అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య | Newly Married NRI Gavin Dasaur Shot Dead In USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

Published Sun, Jul 21 2024 3:07 PM | Last Updated on Sun, Jul 21 2024 3:48 PM

Newly Married NRI Gavin Dasaur Shot Dead In USA

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు భారతీయులపై కాల్పులు జరపడంతో వారు మరణించిన ఘటనలు కూడా చూశాం. తాజాగా అకారణంగా భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వ్యక్తి గావిన్‌ దసౌర్‌(29) కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గావిన్‌.. మెక్సికోకు చెందిన వివియానా జమౌరాతో ఇటీవలే వివాహం జరిగింది. ఈ సందర్భంగా భార్యతో సరదాగా బయటకు వెళుతుండగా.. కారు ప్రమాదం జరిగింది. వెంటనే దసౌర్‌ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు. వెనక వాహనంలో ఉన్న డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్‌పై కాల్పులు జరిపాడు. మెడకు బుల్లెట్‌ తగలడంతో దసౌర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

 


అనంతరం దసౌర్‌ను అతడి భార్య ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఇక, దసౌర్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement