national falg
-
మన మువ్వన్నెల జెండా ఆవిర్భవించింది ఏ రోజో తెలుసా!
‘‘ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ప్రతి మనసు ఉప్పొంగ మువ్వన్నెల మన జెండా పుట్టింది నేడు మన జాతి గుర్తుగా ఏప్రియల్ 1 శుభదినము అనుచు’’ ‘‘మన జెండా పుట్టిన రోజును భారతీయులుగా మనందరం పండుగ చేసుకుందాం’’ అని పిలుపునిస్తున్నారు కె.హెచ్.ఎస్. జగదంబ. రామ్‌నగర్ గుండులో నివసిస్తున్న ఈ జాతీయతావాది ఇంట్లో గోడలన్నీ దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టే బాధ్యతను మోస్తుంటాయి. ఎనభై ఆరేళ్ల వయసులో ఆమె టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురించి సేకరించిన విషయాలను పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాస్తూ ఉంటారు. స్త్రీ శక్తి పురస్కార గ్రహీత జగదంబ. ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నానికి చెందిన జగదంబ పెళ్లి చేసుకుని 1952లో హైదరాబాద్‌కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్‌లో మహిళాసాధికారత కోసం పని చేశారు. యాభై ఏళ్ల కిందటే ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టి మహిళలకు మార్గదర్శనం చేశారు. గడచిన పాతికేళ్లుగా ఆమె జాతీయ పతాక రూపశిల్పి, జాతీయ పతాకం రూపుదిద్దుకున్న వైనం పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆది, సోమవారాల్లో(మార్చి 31, ఏప్రిల్ 1న) తాను నిర్వహించనున్న జెండా పుట్టిన రోజు పండుగ కోసం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె తన మనోభావాలను పంచుకున్నారు. పెన్షన్ తీసుకోమన్నారు! ‘‘పింగళి వెంకయ్య కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న విషయం పాతికేళ్ల కిందట కాకతాళీయంగా నా దృష్టికి వచ్చింది. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో నాకు తెలిసిన ఎవరో మా పరిశ్రమకు వచ్చి ఒక మాట చెప్పారు. ‘ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలనుకుంటోంది. మీరు దరఖాస్తు చేసుకోండి’ అన్నారు. ‘మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి నాకు పదేళ్లుంటాయో లేదో. నేను జాతీయోద్యమంలో పాల్గొనలేదు, అబద్ధపు దరఖాస్తు చేసుకోను’ అని చెప్పి పంపేశాను. అప్పుడు మా పరిశ్రమలో పని చేస్తున్న ఒక మహిళ నా దగ్గరకు వచ్చి తన పేరు రాయించమని అడిగింది. వివరాల్లోకి వెళితే ఆమె పింగళి వెంకయ్య గారి సమీప బంధువు. జెండా రూపుదిద్దుకున్న రోజుకి గుర్తింపు ఏదీ..? ఆమె మాత్రమే కాదు, పింగళి వెంకయ్య గారి పిల్లలు కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి నిర్ఘాంత పోయాను. ఆ క్షణంలోనే అనేక ప్రశ్నలుద్భవించాయి. భారత జాతిత్రయం! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును వేడుక చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించుకుంటున్నాం. కానీ భారత జాతికి ప్రతీక, భారతీయులందరికీ గర్వకారణమైన జాతీయ పతాకం రూపొందించుకున్న రోజు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకోవడం లేదు. మన జాతిపిత గాంధీజీ పుట్టిన రోజును గుర్తు చేసుకుంటున్నాం. తొలి ప్రధాని నెహ్రూకి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. జాతీయ పతాక రూపకర్త పుట్టిన రోజును ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం. ఇలా ప్రశ్నలతోపాటు నాలో ఆవేశం ఒక్క ఉదుటున తన్నుకొచ్చింది. అప్పటి నుంచి పింగళి వెంకయ్య గారి సమగ్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ‘శ్రీ పింగళి వెంకయ్య ఛారిటబుల్ ట్రస్ట్ మరియు స్మారక సంస్థ’ స్థాపించి ఆయన పుట్టిన రోజు ఆగస్టు 2వ తేదీ, జాతీయ పతాకం పుట్టిన రోజు మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో స్కూలు పిల్లలకు జాతీయ పతాకం ప్రాధాన్యం, పతాకం రూపుదిద్దుకున్న వివరాలను తెలియచేయడంతోపాటు చిన్న చిన్న పోటీలు పెట్టి బహుమతులివ్వడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టాను. పార్లమెంట్లో తీర్మానం ప్రవేశ పెట్టించగలిగాను. పింగళి వెంకయ్య గారి సేవలను ప్రచారం చేసుకోవడానికి అనుమతి వచ్చింది. పోస్టల్ స్టాంపు విడుదల వరకు చేయంచగలిగాను. సెలవు ప్రకటించడం సాధ్యం కాదన్నారు. పర్వదినాలుగా ప్రకటన కోసం పోరాడుతున్నాను. నా వంతుగా ఏటా జెండా పుట్టిన రోజు వేడుకగా నిర్వహిస్తున్నాను. మన జెండా పుట్టిన రోజు! అది 1921 మార్చి 31వ తేదీ. విజయవాడ, గాంధీ నగర్లో రెండు రోజుల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు గాంధీజీ అధ్యక్షతన మొదలయ్యాయి. దేశనాయకులు, రాష్ట్ర నాయకులతోపాటు జాతీయోద్యమంలో పాల్గొంటున్న దేశభక్తులు దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. పింగళి వెంకయ్య లెక్చరర్‌గా బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా ఆ సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఆ సమయంలో గాంధీజీ ‘వెంకయ్య దేశదేశాల జాతీయ పతాకాల మీద అధ్యయనం చేసి ఉన్నారు. విద్యార్థులకు ఆయా దేశాల పతాకాల గురించి సమగ్రంగా వివరిస్తుంటారు. మనదేశం కోసం పతాకాన్ని రూపొందించే బాధ్యత చేపడితే బాగుంటుంది’ అన్నారు. అలా అడిగిన రోజు ఏప్రిల్ 1. గాంధీజీ అడిగిన మూడు గంటల్లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి, రంగులకు భావాన్ని, భాష్యాన్ని చెప్పారు. సభ ఆమోదం పొందడం, అధికారికంగా ప్రకటించడం అదే రోజు జరిగిపోయాయి. అలా 2021లో జెండా పుట్టిన వందేళ్ల పండుగ ఘనంగా నిర్వహించాను. ఈ ఏడాది ‘103వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సం’ వేడుకలను మార్చి 31వ తేదీన హైదరాబాద్, అంబర్‌పేట, వెంకటేశ్వర నగర్లో ఉన్న ‘పూర్ణ శాంతిశీల హోమ్స్’లో నిర్వహిస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఏప్రిల్ 1న కార్యక్రమాలను రామ్ నగర్ గుండులోని ట్రస్ట్ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించనున్నాం’’ అని వివరించారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదంబ. గమనిక: ఇక ప్రతి ఏటా జూలై 22 జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నాం. అది భారత జాతీయ జెండాగా స్వీకరించిన రోజు జులై 22,1947. ఇది జాతీయ పతాకం రూపుదిద్దుకున్న రోజు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !) -
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పొడవైన జాతీయ జెండా!
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని గార్డెన్ నంబర్ 95 శ్రీవేణుగోపాలస్వామి టెంపుల్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 54 అడుగుల ఎత్తైన జాతీయ పతాక పోలుపై 12 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నైతిక నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గణతంత్ర వేడుకల్లో పిల్లలు ,మహిళలకు ఆట పోటీలు నిర్వహించి వారికి సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం పిల్లల్లో దేశభక్తి జాతీయ సమైక్యత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని నైతిక నిర్వాహణ సభ్యుడు ఆడిటర్ జగన్నాథం, ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త నర్ర భూపతి రెడ్డి, సామాజిక కార్యకర్త పూస యోగేశ్వర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా స్వాతంత్ర, గణతంత్ర కార్యక్రమాల్ని నిర్వహిస్తామని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన అన్ని సౌకర్యాలు కల్పించిన కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుకర్ నాయక్‌కు నిర్వాహణ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్ -
మువ్వన్నెల జెండాతో చికెన్ శుభ్రం.. అరెస్ట్
Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్‌ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. దాద్రా-నగర్ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్‌లో చికెన్‌ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మొహమ్మద్ సైఫ్ నదీమ్ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ శాఖ అతని దుకాణానికి సీజ్ వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్‌గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. Mohammad Saif Nadim Qureshi was seen cleaning chopped chicken using the national flag in Silvassa. And then they say " Don't question our Patriotism " ! pic.twitter.com/KtPjuYvrSl — Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) April 22, 2023 -
Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది
న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్స్ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్ చేశారు. గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ విద్యార్థులకు జెండాలు పంచారు. ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్ ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్ పిక్చర్లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్ తన ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. -
15 రోజుల పాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ఇంటింటా త్రివర్ణ పతాకం (హర్ ఘర్ తిరంగా) నినాదంతో 2022 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుందామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మొత్తం 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని, అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జాతీయ జెండాలను పంపిణీ చేస్తామన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై రాష్ట్ర సాంస్కృతికశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఆర్ఓ గాయత్రిదేవి, ఆన్సెట్ సీఈఓ కేశవ నాయుడు, జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. (చదవండి: మధ్య తరగతికి మంచి ఛాన్స్.. తక్కువ ధరకే ప్లాట్లు.. అర్హతలు ఇలా) -
ఘనంగా ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
-
AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. (చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు) ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్ పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. -
‘‘కేజ్రీవాల్ జాతీయ జెండాను అవమానించారు’’
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అవమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కూర్చున్న కుర్చీ వెనుకలా పెట్టిన జెండాలు జాతీయ హోంమత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపారు. జెండాలోని ఆకుపచ్చ రంగును పెద్దదిగా చేసి.. వక్రీకరించారని, మధ్యలో ఉండే తెలుపుదనాన్ని తగ్గించారని ఆరోపించారు. దేశ జాతీయ జెండా నియమావళికి ఇది విరుద్ధమన్నారు ప్రహ్లాద్ పటేల్. ఈ పొరపాటును వెంటనే సరిదిద్దాలని ప్రహ్లాద్ పటేల్ సూచించారు. అరవింద్ కేజ్రీవాల్ టెలివిజన్ బ్రీఫింగ్లో ప్రసంగించినప్పుడల్లా తన దృష్టి ఆయన కుర్చీ వెనుకలా ఉన్న జాతీయ జెండాలపైనే పడుతుందన్నారు ప్రహ్లాద్ పటేల్. కుర్చీ వెనుక పెట్టిన జాతీయ జెండాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని తెలిపారు. అలంకారం కోసం జాతీయ జెండాలను ఉపయోగిస్తున్నారని ప్రహ్లాద్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలోని తెలుపుదనం ఆకుపచ్చని రంగుతో తగ్గిపోయిందన్నారు. ‘‘ఈ పొరపాటు గురించి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలుసో.. తెలియదో నాకు తెలియదు. నేను మాత్రం ఈ పొరపాటును కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను’’ అన్నారు ప్రహ్లాద్ పటేల్. చదవండి: రాష్ట్రాలకు భంగపాటు! -
కశ్మీర్లో మువ్వన్నెల రెపరెపలు
న్యూఢిల్లీ: రాష్ట్ర సచివాలయ భవనంపై ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్ర జెండాను అధికారులు తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు పూర్తయ్యి మూడు వారాలు అవుతున్న క్రమంలో దీన్ని తొలగించడం గమనార్హం. వాస్తవానికి జమ్మూ కశ్మీర్ జెండాను అక్టోబర్ 31న తొలగించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ముందుగానే తొలగించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీన్ని తొలగించనున్నామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి కేవలం మువ్వన్నెల భారత జెండా మాత్రమే ఎగురుతూ కనిపించింది. 1952, జూన్ 7 నుంచి రెండు జెండాలు ఎగిరేలా ఆర్టికల్ 370 వీలు కల్పించిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో నిత్యావసరాలకు, మందులకు దిగుల్లేదని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ అన్నారు. ప్రజలకు అవసరమైన ముడి సరుకులు అన్నింటిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సమాచార వ్యవస్థను నిలిపివేయడం ద్వారా ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. కశ్మీర్లో పరిస్థితులు అసాధారణం: రాహుల్ కేంద్రం చెబుతున్నట్లు కశ్మీర్లో పరిస్థితులు సాధారణంగా లేవని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల బృందం శనివారం కశ్మీర్‌ను సందర్శించడానికి ప్రయత్నించగా అధికారులు వారిని శ్రీనగర్ విమానాశ్రయంలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. శ్రీనగర్‌లో తమ బృందం ఎదుర్కొన్న పరిస్థితులను రాహుల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కశ్మీరీలకున్న స్వాతంత్య్రం కోల్పోయి 20 రోజులు అవుతోందన్నారు. -
300 మీటర్ల జాతీయ జెండాతో ‘స్వచ్ఛ ర్యాలీ’
సంగారెడ్డి జోన్ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని డీఆర్డీఏ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లా యంత్రాంగం గురువారం స్వచ్ఛగణతంత్ర వారోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 మంది కళాశాల విద్యార్థులతో కలిసి 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందగా సహకరించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం జేసీ వాసం వెంకటేశ్వర్లు చేతులమీదుగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సిద్ధారెడ్డి, ఏఓ మధులత, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చభారత్ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
జెండా ఎగురవేసేది ఎస్‌ఎంసీలే!
అగనంపూడి : మహా విశాఖ పరిధిలో పంద్రాగస్టుకు మూడు రంగుల జెండా ఎగురవేసే అదష్టం పాఠశాల యాజమాన్యం కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్లకు దక్కింది. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్పొరేటర్లు అందుబాటులో లేరు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, పాథమికోన్నత పాఠశాలల్లో ఎంపీటీసీలు, ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు పతాకావిష్కరణ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే పాలక మండళ్లులేని జీవీఎంసీలో పతాకావిష్కరణ ఎవరు చేయాలనే విషయమై స్పష్టత లేకపోవడంతో స్పందించిన మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డికి ఆదేశాలిచ్చారు. ఈమేరకు జీవీఎంసీ పరిధిలోని పెందుర్తి, చినగదిలి, భీమిలి, ఆనందపురం, పరవాడ, పెదగంట్యాడ, సబ్బవరం, అనకాపల్లి మండలాల పరిధిలోని జీవీఎంసీ విలీన ప్రాంతాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లకే ఆ హోదా దక్కింది.