మువ్వన్నెల జెండాతో చికెన్‌ శుభ్రం.. అరెస్ట్‌ | Man Clean Chicken With National Flag Arrested | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్‌ శుభ్రం.. వీడియో వైరల్‌.. అరెస్ట్‌

Published Sat, Apr 22 2023 8:39 PM | Last Updated on Sat, Apr 22 2023 8:39 PM

Man Clean Chicken With National Flag Arrested - Sakshi

Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్‌ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.  

దాద్రా-నగర్‌ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్‌లో చికెన్‌ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ హానర్‌ యాక్ట్‌ 1971’’ సెక్షన్‌ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

నిందితుడ్ని మొహమ్మద్‌ సైఫ్‌ నదీమ్‌ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్‌ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్‌ శాఖ అతని దుకాణానికి సీజ్‌ వేసింది. 

ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ హానర్‌ యాక్ట్‌ 1971’’ సెక్షన్‌ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్‌గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్‌ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement