Shot Dead
-
మార్కో ఫినిష్డ్
అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. క్యూలికాన్లో జరిగిన గ్రూప్వార్లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్ వద్దు! -
కెనడాలో భారత విద్యార్థి హత్య
టొరంటో:కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్‌దీప్‌సింగ్‌ను ఎడ్మాంటన్‌లోని అతడి అపార్ట్మెంట్లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్ రెయిన్,జుడిత్ సాల్టియాక్స్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్‌దీప్‌సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్‌లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సరికే హర్షన్‌దీప్‌సింగ్ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: డేంజర్ బెల్స్.. మనపాలిట శాపాలివే -
ఢిల్లీలో మళ్లీ కాల్పులు.. వ్యాపారి మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ ఏరియాతో శనివారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి.. వ్యాపారి సునీల్ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.ఇక, స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ జైన్‌ను కృష్ణా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని రాణిభాగ్‌లో భామ్‌భీనా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. #WATCH | Delhi | A person, Sunil Jain was found with gunshot injuries in the Farsh Bazar PS area. He was reported to have been shot by two persons who came on a motorcycle. The Crime Team has been called to the spot. Further investigation is in progress: DCP Shahdara(Visuals… pic.twitter.com/t2DEV2lkNy— ANI (@ANI) December 7, 2024 -
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
ఎనిమిదేళ్లలో తొలిసారి కనిపించిన ధ్రువ ఎలుగుబంటి.. పోలీసులు ఏం చేశారంటే!
ఐస్లాండ్లోని ఒక మారుమూల గ్రామంలోని కనిపించిన అరుదైన ధ్రువ ఎలుగుబంటిని స్థానిక ప్రజలకు ముప్పుగా భావించి పోలీసులు కాల్చి చంపారు. అయితే ముందుగా ఎలుగుబంటిని తరలించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విఫలం కావడంతో చంపాల్సి వచ్చందని వెస్ట్ఫ్జోర్డ్స్ పోలీస్ చీఫ్ హెల్గి జెన్సన్ తెలిపారు.ఆ ఎలుగుబంటి ఓ ఇంటికి సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఆ ఇంట్లో ఓ వృద్ధురాలు ఉందని, ఎలుగుబంటినిచూసి ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుందని పేర్కొన్నారు. సాయం కోసం తన కుమార్తెకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని దాన్ని కాల్చినట్లు పోలీసులు తెలిపారు.ధృవపు ఎలుగుబంట్లు ఐస్లాండ్కు చెందినవి కావు, అయితే కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్లాండ్ నుంచి ఒడ్డుకు చేరుకుంటాయి. 2016లో ఐస్‌ల్యాండ్‌లో మొదటిసారి కనిపించింది ఇవి 150 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడి చేయడం చాలా అరుదు. 2017లో వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా సముద్రపు మంచు కోల్పోవడం వల్ల ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడం ప్రారంభించాయని తెలిపింది. దీని వల్ల మానకులకు ప్రమాదం పెరిగిందని పేర్కొంది. వీటి వల్ల, మానవులకు లేదా పశువులకు ముప్పు కలిగిస్తే అధికారులు వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుది. -
బీహార్‌లో సీపీఐ నేత దారుణ హత్య
అర్వాల్: బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన మార్కెట్ నుండి తన ఇంటికి వెళుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అతన్ని అడ్డుకుని, తుపాకీతో కాల్చిచంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ ఘటన అర్వాల్ జిల్లాలోని కింజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కన్ బిఘా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాతకక్షలే కారణమై ఉంటాయని అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య
వాషింగ్టన్: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు భారతీయులపై కాల్పులు జరపడంతో వారు మరణించిన ఘటనలు కూడా చూశాం. తాజాగా అకారణంగా భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వ్యక్తి గావిన్ దసౌర్(29) కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గావిన్.. మెక్సికోకు చెందిన వివియానా జమౌరాతో ఇటీవలే వివాహం జరిగింది. ఈ సందర్భంగా భార్యతో సరదాగా బయటకు వెళుతుండగా.. కారు ప్రమాదం జరిగింది. వెంటనే దసౌర్ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు. వెనక వాహనంలో ఉన్న డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్ తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్‌పై కాల్పులు జరిపాడు. మెడకు బుల్లెట్ తగలడంతో దసౌర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. There are lessons here. The guy totally wasted imo. He should gather more data before getting out of the car with the gun. pic.twitter.com/KiNQzj9Z08— Xnews_with_Grok (@Xnews_with_grok) July 19, 2024అనంతరం దసౌర్ను అతడి భార్య ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఇక, దసౌర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. -
కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
ఒట్టావా: భారత సంతతికి చెందిని ఓ యువకుడు కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురుయ్యాడు. జూన్ 7 (శుక్రవారం) ఉదయం అతనిపై కాల్పులు జరగటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకుడిని భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రే నుంచి హత్య జరిగినట్లు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. యువరాజ్‌పై ఎటువంటి నేరపూర్తి రికార్డు లేదు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతన్ని టార్గెట్ చేసి కొందరు కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ హత్య ఎందుకు జరిగిందనే కారణాల కోసం పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. యువరాజ్ గోయాల్ స్టూడెంట్ వీసాపై 2019లో పంజాల్‌లోని లూథీయానా నుంచి కెనడా వెళ్లారు. 28 ఏళ్ల యువరాజ్ కెనడాలో సెల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్‌వుడ్ వ్యాపారవేత్త. యువరాజ్ మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
ఉత్తరప్రదేశ్‌లో నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్, బీహర్, రతన్‌పురి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వాంటెడ్ బీహార్ గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు.వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి బీహార్‌లోని రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఇంచోరా గ్రామం సమీపంలోని అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), బీహర్, రతన్‌పురి పోలీసులు ముగ్గురు దుండగులను ఎన్కౌంటర్ చేశారు వీరిలో బీహార్ గ్యాంగ్ స్టర్ నీలేష్ రాయ్ ఉన్నారు. రూ. రెండు లక్షల రివార్డు కలిగిన నీలేష్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతని సహచరులిద్దరూ పరారయ్యారు.నిందితులకు చెందిన బైక్, రెండు పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్థరాత్రి నోయిడా, బీహార్‌కు చెందిన ఎస్టిఎఫ్ బృందాలు రతన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ పోలీస్ పోస్ట్‌లో నేరస్తుల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇంతలో బుధానా నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపి, ఖతౌలీ-బుదానా రహదారి వైపు వేగంగా వెళ్లిపోయారు.పోలీసు బృందం వారిని వెంబడిస్తున్న సమయంలో ఇంచుడ గ్రామం అడవిలో వారి బైక్ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఇంతలో పోలీసులు కాల్పులు చేయగా ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. పోలీసుల తూటాలకు ఓ యువకుడు(నీలేష్ రాయ్) గాయపడ్డాడు. పోలీసులు బాధితుడిని బుధానా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు.మృతుడిని బీహార్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నీలేష్ రాయ్‌గా గుర్తించామని, బరో రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధరా బెగుసరాయ్ బీహార్ నివాసి అని ఎస్పీ దేహత్ ఆదిత్య బన్సాల్ తెలిపారు. అతనిపై బీహార్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ప్రకటించింది. నీలేష్‌పై హత్య, దోపిడీ, తదితర 16 తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నీలేష్ సహచరులిద్దరి కోసం పోలీసులు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
హలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. కారులో వెళ్తున్న ఆయనను దోపిడీ చేసే ప్రయత్నంలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కాగా.. వాక్టర్ 'జనరల్ హాస్పిటల్' షోలో బ్రాండో కార్బిన్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ 'ఆర్మీ వైవ్స్'లో అతను ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 'వెస్ట్‌వరల్డ్', 'స్టేషన్ 19', 'సైబీరియా', 'ఏజెంట్ ఎక్స్', 'ఫెంటాస్టిక్', 'యానిమల్ కింగ్డమ్', 'హాలీవుడ్ గర్ల్', 'ట్రైనింగ్ డే', క్రిమినల్ మైండ్స్', 'స్ట్రగ్లింగ్ సర్వర్లు', 'ది ప్యాసింజర్' 'బార్బీ రిహాబ్' లాంటి సిరీస్‌లలో అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా పలు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా పనిచేశాడు. 2016లో వచ్చిన చిత్రం 'యూఎస్ఎస్ ఇండియానాపోలిస్: మెన్ ఆఫ్ కరేజ్' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు మారియో వాన్ పీబుల్స్ దర్శకత్వం వహించాడు. -
ఎన్నికల వేళ.. జేడీయూ యువనేత దారుణ హత్య
పాట్నా: సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్‌లో అలజడి రేగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) యువ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా బుధవారం అర్ధరాత్రి ఆయన్ను దుండగులు కాల్చి చంపారు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు జేడీయూ నేత సౌరభ్ కుమార్ తలపై రెండుసార్లు కాల్చారు. ఆయన వెంట ఉన్న సహచరుడు మున్మున్‌పైనా కాల్పులు జరిపి పరారయ్యారు. నెత్తుటి మడుగులో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, సౌరభ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మున్మున్ పరిస్థితి విషమంగా ఉంది.పాట్నా పోలీసుల ప్రత్యేక బృందం రాత్రి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి కూడా పున్‌పున్‌కు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ నేత దారుణ హత్య
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత హతమయ్యాడు. సాగర్ రోడ్డులోని మ్యారేజ్ గార్డెన్ సమీపంలో బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా తలపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ మీడియాకు తెలిపారు. మహేంద్ర గుప్తా ఘటనా స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. ఈ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇషానగర్ పట్టణానికి చెందిన మహేంద్ర గుప్తా 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజావర్ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. 10,400 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుప్తా ఛతర్పూర్కు వచ్చినట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత మహేంద్ర గుప్తా వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు అబ్దుల్ మన్సూరీ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి, కాల్పులు జరిపాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తాను చేసిన ప్రయత్నం విఫలమయ్యిందన్నారు. తాను దాడి చేసిన వ్యక్తిని చూశానని, అతనిని గుర్తించగలనని అన్నారు. -
పంజాబ్‌లో ఆప్ కార్యకర్త కాల్చివేత
అమృత్సర్: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్‌తారన్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు. కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
US: అమెరికాలో మరో భారతీయుడి హత్య
అలబామా: అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌సింగ్ అలియాస్ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్ మృతిచెందాడు. రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజాసింగ్ సంపాదనే ఆధారం. రాజాసింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలతో భారత్, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు మూడు నెలల కాలంలో అమెరికాలో మరణించి వారిలో భారత విద్యార్థులతో పాటు ఒక వ్యాపారవేత్త కూడా ఉండటం గమనార్హం. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం -
ఐఎన్ఎల్డీ హరియాణా చీఫ్ కాల్చివేత
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్ గన్మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్‌వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్‌లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్‌తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
దారుణం: లైవ్‌లో మాట్లాడుతుండగా శివసేన నేత హత్య
ముంబై: శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం సబర్బన్ ముంబైలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం. ఫేస్బుక్లో లైవ్ వీడియో మాట్లాడతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన వెంటనే అభిషేక్ ఘోసల్కర్‌ను స్థానిక కరుణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ ఘోసల్కర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అభిషేక్ ఘోసల్కర్... శివసేన(యూబీటీ) మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు. వ్యాపారవేత్త అయిన మోరిస్ నోరోన్హాకు అభిషేక్ ఘోసల్కర్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వివాదాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ కాల్పులు జరిగినప్పుడు ఘటన స్థలంలో మెహుల్ పారిఖ్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు నోరోన్హా కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి. గత వారంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శివసేన (షిండే) వర్గం నేతపై పోలీస్ స్టేషన్లోనే కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
US: రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న
ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్‌తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు. ఇదీచదవండి.. తగ్గిన భారత టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా -
దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆదివారం మధ్యాహ్నం జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను స్థానిక అస్పత్రికి తరలించగా.. అప్పటకే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్‌లోని బహారామ్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్ -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్‌కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్‌ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్‌ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దుండగుడి కాల్పులకు బలైపోయాడు. నార్త్ ఇండియాకు చెందిన వైద్య విద్యార్థి ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే కాల్పులు జరిపారు. ఈ సంఘటన నవంబర్ 9న జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత తుదిశ్వాస విడిచాడు. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదిత్య మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆదిత్య అద్లాఖా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్లో మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో నాల్గవ సంవత్సరం డాక్టరల్ విద్యార్థి. వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది. దీంతో అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని యూసీ మెడికల్ సెంటర్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు బుల్లెట్ రంధ్రాలను గుర్తించామని విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. యూనివర్శీటీ సీనియర్లతోపాటు ఆరోగ్య వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డీన్ ఆండ్రూ ఫిలక్ అద్లాఖా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్లో అద్లాఖా అద్భుతమైన పరిశోధన చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీలో పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లాడు. -
జైషే మహ్మద్ ఉగ్రవాది తాజ్ మహ్మద్ కాల్చివేత!
మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది, జైషే ఉగ్రవాది తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్ రైట్ హ్యండ్, సమీపబంధువు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా జైషే ముఠాలో అత్యంత కీలక మైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్‌కోట్, నగ్రోటా, ఉరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీల ప్రాత. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌవూఫ్ ప్రధాన సూత్రధారి. 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి. -
పుల్వామాలో మళ్లీ ఉగ్రదాడి.. వలసకూలీపై కాల్పులు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రతూటా పేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీపై దుండగులు కాల్పులు జరిపారు. పుల్వామాలో ఈ ఘటన జరగగా.. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న ఎన్స్పెక్టర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. "పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన వలస కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మృతున్ని ముఖేష్‌గా గుర్తించాం. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాం." అని పోలీసులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో పుల్వామాలో జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. ఆదివారం ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: శివసేన, ఎన్సీపీ అనర్హత పటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు -
కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి అనుమానాస్పద మృతి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి నివాసంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితితో మృతిచెందడం కలకలం రేపుతోంది. హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కుమార్ నివాసంలో తలకు బుల్లెట్ తగిలిన గాయాలతో రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లక్నోలోని బెగారియా గ్రామంలో శుక్రవారం ఉదంయ 4 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకున్నారు. కేంద్రమంత్రి కుమారుడు వికాస్ పేరుతో రిజిస్ట్రర్ అయిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుడిని వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు గుర్తించారు. అతడు మంత్రి కుమారుడు వికాస్ కిషోర్ స్నేహితుడిగా తెలిసింది. అయితే ఆ ఇంటిని ప్రస్తుతం మంత్రి ఉపయోగించడం లేదు. అంతేగాక శ్రీ వాస్తవ మరణించిన సమయంలో మంత్రిగానీ, అతని కొడుకు గానీ ఆ ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. ఘటన సమయంలో ఇంట్లో ఉన్న ఆరుగురిని ప్రశ్నిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆధారాలను సేకరించాయి. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ ఇదిలా ఉండగా మృతుడి సోదరుడు మాత్రం తన అన్నయ్య మరణంలో కుట్ర దాగుందని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందా అని ప్రశ్నించగా.. ‘మంత్రి కొడుకు వికాస్ ఎక్కడికి వెళ్లినా తన గన్ను వెంట తీసుకెళ్లేవాడు. అతను కచ్చితంగా పిస్టల్ తీసుకెళ్లి ఉండాల్సింది.. ఢిల్లీకి వెళ్లినా, ఎక్కడికైనా వెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లేవాడని ఖచ్చితంగా చెప్పగలను. నిన్న ఎందుకు తీసుకోలేదో నాకు తెలీదు.. ఇది పక్కా ప్లాన్.. మా అన్నయ్యను ఎందుకు, ఎవరు చంపారో తెలియాలి’ అని ప్రశ్నించాడు. మృతుడి సోదరుడి ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందించారు. వికాస్ గురువారం మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లాడని తెలిపారు. ఇందుకు బోర్డింగ్ పాస్‌లు కూడా సాక్ష్యంగా చూపించారు. పిస్తోల్‌కు నేషనల్ లైసెన్స్ లేదని, అందుకే తన కొడుకు పిస్టల్ని తనతో తీసుకెళ్లలేదని చెప్పారు. జరిగింది విచారకరమని.. విషయం తెలిసిన వెంటనే పోలీస్ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులను వదిలిపెట్టమని, దోషులెవరైనా శిక్షిస్తామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగిని గుర్తు తెలియని దుండుగులు హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురలో చోటుచేసుకుంది. మృతుడిని హర్‌ప్రీత్ గిల్‌గా గుర్తించారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామతో కలిసి భజన్‌పురలోని సుభాష్ విహార్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది దుండగులు ఇద్దరిపై అడ్డగించి కాల్పులు జరిపారు. అనంతరం స్థానికులు గమనించి వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామకు చికిత్స అందిస్తున్నారు. మృతుడి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయిదుగురు వ్యక్తులు తనపై, తన అల్లుడిపై కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హర్‌ప్రీత్ ఇంటి నుంచి బయటకు వెళ్తూ 10 నిమిషాల్లో తిరిగి వస్తానని తమ తల్లిదండ్రులకు తెలిజయేశారు. దుండగుల కాల్పుల్లో గిల్ తలపై కుడి వైపు, బుల్లెట్ గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు. మృతుడి మేనమామ భజన్‌పురా నివాసి. అతడికి కూడా తలపై కాల్పులు జరగడంతో లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చేర్పించినట్లు డీసీపీ తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో యాక్టివ్‌గా ఉందని, నగరంలో పెద్ద డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో తమ ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు. చదవండి: Chandrayaan-3: తొలిసారి విక్రమ్‌ను ఫోటో తీసిన రోవర్.. ఇదిగో ఫోటో -
బీజేపీ నేత దారుణ హత్య.. కారణం అదేనా?
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అధికార పార్టీ నేతను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో, బీజేపీ నేత హత్య యూపీలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంభాల్ జిల్లాలోని మొరదాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరీ(34) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన నివాసం బయటే ఆయనను కాల్చి చంపారు. అనూజ్ చౌధురి తన అపార్ట్మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. పొలిటికల్ ప్రత్యర్థుల పనేనా.. ఇక, కాల్పుల ఘటన ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. ఎస్పీ హేమ్రాజ్ మీనాతో సహా పోలీసు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్ చీఫ్ కుమారుడు అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ట తెలిపారు. ఇక, అనూజ్ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్లుగా బాధిత కుటుంబం తెలిపింది. BJP Leader Anuj Chaudhary Shot dead on day light in Uttar Pradesh But still it's The Best Law & Order state in Bharatvarsh according to Bhakts 🙏#NarendraModi #NarendraModiji #NoConfidenceMotion #NoConfidence #NoConfidenceDebate #PMModi #earthquake #MohanLal #OMG2 #Gadar2 #UP pic.twitter.com/PnmhWMAyDA — Dr Jain (@DrJain21) August 11, 2023 ఇదిలా ఉండగా.. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనూజ్‌కు బీజేపీ కీలక నాయకులు, మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: మోదీకి కాంగ్రెస్ ఫోబియా -
అర్ధరాత్రి భార్య, మేనల్లుడిని చంపి.. గన్‌తో కాల్చుకున్న ఏసీపీ.. ఏం జరిగింది?
పూణే: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి.. తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి.. అనంతరం తనను తాను కాల్చకుని చనిపోయాడు. ఈ ఘటన పూణేలో చోటుచేసుసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. అమరావతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భరత్ గైక్వాడ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకంటే ముందు తన భార్య మోని (44), మేనల్లుడు దీపక్ (35)లను తుపాకీతో కాల్చి చంపాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, గైక్వాడ్ భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తర్వాతే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి.. ఆ ముగ్గురినీ జూపిటర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాల్పులపై కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Tragic Murder-Suicide in Pune: Senior Cop Kills Wife and Nephew before taking own Life; Motive not disclosed.#feedmile #BharatGaikwad #ACP #maharashtra #pune #shot #wife #nephew #gun #shooting #breakingnews pic.twitter.com/o8Bb13i3y3 — Feedmile (@feedmileapp) July 24, 2023 ఇది కూడా చదవండి: ప్రియుడు మరో యువతితో తిరుగుతున్నాడని... -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
కెనడా: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ వద్దనున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్ ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు. ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్. ఇది కూడా చదవండి: మెక్సికోలో పెను భూకంపం.. -
మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే మృతి
కంపాలా: ఉగాండా దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండా దేశ మంత్రిపై తన బాడీగార్డు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఉగాండా రాజధాని కంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా నివాసంలో ఆయనకు బాడీగార్డుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాడీగార్డ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, బాడీగార్జ్ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని బాడీగార్డు కాల్చి చంపినట్లు సమాచారం. ఇక, ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులు దురదృష్టకరమని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్వే వెల్లడించారు. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Col Charles Engola shot dead by the Body Guard. RIP.😭 ! BREAKING NEWS ! pic.twitter.com/CVmbWzMTqU — Davic Films Bsa (@davic_films) May 2, 2023 ఇది కూడా చదవండి: డింగ్ డాంగ్ డిచ్ కేసు: ముగ్గురిని బలిగొన్న ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు -
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమ్మితం అమెరికా వెళ్లాడు. ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఓ షెల్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బుధవారం అర్థరాత్రి 12.50 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదు తీసుకుపోయారు. ఈ కాల్పుల్లో సాయిష్‌కు తీవ్ర గాయాలవ్వగా ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యరణించాడు. సాయిష్ తల్లి ప్రస్తుతం ఏలూరులో నివాసం ఉంటోంది. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. కాగా పాలకొల్లు పట్టణానికి చెందిన వీరా రమణ నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. ఆయన చిన్న కుమారుడైన సాయేష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం యూఎస్ వచ్చిన సాయిష్.. ఇప్పడిప్పుడే కుటుంబ ఆర్థిక సమస్యలను చక్కబెడుతున్నాడు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతుండగా.. మరో 10 రోజుల్లో ఎంఎస్ పూర్తికానుంది. ఈ సమయంలో కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్‌గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
Atiq Ahmed Murder: నా కుమారుడు డ్రగ్ అడిక్ట్.. ఏం పని చేయడు..
లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ఎదుటే.. లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా అనే ముగ్గురు యువకులు వీరిని కాల్చి చంపారు. అనంతరం ఘటనా స్థలంలోనే పోలీసులకు లొంగిపోయారు. అయితే నిందితుల్లో ఒకడైన లవ్లేశ్ తివారీ తండ్రి యజ్ఞ తివారీ తన కుమారుడి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్య ఘటనను టీవీలో చూశామని, అసలు తమ కుటుంబానికి ఏ విషయమూ తెలియదని పేర్కొన్నారు. లవ్లీష్ ఏ పనీ చేయకుండా బలదూర్‌గా తిరుగుతాడని, డ్రగ్స్‌కు బానిసయ్యాడని వెల్లడించారు. ఓ అమ్మాయిని కొట్టి జైలుకు కూడా వెళ్లొచ్చాడని, అతనిపై పోలీసు కేసు నమోదైందని చెప్పారు. 'ఈ ఘటనలో మాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు మాకు ఏమీ చెప్పడు. చాలా కాలంగా ఇంట్లో ఉండటం లేదు. ఐదారు రోజుల క్రితం ఓసారి ఇంటికి వచ్చి వెళ్లాడు. కొన్ని సంవత్సారాలుగా అతనితో మేం మాట్లాడటం లేదు. ఓ కేసులో అతడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. లవ్లేశ్ ఏ పనీ చేయడు డ్రగ్స్‌కు బాగా బానిసయ్యాడు. మాకు మొత్తం నలుగురు పిల్లలు.' అని యజ్ఞ తివారీ వివరించారు. అతీక్ హత్య కేసులో మరో నిందితుడు సన్నీ సింగ్ సోదురుడు పింటు సింగ్ కూడా మీడియాతో మాట్లాడాడు. సన్నీ కూడా ఏ పనీ చేయకుండా రోడ్లపై తిరుగుతాడని వెల్లడించారు. అతను తమ నుంచి వేరుగా నివసిస్తున్నాడని, అసలు క్రిమినల్ ఎలా అయ్యాడో తమకు తెలియదని పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి తమకు ఐడియా లేదని తెలిపాడు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
ఢిల్లీలో బీజేపీ నేత దారుణ హత్య
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిందితులు ముసుగులు వేసుకుని బీజేపీ నేతపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ ఘటన ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర మటియాలాను శుక్రవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ద్వారకలోని తన ఆఫీసులో రాత్రి 7.30 నిమిషాలకు టీవీ చూస్తున్న సమయంలో.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చారు. తొలుత సురేంద్రను కొట్టి.. ఆ తర్వాత ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన సంబంధించిన ముగ్గురు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన సందర్భంగా ఇద్దరు ఆఫీసులోకి వెళ్లగా, మరో వ్యక్తి బైక్‌పై ఆఫీసు బయట ఉన్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన తర్వాత ముగ్గురూ అక్కడ నుంచి బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. సీసీ ఫుటేజీతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్ష వర్ధన్ తెలిపారు. మరోవైపు.. సురేంద్ర మటియాలా హత్యపై కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన కుమారుడు మాట్లాడుతూ.. తన తండ్రికి శత్రవులులేరని తెలిపాడు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అయితే, ఓచోట భూమికి సంబంధించిన వివాదంలో బీజేపీ నేత సురేంద్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. -
పాకిస్తాన్లో హిందూ డాక్టర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్‌దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. -
ఫిలిప్పీన్స్‌లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..
మనీలా: పంజాబ్‌కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు. హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్(41), కిరణ్‌దీప్ కౌర్(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్‌ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు. చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి -
JK: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్‌పై కాల్పులు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న సంజయ్ శర్మపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సంజయ్ శర్మ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మార్కెట్‌కు వెళ్తుండగా ముష్కరులు అతనిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. సంజయ్ శర్మ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేశారు. Deeply saddened to hear of the demise of Sanjay Pandith of Achan in Pulwama district of South Kashmir. Sanjay was working as a bank security guard & was killed in a militant attack earlier today. I unequivocally condemn this attack & send my condolences to his loved ones. — Omar Abdullah (@OmarAbdullah) February 26, 2023 కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. గతేడాది మైనారిటీ వర్గాలకు చెందిన 14 మంది కాల్చి చంపారు. వీరిలో ముగ్గురు కశ్మీరీ పండిట్లు ఉన్నారు. చదవండి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం.. -
అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి కేసులో ట్విస్ట్!
అమెరికాలో ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల్ సాయి మృతి ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. యూఎస్‌లో ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తూర్పు బీఎల్‌వీడి 3200 బ్లాక్‌కి చెందిన ఓ గ్యాస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గన్ను అఖిల్ సాయి పరిశీలిస్తుండగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. గన్ మిస్ ఫైర్ అవ్వడం.. ఆ బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో యువకుడు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గన్ మిస్ ఫైర్ కావడం వల్లే అఖిల్ సాయి చనిపోలేదని, తోటి తెలుగు విద్యార్ధి రవితేజ కాల్పులు జరపడంతో మృతి చెందినట్లు స్థానిక పోలీసులు జరిపిన ప్రాదమిక విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. అఖిల్ సాయి ఉన్నత చదువు కోసం 13 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. అమెరికాలోని అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో అఖిల్ చదువుకుంటున్నాడు. మరోవైపు ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే గ్యాస్ స్టేషన్ లో రవితేజ కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల అమెరికా వ్యాప్తంగా చాలా చోట్ల గ్యాస్ స్టేషన్ లలో క్రైమ్ పెరిగిపోవడంతో.. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్యాస్ స్టేషన్ లో పని చేసే ఉద్యోగులకు గన్ ఇస్తున్నారు. వీరు పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ లోనూ దాని యాజమాన్యం ఓ గన్ ను వీరికి ఇచ్చింది. అత్యవసర సమయంలో గన్ ఎలా కాల్చాలి అన్న దానిపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. దీని కోసం గన్ లో ఉన్న బుల్లెట్లు అని తొలగించి అఖిల్ సాయి, రవితేజలకు ఇచ్చింది. కొంత సేపు గన్ ఎలా కాల్చాలి అన్నదానిపై శిక్షణ తీసుకున్న వీరిద్దరు.. తర్వాత బుల్లెట్లు లోడ్ చేయడం కూడా నేర్చుకున్నారు. తర్వాత బుల్లెట్లు తీసివేసి మరో సారి గురిపెట్టడం చేశారు. అయితే ఓ బుల్లెట్ పొరపాటున అందులోనే ఉండిపోయిందని, ఆ విషయం తెలియక రవితేజ ట్రిగ్గర్ నొక్కడంతో అఖిల్ సాయి మరణించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్న అఖిల్ సాయి, రవితేజ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలను కూడా ఇప్పటివరకు గమనించలేదని స్నేహితులు తెలిపినట్టు సమాచారం. అనూహ్యంగా తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లే.. గాయాలయ్యాయని.. తల్లిదండ్రులకు సమాచారం అందింది.. ఆ తర్వాత చనిపోయాడని తెలిసింది. ఒక పొరపాటు నిండు ప్రాణాలు తీసేలా జరగడంతో రవితేజ వెంటనే 911కు సమాచారం అందించాడని, కొన ఊపిరితో ఉన్న రవితేజకు చికిత్స అందేలోగా చనిపోయాడని తెలిసింది. ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Naba Kisore Das: ఒడిశా మంత్రి హత్య.. ఉద్దేశపూర్వకంగానే గురి!
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్యవెనుక గల కారణాలపై రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి బ్రజరాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్(ఇన్చార్జి) ప్రద్యుమ్న స్వొయి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో ఘటనా క్రమంతో నిందితుల వివరాలు పేర్కొన్నారు. ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ హతమార్చాలనే స్పష్టమైన ఉద్దేశంతోనే మంత్రిపై కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా నమోదు చేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ గాంధీ చౌక్‌లోని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ బిల్డింగ్‌లో బ్రజరాజ్ నగర్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు విచ్చేశారు. వేదిక సమీపంలో ఆగిన కారు ముందు వైపు సిబ్బంది తలుపు తెరిచిన తర్వాత కిందికి దిగారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మోహరించిన ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ వెనువెంటనే తలుపు వద్దకు వచ్చి, చంపాలనే స్పష్టమైన ఉద్దేశంతో మంత్రిని లక్ష్యంగా చేసుకుని చాలా సమీపం నుంచి తన సర్వీస్ రివాల్వర్‌తో గురిపెట్టి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు మంత్రి ఛాతికి తగలడంతో ఆయన కింద పడిపోయార’ని పేర్కొన్నారు. ఐఐసీ వేలికి గాయం.. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన బ్రజరాజ్ నగర్ ఐఐసీ, రాంపూర్ పోలీస్ అవుట్‌పోస్ట్ కానిస్టేబుల్ కేసీ ప్రధాన్‌తో కలిసి నిందితుడు గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు 9 ఎంఎం పిస్టల్ నుంచి మరో రెండు రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. దీంతో బ్రజరాజ్ నగర్ ఐఐసీ ప్రద్యుమ్న త్రుటిలో తప్పించుకోగా, వేలికి గాయం తగిలింది. ఈ పరిస్థితుల్లో కాళీనగర్కు చెందిన జీబన్లాల్ నాయక్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. కొంత పెనుగులాట తరువాత నిందితుడి నుంచి ఎట్టకేలకు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలతో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టంలోని 27(1) కింద కేసు నమోదు చేశారు. 50కి పైగా ప్రశ్నలు.. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన క్రైమ్ బ్రాంచ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) అరుణ్ బొత్రా నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ ఆదివారం ఘటనా స్థలంలో పట్టుబడినట్లు తెలిపారు. మంత్రి నవకిషోర్ దాస్‌పై తుపాకీతో పేల్చడం వెనక పరిస్థితులను స్పష్టం చేసే దిశలో దర్యాప్తుకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాల్పుల ఘటనపై తదుపరి విచారణ కోసం నిందితుడికి ఏడు రోజుల రిమాండ్ నిమిత్తం కోర్టుకు అభ్యరి్థంచనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. సుందర్‌గఢ్ పోలీసు బ్యారక్‌లో నిర్బంధించి నిందిత ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను నిరవధికంగా 2 గంటల పాటు ప్రశ్నించారు. 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అయితే ఆయన ఏం మాట్లా డారు? ఏం సమాధానం చెప్పాడు? ఎందుకు చంపాడనే విషయాలేవీ తెలియరాలేదు. అరుణ్ బొత్రా సైతం మీడియా ఎదుట పెదవి దాటకుండా జాగ్రత్త వహించారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ.. మంత్రి నవకిషోర్ దాస్ హత్య ఘనను హైకోర్టు న్యాయ మూర్తితో విచారణ జరిపించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాసింది. మంత్రి నవకిషోర్ దాస్ హత్యా ఘటనపై విచారణకు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని పేర్కొవాలని సోమవారం రాసిన లేఖలో అభ్యర్థించింది. ఝార్సుగుడ మున్సిపాలిటీ లో మంత్రి చివరి ప్రసంగం నన్ను మాత్రం వదులుతారా? ఆరోగ్యమంత్రి నవకిషోర్ దాస్ మరణానికి కొద్ది సమయం ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రసంగంతో ఆయన జీవన ప్రస్థానం ముగిసింది. ఝార్సుగుడ మున్సిపాలిటీ ఒకటో నంబరు వార్డు కిసాన్పాడులో మైక్రో యాక్టివిటీ సెంటర్ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో చివరి సారిగా ప్రసంగించారు. ఈ సమావేశంలో మంత్రి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ప్రతి చోటా ఆదరించే వారు ఉంటారు.. కించపరిచే వారూ.. ఉంటారు. రాముడు–రావణుడు, కృష్ణుడు–కంసుడు ఈ కోవకు చెందిన వార’ని ఉదహరించారు. ‘సీతారాములను కించపరచకుండా వదలని ప్రజానీకం మధ్య మనుగడ కొనసాగిస్తున్న నన్ను మాత్రం ధూషించకుండా వదులుతారా?’ అని చమత్కరించి సభలో నవ్వులు కురిపించారు. ఈ కార్యక్రమం హాజరయ్యే ముందు తుపాకీ తూటాతో కుప్పకూలి అనంత విషాదం మిగిల్చారు. శని శింగనాపూర్ శనిదేవుని మందిరంలో మంత్రి నవకిషోర్ దాస్ పూజలు(ఫైల్) కలిసిరాని పూజ! త్రివేణి అమావాస్య సందర్భంగా మహారాష్ట్ర శని శింగనాపూర్‌లో ఉన్న శనిదేవుని మందిరంలో మంత్రి కిషోర్‌దాస్ బంగారు కలశం విరాళంగా అందజేసి ఇటీవల వార్తలకెక్కారు. రూ.కోటి విలువైన 700 గ్రాముల బంగారం, 5కిలోల వెండితో చేసిన కలశాన్ని ఆలయానికి సమరి్పంచారు. అయితే ఈ కలశం విలువ కేవలం రూ.10 లక్షలు మాత్రమేనని మంత్రి ప్రకటించారు. ఈ కలశం ఆవ నూనెతో శని భగవానునికి అభిషేకించేందుకు వినియోగించేందుకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర, ఝార్సుగుడ ప్రజలను సంతోషంగా ఉంచాలని శని దేవుడిని ప్రార్థించానన్నారు. గోపాల్ కృష్ణదాస్, ఏఎస్ఐ విధుల నుంచి తొలగింపు.. ఆరోగ్యశాఖ మంత్రి కిషోర్ దాస్ హత్యకేసులో నిందితుడు సహాయ సబ్ ఇస్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్ఐ) గోపాల్‌కృష్ణ దాస్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విధుల నుంచి తొలగిస్తునట్లు ఝార్సుగుడ జిల్లా ఎస్పీ రాహుల్‌జైన్ సోమవారం ప్రకటించారు. నిందితుడు బ్రజరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఛక్ అవుట్‌పోస్టు సిబ్బందిగా పేర్కొన్నారు. భారత రాజ్యంగం ఆర్టికల్ 311 ప్రకారం సరీ్వసులో ఉన్న నిందితునికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 30నుంచి అమలైనట్లు పరిగణిస్తామన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి చివరి చూపు.. దివంగత మంత్రి నవకిషోర్ దాస్ స్థానిక యూనిట్–5 అధికారిక నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ ప్రొఫెసర్ గణేష్‌లాల్ అంతిమ దర్శనం చేసుకుని పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ ప్రాంగణంలో దాస్‌కు ఒడిశా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ప్రదానం చేశారు. అతున్ సవ్యసాచి నాయక్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఉషాదేవి, న్యాయశాఖ మంత్రి జగన్నాథ్ సరకా, విద్యుత్‌శాఖ మంత్రి ప్రతాప్ కేశరీదేవ్, జల వనరులశాఖ మంత్రి టుకుని సాహు, ఎక్సైజ్‌శాఖ మంత్రి అశ్వినీకుమార్ పాత్రొ, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రీతిరంజన్ ఘొడై, జౌళీ, హస్తకళల శాఖమంత్రి రీతా సాహు, పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్ దాస్ ఈ ప్రాంగణంలో దివంగత మంత్రికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆరోగ్యశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మరణం దురదృష్టకరమని వీరంతా విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబీకుల పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి
ఒడిషా చరిత్రలో నెత్తుటి మరక చోటు చేసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిశోర్ దాస్(61)పై తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిన ఆయనను.. ఝార్సుగుడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉన్నత చికిత్స కోసం హెలీకాఫ్టర్లో భువనేశ్వర్ తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మంత్రి మృతికి కారణమైన ఏఎస్ఐ గతంలో ఆయన వద్ద గన్‌మెన్‌గా పని చేసినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై రాష్ట్ర హోంశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఝార్సుగుడ: బ్రజ్‌రాజ్ నగర్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తుపాకీ కాల్పులకు గురికావడం కలకలం రేపింది. అభిమానులతో కలిసి ఊరేగింపునకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఆయనపై తుపాకీ తూటా పేలింది. బ్రజ్‌రాజ్ నగర్ గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఏఎస్ఐ గోపాల్‌దాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. మంత్రి ఛాతికి గురిపెట్టి, తుపాకీ పేల్చడంతో బుల్లెట్ శరీరంలో ఎడమవైపు దూసుకు పోయింది. బ్రజ్‌రాజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కొత్త కార్యాలయ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న హడావిడిలో గాంధీ ఛక్ సమీపంలో తుపాకీ పేలుడు సంభవించింది. గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఠాణా ఏఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో అతి సమీపం నుంచి మంత్రి ఛాతీకి గురిపెట్టి కాల్చడంతో మంత్రి అక్కడికక్కడే కుప్పకూలారు. పక్కనే స్థానిక ఐఐసీ ప్రద్యుమ్న స్వొయినిపై సైతం కాల్పులు జరపగా, ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం నవీన్ పట్నాయక్ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై క్రైంశాఖ దర్యాప్తుకు ఆదేశించారు. ఒడిషా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ మృతి కేసులో కీలక విషయం వెలుగు చూసింది. ఆయన్ని కాల్చి చంపిన ఏఎస్ఐ గోపాలకృష్ణ దాస్ మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న దాస్.. పదేళ్లుగా సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే.. అతనికి ఉన్న మానసిక వ్యాధిని పక్కనపెట్టి.. సర్వీస్ రివాల్వర్ జారీ చేయడంతో పాటు బ్రజరాజ్ నగర్ పోలీస్ పోస్ట్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు ఆయనకు పదేళ్లుగా చికిత్స అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ త్రిపాఠి మీడియాకు వివరాలను వెల్లడించారు. పదేళ్ల నుంచి ట్రీట్మెంట్ పదేళ్ల కిందట గోపాలకృష్ణ దాస్ తన దగ్గరకు చికిత్స కోసం వచ్చాడని ఆయన తెలిపాడు. కోపధారి అయిన దాస్.. దానిని నియంత్రించుకునేందుకు తన దగ్గర చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతనికి ఉన్న బైపోలార్ డిజార్డర్ వ్యాధికి ప్రతీరోజూ మందులు వాడాల్సిందేనని, కానీ, ఏడాదిగా అతను తన దగ్గరికి రాలేదని డాక్టర్ త్రిపాఠి వెల్లడించారు. జార్సుగూడ ఎస్డీపీవో గుప్తేశ్వర్ భోయ్ మాట్లాడుతూ.. దాస్‌కు ఏఎస్ఐ హోదాలో బ్రజ్‌రాజ్‌నగర్ ఏరియా గాంధీ చక్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారని, ఆ తర్వాతే లైసెన్స్డ్ పిస్టోల్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య జయంతి దాస్ తెలిపారు. వృత్తి రిత్యా కుటుంబానికి దూరంగా(400 కిలోమీటర్ల..) ఉంటున్నాడని ఆమె వివరించారు. మంత్రిపై దాడికి సంబంధించిన సమాచారం టీవీ చానెళ్ల ప్రసారంతో తెలిసిందన్నారు. ‘నా భర్త గత ఏడాదిన్నరగా గాంధీ ఛక్ ఔటుపోస్టులో ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యానికి సంబంధించి మందులు కూడా వాడుతున్నారు. అయితే అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియదు. ఉదయమే కుమార్తెతో, శనివారం రాత్రి కుమారుడితో వీడియోకాల్ ద్వారా మాట్లాడారు. కాల్ సమయంలో పూర్తిగా సాధారణమైనట్లు కనిపించా’రని ఆమె వివరించారు. ఈ చర్యతో తామంతా షాక్‌కు గురయ్యామన్నారు. నిందితుడు దాస్‌ను ఝార్సుగూడ పోలీసులు ఘటనకు పాల్పడిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని ఉత్తర రేంజ్ ఐజీ దీపక్‌కుమార్ ప్రకటించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మంత్రి దగ్గర కూడా.. నిందిత ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు బ్రజరాజ్ నగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీఓ) గుప్తేశ్వర్ భొయ్ తెలిపారు. గంజామ్ జిల్లా జలేశ్వర్ఖండికి చెందిన దాస్.. బెర్హమ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత జార్సుగూడలో పన్నెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో 2 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఈ పరిస్థితికి ప్రేరేపించిన కారణాలను ధ్రువీకరించే దిశలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. గోపాల్‌దాస్.. కొన్నేళ్ల క్రితం మంత్రి వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్ఓ)గా పనిచేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. భువనేశ్వర్‌కు ఎయిర్‌లిఫ్ట్.. తుపాకీ కాల్పులకు గురైన రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్‌ను ముందుగా ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో భువనేశ్వర్‌కు తరలించారు. మధ్యాహ్నం 2.55 గంటలకు విమానాశ్రయానికి చేరడంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, అంబులెన్స్‌లో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేర్చారు. క్యాపిటల్ ఆస్పత్రి డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్సను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. మంత్రి గుండెల్లోకి బుల్లెట్ దూసుకు పోవడంతో ఊపిరితిత్తులు, లోపలి భాగాల పునరుద్ధరణకు చేసిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త ప్రసరణకు చేసిన ప్రయత్నాలు అనుకూలించ లేదు. ఐసీయూలో అత్యవసర చికిత్స సేవలు ఫలప్రదం కానందున ప్రాణాలు కాపాడటం సాధ్యం కాలేదని అపోలో ఆస్పత్రి వర్గాలు మీడియాకు వెల్లడించారు. దీంతో భారీగా అంతర్గత రక్తస్రావమై, ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసినట్లు డాక్టర్ దేవాశిష్ నాయక్ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం వెల్లడించింది. అత్యంత ధనిక మంత్రిగా.. ఆరోగ్య శాఖామంత్రి నవ కిషోర్ దాస్ నవీన్ మంత్రి మండలిలో రెండో అత్యంత ధనవంతుడు. 2009 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి నిరవధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ఎన్నికల ముందు బీజేడీ చేరి, మరోసారి విజయం సాధించారు. పార్టీలో అనతి కాలంలోనే కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 70కి పైగా వ్యక్తిగత వాహనాలు, రూ.కోటి విలువ చేసే మెర్సిడెజ్ బెంగ్ కారు, ఒక రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్, రైఫిల్ కలిగి ఉన్న కిషోర్‌దాస్ సమగ్ర ఆస్తుల విలువ రూ.34 కోట్లుగా గతేడాది ప్రకటించారు. గనుల మైనింగ్ ఆనయకు ప్రధాన ఆదాయ వనరు. బలమైన నాయకుడిని కోల్పోయాం.. 1962 జనవరి 7న సంబల్పూర్లో జన్మించిన నవకిషోర్ దాస్.. ఎల్ఎల్.బి, ఎంఏ పూర్తి చేశారు. 1980 దశకంలో విద్యార్థి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంబల్పూర్లోని గంగాధర్ మెహెర్ కళాశాల(ప్రస్తుతం గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం)లో చదువుతున్నప్పుడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. దాస్ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా 4 దశాబ్దాలు కొనసాగింది. ఉన్నత నాయకత్వ లక్షణాలతో అన్ని వర్గాల ఆదరణ చూరగొన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి తొలుత కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత బిజూ జనతాదళ్ అభ్యరి్థగా శాసన సభ్యుడిగా తుదిశ్వాస వరకు కొనసాగారు. ఆయన మరణంతో పశి్చమ ఒడిశాతో రాష్ట్రం బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దాస్ ఆకస్మిక మృతి ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని ప్రకటించారు. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు వైద్య రంగంలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. పశ్చిమ ఒడిశాలో బీజేడీని బలోపేతం చేయడంలో అతని సహకారం అసాధారణమైనదని, పారీ్టలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. గతంలో మంత్రి మహంతిపై.. బిజూ జనతాదళ్ హయాంలో మంత్రులపై దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో 2014 ఫిబ్రవరి 21న న్యాయశాఖ మంత్రి మహేశ్వర్ మహంతిపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటన పూరీలో చోటు చేసుకుంది. మంత్రి శరీరంలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. అదృష్టావశాతు ఈ దాడి నుంచి మంత్రి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా మంత్రి నవకిషోర్ దాస్ తుపాకీ పేలుడుతో మృతిచెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 2009 నుంచి ఆయన ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్ మంత్రి కిషోర్‌దాస్‌పై తుపాకీ దాడి తదనంతర మృత్యు ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిపై బాధ్యత వహిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కంటాబంజి ఎమ్మెల్యే సంతోశ్ సింగ్ సలుజా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఆరోగ్య మంత్రిపై కాల్పులపట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దారుణమైన ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తోందని, అయితే ఈ విషాద ఘటన రాష్ట్ర ప్రజల భద్రత వ్యవస్థ పట్ల ప్రశ్న లేవనెత్తిందని నిలదీశారు. ప్రభుత్వం తన మంత్రికి భద్రత కల్పించ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ట అని, దీనిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని మీడియా వింగ్ చైర్మన్ గణేశ్వర్ బెహెరా, జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ డిమాండ్ చేశారు. ప్రధాని సహా పలువురి సంతాపం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కాల్పులకు గురికావడం బాధాకరమన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేశ్ లాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ ప్రముఖులు మంత్రి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అరుణ్ బొత్రా నేతృత్వంలో.. బ్రజ్‌రాజ్‌నగర్‌లో మంత్రి కిషోర్‌దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరపడంతో మృతికి దారితీసిన ఘటనపై విచారణ జరిపేందుకు ఒడిశా క్రైంబ్రాంచ్ బృందం ఆదివారం సాయంత్రం ఝార్సుగుడ చేరుకుంది. ఎస్పీ రమేశ్ చంద్ర దొర ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ బృందంలో బాలిస్టిక్, సైబర్ నిపుణులు, క్రైంబ్రాంచ్ అధికారులు ఉన్నారు. దర్యాప్తును క్రైంశాఖ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. కాల్పులకు గల కారణాన్ని తెలుసుకోవడానికి, ఘటన జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఐను విచారించనున్నారు. -
కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి..
అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పుట్టగొడుగుల ఫామ్‌లోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హతమార్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ట్రక్కు కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఇంకొకరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటల్లోగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఇటీవల మాస్ షూటింగ్ ఘటనలు తరచూ జరగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రెండు రోజుల క్రితమే చైనీస్ న్యూ ఇయర్ వేడుకపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు కూడా ఘటనా స్థలంలోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్! -
దారుణం.. ప్రేమకు నిరాకరించిందని తుపాకీతో కిరాతకంగా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ భదోహిలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందని 15 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిచంపాడు ఓ కిరతాకుడు. నుదుటిపై షూట్ చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందుతుడ్ని 22 ఏళ్ల అరవింద్ విశ్వకర్మగా గుర్తించారు పోలీసులు. బాధితురాలి పేరు అనురాధ. ఈమె నిందితుడి సోదరితో పాటు కోచింగ్ సెంటర్‌కు వెళ్తోంది. ఓ రోజు తిరిగివస్తుండగా.. అనురాధ దగ్గరకు వెళ్లి అరవింద్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అరవింద్ గన్ తీసి ఆమెను షూట్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
రెస్టారెంట్‌కు నకిలీ తుపాకీతో వెళ్లి దోపిడీ.. చివరకు..
వాషింగ్టన్: అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి ప్రయత్నించాడు ఓ దొంగ. రెస్టారెంట్లో వెళ్లి కస్టమర్లను బెదిరించి వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అతని దగ్గరున్న గన్ నకిలీదని తెలియక కస్టమర్లు భయపడ్డారు. అయితే రెస్టారెంట్‌లోని ఓ కస్టమర్ దొంగను చావుదెబ్బతీశాడు. అదును చూసి తన దగ్గరున్న తుపాకీ తీసి దొంగను షూట్ చేశాడు. దీంతో అతనికి తూటాలు తగిలి కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగకుండా దొంగ దగ్గరకు వెళ్లి పలు మార్లు కాల్పులు జరిపాడు కస్టమర్. దీంతో దొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant 📌#Houston | #Texas Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ — R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023 గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే దొంగను కాల్చిచంపిన కస్టమర్‌ను పోలీసులు విచారించాల్సి ఉంది. దొంగ నుంచి తనను తాను కాపాడుకునేందుకే షూట్ చేసినందున అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. ఇంతకీ దొంగను కాల్చి చంపిన కస్టమర్ ఎవరనే విషయం తెలియలేదు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
పిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య!
మనీలా: పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. భారత్‌లోని పంజాబ్, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్ప్రీత్ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు దిగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ కోచ్‌ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కెనడాలో మరో ఘటన.. కెనడాలోని ఒంటారియాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. పంజాబ్‌కు చెందిన మోహిత్ శర్మ(28) నిర్మాణుష్య ప్రాంతంలో కారు వెనకసీటులో మృతి చెంది కనిపించాడు. కొద్ది రోజులుగా విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. భారతీయులపై దాడులు పెరిగిన క్రమంలో కెనడాలో ఉన్న పౌరులు అప్రమతంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
Rajasthan: పట్టపగలే గ్యాంగ్‌స్టర్ దారుణ హత్య
జైపూర్: రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్.. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే హైప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందే నలుగురు దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. శనివారం ఉదయం 9.30గం. ప్రాంతంలో సికార్ నగరం పిప్రాలి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి.. రాజు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. షెకావతి ప్రాంతానికి చెందిన మరో గ్యాంగ్‌తో రాజుకి వైరం ఉందని, బహుశా ఆ ముఠానే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హత్య తర్వాత గాల్లోకి కాల్పులు జరుపుతూ జనాలను భయపెట్టుకుంటూ ముందుకు వెళ్లింది ఆ ముఠా. అయితే.. Gang war in Sikar, Rajasthan. Gangster Raju Theth shot dead. Earlier Raju Theth had enmity with the Anandpal gang, according to sources currently Anandpal gang and Bishnoi gang were together. Sikar police is investigating the matter. pic.twitter.com/ZLkkcNshRH — Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022 ఇక ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు తానే బాధ్యుడినంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించుకోవడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినే అంటూ అతను పరిచయం చేసుకున్నాడు. ఆనంద్ పాల్ సింగ్, బల్బిర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ప్రకటించుకున్నాడు రోహిత్. గ్యాంగ్‌స్టర్ రాజు(పాత చిత్రం) ఆనంద్‌పాల్ గ్యాంగ్‌కు చెందిన బనుదా.. జులై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇదిలా ఉంటే.. థెట్ వర్గీయులు అతని మరణానికి సంఘీభావంగా స్థానికంగా దుకాణాలు మూయించేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేపడతామని పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం -
శివసేన నేత దారుణ హత్య.. పట్టపగలే తుపాకులతో రెచ్చిపోయారు..
Sudhir Suri.. శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన శివసేన నేత సుధీర్ సూరి.. శుక్రవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఓ ఆలయ ప్రాంగణం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించడంతో శివసేన నాయకులు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివసేన నాయకులకు మద్దతిస్తూ సుధీర్ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు సుధీర్‌పై కాల్పులు జరిపారు. దీంతో, సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా.. కాల్పులు జరిపిన వ్యక్తిని శివసేన నాయకులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం సుధీర్ సూరి ఓ వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ.. మతపరంగా మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సుధీర్ సూరి.. హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా ఆయనపై కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇక, సుధీర్ హత్యపై బీజేపీ నేత తజీందర్ సింగ్ బగ్గా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తజీందర్ బగ్గా.. ‘పంజాబ్‌లో శాంతి భ్రదతలు పూర్తిగా విఫలమయ్యాయి. అమృత్‌సర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో శివసేన నాయకుడు సుధీర్ సూరి తీవ్రంగా గాయపడ్డారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. Right under the nose of several police officers in Amritsar, Hindu activist Sudhir Suri shot dead at point blank range. He was reportedly on the hitlist of pro-Khalistani elements. Meanwhile Punjab CM Bhagwant Mann is busy with AAP's election campaign in Gujarat. What a shame!! pic.twitter.com/rcx2HaScXb — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) November 4, 2022 -
హైస్కూల్‌తో తుపాకీతో రెచ్చిపోయిన యువకుడు.. భీకరంగా కాల్పులు..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హైస్కూల్లో ఓ సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని షూట్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు సహా మరో ఇద్దరు బాధితులు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఓ మహిళ, ఓ టీనేజర్ ఉన్నారు. ఉదయం 9:10 గంటలకు తమకు కాల్పులు జరుగుతున్నట్లు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. 2 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ లోపల పెద్ద తుపాకీతో ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు విద్యార్థులు తమకు తెలిపారని, వెంటనే అతడ్ని షూట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి వయసు 20 ఏళ్లు పైబడి ఉంటుందని, అతడి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని.. -
Rajasthan: బీజేపీ నేత, ఎంపీకి అత్యంత సన్నిహితుడు దారుణ హత్య
జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. భరత్‌పూర్‌లో కిర్పాల్ సింగ్ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్ తన కారులో సర్క్యూట్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది రెండు బైక్‌లు, అనేక కార్లలో వచ్చి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో సింగ్‌కు ఏడు బుల్లెట్లు గాయాలయ్యాయి. సింగ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. కాగా కిర్పాల్ సింగ్.. భరత్పూర్ బీజేపీ ఎంపీ రంజీతా కోలికి అత్యంత సన్నిహితుడు. సింగ్ మరణవార్త తెలిసిన వెంటనే ఎంపీ రంజీతా కోలి ఆసుపత్రికి వెళ్లారు. డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, కిసాన్ మోర్చా మాజీ ప్రతినిధి కిర్పాల్ సింగ్ మృతిచెందడం వల్ల ఈ రోజు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు ఎంపీ కోలీ హిందీలో ట్వీట్ చేశారు. చదవండి: కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం -
సీఎం సన్నిహితుడు, బీజేపీ నేత దారుణ హత్య
బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నాయకుడు సుఖ్బీర్ ఖతానాను కాల్చి చంపారు. కాగా, ఆయన మర్డర్‌పై రంగంలోకి దిగిన హర్యానా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. గుర్గావ్లోని ఓ క్లాత్ షోరూమ్‌లో స్థానిక బీజేపీ నాయకుడు సుఖ్బీర్ ఖతానాను ఐదుగురు వ్యక్తులు కాల్చి చంపారు. షోరూమ్‌లోని ప్రవేశించిన దుండగులు సుఖ్‌బీర్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుఖ్బీర్ ఖతానా ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్టు పోలీసు ఉన్నతాధికారి దీపక్ సహారన్ తెలిపారు. కాగా, సుఖ్బీర్ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్నికల్లో రిథోజ్ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు స్థానిక మీడియాతో ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. సుఖ్బీర్ గుర్గావ్లోని సోహ్నా మార్కెట్ కమిటీకి మాజీ వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సుఖ్బీర్ ఖతానా అత్యంత సన్నిహితుడు. BJP worker and former vice chairman of Sohna Market Committee, Sukhbir Khatana gunned down by unknown assailants in broad daylight on Gurudwara Road #Gurugram. pic.twitter.com/tLxm4YqgxM — Nikhil Choudhary (@NikhilCh_) September 1, 2022 -
రెండుసార్లు హత్యాయత్నం.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ముంబైలో రూ.5 కోట్ల కొకైన్ పట్టివేత వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్‌వెపన్‌తో కాల్చారు.. షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడిని ఇద్దరు వ్యక్తులు పిస్తోల్‌తో కాల్చిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–7లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నాడు. అయితే రాజేందర్ శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా..సుమారు 1.30 గంటల నుంచి రెండు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రిస్తున్న రాజేందర్‌పై వెంట తెచ్చుకున్న పిస్తోల్‌తో కుడివైపు కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఉదయం ఐదు గంటలవరకూ నిందితులు రాజేందర్ ఇంటిముందున్న గద్దెపైనే కూర్చున్నట్లు స్థానికులు చెబుతున్నారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా..త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు. హత్య సమయంలో రవళి బాత్రూమ్లోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్, కోడలు రవళి కలిసి తమ కొడుకును తుపాకీతో కాల్చి చంపినట్లు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు సాంకేతిక ఆధారాలతో నిందితులను మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బందం రాజు, అతని మిత్రుడు సయ్యద్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందాన్ని రప్పించి తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ట్‌వెపన్‌తో కాల్చారు.. షార్ట్‌వెపన్‌తో కాల్చినట్లు భావిస్తున్నాం. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు వాడింది లైసెన్స్డ్ వెపనా..? లేక దేశీ కట్టా వెపనా..? తేలాల్సి ఉంది. హత్యకు సంబంధించిన ఏమైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. –రూపేష్, పెద్దపల్లి డీసీపీ -
ఆప్ కౌన్సిలర్ దారుణ హత్య.. జిమ్‌లోకి వచ్చి తుపాకీతో కాల్చిన దుండగుడు
చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి -
సహోద్యోగులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కమాండర్ పింటో నామ్‌గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్‌హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్ రాయ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయెట్ పూర్తి చేయగా.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్‌కు చెందిన వారు. -
‘కనిష్క’ మరోసారి తెరపైకి..
టొరంటో: 1985లో ఎయిరిండియా ‘కనిష్క’ ఉగ్ర బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన రిపు దమన్ సింగ్ మాలిక్ (75) కెనడాలో గురువారం హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుంచి తుపాకీతో కాల్చేశాడు. దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. వాంకోవర్‌లో 16 వేల మంది సభ్యులున్న ఖల్సా క్రెడిట్ యూనియన్ (కేసీయూ)కు మాలిక్ ప్రెసిడెంట్. అక్కడే ఖల్సా స్కూళ్లను నడుపుతున్నారు. ఆయనకు పాపిలాన్ ఈస్టర్న్ ఎక్స్పోర్ట్ వంటి పలు వ్యాపారాలున్నాయి. మాలిక్ హత్యను బాధాకరమైన, దురదృష్టకరమైన ఘటనగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది. ఎందరో శత్రువులు సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌ను భారత్ వెలుపల ముద్రించరాదన్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి రిపుదమన్ వివాదాస్పదుడయ్యారు. ఆయన బయటకు కనిపించినంత మంచి వ్యక్తి కాదని కనిష్క కేసు దర్యాప్తు బృంద సారథి రిటైర్డు డిప్యూటీ కమిషనర్ గ్యారీ బాస్ చెప్పారు. మాలిక్ వివాదాస్పద వ్యక్తి అని ఆయన ఒకప్పటి మిత్రుడు ఉజ్జల్ దొసాంజ్ అన్నారు. 1985 జూన్ 23న 329 మందితో టొరంటో నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా కనిష్కలో సూట్‌కేసు బాంబ్ పేలి అంతా దుర్మరణం పాలయ్యారు. ఇది ఖలిస్తానీ ఉగ్రవాదుల పనేననంటారు. ఈ ఘటనలో దోషిగా తేలిన ఇందర్జిత్ సింగ్ రేయాత్ అనే వ్యక్తి కెనడాలో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. -
నాసిక్‌లో ముస్లిం మత గురువు దారుణ హత్య
ముంబై: ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. అఫ్గనిస్తాన్‌కు చెందిన 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీ గత కొన్నేళ్లుగా నాశిక్‌లో నివసిస్తున్నారు. స్థానికంగా సూఫీ బాబాగా పేరొందారు. యోలా పట్టణంలోని ఎమ్ఐడీసీ ఓపెన్ ప్లాట్‌లో సూఫీ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కాల్చి చంపారు. ఈ ప్రాంతం ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిందితులు మత గురువు నుదుటిపై పిస్టోల్‌తో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. బాబాను హత్య చేసిన అనంతరం నిందితులు అతనికి చెందిన ఎస్యూవీ కార్లోనే పరారయ్యారు. విషయం తెలుసుకున్న యోలా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆధ్యాత్మిక గురువు కారు డ్రైవర్‌నే ప్రధాని నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాబా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: నూపుర్ వ్యాఖ్యల ప్రకంపనలు.. ఆమె తల తెస్తే ఇల్లు రాసిస్తానన్న వ్యక్తి అరెస్ట్ -
సాయిచరణ్‌కు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ క్రైం: అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో మరణించిన నక్క సాయి చరణ్ మృతదేహం మంగళవారం నల్ల గొండకు తీసుకువచ్చారు. నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు నక్క సత్యనారాయణ– పద్మ కుమారుడు సాయిచరణ్(25) ఈ నెల 20న అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ సిటీలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. సాయి చరణ్ మృతదేహం మంగళవారం ఉదయం నల్లగొండలోని నివాసానికి ప్రత్యేక వాహనంలో రాచకొండ సీపీ మహెష్ భగవత్ చేర్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి, తండ్రి గుండెలవిసేలా రోదించారు. కుమారుడి పార్థీవదేహాన్ని చూసి రోదిస్తున్న తల్లి గొప్పోడివయ్యావనుకుంటే.. కానరాని లోకాలకు వెళ్లిపోతివా కొడుకా అంటూ వారి రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. డిసెంబర్లో వస్తానని చెప్పి శవమై వస్తివా అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘డాడీ నేను ఉండేది అమెరికా దేశంలో. డేంజర్ జోన్ 5లో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను ఉండే ప్రాంతం నుంచి ఉద్యోగాన్ని మార్చుకుంటా’ అని చెప్పాడని సాయిచరణ్ తండ్రి సత్యనారాయణ తెలిపారు. ఆ ప్రాంతం నుంచి కొన్నిరోజులు ముందుగా మారినా తన కుమారుడి ప్రాణం దక్కేదని విలపించాడు. చదవండి👉🏻బస్టాండ్ బాత్రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి నాలుగు గంటలు రోడ్డుపైనే సాయిచరణ్.. స్నేహితుడిని కారులో తీసుపోయి ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తుండగా ఇంటర్స్టెట్–95 లోని కెటన్ అవెన్యూ చివరికి చేరుకోగానే ఓ నల్లజాతీయుడు కారుపై కాల్పులు జరిపడంతో ముఖం కుడివైపు బుల్లెట్ తగిలిందని, ఆ వెంటనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిసింది. ఇతరుల సాయం కోసం సాయిచరణ్ కారు డోర్ తీసి కిందపడిపోయాడు. కాల్పులు జరిగిన 4గంటల తర్వాత పోలీస్ పెట్రోలింగ్ గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స మొదలైన రెండు గంటల్లోనే సాయి చరణ్ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. వాట్సాప్ ద్వారా సమాచారం.. సాయిచరణ్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే విషయంపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేశారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరితో, సాయిచరణ్ కుటుంభ సభ్యులతో సీపీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సాయి మృతదేహన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. చదవండి👉🏻దేశ్‌కీ నేతా! బీఆర్ఎస్ ఏమైంది? అండగా ఉంటాం.. సాయి చరణ్ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మృతుని కుటుంబాన్ని పరామార్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వారి కుటుంబానికి తగిన సహకారం అందించాలని కోరారు. -
పాక్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఆదివారం ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. మృతులను సుగంధ ద్రవ్యాల దుకాణం నడుపుకునే సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38)గా గుర్తించారు. ఘటనకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. పెషావర్‌లో సుమారు 15 వేల మంది సిక్కు మతస్తులున్నారు. చదవండి: సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా -
అల్ జజీరా మహిళా జర్నలిస్టు కాల్చివేత
జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు షిరీన్ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు షిరీన్ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది. బులెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా... కవరేజీ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించారు. పాలస్తీనా సాయుధుల కాల్పుల్లోనే ఆమె చనిపోయినట్టు తమకు సమాచారముందన్నారు. Large crowds gathering in Jenin to sat good bye to veteran AlJazeera Arabic journalist who was shot dead by Israeli fire while reporting near Jenin refugee camp. pic.twitter.com/1oLoCUIeXR — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 AlJazeera journalists & other Palestinian reporters at the scene say veteran @AJArabic reporter Shireen Abu wallah was ´killed in cold blood’ by Israeli forces as she reported on an Israeli raid on Jenin refugee camp. pic.twitter.com/RRsP3PY7GF — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 -
ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీGhazipur ల్లో దారుణం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని ఘజీపూర్ ప్రాంతంలో బీజేపీ నేత జీతు చౌదరిని ఆయన ఇంటి ముందే దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8. 15 నిమిషాల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు జితు చౌదరి తన ఇంటి ముందు రోడ్డుపై తుపాకీ గాయాలతో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా జితూ చౌదరి బీజేపీ మాయూర్ విహార్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జ్, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. -
కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. 20 రోజుల్లో 20 మంది..!
చండీగఢ్: పంజాబ్‌లో హత్యల పరంపర కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లో 20 హత్యలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ ఆరోపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నమోదైన హత్య కేసుల్లో అధిక భాగం క్రీడాకారులవే కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ హత్య ఉదంతం మరవకముందే తాజాగా మరో కబడ్డీ ప్లేయర్ హత్య చేయబడ్డాడు. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో ధర్మేంద్ర సింగ్ అనే కబడ్డీ ప్లేయర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చారు. ఓ విషయంలో (ఎన్నికలు) ధర్మేంద్రకు అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లే గత మంగళవారం ధర్మేంద్రను రాజీకని పిలిపించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య -
సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. 19 మంది మృతి
మెక్సికో: మెక్సికో దేశంలో ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో గుర్తు తెలియని వ్యక్తులు జరిగిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మిచోకాన్ రాష్ట్రంలోని లాస్ టినాజాస్ పట్టణంలో ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఓ ఉత్సవంలో గుమిగూడిన వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 19 మంది మృతదేహాలను గుర్తించినట్లు, వీరిలో 16 మంది పురుషులు ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలపై తుపాకీ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంతమంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఫెడరల్ అధికారులు పనిచేస్తున్నారని మిచోకాన్ పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ కార్యాలయం ట్విటర్లో తెలిపింది. చదవండి: Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా? కాగా మిచోకాన్ దాని పరిసర ప్రాంతం గునజుటో మెక్సికోలోనే అత్యంత హింససాత్మక ఘటనలు చోటుచేసుకునే రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు నిత్యం కాల్పులు జరుపుతూ ఉంటాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయిల్ దొంగతనం సహా అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో కాల్పుల్లో ప్రతి ఏడాది వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
పాకిస్తాన్లో దారుణం.. యువతి కిడ్నాప్‌నకు యత్నం.. ప్రతిఘటించడంతో..
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల హిందూ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చిచంపారు. పూజా ఓద్ అనే యువతిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. పూజా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పాకిస్తాన్లో ఇటువంటి ఘటనలు కొత్తదేం కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. పాకిస్తాన్ మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన పలువురిని బలవంతంగా అపహరించి, మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతియేడు ఈ తరహా ఘటనలు చూస్తున్నామని ఆవేదన చెందారు. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేసేలా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ మొత్తం జనాభాలో హిందూ కమ్యూనిటీ 1.60 శాతం, సింధ్ ప్రావిన్స్‌లో 6.51 శాతం ఉన్నట్లు ఆ దేశ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
International Kabaddi Player Sandeep Nangal Shot Dead: దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. కాగా, సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్‌ను అభిమానులు డైమండ్ పార్టిసిపెంట్ అని పిలుస్తారు. International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar It has started… the deterioration.. Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state.. I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q — Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు -
కాందహార్ హైజాకర్.. ఇన్నాళ్లూ ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో!
మిస్త్రీ జహూర్ ఇబ్రహీం.. ఈ పేరు వినగానే భారత్ రక్తం మరిగిపోతుంటుంది. ఎందుకంటే కాందహార్ హైజాక్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానం దారిమళ్లించిన ముష్కరుల్లో ఒకడు వీడు. అంతేకాదు ఒక ప్రాణాన్ని సైతం బలిగొన్నాడు. భారత్‌కు పీడకలగా మిగిల్చిన ఈ హైజాకింగ్‌లో పాల్గొన్న మిస్త్రీ ఇప్పుడు హతమయ్యాడు. నాడు హైజాక్ కు పాల్పడిన ముష్కరుల్లో మిస్త్రీని ఎవరో హత్య చేశారు. కరాచీ అక్తర్ కాలనీలో నివసిస్తున్న మిస్త్రీ తలలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో రెండు తుటాలు కాల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 1వ తేదీనే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు జహూర్ అంత్యక్రియలు కరాచీలోనే నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహార్ సోదరుడు, జైషే కీలకనేత అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ హాజరయినట్లు సమాచారం. ఇన్నాళ్లూ తెలియలేదా? మిస్త్రీ మరణంపై అధికారిక ప్రకటన చేసిన పాక్ అధికారులు.. అతన్ని ఇంతకాలం గుర్తించకపోవడం విశేషం. జాహిద్ అఖుంద్‌గా పేరు మార్చుకుని అక్తర్ కాలనీలోనే ఏళ్లుగా ఉంటున్నాడు. పైగా కరాచీలోనే ఓ పెద్ద ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తున్నాడు కూడా. అయినప్పటికీ పాక్ అధికారులు అతన్ని ట్రేస్ చేయకపోవడం విచిత్రం. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కు చేరుకుంది. అక్కడ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. 25 ఏళ్ల ప్రయాణికుడు రూపిన్ కట్యాల్‌ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. రూపిన్‌ను చంపింది మిస్త్రీనే అని అధికారులు సైతం ధృవీకరించారు అప్పట్లో. భార్యతో రూపిన్ కట్యాల్ ఇక కాందహార్ హైజాక్ ఘటన తర్వాత జహూర్ మిస్త్రీ... జాహిద్ అఖుంద్ పేరుతో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్థిరపడి ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి హత్యను నిర్ధారించిన జియో టీవీ... ఓ వ్యాపారవేత్త హత్య అంటూ కథనం ప్రసారం చేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను ఎవరు లేపేసారన్నది తెలియాల్సి ఉంది. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్‌తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్‌గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్‌మెన్‌గా, నవీన్ శ్రీనివాస్‌రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు. -
టార్గెట్ శ్రీనివాస్‌రెడ్డా..?లేక రాఘవేందర్‌రెడ్డా..?
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం : సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ హత్యలో ఏడెనిమిది మంది హంతకులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు కారు, ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి దగ్గర్లోనే పెట్రోల్ బంక్ ఉండటంతో అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితులు, వాహనాల రాకపోకలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా? అనేదానిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో అల్మాస్‌గూడకు చెందిన నవారు శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎన్ రెడ్డి నగర్ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన కోమటిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మృతి చెందడంతో.. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా సాంకేతిక అంశాలపై ఆధారపడాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల పాత్ర ఉందా? ► కాల్పులు జరిగిన ఘటనా స్థలానికి అత్యంత చేరువలో 10 నుంచి 15 గుడిసెలు ఉన్నాయి. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు. వెంచర్‌లోని రోడ్లు, డ్రైనేజీ వర్క్స్, గుంతలు తీయటం వంటి పనులు చేస్తుంటారు. మంగళవారం శివరాత్రి పండగ కావటం, ఉదయం 8 గంటల ప్రాంతంలోనే కాల్పులు జరగడంతో ఆ సమయంలో గుడిసె వాసులు అక్కడే ఉండి ఉంటారని.. అనుమానాస్పద వ్యక్తులు వెంచర్లోకి రావటం, తూటాల శబ్దం వంటివి ఏమైనా గమనించారా? కాల్పులను ప్రత్యక్షంగా చూశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ► గుడిసెవాసుల్లోని 20 మంది మహిళలు, పురుషులను పోలీసులు బుధవారం విచారించారు. మంగళవారం శ్రీనివాస్ రెడ్డి మృతదేహం వద్ద జాగిలంతో పరిశీలించిన డాగ్ స్క్వాడ్‌ను బుధవారం మరోసారి రంగంలోకి దింపారు. ఘటన జరిగిన రోజు నేరుగా ఇబ్రహీంపట్నం రోడ్ వైపు పరుగెత్తిన జాగిలం.. బుధవారం మాత్రం మృతదేహం పడిన చోటే తిరిగింది. వెంచర్ బయటికి వెళ్లకపోవడం గమనార్హం. భూ వివాదాలే కారణం.. కానీ.. ► భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆ తగాదా కర్ణంగూడలోని 10 ఎకరాల భూమి విషయంలోనా లేక వేరే ఏమైనా భూ తగాదాలా, సెటిల్మెంట్లా? అనేవి తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. దీంతో రియల్టర్ల హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారనేది పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రతి రోజు ఉదయం శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కర్ణంగూడలోని తమ పొలానికి వచ్చి కాసేపు గడుపుతారనే సమాచారం తెలిసిన వ్యక్తే హత్యకు పథకం రచించి ఉంటాడని, అతనే హంతకులకు వారి సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ► శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి రాకముందే హంతకులు అక్కడ కాపు కాస్తున్నా రని తెలిసింది. మృతులు ఇద్దరికీ ఆయుధ లైసెన్స్‌లు లేవని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్, షెల్స్ ఆధారంగా హంతకులు రెండు తుపాకులు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. లాఅండ్ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఇంటలిజెన్స్ వంటి ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్థిర చరాస్తులపై దర్యాప్తు.. ► భూ వివాదాలు, సెటిల్మెంట్లే హత్యకు కారణ మని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో స్థిర, చరాస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రియల్టర్ మట్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ కృష్ణ, ప్రధాన అనుచరులు హఫీజ్, నవీన్‌లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నమ్మిన బంటైన కృష్ణ.. చిన్నతనం నుంచి శ్రీనివాస్ వెంటే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ► చర్లపటేల్గూడలోని పదెకరాలు కొనుగోలు చేసిన శ్రీనివాస్‌రెడ్డి.. ఆ భూమిని కృష్ణ పేరు మీదనే డెవలప్మెంట్కు తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ చుట్టూ అనుచరులు, సెక్యూరి టీతో ఉండే శ్రీనివాస్‌రెడ్డిని మీర్‌పేట నయీంగా పిలుస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ► పట్నంతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట, అనాజ్‌పూర్, హయత్‌నగర్‌లో పెద్ద మొత్తంలో సెటిల్మెంట్లు చేస్తుంటాడని తెలిసింది. తుర్కయాంజాల్‌లో పెద్ద డీల్‌తో పాటు వనస్థలిపురంలో స్థలంవివాదంపై కోల్‌కతా వెళ్లి సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం. ఉప్పందించిందెవరో..? ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని కర్ణంగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడలేదు. ఇక్కడ చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా తమ అనుచరులు లేకుండా శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి సైట్ వద్దకు వస్తున్నట్లు దుండగులకు ఎవరు ఉప్పందించారనేది కీలకంగా మారింది. ఈ విషయం తేలితే కేసు మిస్టరీని సులువుగా ఛేదించే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. సుపారీ గ్యాంగ్ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్పెషల్ టీంలతో దర్యాప్తు జంట హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్ఓటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ ఇలా వేర్వేరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీంకు లభించిన ఆధారాలు, బుల్లెట్లను పరిశీలిస్తున్నారు. కాల్పులకు వాడిన తుపాకులు, బుల్లెట్లు అక్రమంగా కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కాల్పులు జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న గుడిసెవాసులను, లేక్ విల్లాలో పనిచేస్తున్న కూలీలను పోలీసులు బుధవారం విచారించారు. కాల్పుల శబ్దం వినబడిందా? ఈ గొడవను మీరు చూశారా..? దుండగులను మీరు గుర్తు పట్టగలరా..? అనే కోణంలో వారిని విచారించారు. టార్గెట్ ఒక్కరేనా..? దుండగులు ఒక్కరినే టార్గెట్ చేసి వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఒకే వాహనంలో ఉండటంతో దుండగులు ఇద్దరినీ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఎవరిని టార్గెట్ చేసింది ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వీరి లక్ష్యం భూదందా, సెటిల్మెంట్లలో సిద్ధహస్తుడైన శ్రీనివాస్‌రెడ్డా..? లేక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చిన రాఘవేందర్‌రెడ్డా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తున్నారు. -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు కీలక మలుపు తిరిగింది. కాల్పుల ఘటనను కిరాయి హంతకుల సుపారి హత్యగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణ చేశారు. పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక హత్య కేసులో రాఘవేందర్‌రెడ్డి నిందితుడని, శ్రీనివాస్‌రెడ్డిపై సైతం పలు కేసుల్లో ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి కొంతకాలంగా పలు లాండ్ అగ్రిమెంట్స్, డెవలప్మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఎనిమిది స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మట్టారెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు.. హఫీజ్, కృష్ణలను పోలీసులు విచారిస్తున్నారు. నేడు(బుధవారం) పలువురు భూమి యజమానులను పోలీసులు విచారించనున్నారు. లేక్ వ్యూ విల్లాస్ యజమానులను వద్ద సైతం పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కృష్ణా, అఫీజ్‌లపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదస్పద లేక్ విల్లా డెవలప్మెంట్ డ్రైవర్ కృష్ణ పేరుతో అగ్రిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ పేరు మీద అబ్ధుల్లాపూర్‌మెట్‌లో కొంత భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భూమిపై గురిపెట్టి.. నోట్లో గన్ పెట్టి
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం రూరల్: నగరశివారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూవివాదం ఇద్దరు రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస్‌రెడ్డి (38), కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40)లు తమ వాహనంలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డ ద్వారకామయినగర్ కాలనీకి చెందిన రాఘవేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణలతో కలిసి సందర్శించారు. హతులిద్దరికీ నేరచరిత్ర ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. నోట్లో గన్ పెట్టి..: శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి తమ స్కార్పియో వాహనంలో కర్ణంగూడలోని లేక్‌విల్లా అర్చిడ్స్కు చేరుకున్నారు. అక్కడ ఓ స్థల వివాదంపై నల్లగొండకు చెందిన మట్టారెడ్డితో మాట్లాడిన అనంతరం తిరుగుముఖం పట్టారు. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించారో లేదో గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో వీరిపై కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌రెడ్డి తలలో రెండు బుల్లెట్లు, రాఘువేందర్రెడ్డి ఛాతి భాగంలో ఒక తూటా వెళ్లాయి. శ్రీనివాస్‌రెడ్డి కారు దూకి పారిపోతుండగా.. దుండగులు ఆయనను పట్టుకొని తుపాకీని నోట్లో పెట్టి కాల్చినట్లు తెలుస్తోంది. రాఘువేందర్ రెడ్డి కారులో పారిపోతుండగా వాహనం అదుపుతప్పింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో కారులోనే సుమారు అరగంటపాటు కొట్టుమిట్టాడినట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు రాఘువేందర్ను బీఎన్‌రెడ్డి నగర్‌లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనాస్థలంలో పోలీసులకు ఒక బుల్లెట్ లభ్యం కాగా.. కారులో రెండు బుల్లెట్ షెల్స్ లభించాయి. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న హఫీజ్, కృష్ణతోపాటు మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. భూ వివాదమే కారణమా? ఇబ్రహీంపట్నం పరి«ధిలోని చర్లపటేల్‌గూడ రెవెన్యూ పరి«ధిలో ఇరవై ఏళ్ల క్రితం కొంతమంది రైతులు నల్లగొండ జిల్లాకు చెందిన ఇంద్రారెడ్డి అనే రియల్టర్‌కు కొంత భూమిని విక్రయించారు. ఆయన ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు విక్రయించగా.. వాళ్లు లేక్‌విల్లా ఆర్చిడ్స్ పేరుతో సుమారు 200–300 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. ఒక్కో ప్లాట్ 1,111 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ధరణి వచ్చాక ఆ భూమి తిరిగి ఇంద్రారెడ్డి పేరుపై ఉన్నట్లు చూపించింది. రైతుబంధు పథకం కూడా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈక్రమంలో ఇంద్రారెడ్డి నుంచి పదెకరాల స్థలాన్ని శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డి కొనుగోలు చేశారు. దీంతో ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. ఎలాగైనా భూమిని దక్కించుకోవాలని భావించి శ్రీనివాస్‌రెడ్డి పదెకరాల పొలం చదును చేసి బోర్లు వేసి వ్యవసాయ భూమిగా మార్చాడు. మట్టారెడ్డి, ఇంద్రారెడ్డిలు శ్రీనివాస్‌రెడ్డితో రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఇంద్రారెడ్డి, మట్టారెడ్డి సోమవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. న్యాయవాది హత్య కేసులో దోషి రాఘవేందర్ రెడ్డి భార్య స్వాతిరెడ్డి హైకోర్టులో అడ్వొకేట్‌గా పనిచేస్తున్నారు. 2004లో ఓ మహిళా న్యాయవాది హత్య కేసులో రాఘవేందర్ రెడ్డి (ఏ–2) నిందితుడిగా ఉన్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నేరంలో రాఘవేందర్‌కు కోర్టు జీవితకాలం శిక్ష విధించగా, శిక్ష అనంతరం ఇటీవలే రాఘవేందర్ బయటకు వచ్చినట్లు సీపీ చెప్పారు. ఇదిలాఉండగా.. రెండు నెలల క్రితం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైందన్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత బావనే కేసు పెట్టాడని, బావ మీద శ్రీనివాస్ రెడ్డి కూడా కేసు పెట్టాడని వివరించారు. కేసును చాలెంజ్‌గా తీసుకున్నాం: రాచకొండ సీపీ జంట హత్యల కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లో లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసులున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. మృతులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఇతరత్రా వివరాలను రాబట్టేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చివరిసారిగా మృతులు ఎవరితో మాట్లాడారు? సంఘటనాస్థలం వద్ద ఎవరెవరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? ఎవరికి సుపారీ ఇచ్చారు? తుపాకీ ఎక్కడిది? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం వెతికే పనిలో పడ్డారు. -
విషాదం: పీఎస్‌లో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సంతోష్ మృతదేహన్ని జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్ సందర్శించారు. -
మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు
శ్రీనగర్: శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఘటన నేపథ్యంలో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. -
ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. ఎన్కౌంటర్లో ఇద్దరు హతం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో నిందితుల మృతదేహాల వద్ద నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్‌లుగా గుర్తించారు. ఇవాళ ఉదయం ఖజురి ఖాస్ ప్రాంతంలో ఇద్దరు నేరస్తులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితులు మొదట కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నేరస్తులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుప్రతికి తరలించగా, మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఇవాళ ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో భద్రతను మరింత కఠినం చేశారు. -
20 రౌండ్ల కాల్పులు: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత హత్య
మొహాలి: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా అలియాస్ విక్కీ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో మృతి చెందారు. ఈ ఘటన మొహాలీలోని సెక్టార్ 71లో చేటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్యూవీ కారులో కూర్చున్న విక్కీనిపై మాస్కులు ధరించిన నాలుగురు దుండగుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కారు నుంచి పరుగులు తీశాడు. దుండగులు వెంబడించి మరీ 20 రౌండ్ల కాల్పులు జరపడంతో విక్కీ మృతి చెందాడు. ఈ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ నేత దల్జిత్ సింగ్ చీమా స్పందిస్తూ.. దుండగులు జరిపిన కాల్పుల్లోయూత్ లీడర్ విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా మృతి చెందినట్లు తెలిపారు. ఆయన సోదరుడు స్థానిక మున్సిపల్ ఎన్నికలు పార్టీ తరఫున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. విక్కీ వద్ద లైసెన్స్ తుపాకీ ఉన్నప్పటికీ దుండగలు జరిపిన భీకర కాల్పుల్లో తనను రక్షించుకోలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే విక్కీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వైభవంగా పెళ్లి వేడుకలు; ఇంతలో ఊహించని పరిణామం
మీరట్: ఆ ఇంట్లో అంరగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో వివాహతంతు ముగుస్తుందనగా ఒక వ్యక్తి తుపాకీతో మంటపంలోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీ తూటాలకు ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలగా.. మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటివరకు ఆహ్లదకరంగా ఎంతో సంతోషంగా కనిపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని సరూర్‌పూర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని 18 ఏళ్ల సుమిత్‌గా.. గాయపడిన వ్యక్తిని అంకుర్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత అగంతకుడు సురేంద్ర అలియాస్ కల్లు.. సుమిత్‌పై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సుమిత్తో ఉన్న పాత గొడవల కారణంగానే సురేంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే సుమిత్ శరీరంలోకి దూసుకెళ్లిన బులెట్ పక్కనే ఉన్న అంకుర్‌ను గాయపరిచిందన్నారు. అయితే నిందితుడు సురేంద్ర కాల్పులు జరిపి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం సుమిత్‌ను తరలిస్తుండగా.. కుటుంబసభ్యులు అందుకు ఒప్పుకోలేదు. సుమిత్ మృతికి కారణమైన సురేంద్రను మాకు అప్పగించాలని కోరినా పోలీసులు అందుకు నిరాకరించారు. మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా.. చివరికి పోలీసులు ఎలాగోలా సుమిత్ కుటుంబసభ్యులను ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
బ్రిటీష్ యువతికి పెళ్లి పేరిట వల.. ఆపై దారుణం
ఇస్లామాబాద్: బ్రిటీష్ దేశానికి చెందిన యువతి పాకిస్తాన్లో ఉంటుండగా ఇద్దరు యువకులు ఆమెను ఇష్టపడ్డారు. వారిద్దరూ ఆమెకు లవ్ ప్రపోజల్స్ చేశారు. అయితే వారు ప్రపోజల్ చేసిన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాకిస్తాన్లో కలకలం రేపింది. ఆ యువతి మరణం మిస్టరీగా మారింది. దీనిపై అక్కడి పోలీసులతో పాటు బ్రిటీష్ అధికారులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్ (25) పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సాద్ అమీర్ భట్, జాహీద్ జడూన్ పరిచయమయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్‌లో నివసించే ఆమె బాబాయి మహ్మద్ నాజీర్ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు. మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్ వీసా లభిస్తుందనే ఆశించారట. అయితే ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్ హత్యలో అమీర్ భట్ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్ అధికారి సిద్రా ఖాన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్‌లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ అధికారులు కూడా ఆరా తీశారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు -
పోలింగ్ వేళ ఉద్రిక్తత.. నలుగురు మృతి
-
పోలింగ్ వేళ ఉద్రిక్తత.. నలుగురు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీంగ్ కేంద్రం బయట భద్రతాదళాలు కాల్పులకు దిగడంతో నలుగురు మృతి చెందారు. కూచ్‌బెహార్ జిల్లాలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది. కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ హత్యపై బీజేపీ, టీఎంసీ నాయకలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని బీజేపీ మండి పడింది. కాల్పుల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద దాడులకు దిగారు. పరస్పరం బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భారీగా మోహరించారు. ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీతల్‌కుచి ప్రాంతంలో పోలింగ్ నిలిపివేసింది. ఘర్షణలకు సంబంధించి శనివారం సాయంత్ర ఐదు గంటల వరకు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ సంఘటని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. కుచ్‌బిహార్‌లో జరిగిన సంఘటన ఏదైతే ఉంది అది చాలా బాధకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. జనాలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారనే భయంతోనే మమత దీదీ, ఆమె గుండాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత కారుపై దాడి మరోవైపు హుగ్లీ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘నా కారుపై దాడి చేసి నన్ను గాయపర్చారు. ఈ ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నికల అధికారులు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అమె చెప్పారు. చదవండి: దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే -
అమెరికాలో కాల్పుల కలకలం: 8 మంది మృతి
వాషింగ్లన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగిపోయింది. దుండగులు అట్లాంటాలోని మసాజ్ పార్లర్, స్పాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఎనిమింది మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉండటం గమనార్హం. కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్ మంగళవారం అట్లాంటాలో ఉన్న ఓ బ్యూటీ స్పా దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇలా రెండు స్పాలు, ఓ మసాజ్ సెంటర్ దగ్గర మొత్తం ఎనిమిది మందిపై కాల్పులు జరిపాడు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాల్పులకు తెగబడిన రాబర్ట్ ఆరన్ కోసం గాలించడం ప్రారంభించారు. రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ను రాత్రి 8:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చదవండి: దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్! -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడి కాల్చివేత
పట్నా: బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ కుమార్ మిశ్రా మేనల్లుడిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు శనివారం కాల్పులు జరిపి హతమర్చారు. ఈ ఘటన రోహ్తాస్ జిల్లా పార్సతువా మార్కెట్ సమీపలోని సోహాసా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. సంజీవ్ కుమార్ మిశ్రా(40) మెడిసిన్ కోసం సమీపంలోని మెడికల్‌షాప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా నలుగురు దుండగులు రెండు బైకుల మీది వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మార్కెట్ ప్రాంతం ఉద్రికత్తంగా మారిపోంది. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను వారణాసిలోని ఓ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సంతోష్ కుమార్ ఘటన స్థలనికి చేరుకున్నారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేయలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించాంరు. వందల మంది స్థానికులు సంజీవ్ మిశ్రా మృతికి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. సంజీవ్ కుమార్ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పండిట్ గిరీష్ నారాయణ్ మిశ్రా మనవడు. అతను స్థానికంగా ఓ డిగ్రీ కళాశాల నడుపుతూ.. సామాజిక సేవ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సంతోష్ కుమార్ మిశ్రా కార్గహార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత 20 ఏళ్లలో సంజీవ్ కుమర్ కుటంబంలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అతని తండ్రి మహేంద్ర అలియాస్ గుమతి మిశ్రా, మామ చంద్రమా మిశ్రా, తాత పండిట్ కామతా ప్రసాద్ మిశ్రా అందరూ పార్సతువా మార్కెట్లో కాల్చి చంపబడ్డారు. చదవండి: లాయర్ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి -
క్లాస్‌రూంలోనే దారుణం
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఇద్దరూ మైనర్ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న (బుధవారం) ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతేకాదు నిందితుడి బ్యాగులోమరో నాటు తుపాకీ కూడా ఉండటం పోలీసులను కూడా విస్మయపర్చింది. సైన్యంలోపనిచేస్తూ, ప్రస్తుతం సెలవులో ఉన్న తన మామ లైసెన్స్డ్ తుపాకీని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రోడ్డు దాటేందుకు సమయాత్తమవుతున్న ఓ పాపర్టీ డీలర్‌పై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో బాధితుడు హరీష్ పచౌరీ (50) తీవ్ర గాయాలపాలయ్యారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాహనాలు, జనం రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పచౌరీ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరీనీ అరెస్టు చేయలేదని ఆగ్రా ఎస్పీ బబ్లూ కుమార్ మీడియాకు తెలిపారు. మృతుని కుటుంబంతో ఎవరికైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణం విచారిస్తున్నామని అన్నారు. (చదవండి: నాలుగేళ్ల బాలుడిపై దారుణం..) A property dealer’s murder on a busy Agra intersection , caught on cctv . Amazing impunity . 24 hours after the incident ,still awaiting word from @agrapolice on arrests ... pic.twitter.com/k9ah4ChKMv — Alok Pandey (@alok_pandey) December 20, 2020 -
ట్రిపుల్ మర్డర్స్: కోడలే ప్రధాన సూత్రధారి
సాక్షి, చెన్నై: ఆస్తి కోసం ఆమె ఎంత ఘోరానికైనా వెరవలేదు. అత్తమామలతో పాటు భర్తను సైతం తుపాకీ కాల్పులతో నిర్ధాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుంది. తనకు సహకరించిన బంధువులతో కలిసి నింపాదిగా చెన్నై నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి జరిగిన ఈఘోరానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దలీల్‌చంద్ (74) చెన్నై షౌవుకార్‌పేటలో ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. చెన్నై ఎలిఫెంట్‌గేట్ సమీపంలోని అపార్టుమెంటులో భార్య పుష్పాబాయ్ (70), కుమారుడు సీతల్(40)లతో కలిసి నివసిస్తున్నాడు. కుమార్తె పింక్ (36)కు వివాహం కాగా భర్తతో కలిసి చెన్నైలోనే వేరే చోట కాపురం ఉంటోంది. బుధవారం రాత్రి కుమార్తె పింక్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా ఎంతసేపటీకి ఎవ్వరూ తీయలేదు. దీంతో కంగారుపడి నేరుగా తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగా తలపై తుపాకీ పేల్చిన గాయాలతో రక్తపుమడుగులో ముగ్గురూ విగతజీవులై పడి ఉండడంతో కేకలు పెట్టింది. చదవండి: తమిళనాడులో ట్రిపుల్ మర్డర్స్ సంచలనం సమాచారం అందుకున్న ఎలిఫెంట్‌గేట్ పోలీసులు జాగిలం, వేలిముద్రనిపుణులతో అక్కడికి చేరుకున్నారు. సీతల్‌కు వివాహమైనా భార్యతో ఏర్పడిన మనస్పర్థల వల్ల తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మానసిక స్థితి సరిగాలేని సీతల్‌కు రాజస్థాన్‌లోని బంధువులెవ్వరూ పిల్లనివ్వకపోవడంతో మహారాష్ట్రకు చెందిన జయమాలతో పెళ్లి జరిపించారు. 14 ఏళ్లపాటు సజావుగా కాపురం చేసిన సీతల్ క్రమేణా వేధింపులకు దిగడంతో ఈ ఏడాది జనవరిలో జయమాల భర్తను వదిలిపెట్టి తన ఇద్దరు కుమార్తెలతో పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త, పోలీసులు తనను వే«ధిస్తున్నట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూనే పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పింక్ తన ఇద్దరు సోదరులతో కలిసి చెన్నైకి వచ్చి ఆస్తిలో వాటా కావాలని సీతల్‌ను బెదిరించి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించి చెన్నై ఎలిఫెంట్‌గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాల, ఆమె బాబాయ్, మామ, ఇద్దరు సోదరులను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం సీతల్ ఇంటికి వెళ్లి మళ్లీ ఆస్తిని పంచివ్వాలని బెదిరించారు. భరణం కింద రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో వాగ్యుద్ధం చోటుచేసుకోవడంతో దలీల్‌చంద్, పుష్పాబాయ్, సీతల్‌లపై కిరాయి గూండా లు కాల్పులు జరిపి హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. -
తమిళనాడులో ట్రిపుల్ మర్డర్స్ సంచలనం
చెన్నై: రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకున్న కాల్పులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో చోటుచేసుకుంది. షావుకారుపేటలోని వినయగ మాస్త్రీ వీధిలో అపార్ట్మెంట్లో దిలీప్ తలీల్ చంద్ అనే వ్యాపారి కుటుంబం నివాసముంటుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వ్యాపారి ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి కుంటుంబం మొత్తంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యాపారి దిలీప్ తలీల్ చంద్(74),ఆయన భార్య పుష్పా భాయ్(70), కుమారుడు శిర్షిత్ (38) ఘటనాస్థలంలోనే ప్రాణాలొదిలారు. అయితే తమకు ఎలాంటి తుపాకీ కల్పులు వినపడలేదని అపార్ట్మెంట్ నివాసితులు తెలిపారు. చదవండి: యువతి దారుణ హత్య.. పెట్రోల్ పోసి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని సీపీ మహేష్ కుమార్ అగర్వాల్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కాల్పులు జరిగిన సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా వ్యాపారి ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న దుండగుడి చిత్రాన్ని పోలీసులు కనుగొన్నారు. అలాగే రాజస్తాన్‌కు చెందిన బాబుసింగ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టారనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. అదే విధంగా విభేదాల కారణంగా శిర్షిత్ అతని బార్య, పిల్లలతో విడిపోయినట్లు, విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లోఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చదవండి: ఇంట్లో.. అనుమానాస్పదస్థితిలో 6 మృతదేహాలు -
కాబోయే భర్తతో రెస్టారెంట్‌కు.. టెకీ దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని పరిసరాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తతో సరదాగా బయటకు వెళ్లిన యువతి ఓ దొంగ చేతిలో తుపాకీ కాల్పులకు బలైన ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. గత గురువారం జరిగిన ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... చత్తీస్‌గడ్‌కు చెందిన పూజ శర్మ అనే యువతి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం నవంబర్ 3న తన కాబోయే భర్తతో కలిసి సాయంత్రం కారులో బయటకు వెళ్లింది. రెస్టారెంట్లో భోజనం చేసిన ఆనంతరం సరదాగా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. (చదవండి: నకిలీ కార్డులు; లగ్జరీ షాపింగ్‌లు.. చివరికి) ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు మోటారు సైకిల్‌పై వెంబడించి లూటీ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పూజ శర్మ తలకు బులెట్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బాధితురాలు మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. -
ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని సమీపంలోని ఫరిదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న యువతి నికితా తోమర్ (21) హత్య ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు మత మార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తౌసీఫ్ తమ బిడ్డను బలితీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గత మూడు రోజులుగా ఇంటి ఆరు బయట కూర్చోని నిరసన తెలుపుతున్నారు. లవ్ జిహాద్ పేరుతో నికితా తోమర్‌ను అతి కిరాతకంగా హతమార్చిన తౌసీఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలతో పాటు, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ‘వెంటనే ఆ దుర్మార్గుణ్ని కాల్చి చంపండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’ అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటుతున్నాయి. కాగా గత నెల 26న ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో పరీక్ష రాసి వస్తుండగా నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. ఆమెపై కాల్పులు జరిపుతున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమవుతున్నారు. (పెళ్లి కోసమే మతం మారడం సరికాదు) అయితే గతంలో కేరళ యువతి వివాహం కేసులో హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చిన లవ్ జిహాద్.. తాజాగా నికిత హత్యతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో పెళ్లి కోసం కొంతమంది యువతీ, యువకులు మతం మారడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే పెను వివాదానికి దారితీస్తోంది. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త చర్చకు దారితీస్తోంది. వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని న్యాయస్థానం సంచనల తీర్పును వెలువరించింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదంటూ 2014లో ఇచ్చిన తీర్పును ఉటంకించారు. అయితే జాతీయ స్థాయిలో లవ్ జిహాద్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు, ఆ మత విధానాలను పాటించవచ్చు. -
షాకింగ్: రోడ్డుపై దారుణ హత్య.. ఆపై
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై అతీ సమీపం నుంచి కాల్పులు జరిపిన దుండగుడు, సెల్ఫోన్లో మృతుడి ఫొటోలు తీసుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా అక్టోబరు 22న ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతడు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు. వివరాలు.. ఈ కేసులో నిందితుడైన పవన్ గహ్లోత్, సోదరుడు ప్రవీణ్ గహ్లోత్ 2019లో వికాస్ దలాల్ చేతిలో హతమయ్యాడు. (చదవండి: పొరుగింటి వ్యక్తి షాపును కూల్చేసిన యువకుడు) ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసుల చేతికి చిక్కిన దలాల్ ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. అయితే సోదరుడి మరణంతో తీవ్రంగా కలత చెందిన పవన్, దలాల్ మృతి చెందడంతో అతడి అనుచరులనైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతా కలిసే కుట్ర పన్ని తన సోదరుడు ప్రవీణ్‌ను హతమార్చారనే కోపంతో దలాల్ దగ్గర పనిచేసే ప్రదీప్ సోలంకి, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వికాస్ మెహతా కదలికలపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం, మోహన్‌గార్డెన్ ఏరియాలో మాటువేసి వికాస్ మెహతాను పట్టుకున్నాడు. అతడిని వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు జరపగా మృతి చెందాడు. -
ఫరిదాబాద్ హత్య.. ‘నా కెరీర్ నాశనం చేసింది’
చండీగఢ్: సోమవారం మధ్యాహ్నం ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో 21 ఏళ్ల నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. నికిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ నెల 24, 25 తేదీలలో నికిత, తౌసీఫ్‌లు దాదాపు 16 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కెరీర్‌ని నాశనం చేసింది.. అందుకే నికితా తోమర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తౌసీఫ్ తమ కుమార్తెని వివాహం చేసుకోవాల్సిందిగా చాలా కాలం నుంచి వేధిస్తున్నాడని తెలిపారు. ఒకసారి నికితను కిడ్నాప్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో తౌసీఫ్ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో తౌసీఫ్.. తన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో మెడిసిన్ చదవలేకపోయానని.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలిన భావించి.. నికితను హత్య చేశానని తెలిపాడు. (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో
ఫరీదాబాద్ : మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా హరియాణలో జరిగిన దారుణ ఘటన మహిళల భద్రతను సవాల్ చేస్తోంది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన వైనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నిఖిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నిఖితను కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. నిఖిత పరీక్ష రాసి బయటికి వస్తుండగా బాధితురాలి స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ ఎటాక్ చేశాడు. మొదట కారులో ఆమెను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిఖిత కిడ్నాప్ యత్నం, ఆమె ప్రతిఘటన, కారులోంచి దిగిన నిందితుడు తన రివాల్వర్‌ను బయటకు తీసి కాల్పులు జరపడం, బాధితురాలు కుప్పకూలిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. హరియాణలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై భారీ ఆగ్రహం చెలరేగింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. फरीदाबाद, छात्रा का अपहरण करने का प्रयास, असफल होने पर गोली मारकर हत्या। भाजपा शासित राज्यों में महिलाओं की स्थिति दयनीय है भले हरियाणा हो या यूपी, एमपी pic.twitter.com/ZHqmukqm8n — KARAN THAPAR DESI (@DesiStupides) October 27, 2020 -
శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ కాల్చివేత
చండీగఢ్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ (62)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని తారన్ తరణ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనపై గతంలోకూడా అనేకసార్లు ఉగ్రవాదులు ఎటాక్ చేశారని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం బల్విందర్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉందని బల్విందర్ సింగ్ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన బల్విందర్ సింగ్ కు 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్యచక్ర పురస్కారం లభించింది. అంతర్జాతీయ మీడియాను కూడా ఆయన ధైర్యసాహసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తోపాటు అనేక డాక్యుమెంటరీలు ఆయనపై రూపొందాయి. -
పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
లక్నో: అధికారులు, పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరుడు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జయప్రకాశ్ (46) అనే వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.దాంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (చదవండి: త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి) (నిందితుడు ధీరేంద్ర సింగ్(బ్లాక్ డ్రస్ వేసుకున్న వ్యక్తి)తో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్) నిందితుడు బల్లియా బీజేపీ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ధ్రువీకకరించారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాల్పుల తర్వాత అక్కడ జనం భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా జనం గుమిగూడి ఉండగా.. నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వీడియోలో స్పష్టమవుతోంది. (చదవండి: యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్!) #WATCH One person dead after bullets were fired during a meeting called for allotment of shops under govt quota, in Ballia. Devendra Nath, SP Ballia, says, "The incident took place after a clash erupted between two groups during the meeting. Probe on." (Note-abusive language) pic.twitter.com/sLwRgkr9s4 — ANI UP (@ANINewsUP) October 15, 2020 అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆర్డీఓ సహా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు హోంశా అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ కుమార్ అవస్థీ తెలిపారు. అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపించి, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. -
బెజవాడలో యువకుడి కాల్చివేత
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగర శివారు నున్నలో శనివారం అర్ధరాత్రి ఒక యువకుడిని 7.65 ఎంఎం పిస్టల్‌తో ఆగంతకులు కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే గజకంటి మహేశ్‌గా గుర్తించారు. నున్న బైపాస్ రోడ్డులోని బార్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆగంతకులు పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారమే హతమార్చినట్టు భావిస్తున్నారు. విజయవాడ క్రీస్తురాజుపురంకు చెందిన గజకంటి మహేశ్ (33) తన స్నేహితులు.. కుర్రా హరికృష్ణ, ఉయ్యూరు దినేశ్, యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం అర్ధరాత్రి బార్‌కు సమీపంలో రోడ్డుపైన మద్యం సేవిస్తూ కూర్చున్నాడు. బీరు కొనుగోలుకు టోనీ, దీపు బార్‌కు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పిస్టల్ చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మహేశ్, అతడి స్నేహితులు చెబుతుండగానే స్కూటీ వెనుక కూర్చున్న వ్యక్తి.. మహేశ్ గొంతు, ఛాతీ, మెడపై కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు తగలడంతో మహేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు స్కూటీపై, మరొకరు మహేశ్ కారులో ముస్తాబాద్ రోడ్డు వైపునకు పారిపోయారు. కొంతదూరం వెళ్లాక కారును అక్కడ వదిలేసి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న మహేశ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు కారణాలేంటో తెలుసుకునేందుకు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
బీజేపీ నేత కాల్చివేత : తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, కోలకతా : పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలో దుండగులు అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యకు నిరసనగా బీజేపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులతో సమావేశం అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు శుక్లాపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలొదిలారు. శుక్లాతోపాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహోదగ్రులైన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారి మనోజ్ వర్మ పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) ఈ దాడికి పాల్పడిందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. రాత్రి 7.30 వరకు తనతో ఉన్నారని, పోలీసుల సమక్షంలోనే శుక్లాపై కాల్పులు జరిగాయని విమర్శించారు. మరోవైపు గవర్నర్ జగదీప్ ధన్ఖర్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని వీరేంద్రను రాజ్ భవన్‌కు పిలిపించారు. మనీష్ తనకు తమ్ముడి లాంటి వాడని, బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి టీఎంసీ, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పోలీసుల పాత్రను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అధికార పార్టీ నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని మరో సీనియర్ నాయకుడు అరవింద్ మీనన్ ఆరోపించారు. టీఎంసీ కుట్రలతో బహిరంగ హత్యలకు తెగబడుతోందని ట్వీట్ చేశారు. ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. పార్టీలో అంతర్గత పోరుకు శుక్లా హత్య నిదర్శనమంటూ ఖండించారు. తప్పుడు ఆరోపణలతో టీఎంసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ విమర్శలను తిప్పికొట్టారు. కాగా 2019 లో బీజేపీలో చేరిన మనీష్ శుక్లా ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడు. శుక్లా బీజేపీలో చేరడానికి ముందు టీఎంసీతో ఉన్నారు. पश्चिम बंगाल में राजनीतिक हिंसा थमने का नाम नहीं ले रही। आज फिर भाजपा कार्यकर्ता श्री मनीष शुक्ला की #TMC के गुंडो ने गोली मारकर हत्या कर दी। ये घटना बैरकपुर के टीटागढ़ पुलिस स्टेशन के बाहर घटी, पर हमेशा की तरह पुलिस आंख पर पट्टी बांधे रही। pic.twitter.com/A8kfnZ4qCH — Kailash Vijayvargiya (@KailashOnline) October 4, 2020 -
దారుణం: పరీక్ష కోసం వచ్చిన యువతిపై..
జైపూర్ : పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి విగత జీవిగా మారింది. కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన శనివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఝున్‌ఝనూ జిల్లాకు చెందిన యువతికి ఇటీవల ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్ష ఉన్నందున ఇంటి నుంచి బయలుదేరి రాజపార్క్ ప్రాంతంలోని తన కళాశాలకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు పరీక్ష రాసి బయటకు రాగా అదే సమయంలో ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసి ఆమెపై కాల్పులు జరిపాడు. (హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు) ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ధోల్పూర్కు చెందిన విష్ణుగా గుర్తించిన పోలీసులు అతను జైపూర్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియదని, దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు. (కలకలం రేపిన పరువు హత్య) -
రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ: రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చోటు చేసుకున్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టు సమాచారం. నిందితుడు దేశ్వాల్ను అతి సమీపంనుంచి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసుల సమాచారం ప్రకారం ద్వారకలోని సెక్టార్ 12 లోని అపార్ట్మెంటును దేశ్వాల్ అతని వ్యాపార భాగస్వాములు కలిసి నిర్మించారు. ఇక్కడ నిందితుడు ప్రదీప్ ఖోకర్ కూడా ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అతను దేశ్వాల్కు 5 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆగ్రహంతో పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చి దేశ్వాల్తో వాగ్వివాదానికి దిగాడు. ఈ సంఘర్షణలోఆవేశంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో దేశ్వాల్ నోట్లో బుల్లెట్ దూసుకు పోయిందని తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశామని నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ మీనా తెలిపారు. -
చుట్టుముట్టి కాల్చి చంపారు!
-
ఘోరం: చుట్టుముట్టి కాల్చి చంపారు!
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తుపాకీ గుళ్ల వర్షం కొనసాగుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ కాల్చివేతపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు ఎగిసినా పోలీసుల దుందుడుకు చర్యలు తగ్గడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. మృతున్ని ట్రేఫోర్డ్ పెల్లెరిన్గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి లుసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెన్ క్రంప్ అనే పౌర హక్కుల న్యాయవాది దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. (చదవండి: బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!) ‘ఓ నల్ల జాతీయుడిని చట్టుముట్టిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. మారణాయుధం (కత్తి) ధరించిన సదరు వ్యక్తి తమ మాటల్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పడం అత్యంత అమానవీయం. కత్తిని కలిగి ఉంటే చంపేస్తారా?’అని ఆయన ట్విటర్లో బెన్ క్రంప్ పేర్కొన్నారు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం తరపున ఆయన కోర్టులో వాదిస్తున్నారు. (చదవండి: ట్రంప్ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు) -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్టుమెంట్ చీఫ్ పీటర్ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్డోర్ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ లాగిస్తూ.. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (ట్రంప్ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి) ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్(ఆ సమయంలో విధుల్లో లేరు)కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వందలాది మంది ఒక్కచోట చేరి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రత్యక్ష సాక్షులు ఈ విషయం గురించి చెబుతూ.. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్‌ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని, అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని పేర్కొన్నారు. మరికొంత మంది కార్ల కింద దాక్కొన్నారని, అదో భయంకర ఘటన అని గుర్తు చేసుకున్నారు. -
తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్!
సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీస్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద గ్రే హౌండ్స్ క్యాంపస్‌లో ఓ కానిస్టేబుల్ బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలిస్ కానిస్టేబుల్ చాంద్ పాషా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యక్తిగత కారణాలతోనే చాంద్ పాషా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. (కరోనాపై పాట రాసిన.. దానికే బలైన నిస్సార్!) -
బీజేపీ నేత కుమారుడి దారుణ హత్య
లక్నో: ఉత్తర ప్రదేశ్ బాగ్పట్ జిల్లా బసోలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ధాన్యాలు విసరే అంశంలో జరిగిన గొడవ ఓ మైనర్ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. వివరాలు.. నిన్న సాయంత్రం యువకుడి కుటంబంతో కొందరు వ్యక్తులు ధాన్యం విసిరే అంశంపై గొడవపడ్డారు. మంగళవారం నిందితులు మరికొందరితో కలిసి యువకుడి ఇంటి మీదకు వచ్చి కాల్పులకు తెగ బడ్డారు. ఈ దాడిలో యువకుడు మరణించాడు. అడ్డుకోవడానికి వచ్చిన జనాల మీద కూడా నిందితులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఇద్దరు నిందితులపై దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చనిపోయిన యువకుడిని జిల్లా బీజేపీ నాయకుడు పాదం కుమారుడిగా గుర్తించారు. ఈ క్రమంలో పాదం మాట్లాడుతూ.. ‘గతంలో మా మామ కొడుకును చంపేశారు.. ఇప్పుడు నా కుమారుడిని హతమార్చారు. దుండగులు ఈ ప్రాంతం వారే. మాకు న్యాయం కావాలి’ అని విలపించారు. -
రాంపూర్ జిల్లాలో శివసేన కార్యకర్త దారుణ హత్య
రాంపూర్ : శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లోని జ్వాలానగర్‌లో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే శర్మను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. శర్మ నిన్న రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. కాగా శర్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. (పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య) -
పీటీఎం నేత ఆరిఫ్ వజీర్ దారుణ హత్య
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో పష్తూన్ తహఫ్పూజ్ ఉద్యమ(పీటీఎం) నేత ఆరిఫ్ వజీర్ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చిన ఆరిఫ్పై శుక్రవారం అర్థరాత్రి ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రం దక్షిణ వజీరిస్తాన్లోని తని నివాసంలో గుర్తుతెలియని దుండగడులు కాల్పులు జరిపారు. దీంతో ఆరిఫ్‌కు తీవ్రగాయాలు కాగా, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, 2017లో ఆరిఫ్ కుటుంబ సభ్యులు కూడా హత్యకు గురయ్యారు. ఆరిఫ్‌తో గొడవపడ్డ కొందరు ఉగ్రవాదులు అతని కుంటుంబంలో ఏడుగురు వ్యక్తులను కాల్చిచంపారు. పష్తూన్ తహఫ్పూజ్ మూవ్మెంట్ 2014లో ప్రారంభమైంది. పష్తీన్ అనే ఒక యువకుడు దీనిని ప్రారంభించాడు. గిరిజన సమాజానికి జరుగుతున్న అన్యాయంపై, ముఖ్యంగా పష్తూన్ల హక్కుల కోసం పీటీఎం పనిచేస్తోంది. మొదట్లో ఇది ప్రజలను తమవైపు ఆకర్షించడంలో అంత విజయవంతం కాలేకపోయింది. కానీ మెల్లమెల్లగా దాని మద్దతుదారులు ఎంతగా పెరిగారంటే.. ఇప్పుడు వారు పాకిస్తాన్ ప్రభుత్వానికే పెను సవాలుగా నిలిచారు. -
ఢిల్లీలో మహిళా ఎస్సై దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ మహిళా పోలీసు అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని మెట్రో స్టేషను సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ.. ఇలా ఓ మహిళా ఎస్సై హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. వివరాలు... హర్యానాలోని సోనిపట్‌కు చెందిన ప్రీతి అహ్లావత్(26) 2018లో పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమెకు తూర్పు ఢిల్లీలోని పట్పార్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఎస్సైగా పోస్టు లభించింది. అప్పటి నుంచి ప్రీతి.. రోహిణి ప్రాంతంలో బస చేస్తూ విధులు నిర్వరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకున్న ప్రీతి.. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో.. రోహిణి మెట్రో స్టేషను నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని.. అయితే అతడిని ఇంతవరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.(ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ప్రీతి హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు పరిచయం ఉన్న దీపాంశు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం హర్యానాలోని తన ఇంటికి వెళ్లి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇక దీపాంశు కూడా ఢిల్లీలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చేవి: రంజిత్ భార్య
లక్నో: విశ్వహిందూ మహాసభల నాయకుడు రంజిత్ బచ్చన్ ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య కలింది మాట్లాడుతూ.. రంజిత్‌కు రాడికల్ గ్రూప్‌ల నుంచి తరచూ బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు వచ్చేవని పేర్కొన్నారు. అయితే ఆయనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తనకు ఎప్పటికీ హాని జరగదని ఆయన చాలా నమ్మకంగా ఉండేవారన్నారు. కాగా గతంలో మేము మా బిడ్డను కోల్పోయాము, ఇప్పుడు నా భర్తను కోల్పోయానంటూ ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భర్తను హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!) ఇక రంజిత్ హత్య కేసుపై లక్నో పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 50 వేలు బహుమతిని ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఆదివారం ఉదయం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లిన రంజిత్ బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. -
విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!
లక్నో : విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్గంజ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ వెళ్లిన బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. నిందితుల కోసం ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండోది. గత అక్టోబర్‌లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని దుండగులు లక్నోలోని నక ప్రాంతంలో కాల్చి చంపారు. 2015లో ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తివారీ వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో ముస్లిం సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన తివారీ డిపాజిట్ కోల్పోయారు. పలు కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
నీటి కటకట.. ఒంటెల కాల్చివేత
సిడ్నీ: కరవుతో అల్లాడుతున్న ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా తాగే పదివేల ఒంటెలను కాల్చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. శిక్షణ పొందిన షూటర్లతో హెలికాప్టర్ల నుంచి కాల్చడం ద్వారా ఒంటెల సామూహిక హనన కార్యక్రమం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. నీళ్లకోసం వెంపర్లాడుతున్న ఈ మూగజీవాలు గుంపులుగా మానవ ఆవాసాల వద్దకు వచ్చేస్తున్నాయని, ఫలితంగా అక్కడి గిరిజన తెగల ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. భారీ సంఖ్యలో ఉండే ఒంటెల మందలు నీటి కోసం వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయని, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఆహారం, నీళ్లను వాడేస్తున్నాయని దక్షిణ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియాలో కనివినీ ఎరుగని రీతిలో వేడి వాతావరణం కొనసాగుతూండటంతో కొన్ని చోట్ల నీళ్లు అడుగంటిపోయి కార్చిచ్చులు పెచ్చరిల్లిపోతున్న విషయం తెలిసిందే. కరవు కారణంగా జంతువులను రక్షించుకోవడమూ కష్టమవుతోందని నీటికోసం పోటీపడే క్రమంలో కొన్ని ఒంటెలు తొక్కిసలాటలో మరణించగా... మరికొన్ని నీళ్లులేక మరణించాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల మృతదేహాల కారణంగా తాగునీరు కలుషితమైన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. -
కాంగ్రెస్ నేత దారుణ హత్య
పట్నా : బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాకేశ్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. వైశాలి జిల్లాలోని సినిమా రోడ్డు ప్రాంతంలో ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీనాపూర్ గ్రామంలోని రాకేశ్ యాదవ్ ప్రతి రోజు తన ఇంటి నుంచి సినిమా రోడ్డులోని జిమ్‌కు వెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రాకేష్ తిరిగి వస్తుండగా జిమ్ సమీపంలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి రాకేశ్‌పై వరుసగా అయిదు రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్ర గాయాలైన యాదవ్‌ను సఫ్దర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. రాకేశ్ యాదవ్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. సంఘటన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
జాబ్ వదిలేయలేదని భార్యను కాల్చిచంపాడు..
ఇస్లామాబాద్ : ఉద్యోగం వదిలివేయలేదనే ఆగ్రహంతో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్‌ను ఆమె భర్త కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఏడు నెలల కిందటే వీరి వివాహం జరగ్గా ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఉరూజ్ ఇక్బాల్ (27) ఉర్దూ పత్రికలో పనిచేస్తోంది. సెంట్రల్ లాహోర్‌లోని కిలా గుజ్జర్ ప్రాంతంలోని తన కార్యాలయంలోకి ఆమె ప్రవేశించిన క్రమంలో జర్నలిస్టుగా పనిచేసే ఆమె భర్త దిలావర్ అలీ నేరుగా ఆమె తలపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఉరూజ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. కాగా, మరో ఉర్దూ పత్రికలో పనిచేస్తున్న ఆమె భర్త దిలావర్ అలీపై ఉరూజ్ సోదరుడు యాసిర్ ఇక్బాల్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.ఏడు నెలల కిందట తమ సోదరి అలీని ప్రేమించి పెళ్లి చేసుకుందని, అప్పటి నుంచి ఆమెను అలీ వేధింపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం మానేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని ఫిర్యాదులో ఇక్బాల్ పేర్కొన్నారు. అలీపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఈ ఘాతుకం జరిగిందని చెప్పారు. భర్త తీరుతో విసిగిపోయిన తమ సోదరి ఉర్దూ పత్రిక కార్యాలయ భవనం పక్కనే ఓ గదిలో ఉంటోందని ఇక్బాల్ తెలిపారు. కాగా హత్య జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను స్వాధీనం పరిశీలిస్తున్నామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
బిచ్చగత్తెను కాల్చేశారు...
బ్రెజిల్‌లోని రీయో డీ జెనిరో నగరంలో పట్టపగలు ఓ ఘోరం జరిగి పోయింది. ఇల్లూ వాకిలి లేక రోడ్డు మీద భిక్షమెత్తుకునే 31 ఏళ్ల జిల్దా హెన్రిక్ డాస్ సంతోష్ లియోనార్దో ‘ఆకలవుతోంది. 25 సెంట్లు ఇవ్వండి ప్లీజ్..బన్ను కొనుక్కుంటా!’ అంటూ ఓ బాటసారి వెనకాల పడింది. ఆమె వైపు చూడకుండానే ఆ బాటసారి ‘చీ పో!’ అంటూ ఓ సారి కసురుకున్నాడు. ఆమె వినిపించుకోకుండా ఆయన పక్కకు వచ్చి మళ్లీ చేయి చాపడంతో చిర్రెత్తి పోయిన అతగాడు బొడ్డు లోనుంచి రివాల్వర్ తీసి నేరుగా ఆమెను కాల్చాడు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే ఆమె ప్రాణం పోయింది. అంతకు నాలుగు గంటల ముందే ఆ ప్రాంతంలోనే నలుగురు భిక్షగాళ్లు విష ప్రయాగానికి మరణించారు. ఆ నేపథ్యంలో బిచ్చగత్తెను కాల్చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఏడుగురు పురుషులు, ఒక యువతి ఉన్న బృందం ఓ మద్యం బాటిల్‌ను రోడ్డు ఫుట్‌పాత్‌పై ఉన్న భిక్షగాళ్లకు ఇచ్చి పోయారట. అందులోని మద్యాన్ని తాగిన ఎనిమిది మంది భిక్షగాళ్లు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా నలుగురు చనిపోగా, మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. డ్రగ్ మాఫియా ఆ మద్యం బాటిల్‌ను ఇచ్చిందా? మరెవరైనా బిచ్చగాళ్ల నిర్మూలనకు ఇలా చంపుతున్నారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక బిచ్చగత్తెను హత్యచేసిన బాటసారిని సీసీ కెమేరాల ద్వారా 39 ఏళ్ల అడెర్బాల్ రామోస్ డీ కాస్ట్రోగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోడ్డు మీద భిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉందని, తాను ఆ రోడ్డు మీద వెళ్లినప్పుడల్లా వేధిస్తుంటారని, ఆ రోజు సొంతంగా ఓ హోటల్‌ను ఏర్పాటు చేయడం కోసం డబ్బును తీసుకెళుతుంటే ఆమె వెంట పడటంతో డబ్బెక్కడ దోచుకుపోతుందోనన్న భయంతో కాల్పులు జరిపానని అతడు వాదిస్తున్నారు. సీసీ టీవీ కెమేరాలోని దృశ్యాలను చూస్తే అడెర్బాల్ వాదన తప్పని తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి
కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకుంటున్న బృందంపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా అనేకమంది గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన 320 కి.మీ దూరంలో ఉన్న ఫ్రెస్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిఫొర్నియాలోని ఓ స్నేహితుల బృందం తమ బంధువులతో కలిసి గెట్ టు గెదర్ పార్టీని జరుపుకొంటున్న సమయంలో దుండగులు ఈ కాల్పులు జరిపారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఇంట్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురు ఘటనాస్థలిలోనే మరణించిగా.. మరొకరు ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇక మిగిలిన క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. దాడికి తెడబడ్డ నిందితులు తమకు పరిచయం లేని వ్యక్తులని బాధితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణహత్య!!
గురుగ్రామ్ : హరియాణాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల భారత యువ క్రీడాకారిణిని కాల్చివేతకు గురైంది. తైక్వాండో క్రీడాకారిణి అయిన సరితను మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక యువకుడు సరితను కాల్చి చంపాడని సమాచారం. అయితే ఈ హత్య వెనుక సరిత కోచ్ హస్తం దాగుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 'గతంలో సరిత కోచ్ ఆమెను వివాహం చేసుకోవాలని పలుమార్లు వెంటపడగా సరిత చాలాసార్లు తిరస్కరించింది. దీంతో పెళ్లి విషయమై వీరివురి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లికి నిరాకరించడంతోనే కోచ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు' అని సరిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురుగ్రామ్‌లోని బోరాఖుర్ద్ గ్రామంలో ఓ యువతి కాల్చివేతకు గురైనట్టు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను తైక్వాండో క్రీడాకారిణి సరితగా గుర్తించారు. ఒక యువకుడు మహిళను కాల్చి చంపి పరారైనట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సరిత హత్య వెనుక కోచ్ హస్తం ఉందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోచ్ సరితకు 2013 నుంచి తెలుసని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హత్య తర్వాత కోచ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలిపై అత్యాచారం చేసేందుకు వెళ్లి...
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను నిర్లక్ష్యం చేస్తుందనే కోపంతో ఓ యువకుడు ప్రియురాలితో పాటు ఆమె తమ్ముడిని కాల్చి చంపేశాడు. నవంబరు 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... కౌశాంబికి చెందిన షీలా(16) తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెకు పుర్వా గ్రామానికి చెందిన గంగా ప్రసాద్(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్లుగా షీలా.. ప్రసాద్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో మరో యువకుడితో ఆమె స్నేహం చేస్తున్నట్లుగా అనుమానించిన ప్రసాద్.. షీలాకు బుద్ధి చెప్పాలని భావించాడు. వారం రోజుల క్రితం ఆమె హత్యకు పథకం రచించాడు. ఈ క్రమంలో షీలా తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లారని తెలుసుకున్న ప్రసాద్ నాటు తుపాకీతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తొలుత షీలాపై అత్యాచారానికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేస్తూ అందరినీ పిలిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రసాద్ ఆమె కణతిపై కాల్చి చంపేశాడు. అదే విధంగా తన అక్క అరుపులు విని గది నుంచి బయటకు వచ్చిన షీలా తమ్ముడు రాజేంద్ర(12)ను కూడా తుపాకీతో కాల్చి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో అక్కాతమ్ముళ్లు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కాగా షీలా తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ జాడ కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసాద్ నేరాన్ని అంగీకరించాడని... తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తుందనే కారణంగానే ఆమెను హత్య చేసినట్లు తెలిపాడని పేర్కొన్నారు. -
కారు రూఫ్ మీద ఎక్కి మరీ..
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నడిరోడ్డు మీదే ఓ వ్యక్తిని కాల్చి చంపేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా విహార్ రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలు.. నరేంద్ర గెహ్లోత్(48) అనే వ్యక్తి ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి కారులో బయల్దేరాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి నరేంద్రపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అతడిని కారుతో ఢీకొట్టేందుకు నరేంద్ర ప్రయత్నించగా.. ఆగంతకుడు మరో కారు మీదకు ఎక్కి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడి నుంచి తప్పించుకునేందుకు నరేంద్ర కారు దిగి పారిపోతుండగా.. నిందితుడు గురి చూసి నరేంద్ర కాళ్లలో బుల్లెట్లు దింపాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నరేంద్ర ఆస్పత్రికి చేర్చే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా నరేంద్ర శత్రువులు ఉద్దేశపూర్వకంగానే అతడిని హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నిందితుడు హెల్మెట్ ధరించి ఉన్నాడని.. అతడి బైక్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. నరేంద్ర ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడని.. అతడిపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో భారత యువకుడి మృతి
న్యూయార్క్ : అమెరికాలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న పంజాబ్‌కు చెందిన విద్యార్థి బల్జీత్ సింగ్ అలియాస్ ప్రిన్స్ (28)ను దుండుగులు కాల్చిచంపారు. చికాగోలో బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. డిపార్ట్మెంట్ స్టోర్‌లో తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా బల్జీత్‌ను దుండగులు అడ్డగించారు. బల్జీత్ వద్ద ఎలాంటి సొమ్ము, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని బాధితుడి తాత ఫమ్మాన్ సింగ్ చెప్పారు. గాయపడిన స్థితిలో బల్జీత్ అవతార్ సింగ్‌కు ఫోన్ చేయగా, బాధితుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్ మరణించినట్టు వైద్యులు ప్రకటించారని సింగ్ తెలిపారు. ముగ్గురు నలుగురు దుండగులు బల్జీత్‌పై కాల్పులు జరిపారని చెప్పారు. -
‘నన్ను క్షమించండి..మేం చచ్చిపోతున్నాం’
చండీగఢ్ : జీవితంపై విరక్తి చెందిన ప్రేమికులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదరకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.... రాష్ట్రంలోని గుజ్రాన్ గ్రామానికి చెందిన సిక్కు యువకుడు(25), దళిత యువతి(20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతడు ఇంటర్ పాసై పొలం పనులు చూసుకుంటుండగా..యువతి ప్రస్తుతం బీఏ ఫైనలియర్ చదువుతోంది. చాలా ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం పెద్దలకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో గురువారం ఇద్దరూ కలిసి యువకుడికి చెందిన పొలానికి వెళ్లారు. అనంతరం తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. ‘ మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దయచేసి నా కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ విషయమై ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను కోరుతున్నా. నేను నా వాళ్లను చాలా కష్టపెట్టాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరందరూ అంటే నాకెంతో ఇష్టం. భయంతో చచ్చిపోతున్నా అని నా ప్రత్యర్థులు భావించవచ్చు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్నా’ అని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తుపాకీతో యువతి పొట్టలో కాల్చి, తాను రెండుసార్లు మెడపై కాల్చుకుని కుప్పకూలాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్ట్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల వద్ద వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. యువతి కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతుందని..ఈ కారణంగానే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న స్థానికుల వివరాల మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. -
కలకలం : అమెరికాలో ఆగంతకుడి కాల్పులు
మిస్సోరి : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో మరో మహిళ, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సోల్డాన్ హైస్కూల్ వద్ద ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లగా దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పొట్టలోకి తూటా దూసుకుపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని సెయింట్ లూయిస్ పోలీస్ చీఫ్ జాన్ హెడెన్ వెల్లడించారు. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఘటన జరిగిందని అన్నారు. పాఠశాలలో జరుగుతున్న ప్రీ-సీజన్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను వారంతా చూసేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారని, కాల్పుల అనంతరం హుటాహుటిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని చెప్పారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇదిలాఉండగా.. సెయింట్ లూయిస్‌లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12 మంది బాలికలు తూటాలకు బలయ్యారు. -
సాండ్విచ్ త్వరగా ఇవ్వలేదని కాల్చి చంపాడు..!
పారిస్ : ప్రాన్స్‌లోని ఓ హోటల్లో దారుణం చోటుచేసుకుంది. సాండ్విచ్ తెచ్చివ్వడంలో ఆలస్యమైందనే కారణంతో ఓ వ్యక్తి వెయిటర్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన తూర్పు పారిస్‌లోని నాయిసీలే గ్రాండ్ హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. వెయిటర్ (28) భుజంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ప్రాణాలు విడిచాడు. నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. సహోద్యోగుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సాండ్విచ్ కోసం హత్య చేశాడా..! అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్, మద్యానికి బానిసైన వ్యక్తులు తమ ప్రాంతంలో విచ్చవిడిగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. -
ప్రభుత్వ మహిళా న్యాయవాది హత్య కలకలం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో మహిళా న్యాయవాది న్యాయవాది హత్య కలకలం రేపింది. నూతన్ యాదవ్(35) అనే ప్రభుత్వ మహిళా న్యాయవాది హత్యకు గురయ్యారు. ఎటా జిల్లాలో పోలీస్ లైన్స్ ఎదురుగా ఉన్న క్వార్టర్లో ఆమె నివాసంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపారు. ఎటా పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం ఆగ్రా నివాసి అయిన నూతన్ అవివాహితురాలు, ఒంటరిగా నివసిస్తోంది. అయితే కుటుంబానికి అత్యంత సన్నిహతులైన వారే ఈ హత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. ఆమె గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను తరచూ సందర్శించేవారనీ, ఆమె నివాసంలో ఉండేవారని తెలుస్తోంది. వీరే ఈ దురాగతానికి పాల్పడి వుంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారని ఎస్పీ తెలిపారు. కాగా రెండు నెలల క్రితం( జూన్,12) యూపీ బార్ కౌన్సిల్ మొదటి మహిళా అధ్యక్షురాలు దర్వేష్ యాదవ్(38)ను తోటి న్యాయవాది ఆగ్రా కోర్టు ప్రాంగణంలో కాల్చి చంపి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళా న్యాయవాదులపై ఘోరమైన దాడులకు సంబంధించిన మరో సంఘటనలో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కుల్జీత్ కౌర్ (60) జూలై 4న నోయిడా సెక్టార్ 31 లోని ఆమె బంగ్లాలో శవమై తేలిన సంగతి తెలిసిందే. -
పోకిరీని వారించినందుకు సీఎం కమాండో హతం
చండీగఢ్ : మహిళను వేధిస్తున్న వ్యక్తిని వారించాడనే ఆగ్రహంతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సెక్యూరిటీ కమాండోను ఓ యువకుడు కాల్చిచంపిన ఘటన మొహాలీలో వెలుగుచూసింది. క్లబ్లో మహిళను అసభ్యంగా తాకుతూ వెకిలిచేష్టలకు పాల్పడిన నిందితుడు చరణ్‌జిత్ సింగ్‌ను పంజాబ్ పోలీస్ 4వ కమాండో బెటాలియన్‌కు చెందిన సుఖ్వీందర్ కుమార్ వారించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో నిందితుడు చరణ్‌జిత్ సింగ్‌తో పాటు అతని స్నేహితులను నిర్వాహకులు బయటకు పంపారు. అదే సమయంలో సుఖ్వీందర్ కూడా వెలుపలికి రావడంతో అక్కడే మాటువేసిన నిందితుడు మరోసారి బాధితుడితో ఘర్షణకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో చరణ్‌జిత్ బాధితుడిపై తన గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. బుల్లెట్ గాయాలతో సుఖ్వీందర్ మరణించారు. కాగా నిందితుడిని గుర్తించామని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మొహాలీ ఎస్ఎస్పీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు. హత్య జరిగిన పార్కింగ్ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని చెప్పారు. -
షాకింగ్ : దుండగుల కాల్పుల్లో కాంగ్రెస్ నేత మృతి
చండీగఢ్ : కాంగ్రెస్ నేత వికాస్ ఛౌదరిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఫరీదాబాద్‌లో గురువారం ఉదయం వికాస్ చౌధరి జిమ్ నుంచి తిరిగివస్తుండగా ఆయన వాహనాన్ని అడ్డగించిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెక్టార్ 9లో నిసించే వికాస్ ఛౌదరి జిమ్ నుంచి తిరిగివస్తూ కారులో ఎక్కిన కొద్దిసేపటికే వెనుక నుంచి మరో వాహనంలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన ఛౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ నేత హత్యతో హర్యానాలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడైందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరి ఎస్పీ నేతల కాల్చివేత
నోయిడా/జాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శుక్రవారం నోయిడాలోని దద్రీ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలోనే ఆయన్ను కాల్చి చంపారు. రామ్‌తేక్ కటారియా దద్రీ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నారు. ‘జర్చా రోడ్డు సమీపంలో 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆయన్ను 5 సార్లు కాల్చి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది’అని పోలీసు అధికారి వెల్లడించారు. దీనివెనుక ఎలాంటి రాజకీయ కుట్రలేదని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా జాన్‌పూర్‌లో శుక్రవారం ముసుగులు ధరించిన ఆరుగురు అగంతకులు జరిపిన కాల్పుల్లో మరో ఎస్పీ నేత లాల్జీ యాదవ్ (51) మరణించారు. ఖాన్పూర్ సమీపంలోని షాగంజ్–జాన్పూర్ రోడ్డుపై ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. -
బెంగాల్లో బీజేపీ కార్యకర్త కాల్చివేత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బట్పారాలో ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. చందన్ సాహు అనే 36 సంవత్సరాల బీజేపీ కార్యకర్త రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. జగ్ధాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలితల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని చౌసొట్టిపల్లి వాసిగా గుర్తించారు. చందన్ తన ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. చందన్‌ను బట్పారా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరుడు, బీజేపీ కార్యకర్త సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన కొద్ది గంటల్లోనే బెంగాల్లో ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ : అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ను బరూలియ గ్రామంలో శనివారం రాత్రి దుండగలు కాల్చిచంపారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా సురేంద్ర సింగ్ స్మృతి ఇరానీకి సన్నిహితులని గ్రామస్తులు చెప్పారు. కాగా స్మృతి ఇరానీ ఆదేశాల మేరకు ఆమె తరపున స్ధానికులకు సింగ్ చెప్పులు పంపిణీ చేశారని చెబుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్ సెలబ్రిటీ దారుణ హత్య
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సెలబ్రిటీ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి.. దారుణంగా కాల్చి చంపారు. వివరాలు.. మోహిత్ మోర్(24) అనే వ్యక్తి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో మోర్ ప్రతిరోజు నాజ్ఫర్‌గఢ్ ప్రాంతంలో ఉన్న జిమ్‌కు వెళ్తుంటాడు. మంగళవారం సాయంత్ర జిమ్‌కు వెళ్లిన మోర్.. పక్కనే ఉన్న స్నేహితుడి ఫోటోషాప్‌కు వెళ్లి కూర్చున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు షాప్‌లోకి ప్రవేశించి..మోర్ మీద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 13 బుల్లెట్లు మోర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. దాంతో అతను అక్కడిక్కడే మరణించాడు. దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిని గుర్తించారు. దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించారని.. మోర్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి సీసీటీవీలో క్లియర్‌గా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా నిందుతులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. అంతేకాక మోర్ ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ యాప్‌ల పోస్టింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
‘పరుగెత్తండి..దాక్కోండి..ఫైట్ చేయండి’
నార్త్ కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. చార్లెట్ క్యాంపస్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకడమిక్ ఇయర్ ముగింపు రోజే యూనివర్సిటీలో ఈ ఘటన చోటుసుకుంది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో పాటుగా.. విద్యార్థులను వెంటనే అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘పరుగెత్తండి, దాక్కోండి, ఫైట్ చేయండి. మిమ్మల్ని కాపాడుకోండి. క్యాంపస్‌లో కాల్పులు జరిగినందు వల్ల పోలీసులు అన్ని బిల్డింగ్‌లలో దుండగుడి కోసం అన్వేషిస్తున్నారు’ అంటూ క్యాంపస్ ఎమర్జెన్సీ ఆఫీస్ ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘నాతో పాటు మరో 30 మంది ఫిల్మ్ క్లాసులో ఉన్నాం. అప్పుడు ఓ విద్యార్థి పరిగెత్తుకు వచ్చి క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయని చెప్పాడు. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. వెంటనే అప్రమత్తమై మేమందరం లోపల నుంచి లాక్‌చేసుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు నా తల్లిదండ్రులకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను. దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్మల్ని గది నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు యూఎన్సీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ హ్యారీ స్మిత్ పేర్కొన్నారు. చార్లెట్లో క్యాంపస్‌లో చోటుచేసుకున్న ఈ హింస తమను తీవ్రంగా కలచివేసిందని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్ : కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పోవేలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న పందొమ్మిదేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతానికి దీనిని జాతి విద్వేష చర్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘ కాలిఫోర్నియాలోని పోవేలో గల సినాగోగ్(యూదుల ప్రార్థనా మందిరం)పై జరిగిన కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట సంస్థలు (పోలీసులు) అద్భుతంగా తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. Thoughts and prayers to all of those affected by the shooting at the Synagogue in Poway, California. God bless you all. Suspect apprehended. Law enforcement did outstanding job. Thank you! — Donald J. Trump (@realDonaldTrump) April 27, 2019 -
విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
లక్నో : బెనారస్ హిందు యూనివర్సిటీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న గౌరవ్ సింగ్(23) హాస్టల్ ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు. పొట్టలోకి బులెట్లు దూసుకుపోవడంతో తీవ్రగాయాల పాలైన గౌరవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. కాగా కాలేజీలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడనే కారణంగా గౌరవ్ సింగ్‌ను యూనివర్సిటీ యాజమాన్యం 2017లో అతడిని సస్పెండ్ చేసింది. ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా.. బస్సును దహనం చేసిన ఘటనతో గౌరవ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. కాగా మృతుని తండ్రి రాకేష్ సింగ్ యూనివర్సిటీలోనే కార్మికుడిగా పని చేస్తుండటం గమనార్హం. -
హ్యాపీ హోలీ అంటూ దారుణం
చండీగఢ్ : నిజాయితీగా పనిచేస్తున్న ఎఫ్డీ (ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్) జోనల్ లైసెన్సింగ్ అథారిటీ మహిళా అధికారిపై పగబట్టాడో ప్రబుద్ధుడు. అక్రమంగా నిర్వహిస్తున్న షాపు లైసెన్స్‌ను రద్దు చేసిందనే అక్కసుతో డాక్టర్ నేహా శౌరి(36)ను కాల్పి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదానికి దారి తీసింది. పంజాబ్ రాజధాని చండీగఢ్ సమీపంలోని ఖరార్ డ్రగ్ అండ్ కెమికల్ టెస్టింగ్ లాబోరేటరీ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మోరిండాకు చెందిన కెమిస్ట్ షాప్ ఓనర్ బల్విందర్‌సింగ్(50)గా గుర్తించారు. పోలీసు అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అందించిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం మోటార్‌బైక్‌పై వచ్చిన బల్విందర్ సింగ్ నేరుగా నేహా ఆఫీసులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపాడు. హ్యాపీ హోలీ అంటూ అరుచుకుంటూ సంఘటనా స్థలంనుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ల్యాబ్‌లోని ఉద్యోగి సురేష్ కుమార్ అతన్ని వెంబడించి, మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుండగా పట్టుకున్నాడు. దీంతో బల్విందర్ మొదట సురేష్‌పై కాల్పులకు ప్రయత్నించాడు. కానీ బైక్‌ను వెనుకకు లాగడం మూలంగా అతను పడిపోయాడు. ఇక దొరికిపోతాననే ఆందోళనలో తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరినీ ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నేహా మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు చికిత్స పొందుతూ బల్విందర్ సింగ్ కూడా చనిపోయాడు. 2009లో అక్రమంగా విక్రయిస్తున్న మాదకద్రవ్యానికి బానిసలైనవారుపయోగించే 35 రకాల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు నేహా. దీనికి సంబంధించిన సరియైన పత్రాలను చూపించకపోవడంతో ఆమె బల్విందర్ దుకాణం లైసెన్సును రద్దు చేశారు. ఈ విషయం త్వరలోనే కోర్టు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పగ తీర్చుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మార్చి 9న ఆయుధాల లైసెన్సును తీసకున్నాడు. అంతేకాదు రెండు రోజుల క్రితం రివాల్వర్‌ను కూడా కొనుగోలు చేశాడు. సంఘటనా స్థలంతో రివాల్వర్‌తోపాటు, సింగ్ వద్ద ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ సంఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సమగ్ర దర్యాప్తునకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా నేహాకు రెండేళ్ల కుమార్తె, భర్త వరుణ్ మంగా (బ్యాంకు ఉద్యోగి) ఉన్నారు. సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కాల్పుల కలకలం.. ఉగ్రదాడిగా అనుమానం!
ఆమ్స్టర్డ్యామ్ : న్యూజిలాండ్‌లో ఉన్మాద కాండను మరువక ముందే నెదర్లాండ్స్‌లో అటువంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. ఉట్రెక్ట్ నగరంలోని 24 అక్టోబెర్ప్లీన్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇక.. స్థానిక మీడియా కాల్పులకు పాల్పడిన అనుమానితుల ఫొటోలు విడుదల చేసిందని పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దుండగులు ఇంకా నగరంలోనే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని.. ఇంటి నుంచి ఎవరూ బయటికి రావొద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి మసీదులపై జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
కశ్మీర్లో మహిళా ఎస్పీవో కాల్చివేత
శ్రీనగర్: కశ్మీర్లో శనివారం ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో) ఇంట్లోకి దూరి ఆమెను కాల్చిచంపాయి. షోపియాన్ జిల్లాలోని వెహిల్ ప్రాంతానికి చెందిన ఖుష్బూ జాన్ విధులు ముగించుకుని శనివారం ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకూ అక్కడే మాటేసిన ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి అత్యంత సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఖుష్బూను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న భద్రతాబలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్‌సెర్చ్ ప్రారంభించాయి. -
ఇంటి ముందే మహిళా పోలీసు హత్య
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తన నివాసం ముందే మహిళా పోలీసు ఆఫీసర్‌ను కాల్చి చంపారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని వెహ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల... దక్షిణ శ్రీనగర్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా ఖుష్బూ జాన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కొంతమంది ఉగ్రవాదులు ఆమె ఇంటి వద్దకు వచ్చారు. అనంతరం ఖుష్బూపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించామని, కానీ అప్పటికే ఖుష్బూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. హేయమైన ఈ చర్చను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఖుష్బూ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ భద్రతా బలగాలు ఘటనాస్థలిని అదుపులోకి తీసుకుని.. హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి, పోలీసులకు సానుభూతి తెలిపారు. కాగా ఉగ్రవాదులను ఏరిపారేయడానికి కశ్మీర్ పోలీసులు నెలవారీ జీతం ఇచ్చి కొంత మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. అయితే వారికి సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆయుధాలు సరఫరా చేయకుండానే పని చేయాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడుల అనంతరం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. A lady special police officer (SPO) was shot & killed outside her home in South Kashmir earlier today. I condemn this act of terror & extend my condolences to her family & all her J&K police colleagues. — Omar Abdullah (@OmarAbdullah) March 16, 2019 -
తృణమాల్ నాయకుడి కాల్చివేత
కోల్కత్తా: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడుని దుండగులు కాల్చి చంపారు. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యేను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన టీఎంసీ నాయకుడు కార్తీక్ నస్కర్‌ను దుండగులు అతి దగ్గర నుంచి కాల్చిచంపారు. కార్తీక్ భార్య స్వప్న నస్కర్ దారియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. కార్తీక్ టాంగ్రఖలి నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత అతన్ని అడ్డగించిన కొందరు వ్యక్తులు పదుననైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత అతన్ని కాల్చివేశారు. అక్కడున్నవారు ఆస్పత్రి తరలించేలోపే కార్తీక్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం కుల్తూలికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
ఫ్లోరిడాలో దారుణం..తెలంగాణవాసి మృతి
-
అమెరికాలో కాల్పులు.. యాదాద్రి జిల్లావాసి మృతి
ఆత్మకూరు (ఎం)/హైదరాబాద్ : అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్యకు మరో తెలుగువాడు బలయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొత్త గోవర్ధన్ రెడ్డి (45)పై మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 8 గంటలకు స్టోర్‌లో ఓ నల్లజాతీయుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలలో గోవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన.. సెలవులపై మార్చిలో ఇంటికొస్తానని కుటుంబసభ్యులు, మిత్రులకు చెప్పారు. అంతలోనే గోవర్ధన్ మృతిచెందారన్న వార్త ఆయన సొంతూరు.. యాదాద్రి భువనగరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రహీంఖాన్‌పేటలో, హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో విషాదం నెలకొంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పెన్సకోలా సిటీలో నివాసం ఉంటున్న గోవర్ధన్.. ఫ్లోరిడాలోని ఓ గ్యాస్‌స్టేషన్‌లోని స్టోర్‌లో కౌంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం గోవర్ధన్‌రెడ్డి స్టోర్‌లో ఉండగా ముగ్గురు నల్లజాతీయులు (ఓ మహిళతోసహా) లోపలకు ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే గోవర్ధన్‌పై మూడురౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం.. దోపిడీకి కాల్పులకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి హత్యానేరం కిందకేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య శోభారాణి, ఇద్దరు కుమార్తెలు (శ్రియ, తులసి) ఉన్నారు. భార్య బోడుప్పల్లో నివాసముంటూ.. ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె శ్రియ ఇంజనీరింగ్, చిన్న కుమార్తె తులసి ఇంటర్ చదువుతున్నారు. ఆయన తండ్రి నర్సిరెడ్డి, తల్లి పద్మ స్వగ్రామమైన రహీంఖాన్‌పేటలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. కుమారుడు మృతిచెందిన వార్త అర్ధరాత్రి వరకు తల్లిదండ్రులకు తెలియలేదు. నర్సిరెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనకు ఈ విషయం చెప్పలేదు. ఈ దుర్వార్తను టీవీల్లో చూసిన గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. గోవర్ధన్‌కు తుపాకీ గురిపెడుతున్న దుండగుడు చిన్న అవకాశంతో.. డిగ్రీ వరకు చదువుకున్న గోవర్ధన్.. హైదరాబాద్‌లోని ఘటి కార్గో కంపెనీలో పనిచేసేవాడు. అమెరికాలో ఉంటున్న బంధువుల ద్వారా లభించిన అవకాశంతో అతనూ అక్కడికి వెళ్లాడు. అక్కడే డిపార్ట్మెంట్ స్టోర్‌లో మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ఇతనికి ముగ్గురు చెల్లెళ్లు కాగా, మూడో సోదరి భర్తను కూడా ఈయనే అమెరికా తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆయన కూడా అక్కడే ఉన్నారు. గోవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన మధ్యలో 2సార్లు స్వదేశానికి వచ్చి వెళ్లారు. 2009లో రహీంఖాన్‌పేట గ్రామాభివృద్ధికి ఓ సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితం మరోసారి వచ్చారు. హైదరాబాద్‌లోని సెటిల్ అవుదామని నిర్ణయించుకుని ఆన్లైన్లో బంగారం వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారం కలిసిరాకపోవడంతో తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. ఇటీవల భువనగిరిలో ఉండే ఓ స్నేహితుడికి ఫోన్ చేసి మార్చిలో వస్తున్నట్లు చెప్పాడు. కుటుంబసభ్యులతో గోవర్ధన్‌రెడ్డి(ఫైల్) ఫ్రెండ్స్ కాలనీలో విషాదఛాయలు ఉప్పల్‌లోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన గోవర్ధన్‌రెడ్డి భార్య, పిల్లలు ఉంటున్నారు. ఆయన భార్య శోభారాణి, ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఆయన మరణవార్తతో భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో రెండు నెలల్లో గోవర్ధన్ అగ్రిమెంట్ పూర్తవనుండగా.. త్వరలోనే భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నారు. మృతదేహన్ని ఇక్కడికి తెప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు -
కేసు విత్ డ్రా చేసుకోలేదని దారుణ హత్య
గుర్గావ్ : అత్యాచార కేసును ఉపసంహరించుకునేందుకు నిరాకరించిన మహిళను దారుణంగా కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. గుర్గావ్లో శుక్రవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. కోర్టులో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి కొన్ని గంటలముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సందీప్ కుమార్, శుక్రవారం తెల్లవారుఝామున ఆమె ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలి రమ్మని బయటికి పిలిచి, కిడ్నాప్ చేసి కారులో తీసుకు పోయాడు. అనంతరం ఆమెను తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. గుర్గావ్-ఫరిదాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే పై మృతదేహాన్ని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుభాష్ బోకన్ తెలిపారు. కాగా ఒక బార్లో డాన్సర్‌గా పనిచేస్తున్న బాధితురాలు అదే బార్లో బౌన్సర్‌గా పనిచేస్తున్న సందీప్ కుమార్‌పై మార్చి, 2017లో అత్యాచార కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సందీప్ అనంతరం బెయిల్‌పై బయటికొచ్చాడు. దీనిపై విచారణ శుక్రవారం (జనవరి18) జరగాల్సి వుంది. అయితే కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు. -
రైలులో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య
గాంధీనగర్ : గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. భుజ్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్ భానుషలీపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గతంలో జయంతీలాల్ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే డబ్బు కోసమే తన భార్య ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త పేర్కొనడంతో ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, ఈ నేపథ్యంలో జయంతీలాల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
వేడుకల్లో విషాదం : ఇద్దరు బాలురపై కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకలు శ్రుతిమించాయి. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్రమంలో ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలురిపై కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది సంవత్సరాల బాలుడు బుల్లెట్ గాయాలతో మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో తమ ఇంటి టెర్రేస్‌పై నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఎనిమిదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాణాసంచా పేలుళ్లు తమకు వినిపించాయని, అనంతరం బాలుడు స్పృహ కోల్పోయి పడిఉండటాన్ని గమనించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్ధానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని ప్రశ్నించామని విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక ఈశాన్య ఢిల్లీలోని వెల్కం ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో 12 ఏళ్ల బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
శ్రీనగర్‌లో ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో భద్రత బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీగా ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు. -
త్వరలో వస్తానన్నాడు.. అంతలోనే..
టెన్సిపీ : అమెరికాలో తెలుగు వ్యక్తి సునీల్ ఎడ్ల (61) గురువారం రాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. సునీల్ మరో రెండు వారాల్లో సొంతూరుకు రావాల్సి ఉందని ఆయన బంధువులు వెల్లడించారు. ‘క్రిస్టమస్, తల్లి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు సునీల్ ఈ నెల (నవంబర్) 27న స్వస్థలానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు తమతో గడుపేందుకు వస్తున్నానీ చెప్పాడు’ అని ఆయన బంధువులు తెలిపారు. అంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. (అమెరికాలో ఎన్ఆర్ఐ హత్య) కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సునీల్ 30 ఏళ్ల క్రితం అమెరికా వలస వచ్చాడు. అట్లాంటిక్ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో ఆయన ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు సునీల్ డ్యూటీ నిమిత్తం ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లేందుకు బయటకు రాగా.. 16 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఆయనను కాల్చి చంపారు. అంనతరం సునీల్‌కు చెందిన సబారు ఫోర్స్టర్ కారులోనే పరారయ్యారు. కాగా, అట్లాంటిక్‌సిటీ పోలీసులు నిందితులను పట్టుకుని జైలుకు తరలించారు. వారిపై హత్య, దోపిడీ నేరాలు మోపామని చెప్పారు. ఆయనకు భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. టెన్సీసీలోని వివిధ చర్చిలలో పాటలు పాడటం ద్వారా సునీల్ చాలా మందికి సుపరిచితులు. మెదర్ చర్చిలోనూ ఆయన చాలా సార్లు పాటలు పాడారని ఆయన బంధువులు తెలిపారు. -
టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య
ఫరీదాబాద్: టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్నిదం పాల్ (35) దారుణ హత్యకు గురయ్యారు. కంపెనీ గిడ్డంగిలోనే నవంబర్ 9వ తేదీ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంస్థ మాజీ ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఉద్యోగి విశ్వాష్ పాండే(32) ఆఫీసు మెయిన్ గేటునుంచి ఆఫీసులోకి ఎంటర్ అయ్యి, నేరుగా సీనియర్ మేనేజర్ పాల్ క్యాబిన్లోకి చొరబడ్డాడు. అతిసమీపం నుంచి పొట్టలో ఐదుసార్లు కాల్పులు జరిపి మరోగేటు నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాండేను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. కోలకతాకు చెందిన పాల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు ఇంకా పరారీలోఉన్నాడు. మరోవైపు నిందితుడు 2015లో టాటాస్టీల్ ప్రోసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీఎస్‌పీఎస్‌డీఎల్)లో ఉద్యోగంలో చేరాడు. అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2018, ఆగష్టులో తొలగించినట్టు టీఎస్‌పీఎస్‌డీఎల్ వెల్లడించింది. మృతుని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిందితుడు పాండే దూకుడుగా ఉండేవాడనీ, సహచరులు, ఇతర సీనియర్లతో తరచూ గొడవలు పడుతూ వుండేవాడని కంపెనీ ఇతర ఉద్యోగుల కథనం. మరోవైపు హతుడు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే సంస్థ అతడిని ఉద్యోగంనుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న పాండే ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. -
ట్విస్ట్.. హత్యకేసు; పోలీసుల నిరసన
లక్నో : ఓ కేసులో నిందితుడిగా ఉన్న తమ సహచరుడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు నిరసన బాట పట్టారు. గత వారం రాత్రి పూట విధుల నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ చౌదరి జరిపిన కాల్పుల్లో ఆపిల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్ తివారీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రశాంత్ స్పందిస్తూ.. వివేక్ తనపై కారుతో దాడికి ప్రయత్నం చేయడంతోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు బాధితుడి బంధువులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వస్తే కాల్చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటన తరువాత యూపీ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ప్రశాంత్‌ని అరెస్ట్ చేయడంతో పాటు అతన్ని సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి సిట్‌ను నియమించింది. కానీ, యూపీకి చెందిన చాలా మంది పోలీసులు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను ఖండిస్తున్నారు. అతనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అతన్ని వెంటనే విడుదల చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అతనిపై చర్యలు ఉపసంహరించకుంటే అమరణ దీక్షకు దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 5ను బ్లాక్‌డే పేర్కొంటూ పోలీసు అధికారుల సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్‌గా మారింది. చదవండి: షాకింగ్ : కారు ఆపలేదని.. కాల్చేసిన కానిస్టేబుల్ ఆపిల్ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు? -
తివారి హత్య : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
లక్నో : పోలీస్ కాల్పుల్లో మరణించిన ఆపిల్ సంస్థ ఉద్యోగి వివేక్ తివారి కుటుంబాన్ని ఆదుకోవడానికి యూపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వివేక్ భార్య కల్పన తివారికి మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకే మేం వికేక్ తివారి భార్యకు ఉద్యోగం కల్పిస్తున్నాం. ఆమె పోస్ట్ గ్రాడ్యూయేట్ చదివింది. ఆమె అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇస్తాము. ఇందుకోసం అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు, డాక్యుమెంట్స్ తీసుకున్నాం. అన్ని ఫార్మలిటీస్ పూర్తయ్యాయి. త్వరలోనే ఆమెను మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఏదో ఒక డిపార్ట్మెంట్కి కేటాయిస్తాం’ అని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వివేక్ కుటుంబాన్ని అదుకుంటుందని తెలిపారు. అంతేకకా వివేక్ మృతికి నష్ట పరిహారంగా ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సొమ్మును వివేక్ కూతుర్ల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తామన్నారు. -
ఆపిల్ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు?
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో పోలీసు కాల్పుల్లో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి వివేక్ తివారి మరణించిన సంఘటన సూచిస్తోంది. శనివారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ప్రస్తుతం రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తాను సకాలంలో స్పందించి జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశానని యోగి వాదిస్తున్నారు. మరోపక్క తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పోలీసులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వివేక్ తివారి భార్య కల్పనా తివారి ఆదివారం రెండో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, ఆయన్ని అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి తనకూ అవకాశం ఇవ్వాలని పోలీసు కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధరి భార్య రాఖీ మాలిక్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె కూడా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కారు మీదకు దూసుకరావడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధరి చెబుతున్నారు. కారు దూసుకొస్తే కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకొస్తుందన్న ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రావడం లేదు. ‘అనుమానంతోని ఎవరినైనా చంపేయడానికి ఇదేమన్న జమ్మూ కశ్మీరా?’ అని వివేక్ తివారి బావమరిది మీడియాతో వ్యాఖ్యానించారు. ‘ఎంతో విశ్వాసంతో బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. ఆ తర్వాత యోగిని ముఖ్యమంత్రిని చేస్తున్నారంటే మరెంతో సంతోషించాం. అందుకు ప్రభుత్వం నా భర్తను పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదు’ అని కల్పనా తివేరి మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటల్లో కచ్చితమైన అంతరార్థం ఉంది. ఆమె భర్త చావుకు యోగి ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణం కాకపోయినా, పరోక్షంగా కారణమైంది. యోగి ప్రభుత్వం హయాంలో దాదాపు 1400 బూటకపు ఎన్కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 60 మందికిపైగా మరణించారు. తొలి 10 నెలల్లోనే 921 ఎన్కౌంటర్లు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి పది నెలల కాలంలోనే అంటే, 2017, ఏప్రిల్ నెల నుంచి 2018, ఫిబ్రవరిలోగా రాష్ట్రంలో 921 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 33 మంది మరణించారు. వీటిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ యోగి ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసింది. ఇదే కాలంలో 365 లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అండదండలు, ఆశీర్వాదంతో రాష్ట్రంలో పోలీసులు తమ ఇష్టా రాజ్యంగా చెలరేగిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆది నుంచి గొడవ చేస్తున్నాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు స్వస్తి చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశాయి. ఆపే ప్రసక్తే లేదన్న యోగి ‘రాష్ట్రంలో 1200 ఎన్కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 40 మంది నేరస్థులు మరణించారు. నేరస్థులను సమూలంగా నిర్మూలించేంత వరకు వీటిని ఆపే ప్రసక్తే లేదు’ అని 2018, ఫిబ్రవరి 14వ తేదీన శాసన మండిలిలో, జీరో అవర్‌లో యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారు జామున కారు ఆపమంటే ఆపలేదన్న కారణంగా ప్రశాంత్ చౌధరి నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనను యోగితోపాటు పలువురు మంత్రులు ఖండించినప్పటికీ, ‘తూటాలు నేరస్థులకు మాత్రమే తగులుతాయి’ అంటూ కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో ఇంత వరకు సామాన్యులు, నిమ్న కులాల వారే మరణించడంతో వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అగ్ర కులానికి చెందిన వ్యక్తే కాకుండా ఆపిల్ ఉద్యోగి అవడం వల్ల దుమారం రేగుతోంది. -
సోదరితో సన్నిహితంగా ఉంటున్నాడని..
సాక్షి, న్యూఢిల్లీ : తన సోదరితో సన్నిహితంగా ఉంటున్నాడనే కసితో కోచింగ్ సెంటర్ నిర్వహించే వ్యక్తిని హతమార్చిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జహంగరిపురి ప్రాంతంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అంకిత్ (31) సోమవారం క్లాస్ తీసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొచ్చుకువచ్చి అతడిని కాల్చి చంపారు. ఓ మహిళతో సంబంధం నెరుపుతున్నందునే అంకిత్ హత్య జరిగిందని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు విద్యార్ధులు క్లాస్‌రూమ్‌లో ఉన్నట్టు సమాచారం. అంకిత్‌కు ఓ మహిళతో సంబంధం ఉందని దీనిపై ఇరు కుటుంబాలకూ ఎలాంటి అభ్యంతరం లేదని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం మహిళ సోదరుడికి ఇష్టం లేదని తెలిసింది. అంకిత్ హత్య వెనుక అతని ప్రియురాలి సోదరుడి హస్తం ఉందని అంకిత్ సోదరి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యోదంతంలో వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నేరం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
యోగిని కలిసిన టెకీ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు
లక్నో : పోలీస్ కానిస్టేబుల్ చేతిలో హతమైన యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను సోమవారం కలుసుకున్నారు. తమకు అన్నివిధాలా సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉందని వివేక్ తివారీ భార్య కల్పనా తివారీ అన్నారు. తాము చెప్పింది సావధానంగా విన్న ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారని, ప్రభుత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రభుత్వంపై తమ నమ్మకం రెండింతలైందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపనందుకు ఆగ్రహంతో శనివారం లక్నోలోని గోమతీపూర్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ వివేక్ తివారీపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో తివారీతో ప్రయాణిస్తున్న కొలీగ్ సనా ఖాన్ ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.కాగా, బాధితుడి కుటుంబంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. -
‘మా నాన్నను ఎందుకు చంపారో తెలియదు’
ఢిల్లీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన తండ్రిని మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడు హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సర్వేశ్వరరావు కుమారుడు నాని..దాడి గురించి తెలుసుకున్న వెంటనే విశాఖకు బయల్దేరారు. ఆదివారం అరకు లోయలో కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. -
అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు
-
మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత
సాక్షి, విశాఖపట్నం: అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం టీడీపీలో చేరారు. కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. దాడి గురించి తెలియగానే బాధపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఓ ప్రకటననువిడుదల చేశారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడిన సీఎం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలన్నారు. -
వివాహేతర సంబంధం : రాజకీయ నేత మృతి
లక్నో : సమాజ్‌వాది పార్టీకి చెందిన ఓ నాయకుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సదరు రాజకీయ నాయకున్ని అతని ఇంట్లోనే తుపాకీతో కాల్చి చంపాడు. వివరాల ప్రకారం.. సంభాల్, నాయి బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జగ్దీష్ మాలి (33) సమాజ్‌వాది పార్టీకి చెందిన నాయకుడు. అయితే మాలి భార్యకు దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం గురించి గతంలో భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మాలి ఇంట్లో లేని సమయంలో దిలీప్ అతని ఇంటికి వచ్చాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మాలి తన భార్య, దిలీప్‌తో ఉండటం చూసి అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో దిలీప్ తన దగ్గర ఉన్న తుపాకితో మాలి మీద కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాలి భార్యను, దిలిప్‌ను ఆరెస్ట్ చేశారు. -
శరత్ హంతకుడ్ని కాల్చిచంపారు
భారత విద్యార్థి శరత్ హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. ఆదివారం కాన్సస్ సిటీ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సస్ నగర పోలీసులు ట్విటర్లో విషయాన్ని ధృవీకరించారు. మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్ కొప్పు(తెలంగాణ.. వరంగల్ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. అప్పటి నుంచి పోలీసుల వేట కొనసాగుతోంది. చివరకు కాన్సస్ సిటీ శివార్లలో నిందితుడు ఉన్నాడన్న సమాచారం అందుకుని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, లొంగిపోవాలని పోలీసులు కోరటంతో.. ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. (అలా చేయకపోయి ఉంటే బతికేవాడేమో!) నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడు అని కాన్సస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలియజేశారు. శరత్ హత్య కేసు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి