
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆదివారం మధ్యాహ్నం జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు.
వెంటనే ఆయన్ను స్థానిక అస్పత్రికి తరలించగా.. అప్పటకే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్‌లోని బహారామ్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్