
అమృత్‌సర్: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్‌తారన్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు.
కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్‌ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment