్సిడెంట్ చేసిన రోహిత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే నిన్న గుర్ప్రీత్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు హత్యకేసు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. లాయర్ రోహిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద!
న్యూయార్క్: తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరాన్ని తమకు చెప్పకుండా దాచడమే కాకుండా తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించిన ఓ భారతీయ అమెరికన్ పౌరుడు అమెరికా పౌరసత్వాన్ని కోల్పోనున్నాడు. ప్రస్తుతం కేసు విచారణ తుది దశలో ఉన్నప్పటికీ అతడు అధికారులకు సహకరించని కారణంతో అతడిని పౌరసత్వాన్ని రద్దు చేసి బహిష్కరించనున్నారు. వివరాల్లోకి వెళితే.. గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి వాటర్‌టౌన్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఈ మధ్యే ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించి అతడిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా సిరాకస్‌లోని ఫెడరల్ కోర్టు మూడు నెలల శిక్ష కూడా విధించింది. అదే సమయంలో అతడు తన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పౌరసత్వాన్ని ధ్రువీకరించే క్రమంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూఎస్సీఐఎస్) అధికారుల ముందు హాజరైన అతడు తాను చేసిన నేరాన్ని వారికి చెప్పలేదు. ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చినా తనపై ఏ కేసు లేదని, ఏ తప్పు చేయలేదని, అరెస్టు కాలేదని అబద్ధం చెప్పాడు. కానీ, అతడు నేరం చేసినట్లు, అరెస్టయినట్లు ఆధారాలు తెప్పించుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి తప్పును గుర్తించి పౌరసత్వాన్ని త్వరలో రద్దు చేయనున్నారు. అమెరికా పౌరసత్వం ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నేరానికి పాల్పడినా అది ఆమోదం పొందదు. -
గుర్‌ప్రీత్‌కు రజతం జీతూరాయ్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ రజతం... జీతూ రాయ్ కాంస్య పతకం గెలిచారు. ఇరాన్ షూటర్ సెఫెర్ బొరూజెని (198.7 పాయింట్లు) స్వర్ణ పతకం సాధించాడు. గుర్ప్రీత్ 197.6 పాయింట్లు, జీతూ రాయ్ 177.6 పాయింట్లు స్కోరు చేశారు. గుర్ప్రీత్ సింగ్, జీతూ రాయ్, ఓంకార్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ ఈవెంట్లో 1734 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సుమేధ్ కుమార్ స్వర్ణం, హేమేంద్ర సింగ్ రజత పతకం నెగ్గారు. యూత్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మోహిత్ గౌర్ కాంస్యం నెగ్గగా... మోహిత్ గౌర్, షైన్‌కి నాగర్, సమర్జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టుకు రజతం లభించింది. -
భారత్ కు మరో రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా మూడు రోజూ కూడా భారత షూటర్లు రాణించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా, జితూ రాయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో గుర్ ప్రీత్ సింగ్, జితూ రాయ్ లు ఫైనల్ కు చేరుకోగా.. గుర్ ప్రీత్ సింగ్ 197.6 పాయింట్లతో రజతాన్ని, జితూ రాయ్ 177.6 పాయింట్లతో కాంస్యాన్ని సాధించాడు. కాగా, ఇరాన్ కు చెందిన బోరౌజెనీ సఫారీ 198.7 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. -
‘రియో’ ఒలింపిక్స్‌కు షూటర్ గుర్ప్రీత్ అర్హత
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత్ నుంచి ఐదో షూటర్ అర్హత సాధించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో గుర్ప్రీత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో గుర్ప్రీత్ 154 పాయింట్లు స్కోరు చేసి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. జావో కోస్టా (201.4-పోర్చుగల్), తొముయుకి (200.4-జపాన్), సున్ యాంగ్ (177.3-చైనా) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు. భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ ఫైనల్ చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటికే భారత్ నుంచి గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వీ చండేలా, అభినవ్ బింద్రా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. -
రెజ్లింగ్‌లో నిరాశ
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో బుధవారం భారత క్రీడాకారులు బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ ఈవెంట్స్‌లో పతకాలతో మెరిసినా... మిగతా క్రీడాంశాల్లో మాత్రం మనోళ్లు పూర్తిగా నిరాశపర్చారు. ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌తో పోలిస్తే గ్రీకో రోమన్ విభాగంలో ఒక్కరు కూడా కనీసం కాంస్య పతక పోరుకు కూడా అర్హత సాధించలేపోయారు. రెజ్లింగ్: గ్రీకో రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. 75 కేజీల విభాగంలో గురుప్రీత్ సింగ్ 1-3తో పయ్యమ్ పయాని (ఇరాన్) చేతిలో; 85 కేజీల ఈవెంట్లో మనోజ్ కుమార్ 0-3తో ఫె పెంగ్ (చైనా) చేతిలో; 130 కేజీల బౌట్లో ధర్మేందర్ దలాల్ 0-4తో బషీర్ డార్జి (ఇరాన్) చేతిలో; 66 కేజీల ఈవెంట్లో సందీప్ యాదవ్ 0-4తో కుశ్రావ్ ఓబ్లోబెర్డివ్ (తజికిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ శరత్ కమల్ నిరాశపర్చినా... సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఘోష్ 11-5, 11-7, 11-5, 11-4తో పతాఫోన్ తవిసాక్ (లావోస్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ శరత్ 11-6, 10-12, 11-5, 9-11, 11-6, 10-12, 9-11తో ప్రపంచ 26వ ర్యాంకర్ తన్విరివెంచకుల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు. తైక్వాండో: 57 కేజీల విభాగంలో ఆర్తీ ఖకల్ 8-15తో గనియా అల్జాక్ (కజకిస్థాన్) చేతిలో; పురుషుల 80 కేజీల విభాగంలో రాజన్ పండియా ఆనంద్ 1-7తో యోంగ్యున్ పార్క్ (కొరియా) చేతిలో ఓడారు. బాస్కెట్‌బాల్: ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నిరాశపర్చింది. 47-68తో కజకిస్థాన్ చేతిలో ఓడి ఆరో స్థానంతో సంతృప్తి చెందింది.