insult
-
అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం జరిగింది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హోంమంత్రి అనిత తమను పట్టించుకోవడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు మండిపడ్డారు. హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వెళ్లిన ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి వెళ్లగా.. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.కారు కూడా దిగకుండా.. మంత్రిగారూ.. ఇదేం తీరు!కర్నూలు: మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ కనీసం ప్రజల సమస్యలను వినడానికి కూడా ఇష్టపడటం లేదు.పింఛన్ రావడం లేదని సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధురాలి మంత్రి పట్టించుకోలేదు. నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలు మంత్రి దగ్గరకు వెళ్లగా.. టీజీ భరత్ కారు కూడా దిగలేదు. తనకు పింఛన్ రావడం లేదని.. ఇప్పించాలంటూ మంత్రిని వృద్ధురాలు కోరింది. కొత్త పింఛన్లు వస్తే ఇస్తామంటూ మాట దాటేశారు. సమస్యలను వినాల్సిన మంత్రి.. కారు కూడా దిగకుండానే ప్రజలు సమస్యలను ఏసీ కారులో కూర్చోని విన్నారు. మంత్రి తీరుపై స్థానికులు మండిపడ్డారు. -
కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ అసహనం
-
యూకేలో భారత సంతతి మహిళకు అవమానం
లండన్‌లో భారత మహిళకు (Indian Woman) అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్ (London) నుంచి మాంచెస్టర్ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల గాబ్రియెల్ ఫోర్సిత్ రైలులో ఇంటికి వెళ్తూ తోటి ప్రయాణికుడితో పలు అంశాలపై చర్చిస్తున్నారు. వలసదారులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలో పని చేశానని ఫోర్సిత్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో అదే బోగీలో మద్యం సేవిస్తున్న ఓ బ్రిటిషర్ ఆమె మాటలకు అడ్డుతగి లారు. తోటి రైలు ప్రయాణికులను ‘వలసదారులు’గా అభివర్ణిస్తూ నీచమైన దూషణలకు దిగాడు. ఫోర్సిత్ను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ (England) చారిత్రక విజయాల గురించి గొప్పగా చెప్పాడు. ‘‘నువ్వు ఇంగ్లాండులో ఉన్నావు. కానీ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఆంగ్లేయులు ప్రపంచాన్ని జయించారు. భారత్‌ను కూడా జయించాం. కానీ మాకు వద్దంటూ తిరిగి ఇచ్చేశాం. ఇలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. మీది సార్వభౌ మాధికారమా’’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్య లు చేశారు. వీడియో చివర్లో ఆ వ్యక్తి ఫోర్సిత్తో ‘‘నేను నిన్ను కొట్టబోవడం లేదు’’ అని అన్నాడు. అంతేకాదు.. ఆ ఘటనను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. అతని జాత్యహంకార దూషణను ఫోర్సిత్ కూడా చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘అతని నోటి నుంచి వచ్చిన వలస అనే పదం, బాడీ లాంగ్వేజ్, కోపం, దూకుడు చూస్తే చాలా బాధేసింది. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నేను శ్వేతజాతీయేతరురాలిని. ఇదే నా గుర్తింపు. అందుకు నేను గర్విస్తున్నా. జాత్యహంకార వీడియోను పోస్ట్చేసినందుకు శ్వేతజాతీయులు ఎందరో నన్ను ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వేధింపులు ఎదుర్కొన్నా. నాకు తెలియని బూతులు తిట్టారు. బ్రిటన్‌లో శ్వేతజాతీయేతర వ్యక్తుల హక్కులపైనే నా ఆందోళన అంతా’’అని ఫోర్సిత్ తెలిపారు.చదవండి: ఫ్రాన్స్ పిలుస్తోంది.. భారత విద్యార్థులకు శుభవార్తఈ ఘటనపై బ్రిటన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘వలస వచ్చిన భారతీయుడి కూతురిగా బతకడం, నా దేశ మూలాలంటే నాకెంతో ఇష్టం. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా కోసం, శ్వేతజాతీయేతర ప్రజల పక్షాన నిలబడి పోరాడతా. నాకు శ్వేతజాతీయేతర వర్గాల నుంచి ఇప్పుడు పూర్తి మద్దతు లభిస్తోంది’’అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట అవంతి వెస్ట్ కోస్ట్ రైలులో ఓ శ్వేతజాతి మహిళ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపొండి’ అని ఒక భారతీయ దంత వైద్యుడిని దూషించడం చర్చనీయంశమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఉందా!?
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు. -
పబ్లిక్‌గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్‌గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ. -
సీఎంవోలో సీనియర్ ఐఏఎస్‌కు అవమానమా?
అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్ అధికారి. డిప్యూటేషన్ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అవమానం
-
కూటమి ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు
-
Big Question: పసుపు రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నరకయాతన
-
మహాసేన రాజేష్ కు ఘోర అవమానం
-
మీ సలహాలు నాకు వద్దు..సభలో కార్యకర్తలను అవమానించిన పవన్ కళ్యాణ్
-
మోదీ మీటింగ్ లో పవన్ పరువు పోయె
-
బాలయ్యను పీకి పక్కన పెట్టిన చంద్రబాబు..
-
ఇగో హర్ట్ అయితే.. అట్లుంటది మరి!
ఎక్కడైనా ధర దగ్గర భేరమాడటం సహజమే.. అయితే.. కొన్నిసార్లు అడిగిన ప్రతి ఒక్కరికీ ధరను చెప్పలేక వ్యాపారి విసిగిపోవడమూ అప్పుడప్పుడు చూస్తుంటాం. అయితే.. ఇదే వ్యవహారంపై చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. కొనలేకపోతే వెళ్లిపోండని కసురుకున్న వ్యాపారికి తిక్క కుదిర్చాడో వ్యక్తి. రూ. 9 వేలు పెట్టి ఖరీదు చేసి వ్యాపారి అమ్ముతున్న న్యూడుల్స్‌ని కిందపడేసి ధ్వంసం చేశాడు. వీడియోలో చూపిన విధంగా కొనుగోలుదారుడు వ్యాపారి వద్దకు వెళ్లాడు. న్యూడుల్స్ ధర ఎంత అని అడుగుతాడు. ఒక కప్ న్యూడుల్స్కు రూ.164 అని అతడు చెబుతాడు. ఎందుకు అంత ధర చెబుతున్నారని కస్టమర్ ప్రశ్నిస్తాడు. న్యూడుల్స్ లో వాడుతున్న ముడి సరకులు ఎంటో చెప్పాలని అడుగుతాడు. దానికి వ్యాపారి రెండు గుడ్లుతో సహా వాడే ముడి పదార్థాలను వివరిస్తాడు. విన్న తర్వాత దానికే మరీ ఇంత రేటా? అని కస్టమర్ అనగానే పక్కనే ఉన్న వ్యాపారి కొడుకు లేచి ఆర్థిక స్తోమత లేకపోతే వెళ్లిపోవాలని కసురుకుంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ వ్యాపారిపై విచిత్రంగా ప్రవర్తించాడు. వ్యాపారి వద్ద ఉన్న అన్ని న్యూడుల్స్ కు రూ.9,920 వెచ్చించి కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత అన్నింటిని పనికిరానివాటిగా పరిగణిస్తూ కిందపడేస్తాడు. కాలితో తొక్కుతూ నన్నే అవమానిస్తావా? అని అంటాడు. వ్యాపారి కుమారుడు క్షమాపణలు కోరుకున్నా ఫలితం లేకపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇగో హర్ట్ అయితే ఇలాగే ఉంటది? అంటూ కామెంట్లు పెట్టారు. వ్యాపారి తిట్టినందుకు బహుమతిగా రూ.9 వేలు ఇచ్చావా? సరిపోయిందా? అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. ఇదీ చదవండి: డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. సెక్యూరిటీ గార్డ్‌పై మరీ ఇంత దారుణమా..? వీడియో వైరల్.. -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నందమూరి కుటుంబానికి అవమానం
-
మువ్వన్నెల జెండాతో చికెన్ శుభ్రం.. అరెస్ట్
Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్‌ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. దాద్రా-నగర్ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్‌లో చికెన్‌ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మొహమ్మద్ సైఫ్ నదీమ్ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ శాఖ అతని దుకాణానికి సీజ్ వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్‌గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. Mohammad Saif Nadim Qureshi was seen cleaning chopped chicken using the national flag in Silvassa. And then they say " Don't question our Patriotism " ! pic.twitter.com/KtPjuYvrSl — Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) April 22, 2023 -
Crime News: జీతం అడిగినందుకు ఘోరంగా..
క్రైమ్: పని పేరుతో ఊడిగం చేయించుకున్నారు. నెలల జీతాన్ని పెండింగ్‌లో పెట్టారు. విసిగిపోయిన ఈ టీనేజర్.. బయట వేరే పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. ఇంతలో మళ్లీ వచ్చిన ఆ పాత ఓనర్లు.. మళ్లీ పని ఇస్తామని నమ్మబలికారు. నమ్మి వెళ్తే మళ్లీ అదే మోసం ఎదురైంది. తన జీతం తనకు ఇప్పించాలని ఎదురు దిరగడంతో.. దారుణంగా అవమానించారు. ఆ అవమానం భరించలేక ఆ టీనేజర్ ప్రాణం తీసుకున్నాడు. ముంబై దాదార్లో ఘోరం చోటుచేసుకుంది. ఆరు నెలల పెండింగ్ జీతం కోసం ఓనర్లను ఓ యువకుడు నిలదీయడంతో వాళ్లు ఆగ్రహానికి గురయ్యారు. చితకబాది గుండు కొట్టించి.. నగ్నంగా వీధుల వెంట ఊరేగించారు. ఆ అవమానం భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి తండ్రి రామ్రాజ్ జైస్వార్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. వారణాసి నుంచి వలస వచ్చిన పంకజ్(18) కుటుంబం కామ్‌గర్ నగర్లో నివాసం ఉంటోంది. పంకజ్ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. పంకజ్ తండ్రి రామ్రాజ్ ఓ ట్రావెల్స్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పదో తరగతి దాకా చదివి స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనికి చేరాడు పంకజ్. అయితే ఆరు నెలలుగా ఆ దుకాణం యజమాని డబ్బులు చెల్లించలేదు. దీంతో పని మానేసి.. చిన్నాచితకా పనులు చేసుకుంటూ వెళ్లాడు పంకజ్. ఈ క్రమంలో.. మార్చి నెలలో పాత ఓనర్ సోదరుడు ఒకడు పాన్ షాప్ నడిపించేందుకు పంకజ్ సాయం కోరాడు. పాన్ షాప్‌లో పనికి అంగీకరించిన పంకజ్.. పాత జీతం కూడా ఇప్పించాలని డిమాండ్ చేయడంతో సరే అన్నాడు ఆ వ్యక్తి. అయితే పనిలో కుదిరి నెల దాటినా డబ్బులు చేతిలో పడకపోవడంతో పంకజ్ వాగ్వాదానికి దిగాడు. దీంతో.. ఆ ఓనర్లు ఆగ్రహానికి గురైయ్యారు. యువకుడికి గుండు చేయించి.. ముఖానికి మసి పూసి బట్టలు విప్పదీసి స్థానికంగా ఊరేగించారు. భయంతో ఓ టాయ్లెట్లోకి వెళ్లి దాక్కున్నాడు పంకజ్. ఆపై.. స్థానికుల సాయంతో ఓ టవల్‌తో ఇంటికి చేరిన పంకజ్.. నేరుగా ఇంటికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ తలుపులు తీయకపోయే సరికి స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు తలుపులు బద్ధలు కొట్టి చూసే సరికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పంకజ్. పని మీద పుణేకు వెళ్లిన ఆ తండ్రి.. తిరిగి వచ్చి చూసేసరికి కొడుకు విగతజీవిగా మారడాన్ని తట్టుకోలేకపోయాడు. ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మాత్రం అదొక యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్నారు. అయితే.. స్థానిక మీడియా జోక్యంతో స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సమాధానం చెప్పడం గమనార్హం. -
Viral:మల్టీప్లెక్స్‌లోకి గిరిజన కుటుంబం అడ్డగింత
Tribal Video: చెన్నైలోని ఓ పాపులర్ మల్టీప్లెక్స్ కమ్ షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా చూసేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాళ్లను స్క్రీన్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మల్టిప్లెక్స్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చుకుంది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్‌లో శింబు నటించిన ‘పాతు తల’ చిత్రం నడుస్తోంది. ఇంతలో ఓ కుటుంబం టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లేందుకు యత్నించింది. అయితే.. వాళ్ల అవతారం, వేషధారణ చూసి థియేటర్ సిబ్బంది వాళ్లను లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఉన్నా అనుమతించకపోవడంపై ఆ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గిరిజనులపై వివక్ష ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యి హక్కుల సాధన ఉద్యమకారుల నుంచి విమర్శలకు తావిచ్చింది. ఇంకోపక్క నారికురవర్(ఆ కుటుంబం ఈ వర్గానికి చెందిందే) తెగ పెద్దలు సైతం ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించేందుకు యత్నించారు. అయితే.. காசு கொடுத்து டிக்கெட் வாங்கினப்புறம் என்னடா இது @RohiniSilverScr pic.twitter.com/bWcxyn8Yg5 — Sonia Arunkumar (@rajakumaari) March 30, 2023 ఈలోపే సదరు మల్లిప్లెక్స్ నిర్వాహకులు ఘటనపై వివరణ ఇచ్చారు. పాతు తల చిత్రానికి సెన్సార్ బోర్డు యూ బై ఏ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి, 12 ఏళ్లలోపు వాళ్లు సినిమా చూసేందుకు అనుమతి లేదు. ఆ లెక్కన ఆ కుటుంబంలో రెండు, ఆరు, ఎనిమిది, పదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అందుకే లోపలికి అనుమతించలేదు. అంతేతప్ప.. అక్కడ ఎవరినీ అవమానించలేదు. ఈలోపు కొందరు గుమిగూడి గూడడంతో.. పరిస్థితి చెయ్యి దాటకూడదన్న ఉద్దేశంతో వాళ్లను సినిమా చూసేందుకు అనుమతించాం అంటూ ఆ కుటుంబం వీడియో చూస్తున్న వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. pic.twitter.com/dvfewZsxuN — Rohini SilverScreens (@RohiniSilverScr) March 30, 2023 ఇదిలా ఉంటే.. ఓ గిరిజన మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 341 కింద ఇద్దరు థియేటర్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయగం గమనార్హం. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ఈ వీడియోపై స్పందించారు. ఈ వ్యవహారంలో థియేటర్ సిబ్బంది తీరుపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేయగా.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, వ్యవహారం అప్పుడే సర్దుమణిగిందని, వాళ్లను సినిమా చూసేందుకు మేనేజ్మెంట్ అనుమతించిందంటూ రీట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రియల్ కాంతార.. భూత కోల చేస్తూ కుప్పకూలాడు పాపం -
‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగేలా వ్యవహరిస్తే.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయన భారీ విగ్రహ ఏర్పాటుతో గౌరవిస్తోందని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేయబోతున్న భారీ విగ్రహ పనులను ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతారని మేం ఊహించలేదు. ఇంత ఖరీదైన స్థలంలో విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలోనే ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విగ్రహ తయారీ హర్యానాలో జరుగుతోంది. విగ్రహ ఏర్పాటు కోసం నిర్మాణ వ్యయం పెరిగినా.. ముందుకే వెళ్తున్నాం. సీఎం జగన్ నిర్ణయం నభూతో.. నభవిష్యత్. ఇచ్చిన మాటమీద నిలబడే నాయకుడు సీఎం జగన్. 2023 ఏప్రిల్ 14 నాటికి విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం అని ఉద్ఘాటించారు మంత్రి నాగార్జున. గత ప్రభుత్వం అంబేద్కర్ ను అగౌరవ పరిచేలా వ్యవహరించింది. అంబేద్కర్ ఆలోచనలను అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. దళిత జాతిని అవమాన పరిచిన చరిత్ర చంద్రబాబుది. అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు గురించి మాట్లాడటం కూడా అవమానమే అంటూ పేర్కొన్నారు. టీడీపీపై ఫైర్ టీడీపీ నేతలకు ఉత్తరాంధ్ర ఇప్పుడు గుర్తుకొచ్చిందా?. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు రాలేదా?. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఎందుకు గుర్తుకు రాలేదు?. మూడు రాజధానుల పై జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాకే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చిందా?. చంద్రబాబు, టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయ్. రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు యాత్ర చేయిస్తున్నాడు. అమరావతి ప్రాంతంలో రైతుల కోసం కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు అని మంత్రి మేరుగ విమర్శించారు. -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
భారత్‌కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం!
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి పట్ల క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. 52 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందిన వార్న్‌పై క్రికెట్‌కు అతీతంగా అన్ని వైపుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అలాంటి వార్న్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల నుంచి వార్న్‌తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. భారత్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న వార్న్‌కు ఒక సందర్భంలో మాత్రం సొంత దేశంలో ఘోర అవమానం జరిగింది. ఇది 2012 నాటి మాట. ఆ దేశానికి చెందిన జూ వీక్లీ అనే మ్యాగజైన్.. వార్న్‌ను ఘోరంగా అవమానించింది. షేన్ వార్న్.. బ్రిటీష్ మోడల్.. నటి లిజ్ హర్లేతో జరిపిన ప్రేమాయణమే ముఖ్య అంశంగా తీసుకొని ఆ ఏడాదికి గాను ''అన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా'' పరిగణించింది. లిజ్ హార్లేతో రిలేషన్ సమయంలో వార్న్ ఒక ప్లేబాయ్‌గా మారిపోయాడని.. విచ్చలవిడిగా తినడం.. తాగడం.. తిరగడం చేసేవాడని తెలిపింది. 42 ఏళ్ల వయసులో నవ మన్మథుడిగా ముద్రించుకోవడం అతనికే చెల్లిందంటూ మ్యాగజైన్ అవమానపరుస్తూ రాసుకొచ్చింది. క్రికెట్లో ఎంత పేరు సంపాదించాడో.. ఆటకు వెలుపల అన్నే వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఆటలో ఏనాడు ఒక మచ్చ కూడా లేని ఈ దిగ్గజం బయట మాత్రం వివాదాలకు కేంద్ర బింధువుగా మారాడు. 2006లో భార్య సిమోన్‌తో విడాకుల అనంతరం వార్న్ నడిపిన రాసలీలలకు అంతే లేదు. చాలా మంది అమ్మాయిలకు పర్సనల్‌గా అసభ్యకర సందేశాలు పంపుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు. చదవండి: Shane Warne Demise:'ఇప్పటికీ షాక్‌లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు' Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Respond On Farmer Issue: కర్ణాటక తుమకూరు మహీంద్రా షోరూంలో జరిగిన ఘటన సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బొలెరో కొనడానికి వెళ్లిన ఓ రైతు, అతని స్నేహితుల్ని.. వేషధారణ చూసి సేల్స్‌మ్యాన్ ఘోరంగా అవమానించాడు. ప్రతీకారంగా గంటలో పది లక్షలతో అక్కడ వాలిపోయిన రైతు.. షోరూం నిర్వాహకుల గర్వం అణచిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో చాలాసేపు వాగ్వాదం తర్వాత ఆఖరికి రైతు కెంపగౌడకి, అతని స్నేహితులకు క్షమాపణలు తెలియజేశాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన షోరూంలో జరిగిన ఘటనపై స్పందించలేదేం అనే అనుమానం చాలామందికి తలెత్తింది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూడా స్పందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం ప్రాముఖ్యత గురించి ఒక ట్వీట్ చేశారు. @MahindraRise యొక్క ప్రధాన ఉద్దేశ్యం కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడం. ఒక కీలకమైన ప్రధాన విలువ.. ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. ఈ తత్వశాస్త్రం నుండి ఏదైనా ఉల్లంఘన జరిగితే చాలా అత్యవసరంగా పరిష్కరించబడుతుంది అంటూ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు ఆయన. The Core Purpose of @MahindraRise is to enable our communities & all stakeholders to Rise.And a key Core Value is to uphold the Dignity of the Individual. Any aberration from this philosophy will be addressed with great urgency. https://t.co/m3jeCNlV3w — anand mahindra (@anandmahindra) January 25, 2022 అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా.. దానికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో విజయ్ నక్రా స్పందించారు. కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్లు అంతర్భాగం. మా కస్టమర్లందరినీ మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. మేము సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. తగిన చర్య తీసుకుంటాం అని విజయ్ నక్రా రీట్వీట్ చేయగా.. ఆ రీట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహీంద్రా. Dealers are an integral part of delivering a customer centric experience & we ensure the respect & dignity of all our customers. We are investigating the incident & will take appropriate action, in the case of any transgression, including counselling & training of frontline staff https://t.co/9jLUptoevy — Veejay Nakra (@vijaynakra) January 25, 2022 A farmer was insulted for his looks by @MahindraRise showroom and he returned with full cash to buy the truck. @anandmahindra sir, please look into it. If true, I know this is not something that you would ever encourage! https://t.co/C9hXDXtIGM — GiriSonnaSeri Tech (@GiriSonnaSeri) January 24, 2022 Mahindra Car showroom salesman taunted a farmer aftr seeing his attire when he visited showroom to buy Bolero Pik-up. Farmer Kempegowda alleged field officer of showroom made fun of farmer & his attire, told him tat car is not worth 10 rupees for him to buy. @anandmahindra pic.twitter.com/9fXbc5naY7 — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) January 23, 2022 సంబంధిత వార్త: ఘోర అవమానం.. రైతు అల్టిమేట్ రివెంజ్ -
దళిత ఎమ్మెల్యేను అవమానిస్తారా
-
అది రైతులకు అవమానం
బహ్రైచ్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంకా గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ అమలు చేస్తున్న పీఎం–కిసాన్ పథకంపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఈ పథకంతో బీజేపీ రైతులను అవమానిస్తోందన్నారు. ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నప్పటికీ ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్నది రోజుకు రూ.3.50 మాత్రమే, ఇది ముమ్మాటికి రైతులను అవమానించడమే అని ఆమె అన్నారు. బీజేపీ ఎప్పుడూ జాతీయవాదం గురించి ప్రస్తావిస్తుందనీ, నిజానికి రైతులు, ప్రజల సమస్యలు వినడం, వాటికి పరిష్కారం చూపడమే నిజమైన జాతీయవాదం అని తాను భావిస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహ్రైచ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సావిత్రిభాయ్ పూలే తరఫున ప్రియాంక ప్రచారం చేశారు. జాతీయవాదం గురించి ప్రధాని పదేపదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారని, ప్రజలు కష్టాలు పరిష్కరించడమే నిజమైన జాతీయవాదంగా తాను భావిస్తానని, స్వోత్కర్షపైనే ఎప్పుడూ మోదీ దృష్టిసారిస్తారనిఅన్నారు. -
దలితులను కించపరిచిన టీడీపీ నేత దెవినేని
-
మోదీని కావాలని అవమానించలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ భావోద్వేగంగా మాట్లాడిన సందర్భంలో దొర్లిన తప్పిదమే తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం లేదని ఎంపీ కె.కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సన్ ఫౌండేషన్ చైర్పర్సన్ కావేరి శుక్రవారం ఇక్కడ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో కవిత మాట్లాడుతూ ప్రధానిని అవమానిస్తే దేశంలోని ప్రజలంతా ఎవరికివారే అవమానించుకున్నట్టు అని అన్నారు. చిన్న పొరపాటుపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దేశంలో 130 కోట్ల మంది ఉంటే 600 మంది ఓట్లేసి తనను గెలిపించినట్టుగా దావోస్ పర్యటనలో మోదీ తప్పుగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే సీఎం కొంచెం కటువుగా మాట్లాడారని చెప్పారు. రైతు బడ్జెట్ అని చెప్పిన కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతునిస్తూనే ఉన్నామని, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని అన్నారు. వ్యాపార రంగానికి సంబంధించి 30 బిల్లులు పెట్టిన కేంద్రం రైతుల కోసం ఒక్క బిల్లు కూడా పెట్టలేదని విమర్శించారు. రైతుల హక్కులు, నిధుల కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామన్నారు. -
అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ సిటీ: కట్టుకున్న భార్యకు అన్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవమానభారంతో తాను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందని భయపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కుషాయిగూడ, గణేష్‌నగర్ కాలనీలో వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగించే రాజేష్(30)కు రాజమణితో వివాహం జరిగింది. అయినా రాజేష్ ఓమహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య రాజమణి, భర్తను నిలదీసింది. బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త తీరుపై ఫిర్యాదు చేసింది. దీంతో పరువు పోతుందని భావించిన రాజేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్లగా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తహసీల్దార్‌కు అవమానం
కంబదూరు : మండలంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో తహసీల్దార్ రఫీక్అహ్మద్కు అవమానం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నవనిర్మాణ దీక్ష టీడీపీ సొంత కార్యక్రమంలా మారింది. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపైకి తహసీల్దార్ రఫీక్అహ్మద్ను పిలువకుండా ఎమ్మెల్యే ఉన్నం, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, ఎంపీపీ దండా గోవింద్చౌదరి, టీడీపీ మండల కన్వీనర్, పార్టీ జిల్లా కార్యదర్శి, ఎస్సీ సెల్ అ«ధ్యక్షుడు, మిగిలిన టీడీపీ నాయకులు ఆశీనులైయ్యారు. దీంతో ఎమ్మెల్యే సాక్షిగా మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్‌ను కార్యక్రమం ముగిసేంత వరకు వేదిక కిందే కూర్చోబెట్టి అవమాన పరిచారు. తహసీల్దార్కే గౌరవం లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని మండలవాసులు విస్తుపోయారు. -
మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు
ఆగ్రా: బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ మరోసారి బీఎస్పీ అధినేత్రిని తీవ్రంగా విమర్శించారు. మాయావతి ఓ కుక్కలాంటిదని సంబోధించాడు. ఆమె డబ్బు వెనుకే పరుగెడుతోందని ఆరోపించారు. ఆమె ఒక వంచకురాలని, పిరిక పంద అని వ్యాఖ్యానించాడు. దీనిపై ఒక్కసారిగా బీఎస్పీపై నేతలతోపాటు దళితులు కూడా తీవ్రంగా స్పందించడంతో తాను ఆ మాటలు అనలేదని కొట్టిపారేశాడు. అయితే, దయానంద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దయాశంకర్ మాయవతిని వ్యభిచారిణి అంటూ పరుష వ్యాఖ్యలు చేసి పదవీ కోల్పోయి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతడిపై ఎస్సీ యాక్ట్ కూడా నమోదైంది. అయితే, ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన దయాశంకర్ 'ఆమె పేరాశగల మహిళ. బైకు వెంట ఓ కుక్క పరుగెత్తుకుంటూ అరుస్తూ వెళుతుంది. కానీ బైక్ ఆపిన వెంనటే తోకముడిచి వెనక్కు వెళ్లిపోతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాయావతి, ఆమె సోదరుడు, ఇతర సన్నిహితులు కోట్లు వెనుకేసుకున్నారని, వాస్తవానికి మాయావతి పెద్ద వంచన చేసే మహిళ, పిరికి పంద అని ఆరోపించారు. -
‘జాతీయ జెండాకు అవమానం’
* టీడీపీ పాటల మధ్య, చంద్రబాబును పొగుడుతూ జెండా ఆవిష్కరణ * ఎంపీటీసీ, సర్పంచ్‌ని కాదని విద్యాకమిటీ చైర్మన్‌తో ఆవిష్కరణ * టీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్న వైఎస్సార్సీపీ నరసరావుపేట : స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను అవమానించి దేశద్రోహానికి పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. చింతలపాలెం గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్ల ఎదురుగానే జాతీయ జెండాను తెలుగుదేశం పార్టీ పాటల మధ్య విద్యాకమిటీ చైర్మన్‌తో ఎగుర వేయించారని విమర్శించారు. దీనికి సంబంధించిన సీడీలను విలేకరులకు అందించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కార్యాలయంలో జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్ విలేకరులతో మాట్లాడారు. నరసరావుపేట మండలంలోని చింతలపాలెం గ్రామంలో దేశభక్తి గీతాలు కాకుండా టీడీపీ పాటలు పెట్టి పార్టీని, చంద్రబాబును పొగుడుతూ దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని తెలిపారు. ప్రతి మండల ప్రజాపరిషత్ స్కూల్లో ఆ గ్రా మానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యునిచే జెండాను ఆవిష్కరించాలని, ఆయన లేకుంటే సర్పంచ్, ఆయన లేని సమయంలో విద్యాకమిటీ చైర్మన్‌చే జెండాను ఆవిష్కరింపచేయాలని ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జెండా వందనం చేయాలని ఎంపీటీసీ సభ్యునికి ఆహ్వానం కూడా పంపినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ భూతమేకల శివయ్య, ఎంపీటీసీ సుంకర అంజయ్య ఎదురుగానే టీడీపీ వారిచే ఎంపికయిన విద్యా కమిటీ చైర్మన్‌చే జెండాను స్కూల్లో ఆవిష్కరించారని చెప్పారు. ఇది దేశద్రోహంగా తాము భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూలు కమిటీ చైర్మన్, సభ్యులు తదితరులపై పోలీసులకు ఫిర్యాదుచేస్తామన్నారు. దీంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేంతవరకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ మైనార్టీ అధ్యక్షుడు నబీ సుభాని, మాజీ సర్పంచ్ పొదిలే ఖాజా, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ తదితరులున్నారు. -
జేసీ–2కు అవమానం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా జాయింట్ కలెక్టర్ సెలవుల్లో వెళితే సర్వ సాధారణంగా జాయింట్ కలెక్టర్–2కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లాలో జేసీ–2ను పక్కన పెట్టి అవమానపరిచేలా ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమయింది. ఇటీవల జాయింట్ కలెక్టర్ హరికిరణ్ నాలుగు రోజుల పాటు శిక్షణ నిమిత్తం వెళ్లారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న జేసీ–2 రామస్వామికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే డీఆర్ఓకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెడతారు. కానీ జిల్లా కలెక్టర్ జేసీ–2ను, డీఆర్ఓను కాదని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే జేసీ–2కి ప్రాధాన్యత తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేసీ–2 రామస్వామి విధుల్లోనే అందుబాటులో ఉన్నా.. జూనియర్ అయిన అధికారికి జేసీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల అసంతప్తి వ్యక్తమవుతోంది. ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంలో జిల్లా కలెక్టర్‌కు విచక్షణాధికారాలు ఉన్నా సీనియారిటీని గౌరవించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అవమాన భారంతో వృద్ధుని మృతి
పొందూరు : చేతబడి చేశారనే నిందారోపణలు ఓ వృద్ధుని ప్రాణాలు తీశాయి. మూఢ నమ్మకాలకు కరగాన రాజారావు(60) బలయ్యాడు. పలుమార్లు తమకు కలలో కనిపిస్తున్నావంటూ పలువురు సోమవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో అవమానం భరించలేని ఆయన మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ చింతాడ ప్రసాద్ చెప్పిన వివరాలు... కనిమెట్ట గ్రామానికి చెందిన కరగాన రాజారావు చేతబడి చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన బొంతు చిన్నారావు, చల్ల గోవింద, ముద్దాడ చిరంజీవి సోమవారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన రాజారావు ఆ రాత్రే చనిపోయేందుకు ఇంటి నుంచి వెళ్లిపోగా కుమారుడు నర్సింహులు వెతికి ఇంటికి తీసుకువచ్చాడు. రాజారావు ఉదయాన్నే లేచి బయటకు వచ్చినపుడు బొంతు చిన్నారావు గొడవ పెట్టుకొని కిందకు తోసేయ్యడంతో మనస్తాపానికి గురైన ఆయన వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి యత్నించాడు. అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ చెప్పారు. దీనికి సంబంధించి చిన్నారావు, గోవింద్, చిరంజీవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంఘటనా స్థలానికి ఇన్చార్జి డీఎస్పీ ఆదినారాయణ వెళ్లి విచారించారు. రాజారావుకు భార్య ఎర్రమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
మంత్రి రావెలను పట్టించుకోని అధికారులు
-
కర్మభూమిలో కురువృద్ధుడికి అవమానం!
పార్లమెంట్ లో రెండు సీట్లతో ప్రారంభమై, మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో భారతీయ జనతా పార్టీని నిలిపిన మూడు స్తంభాల్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. మిగతా ఇద్దరు అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీలు. చివరి ఇద్దరి కంటే భిన్నంగా మనోహర్ జోషి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ ఉన్నతికి కృషి చేశారు. జోషి పుట్టింది నైనిటాల్ లోనే అయినప్పటికీ అలహాబాద్ యూనివర్సిటీలో ఆయన జీవితం మలుపు తిరిగింది. విద్యార్థిగా ప్రవేశించి, పీహెచ్ డీ పూర్తిచేసి, వర్సిటీలోనే ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన అలహాబాద్ పేరు చెబితే చాలా మందికి.. నెహ్రూ, ఇందిర, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియాలతోపాటు మురళీ మనోహర్ జోషి పేరు కూడా గుర్తుకొస్తుంది. అలాంటి కర్మభూమిలో, సొంత పార్టీ నేతల చేతిలోనే అవమానానికి గురయ్యారు మనోహర్ జోషి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యూహరచన చేసేందుకు బీజేపీ ఆదివారం అలహాబాద్ లో జాతీయ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర సీనియర్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతటి కీలక సమావేశానికి కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని పిలవకపోవడంపై అలహాబాద్ లోని ఆయన అనుచరగణం భగ్గుమంటోంది. సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం తెలుపుతూ యూపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ జోషి ఫొటో ఎక్కడా కనిపించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. అద్వానీ, వాజపేయిల ఫొటోలు కూడా ఏక్కడోగానీ కనబడలేదట. 'జోషి గారు రెండు రోజులుగా అలహాబాద్ లోనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు రమ్మని ఏఒక్కరూ ఆయనను పిలవలేదు. ఇది జోషిని అవమానించినట్లు కాదా? ఇలాంటి చర్యల ద్వారా ఇప్పుడున్న నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు?' అంటూ మీడియా ముందు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జోషి అనుచరులు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై పార్టీ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. అలహాబాద్ నుంచి మూడు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన మనోహర్ జోషి.. 2009లో వారణాసి నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. సంఘ్ నిర్దేశకత్వంలో మోదీ-షా ద్వయం నడిపిస్తోన్న బీజేపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఎప్పుడో తగ్గిపోయిందని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' పిలుపునిచ్చిన పార్టీ 'కాంగ్రెస్ యుక్త్'లా మారిపోయిందని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు కామెంట్ చేశారు. -
జాతీయ జెండాను అవమానించి మహిళకు..
మిర్యాలగూడ టౌన్: జాతీయ జెండాను అవమానించిన కేసులో మహిళకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం మిర్యాలగూడ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎ. నాగరాజు తీర్పు నిచ్చారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో గల మాతృశ్రీ మహిళా మండలి భవనం వద్ద 2011లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆ మండలి నాయకురాళ్లు వచ్చారు. ఆ సమయంలో అదే భవనంలో నివసిస్తున్న దర్శనం నిర్మల అనే మహిళ జెండాను కట్టిన కర్రను విరగగొట్టి అసభ్యంగా మాట్లాడి జాతీయ జెండాను అవమానించింది. దీంతో మాతృశ్రీ మహిళా మండలి నాయకురాళ్లు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి ఏఎస్ఐ జిలానీ కేసు నమోదు చేయగా అప్పటి ఎస్ఐ జి. రవి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు దర్శనం నిర్మలపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానాను జడ్జి విధించారు. ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. -
'కాపులను ఎగతాళి చేస్తే ఊరుకోం'
కిర్లంపూడి(తూర్పుగోదావరి): కాపు కులస్తులను ఎగతాళి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తమ ఆగ్రహానికి గురైతే ముఖ్యమంత్రులు కుర్చీ దిగిపోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు యువత, విద్యార్థి నాయకులు ర్యాలీగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ భావితరాల కోసం, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను సాధించుకోవడం కోసం కాపు యువత నడుం బిగించాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో, బహిరంగ సభల్లో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కాపులను బీసీల జాబితాలో కలపడమే కాక కాపుల అభివృద్ధికి ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకూ వారి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న కాపులను సమీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను అమలు పరిచే వరకు దశలవారీగా నిరంతర పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ చివరిలో లేదా సంక్రాంతి వెళ్లాక ప్రతి జిల్లాలో పర్యటించి, కాపులను సమీకరించి చైతన్య పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
రాజ్యాంగ నిర్మాతకు అవమానం..
ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పేడ చల్లారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దుండగులు పేడ చల్లారు. దీంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించిన ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి
-
దొంగతనం మోపారని మహిళ ఆత్మహత్య
దేవరకద్ర (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో ఓ మహిళపై దొంగతనం నేరం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ. వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాయపల్లి గ్రామానికి చెందిన దంపతులు బురాన్, రజియా బేగం(23)లు రాయి కొట్టుకుని జీవించేవారు. కాగా సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన బీవీబీ అనే మహిళ తన బంగారు పూసలదండ పోయిందని ఆరోపిస్తూ మరో ముగ్గురు మహిళలతో కలసి వచ్చి రజియాబేగంను విపరీతంగా కొట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన రజియా బేగం రాత్రి తన ఇంట్ల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి రజియాబేగం భర్త బురాన్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రజియా ఆత్మహత్యకు కారణమైన నలుగురు మహిళలపై కేసు నమోదు చేశారు. -
అవమాన భారంతో ఆత్మహత్య
బాలానగర్ :తను చేయని నేరానికి జైలుకు పంపారని, అవమానం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరళ్లపల్లి పంచాయతీ గుడిబండ తండాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...గుడిబండ తండాకు చెందిన భానోవత్ శకుంతల గత జనవరి నెలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు అత్తింటి వేధింపులతోనే చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు...అల్లుడు కృష్ణ, మామ ధావుర్యా(60), అత్త భామినీలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరిని అరెస్టు చేశారు. ఈ నెల 6న థావుర్యా, భామినీ బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చారు. అయితే చేయని నేరానికి జైలుకు పంపారని మనస్తాపం చెందిన థావుర్యా ఆదివారం ఉదయం పశువుల కొట్టంలో ఉరి వేసుకుని చనిపోయాడు. -
బంధువులు కొట్టారని బావిలో దూకాడు
శంషాబాద్ : బంధువులు చేయి చేసుకోవడంతో ఆవేదనకు గురైన ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాత తండా నివాసి లాల్‌సింగ్ (30) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రైవేటు ఉద్యోగి. ఇతడు మద్యం తాగి తరచూ భార్య సునీతతో గొడవ పడేవాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి భార్యపై చేయి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య తరపు బంధువులు అతడిని చితకబాదారు. దీన్ని అవమానంగా భావించిన లాల్‌సింగ్ తండాలోని బావిలో దూకాడు. అయితే బావిలో నీళ్లు లేకపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. లాల్‌సింగ్‌కు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతనిపై దాడి చేసిన బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భాస్కర్ తెలిపారు. -
పోలీసుస్టేషన్లో గర్భిణికి అవమానం
భీమిలి పోలీసు స్టేషన్లో ఓ గర్భిణికి తీవ్ర అవమానం జరిగింది. ఓ వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లింది. అయితే.. ప్రసవం అయిన తర్వాత బిడ్డతో కలిసి వస్తే.. పరీక్షలు చేసి, ఆ బిడ్డకు అసలు తండ్రి ఎవరో చెబుతామంటూ పోలీసులు తనను అవమానించారని ఆ గర్భిణి ఆరోపిస్తోంది. ఎట్టకేలకు.. ఆమెను మోసం చేసిన ఆటోడ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి వల్లే నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేశారని సదరు గర్భిణి ఆరోపిస్తోంది. -
కేసీఆర్‌కు దొరతనం దిగలేదు: డీఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దొరతనం ఇంకా దిగలేదని, అందుకే దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఆయన అవమానించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. జలవిహార్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో నిర్వహించాలని, జాప్యం చేస్తే ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నట్టేనని డీఎస్ అన్నారు. సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ఓటేసిన సెటిలర్లు సంతోషంగా లేరని, ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని డి.శ్రీనివాస్ చెప్పారు. ఈ పరిస్థితిని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు వారికి అనుకూలంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. -
మహిళపై అత్యాచారం.. ఆత్మహత్యాయత్నం
అత్యాచారం జరగడంతో అవమాన భారం భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా అయిలాపూర్‌లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం సాయిలు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి కల్లు సీసా తెమ్మని చెప్పింది. కల్లు తీసుకొని వచ్చిన సాయిలు.. తలుపులు మూసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. అవమానాన్ని భరించలేని ఆమె 16వ తేదీన రసాయన గుళికలు మింగింది. అటుగా వచ్చిన ఆమె వదిన అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. 17వ తేదీన బాధితురాలు స్పృహలోకి వచ్చి వివరాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం మరోవైపు మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు ఈ నెల 14న చాక్లెట్లు కొనిస్తానని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి చిన్నారిని కాపాడారన్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం రాకేశ్‌పై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. -
నాడు అంజయ్య.. నేడు హనుమన్న
కాంగ్రెస్ పార్టీ, అందులోనూ గాంధీ కుటుంబం ప్రతిసారీ తెలుగు నాయకులను, పార్టీకి వీర విధేయులుగా ఉన్నవాళ్లను తీవ్రంగా అవమానిస్తూనే ఉంది. పదహారణాల కూలీని అని గర్వంగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో అప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేని రాజీవ్ గాంధీ తోసి పారేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న వి.హనుమంతరావు (వీహెచ్)కి కూడా సరిగ్గా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీనని చెప్పినా రాహుల్ గాంధీ పాల్గొంటున్న సభా వేదికపైకి ఆయనను పంపడానికి పోలీసులు నిరాకరించారు. ఎల్బీస్టేడియంలో రాహుల్ సభ వద్ద వీహెచ్‌కు అవమానం జరిగింది. వేదికపైకి అనుమతి నిరాకరించడంతో వీహెచ్ కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వీహెచ్‌ను అనుమతించకపోవడంతో ఆయన ఆగ్రహంతో అక్కడి నుంచి తప్పుకొని, ఓ పక్కన మౌనంగా నిలబడిపోయారు. రాహుల్ గాంధీయే తలచుకుంటే వీహెచ్ లాంటి నాయకులకు వేదికపైకి అనుమతి లభించడం పెద్ద కష్టం కాదు. కానీ, రాహుల్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని వీహెచ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి గాంధీ కుటుంబంలో దాదాపు ప్రతి ఒక్కరికీ వీహెచ్ బాగా పరిచయం అని చెబుతారు. అంత సన్నిహిత సంబంధాలున్న నాయకుడిని కూడా ఇప్పుడు కూరలో కర్వేపాకులా తీసి పక్కన పారేశారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.