![UK man racially abuses Indian-origin woman on train](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/indian-wom.jpg1234.jpg.webp?itok=s_3slWx7)
మద్యం మత్తులో బ్రిటిషర్ జాత్యహంకార వ్యాఖ్యలు
‘మేం భారత్‌ను జయించాం.. తిరిగి ఇచ్చేశాం’అంటూ ఎద్దేవా
లండన్‌లో భారత మహిళకు అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి మాంచెస్టర్ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల గాబ్రియెల్ ఫోర్సిత్ రైలులో ఇంటికి వెళ్తూ తోటి ప్రయాణికుడితో పలు అంశాలపై చర్చిస్తున్నా రు.
వలసదారులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలో పని చేశానని ఫోర్సిత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో అదే బోగీలో మద్యం సేవిస్తున్న ఓ బ్రిటిషర్ ఆమె మాటలకు అడ్డుతగి లారు. తోటి రైలు ప్రయాణికులను ‘వలసదారులు’గా అభివర్ణిస్తూ నీచమైన దూషణలకు దిగాడు. ఫోర్సిత్‌ను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ చారిత్రక విజయాల గురించి గొప్పగా చెప్పాడు. ‘‘నువ్వు ఇంగ్లాండులో ఉన్నావు. కానీ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు.
ఆంగ్లేయులు ప్రపంచాన్ని జయించారు. భారత్‌ను కూడా జయించాం. కానీ మాకు వద్దంటూ తిరిగి ఇచ్చేశాం. ఇలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. మీది సార్వభౌ మాధికారమా’’అంటూ అభ్యంతరకర వ్యాఖ్య లు చేశారు. వీడియో చివర్లో ఆ వ్యక్తి ఫోర్సిత్‌తో ‘‘నేను నిన్ను కొట్టబోవడం లేదు’’అని అన్నా డు. అంతేకాదు.. ఆ ఘటనను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అతని జాత్యహంకార దూషణను ఫోర్సిత్ కూడా చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
‘‘అతని నోటి నుంచి వచ్చిన వలస అనే పదం, బాడీ లాంగ్వేజ్, కోపం, దూకుడు చూస్తే చాలా బాధేసింది. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నేను శ్వేతజాతీయేతరురాలిని. ఇదే నా గుర్తింపు. అందుకు నేను గరి్వస్తున్నా. జాత్యహంకార వీడియోను పోస్ట్‌చేసినందుకు శ్వేతజాతీయులు ఎందరో నన్ను ఆన్‌లైన్‌లో ట్రోల్ చేశారు. వేధింపులు ఎదుర్కొన్నా. నాకు తెలియని బూతులు తిట్టారు. బ్రిటన్‌లో శ్వేతజాతీయేతర వ్యక్తుల హక్కులపైనే నా ఆందోళన అంతా’’అని ఫోర్సిత్ తెలిపారు.
ఈ ఘటనపై బ్రిటన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘వలస వచ్చిన భారతీయుడి కూతురిగా బతకడం, నా దేశ మూలాలంటే నాకెంతో ఇష్టం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా కోసం, శ్వేతజాతీయేతర ప్రజల పక్షాన నిలబడి పోరాడతా. నాకు శ్వేతజాతీయేతర వర్గాల నుంచి ఇప్పుడు పూర్తి మద్దతు లభిస్తోంది’’అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట అవంతి వెస్ట్ కోస్ట్ రైలులో ఓ శ్వేతజాతి మహిళ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపొండి’అని ఒక భారతీయ దంత వైద్యుడిని దూషించడం చర్చనీయంశమైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment