‘రియో’ ఒలింపిక్స్‌కు షూటర్ గుర్‌ప్రీత్ అర్హత
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత్ నుంచి ఐదో షూటర్ అర్హత సాధించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో గుర్‌ప్రీత్ 154 పాయింట్లు స్కోరు చేసి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.
జావో కోస్టా (201.4-పోర్చుగల్), తొముయుకి (200.4-జపాన్), సున్ యాంగ్ (177.3-చైనా) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు. భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ ఫైనల్ చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటికే భారత్ నుంచి గగన్ నారంగ్, జీతూ రాయ్, అపూర్వీ చండేలా, అభినవ్ బింద్రా రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.